భీష్మ దేహత్యాగము & కృష్ణుని ద్వారకా గమనం (Parts 15-18)

Passing of Bhishma & Krishna's Return (Parts 15-18)

bhagavatam

శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని మనసులో ధ్యానిస్తూ తన దేహాన్ని త్యజించే మహోన్నత దృశ్యాన్ని మనం దర్శిస్తాము. ఆ మహానుభావుడు పాండవులకు ధర్మసూక్ష్మాలను బోధించి, భక్తి మార్గాన్ని చాటి చెప్పిన తర్వాత శ్రీహరిలో లీనమవుతాడు. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురం నుండి నిష్క్రమించి తన ప్రియమైన ద్వారకానగరానికి తిరిగి వెళ్ళే సంఘటన హృదయాన్ని స్పర్శిస్తుంది.

In this profound episode of Srimad Bhagavatham Canto 1, we witness the sacred passing of Bhishma Pitamaha, who departs his body with his mind fixed upon Lord Sri Krishna. The great grandsire imparts timeless wisdom to the Pandavas before merging into the Supreme, leaving behind an eternal legacy of devotion and dharma. Following this deeply moving event, Lord Sri Krishna prepares to depart from Hastinapura and return to His beloved city of Dwaraka, bidding farewell to the Pandavas and the grieving Kuru family.

← Prev Next →
Passing of Bhishma & Krishna's Return (Parts 15-18) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః తపస్వినో దాన పరాయశస్వినః మనస్వినః మంత్ర విదస్సు మంగలాః క్షేమం నవిందంతి వినాయ దర్పణం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః తపశ్శాలురు గాని దానశీలురు గాని ప్రజాహిత కార్యములను చేసి కీర్తిని సంపాదించిన వారు గాని మనోనిగ్రహము గల యోగులు గాని మంత్రవేత్తలు గాని ఇతరులకు సదాచారపరులు గాని తమ తమ తపస్సు మొదలగు సాధనలను శ్రీహరికి సమర్పించనిదే వాటి పరమ ఫలమును పొందజాలరు. అట్టి పరమ మంగళకరమగు కీర్తిగల శ్రీహరికి అనేక నమస్కారములు. సెకండ్ క్యాంటు, ఫోర్త్ చాప్టర్, 17th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 15వ పాడ్కాస్ట్ లో స్వాగతం. వ్యాసుడు నారదుడు ఇచ్చినటువంటి ఉపదేశంతో భాగవతం రాయటానికి పూనుకున్నాడు. ఇంక ముందు ఏం జరుగుతుందో విందాం. పరమాత్మని మననము చేయుచు ఆనందమని అనుభవించుచుండుటచే లౌకికార్థములతో కూడిన ప్రబంధములు అధ్యయనము చేయుటకు ఇష్టపడని వారు కూడా. భగవానుని యందు వేరొక ప్రయోజనము కాంక్షింపని వారై భక్తి గల వారై యుందురు. భక్తి భగవత్ స్వరూప గుణములను మనము చేయుటయే కదా. భాగవతం భగవత్ భక్తిని వృద్ధి పొందించును. అది మననముకు విరోధి కాదు. అందుచే ఆత్మారాములగు మునులు కూడా భాగవతమును ఆదరింతురు. భగవానుని గుణములను ప్రతిపాదించు భాగవతమును వినుటచే శుకుని మనస్సు ఆకర్షింపబడినది. అందుచే అతడు భాగవతమును అధ్యయనము చేసెను. జ్ఞానులైన మునులకు భగవన్ మననమే సంతతము కర్తవ్యమై ఉండును. భాగవతము ఉపనిషత్తులచే స్పష్టముగా నిరూపింపని గుణములను కూడా నిరూపించినది అగుటచే శుగయోగికి అది చాలా ప్రియమైనదే ఉండెను. ముందుగా ఉపోద్ఘాతముగా రాజర్షియగు పరీక్షత్తుని యొక్క జన్మను

కర్మను లయమొందించినట్టి పాండవుల వృత్తాంతమును ఎరింగించెదను. దాని ద్వారా కృష్ణగత ఎరుంగబడును. ఆఖరణింపుడని సూతుడు శౌనకాదులకు పరీక్షితు జన్మ వృత్తాంతము చెప్పుటకు ఆరంభించెను. కౌరవ పాండవ యుద్ధములో వీరులందరూ వీరోచితంగా మరణించగా భీమునితో గదాయుద్ధము చేసి ఊరుభంగమై దుర్యోధనుడు మరణించెను. అశ్వత్థామ తన ప్రభువగు దుర్యోధనునకు ప్రియమైన కార్యమని ద్రౌపది పుత్రులు ఉపపాండవులు ఐదుగురు నిదిరించుచుండగా వారి శిరస్సులను ఖండించి తీసుకొని పోయెను. ఈ వృత్తాంతం విన్న వారి అందరి మనస్సులు కలవరపరిచెను. సర్వలోకము నిందించెను. ద్రౌపది తన బిడ్డల శిరస్సు ఖండింపబడి యుండుట చూచి కన్నీరు కార్చుచు విలపించుచుండెను. ఆమె విచారమును చూచి ఓర్వలేక అర్జునుడు ఆమెతో ఇట్లు పలికెను. బ్రాహ్మణాధముడు అశ్వత్థామ అతతాయై నిరపరాధుడైన పిల్లను చంపినాడు. నా గాండీవమున బాణములను వదిలి అతని శిరస్సును ఖండించి తెచ్చెదను. నీవు కాలితో దానిని తొక్కి స్నానము చేసి నీ శోకమును తొలగించుకొందువు. ఈ విధంగా ద్రౌపది మనస్సును ఓదార్చుచు అర్జునుడు మిత్రుడగు కృష్ణుడు సారథిగా రథమును నడుపుచుండగా గాండియమును ఎక్కుపెట్టి హనవధ్వజముపై చిహ్నముగా గల రథమును అధిరోహించి ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామను వెంబడించెను. అశ్వత్థామ వచ్చుచున్న అర్జునుని దూరము నుండియే చూచి భయముతో ప్రాణమును దక్కించుకొనుటకు రథముతో చాలా దూరము పారిపోయెను. గుర్రములు అలసి రథం ముందునకు సాగలేదు. అప్పుడు అశ్వత్థామ బ్రహ్మ శిరము అను పేరు గల అస్త్రమును ప్రయోగించి అర్జునుని చంపి తను రక్షించుకొనవలెను తలంచెను. అశ్వద్ధామకు ఆ అస్త్రమును ప్రయోగించుటయే తెలియును కానీ ఉపశమరించుట తెలియదు. ప్రాణములకు ముప్పు వాటిలోటచే ఆ అస్త్రమును ప్రయోగించినాడు. అన్ని దిక్కుల యందు ఉగ్రముకు తేజస్సు వ్యాపించినది. తన ప్రాణములను కాపాడుటకు నాకు మార్గాంతరము తోచక అర్జునుడిట్లు పలికెను. కృష్ణా మహాబాహు భక్తులకు అభయము సంగు వాడవు నీవే కదా సర్వలోకములకు నీవు ఈశ్వరుడవు.

ఆది పురుషుడవు. ప్రకృతి సంబంధం లేని వాడవు. పరమ పురుషుడవు. నీ జ్ఞాన శక్తిచే చేతనా చేతనాత్మకమగు జగత్తునందలి మాయను తెగకోసి స్వస్వరూపమునందు వెలింగెడివాడవు. మాయచే దేహమే తానని, తాను స్వతంత్రుడని, మోహమునందియున్న జీవులకు ధర్మార్థ, కామ మోక్షములకు పురుషార్ధములను వసంగా కలిగిన మహిమ గలగవాడవు. భూమికి భారభూతులైన దుర్మార్గులను సంహరించవలెననియు ఏ కోరికయు లేక నిన్నే సేవించవలెనని వారికి సేవింపవీలుగా ఉండవలెననియు నీవు ఈ లోకమును అవతరించితివి. అంతటా వ్యాపించియున్న ఈ తేజస్సు ఏమో నాకు తెలియకున్నది. ఎక్కడ నుండి వచ్చుతున్నది? అన్ని వైపుల నుండి భయంకరంగా వచ్చుతున్నది అని అర్జునుడు పలకగా భగవానుడు విని ద్రోణుని కుమారుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు. దానిని వేరొక అస్త్రము చల్లార్చలేదు. దీనిని బ్రహ్మాస్త్రమే ఎదుర్కొనవలెను. నీవు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి ఆ తేజస్సును తగ్గునట్లు చేయుము అని చెప్పెను. భగవానుడు చెప్పిన మాటలు విని శత్రువులను సంహరించాడు అర్జునుడు ఆ బ్రహ్మాస్త్రమును ఉపశమింపచేయుటకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. రెండు అస్త్రములు ఒకదానితో ఒకటి కలిసి భూమ్యాకాశములను సూర్య తేజస్సు, అగ్ని తేజస్సు కలిసి వ్యాపించినట్లు ప్రజ్వలింపుచుండెను. మూడు లోకములను దహించున్న ఆ అస్త్ర తేజస్సును చూచి ప్రజలందరూ ప్రళయాగ్ని అనుకొనిరి. అర్జునుడు ఈ తేజస్సుచే లోకులందరూ నాశనమగుదరని శ్రీకృష్ణుని అట్టి వినాశము అభిమతము కాదనియు గుర్తించి రెండు బ్రహ్మాస్త్రములు ఉపసంహరించెను. తరువాత అశ్వత్థామ సమీపనవు చేరి అర్జునుడు కోపముతో కనులు ఎర్ర వారిన వాడై త్రాటితో పశువును కట్టినట్లు కట్టి తమ శిబిరమునకు బలాత్కారముగా లావుకొని వచ్చుచుండెను. అప్పుడు కృష్ణ భగవానుడు కోపముతో ఎర్రబడిన కన్నులు గలవాడై అర్జునా ఈ బ్రాహ్మణాధముడు పాపమెరుగక నిద్రించుచున్న బాలురును రాత్రివేళ చంపినాడు. ఇతనిని కాపాడుట నీకు తగదు. ధర్మము ఎరిగిన పురుషుడు ఒడలు తెలియని వానిని, పిచ్చి వానిని, నిద్రించున్న వానిని, బాలుని, స్త్రీని, మూర్ఖునిని, శరణు పొందిన వానిని, రథము లేని వానిని, భయపడి పారిపోవు వానిని, శత్రునెనను చంపడు.

దయలేని వాడై, నీచుడై తన ప్రాణాలను కాపాడుకుటకు పరల ప్రాణములను తీసి తనను పోషించుకొనువాడు వధార్హుడు. అట్టి వానిని వధింపక వదిలినచో వానిపై జాలిపడి వదిలినవాడు నరకమును పొందును. నీవు ద్రౌపదికి మాటను ఇచ్చి యుంటివి ఇతని శిరస్సును తెచ్చి ఆమె పాదముల చెంత ఉంచెదనని కావున నీ బంధువులను చంపిన ఈ పాపాత్ముని చంపుము ఇతడు తన ప్రభువగు ధృతరాష్ట్రునకు కూడా ఈ వధ అనిష్టమని ఎరుంగక ఆవేశముతో చేసినాడు కావున ఇతన్ని చంపుటయే కర్తవ్యం ఈ విధంగా కృష్ణుడు అర్జునుని పరీక్షించుటకు ప్రేరేపించెను. గురువును చూచినట్లే గురుపుత్రుని చూడవలెను. అతడు తనకు అపకారమే చేసెనను వాని చంపరాదు అనే ధర్మమును అర్జునుడు పాటింపగలడో లేదో చూడవలెనని కృష్ణుడి అభిప్రాయం. కానీ అర్జునుడు తన కుమారులను చంపినను గురుపుత్రుని చంపుటకు అంగీకరించలేదు. శ్రీకృష్ణుడు రథమును నడుపుచుండగా అశ్వత్థామను బంధించి తమ శిబిరమునకు తెచ్చి చనిపోయిన కుమారులకై విలపించుచున్న ద్రౌపదికి చూపెను. అశ్వద్ధామ పశువులే కట్టివేయబడి నీచముకు కర్మ చేయుటతో చేయుటచే సిగ్గుతో తలవంచుకొని ఆమె ముందు నిలిచి నిలిచి ఉండెను. సుకుమారముకు స్వభావం గల ద్రౌపది గురుపుత్రుడు తనకు అపకారం చేసినవాడే ఎనెను కృపచే దూషింపలేక నమస్కరించెను. అతన్ని కట్టి తీసుకోవచ్చుట సహింపలేకపోయెను. బ్రాహ్మణుడు మనకు గురువు. అతన్ని బంధింపకుడు. విడిచిపెట్టుడు. ఈతడు మీ గురుపుత్రుడు. ద్రోణాచార్యులు ప్రయోగ ఉపసంహారములతో ధనుర్వేదమునంతను మీకు నేర్పినారు. తండ్రియే కుమారుడుగా ఉండును. అందుచే ఈ అశ్వత్థామ ద్రోణుడే. ఆ ద్రోణాచార్యులు శరీరంలో సగభాగమే మీ గురుపత్ని అయిన కృపి. మీరు ధర్మజ్ఞులు. పూజింపదగిన నమస్కరింపదగిన గురువు అంశమును చంపి పాపము నొందుట మీకు తగదు. బిడ్డలు చనిపోయి నేను ఏడుచున్నట్లు ద్రోణాచలుడి పత్ని కూడా ఏడవరాదు. క్రోధమునకు పరవశమై మనసును నిగ్రహించుకొనలేక బ్రాహ్మణులకు అప్రియమును ఆచరించిన క్షత్రియులు బంధువులతో పరివారంతో నశింతురు. అందుచే అశ్వద్ధామును చంపుట మీకు తగదు. విడిచిపెట్టుడు. ధర్మబద్ధము, న్యాయసమ్మతము, దయాపూర్ణము, దోషరహితమగు ఆ మాటలు విని ధర్మరాజు, బ్రాహ్మణులు, నకుల సహదేవులు, సాత్యకి, అర్జునుడు, శ్రీకృష్ణుడు అతడి చేరియున్న స్త్రీలు.

మొదలగు వారందరు ఆమె ఔదార్యమునకు ధర్మపరతకు సంతోషించిరి. ఆమెను అభినందించిరి. కానీ భీముడు మాత్రం కోపపరవశుడై అతన్ని వదిలివేయుటకు సహింపలేకపోయెను. నిద్రించుచున్న బిడ్డలను చంపిన ఇతడు చంపదగిన వాడే అనెను. భీముని మాటలను ద్రౌపది మాటలను వినని శ్రీకృష్ణ భగవానుడు మిత్రుడగు భీముని మొహం చూచుతూ నవ్వుచు ఇట్లు పలికెను. బ్రాహ్మణాధముడైనను జాతి మాత్రము చేత గౌరవింపవలెను గాని చంపరాదు. చేయరాని పనులను చేసిన ఆతతాయిని ఆలోచింపక చంపవలెను అని శాస్త్రము చంపవలెననియు చంపరాదని చెబుచున్నది. ఈ రెండిటిని నీవు పాలింపవలెను. అని అర్జునుతో చెప్పెను. నీవు బయలుదేరినప్పుడు ప్రియురాలిని ఓదార్చు ఓదార్చు అశ్వద్ధామమున శిరస్సును ఖండించి తెచ్చి నీ పాదముల వద్ద ఉంచెదనని ప్రతిజ్ఞ చేసితివి. దాన్ని నీవు పాటించవలెను. భీముడు చంపవలెను కోరుచున్నాడు. అందుచే నీవు భీమునకు ద్రౌపదికి నాకు కూడా ప్రియమగునట్లు చేయుము. అర్జునుడు శ్రీకృష్ణుని హృదయమునంద అభిప్రాయమును గ్రహించెను. అశ్వత్థామ శిరస్సున ధరించిన మణితో పాటు కేశములను కూడా ఖండించి ఆ మణిని ద్రౌపది పాదముల వద్ద ఉంచెను. అశ్వత్థామను బంధము నుండి విడిచి పెట్టెను. మణి పోయి తేజోహీనుడైనటువంటి అశ్వత్థామను శిబిరము నుండి వెలికి పంపివేసెను. బ్రాహ్మణాధముడు తప్పు పనులు చేసినా కూడా వారిని చంపరాదు. తల గొరిగించుట గాని దేశ బహిష్కారము గాని చేయవలెను. ఇట్లు అర్జునుడు శ్రీకృష్ణుని ఆజ్ఞను పాలించిన తర్వాత పాండవులందరూ ద్రౌపదితో కలిసి చనిపోయిన వారికి ఉత్తమ సంస్కారం నెరవేర్చిరి. పాండవుల చనిపోయిన బంధువులందరుకు తర్పణములు, శ్రాద్ధములు చేయుటకు శ్రీకృష్ణునితో స్త్రీలతో కలిసి గంగా నదికి వెళ్ళిరి. కౌరవులందరు చనిపోవుటచే వారి స్త్రీలు వారికందరకు తర్పణములు చేసి విలపించిరి. శ్రీకృష్ణ పాదపద్మ రాగముచే పవిత్రమైన గంగాజలములలో అందరూ స్నానము చేసిరి. ఆ గంగా తీరమందు కూర్చునియున్న ధృతరాష్ట్రుని పుత్ర శోకముతో బాధపడుచున్న గాంధారిణి, కుంతిని, ద్రౌపదిని మునులతో కూడియున్న శ్రీకృష్ణ పరమాత్మ ఓదార్చెను. జూదగాండ్రు పంచకులై ధర్మరాజు రాజ్యమును అపహరించినారు. ద్రౌపది కేశపాశమును పట్టుకొని ఈడ్చి అవమానపరిచినారు. దానిని సహింపలేక కౌరవులందరినీ పాండవులు చంపినారు.

ఇదంతయు కాలం యొక్క ప్రభావం. దానికి ప్రతీకారం చేయుట ఎవరికినీ సాధ్యము కాదు. అందుచే శ్రీకృష్ణుడు యుద్ధ వ్యాజమున దుష్టులందరినీ సంహరింపచేసి వారి స్త్రీలందరిని ఓదార్చి ఉత్తమమైన విధానముతో ధర్మరాజుచే మూడు అశ్వమేధ యాగములు చేయించెను. ధర్మరాజు కీర్తి ఇంద్రుని కీర్తి వలె పవిత్రమై దిక్కులంతటా వ్యాపించినది. చేయవలసిన పనులు అన్నియు పూర్తి చేయుటచే శ్రీకృష్ణుడు పాండవులతో వెళ్లి వచ్చెదని చెప్పి సాత్యకితో ఉద్ధమునితో కలిసి ద్వారక వెళ్ళటం నిశ్చయించుకొనెను. బ్రాహ్మణులను అందరినీ పూజించెను. వారు తిరిగి శ్రీకృష్ణుని పూజించిరి. బయలుదేరుటకు సిద్ధముగా శ్రీకృష్ణుడు రథముపై దిరోహించి ఉండగా భయముతో బెదిరి ఉత్తర పరిగెత్తుకొని వచ్చుచు శ్రీకృష్ణుడు ఎట్లు విన్నవించెను. ఉత్తర శ్రీకృష్ణుడుతో ఏం చెప్పిందో మనం తర్వాత ఎపిసోడ్ మా పాడ్కాస్ట్ లో విందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Those who are ascetics, those who are charitable, those who are selfless, those who know mantras, auspicious ones, those who wish well, those who are devoted to Vinayaka, salutations to them. Those who are ascetics or charitable, those who do good deeds for the people Those who have earned fame, or yogis with self-control, or magicians, or others who are virtuous, or those who have not dedicated their penance and other practices to Srihari, will not be able to attain the ultimate fruit of those practices. Salutations to Sri Hari, who is supremely auspicious and has glorious fame. Second Canto, Fourth Chapter, 17th Prayer. Devotees of God, welcome to the first episode of the Srimad Bhagavata Tattva Deepika, in the 15th podcast. Vyasa undertook to write the Bhagavatam with the teachings given by Narada. Let's wait and see what happens. Those who do not like to study the epics filled with worldly purposes, by contemplating the Supreme Being and experiencing bliss. Those who do not desire any other purpose in God, and are devoted, are there. Devotion is the form and quality of the divine Right. Bhagavatam increases devotion to God. It's not against our beliefs. Therefore, even the sages who are like Atmaramas will respect the Bhagavatam. By listening to the Bhagavata, which describes the virtues of the Lord, Shuka's mind was captivated. Therefore, he studied the Bhagavata. For the wise sages, contemplation of the Lord is always a duty. The Bhagavata, because it clearly proves the qualities that the Upanishads do not prove, was very dear to Shugayogi. First, as an introduction, the birth of the royal scholar Parikshit

I will narrate the story of the Pandavas, who destroyed karma. Through that, the Krishna-related knowledge is understood. Thus began the conclusion, and Shaunaka and others started to tell the story of Parikshit's birth. In the Kaurava Pandava war, all the warriors died heroically, and Duryodhana died after fighting a mace fight with Bhima, and the village was destroyed. Ashwatthama, considering it a dear task for his lord Duryodhana, while the sons of Draupadi, the five Upa-Pandavas, were sleeping, cut off their heads and took them away. The story caused a stir among the listeners. The whole world condemned. Draupadi, seeing her children's heads being severed, cried and lamented. Unable to bear her grief, Arjuna spoke thus to her. The Brahmin killed the innocent child Ashwatthama unintentionally. I will release the arrows from my Gandiva and bring his head after cutting it off. You will step on it with your foot, bathe it, and remove your sorrow. In this way, consoling Draupadi's mind, Arjuna, being a friend, Krishna, as a charioteer While driving the chariot, he mounted the chariot with the Gandiva bow as a symbol on the Hanavadhaja and followed Ashwatthama, the son of Dronacharya. Ashwatthama, seeing Arjuna coming from a distance, ran far away with his chariot in fear to save his life. The horses were tired and could not move forward. Then Ashwatthama, using a weapon named Brahma Siramu, thought of killing Arjuna and saving himself. Ashwatthama knows how to use that weapon, but he doesn't know how to pacify it. The weapon was used because it was a threat to lives. Radiance of the fierce has spread in all directions. To save his life, I did not know any other way, so Arjuna said so. Krishna, you are the one who gives refuge to the mighty-armed devotees, aren't you? You are the lord of all the worlds.

The first man. You're out of your element. You are the supreme being. By the power of your knowledge, you cut through the illusion in the world that is conscious and self-aware, and you shine in your true form. You are the illusion, the body, the self, the independent, to the beings who are deluded, for dharma, artha, kama, moksha, and the means of sustenance, you are the one with great glory. You have incarnated in this world to destroy the wicked who are burdens to the earth, to serve you without any desire, and to be able to serve them. I don't know what this radiance that spreads everywhere is. Where are you coming from? Arjuna, hearing that it was coming terribly from all sides, Bhagavan heard and Ashwatthama, the son of Drona, launched the Brahmastra. It was not warded off by any other weapon. This is something that should be faced by Brahmastra. He said, "You use the Brahmastra and make that light decrease." Arjuna, hearing the words of the Lord, destroyed the enemies. To pacify that Brahmastra, the Brahmastra He launched. Two weapons joined together, and the earth and sky were illuminated as if the sun's light and the fire's light were combined. Seeing the brilliance of that weapon that burns the three worlds, all the people thought it was the fire of destruction. Arjuna, realizing that this brilliance would destroy all the people, and that such destruction was not desired by Sri Krishna, withdrew the two Brahmastras. Then Ashwatthama approached and, with anger, Arjuna, with red-red eyes, tied the animal with a rope, and was coming to their camp forcefully. Then Krishna Bhagavan, with red eyes, said, Arjuna, this Brahmin, unaware of his sin, killed the sleeping children at night. It's not in your best interests to stay out of this. A man who knows righteousness does not fear a man who does not know, a madman, one who is asleep, a child, a woman, a fool, one who has taken refuge, one who does not have a chariot, one who runs away in fear. He will not kill even an enemy.

He who is cruel, vile, and takes the lives of others to save his own, is worthy of death. If one does not kill such a person and leaves him, and if one leaves him feeling pity for him, he will attain hell. You had given your word to Draupadi that you would bring his head and place it at her feet. Therefore, kill this sinner who killed your relatives. He did this with rage, not realizing that this killing was also displeasing to his lord, Dhritarashtra Therefore, it is the duty to kill him. In this way, Krishna inspired Arjuna to test him. Just as one sees the Guru, so too should one see the Guru's son. Krishna's opinion is that it should be seen whether Arjuna can follow the dharma that he should not kill him because he has done him a disservice. But Arjuna refused to kill his nephews even though he had killed his nephews. While Srikrishna was driving the chariot, he brought Ashwatthama, bound him, and showed him to Draupadi, who was lamenting over her dead sons. Ashwatthama, the animals were tied up, and with shame, she bowed her head before him, doing it with karma He stood still. Draupadi, who had a gentle nature, could not bear to be insulted by the one who had harmed her husband, so she humbly bowed down. He couldn't bear to be tied up and taken. The Brahmin is our Guru. He should not be imprisoned. He should be released. He is your son-in-law. Dronacharya has taught you all of Dhanurveda with experiments and conclusions. The Father is the Son. So this Ashwatthama is Drona. Dronacharya's body is half of yours, my Guru's wife, Kripa. You are a saint. It is not appropriate for you to kill the part of the guru who is worthy of worship and salutation and suffer sin. Just as I am crying because my children have died, Dronacharya's wife also should not cry. Those who are intoxicated by anger and cannot control their minds, and who practice what is unpleasant to Brahmins, will perish with their relatives and family. Therefore, it is not appropriate for you to kill Ashwatthama. Leave him. Hearing those words that are righteous, just, full of compassion, and free from fault, Dharmaraja, Brahmins, Nakula, Sahadeva, Satyaki, Arjuna, and Srikrishna joined him The women.

All those who began were pleased with her generosity and righteousness. She was congratulated. But Bhima, in a fit of rage, could not bear to let him go. He who slew the sleeping children said that he was a murderer. Srikrishna Bhagavan, who did not listen to Bhima's words and Draupadi's words, looked at Bhima's friend's face, laughed, and said thus. Even though he is a Brahmin, he should be respected by his caste, but he should not be killed. The scriptures say that one should not kill a person who has committed unforgivable acts without considering the consequences. You must obey both. He said to Arjuna. When you set out, you promised to comfort your beloved, comfort Ashwatthama, cut off his head, bring it, and place it at your feet. You should follow it. Bhima wishes to be killed. Therefore, make it pleasing to Bhima, Draupadi, and me as well. Arjuna understood Sri Krishna's heart. Ashwatthama, along with the gem worn on his head, also severed his hair. Draupadi He placed it at the foot. Aswatthama was freed from the noose. Mani went and sent Ashwatthama, who was without light, out of the camp. A Brahmin, even if he has done wrong, should not be killed. One should either shave their head or go into exile from the country. Thus, after Arjuna obeyed Sri Krishna's command, all the Pandavas, along with Draupadi, performed the best rites for those who had died. To perform Tarpanam and Shraddha for all the dead relatives of the Pandavas, they went to the Ganges River with Sri Krishna and the women. Because all the Kauravas died, their wives performed obsequies for all of them and lamented. Everyone bathed in the Ganges water, which is purified by the lotus feet of Lord Krishna. Gandhari, who was suffering from the grief of her son Dhritarashtra, who was sitting on the banks of the Ganges, Kunti, Draupadi, along with the sages, Srikrishna Paramatma consoled her. The gamblers, being gamblers, plundered the kingdom of Dharmaraja. Draupadi held the Kesapasam and dragged it, humiliating it. Unable to bear it, all the Kauravas The Pandavas have been killed.

This is all the effect of time. It is not possible for anyone to take revenge for that. Therefore, Sri Krishna, in the guise of a war, destroyed all the wicked and comforted all their women, and with an excellent method, Dharmaraja had three Ashwamedha Yagas performed. Dharmaraja's fame, like that of Indra, was as sacred and spread throughout the directions. Having completed all the tasks to be done, Srikrishna, along with the Pandavas, decided to go to Dwaraka with Satyaki and Uddhama. He worshipped all the Brahmins. They returned and worshipped Lord Krishna. While Sri Krishna was ready to leave and was riding on the chariot, fearing and threatened, Uttara ran and came, how did Sri Krishna plead? We will listen to what Uttara told Srikrishna in our next episode of our podcast. Jai Srimannarayana. Salutations to the Asmadgurus