పరిచయం & ప్రియవ్రత చక్రవర్తి చరిత్ర

Introduction & History of Emperor Priyavrata

bhagavatam

శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధం విశ్వ విన్యాసం యొక్క దివ్యమైన దర్శనంతో ప్రారంభమవుతుంది, మరియు స్వాయంభువ మనువు పుత్రుడైన మహారాజు ప్రియవ్రతుని పవిత్ర చరిత్రను మనకు అందిస్తుంది. నారద మహర్షి ప్రభావంతో వైరాగ్యం వైపు మొగ్గు చూపిన ప్రియవ్రతుని, బ్రహ్మదేవుడు ప్రేమతో లోక కళ్యాణం కోసం రాజధర్మాన్ని నిర్వహించమని ప్రోత్సహించాడు. ప్రియవ్రత చక్రవర్తి తన రథ చక్రాల బలంతో భూమిపై సప్త సముద్రాలను మరియు సప్త ద్వీపాలను ఏర్పరచాడు. నిజమైన భక్తుడు లౌకిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే భగవంతుని పట్ల అచంచలమైన భక్తిని ఎలా కాపాడుకోవచ్చో ఈ ఎపిసోడ్ అద్భుతంగా వివరిస్తుంది.

Canto 5 of the Srimad Bhagavatham opens with a majestic vision of the universal arrangement, guiding us through the sacred history of Emperor Priyavrata, the illustrious son of Svayambhuva Manu. Though Priyavrata was deeply inclined toward spiritual renunciation under the guidance of Sage Narada, Lord Brahma lovingly persuaded him to fulfill his royal duties for the welfare of the world. Priyavrata ruled the earth with such unparalleled devotion and power that his chariot wheels carved out the seven oceans and seven continents as we know them today. This episode beautifully reveals how a true devotee of the Lord can engage in worldly responsibilities while keeping the heart firmly rooted in God.

← Prev Next →
Introduction & History of Emperor Priyavrata bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే సర్వభూతాధివాసాయ శాంతాయ బృహతే నమః ఓ శ్రీహరి సకల జగత్తునకు సత్తాస్ఫూర్తులను అనుగ్రహించే చైతన్య ఘనుడవు నీవే జగత్తును సృష్టించి సకల ప్రాణులకు ఆశ్రయమైనది నీవే. గుణప్రవాహమునకు అతీతముకు శాంత తత్వము నీవే. దేశకాల పరిచ్ఛేదములకు అతీతుడవగు నీ కొరకు అనేక నమస్కారములు. నైన్త్ క్యాంటో, 19th చాప్టర్, 29th ప్రేయర్. భవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము మొదటి పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు. మనం నాలుగు స్కంధాలను పూర్తి చేసుకొని ఐదవ స్కంధంలో అడుగు పెడుతున్నాం. నాలుగో స్కంధంలో ఇదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ఉత్తానపాదుని యొక్క చరిత్రము తన యొక్క పుత్రులు అనేటువంటి ప్రాచీన బర్హీలు తరువాత ప్రచేతస్సులు వారి పుత్రులు వారి యొక్క కథాభాగాన్ని మనం శ్రద్ధగా ఆలకించాం. దాని వివరంగా తెలుసుకోవడానికి నాలుగవ స్కందం పాడ్కాస్ట్లు అందరూ కూడా వినాలని మనవి. ఇప్పుడు ప్రియవ్రతుడు యొక్క అంటే స్వయంభువ మనువు యొక్క రెండవ కుమారుడు పేరు ప్రియవ్రతుడు. మొదటి కుమారుడి పేరు ఉత్తానపాదుడు ఆయన చరిత్ర మనం నాలుగో స్కంధంలో పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ప్రియవ్రతుడి చరిత్రం తెలుసుకుందాం. ప్రియవ్రతుడు మహా భాగవతుడు. అతడు బ్రహ్మ ఆత్మగా ఉన్న తన ఆత్మనే సంతతం అనుభవించుచుండును. అట్టివాడు ఇల్లు వదలి వనములలో నుండక ఈ దేహమును బిడ్డలను అనుభవించు చెట్లుండెను. గృహమునందు ఆసక్తి కలిగి ఉండుటయే కర్మలు బంధించుటకు కారణము. కర్మ బంధముచే ఆత్మ యొక్క భావము సంకుచితమగును. జ్ఞానము సంకుచితమగుటచే భగవత్ స్వరూపము భాసింపదు. అందుచే భగవత్ భక్తి గల ప్రియవ్రతుడు ఇంటియందు ఆసక్తి గలవాడే ఎట్లుండెను?

ఆత్మారాములై ముక్త సంగులైన భాగవతులకు గృహము, బిడ్డలు, భార్యలు మున్నగు వారిని దుఃఖ హేతువులు అని ఎరుంగుటచే అనుభవింపవలెను అభినివేశం ఉండదు కదా? అట్టి వారికి గృహముల యందు అభినివేశం ఎట్లుండును? భగవత్పాదారవిందముల నీడ నుండి తాపత్రయములచే తపింపబడకుండా ఆనందముతో ఉండెడి మనస్సు గల మహాపురుషులకు కుటుంబమునందు స్పృహ ఉండదు. అట్లు గృహమునందు ఆసక్తి గలవానికి భక్తి ఎట్లు కలుగును? కానీ ప్రియవ్రతుడు గృహమునందు ఆసక్తి గలవాడయు కృష్ణుని యందు ఆసక్తిచే ముక్తి పొందునని తెలియుచున్నది. అది ఎట్లు కుదిరనని సంశయముగా ఉన్నది అని పరీక్షిత్తు సుఖయోగిని ప్రశ్నిస్తున్నాడు. ఈ పంచమ స్కంధము మొట్టమొదట. రాజా, నీవు చెప్పినది నిజము. గృహమునందు ఆసక్తి గలవారికి భక్తి యోగము కుదరదు. ఆత్మారామునకు గృహమునందు ఆసక్తి ఉండదు. భగవానుని నిరతిశయ శోభాయుక్తములు సౌగంధ్య సౌకుమార్య లావణ్యములు కలవీనిను అగు పాదారవిందములు నుండి శ్రవించడి మకరంద ప్రవాహమే భక్తి. దానియందు ఆసక్తి కలిగిన వారికి ఏదైనా ఒక విఘ్నముచే మధ్యలో విచ్ఛేదము కలిగినను భగవత్భక్తి ఎడదెగక సాగుచుండును. వారు పరమహంసలు, భాగవతులు. వారికి ప్రియమైనది భగవత్ కథ. వారు పొందవలసినది మోక్షము. వారికి మొదటి నుండియు ఆ మోక్షమునకు మార్గముకు భక్తి యందే నిశ్చలముకు శ్రద్ధ ఉండుటచే వారికి మనసు నంటిన వాసనలు గృహముల యందు ఆసక్తి ఉన్నను ఆ భక్తి వదలక ఉండును. రాజపుత్రుడగు ప్రియవ్రతుడు, పరమ భాగవతుడు, నారదుని చరణ సేవ చేసినవాడు, అతని వలన పరమార్థ తత్వమును ఎరింగినవాడు, అతడు బ్రహ్మ సత్రమును చేయవలెనని తలంచినాడు. రాజ్య పరిపాలన చేయుటకు అవశ్యకము అయిన గుణగణములు పరిపూర్ణముగా కలవాడు. తండ్రియైన స్వయంభవ మనువు అతనిని రాజ్యము చేయమని చెప్పెను. అది తిరస్కరింపరాదు. కానీ రాజ్యపాలనముచే ప్రకృతి పరిణామ రూపమగు శరీరమునందు ఉంటుటచే రాగద్వేషములు కలిగి దానిచే భగవద్జ్ఞానం మరుగుపడునని అతడు భావించి రాజ్య పరిపాలనమునకు అంగీకరించలేదు.

ప్రియవర్తుని మనస్సులో నిశ్చయమును దేవతలందరిలోను మొదటివాడును పరిపూర్ణమగు జ్ఞానముచే విశ్వమంతయు వ్యాపించి జగత్తు యొక్క అభిప్రాయమును ఎరింగినవాడును అగు చతుర్ముఖ బ్రహ్మ ఎరింగి మూర్తీభవించిన వేదములతో మరీచి మొదలగు వారితో సత్యలోకము నుండి భూలోకముకు దిగి వచ్చెను. ఆ సత్యలోకము కంటే క్రిందనుండు ఆకాశమున నక్షత్రముల మధ్య చంద్రుని వలె ప్రతిక్షణం ప్రకాశించుచు దేవ దేవేదాందులచే దేవేంద్రాదులచే పూజింపబడుచు సిద్ధగణములు ప్రతిక్షణము ఆరాధించుచుండగా గంధమాదన పర్వతం యొక్క లోయను తన కాంతిచో ప్రకాశింప చేయుచు చేరెను. నారదుడు హంసవాహనముతో దిగుచున్న బ్రహ్మను చూచి తన తండ్రియగు బ్రహ్మయే అని ఎరింగెను. స్వయంభువమను ప్రియవ్రతునితో కలిసి ఆ గంధమాదన పర్వతము వద్ద బ్రహ్మకు నమస్కరించి స్వాగతం పలికెను. చతుర్ముఖుడు వారి స్తోత్రములతో చాలా సంతసించిన వాడై వారి ఆరాధనమును స్వీకరించి ప్రియవ్రతుని దయతో చిరునగవుతో చూచుచు ఇట్లు పలికెను. నాయనా ప్రియవ్రత, నేను చెప్పినది మిమ్ములను అందరినీ శాసించడి భగవానుని ఆదేశం. ఇది సత్యం, శ్రద్ధతో వినుము. నేను చెప్పెడి ఉపదేశము ప్రాకృతములగు ఇంద్రియములచే కలిగెడి జ్ఞానముచే ఎరుంగరానిది. అపరిచ్ఛిన్నము. దానిని నీవు తిరస్కరించినచో భగవంతునిపై అసూయ కలిగినట్లు అగును. అందుచే దానిని దోష బుద్ధితో చూడకుము. ఆ భగవానుని ఆదేశమును పరతంత్రుల పరతంత్రులమై నీ తండ్రియగు స్వయంభువ మనువు మహర్షి నారదుడు మేము రుద్రుడు కూడా పాలించుచుందుము. భగవానుడు మన వాక్కుచే గాని, మనసుచే గాని గ్రహింప శక్యము గాని వాడు. సత్యమును తన వంశము వశమునందు ఉంచుకొని పాలించగలగవాడు. అట్టి వారి ఆజ్ఞను మనమందరము పాలింపవలెను. దానిని మనం ఎవ్వరము జవదాటరాదు. ఆ భగవానుని శాసనమునకు వశపడి సూర్యచంద్రులు ధరించబడి ఉన్నారని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. శరీరధారియగు జీవుడు ఎవ్వడును అతని ఆజ్ఞను అతిక్రమింపజాలరు.

ఎంత తపస్సు చేసినను, ఎంత జ్ఞానము ఉన్నను, యోగ భక్తి ఉన్నను, బుద్ధి ఉన్నను అతని ఆజ్ఞను ఎవ్వరును అతిక్రమింపజాలరు. ధనము చేయుగాని, యజ్ఞాది ధర్మాచరణము చేయుగాని, బలవంతుని వేరొకరిని ఆశ్రయించిన గాని, తనంత తాను గాని ఏ విధమగునో. భగవంతుని ఆజ్ఞ మీరుట సాధ్యము కాదు. ఓ ప్రియవ్రత, ఈ విశ్వములో జనులందరూ భగవానుని సంకల్పమును అనుసరించి దేహ సంబంధమును పొందుచున్నారు. శరీరముతో జీవులు కర్మలు చేసి ఉత్తమ జన్మలందుటకు జన్మలు నశింప చేసుకొనుటకు శోకమును, మోహమును, భయమును పోగొట్టుకొనుటకు సుఖమును దుఃఖమును సంపాదించుకొనుటకు సాధనమే శరీరము. దీనిని జీవులకు సర్వేశ్వరుడే సమకూర్చుచున్నాడు. ముక్తిని ఆర్జించుటకు కూడా శరీరము సాధనమే. ఆ భగవంతుని వాక్కు వేదములు. అతనిది అది త్రాడు వలె జీవుని బంధించును. సత్తరజస్తమో గుణములు ఆ గుణములచే వారి వర్ణములకు చేయదగిన కర్మలు మెదులగు అన్నియు ఈ జీవుని శరీరముతో బంధించుటకు కారణములు. అందరము వేదమును అనుసరించి వేద విహత కర్మలు చేయుచు ముక్కుత్రాడి వేసి బంధించిన నాలుగు కాళ్ళ జంతువగు పశువు రెండు కాళ్ళ మనుషునకు వశపడినట్లు వశపడి వాని కొరకే సర్వ కర్మలు చేయుచున్నాం. ఈ ప్రాణులందరూ వేదములు కర్మలు అనేటి పాశముచే బంధింపబడిన వారై భగవానునకు ఆరాధనము చేయుచుందురు. ఓ ప్రియవ్రత సర్వేశ్వరుడు ఎట్లు వినియోగించునో అట్లు మనమందరము ఆయా వర్ణాశ్రమములను జాతులను పొంది దేవ తిర్యక్ మనుష్య శరీరములను పొంది ఉన్నవారము గాని స్వతంత్రమును కాము. సత్వరజస్తమో గుణములచే ఆయా కర్మలను చేసి వాని ఫలముగా సర్వేశ్వరు నుసంగిన సుఖమును గాని దుఃఖమును గాని అనుభవించుచున్నాము. సర్వేశ్వరునకు పక్షపాతము గాని వైషమ్యము గాని లేదు. జీవుల యొక్క గుణములను బట్టి కర్మలను బట్టి ఫలమును వసంగుచుండును. చూపు గలవాడు గుడ్డివాని నడిపించునప్పుడు ఆ చూపు గలవాడు ఎండలో నడిపించినను నిడలో నడిపించినను గుడ్డివాడు ఎట్లు అనుసరించి పోవునో అట్లే జీవులందరును సర్వేశ్వరునకు వశులై సాగుచుందురు. సంసారియగు జీవుడు ఈశ్వరుడు చేయవలెన నిర్దేశించిన ప్రవృత్తి ధర్మములను ఆచరింపవలెను. కానీ జ్ఞానము లేనివాడు కర్మలచే వచ్చు ఫలములను అనగా సుఖదుఃఖములను తానే అనుభవించుచున్నానని భావించును.

జ్ఞానము గలవాడు అభిమానము లేనివాడై దేహమును కల్పించునట్టి బంధకములుగా కర్మలు ఆచరింపడు. ఇట్లు మోక్షమునందు ఇచ్చగలిగి జ్ఞానము గలవాడు కూడా ప్రారబ్ధానుభవము దేహధారణము చేయక తప్పదు. ముముక్షువు కర గృహములను వీడి అరణ్యములను కేగి అచరును ఉండుట అచరు దొరికేడి కందమూలాదులతో శరీరమును పోషించుకొనుట మేలు కానీ గృహమునందు ఉండుట మేలు కాదని భావింతువేమో. భయము అభయము కలుగుటకు గృహము వనము కారణములు కావు. ఇంటిలోనున్నను అడవిలోనున్నను స్వస్వరూపమును పరస్వరూపమును మరచి ఉన్నవాడు దేహములకు ఇంద్రియములకు వశపడి ఉండక తప్పదు. ఆత్మ స్వరూపమును మరిచి ఉన్నవాడు అడవిలో ఉన్నను సంసారము వీడడు. అడవిలో ఉన్నను శత్రువులు వారిలో వారితో కలిసి ఉందురు. జ్ఞానేంద్రియములు ఐదు, మనస్సు అనేటి ఆరు ఆత్మలకు శత్రువులు. అవి విషయములందు ప్రసరించుట జ్ఞానమునకు విరుద్ధము. ఎచ్చట ఉన్నను ఇంద్రియములు వశకము కానప్పుడు ఆత్మ స్వరూపము మరిచి వర్తించుటచే వానికి సంసారం వదలదు. బంధము తప్పదు. ప్రకృతి కంటే వేరైన ఆత్మ స్వరూపమును ఎరింగి బ్రహ్మనిష్ఠ కలిగి ఉన్న వానికి ఇంటిలో ఉండుటచే ఏ అనర్థము కలగదు. వాని ఇంద్రియములు విషయములపై ప్రసరింపవు. కనుక వానికి అభయము లభించును. జ్ఞాననిష్ఠకు విరుద్ధములు జ్ఞానేంద్రియములు మనస్సు. అందుచేత ఇంద్రియములను జయించుటకు మనస్సును వశపరచుకొనుటకు ప్రయత్నించువాడు గృహస్థాశ్రయమును వీడక ఇంటిలో ఉండియే ప్రవర్తించవలెను. శత్రువులను జయింపవలెనని కోరెడి రాజు దుర్గములో ఉండి యుద్ధము చేసిన శత్రువులను జయించును. అట్లే ఇంద్రియములను జయింపగోరువారు గృహస్థాశ్రమలోనే ఉండి ఇంద్రియములను జయించుటకు ప్రయత్నించవలెను. ప్రియవ్రతా, నీవు భగవత్పాదారవిందముననెడి దుర్గమును ఆశ్రయించి ఉన్నవాడవు. ఇంద్రియములను మనస్సును జయించిన వాడవు. అయినను ఇంటిని వీడి అడవికేగ వలెన తలంపు సరైనది కాదు. భగవానుడు నీకు సంకల్పించిన భోగములను ఇతట అనుభవింపుము. వాటియందు సంఘము లేకుండా ఉండుము. భగవత్భక్తితో ఉండి ఆత్మ యొక్క స్వరూపమును ఎరుంగుము.

ఈ విధముగా బ్రహ్మ ఉపదేశింపగా మహానుభావుడగు ప్రియవ్రతుడు త్రిలోక జనకుడగు బ్రహ్మ యొక్క ఆజ్ఞను శిరస్సు వంచి నమస్కరించి స్వీకరించి గౌరవముతో అంగీకరించెను. స్వాయంభువ మనువు బ్రహ్మకు యథాశాస్త్రముగా అర్చనము వనర్చెను. ప్రియవ్రతుడు నారదుడు చూచుండగా వాజ్ఞ వాగ్మనస్సులకు అందని తన లోకమునకు బ్రహ్మ వెడలెను. స్వయంభువ మనువు కూడా తన కోరికను బ్రహ్మ సాధించుటచే సంతోషించి నారదుని అంగీకారముతో తన పుత్రుడగు ప్రియవ్రతుని లోక రక్షణముకు నియమించి విషపు మడుగుల వంటివైన విషయములగు విషయ భోగమునందు ఆశ వదిలిన వాడాయను. భగవానుని పాద యుగళమును ఎడతెగక ధ్యానించి మనసున అంటిన రాగాది విషయములు తొలగిన వాడాయను. బ్రహ్మాదుల ఆజ్ఞను అనుసరించి భూమండలమును పాలించెను. విశ్వకర్మను పేరుగల ప్రజాపతి కుమార్తె అయిన బరిహిష్మతిని వివాహమాడెను. ఆమె యందు తనతో సమానమగు శీలము, గుణములు, రూపము, వీర్యము గల కుమారులను పది మందిని పొందెను. వారు తరువాత ఊర్జ్వ స్థితి అను కన్య కూడా జన్మించెను. ఈ కుమారులు 10 మందికి అగ్నుల యొక్క పేర్లు ఉన్నవి. అగ్నీంధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతవృష్టుడు, సవనుడు, మేధాతిథి, వీధిహోత్రుడు, కవి. అని 10 మందికి నామధేయములు ఉంచిరి. వారిలో కవి మహావీరుడు. సవణుడు అనిటి ముగ్గురు ఇంద్రియ జితేంద్రులై ఊర్ధరేతస్కులై ఉండిరి. వారి బాల్యము నుండియు ఆత్మవిద్యయందే పరిచయం పరిచయము గలవారై నివృత్తి ధర్మమునందే ఆసక్తి గలవారలై పరమహంసులై ఉండిరి. వారు పరమహంసాశ్రమమున ఉండి ఇంద్రీయ నిగ్రహము సహజముగా లభించిన వారై ఉండిరి. సకల జీవ సమూహము తన శరీరముగా గలవాడును సంసార భీతి గలవారికి రక్షకుడును అగు వాసుదేవుని చరణారవిందములయందు అవిచ్ఛిన్నముగా స్మరణ గలవారలై పరమ భక్తి గలవారలై ఉండిరి. వారి మనసున భగవత్ సాక్షాత్కారమునంది ఉండిరి.

భగవానుడితో తాము సాధర్మ్యమును పొంది ఉండిరి. ప్రియవ్రతునకు రెండవ భార్యయందు ముగ్గురు కుమారులు కలిగిరి. ఉత్తముడు, తామసుడు, రైవతుడు అని పేర్లు గలయ ముగ్గురు కుమారులు తరువాత మన్వంతరములకు అధిపతులైరి. ఉత్తమ గుణవంతురాలైన కుమారులు లభించి 11 కోట్ల సంవత్సరములు తన ఆజ్ఞకు ఎదురులేకుండా ప్రియవృద్ధుడు పరిపాలించుచు భార్యలతో ఆనందించుచు వివేకము తొలగిన వాని వలె జ్ఞానము లేని వాని వలె వారి విలాసములకు వశపడి వర్తించుచున్నట్టుండి రాజ్యమును అనుభవించెను. తర్వాత జరిగినటువంటి పాడ్కాస్ట్ లో తర్వాత విషయాన్ని మనం తెలుసుకుందాం అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Gurus, salutations to you, Lord Vasudeva, the knower of all beings, the peaceful one, the great one, salutations to you. Oh Srihari, you are the one who bestows the essence of power to the entire universe, you are the one with consciousness, you created the universe and all You are the protection of the living beings. You are the peaceful essence beyond the flow of qualities. Many salutations to you, who are beyond the limitations of space and time. Ninth Canto, 19th Chapter, 29th Prayer. Dear relatives, welcome to the first podcast of the fifth book of Srimad Bhagavata Tatva Deepika. Until now. We have completed four books and are stepping into the fifth book. In the fourth Skandha, as part of the conversation between Idura and Maitreya, we have carefully listened to the story of Uttanapada, his sons, the ancient Barhilu, then the Prachetas, their sons, their story. We request all the listeners to listen to the fourth episode of Podcasts to know in detail. Now, Priyavrata's, that is, Swayambhuva Manu's second son's name is Priyavrata. The name of the first son is Uttanapada. We have completed his history in the fourth book. Now, let's learn about the history of Priyavrat. Priyavratudu is a great devotee. He experiences his own soul as the Brahma Atma. Such a person, leaving home and not living in forests, had trees that enjoyed this body and children. Having interest in household is the reason for binding karmas. Karmic bondage makes the soul’s perspective narrow. Because knowledge is narrow, the form of God does not shine. Therefore, how was the devotee of God, the beloved one, who was interested in the house?

Those Bhagavatas who are liberated and free from attachment, should experience the sorrow of not having a house, children, wives, etc., because they know them to be the cause of sorrow, right? How will those who have such a desire be in their homes? Those great men who have a mind to be in family, without being afflicted by anxieties from the shadow of the lotus feet of the Lord, and who are happy, have no consciousness in the family. How can devotion arise in someone who is interested in the house? But Priyavrata, being interested in the house, it is known that he will attain salvation through interest in Krishna. Parikshit, the happy Yogi, is questioning how it is possible. This fifth book, first. Your Highness is to be blamed. For those who are interested in household, devotion yoga is not possible. The soul has no interest in the house. The nectarous, fragrant, modest, and beautiful lotus feet of the Lord, from which the flow of nectar is heard, is devotion. For those who are interested in it, even if there is any obstacle, even if there is a break in the middle, do not let your devotion to God waver They are cultivating. They are Paramahamsas and Bhagavatas. The devotees' favorite is the story of the Lord. What they should achieve is liberation. From the beginning, they have faith in the path to salvation, in devotion, and in steadfastness, so they have the fragrances that are attached to their minds, even if they have interest in houses, they will not abandon that devotion. Priyavrata, a Rajput, a supreme devotee, one who served Narada, one who understood the ultimate truth through him, he thought that he should build a Brahma's abode. He is one who possesses all the qualities necessary for governing a kingdom. Swayambhuva Manu, the father, told him to rule the kingdom. It is not to be denied. But because he was in the body, which is the form of natural evolution through governance, having attachment and aversion, he thought that the knowledge of God would be obscured by it, and he did not agree to the governance of the kingdom.

In the mind of Priyavartuni, the determination, the first among all the gods, the complete knowledge, pervading the entire universe, the one who knows the opinion of the world, the four-faced Brahma, with the Vedas that originated from the idol, and others With them, he descended from the heavens to the earth. That which is below the world of truth, in the sky, among the stars, shining like the moon every moment, being worshiped by the gods and demons, being worshiped by the gods and demons, while the Siddha Ganas are worshiping every moment, the valley of Gandhamadana mountain is his The light shone and reached. Narada, seeing Brahma descending with a swan, exclaimed, "Is it Brahma, my father?" Swayambhuva, along with Priyavrata, greeted Brahma at the Gandhamadana mountain and welcomed him. The four-faced one, being very pleased with their praises, accepted their worship and, with the grace of Priyavrata, looked with a smile and spoke thus. Oh dear Pratyavrata, what I have said is the order of the Lord to all of you. Listen carefully to this, Satya. I'd like The teaching that is said is imperishable, beyond the knowledge gained by the senses. It is indivisible. If you reject it, it will be like envying God. Therefore, do not look at it with a faulty mindset. That order of the Lord, being dependent on others, your father Swayambhuva Manu, sage Narada, and we, Rudra, also govern. God is capable of being perceived by our speech or by our mind. He who keeps the truth in his lineage and can rule. We should all obey their commands. We must not allow that to happen. The Upanishads say that, subjugated by the law of that God, the sun and moon are adorned. No one, being a body, can transgress his command.

No matter how much penance you do, no matter how much knowledge you have, no matter how much yoga and devotion you have, no one can violate his command. Whether it is to do wealth, or to perform yajna and other dharmas, or to rely on another for strength, or to be alone, whatever it may be. It is not possible for you to obey God. Oh Priyavrata, in this universe, all the people, following the will of God, are attaining bodily relationships. The body is the means to attain good births, to destroy births, to get rid of sorrow, delusion, and fear, to acquire happiness and sorrow. This is provided by God to the living beings. The body is also the instrument by which enlightenment is attained. The Vedas are the word of God. His is like a rope, binding the soul. The qualities of the seventy-six senses, and all the actions that are performed by those senses for their respective colors, are the reasons for binding all of them to the body of this being. Following the Vedas, performing Vedic rituals, having a nose ring, having a four-legged animal bound, to a two-legged human As if subdued, we are doing all the deeds for him. All these beings are bound by the noose of Vedas and actions, and they worship the Lord. Oh, how the all-pervading Lord Sarveshwara utilizes, in that way, all of us, having attained the Varnaashramas and castes, having attained divine, celestial, and human bodies, we are not independent. By the qualities of Sattva, Rajas, and Tamas, having done those actions, as their fruits, we are experiencing either happiness or sorrow, depending on whether the Lord is pleased or displeased. There is no partiality or discrimination towards the Lord. Depending on the qualities and actions of living beings, the fruits are determined. When the one with sight guides the one without sight, just as the one with sight guides in the sun and guides in the shade, so all creatures will follow and be subject to the Lord. A worldly being should practice the prescribed duties of dharma, as directed by God. But one without knowledge considers that he himself is experiencing the fruits of his actions, that is, happiness and sorrow.

He who is full of knowledge, without pride, does not perform actions as bonds that create the body. Thus, even one who is capable of giving liberation and has knowledge must experience the fruits of past actions and assume a body. Mumukshu, leaving the houses and going to the forests, thinking that it is better to live as an ascetic, to nourish the body with roots like Kanda, but to be in the house, we may think that it is better not to be. Home and the forest are not the causes of fear and deliverance. He who forgets his true form and his other form, whether in a house or in the forest, must be subject to his body and senses. He who forgets the nature of the self, even if he is in the forest, does not leave worldly life. Even in the forest, enemies are with them. The five senses are five, and the mind is the sixth enemy of the soul. They are contrary to knowledge in spreading things. Wherever one is, when the senses are not under control, forgetting the form of the soul and acting, one does not leave the cycle of life. Bondage is inevitable. The soul, which is different from nature, having a form of Brahman, is in the house of the one who is devoted to Brahman There will be no loss. His senses do not percolate with the objects. Therefore, he will receive assurance. The senses and the mind are contrary to the intellect. Therefore, one who tries to control the mind to conquer the senses should not leave the shelter of a householder, but should live in the house and act accordingly. The king who wishes to conquer enemies will conquer the enemies who fight while staying in the fort. Similarly, those who desire to conquer the senses should remain in the Grihastha stage of life and strive to conquer the senses. Priyavrata, you are the one who resides under the Durga, which is said to be the lotus feet of the Lord. You are the conqueror of the senses and the mind. However, the thought of leaving home and going to the forest is not right. Experience the pleasures that the Lord has destined for you. Be without church. Being in devotion to God, understand the nature of the soul.

In this way, when Brahma preached, the great and virtuous Priyavrata, bowing his head to the command of Brahma, the father of the three worlds, accepted it with reverence. The self-existent Manu performed the worship of Brahma as prescribed. While Priyavrata and Narada were watching, Brahma departed to his world, which was beyond the reach of speech and intellect. Swayambhuva Manu also, being pleased that Brahma fulfilled his wish, with Narada's consent, appointed his son Priyavrata to the protection of the world, and he was the one who gave up hope in worldly pleasures like the drinking of poison. By constantly meditating on the lotus feet of the Lord, the worldly matters that have attached themselves to the mind are removed. He ruled the earth, obeying the orders of the Brahma. Vishwakarma married Bareeshmati, the daughter of Prajapati, named Vishwakarma. She obtained ten sons with her, who had the same character, virtues, form, and strength as her. They were later joined by the virgin Oorja. These sons have the names of the Agnis to 10 people. Agnindhrudu, idhamajihudu, Yajnabahu, the great hero, Hiranyareta, Ghritavrishtu, Savanudu, Medhatithi, Vedihhotra, Kavi. And put the names of 10 people. Among them was the great poet Mahavir. The three savants were the conquerors of the senses, and were situated in the middle of the city. From their childhood, they were familiar with self-knowledge and had an interest in the duty of restraint, and they were supremely self-controlled. They were in the Paramahamsa ashram and had naturally attained control over their senses. All living beings, those who have his body, and those who have the fear of worldly life, being remembered unbrokenly at the lotus feet of Vasudeva, being with supreme devotion, were there. They were in the state of divine realization in their hearts.

They had attained the state of being in harmony with God. Priyavrata had three sons by his second wife. Uttamudu, Tamasudu, and Raivatudu, these three sons later became the rulers of the Manvantaras. Having obtained excellent virtuous sons, for 11 crore years, without opposing his command, the beloved old man ruled, rejoicing with wives, like one who has lost wisdom, like one who is without knowledge, being subject to their pleasures As if it were in effect, he enjoyed the kingdom. In the podcast that followed, let us learn about the next topic. Salutations to Asmadguru