కుంతీదేవి దివ్య స్తుతి - ఆపదలలో భగవత్ స్మరణ వైభవము
Prayers of Queen Kunti — Glories of Surrender in Adversity
ఈ భాగవత ప్రవచనంలో, కురుక్షేత్ర యుద్ధానంతరం శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళబోయే సమయంలో కుంతీదేవి చేసిన దివ్య స్తుతులను వివరిస్తున్నాము. జీవితమంతా అపారమైన కష్టాలను అనుభవించిన కుంతీదేవి, మరింత ఆపదలను ప్రసాదించమని ప్రార్థించడం ద్వారా భక్తి యొక్క అత్యున్నత తత్త్వాన్ని ప్రకటిస్తుంది. ఆపదలలో మాత్రమే భగవంతుని స్మరణ సహజంగా కలుగుతుందని, అదే నిజమైన భక్తుని లక్షణమని ఆమె ప్రార్థనలు మనకు బోధిస్తున్నాయి. శరణాగతి యొక్క మహిమను హృదయానికి హత్తుకునేలా తెలిపే ఈ ఎపిసోడ్, ప్రతి భక్తుడూ తప్పక వినవలసిన అమూల్యమైన ప్రవచనం.
In this profound episode of Srimad Bhagavatham, we explore Queen Kunti's heartfelt prayers to Lord Sri Krishna as He prepares to depart for Dwaraka after the Kurukshetra war. Kunti Devi, having witnessed unimaginable suffering throughout her life, astonishes us by praying for more calamities, revealing that adversity is the greatest catalyst for remembering the Lord. Her prayers illuminate the highest philosophy of devotional surrender — that a true bhakta seeks not comfort, but the constant presence of Krishna in every circumstance. This episode is an eternal reminder that the grace of the Lord is most deeply felt not in prosperity, but in the humble cry of a surrendered heart.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః విచక్షణాయ చరణోపసాధనాత్ సంగమ్ యుదస్యో భయతో అంతరాత్మనః విందంతిహి బ్రహ్మ గతిం గతక్లమాః తస్మై సుభద్రశ్రవసే నమో నమః వివేకవంతులు శ్రీహరి యొక్క పాదపద్మములను సేవించి తద్వారా మనస్సునకు ఇహపరలోకముల భోగములందు గల ఆసక్తిని అతిక్రమించి ప్రయాస లేకుండగానే బ్రహ్మీభూతులగుదురు. అట్టి పరమ మంగళకరము కీర్తి గల శ్రీహరికి అనేక నమస్కారములు. సెకండ్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ 16th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్భాగవత తత్వదీపిక ప్రథమ స్కంధం. 14వ ఎపిసోడ్లో స్వాగతం. ఇంతక్రితం నారదులు వారి యొక్క వృత్తాంతాన్ని చెప్తూ వారు వ్యాసులు వారిని ప్రేరేపించారు. భాగవతం రాయటానికి ముందు భాగాన్ని తెలుసుకుందాం. నారదుడు తన జన్మను కర్మను చెప్పగా విని సత్యవతి సుతుడగు వ్యాసుడు మరల ఇట్లు ప్రశ్నించెను. భగవాన్ మీకు జ్ఞానము ఉపదేశించిన ఆ సన్యాసులు వెడలిన తరువాత చిన్న వయసునందున్న మీరు ఏమి చేసిరి? తరువాత కాలమంతయు ఎట్లు గడిపిరి? ఆయుహ్ పరిమితి గడిచిన తరువాత ఎట్లు ఈ శరీరమును వీడిరి? వెనకటి కల్పములో జరిగిన కథ కదా? మీరు ఇప్పుడు చెప్పినది ఇంత కాలము గడిచిన తరువాత సహజముగా కాలము వెనుకటి సంస్కారములను మరుగుపరుచును కదా మీకు పూర్వజన్మ వృత్తాంతం ఎట్లు జ్ఞాపకం ఉండెను అని ప్రశ్నించారు వ్యాసుల వారు. వ్యాసుడిట్లు అడగగా నారదుడు ఇట్లు చెబుచున్నాడు. నాకు జ్ఞానమును ఉపదేశించిన ఆ సన్యాసులు చాతుర్మాస్యం పూర్తి కాగానే వెడలిపోయిరి. నేను బాలుడను, మా తల్లికి నేను ఒక్కడినే కుమారుడను. ఆమె జ్ఞానము లేనిది. దాస్యము చేసి నన్ను పోషించేడిది. నాకు వేరొక గతి లేదని నన్ను ఆమె ఎంతో ప్రేమించినది. కానీ ఆమె అసమర్థురాలై ఉండిడిది. నియమించు వారి అధీనమున ప్రవర్తించవలసిన జీవులు. కొయ్యబొమ్మ ఆడించు వాని ఇష్టం వచ్చినట్టు ఆడవలెను కదా? ఆమె కొరకై నేను కూడా బ్రాహ్మణుల ఇంట్లోనే ఉండడివాడను. నాకు అప్పుడు ఐదేళ్ల వయస్సు. నాకు దేశకాల జ్ఞానము లేదు. ఒకనాటి రాత్రి
పాలు పిండుటకు ఆమె ఇంటి నుండి వెలుపలికి వచ్చినప్పుడు విధివశమున పాము కరిచి ఆయన ప్రాణం వేడెను. అప్పుడు నేను భక్తులకు భగవానుడు మేలే చేయునని నిశ్చయించుకొని ఆమె చనిపోవుట భగవానుడు నాపై చూపిన అనుగ్రహమని భావించి ఉత్తరపు దిక్కునకు ఇల్లు వదిలిపోవుచుంటిని. పట్టణములను, పల్లెలను, గ్రామములను, వ్యవసాయ క్షేత్రములను, కొండ జాతుల వారి పల్లెలను, తోటలను, అరణ్యములను, ఉద్యానవనములను చూచుచు మంచి జలములు గల చెరువులను సేవించుచు పోవుచుంటిని. ఎవ్వరూ తోడు లేక నడిచిపోవుచున్న నేను ఒక పెద్ద భీకరమగు వనమున ప్రవేశించితిని. అందు క్రూరముగులు, మురుగముగులు, దుష్ట సర్పములు కనపడుచుండెను. చూచెడి వారికి భయమును గలపడేదై ఉండెను. అటు చేరుసరికి నా శరీరం బడలిపోయినది. ఇంద్రియములు అలిసిపోయినవి. దాహము ఆకలి వేయుచున్నది. ఒక్క నది యొక్క మడుగు అచ్చర కనబడెను. దానియందు స్నానం చేసి ఆచమనం చేసి నీరు తాగి శమను పోగొట్టుకొంటిని. అక్కడ ఎవ్వరును మనుష్యులు లేరు. ఒక రావి చెట్టు మొదట కూర్చుంటిని. నా హృదయ కమలమున పరమాత్మ యున్నాడని ఎరెంగి వానినే మనసారా ధ్యానించితిని. అభ్యాసముచే మనసు క్రమముగా నాకు వశపడెను. స్వామి పాదపద్మములను ధ్యానించుచు చూడవలెనని కోరికతో దర్శనముకై తపించి ఏడ్చుచుంటిని. కొంతసేపటికి నా హృదయమున శ్రీహరి దర్శనము సంగెను. ప్రేమచే ఆ స్వామిని చూచిన ఆనందముచే ఒడలు గగురు పొడిచినది. ఆనంద ప్రవాహంలో మణిగితిని. నేను స్వామిని దర్శించుచున్నాను అని కూడా మరిచితిని. కానీ ఇంతలో ఆ మనోహరమగు భగవత్ రూపము నాకు గోచరం కాకుండా అదృశ్యమాయెను. చూడవలెనని కోరిక అధికమాయెను. దర్శించిన మూర్తినే మనసులో నిలుపుకొని స్వామిని ధ్యానించుంటిని. కానీ ఆ స్వామి నాకు మరి దర్శనం వసంగలేదు. నిర్జనమగు ఆ వనమునందు ఎవరు మాట్లాడుచున్నారో తెలియకుండా గంభీరము మధురమగు కొన్ని మాటలు నా దుఃఖమును తగ్గించు విధముగా వినబడినవి.
ఓ బాలకా, ఈ జన్మలో నీవు నన్ను చూచుటకు తగిన యోగ్యత కలవాడవు కావు. నీటికి పట్టిన రంగు వలె నీ ఆత్మకు అంటిన పుణ్య పాప రూపముగు కషాయము కడగబడవలెను. కృత్రిమముగా సాధించినను నిలుకడగా నిలవదు. నీవు నన్ను ప్రేమించి ధ్యానించితివి. నా రూపం నీకు స్మరణలో సంతతము కాగల సాగవలెనని నా రూపమును ఒక్కసారి చూపితిని. దానిచే నీకు నాపై కోరిక అధికమగును. నాయందే కోరిక కలిగి నన్నే స్మరించుచున్న నీ మనసున అంటిన రాగద్వేషాలు తొలగిపోవును. నీవు చేసిన సత్పురుష సేవనము కొద్ది కాలమే అయినను నీకు నా యందు దృఢమైన ప్రేమ ఏర్పడినది. నీవు ఈ లోకమును వీడి నాకు దాసుడుగా ఉండెదవు. నా యందు కలిగిన ప్రీతి ఎన్నడును ఆత్మను చెడనియ్యదు. ఈ కల్పము పూర్తయి ప్రళయము ఏర్పడి మరల నీవు సృజించబడినప్పుడు కూడా నీకు వెనకటి జన్మలోని కథ మరుపు రాదు అని పలికి ఆ అశరీర వాక్కు ఆగిపోయెను. ఇట్లు మాట్లాడి ఆ భగవద్వాణి ఆగిపోగానే ఆ మహాభూతమునకు నేను శిరస్సు వంచి నమస్కరించితిని. కల్పం పూర్తయి ఈ శరీరం విరుటకై ఎదురు చూచుచుంటిని. మదమాత్సర్యం లేని వాడనై సంతుష్టి గల మనస్సుతో దేనియందును కోరిక లేక బిడియపడకుండా భగవన్ నామమును కీర్తించుచు స్మరించుచు భూమి అంతటా పర్యటించుచు జీవిత సమాప్తికై ఎదురు చూచుచుంటిని. ఇట్లు సాగుచుండగా మృత్యు సమయం మెరుపు వలె ఆసన్నమైనది. నా శరీరం వీడిపోయినది. నా ఆత్మ సర్వజీవ లయములకు ఆధారమైన భగవానుని అనిరుద్ధ శరీరమున లయమైనది. ప్రారబ్ధ కర్మ పూర్తి అవుటచే పాంచభౌతిక శరీరము పతనమొందినది. కల్పాంతరమున ఈ జగత్తునంతై లయమునరించి ప్రళయ సముద్రములో భగవానుడు అనిరుద్ధ రూపమున శయనించి యుండెను. వాని నాభి నుండి వెలువడిన పద్మమునందు చతుర్ముఖుడు ఉండెను. అతని ప్రాణములో నేను ప్రవేశించితిని. సహస్ర యుగములు గడిచినవి. అప్పుడు మరల సృష్టి చేయవలెని చతుర్ముఖుడు సంకల్పించెను. అతని ప్రాణముల నుండి మరీచి మొదలగు ఋషులు వశిష్టాదులు నేను పుట్టితిని. భగవత్ అనుగ్రహముచే అడ్డు లేక లోకములలో అంతటను సంచరించగల శక్తి నాకు లభించినది. అస్ఖలితమైన బ్రహ్మచర్యముతో లోకములలో సంచరించుంటివి. సంచరించుంటిని శబ్ద స్వరూపమగు బ్రహ్మచే అలంకరింపబడిన ఈ వీణను భగవానుడు నాకు వసంగినాడు. దానిని వాయించుకొనుచు హరికథలనే గానము చేయుచు నేను ఇటు తిరుగుచున్నాను.
ఆ భగవంతుని లీలను ప్రీతితో గానము చేయుచున్న నా మనసులోనికి పిలిచినట్లు భగవానుడు వచ్చి దర్శనం వసంగినాడు. విషయమును అనుభవించవలెనని కోరికతో శ్రమించిన జీవులకు ఈ సంసార సముద్రం అంటకుండా పోవుటకు భగవల్లీలా వర్ణనమే సాధనము. కామము చేత లోభము చేత నశించుచున్న ఆత్మ ముకుంద సేవనముచే శాంతి నొద్దినట్లు యోగ మార్గములచే కూడా శాంతి నొందదు. నీ మనస్సున కలిగిన అశాంతి తొలుగుటకు మార్గమును ఉపదేశించుటకు నా జన్మమును నా వృత్తాంతమును నీకు వివరించితిని. ఇట్లు నారద భగవానుడు. వ్యాసునితో మాట్లాడి మానసికమైన అశాంతి తొలుగుటకు భగద్గుణ వర్ణనము చేయమని చెప్పి వీణును వాయించుకొనుచు స్వేచ్ఛగా వెలిలిపోయెను. సూతుడు దేవరిషిని తలంచుకొని నారద మహర్షి ఎంత ధన్యుడు భగవానుని కీర్తిని గానము చేయుచు ఆ వీణా ధ్వనిచే హర్ష పరవరషుడై వడలు ఎరుంగని వాడై ఆధ్యాత్మికాది దుఃఖములతో బాధపడుచున్న జగత్తును ఆనందింపజేయుచున్నాడని మనసున ఆనందించెను. నారదుడు ఈ విధంగా చెప్పి వెడిలిపోయిన తరువాత బాదరాయణుడు అగు వ్యాసుడు సరస్వతి దేవి యొక్క పశ్చిమ నదీ తీరము యొక్క పశ్చిమ తీరమునందు సమ్యాప్రాసము అనేటి పేరు గల తన ఆశ్రమమునందు నిశ్చలముగా కూర్చొని ఆచమనం చేసి మనస్సును ఇతర విషయముల నుండి మరలించి ఆత్మావలోకనము చేయుచుండెను. ఆ ఆశ్రమమున రేగు వృక్షములు అధికముగా ఉండెను. అందుచే అతనికి బాదరాయణుడు అని పేరు కలిగెను. భక్తి యోగముచే నిర్మలమైన మనస్సునందు పరమ పురుషుని దర్శించెను. ఆ పరమ పురుషుని అధీనమున ప్రవర్తించని మాయను కూడా దర్శించెను. మాయ అనబడి ప్రకృతియే భగవత్ పరతంత్రమై జీవును ఆవరించును. జీవులు మాయచే మోహితులై శరీరము కంటే తాను వేరైనను శరీరమే తాను అనేటి భ్రాంతి కలిగి ఉందురు. ఆ శరీరము కల్పించిన అనర్థమును అనుభవించుండ తాపత్రయమునని అనర్థము తొలగుటకు భక్తి యోగమే సాధనమని వ్యాసుడు మనసులో నిర్దేశించుకొనెను. అట్లు ఎరంగిన వాడై లోకమునకు వారు అనుభవించడి దుఃఖములకు భక్తి యోగమే నివారించు సాధనమని ఎరంగించుటకు భాగవత సంహిత తను రచించుటకు సిద్ధపడెను. భాగవతం వినినచో పరమ పురుషులకు శ్రీకృష్ణుని యందు భక్తి కలుగును. అదియే పురుషులకు శోకమును, మోహమును, భయమును తొలగించును. వ్యాస మహర్షి.
భాగవతమును రచించి సాంసారిక ధర్మముల యందు విముఖుడై తన కుమారుడవు శుకునకు నేర్పించెను అని సూతుడు శౌనకునకు వివరించెను. శౌనకుడు. ఆ ప్రస్తావమును విని ఏకాగ చిత్తముతో పరబ్రహ్మమునే సంతతము మననము చేయుచు ఆనందముననే మునిగి ఉండి ఇతర విషయమును ఉపేక్షించి ఉండెడి శుకుడు ఈ భాగవత సంహితను అభ్యసించుటకు ఎట్లు ఇష్టపడెను అని ప్రశ్నించాను. ఆ ప్రశ్నకు జవాబు మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్మద్గురుభ్యో నమః. జై శ్రీమనారాయణం.
Jai Srimannarayana, salutations to the Guru. For discretion, for the sake of attaining the feet, they fight with the inner self, fearing the fear of separation from Brahman. To that auspicious one, salutations and salutations. The wise serve the lotus feet of Sri Hari, thereby By transcending the attachment to worldly pleasures in this world and the next, one becomes Brahmibhutas without any effort. Many salutations to Srihari, who is supremely auspicious and has fame. Second Canto Fourth Chapter 16th Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattvadipika, First Canto. Welcome to episode 14. Previously, while narrating their story, Narada inspired Vyasa. Let's learn about the beginning of the Bhagavatam. Narada, having heard about his birth and karma, asked Satyavati's son, Vyasa, to ask again. O Lord, what did you do when those monks who had been initiated by the Guru left? How did you spend the rest of your time? After the limit of life was over, how did they leave this body? It was a story that happened in the past, wasn't it? What you have said now, after so much time has passed, naturally time hides the previous impressions, right? How did you remember the story of your previous birth? Thus, Vyasulu asked. When Vyasa asked this, Narada said this. The saints who imparted knowledge to me left as soon as the Chaturmasya was completed. I am a child and I am my mother's only son. She is thick. It is by giving me in return that you nourish me. She loved me so much, that I had no other choice. But she was only a fool. The creatures that must be kept under the control of those who hire them. Let's play with the puppet as he wishes, shall we? I too stayed at a Brahmin's house for her. I was 5 then. I don't have knowledge of countries or time. One night
When she came out of the house to milk the cow, by chance, a snake bit her and her life was threatened. Then, I, having decided that the Lord would do good to the devotees, and considering her death as the grace shown to me by the Lord, was leaving the house towards the north. I am going to see the towns, villages, farms, hill tribes' villages, gardens, forests, and parks, and to serve the ponds with good waters. I, who was walking alone without anyone, entered a large, terrifying forest. There, cruel snakes, venomous snakes, and evil serpents were visible. It was fear for those who were watching. By the time I reached there, my body was completely exhausted. The senses are tired. Thirst and hunger are triggers. The only river's pond was seen. Having bathed in it, performed Achamanam, drank water, and lost Shamanu. And there were no men there. I first sat under a tree. In my heart, the supreme being resides, I wholeheartedly believe in him I meditated. Through practice, my mind gradually came under my control. With the desire to meditate on the lotus feet of the Lord, I have been weeping, yearning for a vision. After some time, I had a vision of Sri Hari in my heart. The joy of seeing that Swami, the joy of the body trembling. I was lost in the flow of bliss. I also forgot that I was visiting the Swami. But in the meantime, that beautiful form of God disappeared from my sight. The desire to see increased. I have meditated on the form that I saw, keeping it in my mind. But that Swami did not allow me to have darshan. In that deserted forest, without knowing who is speaking, some solemn and sweet words were heard in a way that reduced my sorrow.
Oh boy, in this life you are not worthy of seeing me. Like the color that is attached to water, the virtuous and sinful form of the ink that is attached to your soul must be washed away. Even if achieved artificially, it will not last long. You loved and meditated on me. I showed my form once, so that my form may be remembered by you forever. Through it, your desire for me will increase. The desires you have, and the feelings of attachment and aversion that are attached to your mind, will be removed. Even though the service of the virtuous you have done is only for a short time, you have developed a strong love for me. You will leave this world and be my servant. The love I have for myself will never let the soul be destroyed. When this kalpa is completed, and the apocalypse occurs, and when you are recreated again, even then, you will not forget the story of your past life, thus said that disembodied voice, and it stopped. Having spoken thus, as soon as that divine voice ceased, I bowed my head and saluted that great being. The kalpam is complete, and I am waiting for this body to be destroyed. With a mind full of contentment, without pride or jealousy Without desire or worry, chanting and remembering the name of the Lord, I am traveling all over the earth, waiting for the end of life. Thus, as it continued, the time of death approached like a flash of lightning. My body's gone. My soul is the one that is dissolved in the unborn body of the Lord, who is the basis of all life's dissolutions. The five-bodied physical body has fallen, having completed its karmic cycle. In the afterlife, having dissolved this entire world, in the ocean of dissolution, the Lord was lying in the form of Aniruddha. In the lotus that emerged from his navel, the four-faced one was present. I've got his life. A thousand ages have passed. Then the four-faced one resolved to create again. From his life, the sages like Marichi and others, Vasishta and others, I was born. By the grace of God, I have received the power to roam everywhere in the worlds without any obstacles. We have roamed in the world with loose marital conduct. I have traveled and this veena, adorned by the sound-form Brahma, was given to me by the Lord. Playing it I am singing Harikatha and I am turning around.
As if calling to my mind, singing with love the play of that God, the Lord came and gave a vision. For the beings who strive with the desire to experience the subject, the description of the divine play is the means to avoid this ocean of worldly existence. The soul, which is destroyed by lust and greed, will not find peace through the service of Mukunda, nor will it find peace through the paths of yoga. I have explained to you my birth and my story to teach you the way to overcome the restlessness in your mind. Thus spoke Narada. Having spoken with Vyasa, to alleviate mental unrest, having asked to describe the virtues of Bhagavan, playing the veena, she freely emerged. Thinking of the sage, Narada Maharshi, how blessed is he, singing the praises of the Lord, becoming delighted by the sound of that Veena, becoming one who does not wear the ornaments, and in his mind, he is making the world happy, who is suffering with spiritual sorrows He was in awe. After Narada said this and left, Badarayana, who is Vyasa, the western riverbank of Saraswati Devi's western In his ashram named Samyaprasamam on the shore, he was sitting still, performing Achamanam, withdrawing his mind from other things, and contemplating the self. In that ashram, there were many jujube trees. Therefore, he was named Badarayanudu. Through Bhakti Yoga, he saw the Supreme Person in a mind that was pure. He also saw the illusion that does not act under the control of that Supreme Being. Maya is said to be nature, which is the supreme reality and encompasses the individual soul. Living beings, deluded by illusion, are unaware that they are separate from their bodies, yet they believe that the body is theirs. To experience the suffering caused by the body, and to overcome the suffering, Vyasa directed in his mind that devotion is the only means. Thus, having realized that devotion is the only means to overcome the sorrows experienced by the world, he prepared to compose the Bhagavata Samhita. If one listens to the Bhagavata, they will develop devotion to Sri Krishna. That removes sorrow, delusion, and fear from men. Vyasa Maharshi.
Having composed the Bhagavatam, being averse to worldly duties, he taught his son Shuka, thus Suta explained to Shaunaka. Shaunaka. Having heard that mention, I asked how Sukudu, who was absorbed in bliss, constantly contemplated the Supreme Being with a single-minded focus, neglecting other things, liked to practice this Bhagavata Samhita. We will find the answer to that question in another episode. Salutations to the Siddhas. Jai Shri Ram.