ఇక్ష్వాకు వంశము, మాంధాత మరియు సౌభరి చరిత్ర – నవమ స్కంధము

Ikshvaku Dynasty, Mandhata, and Saubhari's Tale – Bhagavata Canto 9

bhagavatam

ఈ ప్రవచనంలో మనువు కుమారుడు ఇక్ష్వాకుని వంశ వృత్తాంతం వివరించబడింది. యువనాశ్వుడు యజ్ఞజలమును తానే త్రాగి కుమారుడు మాంధాతను కన్న అద్భుత కథ, పురంజయుడు ఇంద్రుని వృషభంపై స్వారీ చేసి రాక్షసులను జయించిన వృత్తాంతం చెప్పబడ్డాయి. సౌభరి మహర్షి మత్స్యముల దాంపత్యమును చూచి విషయాసక్తి పొంది ఏబది భార్యలతో సంసారం చేసి చివరకు విరక్తుడై మోక్షమును పొందిన చరిత్ర ముఖ్యంగా వివరించబడింది. విషయ సంగము మనసులో కలిగినచో అది ఆత్మను నాశనం చేస్తుందని, ప్రయత్నపూర్వకంగా దానిని పరిహరించాలని ఉపదేశించబడింది. గురు తిరస్కారం చేసి శాపగ్రస్తుడైన త్రిశంకు వృత్తాంతంతో గురు వాక్య పాలన యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పబడింది.

This discourse covers the Ikshvaku lineage, beginning with Manu's son Ikshvaku and his hundred sons who ruled various regions of Aryavarta. Key stories include Vikukshi (Shashaada), Puranjaya who aided the gods riding Indra as a bull, and Yuvanashva who accidentally drank the consecrated water meant for his wife and miraculously gave birth to Mandhata. The remarkable tale of sage Saubhari is highlighted—how his attachment to fish led to worldly entanglement with fifty wives, and how he ultimately renounced everything and attained liberation. The episode of Trishanku, who disrespected his guru and was left hanging upside down in the sky, concludes with a moral about respecting teachers and avoiding improper desires.

← Prev Next →
Ikshvaku Dynasty, Mandhata, and Saubhari's Tale – Bhagavata Canto 9 bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః శబ్దార్థ సూక్ష్మ వసనా సత్యాభరణా విచిత్ర హేత్వంగీహి విద్వన్ముఖ నిష్క్రాంతా సుస్త్రీవ విరాజతే వాణి శబ్దార్థాలనే మేలి వస్త్రాలు ధరించి విచిత్ర హేతువులనే చక్కని మేనితో సత్యాన్ని అలంకరించుకొని విద్వాంసుల నోటి నుండి వెలువడిన మాట మంచి మగువలా ప్రకాశిస్తుంది. ఆర్యోక్తి నైన్త్. భగవంతులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక నవమ స్కంధము ఐదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు సుకన్య చరిత్ర మను యొక్క వివిధ మనువుల యొక్క వృత్తాంతాన్ని తరువాత అంబరీషుపాఖ్యానము తెలుసుకొని ఇప్పుడు ఇక్ష్వాకు మోష వర్ణావనము తెలుసుకుందాం. ఇక ఇక్ష్వాకుల వంశమును విస్తారముగా చెప్పబోవుచున్నారు. మనువు కుమారుడు ఇక్ష్వాకువు. అతనికి నూరుగురు కుమారులు. ఆ నూరుగురిలో 25వ మంది ఆర్యవర్తమున తూర్పు దిక్కున వింధ్య హిమవత్ పర్వతముల మధ్య భాగమును పరిపాలించిరి. 25 మంది ఆర్యావర్తమున పశ్చిమ భాగమునకు పాలకులైరి. పెద్దవారగు వికుక్షి, నిమి, దండకుడు అను ముగ్గురు ఆర్యావర్త మధ్య భాగమున పాలకులై ఉండిరి. మిగిలిన వారు దక్షిణ భాగమున ఉత్తర భాగమున పాలకులై ఉండిరి. మధ్య భాగమును పాలించు వికుక్షి అరణ్యమునకు వేటకేగి శ్రాద్ధమునకు ఉపయోగించు మాంసమును తేవలెనని తండ్రిచే నియమించబడెను. అతడు అట్లే అడవికి వెళ్లి కొన్ని మృగములను చంపి అలసి ఆకలి గలవాడై శశకమును అనగా చెవుల పులిని చంపి ఆ మాంసమును కొంత భక్షించెను. ఆ మిగిలిన వాటిని తండ్రికి సమర్పించెను. దానిని శ్రాద్ధమునకు ఉపయోగించుటకు గురువునకు వశిష్టు గురువగు వశిష్టునితో దానిని పరిశుద్ధి చేయమని నివేదించెను. కుమారుడు కొంత తిని తెచ్చినాడని ఇక్ష్వాకునకు తెలియదు. వశిష్టుడు తన దివ్యశక్తిచే జరిగినది తెలుసుకునెను. ఆ విషయమున చెప్పగానే ఇక్ష్వాకునకు కోపం వచ్చి కుమారుని రాజ్యము నుండి వెడలగొట్టెను.

ఇక్ష్వాగు తపస్సు చేసి గురువులతో భగవద్గుణ ప్రస్తావమును ప్రస్తావమును చేసి పరమ పదమునకేగెను. ఇక్ష్వాగు చనిపోయిన తరువాత కుమారుడ విపక్షి శశాదుడు అనేటి పేరుతో రాజ్యమును పరిపాలించి శ్రీహరి సమారాధనముగా అనేక యజ్ఞములు చేసెను. అతని కుమారుడు పురంజేయుడు. ఈతడు దేవ దానవులకు యుద్ధము జరుగుచుండగా దేవతలకు ఓటమి కలుగుచున్నదని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞచే దేవతలకు తోడుగా వెళ్ళెను. అప్పుడు ఇతనని వహించుటకు ఇంద్రుడు వృషభ వాహనమాయెను. ఆ వృషభము పై కూర్చొని దివ్య ధనస్సుతో శ్రీ మహావిష్ణువు తేజస్సుచే పడమటి దిక్కునందలి రాక్షసులను జయించుటకేగెను. అచ్చట వారికి చాలా ఉత్సాహజనకమగు యుద్ధము జరిగెను. చాలా మంది రాక్షసులను సంహరించెను. కొంతమంది రాక్షసులు భయపడి పాతాళమునకు పారిపోయిరి. అప్పుడు పురంజయుడు రాక్షసులను జయించి వారి పట్టణములను ధనమును ఇంద్రునకు సమకూర్చెను. ఆనాడు ఇంద్రుని వాహనముగా చేసుకొని దాని మూపుపై కూర్చున్నాడు గనుక పురంజయునకు ఇంద్రవాహనుడు అని అనియు కకుస్తుడు అనియు పేర్లుగలవు. వారి వంశమున యవ్వనాశ్వుడు అను రాజు ఉండెను. అతనికి నూరు మంది భార్యలునను సంతానము లేకపోయినది. అతడు దిగులు చెంది భార్యలతో అరణ్యమునకేగెను. దయగల ఋషులు అతనిచే ఇంద్ర దేవతాకమగు పుత్రకామేష్టిని చేయించిరి. ఆ యజ్ఞమున మంత్రములచే శక్తి నింపబడిన జలములను రాత్రివేళ దాహముచే ఆగలేక ఆ యవ్వనాశ్వుడు తానే త్రాగెను. ఆ జలములకు పుంసమన శక్తి మంత్రములచే కలిగింపబడినది. అనగా ఆ నీరు త్రాగిన వారికి మగ పిల్లవాడు కలుగును. రాజపత్నికి వసంగ వలెనని ఋషులు ఆ జలమును సిద్ధము చేసిరి. కానీ అనుకొనకుండా రాజే త్రాగెను. ఋషులు లేచి ఆ కలశములోని జలమును ఎవరు త్రాగినని అడిగిరి. రాజకు యవ్వనాశ్వుడే యువనాశ్వుడే త్రాగినని ఎరంగి దైవ నిర్ణయం ఇట్లున్నదని ఏమీ చేయలేక నమస్కరించి ఊరకుండిరి. కొంతకాలము తరువాత ఆ యువనాశ్వుడే గర్భధారణము చేసెను.

అతని కుడివైపు పొట్ట చీల్చుకొని కుమారుడు కలిగెను. అతడు సప్త ద్వీపములు పాలించడి చక్రవర్తి కాగల లక్షణములు కలవాడు. అప్పుడు బ్రాహ్మణులు ఇతనికి ఎవరు స్తన్యమునిత్తురు ఇతనికి ఎవ్వరూ లేరు తండ్రి చనిపోయినాడు అని అనుచుండగా ఇంద్రుడు వచ్చి వత్సా ఎడవవలదు నన్ను పానము చేయమని చెప్పి మా ధాత అని అమృతము శ్రవించునట్లుగా తన చూపుడు వేలిని ఆ శిశువు నోటికి అందించెను. యువనాశ్వుడు బ్రాహ్మణ దేవ అనుగ్రహముచే చనిపోయి సిద్ధిని పొందెను. యువనాశ్వుని కుమారుడగు మాంధాత చక్రవర్తి అయి సప్తద్వీప విశాల మూమండలము పాలించెను. యజ్ఞములు చేసి శ్రీ మహావిష్ణువును ఆరాధించెను. సర్వదేవ స్వరూపుడు శ్రీ మహావిష్ణువు. అతడే ద్రవ్యము, మంత్రము, విధానము, యజ్ఞము, యజమానుడు, ఋత్విక్కులు, ధర్మము, దేశము, కాలము అనేటి రూపములతో యజ్ఞమును నిర్వర్తింపజేయుచుండెను. సూర్యుడు ఉదయించి ఎంత మేర సూర్యరశ్మిని ప్రసరింపజేయుచుండునో ఆ ప్రసరించునంత భాగము భూమండలమున మాంధాత యొక్క పరిపాలన క్షేత్రమని చెప్పుచుందురు. మాంధాతకు పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు అని ముగ్గురు కుమారులు. వారికి ఏ పది మంది చెల్లెళ్ళు ఉండిరి. వారందరూ సౌభరిని భర్తగా వరించిరి. ఆ సౌభరి చరిత్ర విచిత్రమైనది. అతడు యములలో నీటి మధ్యమున మునిగి తపస్సులో నిమగ్నమై ఉండగా ఒక సమయమున చేపల కుటుంబం అతని కంటబడెను. అతనికి వాటి వలె కాపురము చేయవలెనని కోరిక కలిగెను. శోభరి వచ్చి మాంధాతను అతని కుమార్తెలు ఏ పది మందిలో ఒకతను తనకిమ్మని యాచించెను. అతను రూపులేని వాడై విరూపుడుగా కనిపించుటచే తన కూతురులో ఏ ఒకతయినను అతనిని ఇచ్చగించును లేదు అని భయపడి ఆ పిల్లలలో యవతి మిమ్ము వరించునో ఆమెను పరిగ్రహింపుడు అని మాంధాత చెప్పెను. అప్పుడు ఆ సౌభరి నేను ముసలివానిగా నున్నానని ఇతడు పలికినాడని గ్రహించి దేవతా స్త్రీలకు కూడా మనసు ఆకర్షించిన దివ్య రూపమును యోగ బలముచే సాధించెను.

కన్యాంతఃపురమునకు అతనిని తీసుకు వెళ్ళగా ఏవది మందియు ఆ సౌభరిని వివాహమాడవలెనని కోరిరి. వారందరకు కలహము కలిగెను. అతడు అందరినీ స్వీకరించెను. ఏ పది మందితో యోగ బలముచే బహురూపములతో బహువిధములుగా అతడు కాపురము చేసెను. యోగ బలముచే సాధించిన సౌభరి ఐశ్వర్యమును చూచి మాంధాత తానే ఐశ్వర్యవంతుడనన్న గర్వం గర్వమును పరిత్యజించెను. సౌభరి అంతమంది స్త్రీలతో నానా విధములగు భోగములను అనుభవించుచున్నను అతని మనసు సంతృప్తి ఉండలేదు. జ్ఞానము గలవాడు గనుక ఇట్లు ఆలోచించెను. అయ్యో ఎంత తపస్సు చేసితిని యమునా జలములలో పిల్లలతో సాగుచున్న చేపల జంటను చూచి ఆ సుఖమును అనుభవించవలెనని నా కోరిక కలిగినది. విషయలోభముచే ఆ తపస్సంతయు భ్రష్టమైనది. విషయమును అనుభవించుట కంటే కూడా ఆ విషయములను అనుభవించిన బాగుండును అని మనసులో కలిగేడి కోరిక చాలా ప్రమాదమైనది. దానినే సంఘము అందురు. మోక్షమునందు ఇచ్చగలవాడు దంపతులు అనుభవించు భోగములను భావించి మనసును దానియందు లగ్నము చేయరాదు. ఇంద్రియములను బాహ్య విషయములపై పోనీయరాదు. ఎవ్వరూ లేని చోట తన ధ్యానమునకు భంగము కలగని చోట మనస్సును రాజసము తామసము అంటకుండా చూచుకొనుచు అనంతుడగు వాసుదేవుని యందు మనస్సును లగ్నము చేసి ఉంచవలెను. సజ్జనుల తోడనే కూడి ఉండవలెను. నేను ఒక్కడను జలములతో తపస్సు చేసుకొనుచు మత్స్యములను చూచి వాని అనుభవమున సంఘము కలవాడనైతిని. ఆ సంఘము ఏ పది మంది భార్యలను పొంది ఏ పది రూపములతో వారితో భోగమును అనుభవించెనను ఐదు వేల మంది పిల్లలను కన్నను కోరికకు అంతయు కనిపించుట లేదు ఎంత ఆశ్చర్యము. విషయముల అనుభవమే పురుషార్థం అనిపించి చెడిపోవుచుంటిని అని విచారించి విరక్తుడాయెను. అప్పుడు అతడు కామ్య కర్మలను వీడి భగవద్ధ్యానముతో కాలమును గడుపుటకై అరణ్యమునకేగెను. పతివ్రతలగు అతని భార్యలు కూడా అతని అనుసరించిరి. అచట ఆత్మ స్వరూప జ్ఞానము కలవాడై సౌభరి శరీరమును కృషింపచేసి తీవ్రముగు తపమును ఆచరించి అగ్నిహోత్రము ద్వారా తాను పరమాత్మ యందు లయమాయెను.

దానిని చూచి అతని భార్యలు కూడా అతని ప్రభావముచే అగ్నితో పాటు దాని జ్వాలలు కూడా ఉడిగినట్లు ఆ పరమాత్మ యందు లయమునుంది. ఈ విధమగు సౌభరి చరిత్రం మనచే సంతతము గుర్తు ఉంచుకొనదగినది. విషయములు అనుభవించవలెనని కోరిక మనసులో కైగినచో అది ఆత్మను నాశనము చేయును. దాని జయించుట చాలా కష్టం. ప్రయత్నపూర్వకముగా మనసునకు విషయ సంఘం అంటకుండా కాపాడుకొనుచుండవలెను. ఒక చేపల జంటను చూచి దాంపత్యమునందు సౌభరి కలిగిన సంఘము ఏ బది శరీరములతో అనుభవించినను తీరలేదు. అందుచే ప్రయత్నపూర్వకముగా విషయ సంఘం పరిహరించవలెను. మాంధాత వంశమున త్రిశంకువు అనే రాజుకు రాజగురువు త్రిశంకుడు అనే రాజు గురు తిరస్కారము చేసి శాపగ్రస్తుడై విశ్వామిత్రునిచే స్వర్గమునకు పంపబడెను. సశరీరముగా స్వర్గమున నుండుట వీలు కాదని వారిచే త్రోయబడి తలక్రిందుగా ఇప్పటికిని అంతరిక్షములో నిలిచి ఉన్నారు. గురు వాక్యమును తిరస్కరించరాదు. కోరకూడని కోరికలను కోరి పొందినను అవి జీవించి ఉన్నంత కాలము దుఃఖమునే కలిగించును. దీనితోనే మనకు ఇక్ష్వాగు ముంశంలో శోభై వృత్తాంతము మాంధాద యొక్క విషయము పురంజుని యొక్క విషయము మనము తెలుసుకున్నాం. ఇక ముందు మనం హరిశ్చంద్ర వృత్తాంతాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. The subtle meaning of sound, adorned with truth, beautifully decorated, the wise-faced one, without end, shines with a beautiful form. The meaning of sound, wearing fine clothes, with a beautiful form The word that emerged from the mouths of scholars, adorned with truth, shines like a good woman. Aarogyam Ninth. Oh Gods, welcome to the fifth podcast of Srimad Bhagavata Tatva Deepika, the ninth book. Until now, let's learn about the Sukanya Charitamu, the various accounts of Manu, and then the Ambarisha Prakhyanamu. Now, let's learn about Ikshvaku Mosh Varanamu. Now, they are going to describe the Ikshvaku dynasty in detail. Manu's son was Ikshvaku. He has a hundred sons. Among those hundred, the 25th one ruled the middle part of the Vindhya and Himavat mountains in the eastern direction of Aryavarta. 25 people were rulers of the western part of Aryavarta. The three, Vikukshi, Nimi, and Dandakudu, were rulers in the middle part of Aryavarta. The remaining ones, in the southern part, north They were the rulers of the part. The one who rules the middle part, Vikshi, was appointed by his father to go to the forest for hunting and to bring meat used for the obsequies. He went to the forest like that, killed some animals, got tired, and being hungry, he killed a deer, that is, a deer, and ate some of that meat. He offered the rest to his father. To use it for the shraddha, he offered it to Vasishta, who was the guru, to purify it with Vasishta, who was the guru. Ikshvaku did not know that his son had eaten some. Vashishta, by his divine power, came to know what had happened. As soon as he said that, Ikshvaku became angry and drove his son out of the kingdom.

Ikshvaku, after performing penance and mentioning the virtues of the Lord with his gurus, attained the supreme abode. After Ikshvaku died, his son, Vipakshi Shashadu, ruled the kingdom under the name and performed many yagnas as Srihari's Samaradhana. His son was Puranjeyu. While this was happening, a war was taking place between gods and demons, and as Sri Maha Vishnu ordered, he went with the gods. Then, Indra took the Vrishabha as his vehicle. Sitting on that bull, with the divine bow, Sri Maha Vishnu, with his radiance, set out to conquer the demons in the west. There, a very exciting battle took place for them. Slayed many evil spirits. Some of the demons got scared and ran away to the underworld. Then Puranjayudu conquered the demons and brought their towns and wealth to Indra. Because he used to be Indra's vehicle and sat on its back, Puranjayan had names like Indravahanudu and Kakustudu. In their lineage, there was a king named Yavanashva. To him He had a hundred wives and no children. He was distraught and went into the forest with his wives. The benevolent sages performed the Putrakameshti, a ritual for the desiring of a son, for Indra. In that Yagnya, the water filled with power by mantras, unable to stop thirst at night, that young horseman drank it himself. The waters were filled with the power of mantras. That is, a male child will be born to those who drink that water. The sages prepared that water, saying that it would be like a bed for the queen. But unintentionally, Raja drank it. The sages rose and asked who had drunk the water from the kalasha. The king, the young horse, the young horse drank, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is, so it is After some time, that young man conceived.

A son was born to him, tearing open his right side. He is the one who ruled the seven islands, possessing the qualities of an emperor. Then the Brahmins, who will give him milk? He has no one. While they were thinking that his father had died, Indra came and said, "Dear, don't cry, ask me to drink." As if he was drinking nectar, his eyes The finger was put to the baby's mouth. Yuvaanashva was killed by the grace of the Brahma Deva and attained Siddhi. The son of Yuva Nashu, Mandhata, became the emperor and ruled the vast Sapta Dweepa. He performed yajnas and worshipped Lord Mahavishnu. Sri Maha Vishnu is the godly form of the deity. He was the one who was performing the Yagnya with the forms of wealth, mantra, method, Yagnya, the master, the priests, Dharma, country, time. The extent to which the sun rises and illuminates the sun's rays, that part of the earth is called the Mandhata's administrative territory. The three who are the sons of Manthatha are Purukutsu, Ambarisha, and Muchukunda Sons. They had ten sisters. They all came as Saubharis, as husbands. The story of Saubhari is quite a strange one. While he was immersed in penance in the middle of the Yamuna, a family of fish caught his eye. He desired to live like them. Shobhari came and asked Mandhata, his daughters, to give him one of the ten. Because he appeared as a formless being, and because he was seen as a formless being, fearing that none of his daughters would accept him, Mandhata said, "Take that girl who is born among those daughters, and accept her." Then, realizing that Saubhari had said that he was as old as an old man, she attained a divine form that attracted the minds of even the goddesses with the power of yoga.

When they took him to Kanyantra, the people wanted to marry that Saubhari. A fight broke out among them. He accepted everyone. With ten people, by the strength of yoga, with many forms, in many ways, he lived. Seeing the abundant wealth achieved by the strength of yoga, Mandhata abandoned his pride that he himself was wealthy. Even though Soubhari is enjoying various pleasures with so many women, his mind is not satisfied. The wise man thought thus. Oh, how much penance I have done! Seeing the pair of fish swimming with children in the Yamuna waters, I desired to experience that happiness. The penance was ruined by worldly lust. The desire that arises in the mind that it is better to experience those things than to experience the subject itself is very dangerous. That is what the church is. The one who can give salvation, the couple should not fix their minds on the pleasures they experience. The senses should not be allowed to overpower the external objects. In a place where no one is there, in a place where his meditation is not disturbed While keeping the mind from becoming too lustful or too tamasic, one should fix their mind on the infinite Vasudeva. Must be with the gentlemen. I am alone, performing penance with water, seeing the fishes, and having a community in his experience. That church, having obtained ten wives and with what ten forms, enjoyed their pleasures, and having borne five thousand children, the desire is not seen at all, how surprising. He was distraught, thinking that the experience of worldly matters was ruining him. Then he, abandoning desires and actions, went to the forest to spend his time in meditation on God. His chaste wives also followed him. There, being the knower of the form of the soul, he made the body of Saubhari suffer and performed severe penance, and through the Agnihotra, he merged into the Supreme Soul.

Seeing that, his wives also, by his influence, like fire, its flames also, as if they were burned, were dissolved in that Supreme Being. This kind of history, the history of Saubhari, is worth remembering. If the desire to experience things is gained in the mind, it will destroy the soul. Defeating it is really hard. We should try our best to protect our minds from the association of thoughts. Seeing a pair of fish, a community with prosperity in marriage, even if experienced with two bodies, it is not enough. Therefore, the subject group should be resolved with effort. In the Mandhata dynasty, a king named Trishanku, the royal guru, Trishanku, was rejected by the king, cursed, and sent to heaven by Vishwamitra. They were thrown away by them, saying that it is not possible to be in heaven in a physical body, and they are still standing upside down in space. The Word of the Lord is not to be denied. Even if you desire and obtain desires that are not right, they will only cause sorrow as long as they live. With this, we have the story of Ikshvaku's lineage and the matter of Mandhada We have learned about Puranjini. From now on, let's learn about the story of Harishchandra in another podcast. Jai Srimannarayana Asmat Gurubhyo Namaha