కర్దమ ప్రజాపతి తీవ్ర తపోనిష్ఠ - హరి వరప్రదానము

Penance of Kardama Muni & Lord's Benediction

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ ఘట్టంలో, కర్దమ ప్రజాపతి సరస్వతీ నదీ తీరమున భగవంతుడైన శ్రీహరిని గురించి అత్యంత తీవ్రమైన తపస్సు ఆచరించిన వైనాన్ని వివరిస్తారు. ఆయన నిష్కళంక భక్తికి సంతసించిన శ్రీమహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమై, సద్గుణవతియైన భార్య మరియు ధర్మాత్ములైన సంతానము అనే వరాలను ప్రసాదించెను. తపస్సు మరియు శరణాగతి ద్వారా భగవత్కృప లభించే తీరును ఈ పవిత్ర ఘట్టం హృద్యంగా తెలియజేస్తుంది.

In this episode of Srimad Bhagavatham Canto 3, we explore the intense and devoted penance of Kardama Muni, who meditated upon Lord Vishnu with unwavering discipline on the banks of the Saraswati River. Pleased by his supreme dedication, the Lord personally appeared before Kardama Muni and granted him divine benedictions, including the blessing of a noble wife and spiritually accomplished progeny. This sacred episode beautifully illustrates how sincere devotion and steadfast tapas draw the grace of the Supreme Lord directly into one's life.

← Prev Next →
Penance of Kardama Muni & Lord's Benediction bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః ద్రవ్య క్రియా హేత్వయ వేష కర్తృభిహి మాయా గుణైర్వస్తు నిరీక్షితాత్మనే అన్వీక్షయాం గాతిశయాత్మ బుద్ధిభిహి నిరస్తమాయా కృతయే నమో నమః ఆత్మ విచారము మరియు యమ నియమాది యోగాంగముల అభ్యాసములచే సాధకుల బుద్ధి అతిశయించి సూక్ష్మమగును. అట్టి బుద్ధి గల మహాత్ములు మాయాశక్తి కార్యములగు భోగ్య వస్తువులు, ఇంద్రియములు, వాటి దేవతలు, దేహము, కాలము. మరియు అహంకారములను పరిశీలించి పరమేశ్వరుని వాస్తవ స్వరూపమును నిశ్చయించెదరు. ఆ ఆకారములన్నియు పరమేశ్వరుని యందు మాయచే కల్పించబడినవే గానీ వాస్తవముగా లేవు. అట్టి పరమాత్మ కొరకు అనేక నమస్కారములు. ఫిఫ్త్ క్యాంటో 18 చాప్టర్ 37 ప్రేయర్. భగవద్బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము 30వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో స్వయంభు మనువు అదే సంగా కర్దుమా మహా దేవు కర్దుమా తర్వాత దేవహుతి వారికి తొమ్మిది మంది సంతానం భగవంతుని యొక్క ఆజ్ఞగా వారు కలవటం, సంతానం కలగటం, సంతానం కలిగిన వెంటనే కర్దముడు ఆమెను వదిలి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అప్పుడు తరువాత జరిగిన సంభాషణ మనం తెలుసుకుందాం. దేవహుతి ఇలా పలుకుతుంది. భగవాన్, ముందు మీరు మాట ఇచ్చిన ప్రకారము నాకు అన్నియు నెరవేర్చినారు. కానీ నేను మిమ్ములనే శరణముగా ఆశ్రయించుచున్నాను. నాకు అభయము సంగెదనని మీరు అనినచో నేను విజ్ఞాపనము చేసెదం. నాకు స్త్రీ సంతానమునే ప్రసాదించిరి. వారికి యోగ్యులగు వారిని భర్తలుగా అన్వేషింపవలసి ఉన్నది. మీరు సన్యసించి వెడలిపోయినచో ఈ వివాహములు ఏర్పాటు చేసి వేయించేయవలెనని కోరుచున్నాను అంతేకాక నాకు బ్రహ్మజ్ఞానమును కలిగించి

శోకమును తొలగించడి పుత్రుడు కలుగునట్లు అనుగ్రహింప వేడుచున్నాను. ఇంతకాలము శబ్దాది భోగ విషయములను అనుభవించితిని. పరమాత్మును ఉపాసించలేదు. ఈ అనుభవించిన భోగములు చాలు. ఇంద్రియ భోగములందు ఆసక్తురాలనై మిమ్ములను ఆ భోగానుభవము భవముకై ఆశ్రయించితిని కానీ మీలో నుండు గొప్పదనమును గుర్తింపనైతిని. నాకు మీరే అభయమును వసంగవలెను. అసత్పురుషుల యందు ఎంతగా ఎరుంగక ప్రేమ పెట్టుకొననును ఆ ప్రేమ సంసారమునకే దారి తీయును. సత్పురుషులకు మీ వంటి వారిని ఎరుంగక ప్రేమించినను అది వైరాగ్యమును కలిగించి జ్ఞానమునే ప్రసాదించును. ఈ శరీరముతో ఉండగా సహజముగా ఆహార విహార చేష్టిత నిద్రాది కర్మలను చేయుచుందుము. అవి కేవలము భోగ రూపములుగా కాక భగవత్ ఆజ్ఞారూపమగు ధర్మమును నెరవేర్చుటకు ఉపయోగపడవలెను. ఇట్లు ఉపయోగపడనిచో ఆ కర్మ యోగం వ్యర్థము. అట్లే కర్మ యోగముచే జ్ఞానము కలిగినను ఆ కర్మ జ్ఞానములచే వైరాగ్యము కలిగి భగవత్ సేవా రూపమగు భక్తి యందు ప్రవర్తించనిచో అతడు జీవించి ఉండియు చనిపోయిన వాడే అగును. వాని జీవనము వ్యర్థము. నేను భగవానుని మాయచే ఇంద్రియ భోగములనే అనుభవించుచు మోసపోతిని. మోక్షమునకు సాధనమగు జ్ఞానమును వసంగ గల మీ వంటి భర్తను పొందగలిగియు ఈ సంసారము నుండి మోక్షమును పొందుటకు తగిన జ్ఞానమును పొందజాలనైతిని అని ఆమె నిర్వేదముతో మాట్లాడిన మాటలను విని కర్దమ ప్రజాపతి దయగలవాడై వెనక భగవానుడు తన అంశచే తమకు కుమారుడుగా ఆమెయందు జన్మింతునని చెప్పిన మాటను స్మరించి ఆమెతో ఇట్లు పలికెను. ఓ రాజపుత్రి, నీవు పవిత్రమైన నడవడి గలదానవు. నిన్ను ఊర్చి నీవు విచారింపకుము. హేయ గుణములు లేనివాడును, కళ్యాణ గుణములు గలవాడును అగు భగవానుడు త్వరలో నీ గర్భమున ప్రవేశించుచున్నాడు. నీకు మంగళముగాక. నీ భగవదారాధన రూపముకు వ్రతమును పాటించుము. ఇంద్రియ నియమనముతో మనోనిగ్రహముతో పాతివ్రత్యమునే తపస్సుగా పాలించుచు దానములను చేయుచు శ్రద్ధతో భగవానుని సేవించుచుండుము.

నీచే ఆరాధించబడిన భగవానుడు నీ కీర్తిని విస్తరింప చేయువాడై నీ గర్భమున జన్మించును. నీకు అతడు బ్రహ్మోపదేశమును చేయును. నీ అజ్ఞాన గ్రంథిని భేదించును. దేవహుతి భర్తయగు కర్దముని మాటను శ్రద్ధతో విశ్వసించి నిర్వికారుడును అజ్ఞాన నివర్తకుడును అగు పరమ పురుషుని సేవించుచుండెను. చాలా కాలము గడిచినది. భగవానుడు కర్దమ ప్రజాపతి వీర్యము ద్వారా ఆమె గర్భమున ప్రవేశించెను. కర్రలో అగ్నిహోత్రము ఆవిర్భవించినట్లు ఆవిర్భవించినాడు. ఆ సమయమున ఆకాశమున మంగళ వాద్యములు ధ్వనించెను. మేఘములు వర్షించెను. గంధర్వులు గానము చేయుచుండిరి. అప్సరసలు సంతోషముతో నృత్యము చేయసాగిరి. దేవతలు పుష్ప వర్షము కురిపించిరి. దిక్కులన్నియు ప్రసన్నమాయెను. జలములు సత్పురుషుల మనస్సులు ప్రసన్నమాయెను. సరస్వతీ నదీ పరివేష్టితమగు కర్దమాశ్రమమునకు చతుర్ముఖుడు, మరీచి మొదలగు ఋషులు చేరిరి. ఎల్లప్పుడూ ఏక రూపముగానుండు జ్ఞానము గల పరబ్రహ్మయే ప్రకృతి పురుష ఈశ్వర తత్వముల యాధాత్మ్యమును లోకమున ప్రకాశింపచేయుటకు దేవహుతి యందు ఆవ్యర్భవించెను. భగవానుడు తత్వజ్ఞానమును ప్రకాశింపచేయుటకు అవతరించిననాడని ఎరింగిన దేవహుతియు కర్దముడు ఆనందభరితులైరి. బ్రహ్మ కర్దమునితో ఇట్లు చెబుచున్నాడు. పుత్రా, నేను పుట్టించిన ప్రయోజనము నెరవేర్చి నాకు పూజను వనర్చితివి. నా వాక్యమును పాటించితివి. బిడ్డలు తల్లిదండ్రుల మాటలను అనుసరించి ప్రవర్తించుటయే వారికి పూజ చేయుట. సంతానమును సృజించుటకు నిన్ను నేను సృష్టించితిని. ఆ కార్యమును నీవు నెరవేర్చితివి. నీ కుమార్తెలు సాధు స్వభావము గలవారులు. వారు తమ ప్రభావములచే తమ సంతానముల ద్వారా లోకమును ప్రజావృద్ధి గావింతురు. నీవు మరీచ్యాది ఋషులకు నీ కుమార్తెలను వసంగుము. కీర్తిని లోకమున విస్తరింప చేసుకొనుము. సర్వ జగత్ కారణమైన పరమాత్మయే నీకు తన సంకల్పముచే కుమారుడుగా జన్మించినాడని నేను ఎరింగితిని. ఓ మనుపుత్రి దేవహుతి.

సాక్షాత్తు భగవానుడే జీవ పరమాత్మల యాధాత్మ్యమును నీకు ఉపదేశించి దాని ద్వారా లోకములో మానవుల పుణ్య పాప కర్మల మూలమును పెగిలింప సంకల్పించినాడు. అతని కేశములు బంగారం వలె ఆకర్షించునవై యున్నవి. నేత్రములు పుండరీకముల వలె యున్నవి. ఈ బాలుని పాదమునందు పద్మ చిహ్నము ఉన్నది. నీ మనసున నాటుకొనిన దేహాత్మాభిమానమును బ్రహ్మ సంబంధము లేక స్వతంత్రముగా వస్తూ ఉన్నది అనేటి భావన అనేటి అవిద్యను అతడు ఛేదించును. అతడు యోగుల సమూహమునకు అధిపతి అయి ఉండును. ఆత్మతత్వమును ప్రతిపాదించు సాంఖ్య శాస్త్రమును ఆచరణముచే లోకమునకు ఎరింగించెడి మహా యోగులు ఇతన్ని ఆదరింతురు. కపిలుడు అని పేరుతో అతడు వ్యవహరింపబడును. ఇట్లు బ్రహ్మ దేవహుతితో కర్ధమునితో చెప్పి సనత్కుమారాదులతో నారదునితో కలిసి తన హంస వాహనముపై సత్యలోకమున కేగెను. బ్రహ్మ ఏగిన తరువాత కర్దమ ప్రజాపతి బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి తన కుమార్తెలను మరీచి మొదలగు ప్రజాపతులకు వారి వారి యోగ్యతలను అనుసరించి కన్యాదానం ఉనర్చెను. మరీచికి కళను, అత్రికి అనసూయను, అంగీరసునకు శ్రద్ధను, పులస్త్యునకు హవిర్భువు అను ఆమెను, పులహునకు గతిని క్రతువునకు క్రియ అనునామెను బృగువునకు ఖ్యాతిని వశిష్టునకు అరుంధతిని వసంగి వివాహమునర్చెను. వస్త్ర ఆభరణాదులు వసంగి వారిని సత్కరించెను. భార్యలను పరిగ్రహించి మరీచి మొదలగు ఋషులు కర్ధముని వద్ద అనుజ్ఞ పొంది ఆనందముతో తమ తమ ఆశ్రమములకు వెడలిరి. ఆ తర్వాత జరిగిన భాగాన్ని మరో పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. May the wealth, actions, and the doer of actions, along with the qualities of illusion, be seen by the self-controlled intellect. May the self-controlled intellect be free from illusion and created by salutations. Salutations to the self-inquiry and the yoga limbs like Yama, Niyama, etc Through practice, the intellect of the seeker becomes exceedingly subtle. Such wise great souls, the objects of enjoyment, senses, their deities, body, time, which are the works of Maya power. And by examining ego, they determine the true form of Parameshwara. All those forms are created by Maya (illusion) in the Supreme Being (Parameshwara), but they are not real. Salutations to the Supreme Soul. Fifth Canto, 18 Chapters, 37 Prayers. Devotees of the Lord, welcome to the 30th podcast of Srimad Bhagavata Tattva Deepika, Third Canto. Until now, in the conversation between Vidura and Maitreya, Swayambhu Manu, that is, Sanga Karuduma, Mahadeva Karuduma, then Devahuti, they had nine children as per the order of God, they met, they had children, Immediately after having children, Kardamudu left her He will be ready. Then let's find out what happened next. Devahuti said. Oh God, as you promised, you have fulfilled everything for me. But I am taking refuge in you alone. If you say that you will give me refuge, I will make a request. You have blessed me with a daughter. They need to search for suitable husbands. If you renounce and leave, I request that these marriages be arranged and performed. Furthermore, grant me enlightenment

I pray that you may remove sorrow and grant me a son. For so long, I have experienced worldly pleasures. He did not worship the Lord. The pleasures of existence are enough. Being interested in sensual pleasures, I have taken refuge in you for the experience of those pleasures, but I have recognized the greatness within you. You alone grieve me. I will not love the wicked, but I will love them, and that love will lead to worldly affairs. Even if you love people like you without understanding them, it will cause detachment and bestow knowledge. While being in this body, we naturally perform food, recreation, and other actions. They should not only be forms of enjoyment but should be used to fulfill the dharma, which is the form of God's command. Thus, if it is not useful, that karma yoga is useless. Similarly, even if one gains knowledge through Karma Yoga, if one does not practice detachment through those Karma Yoga knowledge and devotion that is the form of service to God, he will remain alive but will be as good as dead. His life is in vain. I am the illusion of God, the senses and pleasures I've been deceived. Having been able to obtain a husband like you, who possesses the knowledge that leads to salvation, I have been able to attain the knowledge necessary to attain salvation from this world, and hearing the words spoken with sorrow by her, Kardama Prajapati, being kind, behind Remembering the words of the Lord that he would be born to her as a son through his part, he spoke thus to her. Oh, princess, you are a woman of virtue. Don't worry about me. He who is without vices and who has virtues, that Lord is soon entering your womb. May you be blessed. Obey the Vrata in the form of your worship of the Lord. With the control of the senses, with self-control, and with chastity, practicing penance, giving donations, and serving the Lord with devotion.

The God whom you worshiped will be born in your womb, expanding your fame. He will give you the Brahma Upadesha. It will break your knot of ignorance. Devahuti, believing the words of her husband, Kardamuni, with devotion, was serving the Supreme Being, who is detached and the remover of ignorance. Moment has passed. The god entered her womb through the semen of Kardama Prajapati. He appeared as if a fire was emerging from a stick. At that time, auspicious sounds were heard in the sky. The clouds have burst. The Gandharvas were musical beings. The nymphs began to dance with joy. The gods shower flowers. All the directions are filled with bliss. The waters were satisfied. The four-faced one, Marichi and other sages, arrived at the Kardama Ashram, which was surrounded by the Saraswati River. The Supreme Brahman, who is always in one form and has knowledge, manifested in the world in the form of the divine, to illuminate the essence of the nature, the man, and the God. The Lord, the knowledge of the essence The gods, knowing that he had descended to illuminate, were filled with joy. Brahma is saying this to Kardama. Son, you have fulfilled the purpose for which I was born and have worshipped me. You kept my promise. Children, following the words of their parents, behaving is worshiping them. I created you to reproduce. You have fulfilled the purpose. Your daughters are gentle. They will make the world prosperous through their influence and through their descendants. You, to the sages like Maricha, give your daughters. Let glory be spread abroad in the world. I have heard that the Supreme Soul, who is the cause of all the world, has born a son to you by His own will. Oh, the daughter-in-law of Devahuti.

The God himself has preached the greatness of the living souls to you, and through that, he has resolved to uproot the root of the meritorious and sinful deeds of humans in the world. His hair is as attractive as gold. The eyes are like lotuses. This boy has a lotus symbol on his feet. The ego of the body that is planted in your mind, the feeling that it is coming independently without any relation to Brahma, he will cut off that ignorance. He will be the head of the group of yogis. The great yogis who have made the Sankhya Shastra, which propounds the essence of the self, a reality in the world, respect him. He is known by the name Kapiludu. Thus, Brahma, Devahuti, Kardhamuni, along with Sanatkumara and Narada, went to Satyaloka on his swan vehicle. After Brahma rose, Kardama Prajapati, following Brahma's command, performed the Kanyadan to his daughters to the Prajapatis Marichi and others, according to their respective merits. To Mareechi, art; to Atri, Anasuya; to Angirasa, devotion; to Pulastya, oblation Anu, she, the fate of Pulahuna, the action of Krutuvuna, the name Anuna, to Bhrigu, the fame, to Vasishta, Arundhati, Vasangi performed the marriage. The Vasangi welcomed the people with clothes and jewelry. Having accepted the wives, the sages like Marichi, having received permission from Kardhamuni, departed with joy to their respective hermitages. We'll find out more in the next podcast. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.