దక్ష ప్రజాపతి పునర్జన్మ వృత్తాంతము - సృష్టి విస్తరణ సంకల్పము
Rebirth of Daksha & Intention to Expand Creation
ఈ శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, షష్ఠ స్కంధంలో వర్ణించబడిన దక్ష ప్రజాపతి పునర్జన్మ వృత్తాంతాన్ని భక్తిపూర్వకంగా తెలుసుకుంటాము. సతీదేవి యజ్ఞంలో జరిగిన విషాద సంఘటనల అనంతరం, శ్రీహరి అనుగ్రహంతోను, బ్రహ్మదేవుని ఆశీర్వాదంతోను దక్షుడు పునర్జన్మ పొంది తన దివ్యమైన కర్తవ్యాన్ని కొనసాగించడానికి నిలబడతాడు. సృష్టిలో ధర్మ క్రమం శాశ్వతంగా కొనసాగాలని, జీవరాశులు వృద్ధి చెందాలని సంకల్పించిన దక్ష ప్రజాపతి, తన ప్రజాసృష్టి విస్తరణ బాధ్యతను నిండు మనసుతో స్వీకరిస్తాడు.
In this episode of our Srimad Bhagavatham podcast, we explore the sacred account of Daksha Prajapati's rebirth, as narrated in Canto 6, where the great progenitor is restored to continue his divine role in cosmic creation. After his previous body was destroyed during the catastrophic events surrounding Sati's sacrifice, Daksha is reborn through the grace of Lord Vishnu and the blessings of Lord Brahma, signifying the eternal continuity of dharmic order. With renewed purpose and unwavering devotion, Daksha sets his intention to expand creation and fulfill his sacred duties as one of the foremost Prajapatis entrusted with populating the universe.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః తస్మై నమో భగవతే పురుషాయ భూమ్నే విశ్వాయ విశ్వ గురవే పరదేవతాయే నారాయణాయ ఋషయే చ నరోత్తమాయ హంసాయ సంయతగిరే నిగమీశ్వరాయ నారాయణ మహర్షి పూజనీయుడు, పూర్ణుడు, వ్యాపకుడు, జగద్రూపుడు, జగద్గురువు, దేవదేవుడు, శుద్ధుడు, వాగింద్రియము నియంత్రించిన ఆయన వేదమార్గమును ప్రవర్తిల్ల చేసెను. ఆయనకు మానవోత్తముడైన నరమహర్షికి నమస్కారము. 12th క్యాంటో, 8th చాప్టర్, 47th ప్రేయర్. భవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక. షష్టమ స్కంధము ఆరవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు దక్ష ప్రజాపతి అంటే ప్రాచేదస్సుడు అయినటువంటి దక్ష ప్రజాపతి చేసినటువంటి హంస గుహ్య స్తోత్రము. మనం తెలుసుకున్నాం ఆ స్తోత్రంలో తను చేసినటువంటి ప్రార్థనల్ని చక్కగా మనం అర్థం చేసుకున్నాం ముందు భాగాన్ని మనం తెలుసుకుందాం. ఇట్లు ప్రాచేతసుడు అయినటువంటి దక్షుడు స్తోత్రము చేయగా భగవానుడు ప్రత్యక్షమాయెను. భక్తవత్సలుడై గరుత్మంతుని మూపుపై కూర్చొని వేంచేసెను. ఎనిమిది బాహువులు గలవాడుగా ఉండెను. ఎనిమిది బాహువులతో చక్రమును, శంఖమును, కత్తిని, డాలును, బాణమును, విల్లును, పాశమును, గదను ధరించిన వాడే ఉండెను. పీతాంబరమును దాల్చిన వాడే ఉండెను. మేఘం వలె నీలమైన వర్ణము గలవాడు వనమాల వక్షస్థలమున వ్రేలాడుచున్నవాడు వక్షస్థలమున శ్రీవత్సము అనడి పుట్టుమచ్చ కౌస్తుభమనడి మణితో ప్రకాశించుచున్నాడు కిరీటమును దాల్చినవాడు, మకర కుండలములను దాల్చి ఉన్నవాడు, మొలనూలు, ఉంగరములు, కంకణములు, కాలి అందెలు, భుజకీర్తులు దాల్చినవాడు.
ఇట్టి త్రిభువనేశ్వరుడగు భగవానుడు త్రైలోక్య మోహనమగు రూపమును దాల్చి నారద సనందాది పారిషదులచే పరివేష్టితుడై స్తోత్రము చేయబడుచున్న వాడై దర్శనమును సంగెను. ఆశ్చర్యకరమగు రూపమును చూచి దక్షుడు నేలపై దండం వలె పడెను. తీవ్రమగు ఆనందముచే ఏమియు మాట్లాడలేకపోయెను. మహానందము మనోద్వారములలో నిండుట చేత మాట వెలువడుట లేదు. భగవానుడు అతని మనస్సులోని కోరికను ఎరింగిన వాడై ఈ విధంగా పరుగుచున్నాడు. మహాభాగా నీవు తపస్సుచే సిద్ధి పొందిన వాడవు. నా యందు పరిపూర్ణమగు శ్రద్ధ కలిగి. నా యందే మనసు నిలిపిన వాడవు ఓ ప్రజాపతి నీవు చాలా సంతోషించితిని నేను నేను ఎల్లప్పుడూ జగత్తు వృద్ధి పొందవలెనని కోరుచుందును ప్రజలను పుట్టించి ఆ ఈ లోకమును వృద్ధి పొందవలెనని నీవు కోరి తపస్సు చేయుచున్నావని నేను ఎరింగితిని. చతుర్ముఖ బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులు అగు మీరు, స్వయంభువుడు మొదలగు మనువులు, ఇంద్రాది దేవతలు అగు వీరందరూ నా విభూతులే. మీరందరూ సకల ప్రాణిజాతమునకు సమృద్ధిని కలిగించుచుందురు. నీవు విశ్వమును వృద్ధి పొందించుటకు తపస్సు చేసితివి. నేను సంతసించితిని. తపస్సే నా హృదయము, తపస్సే నా శరీరము, తపస్సే నా మంత్ర జపము, తపస్సే యాగము, తపస్సే నా అవయవములు, తపస్సే యజ్ఞములు, క్రతువులు, అట్టి నీవు చేసిన తపస్సుకు నేను సంతసించితిని. సృష్టికి ముందు నేను ఒక్కడినే ఉంటిని. అప్పుడు ఈ చేతనా చేతనములు అన్నియు వేరుగా ఉన్నవని గుర్తించుటకు వీలు కాకుండా విడదీయుటకు వీలు కాకుండా నాతోనే చేరి ఉన్నవి. అప్పుడు ఈ చేతనులు కానీ ఆ ఈ అచిత్తు యొక్క వికారముకు జగత్తు కానీ లేదు. ఇవన్నీయు కేవలం సంజ్ఞా మాత్రముగా ఇంద్రియ గోచరము కాకుండా నాలోనే నిద్రించుచున్నవా అనునట్టు ఉన్నవి. నేను అనంత కళ్యాణ గుణములకు ఆకరమైన వాడిని అపరిచ్ఛిన్నుడను సూక్ష్మమైన నా శరీరముగానే
ఉన్న గుణత్రయము గల ప్రకృతి నుండి మహత్తత్వం మొదలు బ్రహ్మాండమంతయి వెలువడినది. బ్రహ్మాండ రూపుడగు విరాట్ విగ్రహము నుండి సమిష్టి పురుషుడు అనగా చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించెను. ఆ బ్రహ్మ నా సంకల్ప రూప జ్ఞానముచే ప్రేరణ చేయబడిన వాడై సత్వ సృష్టి చేయుటయందు సిద్ధపడియు సమర్థుడు కాకపోయెను. అతడు మనసులో నన్ను ధ్యానించెను. నేను అతనికి తపము చేయుము తపము చేయుము అని వినబడినట్లు చేసితిని. అతడు దారుణముగా తపస్సు చేసెను. ఆ తపస్సు చేతనే అతడు ప్రజాపతులగు మిమ్మలందరినీ సృష్టించెను. కావున దక్ష ప్రజాపతి నీవు పంచజనుని యొక్క కుమార్తెయగు అసిక్ని అను ఆమెను భార్యగా స్వీకరింపుము. ఆమెతో నీవు చేరి ప్రజా సృష్టిని చేయుము. నీ తరువాత స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి సృష్టి చేయుటచే కానీ ఒక్కరు సృష్టి చేయుట జరగదు. ఈ దక్షిణకు ముందు ఒక్కరే సంకల్పం మాత్రముతో సృష్టి చేసినారు కానీ ఇక నుండి మిధునముగా దంపతులు సృష్టించుటయే జరుగును. అట్టు సృష్టింపబడిన వారు నా ఆరాధన రూపముగా యజ్ఞాది కర్మలు చేయుదురు. ఇట్లు చెప్పి ఆ ప్రాచీతచురగు దక్షుడు చూచుండగానే అంతర్ధానమాయెను. భగవత్ సంకల్పముచే ప్రేరితుడైన దక్షుడు పంచజనుని కుమార్తెయదు హర్యస్వ సంజ్ఞ అను కుమారులను కనెను. వారందరూ సమానమగు ధర్మాచరణము చేయు స్వభావం కలవారు. వారు తండ్రి ఆజ్ఞను పాలించి సంతానమును వృద్ధి పొందించుట కొరకు పశ్చిమ సముద్ర తీరమునకేగిరి. అచ్చట సింధూ నది సముద్రములో కలియుచున్నది. అచ్చట నారాయణ సరస్సు అనేటి తీర్థమున్నది. అచ్చట మునులు సిద్ధులు తపస్సు చేయుచుందురు.
హర్యశ్వులు ఆ తీర్థములు చూచినంత మాత్రముననే పాపము తొలగి నిర్మలమగు అంతఃకరణము గలవారైరి. వారికి జ్ఞానులు ఆచరించడి పరమహంస ధర్మము అనగా నివృత్తి ధర్మమునందు కోరిక కలిగెను. అయినను తండ్రి ఆజ్ఞను పాలించి తీవ్రమైన తపస్సును సంతానమును వృద్ధి పొందించుటకై చేయుచుండిది. ఆ సమయమున నారదుడు వచ్చి వారిని చూచెను. అతడు వారితో నాయనా, మీరు వివేకము లేని వారు. ఈ భూమి యొక్క అంతమును చూడకుండా మీరు ఎటు సృష్టి చేయుదురు? మీకు ఈ లోకం యొక్క స్వభావము, స్వరూపము పూర్తిగా తెలియకపోవుటచే సృష్టించబడే ఈ శరీరం ఎట్టిదో, ఎట్లు ఉండునో తెలియక. మీరు సృష్టి చేయవలెన తపస్సు చేయుచున్నారు. ఈ విశ్వమునకు అంతకు ఒక్కడే నియామకుడగు పురుషుడు అతడు ఈశ్వరుడు. ఇందు ఒక బిలం ఉన్నది అది హృదయము. ఆ హృదయ బిలములో జీవుడు చూచును. జీవుడు దూరును. ఆ దూరిన వాడు వెలికి వచ్చుటకు ఉపాయమేమో ఎరుంగవలెను. అట్లే ఈ శరీరమునందు ఒక స్త్రీ ఉన్నది. ఆమె అనేక రూపములందు అనేక రూపములు అందుచుండును. అదే బుద్ధి. అది వ్యభిచారిణి. ఒకనియందు నియతముగా ఉండదు. దానికి భర్త జీవుడు. ఆ జారిణీ పతియగు పురుషుని ఎరంగవలెను. ఈ జీవునితో కూడిన శరీరము ఒక గృహము. ఇరువది నైవు తత్వములతో నిర్మింపబడినది. ఇది ఒక నదిలో ఉన్నది. ఇది ఇటునటు ముందు వెనకకు పారుచుండును. అదే మాయ. ఆ మాయ. సృష్టి చేయునప్పుడు వెలికి పారును. లయము చేయునప్పుడు లోనికి పారుచుండును. ఈ నదిలో ఒక హంస ఉండును. ఆ హంస ఈశ్వరుడు. దానికి చిత్రమగు పక్షములు అనగా రెక్కలు కలవు. ఒక రెక్క బంధమును కలిగించుచు ఒక రెక్క బంధమును కలిగించును ఒక రెక్క మోక్షమును కలిగించును ఈ రెక్కలు కత్తులతో వజ్రములతో నిర్మింపబడినవి ఇది అంతయు ఎప్పుడును సాగుచునే ఉండును
సంతానం పొందుటకు, తపస్సు చేయుటకు ముందు దీనిని అంతను ఎరుంగవలెను. ఇది ఈ లోకం యొక్క వాస్తవ స్వరూపం. దీనిని ఎరుగకుండా సృష్టి చేయుట మీకు తగదు. మీరు సృష్టి చేయునప్పుడు ఇదంతయు తెలుసుకుని సృష్టి చేయుడు అని నారదుడు చెప్పెను. దేవర్షియగు నారదుని వాక్యములు విని హర్యశ్వులు తమకు సహజముగా ఉన్న విచారణ శక్తితో కూడిన బుద్ధితో ఆ వాక్యముల యొక్క రహస్యార్థమును పర్యావలోచనము చేసినారు. నారదుడు భూమి యొక్క సొంతమును తెలుసుకునమనినాడు. భూమి అనగా క్షేత్రము, అనగా శరీరము. దీని ముందు ఎరుంగవలెను. తరువాత జీవుడు అనబడెడివాడు శరీరములో ఎట్లు ప్రవేశించునో దానిని ఎరుంగవలెను. అది అనాది. ఈ శరీరములో చేరుట కర్మలచే దాని నుండి వెలువడుటకు మార్గము ఎరంగవలెను. దాని నుండి బయల్పడి ఆనందమునందుట తెలుసుకునవలెను. కానీ బంధమునకు కారణము కర్మలచే ప్రయోజనమేమని నారదుడు చెప్పినాడు. ఈ రాష్ట్రమునకు ఈశ్వరుడు ఒక్కడు. ఆ ఒక్కడు భగవానుడగు పరమ పురుషుడు. అతడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, అవస్థకు అవలివాడు. తురియుడు వేరొకటి ఆధారం అవసరం లేకుండా తనపై తానే ఆధారపడి ఉండువాడు. ప్రకృతి పురుషుల కంటే విలక్షణమైనవాడు. అతడు ఆరు గుణములచే పరిపూర్ణుడు. అతడే ఏ దోషములు అంటని వాడై జీవునితో శరీరములో ప్రవేశించి నియమించువాడు. అతడు సంసారమునకు విరోధి అయినవాడు. అతనిని ధ్యానింపకుండా ఈ అసత్కర్మలు చేయుటచే ప్రయోజనము లేదు అని నారదుడు చెప్పినాడు. నారదుని మాటలలోని అర్థమును పరమ గుహ్యమని విమర్శించుకొనుచుండిరి. నారదుడు మరొక మాట చెప్పినాడు.
బిలస్వర్గమును అనగా పాతాళమును చేరిన పురుషుడు వెలికి రాలేనట్లే హృదయ బిలములో చేరిన జీవుడు అచట భోగముల యందు ఆసక్తుడై మదాంధుడై సస్వరమపును మరిచి ప్రకృతి కంటే వేరైన ఆత్మ హృదయమునందు ఉన్నదని ఇరంగలేక అందే రమించుచుండును. ఆ హృదయ బిలములో ఉన్న స్వప్రకాశమగు జ్యోతి స్వరూపమగు ఆత్మ స్వరూపమును ఇరంగకుండా ఈ అసత్కర్మము చేయుటచే శ్రేయస్సు లేదు. జీవునకు బుద్ధి తోడుగా ఉండును. అది అనేకములకు వ్యాపారములు గలదై ఉండును. అందుచే అది నానా రూప అనగా అనేక వేషములు వేయును. జారినియగు స్త్రీ వలె ఆ బుద్ధి అనేక విషములపై పోవుచుండును. ఒక దానిపై నిశ్చలముగా ఉండదు. దాని ఎరుంగజాలిని వారికి ఈ అసత్కర్మల వలన ప్రయోజనమేమి? బుద్ధి యొక్క స్వరూపమును ఎరుంగి వివేకమునందని వానికి సంసారమనడి అనర్థమే ఫలించును. ఈ పురుషుడు ఈ వ్యభిచారిణియగు స్త్రీకి భర్తగా నుండును అని నారదుడు చెప్పినాడు. దాని అర్థమును ఇట్లా వివరిస్తున్నారు. దుష్ట ప్రవర్తన గల భార్యకు వశుడై ఆమెకు కావలసిన అన్నియు సంపాదించి పెట్టుటకై ఆయాస పడుచున్న పురుషుని వలె జీవుడు తాను కర్మకు వశుడు కాని వాడనని మరిచి అనేక విధములకు పరుగులెత్తి బుద్ధికి వశుడై అనేకమైన కర్మలు చేసి జన్మ జరా మరణాది అనర్థ పరంపరనందుచుండును. ఈ రహస్యమును ఎరుంగని వారు అసత్కర్మలు చేసి ఏమి ప్రయోజనము? మాయ అనడి ఒక నది పారుచున్నది. అది ముందుకు వెనుకకు కూడా పారుచుండును. అనగా జన్మలను కలిగించునది, మరణమును కలిగించునది. మాయే అనగా అవిద్యయే దానికి. ఈవలి ఒడ్డు, ఆవలి ఒడ్డు. ఇహలోకము, పరలోకము. రెండు ఒడ్లను వరుసుకొనుచు నది పారుచున్నది. ఆ నదిలో ఉన్న ఇంటి వంటిది మన శరీరము. అది 25 పదార్థములతో నిర్మింపబడిన ఇల్లు అనగా 25 తత్వముల యొక్క కూడికచే ఏర్పడినది. అందుండు ఈ పురుషుడు పరమపురుషునిచే ధరింపబడి
ఇందు ఉన్నాడని ఎరుంగనివాడు ఇందుండి దేహాత్మ భ్రాంతిని స్వతంత్రుడను భ్రాంతిని కలిగించు అసత్కర్మలను ఆచరించి ప్రయోజనమేమి? నారదుడు హర్యశ్వులకు సృష్టి రహస్యమును ఒక కథలో ఇమిడిచి చెప్పినాడు. ఒక నదిలో ఒక హంస ఉండును. ఆ హంసయే ఏ దోషములు అంటని సర్వేశ్వరుడు. అతడు హంతి దోషాన్ ఇతి హంసః దోషములను పోగొట్టువాడు అనే ఉత్పత్తిచే దోషములను పోగొట్టును. జీవునకు కర్మవశముచే అంతెడి దోషములు ఏమియు హంసకు అంటవు. శాస్త్రము ఈశ్వరుని యొక్క స్వరూపమును బంధ మోక్షములను దానికి కారణమగు ప్రవృత్తి నివృత్తి ధర్మములను తెలియజేయును. ఆ శాస్త్రములచే ప్రతిపాదింపబడి ఈశ్వరుడు హృదయ గుహలో ఉండును. అతనిని ఉపాసించకుండా సర్వేశ్వరుని యందు వైముఖ్యము కలిగించెడి. అసత్కర్మలచే ప్రయోజనము లేకపోవుటయే కాదు, ఆత్మనాశనము కలుగును. నారదుడు ఈ ఉపదేశములో కాళచక్రము గురించి ఇట్లు చెప్పినాడు. ఈ చక్రము ఎల్లప్పుడూ తిరుగుచుండును. ఇది బ్రహ్మ మొదలు గడ్డి పోచ వరకు ఉండెడి సర్వ జగత్తును అటునిటు త్రోయుచుండును. దీని రెక్కలు కత్తుల వలె వాడి అయినవి. వజ్రం వలె ధృఢమైనవి. అట్టి రెక్కలతో ఈ చక్రము తిరుగుచుండును. సహించుటకు శక్యముగాని తీక్షణమగు గర్భ జన్మ మరణాదులను తిరుగుచున్న చక్రము కలిగించుచుండును. అట్టి చక్రమును గురించి ఆలోచించని వాడు వివేకహీనుడు. ఈ అసత్కర్మలు ఆచరించుటచే ప్రయోజనమేమి? కన్న తండ్రి కంటే హితమును ఉపదేశించునది శాస్త్రమే. అదే తండ్రి అది ఈ ప్రవృత్తి ధర్మమును అనగా సాంసారిక ధర్మమును విడువవలెనని చెప్పుచున్నది. దానిని ఎరుంగనివాడు సత్వరజస్తమో గుణములు గల శబ్దాది విషయములందు విశ్వాసము గలవాడై అట్టి గుణమయపు జగత్తునకై సృష్టి చేయుటకు సిద్ధపడును. కానీ సృష్టి చేయమని చెప్పిన తండ్రి మాట కంటే సృష్టి చేయుట అనర్థమని నివర్తింపుడు అని చెప్పెడు ఈ శాస్త్రము మన మేలు కోరునది కనుక సృష్టి చేయుట యందు ప్రవర్తింపరాదు అని నారదుని ఉపదేశమును విమర్శించుకొని అర్థము చేసుకునిన హర్యస్వులు.
ఆ నారదునకు ప్రదక్షిణము చేసి మరల వెనుకకు మరి రాకుండా పోయెడు ముక్తి మార్గమును పోవుటకు స్థానముకు పరబ్రహ్మోపానము చేసి ముక్తిని పొందిరి. బ్రహ్మ సాన్నిధ్యమును కలిగించు వీణానాదముచే భగవత్ సాక్షాత్కరమును పొందిన నారదుడు ఆ భగవానుని పాదపద్మముల యందు అఖండమగు మనస్సు చేర్చి లోకములో సంచరించుటకు పోయెను. దీని తర్వాత జరిగిన విషయాన్ని మనం మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Gurus. Salutations to that Lord, the Supreme Being, the Lord of the Universe, the Supreme God, the Supreme Divine, the Lord of Narayana, the Sage, the Best of Men, the Lord of the Universe, the Lord of the Gods, the Lord of the Goddess, the Lord of the Lords, the Lord of the Sages, the Pious, the Perfect, the All-pervading, The one who is the embodiment of the world, the guru of the world, the god of gods, the pure one, the one who controlled the speech organs, he made the path of the Vedas prevail. Salutations to the great sage Naramaharishi. 12th Canto, 8th Chapter, 47th Prayer. Dear devotees, Srimad Bhagavata Tattvadipika. Welcome to the sixth podcast episode of Shashtama Skandham. Until now, Daksha Prajapati, meaning Prachetasudu, the Hansa Guhya Stotram done by Daksha Prajapati. We have learned, in that hymn, we have nicely understood the prayers he made. Let's learn the first part. Thus, when Daksha, who was a Prachetas, praised, the Lord appeared. Devotee-like, he sat on Garuda's back. He was eight arms-length. With eight arms, a chakra, a conch, He who holds the sword, shield, arrow, bow, noose, and mace. There was a man dressed in yellow. He who is of a blue color like a cloud, who is hanging on the garland of the forest, who is the Srivatsa on the chest, who is shining with the gem called Kaustubha, who is wearing the crown, who is wearing the Makara Kundalas, the Molanulu, He who wears rings, bangles, anklets, and shoulder ornaments.
Thus, the Lord, who is the Lord of the three worlds, assuming the form that delights the three worlds, surrounded by Narada, Sananda, and other council members, is being praised, and he agreed to give a vision. Seeing the astonishing form, Daksha fell to the ground like a garland. The intense joy made me unable to speak. Great joy, because of the fullness in the inner chambers, words do not come out. The Lord, having grasped the desire in his heart, ran in this manner. Oh! You are the one who has attained the state by your penance. Have complete faith in me. Oh, Prajapati, you who have kept my mind in you, I am very pleased. I always wish that the world should prosper. You are doing penance, wishing that people should be born and that this world should prosper Errington. The four-faced Brahma, Rudra, the Prajapatis, and you, the self-existent one, and all the other Manus, Indra and other gods, all of them are my manifestations. You all are the ones who provide abundance to all living beings. You performed penance to increase the universe. I'd like I am pleased. Penance is my heart, penance is my body, penance is my mantra chanting, penance is my sacrifice, penance is my limbs, penance is my yagnas, rituals, I am pleased with the penance you have done. I existed prior to creation. Then, these consciousnesses and selves are not separate, not able to be separated, but are united with me. Then, neither these hands nor the world exists for the distortion of this unmanifest. All these are merely signs, not perceptible to the senses, but seem to be sleeping within me. I am the one who is the cause of infinite auspicious qualities, I am the one who is unblemished, I am the subtle body
From the nature that has the three qualities, the greatness, beginning with the universe, has emerged. From the cosmic form, the Virat statue, the collective being, that is, the four-faced Brahma, manifested. That Brahma, inspired by the form of my resolve, was not able to be competent without being ready to create the essence of goodness. He meditated on me in his mind. I made him hear that I was doing penance, I was doing penance. He performed a severe penance. By that penance, he created all of you, the Prajapatis. Therefore, Daksha Prajapati, you accept Asikni, the daughter of Panchajani, as your wife. Join her and make people’s creation. After you, neither men nor women can create the universe together, but neither can one person create it. Before this south, only one intention was created, but from now on, couples will be created as a pair. Those who are created will perform sacrifices and other rituals as a form of my worship. Saying this, as Daksha, the ancient one, watched He disappeared. Daksha, inspired by the divine will, had sons named Panchajanani's daughter, Adhu, and Harisvara Sangya. They are all of the same nature, practicing the same dharma. They went to the western sea coast to obey their father's command and to increase their descendants. The Indus river meets it in the sea. There is a sacred water body called Narayana Kshetram. There, the sages and siddhas perform penance.
Those who have seen those sacred waters, their sins are removed, and they become pure-hearted. The wise men practiced the Paramahamsa Dharma, that is, in the Dharma of renunciation, they had a desire. However, she was obeying her father's command and performing severe penance to increase her offspring. At that time Narada came and saw them. He said to them, son, you are not wise. Without seeing the end of this earth, where will you create? Because you do not fully know the nature and form of this world, this body is created without knowing what it is and how it is. You are doing penance to create. The only one appointed to this universe is the man, he is God. In this, there is a pit, that is the heart. The creature looks out upon the heart. The living are apt to drift. The one who has gone away, we should know the way to bring him back. Similarly, there is a woman in this body. She is in many forms, many forms. That's the spirit. She is a prostitute. One does not need to be a fan of someone to be a fan of their work. Her husband is the life of the party. That is the husband Like a man. The body with this organism is a house. It is made up of twenty-two naivetés. It is in a river. It runs from front to back. That's the myth. That's the Maya. It flows out when creation is done. When the rhythm is created, it flows inward. There was a swan in the river. The swan is Eshwar. It has wings, which are like pictures. One wing causes bondage, one wing causes bondage, one wing causes liberation. These wings are made of swords and diamonds. This will always continue
It must be learned before one can perform penance and have children. This is the true face of this world. It is not good for you to create without knowing it. When you create, knowing all this, Narada said that you create. Haryashu, hearing the words of Narada, who is a divine sage, with the natural inquisitive power and intellect that they have, contemplated the secret meaning of those words. Narada said, when one knows the land's own. Bhumi means Kshetra, which means body. It should be placed before this. Afterwards, one must understand how the being called a living being enters the body. It's old. The path to reach this body through actions and to emerge from it is like a tunnel. It is as if one knows how to rise from the ground and be in bliss. But Narada said that the cause of bondage is the benefit of actions. The only God in the state. That one is God, the Supreme Being. He is the one who is ready for danger, dreams, deep sleep, and states of consciousness. Turiyudu, without any other support, depends on himself He is unique. He is more different than nature and men. He is perfected in six virtues. He is the one who does not say any faults, and enters into the body with the living being and appoints. He was the one who was against worldly affairs. Narada said that there is no benefit in doing these unrighteous deeds without meditating on him. They were criticizing the meaning of Narada's words as supremely mysterious. Narada said another word.
The man who has reached the heavens, that is, the netherworld, is not able to come out. The being who has entered the heart's pit, being engrossed in pleasures there, being deluded, forgetting his own self, not knowing that the soul, which is different from nature, resides in the heart Enjoying. Without removing the self-illuminating, radiant, soul-like form that is in the heart's pit, there is no benefit in doing this unrighteous deed. It is with good sense that the living being remains. It will be a business with many things. Therefore, it assumes various forms, that is, it wears many disguises. Like a slippery woman, that intellect goes on to many poisons. One doesn't have to be firm about it. What is the benefit to them of this bad deed? The form of intellect is called wisdom, but to him who considers it as worldly, it is a disaster. This man will be the husband of this prostitute woman, said Narada. This is how its meaning is explained. Being subject to a wife with wicked behavior, and like a man who is struggling to earn and keep everything she needs, the soul is not subject to karma Forgetting that he is not, running for many purposes, being subject to the intellect, doing many deeds, he remains in the cycle of birth, old age, death, and misery. What is the use of those who do not understand this secret and perform bad deeds? A river named Maya flows by. It also runs back and forth. That is, it causes births and it causes deaths. Maya is ignorance. The other shore, the other shore. This world and the next. The river is flowing, carrying two banks. Our body is like a house that exists in the river. That is a house built with 25 materials, meaning it is formed by the combination of 25 elements. Therefore, this man is adorned by the Supreme Being
What is the use of practicing unrighteous deeds that cause delusion of the body and delusion of being independent, knowing that he exists? Narada narrated the creation mystery to Haryasva in a story. A swan in a river. That swan does not commit any faults, says the Lord of all. He is the one who removes the faults, thus the swans, the one who removes the faults by producing. Due to karma, the living being does not suffer any faults. The scripture reveals the form of God, the bondages, the liberation, and the causes of those tendencies and the cessation of those tendencies. By those scriptures, it is proposed that God resides in the cave of the heart. Without worshipping him, it creates a separation from the Lord. Not only is there a lack of benefit from bad deeds, but there is also self-destruction. Narada in this sermon describes the Kālachakra. This wheel is always rotating. This, from Brahma to the blade of grass, is the entire universe, and it keeps tossing it this way and that. Its wings are sharp as knives. Durable as the diamond. Atti This wheel rotates with wings. It is difficult to bear, but it causes intense cycles of birth and death. He who does not consider such a wheel is a fool. What is the benefit of practicing these bad deeds? The scriptures teach better than a father's own child. That is the father, it says that this tendency, that is, the worldly dharma, should be abandoned. He who does not understand it, being endowed with the qualities of Sattva, Rajas, and Tamas, and having faith in the objects of sound, etc., is ready to create such a world full of qualities. But this scripture, which says that creating is worse than the word of the father who told to create, criticizes Narada's teaching that one should not act in creating, therefore, the meaning The Hariyas.
Having circumambulated that Narada, and without returning, they attained liberation by offering Parabrahman to the place of going to the path of salvation. Narada, who attained the direct vision of God through the sound of the Veena, which bestows the presence of Brahma, placed his undivided mind at the lotus feet of that Lord and went to wander in the world. We'll find out more in another podcast. Jai Srimannarayana and salutations to the Ashmadguru.