భరత మహారాజు పట్టాభిషేకం
Coronation of King Bharata
శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, ఋషభదేవుని పుత్రుడైన భరత మహారాజు యొక్క వైభవోపేత పట్టాభిషేకం గురించి తెలుసుకుంటాము. తండ్రి రాజ్యత్యాగం చేసి మోక్షమార్గం స్వీకరించిన పిదప, భరతుడు ఈ విశాల భూభాగానికి సార్వభౌముడిగా పట్టాభిషిక్తుడయ్యాడు, ఆయన పేరు మీదుగానే ఈ దేశం భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. ధర్మపరిపాలన, భగవద్భక్తి, మరియు నిష్కళంక చారిత్రముతో భరత మహారాజు సమస్త రాజులకు మరియు ముముక్షువులకు శాశ్వత ఆదర్శంగా నిలిచాడు.
In this sacred episode from Canto 5 of the Srimad Bhagavatham, we explore the glorious coronation of King Bharata, the noble son of Emperor Rishabhadeva. After his father renounced the throne and embraced the path of liberation, Bharata was crowned the sovereign ruler of this vast land, which came to be known as Bharatavarsha in his honor. His reign was marked by righteousness, devotion, and unwavering dedication to Bhagavan Vishnu, setting a timeless example for all rulers and seekers of dharma.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో గుణ ప్రదీపాయ గుణాత్మచ్చాదనాయ చ గుణవృత్యుపలక్ష్యాయ గుణద్రష్ట్రే స్వసంవిదే గుణప్రదీపాయ గుణకార్యములగు దేహాదులను ప్రకాశింపజేయునట్టి గుణాత్మాచ్ఛాదనాయచ గుణకార్యములచే తనచే తనను కప్పివేయునట్టియు గుణవృద్ధిపలక్ష్యాయ గుణకార్యములకు అంతఃకరణము మొదలగు వాటి వ్యాపారములచే నికటముగా సూచింపబడునట్టియు స్వయం ప్రకాశ చైతన్య రూపుడవగు సాక్షి అయినటువంటి పరమాత్మకు నీకు నమస్కారము. 10th క్యాంటో, 16th చాప్టర్, 46th ప్రేయర్. భవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక. పంచమ స్కంధము 10వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు జడభరితుని యొక్క వృత్తాంతంలో తను అడవిలో వెళుతుండగా అక్కడ ఎవరో ఒకరు బలి కోసమని తనని తీసుకోవటం, తను భయపడకుండా ముందుకు వెళ్లటం, భగవంతుడే అన్నీ చూసుకుంటాడనే భావనతోని తను ముందుకు వెళ్లటం జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన భాగాన్ని మనం తెలుసుకుందాం. రహుగణ రాజు యొక్క వృత్తాంతంతోని వీరిద్దరి మధ్యన జరిగేటువంటి సమాగమం మనం తెలుసుకుందాం. సింధు సౌవీర దేశములకు రాజగు రహుగణుడు ఒకనాడు ఇక్షమతీ నధి తీరమునందున్న కపిలుని నుండి విద్యనెరంగుటకై సేవించవలెనని బయలుదేరెను. కొందరు బోయిలు పల్లకిని మోయుచుండగా పల్లకితో అతడు వెడలుచుండెను. మోసడి వారిలో ఒక పురుషుడు నడవజాలలేకపోయెను. వానికి బదులు వేరొక పురుషుని అన్వేషించవలెనని వారు చూచుచుండగా అతనే కూర్చొనియున్న భరతులు వారి కంటపడెను. బలముగా ఉన్నాడు, యువకుడు, దృఢములగు అంగములు గలవాడు, ఎద్దు వలె గాడిద వలె బరువు మోయగలవాడు.
అని భావించి ఇంతకుముందు మోయువారితో పాటు వీనిని కూడా పల్లకి మోయించుటకు వారు సిద్ధపడిరి. అతను వద్దనలేదు. అతని భుజముపై పల్లకి దండెను పెట్టిరి. అట్లే అని మోసెను. అతడు మహానుభావుడని వారు ఎరుంగరు. అతనికి వలదనుట తెలియదు. ఒక బాణము మేర మాత్రమే చూపు ముందునకు చూచుచు అతడు నడుచుండెను. రఘుగనుడు విషమముగా నడుచున్న తన వాహకులను సరిగా నడుపుచు నడుపుడు వాహనము ఇటునడు కదులుచున్నది. కారణం ఏమి అని అడిగెను. వాహనమును మోసడి వాహకులు రాజు తమను దండించునని భయపడి రాజుతో ఇట్లు నివేదించిరి. ప్రభు మేము పరాకుగా లేము. మీ ఆజ్ఞను అనుసరించి చక్కగా మోయుచున్నాము. ఇప్పుడే ఒక పురుషుని తీసుకుని వచ్చి మోయుటకు పెట్టినాము. అతడు వేగముగా నడుచుట లేదు. అతనితో సమముగా మేము మోయజాలకున్నాము. ఒక్కడు సరిగా నడవలేనిచో వానితో కలిసి నడిచెడి వారి అందరి నడకలోను తొట్రుపాటు కలుగునని రాజు నిశ్చయించుకొని పెద్దలను సేవించి జ్ఞానమార్జించిన వాడే అయినను రజోగుణ బలముచే కోపము గలవాడాయను భరతుని తొంగి చూచెను. అతని బ్రహ్మ తేజస్సు భాసించుట లేదు. భస్మము కప్పి నిప్పు వలె ఉన్నాడు. రఘుగణుని మనసు కూడా రజోగణముచే ఆవరింపబడి ఉన్నది. అందుచే ఇట్లు మాట్లాడినాడు. ఓ సోదరా, పాపము చాలా దూరం మోసి ఒక్కడిదే మోయుట చే చాలా శ్రమైనది కాబోలు. చాలా కాలము మోసినావు, నీరసముగా ఉన్నావు. అవయవములు దృఢముగా లేవు, ముదుసలివి అని నిందించుచు ఆక్షేప గర్భముగా మాట్లాడినాడు. నీవు మోయుచు ఎంతసేపైనది? నీవు నీరసముగా ఉన్నావా? మోయలేవా? ముసలివాడవా అని రాజు అభిప్రాయం. ఇట్లు రాజు అధిక్షేపించుటచే అతడు భయపడనని బాధపడి సర్దుకొనునని రాజు అభిప్రాయం. కానీ అతనికి తత్వజ్ఞానం ఉండుటచే బాధ కలగలేదు. కర్మానుగుణముగా కర్మను అనుసరించి ఈ శరీరము ఏర్పడును. ఈ శరీరము పంచమహాభూతములతో శబ్దాది విషయములతో వాక్కు మొదలగు కర్మేంద్రియములతో వాని విషయములతో అంతఃకరణము.
దానిని అంటిన వాసనలు అనువానితో కూడిన అచేతనము పదార్థము. అతడు చేసిన ఆక్షేపణము. శరీరమును సంబంధించినది. ఆ దూషణములు తనకు చెందినవి. శరీరము అచేతనము. దానికి దూషణ తెలియదు. కానీ శరీరమే తాను అనుకొనున నాడు ఆ దూషణములకు మనసు బాధపడును. అతనికి ఆ బాధ లేదు. అతడు బ్రహ్మమునందే నిలిచి ఉన్నాడు. కర్మ ఉన్నంతవరకు ఈ శరీరము నడిపించి కర్మావసానమునందు ఈ శరీరమును వీడి మరల జన్మ లేకుండా పోవలెనని అతడు భావించుచున్నాడు. అందుచే అతడు సమాధానం చెప్పలేదు. ముందువలెనే నడుచుచున్నాడు. పల్లగి కుదుపుచుండెను. రాజుగారికి కోపం వచ్చెను. రే జీవన్మృతుడా, నీవు బ్రతికి ఒంటివా చనిపోతివా? నా శాసనమును మీరుచుంటివా? ఒడలు మరిచిన నీకు ఈ మరుపునకు చికిత్స చేతును. ప్రాణులందరుకును యముడు దిద్దుబాటు చేయుటకు దండం విధించినట్లు నిన్ను నేను దండింతును. నీవు కుదుట పడుదువు అని తను రాజునని అహంకారముతో అతడు పలికెను. అతడు మాట్లాడిన మాటలు అన్నియు అసంగతములే. అతనికి తమస్సు, రజస్సు ఆవరించెను. అందుచే మదము, క్రోధము కలిగెను. భగవంతుని పాదములే తన నివాస స్థానము అని భావించెడి వానిని తిరస్కరించి మాట్లాడినాడు. అన్నిటినీ తానే ఎరుంగుదని అహంకారము గలవాడు. ఆ మాటలు విని భరతునకు రాజుపై దయ కలిగెను. తెలియక పొరబడుచున్నాడు అని సౌహార్దముతో ఆవేశపడక యోగనిష్ఠులు సంచరించు విధానమును ఇతడు ఎరుగడు. ఇతనికి నేనే తెలియజేసెదను. అని ఇట్లు సమాధానం చెప్పుచున్నాడు. జడభరతుడు రహుగణునితో ఇట్లు చెప్పుచున్నాడు. ఓ రాజా, నీవు చాలా స్పష్టముగా మాట్లాడితివి. నిజమైన విషయం చెప్పితివి. చాలా దూరము నడిచితివి. అలసితివి, కృశించితివి అని ఏమేమో పలికితివి. అవి లోక దృష్టిలో మీరు అనదగినవే కానీ.
మోయువాడను అయిన కదా, నాకు బరువు ఆగుటకు, అలయుటకు నేను మోయుట లేదు. నేను ఒక స్థానము చేరవలెనని ఉద్దేశము ఉన్నచో నడవవలసి ఉండుట. నేను పొందవలసినది లేదు. నేను నడిచి పొందునది లేదు. లావుగా ఉన్నాను అనినావు. పంచభూతములు సంఘాతముగు శరీరము లావుగా ఉన్నది కానీ నేను లావుగా లేను. లావుగా ఉండుట, కృశించుట. రోగములు, బెంగలు, ఆకలి, దప్పు, భయము, కలహము, కోరిక, ముసలితనము, నిద్ర, విషయములపై కోరిక, క్రోధము, అహంకారము, మదము అనునవి అన్నియు దేహముతో చేరుటచే కలుగునవి. అవి అన్నియు దేహమునకే చెందినవి. నన్ను జీవన్మృతుడా అంటిరి. జీవించి ఉండుట అనగా చైతన్యము కలిగి ఉండుట. మృతుడు అనగా చైతన్యము లేకపోవుట. ఇవి రెండూను శరీరమునకే గానీ నాకు లేవు. శరీరము పుట్టిన నాడు జీవునితో కలిసి పుట్టినది అని అనబడుచున్నది. జీవుడు విడిపోయిన నాడు చనిపోయినది అనుచున్నారు. నేను అనడి ఆత్మకు బ్రతుకు చావులు లేవు. స్వామి ఆజ్ఞను నేను మీరుచున్నానని మీరు పలికినారు. స్వస్వామి భావము మీకు నాకు లేదు. అది స్థిరముగా ఒకచోటనే ఉండును. అతడు సర్వేశ్వరుడు. అతడే స్వామి. సకల జీవులు వానిచే నియమింపబడుచున్నవి. ఒకడు నియమించుట ఆ విధిని ఒకరు ఆచరించుట అనునది నియతములు. ఈశ్వరుడు ఒక్కడే శాసించువాడు. ఆత్మలన్నియు ఆ నియమమును అనుసరించి ప్రవర్తించుచుండును. నీవు శాసకుడవు కావు. నేను శాసనమును అనుసరించి నడుచువాడను గాను. నా శరీరము పోయి నేను నీవు సేవకు శరీరమును స్వీకరించినచో, నీ శరీరము పోయి నేను రాజు శరీరము స్వీకరించినచో ఆజ్ఞాపించుట, ఆజ్ఞను పాలించుట మన ఇద్దరిలో మార్పు చెందును. శాసించువాడు, పాలించువాడు అను భావములు నీకును నాకును లేదు. సర్వేశ్వరుడు ఒక్కడే శాసకుడు. ఈశ్వరుడు, సేవకుడు అని ఈ భేద బుద్ధి దేహమును బట్టి కలుగు వ్యవహారములను బట్టి ఏర్పడినవే కానీ ఈశ్వరుడు ఎవ్వడు? ఈశతవ్యుడు ఎవ్వడు? ఈ విధముగా చెప్పుట నీకు అనిష్టముగా ఉండును. కానీ ఇది వాస్తవం.
మార్పు చేయజాలము. నీవు మొడలు మరిచి ఒంటివి. చికిత్స చేతును అంటిరి. నేను బ్రహ్మనిష్టుడనై ఉన్నాను. నాకీ దేహ సంబంధము లేదు. బ్రహ్మాత్మకుడునుగా బ్రహ్మాత్మకుడనుగా నన్ను నేను దర్శించుకొనుచున్నాను. అందుచేత నేను ఉన్మత్తుని వలె, మత్తుని వలె, జడుని వలె ఉండును, ఉందును. అసలే ఒడలు తెలియని వాడను. ఇంతకుముందు శరీరమును అన్ని విధములకు దుఃఖములకు వదిలివేసితిని. దానిని మరి నీవు బాధింపలేవు. నేను ఆనందములో ఒంటిని. నాకు నీ బాధలు అంటవు. ఈ శరీరమును నీవు ఏవో దుఃఖములు కలిగించి బాధించుట పిష్టపేషణం. చచ్చిన దానిని పొడచి చంపుట వంటిది. ఈ విధముగా భరతుడు ప్రశాంత మనస్కుడై ఉన్న విషయము అతనికి ఎరగపరిచెను. అతడు ఈ శరీరములో ఉండి వేరొక శరీరమును పొందుటకు కారణమైన పుణ్యాపుణ్య కర్మలను అంతమొందించుకొనినాడు. ఆత్మ దర్శనముచే భగవత్ అనుభవముచే సంచిత కర్మలను ఆగామి కర్మలను అంతమొందించుకొనెను. ప్రారబ్ధ కర్మను అనుభవం చే అంతమొందించు కొనుచుండెను. అందుచే మరల పల్లకి మోయుచు నిలిచెను. ఆ సింధు సౌవీర పతియగు రఘూగనుడు తత్వ జిజ్ఞాస గలవాడు అందుచే అతనికి దానియందు అధికారం ఏర్పడినది. బ్రాహ్మణుడు మాట్లాడిన మాటల వలన ఎన్నో గ్రంథములు చదివిన గాని తెలియని ఆధ్యాత్మిక రహస్యము తెలిసెను. అతడు వెంటనే తొందర తొందరగా పాలకీ నుండి దిగి పాలకీ మోయుచున్న భరతునికి నమస్కరించి క్షమాపణం అర్పించుచు రాజునకు అహంకారం వీడి ఇట్లు పలికెను. తర్వాత తను పలికిన విషయం ఏమిటో మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the one who illuminates virtues, the one who is the light of virtues, the one who is the cause of the destruction of the destruction of virtues, the one who is the seer of virtues, the one who illuminates the virtues, the one who is the cause of the destruction of virtues, and by the virtues, by the virtues Salutations to the Supreme Soul, who is the witness, who is the form of self-illuminating consciousness, who is closely indicated by the activities of the inner self, etc., which covers Him, and is the object of the goal of virtuous conduct. 10th Canto, 16th Chapter, 46th Prayer. Oh, my dear relatives, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the 10th podcast episode of Pancham Skandham. Until now, in the story of Jadabharituni, as he was going into the forest, someone there took him to sacrifice, he went forward without fear, with the feeling that God himself would take care of everything, he goes forward. Let's look at the next part. Let us learn about the meeting between these two, with the account of Rahugana Raja. Rahugana, the king of the Saurashtra country, once upon a time, Ikshmati From the lotus in the river's bank, she set out to serve to learn. Some people were carrying a palanquin, and he was leaving with the palanquin. One of the fraudsters was unable to walk. While they were looking to find another man instead of him, Bharat, who was sitting there, caught their eye. He is strong, young, has strong limbs, and can carry weight like an ox or a donkey.
Thinking so, they prepared to have him carry the palanquin along with the previous ones. He didn't refuse. A palanquin was placed on his shoulder. And so he was. They do not consider him a great man. He doesn't know that he hasn't got a net. He walked, looking ahead, only as far as an arrow could be seen. Raghugaanudu, while driving his vehicles properly, is driving them in a difficult manner. The vehicle is moving this way. He asked the reason. The carriers, fearing that the king would punish them for deceiving the vehicle, reported this to the king. Lord, we are not in a state of ecstasy. We are following your order. We just brought a man to carry him. He is not walking fast. We are not able to carry him alone. If one cannot walk properly, the king decided that everyone who walks with him would have a stumble in their walk, and he looked at Bharata, who had served the elders and gained wisdom, but was angry due to the strength of the Rajoguna. His divine radiance is not shining. Covered in ashes, like fire He is there. Raghunath's mind is also covered by the rajasic nature. Therefore, he spoke like this. Oh brother, carrying sin far away, it must be very difficult to bear alone. You've been dragging on for too long and you're all tired. The organs are not strong, they are old, he spoke as an objection, condemning. How long have you been carrying it? Are you feeling weak? Won't you move? The king's opinion is whether it is an old man. Thus, the king's opinion is that he is not afraid because of the king's insult, and he is worried and trying to adjust. But he was not bothered because he had the knowledge of philosophy. According to karma, this body is formed following karma. This body is with the five great elements, with the objects of sound, etc., with the organs of speech and other karmendriyas, with their subjects, with the inner instrument.
It is the unconscious material, containing the impressions that are attached to it. The objection that he raised. Bodily. Those abuses belong to him. The body becomes inanimate. It doesn't know insult. But when the body itself considers itself, the mind is saddened by those insults. He doesn't have that problem. He is in Brahmam. As long as there is karma, he thinks that he should lead this body and leave this body at the end of karma and be free from birth again. Therefore, he did not answer. He's going over just like you. The bed was shaking. The king was enraged. Oh, the living dead, are you alive or dead? Have you accepted my proposal? I will treat your forgetfulness. I will punish you as Yama punishes all living beings for making mistakes. You will settle down, he said arrogantly, thinking he was the king. All his talk was contradictions. He was enveloped in darkness and gloom. Therefore, arrogance and anger arose. He considered the feet of God as his abode He rejected and spoke. The one with the ego thinks he knows everything. Hearing those words, Bharata felt compassion for the king. He does not know that he is confused without understanding, and he does not know the way in which yogis travel without being agitated with friendship. I'll let you know when I find out. He is saying this. Jadabharata is saying this to Rahugana. Oh, my King, you have spoken very clearly. You spoke the truth. You've walked a lot. You were tired, you were weakened, you said so many things. You may be worthy of condemnation in the eyes of the world.
I am a mute person, so I cannot carry anything to reduce the weight. If I have the intention to reach a place, then I have to walk. I don't have to. I can't even walk. You said I am fat. The five elements are united, the body is heavy, but I am not heavy. Fat, emaciated. Diseases, fears, hunger, thirst, fear, quarrel, desire, old age, sleep, desire for worldly matters, anger, ego, arrogance, etc., all arise from being connected to the body. They all belong to the body. I am Jeevanmritu. Living means having consciousness. A dead person means a lack of consciousness. I don't have both of those. The body is said to be born together with the living being at the time of birth. They think that when a being is separated, it dies. I said the soul has no life or death. You said that I am obeying the Swami's command. You and I have no idea what Swami Bhava is. It will be fixed in one place. He is the supreme Lord. He is the Lord. Sakala Living beings are being controlled by it. One is to appoint, and one is to practice that duty, that is the rules. God is the only one who decides. All spirits will act according to that rule. You are not a ruler. I have followed the edicts of the law. If my body goes and I accept your body as a servant, if your body goes and I accept your body as a king, commanding, obeying the command, a change will occur in both of us. There is no feeling of ruler or ruled for you and me. The sovereign was the only one. God, servant, this different intellect, according to the body, according to the affairs that arise, but who is God? Who is the 100th person? It would be inappropriate to tell you this. But this is the real world.
There can be no change. You've forgotten yourself. Treatment is underway. I am a Brahmavadi. I don't have a physical presence. I am seeing myself as the Brahmajyoti and the Brahmajyoti. Therefore, I will be like a madman, like an intoxicated person, like a fool, I will be. I was a noob. Before this, I had abandoned my body and all its sufferings. You can't hurt her. I was lost in the bliss. I can't stand your misery. This body, you are causing some sorrows and tormenting it. It's like killing a mosquito by squeezing it. In this way, Bharata was informed that he was in a peaceful state of mind. He, being in this body, has destroyed the meritorious and virtuous deeds that caused him to attain another body. Through self-realization and the experience of the divine, he destroyed accumulated karmas and future karmas. He was experiencing the consequences of past actions and was trying to end them. Therefore, he again stood carrying the palanquin. Raghu, the lord of Sauri, who was a seeker of truth, therefore, to him Authority over it was established. By the words spoken by the Brahmin, even after reading many books, the unknown spiritual secret was revealed. He immediately quickly got down from the palanquin, greeted Bharata, who was carrying the palanquin, and apologized, saying, "Giving up arrogance to the king, he spoke thus." After that, let's find out what he said in another episode. Jai Srimannarayana. Salutations to the Asmadgurus