ఇంద్రుని విశ్వరూప సంహార దోషము - బ్రహ్మహత్యా పాతక విభజన
Indra Slays Visvarupa & Apportionment of Brahmanicide Sin
శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, దేవతల పురోహితుడైన విశ్వరూపుడు రహస్యంగా అసురులకు హవిస్సు అందిస్తున్నాడని తెలుసుకున్న దేవేంద్రుడు ఆవేశంతో అతనిని సంహరిస్తాడు. బ్రాహ్మణుడైన విశ్వరూపుని వధతో ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుని అతని దివ్య తేజస్సు క్షీణించసాగింది. ఈ మహాపాపాన్ని తొలగించుకొనుటకు ఇంద్రుడు దాన్ని నాలుగు భాగాలుగా పృథ్వి, జలము, వృక్షములు మరియు స్త్రీలకు పంచిపెట్టాడు, ఒక్కొక్కరూ వరముల ప్రతిఫలంగా ఆ పాపాంశను స్వీకరించారు. పాపము ఎంత గొప్పదైనా పంచబడవచ్చునే గానీ, దాని పరిణామాలు తప్పవని ఈ ఘట్టం స్పష్టంగా బోధిస్తుంది.
In this profound episode of the Srimad Bhagavatham Canto 6, we explore how Indra, the king of heaven, slays Visvarupa — the three-headed priest of the gods — after discovering that Visvarupa was secretly offering oblations to the asuras. This act of killing a brahmin incurs the terrible sin of brahmanicide upon Indra, threatening his divine glory and righteousness. The episode then reveals how Indra distributes this grave sin among four recipients — the earth, water, trees, and women — each accepting a portion in exchange for a boon, demonstrating the cosmic principle that great sins can be shared but never go without consequence.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సంకర్షణాయచ భగవానుడకు వాసుదేవుని కొరకు ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణల కొరకు మనస్సులో నమస్కారమును భావన చేయుచున్నాము. ఆ నామములు గల నాలుగు వ్యూహములకు నమస్కారము. ఓ దేవా, నీకు మనస్సులో నమస్కారమును భావన చేయుచున్నాను. సిక్స్త్ క్యాంటో, సిక్స్టీన్త్ చాప్టర్, ఎయిటీన్త్ ప్రేయర్. భవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము 12వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసుర సంహారంలో భాగంగా వృత్రాసురుడు పుట్టిన తర్వాత తన యొక్క పరాక్రమాన్ని గమనించిన తర్వాత గమనించి దేవతలందరూ వెళ్లి విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారు. ప్రార్థించారు. తర్వాత ఆ శ్రీహరి యొక్క సమాధానం ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం. ఓ దేవతలారా, మీరు చేసిన స్తోత్రముచే సంతుష్టినందినాను. మీరు చేసిన ఈ స్తోత్రమును చేసిన వారికి నా యందు భక్తి కలుగును. నేను సంతసించినచో పొందుటకు శక్యము కానిది ఏదీయును ఉండదు. నన్ను పొందుట కంటే వేరొక ప్రయోజనము లేకుండా సేవించెడి వారు నా నుండి ఏమియు కోరరు. అనుభవించడి శబ్దాది విషయములు పురుషుడు కోరి పొందదగినవి కావు. కానీ ఇంద్రియ పరవసుడగు పురుషుడు తాను దేనిని కోరి పొందవలెనో ఎరుంగడు. అట్టి శబ్దాదులను తన మేలు ఎరుంగక కోరిన వారికి వానినే వసంగిన వాడు ఉత్తముడు కాదు. నిరదిశయ పురుషార్ధమును ఎరుంగిన వాడు దానిని ఎరుంగక కేవలం కర్మలనే చేయవలెనడి కోరెడి వారికి కర్మలయందు ఆసక్తిని కలిగింపరాదు.
వైద్యుడు రోగికి ఇష్టము కదా అని అపద్యమును తినుమని చెప్పడు కదా అందుచే నేను వృత్తుని చంపుటకు నా అంత నేను సిద్ధపడరాదు. అయినను ఓ ఇంద్ర మీరు వెళ్లి దధ్యంచుడు అనే ఋషిని శరీరమును వసంగుమని యాచింపుడు. అతని శరీరము విద్యా, వ్రతము, తపస్సు అనువానిచే శ్రేష్టమైనది. ఆ శరీరముచే మీరు మీ కోరికను సాధింపగలరు. అధర్వరణుడు అధర్వరణుడు అగు దధీచి అను ఋషి ప్రవర్గ్యము అనేడి విద్యయందును బ్రహ్మ విద్యయందును సమర్థుడై ఉండెను. అశ్విని దేవతలు అతని వద్దకు వెళ్లి ఆ విద్యను తమకు ఉసంగుమని ప్రార్థించిరి. అతడు ఇప్పుడు నేను యజ్ఞము చేయుచున్నాను ఉపదేశింపరాదు తర్వాత రెండు ఉపదేశించెదను అనెను. ఇంద్రుడు ఆ విషయముని రింగి అశ్విని దేవతలకు ఆ విద్యచే అతిశయము కలుగునని సహింపలేక దధ్యంచుని దగ్గరకు వెళ్లి ఆ విద్యను నీవు ఎవ్వరినీ ఉపదేశింపవలదు. ఉపదేశించితివా నీ శిరస్సును ఛేదింతును అనెను. తరువాత కొంత కాలమునకు అశ్విని దేవతలు దధ్యంచుని వద్దకు వచ్చి ఉపదేశింపమని కోరిరి. ఇంద్రుడు తన శిరస్సును ఛేదించును అందుచే చెప్పజాలను అని దధ్యంచుడు చెప్పెను. అప్పుడు అశ్విని దేవతలు ఇప్పుడే నీ శిరస్సును ఛేదించి అశ్వ శిరస్సును నీకు సంధించి ఉంచెదము. దానితో మాకు విద్యను ఉపదేశింపుము. అప్పుడు ఇంద్రుడు వచ్చి నీ శిరస్సును ఛేదించును. ఛేదింపబడిన శిరస్సు అశ్వ శిరస్సు కనుక సహజమైన నీ శిరస్సు మరల నీకు సంధించి మేము రక్షణ వసంగుదుము అని పలికిరి. అట్లే అని వారికి దధ్యంచుడు ఆ విద్యను ఉపదేశించెను. ఇంద్రుడు శిరస్సును ఛేదించెను. అశ్విని దేవతలు అతని శిరస్సును సంధించిరి. అశ్వ శరీరముతో అశ్వ శరీరముతో దధీచి ఉపదేశించిన బ్రహ్మ విద్యను అశ్వ శరీరము అని ప్రసిద్ధము. ఆ విద్యచే అశ్విని దేవతలకు అమరత్వం వచ్చెను.
అట్లే అధర్వణుడగు దధీచి నారాయణ కవచమును విశ్వరూపున వసంగెను. విశ్వరూపుడు నీకు వసంగినాడు కదా. ఇట్లు దధీచి బ్రహ్మ విద్యను నారాయణ కవచమును ఎరింగిన మహా ప్రభావశాలి. అందుచే అతని శరీరము సారవంతమైనది. అతడు ధర్మజ్ఞుడు. యాచించిన వారి కోరికను తిరస్కరింపడు. మీరు యాచించినచో అతని అవయవములు వసంగును. ఆ దధీచి అవయవులతో విశ్వకర్మ ఒక ఆయుధమును తయారు చేయును. ఆ ఆయుధమును ధరించి ఇంద్రుడు వృత్రాసుని శిరస్సును ఛేదింపగలడు. అతడు చనిపోయినచో మీ తేజస్సులు, మీ ఆయుధములు మీకు వచ్చును. నన్ను ఆశ్రయించిన మిమ్ములను వృత్తుడు ఏమియు జయజాలడు మీకు మంగళమవుగాక ఇట్లు శ్రీహరి ఇంద్రునకు ఉపదేశించి వారు చూచుచుండగా అంతర్ధానమాయెను. ఇంద్రుడు శ్రీహరి చెప్పినట్లు దధీచి వద్దకు వెళ్లి అతని అవయవములను యాచించెను. అతడు అధర్వుని పుత్రుడు. పరబ్రహ్మముని మననము చేయుచు శరీరమునందు మమకారం లేనివాడు. అతడు వారి కోరికను విని నవ్వుచు ఇట్లనెను. ఓ దేవతలారా, దేహము ధరించు వారికి దేహము వీడునప్పుడు కలిగెడి క్లేశము మీకు తెలియనిది కాదు. లోకములో జీవింపవలెనని కోరు వారికి దేహము కంటే ప్రియమైనది వేరొకటి ఉండదు. అట్టి దేహమును సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి యాచించినను వసంగుటకు ఎవ్వడును అంగీకరింపడు. అని వారు కోరిన కోరికను తిరస్కరించి తిరస్కరించు వాని వలె మాట్లాడెను. దేవతలు ఆ మాటలు విని ఇట్లు పలుకుచున్నారు. ఓ బ్రహ్మ స్వరూపుడా నీవు పుణ్య శ్లోకులు కీర్తించు చరిత్ర గలవాడవు. ప్రాణులపై దయగల మీ వంటి వారికి విడవ శక్యము కానిది ఏదీను ఉండదు. వారు దేనిని అయినను వదులుటకు జంకరు. లోకంలో మానవుడు స్వార్థపరుడు. ఒకరి బాధను గుర్తించడు. తనకు కావలసిన దానిని కోరుచుండును. దాత సమర్ధుడై దాన గుణము గలవాడగుట చేత ఇవ్వను అనలేడు. అందుచేత మేము అడుగుట మా స్వభావమునకు తగినది, ఇచ్చుట నీ స్వభావమునకు తగినది.
కావున నీవు వసంగుదువని మేము భావించుచున్నాము. అప్పుడు దధీచి మీరు ఏమందురో అని నేను మీ కోరికను తిరస్కరించితిని. ప్రారబ్ధ కర్మ పూర్తి కాగానే ఆత్మ తనంత తానే శరీరమును వదిలిపోవును. అట్టి దానిని మీ కార్యము నెరవేర్చుటకు వసంగుట నాకు ఆనందమే. ఒకనాడు నశించెడి శరీరమును ఒకరికి మేలు కలిగించుటకు భూత దయ చేయించుట మానవునకు కర్తవ్యం. భూతములకు మేలు కలిగించుటకు, ధర్మమును ఆర్జించుటకు, కీర్తిని పొందుటకు అవసరమైనచో అస్థిరమగు తన శరీరమును ఎవడు వసంగుడో వానిని చూచి స్థావరములు చెట్లు కొండలు కూడా జాలిపడును. ఒక ప్రాణి యొక్క శోకమునకు శోకింపక ఒక ప్రాణికి కలిగిన సంతోషమునకు సంతోషింపక జీవించుట మెచ్చదగినది కాదు. ఉత్తములైన మహాపురుషులు సేవించు అవ్యయముకు ధర్మము ఒకరి హర్షము చూచి హర్షించుట ఒకరి శోకమును చూచి శోకించుట ఈ శరీరము ఒకనాడు నశించునదే. ఇప్పుడు ఇది ఎప్పుడైనను కుక్కలకు, నక్కలకు ఉపయోగపడునదే. అట్టి శరీరముతో ఒకరికి ఉపయోగపడక ఎవడు జీవించునో వాని జీవితం నిందింపదగినది, శోకింపదగినది. ఇట్లు దధీచి శరీరమును ఒకరికి ఉపయోగించుటకు అర్పించుట కంటే తనకు ధన్యత లేదని నిశ్చయించుకొనినాడు. ఆత్మను పరమాత్మ యందు నిలిపి తన శరీరమును వీడెను. ఇంద్రియములు, మనసును, బుద్ధిని విషయముల నుండి వెనకకు మరలించిన వాడు మరలించినాడు తన ఆత్మ పరమాత్మ ఆత్మ గలది అను తత్వమును దర్శించి తన ఆత్మ పరమాత్మ ఆత్మ గలది అను తత్వమును దర్శించి పరమాత్మయే తాను అను దర్శనము గల వాడాయను పుణ్య పాపమును దూరము చేసుకునినాడు. యోగ ధారణచే శరీరమును నిష్క్రమించినాడు. దేహమును గూర్చిన స్మరణము లేక పరంధామము అను పరంధామమును చేరినాడు.
ఇంద్రుడు దధీచి యొక్క ఎముకలను విశ్వకర్మ కొసంగగా అతడు వజ్రాయుధమును నిర్మించెను. దాని యందు భగవానుని దివ్య తేజస్సు ప్రవేశించెను. ఇంద్రుడు దేవతలందరిచే పరివేష్టింపబడి మూడు లోకములను ఆనందింప చేయుచు ఐరావతమును ఎక్కి వృత్తుని చంపుటకు బయలుదేరెను. వృత్తుడు అసురుల సంఘములతో సేనానాయకులతో పరివేష్టింపబడి ఉండెను. ఇంద్రుడు ప్రళయకాల రుద్రుని వలె వృద్ధుని పైకి ఏగెను. దేవతలకు, అసురులకు అతి తీవ్రమగు యుద్ధము జరిగెను. ఇది మొదటి నాలుగు యుగములలో త్రేతాయుగారంభ కాలములో జరిగెను. రుద్రులు, అసురులు, ఆదిత్యులు, అశ్విని దేవతలు, పితృ దేవతలు, అగ్నులు, మరుత్తులు, భుభువులు, సాధ్యులు, విశ్వేదేవులు ఇంద్రునితో ఉండిరి. ఇంద్రుడు వజ్రమును దాల్చి అత్యధికమగు కాంతితో ప్రకాశించుచుండెను. వృత్తుడు మొదలగు అసురులు అతనిని సహింపలేకపోయిరి. నముచి, శంబరుడు, అనర్వడు. విమూర్ధ్గుడు, వృషభుడు, అంబలుడు, హయగ్రీవుడు, శంఖశిరుడు, విప్రచిత్తి, అయోముఖుడు, పులోముడు, వృషపర్వుడు, హేలి, ఉత్కలుడు మొదలగు రాక్షసులందరూ పృథ్విని వెంట ఉండిరి. దైత్యులు, దానవులు, యక్షులు, సుమాలి, మాలి మొదలగు వారందరు యుద్ధభూమిలో ఇంద్రునికి ఎదురుగా వచ్చి నిలిచిరి. వారందరు గదా మొదలగు ఆయుధములు ధరించి ఏమియు బెదరని వారై సింహ గర్జనము చేయుచు దేవతలను సంహరించుచుండిరి. అసురులు వేసిన బాణములు ఒకదాని వెంట ఒకటి వెడలి దేవతలను కప్పివేయుటచే మబ్బులచే కప్పబడిన నక్షత్రముల వలె దేవతలు కనపడకుండిరి. దేవతలు కూడా సిద్ధహస్తులై శీఘ్రముగా వేలకొలది బాణములు ప్రయోగించి అసురులు బాణములు తమకు అంటకుండా ఛేదించి ఉండిరి. అస్త్ర శస్త్రములు క్షీణింపగా కొండ శిఖరములతో, చెట్లతో, రాళ్లతో అసురులు దేవ సైన్యమును ఎదిరించసాగిరి. దేవతలు వాటిని కూడా పూర్వం వలె క్షేధించుచుండిరి. వృత్తుడు తమ సైన్యమునకు నాథుడై.
ఉండుట చేత అసురుడు ధైర్యముగా ఉండిరి. కానీ తమ వారందరూ ఆయుధములు చేతను ఇతరములగు వాని చేతను చనిపోవునుట చూచి అసురుడు భయమునందిరి. భగవానుడు అనుకూలుడై ఉండుట చేత దేవతలకు వీరి అస్త్రములు ఏమియు తగలలేదు. అసురుల ప్రయాసములన్నియు వ్యర్థములాయెను. క్షుద్రములు, పరుషములు, అమంగళకరములగు మనసును బాధించెడి మాటలు కృష్ణ భక్తులను ఎట్లు బాధింపజాలవో. అట్లే అసురుల అస్త్రముల దేవతలను అంటజాలక దూరమగు ఉండెను. అసురుల ప్రయత్నము వ్యర్థమగుటచే వారి గర్వము తగ్గెను. తమ నాయకుడగు వృత్తుని వదిలి పారిపోవాలని సిద్ధపడిరి. పారిపోవుచున్న తన సైనికులను చూచి వృత్తుడు ప్రశస్తమైన మనసు గలవాడై వారితో ఇలా చెప్తున్నాడు. పారిపోతున్నటువంటి ఆ రాక్షసులను చూస్తూ వృత్తుడు ఏమి చెప్పాడో మనం తర్వాత పాడ్కాస్ట్ లో. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to you, the Lord. To Vasudeva, the radiant one. Salutations to Pradyumna and Aniruddha. To Sankarshana, to the Lord. For Vasudeva, Pradyumna, and Aniruddha, salutations in the mind, the feeling We are doing. Salutations to the four stratas which bear that name. Oh God, I offer my salutations and reverence to you. Sixth Canto, Sixteenth Chapter, Eighteenth Prayer. Dear relatives, welcome to the 12th podcast of Srimad Bhagavata Tatva Deepika, the sixth volume. Until now, as part of the destruction of Vritrasura, after Vritrasura was born, after observing his valor, after observing, all the gods went and are praying to Lord Vishnu. They prayed. Next, let's find out what Srihari's answer is today. Oh Gods, I thank you for the praise you have given me. Those who have done this praise will have devotion to me. If I am satisfied, there is nothing that is impossible to obtain. Without any other benefit than to attain me Those who serve me ask nothing in return. Experiencing the objects of the senses is not something a man can desire and obtain. But a man who is engrossed in the senses does not know what he desires to obtain. One who does not understand the good of such words and desires them, is not a good person. One who understands the purpose of life, one who does not understand it and only performs actions, should not be made interested in actions.
The doctor doesn't tell the patient to eat the medicine because he likes it, right? Therefore, I should not be ready to kill my profession. However, O Indra, you go and ask the sage named Dadhyanchu to take possession of his body. His body is superior to that of Vidya, Vrata, and Tapas. Through the body you can achieve your desire. Adharvārnīndu Adharvārnīndu, the sage Dadhīcī, was skilled in the art of Pārvagya and in the Brahma Vidya. The Ashwini Devas went to him and prayed that he would grant them the knowledge. He said, "Now I am performing a yajna (sacrifice), do not preach. Afterwards, I will preach two." Indra, unable to bear that knowledge, went to Dadhyanu and said, "You should not teach that knowledge to anyone." He said that if you preach, I will cut off your head. After some time, the Ashwini Devas came to Dadhyanchuni and requested him to give them teachings. Indra severed his head, therefore it is not possible to tell, thus Dadhyanudu said. Then The Ashwini gods will now sever your head and attach the horse's head to you. Teach us that. Then the god Indra will come and tear off your head. The severed head, the horse's head, therefore, naturally, your head, again, connecting to you, we will protect you, they said. Similarly, he told them and taught them that knowledge. Indra severing the head. Ashwini Devas severed his head. With a horse body, with a horse body, the Brahma Vidya taught by Dadhichi is famous as a horse body. The Ashwini Devas were endowed with this knowledge.
Similarly, Dadhichi, the knower of Atharvana, was possessed by Narayana's armor, the universal form. Vishwaroop has set you free, right? Thus, Dadhichi, who knew the Brahma Vidya and the Narayana Kavacham, was a great and influential person. Therefore, his body is fertile. He's a moralist. He who has asked will not be denied the desire. If you ask, his limbs will be healed. Vishwakarma makes a weapon with the help of Dadhichi Rods. Wearing that weapon, Indra can sever Vritrasura's head. If he dies, your radiance and your weapons will come to you. The one who has taken refuge in me, the one who has taken refuge in you, no one can conquer. May it be auspicious for you. Thus, Srihari, having instructed Indra, disappeared as they were watching. Indra went to Dadhichi and begged for his organs as told by Srihari. He is the son of Adhrvan. One who contemplates the Supreme Brahman, without attachment to the body. He heard their request and laughed. Oh gods, the suffering that befalls those who take on a body is not unknown to you. For those who desire to live in the world Nothing is dearer to my heart than my body. Even if Sri Maha Vishnu himself comes and begs such a body, no one will agree to accept it. And he spoke as one who refused the request they made. The gods heard these words and spoke them. Oh, embodiment of Brahma, you are the one with a history of praising the virtuous and the shlokas. There is nothing that cannot be abandoned for those like you, who are merciful to living beings. They are not going to give up what they have. Selfishness is the name of the game in the world. One doesn't realize the pain. He is asking for what he wants. The giver, being capable and virtuous, cannot refuse to give. Therefore, what we ask is befitting of our nature, what we give is befitting of your nature.
Therefore, we believe you will be saved. Then, Dadhichi, I rejected your request because I didn't know what you were going to eat. As soon as the karmic debt is complete, the soul leaves the body on its own. It is my pleasure to help you fulfill your purpose. It is the duty of man to cause a body that is going to perish to benefit someone. To benefit the ghosts, to earn righteousness, to gain fame, if necessary, even the unstable body of the one who is settled, even the trees and mountains will pity. It is not commendable to live without grieving the sorrow of a creature, without grieving the happiness that a creature experiences. The best of great men serve the imperishable, righteousness to one, rejoicing to see one's joy, grieving to see one's sorrow. This body will one day perish. Now this is useful for dogs and foxes anytime. Whoever lives without being useful to someone with such a body, his life is condemnable, worthy of mourning. Thus, Dadhichi's body was offered to be used by someone He decided that he did not have any fortune. He fixed the soul in the Supreme Soul and left his body. The senses, the mind, He who has turned the intellect away from worldly matters has turned it away. He who has seen the essence that his soul is the supreme soul, having seen the essence that his soul is the supreme soul, he who has the vision that he is the supreme soul himself, the merit and sin He went far. He has left the body through Yoga practice. He has reached the supreme abode, without any remembrance of the body, or the supreme abode.
Indra took the bones of Dadhichi and made the Vajrayudha out of them. In it, the divine light of the Lord entered. Indra, surrounded by all the gods, delighting the three worlds, mounted Airavata and set out to kill Vritta. The warrior was surrounded by a group of demons and their commanders. Indra, like Rudra during the time of destruction, rose up against the old man. A fierce battle ensued between the gods and the asuras. This happened in the beginning of the Treta Yuga, in the first four yugas. The Rudras, Asuras, Adityas, Ashwini Devas, Pitra Devas, Agnis, Marutis, Bhuvanulu, Sadhyulu, and Vishvedevas were with Indra. Indra, wearing a diamond, was shining with immense light. The Asuras, including Vruttha, could not tolerate him. Namuchi, Shambhurudu, and Anarvudu. Vimurdhugudu, Vrushabhudu, Ambaludu, Hayagreevudu, Shankhashirudu, Viprachitti, Ayomukhudu, Pulomudu, Vrushaparvudu, Heli, Utkakudu, and all the demons were following the earth. Demons, monsters, Yakshas, Sumali, Mali, and others, all stood before Indra on the battlefield. They all wielded maces and other weapons, fearless of anything, roaring like lions, destroying the gods. The arrows shot by the demons, one after another, covered the gods, and the gods appeared like stars covered by clouds. The gods, being skilled, quickly launched thousands of arrows, and the demons, having cleared the arrows from themselves, remained. As the weapons and missiles diminished, the demons began to confront the divine army with mountain peaks, trees, and stones. The gods also protected them as before. The warrior is the leader of his army.
Because of being there, the demons were courageous. But seeing that all their weapons and others were dying, the demon was frightened. Because the Lord was favorable, their weapons did not touch the gods. All the efforts of the demons have been in vain. Words that are harsh, harsh, and inauspicious, how can they hurt the minds of Krishna devotees? Similarly, the demons' weapons, the gods, could not be touched and remained distant. The efforts of the Asuras were in vain, and their pride was diminished. They were ready to abandon their leader's profession and run away. Seeing his fleeing soldiers, Vrutthudu, with a noble heart, said this to them. Let's find out what Vruthi said after seeing those demons who were running away in the next podcast. Jai Srimannarayana Asmadgurubhyo Namaha.