ప్రాచేతసుల సముద్ర గర్భ జల తపస్సు - శివ గీత శ్రవణము
Pracetas Enter the Ocean & Receive Lord Shiva's Song
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, రాజు ప్రాచీనబర్హిస్ యొక్క పది మంది కుమారులైన ప్రాచేతసులు సముద్ర గర్భంలో మునిగి వేల సంవత్సరాలు కఠోర తపస్సు ఆచరించిన వైభవోపేత కథను వివరిస్తున్నాం. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల వారికి స్వయంగా భగవాన్ శివుడు ప్రత్యక్షమై దివ్యతేజస్సుతో దర్శనం ఇచ్చాడు. శివభగవానుడు వారిపై కరుణతో "శివ గీత" అనే దివ్య స్తోత్రాన్ని ప్రసాదించి, శ్రీ విష్ణువే పరమ లక్ష్యమని, సర్వోత్తమ ఆశ్రయమని బోధించాడు.
In this sacred episode of Srimad Bhagavatham Canto 4, we explore the profound tapasya of the ten Pracetas, the sons of King Prachinabarhis, who submerged themselves deep into the ocean to perform intense austerities for ten thousand years. By the grace of the Supreme Lord, they were blessed with a divine encounter with Lord Shiva himself, who appeared before them radiating transcendental splendor. Lord Shiva lovingly bestowed upon them a beautiful and powerful hymn — the celebrated Shiva Gita — glorifying Lord Vishnu as the ultimate refuge and supreme goal of all existence.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో ద్విశీర్షే త్రిపదే చతుశ్శృజ్ఞాయ తంతవే సప్ త హస్తాయ యజ్ఞాయ త్రయీ విద్యాత్మనే నమః స్వర్గాది ఫలములను విస్తరింప చేసే యజ్ఞమే స్వరూపముగా గల శ్రీహరికి ప్రాయనీయము ఉదయనీయము అనే రెండు కర్మలు రెండు తలల వంటివి ప్రాతః మధ్యాహ్న సాయం సవనములు మూడు పాదముల వంటివి, ఋగ్యజస్సామ అధర్వణ వేదములే నాలుగు కొమ్ముల వంటివి, గాయత్రి ఉష్ణక్ పంక్తి త్రిష్టుప్ అనుష్టుప్ బృహతి మొదలైన ఏడు ఛందస్సులు ఏడు చేతుల వంటివి, యజ్ఞమునకు మూలము ఋగ్యజస్సామ వేదములు. అట్టి శ్రీహరికి నమస్కారము. ఏత్ క్యాంటో 16th చాప్టర్ 31st ప్రేయర్. భగత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 28వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పృథురాజు యొక్క చరిత్ర వారి పుత్రులు ప్రచేతస్సులకు ఆ బోధించినటువంటి రుద్రగీత తరువాత ప్రాచీన బర్హుడు. నారదుడి యొక్క నారదుని అడిగినటువంటి విషయాన్ని పురస్కరించుకుని నారదుడు ప్రాచీన బర్హుడికి పురంజనోపాఖ్యానాన్ని ఉపదేశించడానికి సిద్ధమయ్యారు. మన పురంజనోపాఖ్యానాన్ని అనుభవిద్దాం. ఆధ్యాత్మికోపదేశమును నారదుడు ఒక కథ ద్వారా చేయుచున్నాడు. తత్వోపదేశమును ఒక కథలో కాకుండా విడిగా చెప్పినచో లోకతీరులో లోకతీరులో ప్రవర్తించు వారికి బోధపడదు. వారికి స్త్రీలు, పురుషులు, కలయిక మొదలగునవి తెలియును కనుక దానిలో తత్వజ్ఞముని ఇమిడ్చి ఉపదేశించుచున్నారు. పూర్వము పురంజనుడు ఒక రాజు ఉండెను. అతడు వేద వేదాంగములను చదువుకొనినవాడు. అతనికి అవిజ్ఞాతుడు అను మిత్రుడు ఉండెను. అతడు చేయు పనులు అందరుకు స్పష్టముగా తెలిసిన ఒకటచే మంచి కీర్తి కలవాడు. ఆ పురంజనుడు తాను ఉండుటకు ఒక పట్టణమును అన్వేషించుచు భూమియందంతటను సంచరించుచుండెను. తనకి తగిన వాసస్థానము లభింపలేదు. అందుచే దుఃఖము గలవాడాయను. తాను అన్ని ఇంద్రియములతో శబ్ద స్పర్శలను భోగమును అన్నిటినీ పూర్ణముగా అనుభవించుటకు తగిన పట్టణము కావలెనని ఇతడు కోరుకొనుచుండెను.
అట్టి పట్టణం అతనికి దొరకలేదు. ఇట్లు సంచరించుచుండగా ఒకనాడు హిమోత్ పర్వతం యొక్క దక్షిణ చర్యలలో ఒక పట్టణమాతని కనిపించెను. అందు సర్వేంద్రియములతో సకల భోగములను అనుభవించు అవకాశం ఉండెను. దానికి తొమ్మిది ద్వారములు ఉండెను. ఆ పట్టణమునకు ప్రాకారములు, ఉద్యానవనములు, మెడలపై అంతస్తులు, గాలి జోరుడుగా వచ్చుటకు తగిన గవాక్షములు, తోరణములు ఉండెను. ఆ పట్టణమునకు 3 శిఖరములు ఉండెను. అందు ఒకటి బంగారు శిఖరము, వేరొకటి వెండి శిఖరము, వేరొకటి ఇనుప శిఖరము. అందు 6 విధములగు వేరు వేరు గృహములు ఉండెను. అందు పెద్ద ప్రాకారం ఉండెను. అందు నీలము, స్పటికములు, వైఢూర్యములు, ముత్యములు, మరకతములు మొదలగు మణులు పొదగబడి ఉండెను. అందు క్రీడాస్థానములు, అంగణములు, రాజమార్గములు, విశ్రాంతి స్థానములు, ధ్వజపతాకాదులు, పగడపు తిన్నెలు ఉండెను. ఆ పట్టణమునకు వెలుపల. ఉద్యానవనము ఉండెను. అందు దివ్యములగు వృక్షములు, లతలు అలుముకొని ఉండెను. తుమ్మెదలు, పక్షులు, కోలాహలము చేయుచున్న జలాశయములు ఉండెను. మంచు నీటి బిందువులతో కూడిన గాలి అచ్చెడ చెట్ల కొమ్మలను, ఆకులను, చిగుళ్ళను కదలుచుండెను. అందు అనేక విధములగు వన్యమృగములు ఉండెను, కానీ అవి ఎవరినీ బాధింపకుండెను. కోకిలలు కూయుచు ఆ దారిన పోయే బాటసారులను లోనికి రమ్మని పిలుచుచున్నవా అనునట్లుండెను. ఆ ఉద్యానవనమునకు అనుకోకుండా ఒక యువతి వచ్చి యుండెను. పురంజనుడు ఆ ప్రమధను చూచెను. ఆమె వెంట పది మంది భృత్యులు ఉండిరి. వారి వెనుక ఒక్కొక్కరి వెంట వంద మంది సేవకులు ఉండిరి. ఆమె వెనుకనే ఎల్లప్పుడూ ఆమెను కాపాడుచు ఐదు తులల పాము వచ్చుచుండెను. ఆమె పాము ఆ పాము ఆమెను కాపాడుచుండెను ఆమె తనకు అనుకూలుడగు ప్రియునకై అన్వేషించుచుండెను ఆమె విషయములు అనుభవించుటలో ప్రౌఢిమ లేనిది వేరు వేరు రూపములను దాల్చగలిగినది. ఆమె నాసిక సుందరముగా ఉండెను. ఆమె కపోలములు, దంతములు, ముఖము, పిరుదులు, పాదములు, స్తన్యములు చాలా సుందరములై ఆకర్షకములై ఉండెను.
ఆమె మ్రోగుచున్న నూపురములు దాల్చి పాదములతో ఇటునడు సంచరించుచుండెను. ఆమెకు ఇంకను పూర్తిగా యవ్వనము రాలేదు. వక్షస్థలమునందలి స్తనములు సిగ్గుతో కప్పుకొనుచు గజ గమనముతో సాగుచున్నది. సిగ్గుతో మెల్లగా నడుచున్న ఆ సుందరాంగిని పురంజనుడు ప్రేమతో చూరెను. ఆమె పైకెత్తి కదులుచున్న కనుబొమ్మలతో కూడిన చూపుతో అతనిని చూచెను. అతడు ప్రేమ పెల్లుబుకి ఇట్ల అడుగుచున్నాడు. ఓ పద్మదళనేత్రి నీవు ఎవరి కుమారికవు? ఎందరో వనితలు ఉన్నారు, వారెవరు? నీతో సాగుచున్న ఈ సర్పం ఏమి? నీవు సాక్షాత్తు భూదేవివా లేక లక్ష్మీదేవివా? నీ చేతులోని తామర పువ్వు జారి పడినదా? నీవు లక్ష్మి, సరస్వతి, భూదేవులలో ఒకరివై ఉండుటకు అవకాశం లేదు. నీవు పాదములతో భూమిని అంటి నడుచుచున్నావు. దేవతా స్త్రీలు భూమిని స్పృశింపరు. లక్ష్మీదేవి యజ్ఞ పురుషుడగు విష్ణువుతో కలిసి వైకుంఠములో ఉన్నట్లు నాతో కలిసి నీవు ఈ పట్టణమును అలంకరించి ఉండుటకు తగుదువు. నీవు మందహాసముతో, సిగ్గుతో, సవిలాసముగా చూచిన చూపు నా మనసును వశపరచుకొనినది. మన్మధుడు నన్ను బాధించుచున్నాడు, అనుగ్రహింపుము. సిగ్గుతో నీవు తలదించుకొని ఉండకుము. ముఖము ఎత్తి నాకు చూపుము. అందమైన కనుబొమ్మలు, నల్లని కనుపాపలు, ప్రేలాడు ముంగురులు, మధురమగు మాటలు, పవిత్రమైన మందహాసము నాపై ప్రసరింపజేయుము. అని పురంజనుడు ధైర్యము చెడి యాచింపగా ఆ వనితారత్నము ఆ వీరుని చూచి మోహించినది అతనిని మోహింపచేసినది అతడు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానము చెప్పుచున్నది నన్ను కనిన వారెవరో నాకు తెలియదు. మా వంశము నాకు తెలియదు. ఇప్పుడు నేను ఈ పట్టణములో ఉన్నాను. నిన్ను నన్ను తప్ప వేరొక విషయం నాకు తెలియదు. నీవును నేనును ఉండుటకు ఈ పట్టణమును నిర్మించిన వారెవరో నాకు తెలియదు. నా వెనుక వచ్చుచున్న ఆ పదునొక మంది బటులు ఆ స్త్రీలు నాకు మిత్రులు చెలికత్తెలు. ఈ సర్పము నేను నిద్రించుచున్నను ఈ పట్టణమును కాపాడుచు మేలుకొని ఉండును. అదృష్టవశముచే నీవు వచ్చితివి. గ్రామ్యములగు కామములను కోరుచున్నావు. నేను నా బంధువులతో కూడా నీకు కావలసిన భోగములను సంపాదించెదను.
ఈ తొమ్మిది ద్వారములు గల పట్టణమున నాతో కలిసి నేను సంపాదించి పెట్టెడి భోగములను అనుభవించుచుండుము. నీ వంటి భోగానుభవం తెలిసిన వారిని తప్ప భోగ ప్రసంగము లేని వారిని నేను వరింపను. కొందరు సుఖము వలదని తిరస్కరింతురు, కొందరు మరణమునకు భయపడకుండా ఉందురు. రేపు రాబోయేడి సుఖములను అనుభవింపవలెనని కొందరు ఎరుంగరు. అట్టివారు పశువుల వంటి మూర్ఖులు వారిని నేను కామించను. ఈ పట్టణములో ఉన్నంత కాలము మనం అనుభవింపవలసినవి అర్ధకామములు, పుత్ర సుఖము, కీర్తి, దుఃఖము లేని. నిర్మలమైన లోకములను మనం పొందవలెను. ఇట్టి జ్ఞానము లేని వారు ఆదరింపదగిన వారు కారు. గృహస్థ ధర్మము పితృ దేవతలకు, దేవతలకు, పురుషులకు, మనుషులకు, భూతములకు మనకు కూడా క్షేమమును కలిగించును. నీ వంటి కాముకుడు, త్యాగి, దానశీలుడు, సుందరుడు, అనుభవింపదగిన భోగమునందు దృష్టి గలవాడు, భావుకుడగు భర్త లభించిన నాడు ఎవతి కాదనగలదు? స్వయముగా తనంత తానే వరించును. నీ వంటి మహాపురుషులు దాసుల మా మనసులలో ఉన్న బాధలు తొలగించుటకు అంతటను సంచరింతురు. దయతో మందహాసముతో మీరు చేచెడు చూపే మీరు చూచెడు చూపే మనసులోని బెంగలను తొలగింపగలదు. పురంజనుడు ఆ యువతితో కలిసి భార్యాభర్తలుగా అన్యోన్య సంకేతమును చేసుకుని దైవవశముచే దృఢమైన బంధము ఏర్పడి నగరమును ప్రవేశించి నూరు సంవత్సరములు ఆనందించుండిరి. వారు ఒకప్పుడు గాయకులు లలిత గానమును చేయుచుండగా ఆనందించుచుండిరి. ఒకప్పుడు స్త్రీలతో కూడి గ్రీష్మ ఋతువులలో జలక్రీడను అనుభవించుచుండిరి. ఆ పురమునకు ఏడు ద్వారములు ముందు వైపు, రెండు ద్వారములు వెనక వైపు కల్పింపబడినవి. ఆ మార్గములలో ఆయా విషయములకు ఒక్కొక్క ద్వారము నుండి పురము నుండి వెలువడి ఏగుచొందురు. ముందు వైపునున్న ద్వారములో ఐదు ద్వారములు తూర్పు వైపుగను ఒక్కటి దక్షిణమునకు ఒక్కటి ఉత్తరమునకు ఉండెను. పడమట వైపు రెండు ద్వారములు ఉండెను. తూర్పు వైపు ద్వారములో ఒకచోట రెండు ద్వారములు ఉండెను. ఒక ద్వారము ఖద్యోత మరియు ఒక ద్వారము అవిర్ముఖి. పురంజనుడు ఈ ద్వారము నుండి బయటకేగునప్పుడు జుమంతుడను మిత్రునితో బయలు వెళ్ళెను. ఆ మిత్రునితో వెళ్ళెడే దేశము పేరు విభ్రాజితము.
అట్లే తూర్పు వైపు మరి రెండు ద్వారములు ఒక్క చోటనే ఉండెను. అందు ఒకటి నళిని, రెండవది నాళిని. ఈ ద్వారము నుండి వెలువడునప్పుడు పురంజనుడు అవధూతుడు అనే మిత్రుడితో కలిసి బయల్పడును. సౌరభమును దేశమునకేగును. తూర్పు వైపు ముఖ్యమగు ద్వారము ఉన్నది. ఆ ద్వారము నుండి పురంజనుడు వెలుపలకేగునప్పుడు రసజ్ఞుడు, విపణుడు అని మిత్రులతో కూడి ఆపణము, బహుధనము అనేటి దేశములకేగుచుండును. ఇంకా ఆ పట్టణముకు దక్షిణం వైపు ఉన్న ద్వారము పితృహు అని పిలువబడును. ఎడమ వైపు ఉన్న ద్వారము దేవహు అని పిలువబడును. దక్షిణ ద్వారము నుండి విడలినప్పుడు శృతధరుడు అనే మిత్రునితో కలిసి దక్షిణ పాంచాల దేశమునకేగును. దేవహోను ద్వారము నుండి శృతధరుడు మిత్రునితో కలిసి ఉత్తర పాంచాలమునకేగును. పడమటి వైపు అసురి ఆసురి అనేటి ద్వారము ఉన్నది. పురంజనుడు ఆ ద్వారము గుండా దుర్మధుడు అనేటి మిత్రునితో కూడి గ్రామికము అనేటి దేశమునకేగును. పడమటి వైపు నిరుతి అనేటి ద్వారం ఉన్నది. ఆ ద్వారము గుండా వెళునప్పుడు లుబ్ధకుడు అనేటి మిత్రునితో కూడి వైశసం అనేటి దేశముకేగును. ఈ పట్టణము ద్వారములలో రెండు ద్వారములు ఎల్లప్పుడూ తెరవబడక వెలుగు లేనిదే ఉండును. వాటిని నిర్వాక్ అనియు వేశస్కృత్ అనియు పిలిచెదరు. పురంజనుడు ఆ ద్వారముల గుండా వెడలి వెడలి పనులు చేయుచుండును. విషువు చీనుడని మిత్రునితో కూడి అంతఃపురమును చేరినప్పుడు భార్యా బిడ్డల మోహమును హర్షమును పొందుచుండును. పురంజనుడు భార్య ఆజ్ఞకు బద్ధుడై ఉండును ఆమె ఏది కావలెన దానిని దానిని ఎల్ల ఎల్ల తాను చేయుచుండును ఈమె పానము చేయవలెన తాను మధుపరుషుడై మద్యమును పానము చేయును ఆమె భుజింపవలెనైనా ఆమెతో తాను తినును, ఆమె గానము చేయవలెనైనా గానము చేయును, ఏడుచున్నచో తాను ఏడుచును, నవ్వుచో నవ్వును, మాట్లాడినచో మాట్లాడును, ఆమె శయనించునచో తాను కూడా శయనించును. ఆమె నిలిచినచో తాను నిలుచునును, పరిగెత్తుచున్న పరిగెత్తును, చూచిన చూచును, వినిన వినును, వాసన చూచిన తానును వాసన చూచును, ఆమె శోకించినచో తాను కూడా దీనుడై శోకించును, ఆమె హర్షమునందినచో తాను ఆమెతో ఆనందించును. ఈ విధముగా ఆ రాణిచే మోహమునందిన వాడై తన సహజ స్వభావమును వీడి తనకిష్టము లేకపోయినను పరవశుడై కీడామృగం వలె ఆమె ఆడించినట్లు ఆడుచుండెను.
తర్వాత ఏం కథ జరిగిందో మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the two-headed one, the three-footed one, the four-handed one, the one with three hands, the one with three hands, salutations to the one who bestows the fruits of heaven. The sacrifice that expands the fruits of heaven is the form of Sri Hari, the morning sacrifice And two karmas are like two heads, morning, noon, evening, and three feet, like Rig, Yajus, Samaveda, and Atharvana Vedas are like four horns, Gayatri, Ushnuk, Pankti, Trishtup, Anushtup, Brihati, and other seven Chandas are like seven hands, the origin of Yagnya is Rig, Yajus, Samaveda and Atharvana Vedas. Salutations to Shri Hari. Aitken, Chapter 16, Prayer. Devotees of Bhagavat, welcome to the 28th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation between Vidura and Maitreya, the history of Prithu Raja, his sons, and the Rudra Gita that taught them, then the ancient Barhudu. Narada, taking into account the matter asked by Narada, Narada was ready to preach the Puranjana story to the ancient Barhu. Mana Let's experience the Puranjano legend. Narada is teaching spirituality through a story. If the teaching of philosophy is not told separately from a story, it will not be understood by those who behave in the ways of the world. They know about women, men, union, etc., therefore, they are imparting knowledge by embedding the philosopher in it. Once upon a time, there lived a king named Puranjana. He was a scholar of the Vedas and the Vedangas. He had a friend called Avignat. He is one who is known to everyone for his good deeds. That Puranjunudu, while he was there, was searching for a town to live in and was wandering all over the earth. He did not find a suitable place for himself. Therefore, he is sorrowful. He desired that he should have a city fit to fully experience all the sounds, touches, pleasures, and everything else with all his senses.
He couldn't find such a town. While wandering like this, one day, in the southern slopes of the Himavat mountain, a town's mother appeared. And with all the senses, there was an opportunity to experience all pleasures. It had nine gates. That city had walls, gardens, terraces on the tops, and openings for the wind to blow strongly. The city had 3 peaks. And one is a golden peak, another is a silver peak, and another is an iron peak. And there were 6 different kinds of houses. There was a large courtyard. And there were jewels studded with blue, crystals, lapis lazuli, pearls, and emeralds. There were playgrounds, courtyards, royal roads, resting places, flags, and coral reefs. Outside the city. There was a garden. There were divine trees and vines entwined. There were bumblebees, birds, and reservoirs making a lot of noise. The air filled with ice crystals, the branches and leaves of the trees, The chicks were fidgeting. And there were many kinds of wild animals, but they did not hurt anyone. The cuckoos were cooing and calling out to the travelers passing by, inviting them to come in. Unexpectedly, a young woman came to that garden. Puranjaneya saw that Pramadha. She was accompanied by ten bodyguards. Behind them, there were a hundred servants with them. Behind her, always protecting her, a five-tailed snake was coming. She, the snake, that snake was protecting her. She was searching for a beloved who was favorable to her. She was not lacking in maturity in experiencing things. She was able to assume different forms. Her nose was beautiful. Her cheeks, teeth, face, buttocks, feet, and breasts were very beautiful and attractive.
She was walking with her feet, carrying the sound of the drums, as she was playing. She was not fully adult yet. The breasts in the chest are covered with shyness and are moving with a gallop. The beautiful woman, walking slowly with shyness, was looked at with love by Puranjunudu. She lifted her eyebrows, looked at him with a glance that was accompanied by a wagging of her eyebrows. He is asking like this because of his love. Oh, lotus-eyed one, whose daughter are you? There are many women, who are they? What is this snake that is following you? Are you the goddess Bhudevi or Lakshmi? Did the lotus flower in your hand fall? You are not likely to be one of Lakshmi, Saraswati, and Bhudevi. You are walking on the ground with your feet. The goddesses do not touch the ground. Lakshmi Devi, along with Vishnu, the Yagna Purusha, is in Vaikuntha. Along with me, you are worthy of decorating this city. The look with which you looked with a smile, shyness, and amiability has captivated my heart. Manmadha is tormenting me, please have mercy. Don't be so shy as to be looked down by. Turn up your face and look on me. May my beautiful eyebrows, my black pupils, my flowing eyelashes, my sweet words, and my pure smile shower down upon me. And Puranjunudu, losing courage, began to pray. That gem of a woman, seeing that hero, was fascinated. She was fascinated by him. She was answering the questions he asked. I do not know who has seen me. I don't know our family. I am in this town now. I know nothing but you and me. I don't know who built this city for you and me to live in. Those ten servants who are following me, those women are my friends and maids. This serpent, while I sleep, will watch over this city and be awake. You have come to the right place. You're asking for a village. I will also get you the pleasures you desire, with my relatives.
In this city with nine gates, be with me and enjoy the pleasures I will earn and provide. I will not grant it to those who do not have the experience of enjoyment like you, except those who do not have the talk of enjoyment. Some deny that happiness is not good, some are without fear of death. Some people do not understand that they should experience the pleasures that await tomorrow. I will not desire those who are like animals, fools. As long as we are in this town, we should experience only desires, happiness, fame, and sorrowlessness. We must obtain the pure worlds. Those who lack such knowledge are not worthy of being respected. The duty of a householder brings well-being to the ancestors, gods, men, humans, and ghosts. When a woman, who is like you, a lover, a renunciant, a charitable person, handsome, and focused on enjoyable pleasures, and a sensual husband is found, who can deny it? It will come on its own. Great men like you travel throughout to remove the sufferings in the hearts of our servants. With kindness, with a smile, you show what you do, you see what you do It can remove the worries from your mind. Puranjunudu, along with that young woman, as husband and wife, having made a harmonious sign, by divine will, a strong bond was formed, and entering the city, they lived for a hundred years in joy. They were once singers, enjoying Lalita's singing. Once upon a time, they used to enjoy water sports with women during the summer. The city has seven gates, two on the front side and two on the back side. In those ways, from each gate, from each city, they emerge and enter. In the front door, there were five doors to the east, one to the south, and one to the north. The west end has two doors. On the east side of the gate there were two gates. One door is Khadyota and another door is Aviramukhi. When Puranjunudu was leaving through this gate, Jumantudu went out with his friend. The name of the country where I went with my friend is Vibrajitam.
Similarly, on the east side, the two doors were in one place. The first is Nalini and the second one is Nalini. When it emerges from this door, Puranjunudu will go out with a friend named Avadhuta. The fragrance of the land itself. The main entrance is to the east. When Puranjunudu goes out from that door, he goes to the countries called Rasajnudu and Vipanudu with his friends, offering food and wealth. And the gate that is to the south of the city is called Pethruhu. The door on the left is called the Devahu. When separated from the southern gate, he went to the southern Panchala country with a friend named Shrutadharu. From the gate of Devahonu, Shrutadhara, along with his friend, went to Uttara Panchala. On the west side is the entrance to the Asuri Asuri. Puranjunudu, along with his friend Durmadhudu, went to the country called Gramikamu through that door. There is a gate in the west side called Niruthi. When going through that door, he goes to a country called Vaishasam with a friend named Lubdhakudu. This town In the doors, two doors are always not opened, it is without light. They are called Nirvach and Vesak. Puranjunudu is going through those doors, going through and doing work. When Vishnu, along with his friend, reaches the inner chambers, he rejoices and feels the joy of his wife and children. Puranjunudu is bound by his wife's command. Whatever she wants, he does it all the time. If she wants to drink, he becomes a honey-like man and drinks alcohol. Even if she wants to eat, he eats with her Even if she sings, she sings; if she cries, she cries; if she laughs, she laughs; if she speaks, she speaks; if she lies down, she also lies down. Where she stands, she will stand; where she runs, she will run; where she sees, she will see; where she hears, she will hear; where she smells, she will smell; where she grieves, she will grieve; where she rejoices, she will rejoice with her. In this way, being fascinated by the queen, abandoning his natural nature, even though he did not like it, he became ecstatic and like a serpent of harm It was like she was playing like she was playing.
We will find out what happened next in another episode. Jai Srimannarayana and salutations to the Ashmadguru.