అధోలోక వర్ణన - అతల, వితల, సుతల లోకాలు (భాగం 1)
Subterranean Realms — Atala, Vitala, Sutala (Part 1)
ఈ ఎపిసోడ్లో శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలో వర్ణించబడిన అధోలోకాల అద్భుతమైన వివరణను ప్రారంభిస్తున్నాము. మాయాసురుని పుత్రుడైన బలుడు అధిపతిగా ఉండే అతల లోకంలో మాయా శక్తులు మరియు ఇంద్రియ మోహాలు ఎంతగా ప్రబలంగా ఉంటాయో శుకదేవ మహర్షి వివరిస్తారు. హాటకేశ్వర రూపంలో శివుడు అధిపతిగా ఉండే వితల లోకంలో పవిత్ర నదుల నుండి హాటకమనే బంగారు ద్రవ్యం ఉద్భవిస్తుందని తెలుసుకుంటాము. మహాభక్తుడైన బలి చక్రవర్తికి ప్రసాదించబడిన సుతల లోకం స్వర్గలోకాన్ని సైతం మించిన వైభవంతో విరాజిల్లుతుందని, అక్కడ స్వయంగా భగవంతుడే రక్షకుడిగా నిలబడతాడని శ్రద్ధగా తెలుసుకుంటాము.
In this episode of our Srimad Bhagavatham podcast, we begin exploring the fascinating descriptions of the subterranean worlds as revealed in Canto 5. Śukadeva Gosvāmī describes Atala, the realm ruled by Bala, son of Maya, where the sorcery of illusion and sensual enchantment hold powerful sway over all who enter. We then turn to Vitala, presided over by Lord Śiva in his form as Hāṭakeśvara, from whose sacred rivers flows the mystical golden substance known as hāṭaka. Finally, we explore Sutala, the supremely opulent realm granted to the great devotee King Bali, which even surpasses the heavenly planets in its splendor and where the Lord Himself stands as eternal guardian.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమస్తస్మై భగవతే కృష్ణాయా కుంఠమేధసే స్వయోగమాయయాచ్చన్న మహిమ్నే పరమాత్మనే మొక్కవోని విజ్ఞాన శక్తి గల శ్రీకృష్ణ భగవానుని మహిమ ఆయన యోగమాయచే కప్పివేయబడినది. వ్యక్తి యొక్క అంతరతమ చైతన్య స్వరూపుడైన ఆ కృష్ణ భగవానుని కొరకు నమస్కారము. భవ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధం 26వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రియవ్రత చరిత్రము భూగోళ వర్ణనము. తర్వాత జ్యోతిర్మండల వర్ణము, దీప వర్ణము పూర్తి చేసుకొని మనం ఇప్పుడు అధోలోక వర్ణనానికి తెలుసుకోబోతున్నాం. శ్రద్ధగా లభిద్దాం. ఇంతవరకు భూమి యొక్క సన్నివేశం అంతయు వర్ణింపబడినది. ధ్రువ మండలం మొదలు భూమి వరకు మనం వెనక తెలుసుకునేనాము. ఈ భూమికి అడుగున కొన్ని లోకములు ఉన్నవి. అవి భూమికి అడుగుననున్న ఖాళీ ప్రదేశములు. అవి ఏడు. అతలము, పితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము అని ఆ ఏడింటి వివరములు. ఇవి ఒక్కొక్కటి పదివేల యోజనముల వెడల్పు కలిగి అంతే ఎత్తు కలిగి ఉండును. అవి పెద్ద బిలములు అనగా కన్నము వలె ఉండును. అవి బిలస్వర్గములు అనబడును. అతట కూడా స్వర్గమునందువలనే అధికమైన కామములు, భోగములు, ఐశ్వర్యములు, ఆనందము అనుభవింపబడుచుండును. సమృద్ధమైన భవనములు, ఉద్యానవనములు, విహార ప్రదేశములు ఉండును. అందు దైత్యులు, దానవులు, పన్నగములు ఉండును. వారు ఎల్లప్పుడూ ఆనందముతో, అనురాగముతో భార్యాభర్తలు, బిడ్డలు, బంధువులు, స్నేహితులతో కూడి సంసార జీవితమును అనుభవించుచుందురు.
సర్వేశ్వరుడు కూడా వారి భోగములకు అంతరాయము కలిగింపడు. ఆ బిలస్వర్గముల నడి క్రింది లోకములలో మాయలను ఎరింగిన అసురుడవు యముడు మయుడు పట్టణములను నిర్మించెను. ఈ పట్టణములలో చిత్ర విచిత్రములగు మణులతో నిర్మింపబడిన భవనములు ఉండును. ఆ లోకములకు పాలకులకు పాలకులగు వారి భవనములు చాలా దివ్యముగా నిర్మింపబడెను. నాగులు, అసురులు జంటలు జంటలుగా వ్యవహరించుందురు. అందు పారావతము మొదలగు రకరకమునగు పక్షులు ఉండును. కృత్రిమముగా నిర్మింపబడిన వేదికలు ఉండును. అచట ఉద్యానవనములు, ఇంద్రియములు మనసును ఎక్కువగా ఆకర్షించుచుండును. ఆ ఉద్యానవనములోని వృక్షములు పండ్లతో పూలతో గుత్తులు గుత్తులుగా ఒప్పుచుండును. ఆ చెట్లను లతలు అల్లిబిల్లిగా అల్లి ఉండును. సరస్సులలో జలపక్షులు విహరించుచుండును. నిర్మలమగు జలములతో నిండిన ఆ సరస్సులలో చేపలు, నీటి పక్షులు, కలువలు, పద్మములు మున్నగునవి అందముగా నిండి ఉండును. ఆ ఉద్యానవనములు ఇంద్రియములకు ఆనందమును కలిగించునవై ఉండును. దేవలోకం యొక్క శోభను కూడా మించిన శోభ కలిగి ఉండును. ఆ లోకములలో ఉన్నవారికి ఆయుర్దాయము చాలా అధికము. అచట రాత్రింబ వాళ్ళు అనేటి విభాగము తెలియదు. అచటనున్న సర్పముల శిరస్సు పైనున్న మణులు కాంతులే చీకటిని తొలగించుచుండును. ఈ లోకములోనున్న వారికి వయస్సు మారుటచే ఉండెడి మార్పులు ఉండవు. వారు దివ్య ఔషధులను, రసాయనములను, దివ్యమగు ఆహారములను తినుచు, త్రాగుచు ఆయా జలములలో స్నానము చేయుటచే వారి శరీరములకు మనకు కలిగెడి మార్పులు కలగవు. వారికి మానసికమైన పీడలు ఉండవు. శరీరములకు రోగములు ఉండవు. శరీరము ముడతలు పడదు. జుత్తు పండదు. ముసలితనము కలగదు. బుద్ధి చెరుట ఉండదు. ఉత్సాహము తగ్గదు. దుఃఖము కలుగదు. భగవానుని దివ్యాస్త్రమగు చక్రమే ఆ లోకములో ఉండువారిని ఎప్పుడో లేకుండా చేయును.
ఆ లోకములో మొదటిది అతలం. అచట మయుని కుమారుడు బలుడు నివసించుచుండును. మయుని పుత్రుడగు బలుడు సృష్టించినవే మాయలు. అవి 96 రకములు. ఇప్పటికిని ఆ మాయలు కొందరు ధరించుచుందురు. ఆ బలుడు ఆవలించినప్పుడు అతని ముఖము నుండి మూడు విధములగు స్త్రీ గుణములు వెలువడును. వారే స్వైరిణులు, కామిణులు, పుంశ్చలులు అని మూడు వర్ణములు. వీరు వ్యభిచారము చేయుటకు అలవడిన స్త్రీలు, తమ వర్ణము వారితోనే రమించువారు స్వైరిణులు. తమ వర్ణము కాని వారితో కూడా రమించువారు కామినిలు. నియమము లేక పురుష మాత్రులతో స్వేచ్ఛగా సంచరించువారు పుంశ్చలులు. ఆ లోకములోనికి ఎవరైనా పురుషుడు వెళ్ళినచో ఒక రసమును వారిపై ప్రయోగించి తమ వశము చేసుకొని వారికి సంభోగ సామర్థ్యమును కలిగించి అసాధారణములగు తమ విలాసములతో చిరునవ్వులతో మాటలతో ఆలింగనములతో వారిని రమింపజేయుచుందురు. ఆ రసమును ఉపయోగించిన వాడు పదివేల ఏనుగుల బలము గలవాని వలె మదాంధుడై స్త్రీ భోగమును అనుభవించుటలో తృప్తి తీరని వాడై ఉండును. అతలమునకు క్రింద వితలము అను లోకము కలదు. అచట హటకేశ్వరుడను పేరుతో హరుడు తన పార్షదులగు గణములతో వసించి ఉండును. సృష్టిని వృద్ధి పొందించవలెనని బ్రహ్మ ఆదేశింపగా రుద్రుడు భవానితో కలిసి అతడు రమించుచుండును. ఆ భవుడు భవానితో కలిగిన కలికచే వెలువడిన వీర్యము హాటకిని అనేడి నదిగా ప్రవహించుచుండును. అందలి జలము చేతనే బంగారము ఏర్పడును. అచ్చట రుద్రునకు హాటకేశ్వరుడు అని పేరు. ఆ నది జలమును వాయువుచే ప్రజ్వలింప చేయబడిన అగ్ని పానము చేసెను. పానము చేసి ఆ జలమును పుక్కిట పట్టి అగ్ని ఉమ్మివేయగా బంగారము ఏర్పడెను. దానినే హాటకము అందురు. ఆ క్రింది లోకములోనున్న అసురులందరూ వారి అంతఃపుర స్త్రీలకు ఆ బంగారముతో నగలను చేయించి ధరింపచేతురు. దాని క్రింద సుతలము గలదు. అక్కడ తన ఔదార్యముచే ప్రసిద్ధి చెందిన పవిత్రముగు చరిత్రము గల విరోచనుని కుమారుడగు బలి చక్రవర్తి నివసించుచుండును.
ఇంద్రునికి మేలు చేయవలెనని భగవానుడవు శ్రీ మహావిష్ణువు అతితికి కుమారుడై జన్మించి వామన బ్రహ్మచారియై మూడు లోకములను అతని నుండి ఆక్రమించెను. భగవానుడే అతనిపై దయ తలచి సుతలమున అతనిని ప్రవేశింపచేసి పరిపాలకునిగా ఏర్పరిచెను. ఇంద్రాదులకు కూడా దుర్లభమగు సమృద్ధమగు ఐశ్వర్యము గలవాడై నిర్భయముగా తాను ఆచరించవలసిన ధర్మములను భగవదారాధనగా అతడు ఆచరించుచుండును. ఇప్పటికిని అతడు సుతలమున ఉన్నాడు. ఇట్టి ఐశ్వర్యము అతనికి లభించుట భగవానునికి ఔదార్యముతో దానము వసంగుట చేతనే అనుకొనుట సరికాదు. దానం వలన ఇంతటి ఫలము లభింపదు. సకల జీవ సమూహమునకు ఆత్మ అయిన వాడు పరమాత్మగు వాసుదేవుడు. లోకములో మనం ఏది అర్పించినను అర్పించుటకు తగిన పాత్ర అతని కంటే వేరొకటి లేదు ఉండదు. తనను యాచించిన బ్రహ్మచారి వామనుడు సాక్షాత్తు భగవానుడే అని ఎరింగి పరమ శ్రద్ధతో పరమ ఆదరముతో మనసును అతని యందే నిలిపి తాను తన సర్వస్వమును అర్పించినాడు. అట్లు చేయుట తన కర్తవ్యమని చేసినాడు. అతని శ్రద్ధను చూచి భగవానుడు సంతసించి అతనికి ఈ సుతలలోకైశ్వరమును కోసంగెను. భగవన్ నామమును ఒక్కసారి అయినను ఒడలు తెలియక అయినను. ఆవలించినప్పుడు అయినను క్రింద జారిపడినప్పుడైనను పలికినచో ఆ పురుషుని కర్మబంధము వెంటనే విడిపోవును. ముముక్షువులు అట్టి కర్మబంధమును తొలగించుటకు కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము మొదలుగా ఉపాయములను ఆశ్రయింతురు. అట్టి భగవానుని ప్రీతితో సేవించి అంతయు ఆయనదే అని ఎరింగి అతనికి అర్పించుటయే కర్తవ్యమని ఎరింగి అర్పించిన బలి కర్మ బంధము విడకుండుట ఎట్లవుతుంది? తప్పక వీడిపోవును. అంతటి భక్తి గల బలి చక్రవర్తికి భగవానుడు మోక్షముని వసంగక సుతలమునకు ఆధిపత్యమును వసంగుట తగునా అని అనిపించును. ప్రారబ్ధ కర్మను అనుభవించుచు భగవదారాధన రూపముగా కర్మాచరణము చేసి ప్రాచీన కర్మను నశింపచేసుకొని భక్తిచే మోక్షమునందవలెను. అందుకై భగవానుడు తనను గూర్చిన స్మరణమును మరిపించిన
మూడు లోకముల ఐశ్వర్యమును తానే యాచించి తీసుకున్నాడు. తన దర్శనముచే అతనిలో భగవత్ స్మరణమునందు దాస్యమునందు రుచిని కలిగించినాడు. వరుణ పాశములతో బంధించి మరల విడిపించినాడు. ఇట్లు అతని కర్మానుభవమనంతను పూర్తి చేసి ప్రారబ్ధ కర్మ ఉన్నంత కాలము తన ఆరాధనగా కర్మ చేయుటకు తగిన ఐశ్వర్యమును సంగినాడు. అంతేగాని భగవానుడు అతనిని నిగ్రహించలేదు అనుగ్రహించెను. సకల శాస్త్ర జ్ఞానము కలవాడు ఇంద్రుడు. బృహస్పతి అతనికి మంత్రి. కానీ పురుషుడు అర్ధించి పొందవలసినదేదో అతనికి తెలియదు. అతనికి ఆలోచన చెప్పడి బృహస్పతిని అడగకుండా శ్రీ మహావిష్ణువును తనకు తమ్ముడుగా అదితికి పుట్టి వామనుడుగా బలి వద్ద నుండి మూడు లోకములను యాచించి తనకు వసంగుమని కోరినాడు. భగవంతుని దర్శించునప్పుడు భగవత్ దాస్యము కంటే మూడు లోకముల ప్రభుత్వము అల్పాల్పము అని అతనికి తోచలేదు. భగవానుడు అతనికి మూడు లోకములు నుసంగినాడు. ఇంద్రుడెంత అవివేకియో చూడుడు నిరతిశయ గంభీర వేగము కలది కాలము. కాలము అతి వేగముగా గడిచిపోయి ఈ లోకాధిపత్యం ఒకనాడు నశించునది కానీ భగవత్ దాస్యము నిత్యానంద ప్రదము అని అతడు గుర్తింపలేకపోయినాడు. బలిచక్రవర్తి ఇంద్రుని అవివేకమునకు జాలిపడి మా తాతగారగు ప్రహ్లాదుడు పురుషార్ధములను ఎన్నుకొనుటలో నిష్ణాతుడు. భగవానుడు దర్శనమును సంగినప్పుడు స్వామి నీ దాసుల దాస్యమే నాకు కావలని కోరినాడు కానీ తన తండ్రియగు హిరణ్యకశ్యపుని ఐశ్వర్యము కావలని కోరలేదు. తన తండ్రిని చంపి ఆ రాజ్యమును తనకు నరహరి వసంగును కానీ అది పరిమితము సతతము భయప్రదము ఎన్నడును భయమును కలిగింపనిది అనంత సుఖమునిచ్చునది భగవత్ దాస్యము అని ఎరింగి. దానిని కోరి ఈ శరీరావసానమున మోక్షము కావలెనని కోరెను. ఈగ గరుత్మంతుని నడవగలదా? అట్లే కర్మ వాసనలు పూర్తిగా మాసిపోని వారు ప్రహ్లాదుని మార్గమును ఎవరు అనుసరింపగలరు? నా వంటి వానికి ప్రహ్లాద మార్గమును అనుసరించి వెళ్ళుట సాధ్యమైన పని కాదు అని భావించెను. బలిద్వారమునందు సకల లోక గురువగు నారాయణుడు గదదాల్చి ద్వారపాలకుడై ఉండును.
ఒకప్పుడు రావణాసురుడు దిగ్విజయము చేయుటకు సుతలమునకు వచ్చెను. అప్పుడు ద్వారమునందు ఉన్న నారాయణుడు అతనిని తన బొటన విరిలితో 10,000 యోజనముల అవతలకు చిమ్మి పారవేచెను. ఆ తరువాత ఉన్నటువంటి లోకాల గురించి మరొక పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. ఇంతవరకు అతలము, వితలము, సుతలము తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the Lord. By the power of Yoga, the supreme soul, the knowledgeable Sri Krishna Bhagavan, whose mouth is the ultimate, is covered by the power of Yoga. Salutations to that Krishna Bhagavan, who is the inner consciousness of the individual. Dear devotees, welcome to the 26th podcast of Srimad Bhagavata Tattva Deepika, the fifth book. So far, the story of Priyavrata and the description of the earth. After completing the Jyotirmandala Varnam and Deepa Varnam, we are now going to learn about Adholoka Varnam. Let's take care of it. So far, the scene of the earth has been described. We learned from the beginning of the polar region to the earth. There are other worlds beneath this world. They are the empty spaces at the bottom of the ground. They are seven. Athalaamu, Pithalamu, Suthalamu, Thalathalamu, Mahatalamu, Rasatalamu, Patalamu, these are the details of those seven. Each of these has a width of ten thousand yojanas and a height of the same. They are large holes, like a pit. Those Bilisvaragam. There, also, in heaven, excessive desires, pleasures, wealth, and bliss are experienced. There are luxurious buildings, gardens, and recreational areas. There will be demons, giants, and serpents. They always experience family life with joy and affection, as husband and wife, children, relatives, and friends.
The Lord of all is not bothered by their pleasures. Yama and Maya, who knew the illusions in the lower worlds of those Bilvasargas, built the cities. In these towns, there are buildings constructed with various kinds of jewels. Their palaces, which were the rulers of those worlds, were built very divinely. Nagas and Asuras are shown as a pair. There are various kinds of birds, including the paravata. There will be platforms that are artificially created. There, gardens and senses attract the mind more. The trees in that garden are arranged in clusters with fruits and flowers. Those trees are laden with vines. Waterfowls abound in the lakes. Those lakes, filled with clear water, are beautifully stocked with fish, water birds, lotuses, and other aquatic plants. Those gardens are pleasing to the senses. It will have a beauty that surpasses even the heavens. The lifespan of those in that world is very long Excessive. There, the division of people at night is unknown. The gems on the heads of the snakes there remove the darkness. For those who are in this world, there are no changes due to age. They do not get the changes that occur to their bodies by eating, drinking, and bathing in those waters, while they eat, drink, and consume divine medicines, chemicals, and divine foods. They don't have mental illnesses. The bodies themselves are disease-free. The body does not get stiff. Hair doesn't grow. There will be no old age. There will be no brain drain. The enthusiasm will not decrease. No sadness. The divine weapon of the Lord, the Chakra, will make those in that world disappear long ago.
The first in the world was the Atal. There, Mayuni's son, Badalu, lives. Maya is the creation of Bali, the son of Maya. There are 96 types of those. Even now, some people are wearing those illusions. When that powerful person yawns, three kinds of feminine qualities emerge from his face. They are the three varnas: Swaraini, Kamini, and Pumsal. Those women who are accustomed to prostitution, those who enjoy themselves with their own kind, are libertines. Those who enjoy even those of the opposite sex are lovers. Those who roam freely with male partners without any rules are Pumnchalu. If any man goes into that world, they will apply a juice to them, subdue them, give them the ability to have intercourse, and with their extraordinary pleasures, smiles, words, embraces, they will delight them. He who uses that juice, like one with the strength of ten thousand elephants, will be intoxicated and will not be satisfied in enjoying the pleasures of women. Below the ocean, there is a world called the underworld. There, in the name of Hatakeswarudu, Harudu, his associates It is inhabited by the colony. When Brahma ordered to increase the creation, Rudra, along with Bhavani, was enjoying. That Bhavudu, the semen that was produced by the union with Bhavani, flows as a river called Hatakini. By the water of it, gold is formed. Rudra is also known as Hātakesha. He drank the water of the river, which was made active by the wind. Having made the water drinkable, and having put that water in a pot, when the fire was blown on it, gold was formed. That's what they call it. All the demons in the underworld make their inner chamber women wear jewelry made of that gold. Underneath it, there is a seal. There, the son of Virachana, who is famous for his generosity and has a sacred history, Bali Chakravarti, resides.
To do good to Indra, you are the Lord, Sri Maha Vishnu, born as a son to the deity, Vamana, a celibate, and conquered the three worlds from him. The Lord had mercy on him, and having made him enter the abode, He established him as a ruler. He, who is rich and prosperous, and rare even to Indras, fearlessly practices the duties he must perform as the worship of the Lord. He is still in Sutalam. It is not right to think that such wealth is obtained by the Lord through generosity and the donation of wealth. Giving alms does not bring such results. The supreme being Vasudeva is the soul of all living beings. In the world, whatever we offer, there is no vessel better than him to offer it. The celibate Vamana, who pleaded with him, is none other than the Lord himself, with utmost devotion and utmost respect, he fixed his mind on him and dedicated his entirety. He did it because it was his duty. Seeing his devotion, the Lord was pleased and granted him this Suthala Keshwara. The name of God Even once, even if the bodies are not known. Even if it is when he is sleeping, even if he slips down, if he speaks, that man's bondage of karma will immediately be released. Muktas (liberated souls) rely on means such as Karma Yoga, Jnana Yoga, and Bhakti Yoga to remove such karmic bonds. Having served with such devotion to that Lord, how does it become possible for the sacrifice offered by the Lord, which is the duty of offering to him, to be free from the bondage of the karmic bonds? You'll definitely get stuck. To the Bali Chakravarti, who has such devotion, the Lord feels that it is appropriate to grant him the authority over the treasures of the Sudalamas. Experiencing the fruits of past actions, performing actions in the form of devotion to God, destroying ancient karma, and attaining liberation through devotion. Therefore, the Lord forgot the remembrance of Himself
He himself begged and took the wealth of the three worlds. Through his vision, he instilled a taste in him for the remembrance of God and for servitude. Varuna bound him with nooses and released him again. Thus, having completed his karma-anubhava, as long as there is karma, he accumulated wealth sufficient for his worship. But the Lord did not forbid him, He granted him the grace. Indra is the knower of all science. Brihaspati is his mentor. But the man does not know what he should understand and get. Without telling him the idea, without asking Brihaspati, Sri Maha Vishnu, as his brother, was born to Aditi as Vamanudu, and after begging the three worlds from Bali, he asked that he be granted them. When he saw God, he did not realize that the government of the three worlds was less than the servitude of God. The Lord shut the three worlds in him. See how foolish Indra is, time is of unparalleled, grave, and swift speed. Time passes very quickly. This worldly dominance will one day perish, but the servitude of the divine is eternal bliss He couldn't recognize the preamble. Bali Chakravarti, pitying Indra's foolishness, our grandfather Prahlada is skilled in choosing the Purusharthas. When the Lord appeared, Swami, he desired the servitude of your servants, but he did not desire the wealth of his father, Hiranyakashipu. Having killed his father, Narahari will inhabit that kingdom for him, but it is limited, always frightening, never causing fear, giving infinite happiness, is the servitude of God, thus Eringi. He desired it, and desired liberation in this body's end. Can an insect walk like Garuda? Similarly, who can follow the path of Prahlada, those who have not completely worn away from the effects of karma? He thought that it was not possible for a person like me to follow the path of Prahlada. In the sacrificial fire, Narayana, the guru of all the worlds, stands as the gatekeeper.
Once upon a time, Ravanasura came to Sutalam to achieve victory. Then Narayana, who was at the door, threw him down 10,000 yojanas away with his thumb. Let's learn about the worlds that exist after that in another podcast. So far, we have learned about Atalamu, Vitalamu, and Sutalamu. Jai Srimannarayana. Salutations to the Guru