వరాహ అవతారము & దైత్య వంశోత్పత్తి (Parts 17-25)
Varaha Incarnation & Demon Lineage (Parts 17-25)
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన భాగంలో, భగవంతుడు శ్రీమహావిష్ణువు వరాహ రూపంధరించి, పాతాళంలో మునిగిపోయిన భూదేవిని హిరణ్యాక్షుని నుండి రక్షించిన అద్భుతమైన వృత్తాంతాన్ని శ్రద్ధగా వింటాము. భగవంతుడు హిరణ్యాక్షునితో చేసిన పోరాటము మరియు భూదేవిని ప్రేమతో పైకి తీసుకురావడం, ఆయన అనంతమైన శక్తికి మరియు కరుణకు నిదర్శనంగా నిలుస్తాయి. తదుపరి, మహర్షి కశ్యపుడు మరియు దితి కలయిక వల్ల దైత్య వంశం ఏవిధంగా ఉద్భవించిందో, ఆ వంశోత్పత్తి వివరాలను భక్తిపూర్వకంగా తెలుసుకుంటాము. ఈ కథలు మనకు గుర్తు చేస్తాయి — భగవంతుడు ప్రతి యుగంలోనూ ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరిస్తాడని.
In this sacred episode from Canto 3 of the Srimad Bhagavatham, we explore the magnificent Varaha incarnation, in which Lord Vishnu assumes the form of a divine boar to rescue the Earth goddess from the depths of the cosmic ocean. The Lord's glorious battle with the demon Hiranyaksha and His tender lifting of Bhudevi back to her rightful place reveal the boundless compassion and supreme power of the Almighty. We then journey into the origin of the demon lineage, tracing how the great sage Kashyapa's union with Diti gave rise to the mighty Daityas, setting the stage for the eternal conflict between divine and demonic forces. Together, these narratives remind us that the Lord descends in every age to uphold righteousness and protect His devoted creation.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః శక్తిత్రయ సమేతాయ నీఢుషేహం కృతాత్మనే చేత అకూతి రూపాయ నమో వాచో విభూతయే సత్వరజస్తమ శక్తి సమేతునకు జ్ఞానేచ్ఛా క్రియాశక్తి సమేతునకు సహ ఓజో బల సమేతునకు అన్నిటినీ వర్షించువానికి అహంకార స్వరూపునకు చిత్త అకూతి రూపునకు వాగ్విభూతి స్వరూపునకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో 24th చాప్టర్ 43rd ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్భాగవత తత్వదీపిక తృతీయ స్కంధం 16వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం విదురుడు మైత్రేయ సంవాదంలో నుండి జరిగిన విషయం లోపల ప్రజాపతుడు ఎలా సృష్టించాడు తరువాత రుద్రుడు ఎలా ఆవిర్భవించాడు? ఆ స్థానాలేమిటి? తరువాత జరిగిన విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకా ముందు తను ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నకు సమాధానం ఏమి ఇస్తున్నాడో మనం అనుభవిద్దాం. విదురుడు మరల మైత్రియుని ప్రశ్నించెను బ్రహ్మ తన శరీరములో ఆయా అవయవముల నుండి వేదములు మొదలగు వానిని సృష్టించెను కదా ఏ అవయవము నుండి దేనిని సృజించెను ఎరుంగ చేయుము మైత్రియుడు చెప్పుచున్నాడు బ్రహ్మకు నాలుగు దిక్కుల యందును నాలుగు ముఖములు కలవు తూర్పు వైపు ఉన్న ముఖము నుండి ఋగ్వేదము, దక్షిణం వైపు ముఖము నుండి యజుర్వేదము, పడమట ముఖము నుండి సామవేదము, ఉత్తరపు ముఖము నుండి అధర్వణ వేదము సృజింపబడెను. ఇవి యజ్ఞములలో వినియోగింపబడును. ఇందు వరుసగా హోత మొదలగు నలుగురు చేయదగిన కార్యములకు ఉపయోగపడు మంత్రములు ఉండును.
శస్త్రము, ఇజ్య, స్థితిస్తోమము, ప్రాయశ్చిత్తము అను నాలుగింటిని నాలుగు ముఖముల నుండి వరుసగా సృష్టించెను. హోత చేయదగు దేవతా స్తోత్ర రూపములగు మంత్రములను శస్త్రము అందురు. వానిని హోత చెప్పవలెను. అందుచేత దానిని హౌత్రము అందురు. ఇజ్య. ఆధ్వర్యువు చేయవలసిన ప్రక్రియ దానిని ఆధ్వర్యువు చేయవలెను అందుచే దానిని ఆధ్వర్యవము అందురు సంగీత రూపముకు స్తోత్రమునకు ఉపయోగించు రుక్ సముదాయము స్తుతిస్తోమము అనబడును దీనిని ఉద్గాత గానము చేయును కనుక దీనిని ఔద్గాత్రము అనబడును. ప్రాయశ్చిత్తమును బ్రహ్మ చేయవలెను. ఈ నాలుగింటిని వినియోగించు మంత్రములు ఆయా వేదములుగా తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర ముఖముల నుండి ఆవిర్భవించినవి. హోత, అద్వర్యువు, ఉద్గాత, బ్రహ్మ అను నలుగురు ఈ నాలుగు క్రియలను ఆ మంత్రములతో చేయుచుందురు. అందుచే యజ్ఞమునకు చాతుర్హోత్రము అందురు. యజ్ఞములను దానిలో ఆ ఋత్విక్కులు వినియోగించడి మంత్రములను సృజించి బ్రహ్మ ఉపవేదములను కూడా సృజించెను. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వము. స్థాపత్యము అనేవిడి నాలుగు ఉపవేదములను వరుసగా నాలుగు ముఖములచే బ్రహ్మ సృజించెను. ఆయుర్వేదము రోగములకు చికిత్స మొదలగునవి నిరూపించు శాస్త్రము. ధనుర్వేదము, ధనుర్విద్య, గాంధర్వము, సంగీత శాస్త్రము. స్థాపత్యము, శిల్పశాస్త్రము ఇట్లు వేదములను, ఉపవేదములను సృజించిన తరువాత ఇతిహాస పురాణములను పంచమ వేదముగా సృజించెను. ఇవి అన్నియు ముఖమున నుండి వెలువడెను. తరువాత కర్మకాండను సృజించెను. ఉక్త్యము అను రెండు కరములను తుర్ముఖము నుండి, పురుషి అగ్నిష్టుత్ అనే రెండు కరములను దక్షిణ ముఖము నుండి, అప్తోర్యామము అతిరాత్రము అను వానిని పశ్చిమ ముఖము నుండి, గోసవము వాజపేయము అను వానిని ఉత్తర ముఖము నుండి సృజించెను. ఇట్లే ధర్మమునకు విద్యా, దానము, తపస్సు, సత్యము అనే నాలుగు పాదములను సృజించెను. బ్రహ్మచర్యము, గార్హస్త్యము, వానప్రస్థము, సన్యాసము అనే నాలుగు ఆశ్రమములను సృజించెను. ఆ ఆశ్రమములలో ఆచరించవలసిన వృత్తులను కూడా సృజించెను. బ్రహ్మచర్యాశ్రమమున గాయత్రీ మంత్రమును అనుష్టించుట, స్త్రీ సంఘము లేకుండా ఉపనయనం మొదలు గాయత్రిని జపించుట.
మూడు రాత్రులు ప్రాజాపత్య వ్రతం ఆచరించుట, వేదములు పూర్తి చేయునంత వరకు బ్రహ్మచర్యమును పాటించుట, బ్రహ్మచర్యమునే స్థిరముగా ఉండిపోవుటచే నైష్ఠికము. అనే వృత్తులను బ్రహ్మచర్యమున చేయదగినవిగా సృజించెను. కృషి అనగా వ్యవసాయము మొదలగునవి చేయుట, ధనమును ఆర్జించుట, యాచించకుండా జీవనమునకు కావలసిన ద్రవ్యమును సంపాదించుట, వరి వెన్నులను పొలములో ఏరుకొనుట, గింజలను ఏరుకొనుట అనే వృత్తులను. గృహస్తుడు ఆచరించవలెను. అడవులలో నుండి వానప్రస్థులు నాలుగు విధములుగా ఉందురు. వైఖానసులు దున్నకుండా భూమిపై బడి మొలచిన పంటలను భుజించువారు. వాలకిల్యులు కొత్త ఆహారము లభింపగానే తన వద్ద ఉన్నవానిని పరిహరించువాడు. కుదుంబరులు తాము లేవగానే ఏ దిక్కును చూతురో ఆ దిక్కు నుండియే ఆహారమును సంపాదించి జీవించువారు. ఫేనపులు నురుగు త్రాగి జీవించువారు ఇట్లు వానప్రస్తులు నాలుగు విధములుగా ఉందురు. సన్యాసులు కూడా నాలుగు విధములుగా ఉందురు. కుటీచకుడు. బహూదకుడు, హంసుడు, పరమహంసుడు, కుటీచకుడు సన్యాస ఆశ్రమముందలి ధర్మములను వదలక పాటించువాడు. బహూదకుడు కర్మను ప్రధానముగా ఆచరింపక జ్ఞానమునే ప్రధానముగా స్వీకరించువాడు. హంస జ్ఞానాభ్యాసమునందే నిష్ట గలవాడు. పరమహంస తత్వమును పరిపూర్ణముగా ఎరింగి ఉండుటచే ఏ వ్యాపారం లేనివాడే ఉండువాడు. ఇవి కాక బ్రహ్మ నుండి అన్వీక్షకి, త్రై, వార్త, దండనీతి అని నాలుగు విద్యలు ఆవిర్భవించెను. ఆత్మ అనాత్మ అనేటి వివేకమును ఎరింగెడి విద్య అన్వీక్షకి దీని వలన మోక్షములు ఫలించును. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను మూడు వేదములకు త్రై అను పేరు. వానిచే స్వర్గము మొదలగు ఫలములను పొందుటకు కర్మలను ఆచరింతురు. కృషి, వాణిజ్యము, వడ్డీ వ్యాపారం అనునవి వార్త అనబడును. దీనిచే జీవనమునకు కావలసిన పదార్థములు, ధనము లభించును. దండనీతి అర్థమును సాధించుటకు ఉపయోగించును. ఇట్లే బ్రహ్మ నాలుగు ముఖముల నుండి భూ, భువః, సువః, మహాః అనే నాలుగు వ్యాహృతులు బయలు బడలెను. బ్రహ్మ యొక్క రోమముల నుండి ఉష్ణిక్ అనే ఛందము.
చర్మము నుండి గాయత్రీ ఛందము, మాంసము నుండి త్రిష్టుప్ అనేటి ఛందము, అనుష్టుప్ అనేటి ఛందము, ఎముకల నుండి జగత్ అనేటి ఛందము, మధ్య నుండి పంక్తి అనేటి ఛందము, ప్రాణము నుండి బృహతి అనేటి ఛందము ఆవిర్భవించెను. అక్షరములలో క మొదలు మా వరకు ఉండెడి అక్షరములు బ్రహ్మ యొక్క జీవము నుండి బయలు వెడలెను. ఇంద్రియముల నుండి ష ష స హ అనునవి బయలు వెడలెను. బలము నుండి య ర ల వ అను అంతస్తులు ఆవిర్భవించెను. ప్రజాపతి విలాస సంచారము నుండి సప్త స్వరములు బయలు వెడలెను. శబ్ద బ్రహ్మము కూడా బ్రహ్మాత్మకమే. ఈ శబ్ద బ్రహ్మమే బ్రహ్మ శరీరము. వ్యక్త అవ్యక్త రూపముగా ఉన్న చతుర్ముఖ శరీరమందు ఆయా తత్వములు ఆవిర్భవించెను. ఆ చతుర్ముఖ బ్రహ్మ నుండి అతని శరీరముగానే వెలువడిన శబ్ద బ్రహ్మము కూడా అనేక విధములుగా లోకమును విస్తరించినది. ఈ శబ్ద బ్రహ్మాత్మకముకు శరీరమును గాక వేరొక శరీరమును స్వీకరించి సృష్టి సాగించవలెనని అతడు సంకల్పించెను. సంతానమును సృజించే సామర్థ్యము గల ఋషులు. సృష్టి చేయవలెనని అతడు సంకల్పించెను. నేను ప్రయత్నము చేసినను సంతతి వృద్ధి చెందుట లేదు, ప్రజావృద్ధిలో దైవం ప్రతిబంధకముగా ఉన్నది అని తలంచి బ్రహ్మ తన రూపమును రెండివిగా విభజించెను. ఆ రెండు భాగములుగా మారిన బ్రహ్మ శరీరమును కాయము అనిరి. ఆ రెండు భాగములచే మిధునము ఏర్పడెను. స్త్రీ పురుష జంట ఏర్పడినది. ఇంతవరకు. బ్రహ్మ శరీరం నుండే సృష్టి సాగినది. ఇక్కడి నుండి మిధున సృష్టి ప్రారంభమైనది. బ్రహ్మ నుండి ఏర్పడిన పురుష భాగము స్వయంభువ మను అను పేరు గల వాడాయను. స్త్రీ రూపమైన రెండవ భాగము శతరూప ఆయెను. ఆమెయే స్వాయంభీయ మనువుకు మహిషి అయెను. అప్పటి నుండి మనువు శతరూప అను జంట నుండి సృష్టి వృద్ధి పొందెను. ఆ మనువునకు శతరూప యందు ఐదుగురు బిడ్డలు కలిగిరి. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇద్దరు కుమారులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు జన్మించిరి. అందు ఆకూతిని రుచి అని పేరుగల మునికిని. రెండవ ఆమెయగు దేవహుతిని కర్దముడు అను మునికిని ప్రసూతిని దక్షిణకును వసంగెను వీరి వలననే విశ్వమున ప్రజావృద్ధి జరిగెను
విదురుడు మైత్రేయుడు చెప్పిన కథను విని వాసుదేవ కథయందు ఆదరము కలవాడై బ్రహ్మ కుమారుడు స్వయంభువ మనువు శతరూప అను భార్యను పొంది ఏమి చేసెను? అతడు భగవానుని ఆశ్రయముగా విశ్వయించిన వాడు కదా అట్టి రాజుకు స్వయంభువ మనువు చరిత్రమును ఎరిగింపుము ఎవరి హృదయములలో ముకుంద పదారవిందము ధ్యానింపబడుచుండునో అట్టి భాగవతుల యొక్క గుణములు వినుట చిరకాలము ఆర్జించిన అధ్యయమునకు ఫలము అని విద్వాంసులు చెప్పిరి. కనుక ఆమె చరిత్రము నాకు ఎరంగింపుము. విదురుడు కోరగా భగవానుడు అత్యంత ప్రీతిపాత్రుడు అగు విదురుని ప్రశ్న విని ఆనందించిన మైత్రేయుడి ఇట్లు చెప్పుచుండెను. సో స్వయంభువ మనువుతో జరిగినటువంటి చరిత్ర ఏమిటి అనేది మనము మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. May the power of the three forces be with us. May the self-controlled one be in my mind. Salutations to the formless one. May speech be full of power, may knowledge be full of power, may action be full of power, may strength be full of power, may everything be Salutations to the one who showers, to the one who is in the form of ego, to the one who is in the form of the mind's desire, to the one who is in the form of the glory of speech. Fourth Canto, 24th Chapter, 43rd Prayer. Devotees of God, welcome to the 16th podcast of Srimad Bhagavata Tattvadipika, Third Canto. Until now, what happened from the conversation between Vidura and Maitreya, how did Prajapati create inside, and how did Rudra manifest? What are those places? We'll see what happens next. He is still asking. Let's experience what answer the question gives us. Vidur again questioned Maitreya, Brahma created the Vedas and other things from the various parts of his body, right? From which part did he create what? Maitreya is saying, Brahma has four In all directions, four faces The Rigveda was created from the east-facing face, the Yajurveda from the south-facing face, the Samaveda from the west-facing face, and the Atharvaveda from the north-facing face. These are used in yagnas. In this, there are mantras that are useful for four tasks that can be done in order.
The weapon, the yajna, the sthiti sthoma, and the praschitta, these four were created from four faces in a row. They take the mantras and weapons that are in the form of hymns to the deities. He must be told. Therefore, they call it a Houthru. Ijya. The process that the leader should do, the leader should do it. Therefore, it is called the leader. The collection of notes used for musical form and praise is called a stuti sthoma. This is called udgata gana. Therefore, this It's called the Awadh Tram. The expiation of guilt is to be done by Brahma. These four used mantras originated from the east, south, west, and north directions of the respective Vedas. Hota, Advaryuvu, Udgata, Brahma, these four perform these four actions with those mantras. Therefore, they perform Chaturhothram for the Yagnya. The sacrifices, in that, those priests, without using, created the mantras, and also created the Brahma Upavedas. Ayurveda, Dhanurveda, Gandharva. The establishments are four. The four Vedas are in sequence Brahma created the world with his mouth. Ayurveda is a science that proves the treatment of diseases and so on. Dhanurveda, Dhanurvidya, Gandharva, Sangeeta Shastra. Establishment, sculpture, thus after creating the Vedas and Upavedas, he created the history and Puranas as the fifth Veda. All of these emerged from the mouth. Then the ritual was created. Uktyamu, two hands from the east, Purushi Agnishtut, two hands from the south, Aptorayamu, Atiratramu, from the west He created the one called Gosavamu and Vajapeyamu from the north face. Thus, he created the four pillars of Dharma: education, charity, penance, and truth. Brahmacharyam, Grihasthya, Vanaprastha, and Sanyasa are the four ashramas created. He also created the professions to be practiced in those ashrams. In the Brahmacharya Ashrama, chanting the Gayatri mantra, without the presence of a female community, starting with Upanayanam, chanting the Gayatri.
Observing the Prajapatya Vrata for three nights, practicing celibacy until the Vedas are completed, and remaining steadfast in celibacy is Nishtikam. He created professions that can be done in Brahmacharya. Krushi means doing agriculture and other such things, earning money, earning the necessary wealth for life without begging, harvesting paddy and pulses in the field, harvesting grains, such professions. The householder practices the duty (sacred duty) of a householder. There are four types of rainforests. The Vaishnavas eat the crops that have sprouted on the earth without plowing. The cicadas, as soon as they get new food, will take care of the one who is with him. The Kudumbus, as soon as they wake up, live by earning food from the direction they look. Those who live by drinking foam, the rain-makers, are of four types. Sanyasis are also of four types. Kutichakudu. Bahudakudu, Hamsudu, Paramahamsudu, Kutichakudu is one who follows the dharmas in the Sanyasa Ashram without abandoning them. Bahudakudu karmaanu One who primarily accepts knowledge without practicing it. A swan is one who is devoted to the practice of knowledge. Because of having completely understood the essence of Paramahamsa, there is no one without business. Besides these, four arts emerged from Brahma: Anvishakti, Trigya, Varta, and Dandaniti. The knowledge of what is self and what is non-self, the skill of examining it, will lead to salvation. The three Vedas, namely Rigveda, Yajurveda, and Samaveda, are called Traya. They perform actions to obtain heaven and other fruits. Labor, commerce, and interest are called news. From this, the necessary materials and wealth for life will be obtained. It is used to achieve the meaning of discipline. Thus, from the four faces of Brahma, the four Vyahritis, namely Bhu, Bhuvah, Suvah, and Mahah, emerged. The meter of Ushnishak is from the hair of Brahma.
From the skin, Gayatri Chandam; from the flesh, Trishtup Chandam; from the bones, Jagat Chandam; from the middle, Pankti Chandam; from the life force, Brihati Chandam; these emerged. In the letters, the letters that begin with 'ka' until 'ma' emerged from the life of Brahma. From the senses, the sounds of 'sha', 'sha', 'sa', 'ha' etc. will emerge. From strength, the levels of Ra, La, Va emerged. From the playful movement of Prajapati, the seven notes emerged. The sound-brahman is also the Brahman itself. This sound-divinity is the bodily divinity. In the four-faced body, which is in an unmanifest and manifest form, those elements manifested. From that four-faced Brahma, the sound Brahma that emerged from his body also expanded the world in many ways. He resolved that this sound-divine should accept another body besides the body and continue the creation. Sages, who are able to create offspring. He decided to create. Even though I tried, the offspring did not grow, Considering that God is an obstacle in the prosperity of the people, Brahma divided his form into two. The Brahma body, which had become two parts, was called Kaya. The Gemini were formed by the pair. A male and female couple was formed. Until now. Creation proceeded from the Brahma body. The creation of the zodiac begins here. The male part formed from Brahma is called Swayambhuva Manu. The second part, which is in the form of a woman, is called Shatarupa. She became the great buffalo of Swayambhu Manu. From then on, creation grew from the pair of Manu and Shatarupa. That Manu had five children in Satarupa. Priyavrata and Uttanapada, two sons, and Akuti, Devahuti, and Prasuti, three daughters were born. And to the sage named Aakuti, who is known for his taste. The second woman, Devahuti, gave birth to Kardamudu, a sage, and Dakshina. It was through them that the world prospered
Vidurudu, having listened to the story told by Maitreya, having respect for the story of Vasudeva, Brahma's son, having obtained Swayambhuva Manu's wife named Shatarupa, what did he do? He is the one who has taken refuge in the Lord, isn't he? To such a king, knowing the history of Swayambhuva Manu, in whose hearts the lotus feet of Mukunda are meditated upon, to hear the virtues of such devotees, having earned it for a long time Scholars have said that it is the fruit of the study. Therefore, let her history be revealed to me. Vidura, as requested, was very pleased to hear the question of Vidura, who is very dear to the Lord. Maitreya, thus speaking, was delighted. So, let's find out in another podcast what is the history of Swayambhuva Manu. Jai Srimannarayana and salutations to the Ashmadguru.