ప్రహ్లాద విద్యాభ్యాసము & నవవిధ భక్తి (Parts 4-6)
Prahlada's Education & Ninefold Devotion (Parts 4-6)
ఈ ఎపిసోడ్‌లో శ్రీమద్భాగవతంలోని అత్యంత పవిత్రమైన కథాభాగమైన ప్రహ్లాద చరిత్రను విశేషంగా వివరిస్తున్నాము. హిరణ్యకశిపుడి ఆజ్ఞపై చండామర్కుల గురుకులానికి పంపబడిన ప్రహ్లాదుడు అక్కడ కూడా తన సహాధ్యాయులకు విష్ణుభక్తి యొక్క మహిమను బోధించాడు. భక్తి యొక్క తొమ్మిది విధానాలైన శ్రవణం, కీర్తనం, స్మరణం మొదలైన నవవిధ భక్తి మార్గాలను ప్రహ్లాదుడు ఎంతో సులభంగా మరియు హృదయంగమంగా వివరించాడు. ఈ ప్రవచనం భగవంతుని పట్ల అచంచలమైన భక్తి కలిగి ఉండటం యొక్క గొప్పతనాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.
In this episode of our Srimad Bhagavatham series, we explore the remarkable spiritual journey of young Prahlada, who remained unwavering in his devotion to Lord Vishnu even within the demonic household of Hiranyakashipu. Despite being sent to the gurukula of Chanda and Amarka to learn the ways of power and politics, Prahlada continues to immerse himself in the glories of the Lord and inspires his fellow students with his divine wisdom. The episode also illuminates the profound teaching of Navavidha Bhakti — the nine-fold path of devotion — as expounded by Prahlada himself, encompassing practices from Shravanam and Kirtanam to Atma-nivedanam.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నాస్తా ధర్మే నవసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వ కర్మానురూపం ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మ జన్మాన్తరేపి త్వత్పాదాంభోరుహ యుగగతా నిశ్చలా భక్తిరస్తు ఓ కృష్ణా ధర్మమును ఆర్జింపవలెనని గాని అర్థమును కూడబెట్టవలెనని కానీ కామములను అనుభవింపవలెనని కానీ నాకు కోరిక లేదు. నా పూర్వ కర్మమును అనుసరించి ఏది ఎట్లు జరగవలెనో అట్లు జరుగుగాక. ఈ జన్మ యందు గాని జన్మాంతరమందు గాని నీ పాదారవిందముల యందు నాకు నిశ్చలమగు భక్తి కలగవలెనదే ఒక్కటే నా అభిమతమగు కోరిక. ముకుందమాల సిక్స్త్ ప్రేయర్ భవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వ దీపిక సప్తమ స్కంధం. నాలుగవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు హిరణ్యకశిపుడు జననము తరువాత తన యొక్క తమ్ముడు. హిరణ్యాక్షుడి యొక్క మరణము సంభవించిన తర్వాత తను తపస్సు చేసుకోవడానికి వెళ్లి బ్రహ్మ నుండి ఎన్నో కోరికలను తీసుకొని వచ్చిన తర్వాత లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బాధించడం ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. అదే సమయంలో ప్రహ్లాదుని యొక్క జననం కూడా జరిగింది. ప్రహ్లాదుడు ఎలా భగవత్ తత్వం వైపు ఉన్నాడు ఆ భాగాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. పుట్టిన దగ్గర నుండి ప్రహ్లాదుడు పెద్దలకు సేవించువాడు పెద్దలను అంతటా వ్యాపించి ఉన్న నారాయణ తత్వమునందు అనురాగము కలవాడు. మంచి స్వభావము, మంచి నడవడిక కలవాడు, ఆడిన మాట తప్పనివాడు, ఇంద్రియములకు వశపడనివాడు, సర్వభూతములకు తాను హితమునే కోరువాడు.
పెద్దల యెడ దాసుని వలె ప్రవర్తించువాడు, దీనుల యెడ తండ్రి వలె దయచూపువాడు, తన తోటి వారి యందు సోదరులతో సమానముగు భావము గలవాడు, గురువులను ఈశ్వర భావముతో చూచువాడు, చదువు, ధనము, సౌందర్యము కలవాడైనను అహంకారము, గర్వము, విడంబనము లేనివాడు. ఆపదలు కలిగినప్పుడు కూడా మనసు చెదరనివాడు, ఐహికములైన భోగములందు కాంక్ష లేనివాడు, ఇంద్రియములను, ప్రాణమును, మనస్సును, బుద్ధిని, శరీరమును తన ఇష్టం వచ్చినట్లు మంచిగా నడుపుకొనగలవాడు. దేని పైనను కామము లేనివాడు సంతతము సర్వత్ర భగవాను దర్శించి ప్రేమించువాడు భగవానుడగు వాసుదేవుని యెడల జన్మసిద్ధమగు ప్రేమ గలవాడు చిన్నతనములో కూడా ఆట వస్తువులతో ఆడుకొనుటకు అతనికి రుచింపలేదు. కృష్ణా, గోవిందా అని వానినే సర్వత్రా భావించుచు వానినే స్మరించుచు ఈ లోకమును మరిచి ఉండెడువాడు. కూర్చున్నను, తిరుగుచున్నను, నిలుచున్నను, పరున్నను, త్రాగుచున్నను, మాట్లాడుచున్నను భగవన్ నామమునే స్మరించువాడు. ఒక్కొక్క చోట. ఆ భగవంతుని స్మరించుచు ఏడ్చుచుండెడివాడు. ఒకప్పుడు బిగ్గరగా అరుచుచుండెడివాడు. ఒకప్పుడు సిగ్గు లేక నృత్యము చేయుచుండెడివాడు. ఒకప్పుడు కృష్ణ భావన నిండి కృష్ణుని వలె నటించెడివాడు. ఒకప్పుడు ఆ వాసుదేవుని స్పర్శ లభించి ఆనంద పరవశుడై కన్నులు మూసుకొని ఒడలు గగుర్పొడచి ఏదో తెలియని ఆనందములో మునిగి ఉండేడివాడు. ఇట్టి మహా భాగవతుడగు మహాత్ముని హిరణ్యకశిపుడు తన కుమారునిని కూడా భావింపక హింసింపదొచ్చినాడు. ఏమి ఆశ్చర్యం? సాధారణముగా తండ్రులు పిల్లలపై మమకారముచే వారు తమకు ఎదురు తిరిగినను దుర్మార్గులైనను ప్రేమింతురు లాలింతురు కానీ దండింపరు.
కానీ ఈ అసురుని అసురత్వము ఎంత పరాకాష్టకు చెందినదో పరమ భాగవతుడైన సద్గుణశాలి అయిన కుమారుని కూడా ద్వేషించుచున్నాడు. భగవంతుని ద్వేషించుట మాత్రము దోషము కాదు. ఆ భగవంతుని ప్రేమించిన వారిని ద్వేషించి హింసించుట అసురత్వమునకు పరాకాష్ట. దేవుడు లేడనియు దేవుని అంతమొందించవలెనని ప్రయత్నించినను దేవుడు బాధపడడు. శిక్షింపడు. అతనికి హాని లేదు. దేవుని ప్రేమించిన వారిని దూషించి ద్వేషించి హింసింప చూచుట కంటే అసురత్వము లేదు. అదే. అతని వినాశ హేతువైనది. హిరణ్యకశిపునకు పురోహితుడు శుక్రాచార్యుడు. వారి కుమారులు చండ్రుడు, అమర్కుడు అను వారిద్దరూ ఈ ప్రహ్లాదునకు అధ్యాపకులుగా నియమించబడింది. ప్రహ్లాదునకు సహాధ్యాయులుగా అసుర బాలకులను కొందరిని చేర్చి గురుకులమున విద్యాభ్యాసం ఆరంభింపచేసిరి. గురువులు పాఠములను ప్రారంభించిరి. ప్రహ్లాదుడు వానినన్నింటినీ గ్రహించుచుండెను. మరలా అప్పజెప్పుచుండెను. కానీ వారి పాఠములలో ఇది స్వపక్షము, ఇది పరపక్షము అని అభిప్రాయ భేదములు చెప్పుచుండుట ప్రహ్లాదునకు నచ్చలేదు. మనది పైవారిది అను విభాగం ఎట్లు పొసగును? అంతయు వాసుదేవునికే చెందినది కదా? జగమంతయు వాని చేతనే నడిపింపబడినప్పుడు అంతయు వానిదే అగును కదా? కానీ మనది అనుకొనుట పొరపాటు కదా అని ప్రహ్లాదుడు భావించుచుండును. రాక్షసులకు శత్రుపక్షము దేవతలు. అందుచే వారు వేరు, తాము వేరు అని చిన్నతనము నుండి నేర్పవలెనని గురువుల ప్రయత్నం. ఇదే ఇప్పటికిని మన విద్యాభ్యాసములో జరుగుచున్న లోపం. జగమునంతను ఏకముగా తరతమ భావములు వదిలి స్వపర భేదములు లేక ప్రేమించునట్లు పిల్లలను తీర్చిదిద్దుటకు వాసుదేవ తత్వమును వాసుదేవ భక్తిని నేర్పుట అత్యంత ఆవశ్యకం. అది తెలిసిననాడు విశ్వమంతయు వాని శరీరముగా వ్యక్తులందరు వాని అవయవములుగా గోచరించుటచే ఒకరిపై ఒకరికి ద్వేషము గానీ హేయ భావము గానీ కలగదు.
ప్రహ్లాదుని కథచే ఎరుంగవలసిన రహస్యము సమత్వము. సమత్వమారాధనం అచ్యుతస్య సర్వమున సమత్వమును దర్శించుటయే అచ్యుతుని యొక్క ఆరాధనం. ఒకనాడు కుమారిని విద్యాభ్యాసమును పరీక్షింపవలెనని హిరణ్యకశిపునకు కోరిక కలిగినది. కుమారిని ఒడిలో కూర్చోబెట్టుకొని బాబు నీకేది లెస్సై అని తోచినదో దాని చెప్పుము అని అడిగెను. ప్రహ్లాదుడు దేహమును ధరించిన ప్రాణులందరకు ఇదే చాలా మంచిది అని తోచుచున్నది తనది కాని దానిని తనదని భావించి మనస్తాపముతో కృంగుచున్న ప్రాణికోటికి ఇదే శాంతినిచ్చును ఇల్లు అను చీకటి నూతిలో తాను పడకుండా కాపాడుకొనుటకు మంచి మార్గము హరిచరణ సమాశ్రయం ఒక్కటే. ఈ మాట వినగానే హరిని ద్వేషించు తండ్రి సహించలేకపోయెను. విష్ణువు తనకు సంబంధించిన వాడు కాడని అతడు తనకు శత్రువని హిరణ్యకశిపుని భావన. కొందరు విష్ణు పక్షమునకు చెందిన వారుందురనియు వారు తమ పిల్లవాని బుద్ధిని పాడు చేసినారనియు తలంచినాడు. కానీ అందరం విష్ణు పక్షీయులమే అని అతనికి తెలియదు. అంతటా వ్యాపించి ఉండేవాడే కదా విష్ణువు. అతను హిరణ్యకశిపునిలో ఉండును, ప్రహ్లాదునిలో ఉండును. అది తెలియక అతడు వేరు, తాను వేరు అని భావించి, అతడు తనలో లేడని భావించి, తన కుమారుని ఆ విష్ణు పక్షం వారు చెరిచినారని భావించినాడు. గురువులను ఎవరు ఇతనికి ఇట్టి దుర్బోధన చేయుచున్నారో కనుగొనుడు అని ఆజ్ఞాపించెను. ఈ బుద్ధి సహజముగా అందరుకు కలగవలసినదే కానీ రజస్తమో గుణములు అధికమై ఉన్న అసురులకు రాక్షసులకు అది నిరోధింపబడును. అందుచే హిరణ్యకశిపునకు ఎవరో కలిగించిరి అని అనిపించినది. గురువులు నీకెవరు ఈ బుద్ధిని గరిసినారు? నీయంతట నీకే కలిగినదా? ఒకరు చెప్పినదా అని ప్రహ్లాదుని ప్రశ్నించినాడు. ప్రహ్లాదుడు చాలా చక్కగా సమాధానం చెప్పినాడు. ఇది నాది, ఇది వారిది, వీడు నావాడు, వీడు పైవాడను ఏ భేదబుద్ధి ఎవరి ఆశ్చర్యకరమైన మోహజనకమైన మాయచే కలుగుచున్నదో అట్టి భగవానునకు నమస్కారం. దేహములు వేరు, దేహములు వేరు.
వేరు వేరు రూపములతో ఉండును. కానీ ఆత్మ అందరిలోనూ ఏకరూపముగా ఉండును. ఆత్మలన్నిటిలోనూ పరమాత్మ వ్యాపించి ఉండును. అజ్ఞానముచే ఈ దేహమే నేను అని బుద్ధి కలుగును. ఆ బుద్ధిచే తాను ఇతరులు వేరుగా ఆ దేహమునకు చెందిన పదార్థములు వేరుగా కనపడును. దేహములలోను దేహములలోని ఆత్మలలోను ఒకే తత్వము ఎడతెగగా వ్యాపించి ఉన్నది. అది తెలిసిన వారికి పైన కనబడు భేదము వాస్తవము కాదని ఇవి అన్నియు లోపల నుండు ఒకే తత్వమును చెందినవనియు తెలియును. వారికంతా అభిన్నముగా కనపడును. ఇది తెలిసిన వారికి శరీర మూలము శరీర మూలమున కలిగిన తన పర అను భేదము నశించును. ఇది వాసుదేవ నారాయణ శబ్దముల అర్థము. వారి అనుగ్రహముచే వానిని దర్శింపగలిగిన వారికే సమత్వ బుద్ధి కలుగును. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాదులు కూడా దీన్ని గుర్తించలేరు. సూదంటు రాయి ఇనుమును ఆకర్షించుట ఎట్లు సహజమో అట్లే నారాయణ తత్వము ఆత్మలను తన వైపు ఆకర్షించుచుండును. అంతటను దర్శనమిచ్చును. అందుచే తాను పైవారు అను భేదము నాకు గోచరించుట లేదు అని ప్రహ్లాదుడు గురువులకు విన్నవించెను. ఐదేళ్ల పసివాడు చెప్పినది గురువులకు కూడా తెలియని వేదాంతం. ఇది కొంటెతనం. ఇది మన రాక్షస జాతికి విరుద్ధం. ప్రభువుకు అనభిమతము. వీనిని ఈ దారి నుండి మరలించవలెను అని తలంచి అధ్యాపకులకు శిష్యులను శిక్షించుటకు సాధనమైన వేత్రము అంటే బెత్తము స్వీకరించి దండింపబోనిది. రాక్షస వంశము చందన వనము అందు నీవు ముళ్ళ మొక్క వలె పుట్టితివి. ఒక్క చెట్టు కర్ర గొడ్డలికి కాముగా అమరి చెట్లను అన్నిటినీ నాశనం చేయించినట్లు నీవు విష్ణు పక్షములో చేరి రాక్షస వంశానికి వినాశ హేతువు కానున్నావు అని గురువులు భయపెట్టినను అతడు మారలేదు. కానీ విధేయుడై వారు చెప్పిన ధర్మార్థ కామములను ప్రతిపాదించు శాస్త్రములను సామ దాన భేద దండోపాయములను గ్రహించినాడు. అడిగినవన్నీయు గురువులకు చెప్పినాడు. ఇంకా తండ్రి పరీక్షకు నిలుచునని ధైర్యముగా
తోడి తెచ్చినారు కుర్రవానిని హిరణ్యకశిపుని వద్దకు. హిరణ్యకశిపు వద్దిన తరువాత మరి తను ఎలా జవాబు మళ్ళీ ఇచ్చాడో మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Not for the sake of new worldly pleasures, but for the sake of righteousness, not for the sake of desire, whatever is happening, may it be. O Lord, according to the past deeds, this is what I pray for, this is what is bestowed upon me. May devotion, steadfast like the lotus feet of your feet, which have been established since time immemorial, be bestowed upon me. O I have no desire to acquire Krishna's dharma, nor to accumulate wealth, nor to experience desires. May my past karma not be followed by what should not happen. Whether in this birth or in the next birth, may I have unwavering devotion to your lotus feet. That is my only desire. Mukundamala Sixth Prayer, O devotees of Bhavadbandhus, Srimad Bhagavata Tatva Deepika Saptama Skandham. Welcome to the fourth podcast. Until now, Hiranyakashipu, after his birth, his brother. After Hiranyaksha's death, he went to do penance and after bringing many desires from Brahma, he troubled all the people in the world, we have learned about that. At the same time, the birth of Prahlada also It happened. Let us learn today how Prahlada was towards the divine essence. From birth, Prahlada was one who served the elders, one who had affection for the Narayana principle that is spread throughout the elders. One with good character, good conduct, one who does not break his word, one who is not subject to the senses, one who desires good for all beings.
He who acts like a servant towards elders, shows mercy like a father towards the humble, has a feeling of equality with his fellow men and brothers, views teachers with the feeling of God, even if he is educated, wealthy, and beautiful, ego, Of dignity and irreproachable character. He who does not lose his mind even when in distress, he who has no desire for worldly pleasures, he who can control his senses, life force, mind, intellect, and body as he pleases. He who is without lust upon anything, constantly seeing and loving the Lord everywhere, having a birthright love for Lord Vasudeva, even in his childhood, he did not like to play with toys. Krishna, Govinda, considering him everywhere, remembering him, the one who forgets this world. He who sits, who walks, who stands, who is standing, who is lying down, who is drinking, who is talking, remembers the name of the Lord. At each stage. He was crying while remembering God. Once upon a time, there lived a man who could shout really loud. Once upon a time, without shame The dancer. Once upon a time, there was a person filled with Krishna consciousness and acted like Krishna. Once upon a time, he was in a state of bliss after receiving the touch of that Vasudeva, closed his eyes, and his body trembled, immersed in some unknown joy. Thus, Hiranyakashipu, a great devotee of the Lord, could not even think of harming his son without considering him as his own. No surprise. Generally, fathers, out of affection for their children, even if they turn against them and become wicked, they love and caress them, but do not punish them.
But this demon's demonic nature, to what extent it belongs, even hates the supremely virtuous and virtuous son. Hate God is not a crime. Hating and torturing those who love God is the ultimate act of demonic nature. Even if one tries to say that God does not exist and that God should be destroyed, God will not be hurt. He will not be punished. He has no harm. There is no greater heresy than to despise, hate, and persecute those who love God. That is it. It is the cause of his destruction. Hiranyakashipu was prophesized to be killed by Shukracharya. Their sons, Chandra and Amar, were appointed as his teachers. Prahlada was enrolled as a student with some demon boys and started his education in the gurukul. The teachers have started the lessons. Prahlada was able to grasp all of them. He was asking again. But Prahlada did not like them saying that this is their own side and this is the other side in their lessons. How is ours and theirs a division Will it be okay? Is it all belonging to Vasudeva? When the whole world is led by him, then everything becomes his, isn't it? But Prahlada thought that it was a mistake to assume that it was ours. The Devas are the hostile wing of the Rakshasas. Therefore, the gurus' effort is to teach them from childhood that they are different and they are different. This is the flaw that is happening in our education system even now. To shape children in such a way that they love the whole world unitedly, without leaving behind different feelings, and without any selfish differences, it is extremely essential to teach the Vasudeva principle and Vasudeva devotion. When that is known, the entire universe appears as his body, and all individuals appear as his limbs, so there is no hatred or disgust towards one another.
The secret and balance to be learned from the story of Prahlada is equanimity. The worship of Achyuta is to see the equality in everything. Once upon a time, Hiranyakashipu desired to test the virtue of a maiden. He asked the girl, "Sit in my lap, son. Tell me what you want." Prahlada, it seems that this is very good for all the creatures that have taken on a body, considering that it is not his, and this will give peace to the creature that is depressed with remorse, without falling into the dark well that is the house The best way to protect oneself is to take refuge in the feet of Hari. Hearing this, the father, unable to bear the hatred for Hari, could not bear it. Hiranyakashipu's belief is that Vishnu is not his relative and that he is his enemy. Some thought that they belonged to Vishnu's side and that they had corrupted their child's mind. But he did not know that all of them were Vishnu’s devotees. Vishnu is the one who is present throughout. He is in Hiranyakashipu, in Prahlada He will be. Not knowing that, he thought he was different, he thought he was different, he thought he was not in himself, he thought that his son was wiped out by those on Vishnu's side. He commanded, "Find out who is giving this bad teaching to him." This intellect is naturally meant to be in everyone, but for demons and monsters who have excessive qualities like lust, it is resisted. Therefore, it seemed that someone had caused Hiranyakashipu. Who are your gurus? Did you get it yourself? He asked Prahlada whether he had heard someone. Prahlada gave a very good reply. This is mine, this is theirs, this is his, this is above him, whatever difference of mind, whatever surprising, delusive illusion is caused by, salutations to such a God. The bodies are separate, the bodies are separate.
It has different forms. But the soul is the same in everyone. The Supreme Soul pervades all the souls. Due to ignorance, the intellect arises that this body is me. By that intellect, he sees others as separate, and the substances belonging to that body appear separate. In the bodies and in the souls within the bodies, the same essence is constantly pervading. Those who know that the difference seen above is not real, and that all these belong to the same essence within, know that. They all seem to be in a state of shock. For those who know this, the difference between the body and the body, the difference between the self and the other, will be destroyed. It is the meaning of the words Vasudeva and Narayana. Only those who are able to see him through his grace will have equanimity. Sometimes even the Brahmaadis cannot sense this. Just as iron is naturally attracted to a magnet, similarly, the essence of Narayana attracts souls towards itself. Then it will give a vision. Therefore, Prahlada told his gurus that he did not perceive any distinction between himself and the superiors. What a five-year-old said Philosophy that even the gurus do not know. That's mean. It is against our race to do this. The Lord's Answer:. Thinking that he should be turned away from this path, she did not accept the whip, which was a means for the teachers and disciples to punish, but she did not go to punish. Rakshasa Vamshamu, Chandana Vanamu. There, you were born like a thorny plant. Like a tree, a stick, and an axe, you are destroying all the trees. You have joined the side of Vishnu and are the cause of destruction to the demon dynasty. Even though the gurus scared him, he did not change. But being obedient, he accepted the scriptures that propose the righteous and worldly desires, the methods of giving, charity, and punishment. He told everything that was asked. And father, stand firm in the exam
They brought the young man to Hiranyakashipu. After Hiranyakashipu's death, let's find out in another podcast how he gave the answer again. Jai Srimannarayana Asmat Gurubhyo Namaha