జడభరతుని తత్వోపదేశం (భాగం 1)

Jada Bharata's Philosophical Teachings (Part 1)

bhagavatam

శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్‌లోని ఈ అద్భుతమైన ఎపిసోడ్‌లో, రాజు రహూగణుడు మరియు జడభరతుని మధ్య జరిగిన అసాధారణమైన సమాగమాన్ని వివరిస్తాము. రాజు తన పల్లకీని మోసే జడభరతుని అస్థిరమైన నడకను గురించి మందలించినప్పుడు, జడభరతుడు శరీరం, ఆత్మ మరియు అహంకారపు మాయ గురించి గంభీరమైన తత్వసత్యాలను బోధిస్తాడు. నశ్వరమైన దేహానికి మరియు శాశ్వతమైన ఆత్మకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించే జడభరతుని ఉపదేశం ముముక్షువులందరికీ ఆత్మజ్ఞానమార్గాన్ని చూపిస్తుంది.

In this profound episode of the Srimad Bhagavatham podcast, we explore the remarkable encounter between King Rahugana and the sage Jada Bharata, whose divine wisdom hidden beneath a simple exterior leaves a lasting impression. When the king reprimands Jada Bharata for his unsteady pace while carrying the royal palanquin, the sage responds with deep philosophical truths about the nature of the body, the soul, and the illusion of ego. Jada Bharata's timeless teachings illuminate the difference between the eternal Atma and the temporary physical form, guiding all seekers toward true self-knowledge.

← Prev Next →
Jada Bharata's Philosophical Teachings (Part 1) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః తుభ్యం నమస్తే స్వవిషక్త దృష్టయే సర్వాత్మనా సర్వధియాంచ సాక్షిణే గుణప్రవాహోయమవిద్యయా కృతః ప్రవర్తతే దేవ నృతిర్యగాత్మసు నీ జ్ఞానము అసంగము. నీవు సకల ప్రాణులలో సకల బుద్ధివృత్తులకు సాక్షియగు ఆత్మవు. నీ స్వరూపము తెలియకనే అజ్ఞానులు. దేవ మానవ పశుపక్షాది దేహములయందు ఆత్మాభిమానము గలవారై సత్తరజస్తమోగుణ ప్రవాహమైన జనన మరణ రూపమగు సంసారమునందు కొట్టుకొని పోవుచున్నారు. నీకు నమస్కారమగు కాక. 10th కాంటో, 48th చాప్టర్, 12th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధం 16వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు జడభరతుని యొక్క వృత్తాంతాన్ని ఆ వృత్తాంతంలో భాగంగా జడభరతు బోధించినటువంటి భవాటవి వర్ణాన్ని, తత్వోపదేశాన్ని ఆయన రహుగణుడికి బోధించాడు. ఆ విషయాలని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు భరత మోశ వర్ణనని చూద్దాం. భరతుని కుమారుడు సుమతి. అతడు తాతగారగు వృషభుని మార్గమును అనుసరించి శరీరమునకై క్లేశము కలిగించు అవధూత మార్గమున సంచరించుచుండెను. అతడు వేదికమైన వైదికమైన కర్మాచరణము గాని భగవత్భక్తిని గాని స్వీకరించి ఉండలేదు. అతన్ని చూచి కొందరు పాషండులు కలి ప్రభావం చే చెడిన తన బుద్ధిచే అతని వలె విహిత కర్మలను ఆచరింపక శరీరమును క్లేశ పెట్టి విషయములను విడనాడి జీవించుటయే సూక్ష్మ ధర్మ మార్గమని ఆచరించిరి. అతనినే వేదములో చెప్పబడిన దేవతగా కల్పించుకొని అవధూతగా ప్రవర్తింపక మునుపు ధ్రువసేన అను భార్యయందు దేవజిత్తు అని పేరుతో అతనికి ఒక కుమారుడు

జనించెను. దేవజిత్తు భార్య ఆసురి. ఆసురి అను భార్య యందు అతనికి దేవద్యుమ్నుడు అను కుమారుడు కలిగెను. దేవద్యుమ్నుని భార్య ధేనుమతి. ఆమెకు పరమేష్టి అని కుమారుడు కలిగెను. పరమేష్టి భార్య సువర్చల. ఆమెకు ప్రతీహుడు అని కుమారుడు కలిగెను. అతడు చాలా మందికి ఆత్మవిద్యను ఉపదేశించెను. అట్లు ఉపదేశించుటచే నిర్మలమైన అంతఃకరణము గలవాడై పరమ పురుషుని ఉపాసించెను. ఆ సువర్చలకే ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అనడి ముగ్గురు కుమారులు జనించిరి. వారు ముగ్గురును యజ్ఞములను ఆచరించుటలో నేర్పుగలవారు. ప్రతిహర్త భార్య స్తుతి. ఆమెకు అజుడు, భూముడు అని ఇద్దరు కుమారులు కలిగిరి. ఆయనకు ఋషికుల్య యందు ఉద్గీధుడు అను కుమారుడు కలిగెను. ఉద్గీధునకు దేవకుల్య యందు ప్రస్తోత కలిగెను. ప్రస్తోతకు నియుత్స యందు విభు అను కుమారుడు కలిగెను. అతనికి భారతి యందు ప్రుదసేనుడు, అతనికి ఆకూతి యందు నక్తుడు, ఆ నక్తునకు ధృతి అను భార్య యందు గయుడు అను కుమారుడు కలిగెను. అతడు రాజర్షులో శ్రేష్టుడు, ఉదారము కీర్తి గలవాడు. జగత్తును రక్షింపవలెనని కోరికచే శుద్ధ సత్వ గుణములు గల భగవానుడు తన అంశచే గయుడుగా జన్మించెను. గయుడు భగవదంశ స్వరూపుడు ఒకటచే ప్రశస్తమైన మనస్సు కలవాడై మహాపురుషుడుగా ప్రసిద్ధి చెందెను. ఆ గయుడు తన వర్ణమునకు తగిన ధర్మముగా ప్రజా పరిపాలనము చేయుచుండెను. ప్రజలకు కావలసిన అన్నపానాదులను సమకూర్చి తృప్తిపరచుచు వారిని బిడ్డల వలె పాలించుచు మహాపురుషుడగు భగవానుని యందు మనసును నిలిపిన వాడై ఉండెను. భగవత్ చరణారవింద సంసేవముచే సంసేవనముచే భగవత్ భక్తి కలవాడాయను. అతడు భక్తి యోగముచే భక్తి యోగమును ఎల్లప్పుడూ ఆచరించుచుండెను. దానిచే అతని బుద్ధి పరిశుద్ధమై యుండెను. అందుచే అతనికి దేహమే ఆత్మ అని భ్రమ కలగలేదు.

తనలో తనకు ఆత్మగా నుండు పరమాత్మను సాక్షాత్కరించుకొని దానిని అనుభవించుచు ఈ భూమిని పరిపాలించుండెను. ఆ గయును మహాత్యమును ఇట్లు కీర్తింతురు. గయుడు ఆచరించినట్లు కర్మలను ఆచరించువారు వేరొకడు ఉండరు. అతడు వేదములలో చెప్పబడిన యజ్ఞములన్నిటిని కూడా ఆచరించినాడు. అందరి గౌరవమునందినాడు. వరణాశ్రమ ధర్మములను కాపాడినాడు. సభలో అందరిచే ఆరాధింపబడువాడై సత్పురుషులకు సేవకుడై శ్రద్ధ, మైత్రి, దయ, కీర్తి, శ్రీ, స్మృతి, మేధ, ధృతి, తితిక్ష, క్షమ. అను పేర్లతో ప్రవహించెడి దివ్య తేజోమయములగు నదులచే అభిషేకము అందినవాడు. దానితో అతడు శ్రేష్టుడాయెను. అతని గుణములను చూచి సంతోషించి భూమి అతడు ఏ కోరికలను కోరినా ఆ కోరికలను తానే సమకూర్చెను. వేదములు అతనికి కావలసిన సకల కాములను ఫలింపజేసెను. రాజులు యుద్ధములో అతనిచే బాణములచే పూజింపబడిన వారై కప్పములను సమకూర్చిరి. ధర్మ పరిపాలనము చేత, దక్షిణల చేత ఆరాధింపబడిన బ్రాహ్మణులు తాము ఆచరించిన ధర్మములోని ఆరవ భాగమును గైనుకు సమర్పించుచుండిరి. గయుడు యజ్ఞమును ఆచరించుండగా ఇంద్రుడు సంతసించి ప్రేమతో వచ్చి మధ్యలో విఘ్నము లేకుండా యజ్ఞము పూర్తి చేయించి సోమపానమును స్వయముగా స్వీకరించెను. ఆ యజ్ఞము పేరు ఉరుసోమపీథము. ఆ యజ్ఞములో సోమపానము చేసి అతడు సంతోషించుటచే బ్రహ్మ వరకు దేవతలందరూ సంతోషించిరి. గయుడు విశ్వజీవుడు అనగా విశ్వము అంతకు జీవము అయినవాడు. గయుడు భగవానుని నదిశయముగా ప్రేమించుటచే గయునకు తనను గూర్చిన భక్తి వసంగెను. గయునకు జయంతి అను భార్య యందు చిత్రరధుడు మొదలగు ముద్దురు కుమారులు ముగ్గురు కుమారులు కలిగిరి. చిత్రతునకు ఊరున యందు సమ్రాట్టును వానికి ఉత్కళ యందు మరీచియు మరీచికి బిందుమతి అను భార్య యందు బిందుమతుడను

అతనికి సరహ యందు మధువును, మధువుకు సుమనసానునామిని యందు త్వష్టాను కుమారుడును, త్వష్టకు విరోచన యందు విరజుడును, విరజునకు విశూచి యందు శతజిత్తు మొదలగు నూరు కుమారులు ఒక కన్యయు జన్మించిరి. ఇది అంతయు ప్రియవ్రతుని సంతతి. ఈ వంశము చాలా ప్రశంసిప్పదగినది. ఈ వంశమును శ్రీ మహావిష్ణువు అలంకరించినాడు. శుకుడు ప్రియవ్రత వంశమును చెప్పి చాలించిన తరువాత పరీక్షిత్తు మరల ఇట్లు ప్రశ్నిస్తున్నాడు. మహాశయా, మీరు ఈ భూమండలం యొక్క వైశాల్యమును చెప్పినారు. సూడు ఎంతవరకు ప్రకాశించునో, చంద్రుడు నక్షత్రములతో ఎంతవరకు కనపడునో అంతవరకు ఆ భూమి యొక్క వైశాల్యమును వివరించిరి. భూమియందు ప్రియవ్రతుడు రథముతో సంచరించుచుండుటచే ఆ చక్రముచే ఏర్పడిన గోతులు ఏడు సముద్రములు అయినవేని చెప్పినారు. ఆ సముద్రములకు మధ్యలో ఉండు భాగములు ఏడు ద్వీపములు అయినవేని చెప్పినారు. అట్లే భూమండలం యొక్క ప్రమాణమును ఎరుకగోరుచున్నాను. ఆ స్థూల ప్రపంచమునంతయు భగవాను స్థూల రూపమే కదా? దీనిని అవగాహించిన మనసే భగవాను సూక్ష్మము, అంగుష్ట పరిమాణము, శుద్ధ సత్వమయమును, స్వయం ప్రకాశమునగు వాసుదేవుని కూడా. అవగాహింప సమర్థమగును. అందుచే ఈ స్థూల రూపమున మాన లక్షణములతో ఎరంగింప గోరుచున్నాను. అంటే ఈ భూమి యొక్క లక్షణాలు నాకు తెలపమని చెప్తున్నారు అడుగుతున్నారు అన్నమాట. ఇట్లు పరీక్షిణ్ మహారాజు ప్రశ్నింపగా శుకయోగి ఇట్లు చెప్పుచున్నాడు. మహారాజా భగవాను శరీరమున ఏక దేశమగు సత్వరజస్తమో గుణములు గల ప్రకృతి పరిణామముచే ఏర్పడినదే ఈ అనంత బ్రహ్మాండములతో నిండిన లీలా విభూతి. ఇది ఇంత అని ఇట్టిదని మనసుచే వాక్కుచే ఎరిగి చెప్పగలుగుట శక్యము కాదు. దేవతామానముతో నీరు నూరు ఏళ్ళు ఆయుర్దాయమునను వర్ణింపజాలరు. ముఖ్యమైన వానిని ఈ భూగోళమున ఎరంగబడల్సిన వారిని నీకు వివరించెదను వినుము అని భూగోళ వర్ణనం మనకు చేస్తున్నారు. భూగోళ వర్ణనాన్ని మనము తర్వాత ఎపిసోడ్ ద్వారా మనం గ్రహిద్దాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Salutations to you. With a mind free from worldly attachments, with all your senses, with all your senses as witnesses, the flow of qualities is created by me, O God. The self-controlled ones are not attached. You are the soul that is the witness of all beings and all intellect. Ignorant of your form. Those who have self-respect in the bodies of gods, humans, animals, birds, and other creatures are wandering in the cycle of birth and death, which is the flow of the three qualities of passion, aversion, and neutrality. Not to mention you would be. 10th Kanto, 48th Chapter, 12th Prayer. Devotees of God, welcome to the 16th podcast of Srimad Bhagavata Tattva Deepika, the fifth book. Until now, as part of the story of Jada Bharata, he taught Rahuganudu the philosophy and teachings of Bhavatavi, which Jada Bharata taught. We have taken stock of those things. Now, let's move on to Bharatamosha Varna. Bharata's son was Sumati. He followed the path of Vrishabha, the grandfather, and was wandering in the path of the Avadhuta, which causes suffering to the body. He is a ritualistic, a ritualistic, a karmic actor He had never accepted the devotion of God. Seeing him, some heretics, influenced by the influence of the sect, did not practice the prescribed duties like him, but rather, they lived by abandoning worldly matters, causing suffering to the body, and practicing the subtle path of righteousness. He, having been conceived as a deity mentioned in the Vedas, before acting as an Avadhuta, had a son named Devajit with his wife Dhruvasena

He was born. Devajit's wife was Asuri. In Asuri, a wife named, to him, a son named Devadhyumna was born. Dhenukamati was the wife of Devadayumna. She had a son, Parameshti. The consort of Parameshwara, Suvarchala. She had a son, Pratihad. He taught the philosophy of self-knowledge to many people. Thus, having purified his inner self by preaching, he worshipped the Supreme Being. Suvarchala had three sons, Pratiharta, Prastota, and Udgata. The three of them were skilled in performing yajna. Praise be to you, wife of the Praharta. She had two sons, Ajjuda and Bheumudu. He had a son named Udgitha among the sage-kings. Udgitha was invited to Devakula. A son named Vibhu was born to the prophetess Niyutta. To him, Prudasena was born in Bharati, to him, Naktu was born in Akuti, and to that Naktu, Dhruti, a wife, had a son named Gayudu. He is the best among the Rajarshis, generous and full of glory. With the desire to protect the world, possessing pure sattva qualities The Lord took birth as Gayu. Gayudu, who is the embodiment of the divine essence, possessed a mind that was praised by one, and became famous as a great man. That Gayudu was governing the people according to the dharma appropriate to his caste. He was the great man who, having provided and satisfied the people with the food and drink they needed, raised them like children, and remained mindful of the Lord. He is one who has devotion to God through service to the lotus feet of the Lord. He always practiced Bhakti Yoga through Bhakti Yoga. And his mind was filled with holiness. Therefore, he did not have the illusion that the body itself was the soul.

He realized the Supreme Soul as his own self, experienced it, and ruled this earth. They praise Gayu and Mahatyamu like this. There is no one else who practices karma as Gayudu has practiced. He performed all the sacrifices mentioned in the Vedas. He was respected by all. He protected the dharma of the forest hermit. Being worshiped by everyone in the assembly, being a servant to the virtuous, devotion, friendship, kindness, fame, glory, memory, intelligence, fortitude, patience, forgiveness. He who has been anointed by the divine, radiant rivers flowing with names. With that, he became superior. Seeing his qualities, the earth was pleased, and whatever desires he desired, he himself fulfilled those desires. The Vedas made him the fulfiller of all desires. The kings, in the war, having been worshiped by him with arrows, gathered tributes. The Brahmins, who were worshiped by the Dharma administration and the southerners, were offering one-sixth of the Dharma they practiced to the Gayan. While Gayudu was performing a yagna, Indra, pleased, came with love Without any obstacles in between, he completed the Yagnya and accepted the Somapanam himself. The name of the yajna is Urusoma Peetham. In that yajna, after performing the Somapana, he rejoiced, and all the gods were pleased with Brahma. Gayudu is the Viswajeevudu, meaning he is the life of the universe. Gayudu, by loving the Lord as his own, attained devotion to himself. Gayuna had three beloved sons, Chitrarathudu and others, with his wife Jayanti. Chitrathuna, in the town, the emperor, in Utkala, Marichi, and Marichi's wife Bindumati, Bindumati

To him, in the canal, Madhu, to Madhu, Sumanasunami, to him, Twashta's son, and to Twashta, in Virochana, Virajudu, and to Virajudu, in Visuchi, Satatajitta, and so on, a hundred sons were born, and a maiden was born. This is all the descendants of Priyavrata. The lineage is indeed highly commendable. The lineage has been traced back to Lord Vishnu. After telling the lineage of Shukudu Priyavrata, Parikshit is again asking like this. You have described the vast expanse of our planet Earth. As far as the moon shines, as far as the moon and stars are visible, that much the area of the earth was described. Because Priyavrata was wandering in the earth with a chariot, they said that the pits formed by that wheel were as many as seven seas. They said that the parts in the middle of the oceans are seven islands. Similarly, I am aware of the scale of the earth. Is the gross world entirely the gross form of the Lord? The mind that understands this is the subtle form of the Lord, the size of a thumb, pure and full of goodness, self And also to Vasudeva, the lord of light. The understanding is adequate. Therefore, I wish to describe this gross form with its human characteristics. That means they are asking me to tell them the characteristics of this earth. Thus, when King Parikshit asked, Shukayogi said thus. The Maharaja, the body of the Lord, is formed by the evolution of nature with qualities of Sattva, Rajas, and Tamas, which are one country. This is the playful glory filled with infinite universes. It is not possible to know and tell this much with the mind and speech. With the power of gods, water cannot be described as having a lifespan of a hundred years. I will explain to you the important ones and the ones who need to be engraved on this globe, listen, they are describing the globe to us. We will understand the geographical description through the next episode. Jai Srimannarayana. Salutations to the Asmadgurus