పరమశివుని రౌద్ర రూపము - వీరభద్రుని ఆవిర్భావము
Anger of Lord Shiva & Creation of Virabhadra
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, దక్షుని యజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న వార్త విన్న పరమశివుని అపరిమితమైన శోకం మరియు రౌద్రావేశం వర్ణించబడింది. దుఃఖంతో మండిపడిన శివుడు తన జటాజూటం నుండి ఒక వెంట్రుకను తెంచి, అత్యంత భయంకరమైన వీరభద్రుని సృష్టించాడు. వీరభద్రుడు శివగణ సేనలను వెంటపెట్టుకుని దక్షుని యజ్ఞశాలను ధ్వంసం చేయడానికి, సతీదేవికి అవమానం కలిగించిన వారందరినీ శిక్షించడానికి బయలుదేరాడు. ఈ ఘట్టం పరమశివుని అనన్యమైన భక్తి ప్రేమను, అహంకారానికి తప్పక కలిగే దైవిక శిక్షను స్పష్టంగా చాటిచెప్పుతుంది.
In this profound episode from Canto 4 of Srimad Bhagavatham, we witness the fierce wrath of Lord Shiva following the tragic self-immolation of Goddess Sati at Daksha's grand yajna. Consumed by inconsolable grief and divine fury, Lord Shiva tears a lock of his matted hair and from it manifests the terrifying warrior Virabhadra, a being of immense power and cosmic rage. Virabhadra, commanding a vast army of Shiva's ganas, is dispatched to destroy Daksha's sacrificial ceremony and punish all those who dishonored the beloved Sati. This episode reveals the boundless love of Lord Shiva for Sati and the fearsome consequences that arise when divine devotion is met with arrogance and disrespect.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః అనంతా వ్యక్త రూపేణ యేనేదమఖిలం తతం ఇదచి శక్తి యుక్తాయ తస్మై భగవతే నమః ఓ అనంతా ఇంద్రియ గోచరము కాని నీ రూపమే ఈ జగత్తునంతనో వ్యాపించి ఉన్నది. చైతన్య శక్తియగు జ్ఞానమునకు జడశక్తియగు మాయకు నీవే అధిష్టానం. భగవానుడవగు అట్టి నీ కొరకు నమస్కారము. సెవెంత్ కాంటో థర్డ్ చాప్టర్ 34th ప్రేయర్. భగవద్వంధువులారా శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్ధ స్కంధము ఆరవ పాడ్కాస్ట్ లో స్వాగతం. నిదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దక్షిణ యొక్క వృత్తాంతం మనం తెలుసుకుంటున్నాం. సతీదేవి ఆ తండ్రి యొక్క తిరస్కారానికి సహించుకోలేక తన దేహాన్ని విడియడం చూసి అందరూ కూడాను భయపడుతూ అటు ఇటు పారిపోయారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి అవమానింపగా తన భార్యకు సతీదేవి అనగా వృద్ధుని యొక్క భార్యకు సతీదేవి శరీర త్యాగము చేసినదనియు ఆ యజ్ఞ భూమిలో బుభూలు అను దేవతలు అగ్ని నుండి బయలువెళి తన సైన్యమును చంపుటకు తలపడగా సైన్యము పారిపోయినారనియు పరమశివుడు నారదుని వల్ల వినినాడు. తీవ్రము కోపము కలిగినది. కోపముతో క్రింద పెదవి కొరుకుచుండెను. తన జడల నుండి ఒక జడను తీసి నేలపై కొట్టెను. అగ్ని జ్వాలలను కక్కుచున్న ఆ జడల నుండి మహాకాయుడగు వీరభద్రుడు జన్మించెను. అతని శరీరము ఆకాశమును అంటుచుండెను, నల్లగనుండెను. సూర్యుని వలె మెరుగుచున్న మూడు కనులు కలిగి ఉండెను. భయంకరములగు కోరలు, అగ్ని వలె మండుచున్న కేశములు, కపాలములు కలిగి ఉండెను. ఆయుద్ధములను ధరించి రుద్రుని వద్దకు వచ్చి నమస్కరించి ఏమి చేయవలెను ఆజ్ఞాపింపుడు అనెను. భూతనాథుడగు రుద్రుడు ఓ యుద్ధకుశలుడగు వీరభద్ర నీవు నా భటులలో నాయకుడవు నా అంశ వలన జన్మించినాడవు.
నీవు వెళ్లి దక్షుని అతని యజ్ఞమును కూడా నశింపచేయుము. కోపముతో రుద్రుడు ఇట్లు ఆజ్ఞాపింపగానే వీరభద్రుడు అతనికి ప్రదక్షిణము చేసెను. అడ్డులేని వేగముతో ఎవరి చేతనో సహింపజాలని తేజస్సుతో బయలుదేరెను. పెద్దగా ధ్వని చేయుచు రుద్ర పార్షదులు అతనిని అనుసరించిరి. లోకమునంతకో మృత్యువైన మృత్యువుకు కూడా మృత్యువు వలె శూలమును పట్టుకొనెను. ధ్వని చేయుచున్న ఆభరణములను. పాదములను ధరించెను, పాదములందు ధరించెను. దక్షాధ్వర భూమిలో ఉన్న వృత్తిక్కులు, సభ్యులు, దక్షుడు, బ్రాహ్మణులు, బ్రాహ్మణుల భార్యలు ఉత్తర దిక్కున లేచిన పరాగమును చూచి. ఏమి ఇది ధూళియా చీకటియా ఇంత పరాగం ఎట్లు వచ్చినది అని అనుకొనిరి పెద్ద గాలులు విచ్చలేదు దొంగల దండు వచ్చుటలేదు తీక్షణముగు దండముచే శాసించు ప్రాచీన బర్హి అనడి రాజు పరిపాలించుచుండగా దొంగలు ఎట్లు వస్తురు ఇది ఏదో లోక ప్రళయమునకు వచ్చిన ఉత్పాదం అయి ఉండును. దక్షుని భార్య ఆమెతో చేరి ఉన్న స్త్రీలు బెదిరిపోవుచు ఇది దక్షుడు చేసిన పాప ఫలమే అని అనుకొనిరి. దక్షుడు అందరూ చూచుండగా ఏ తప్పు ఎరుగని తన కూతురిని అవమానించినాడు. సహించుటకు శక్యము కాని తేజస్సు గలవాడు రుద్రుడు. ప్రళయకాలములో జడలు విప్పుకొని తన శూలపు కొనతో దిగ్గజములను కూడా పొడిచి పట్టుకొని భయంకరమగు అట్టహాసమును చేయును. భజముల వంటి బాహువులను పైకెత్తి నృత్యము చేయును. వాని గర్జనమునకు దిక్కులు బ్రద్దలగును. అట్టి వానికి మనసున భరింపరాని కోపమును కలిగించినాడు. ఈశ్వరుడు చూచుటకు శక్యము కానివాడు. అతడు కనుబొమ్మలు కదల్చిన నక్షత్రములు కూడా తుల్లిపడును. వానికి కోపము కలిగించిన నాడు బ్రహ్మకు అయినను భద్రత ఉండదు. ఇట్లు ఆ స్త్రీలు బెదరుచున్న చూపులతో ఎన్నో మాటలు మాట్లాడుచుండగానే గొప్ప గొప్ప ఉత్పాదములు ప్రారంభమాయెను. ఆకాశమున భూమిపైనను కలుగుచున్న ఉత్పాదములను చూచి స్థిరమైన చిత్తము గల దక్షిణకు కూడా భయము కలిగెను. ఇంతలో రుద్రానుచరులు వచ్చి యాగభూమిని చేరిరి. వారు పొట్టిగా, పచ్చగా, ముసళ్ళ వంటి ముఖము గల రకరకములైన ఆయుధములను పట్టుకొని యాగభూమిలో ప్రవేశించిరి. యాగభూమిలో ఒక శాల నిర్మింపబడును.
దానికి తూర్పు వైపు పడమర వైపు రెండు స్తంభములు ఉండును. దానిపై అడ్డముగా రెండు కర్రలు వేసి నిర్మించిన శాలకు ప్రాగ్ వంశము అని పేరు. దానిని కొందరు ధ్వంసము చేసిరి. మరికొందరు యజ్ఞశాలకు తూర్పు వైపునున్న సదస్సులు కూర్చుని మండపమును పాడు చేసిరి. మరికొందరు దానికి తూర్పు వైపు ఉన్న హవిర్ధానమును భ్రష్టము చేసిరి. దానికి ఉత్తరముగా ఉన్న అగ్రీధ్రశాలను, యజమానుడు ఉండెడి గృహమును, పత్నీశాలను, వంటశాలను, భోజనశాలను అన్నిటినీ పూర్తిగా నాశనము చేసిరి. కొంతమంది యజ్ఞపాత్రలను బ్రద్దల్లు కొట్టిరి. కొంతమంది అగ్నులను అర్చివైపిరి, అర్పివైచిరి. కొంతమంది హోమగుండములలో మూత్రించిరి. కొందరు పారిపోవుచున్న దేవతల వెంట వెళ్ళిన వారిని పట్టుకొనిరి. రుద్రుని అనుచరులు వారిని చంపుచుండుట చూచి దేవతలు సదస్సులు పారిపోవసాగిరి. వారిపై రాళ్ళు విసిరి కొట్టిరి. చేతిలో శ్రవము పట్టుకొని హోమము చేయుచున్న భృగు యొక్క గడ్డములను, మీసములను వీరభద్రుడు ఊడబెరికెను. అవి అందరుకు చూపుచు నవ్వెను. ఆనాడు సభలో దక్షుడు రుద్రుని అవమానించినప్పుడు ఆ సభలోనున్న భృగుడు కంటితో దక్షుని ప్రేరణ చేసినాడని వీరభద్రుడు కోపముతో భృగుని కన్నులను ఊడబెరికెను. పూష అనునాథుడు ఆనాడు రుద్రుని దూషించినప్పుడు పండ్లు బయటపడినట్లుగా నవ్వినాడని కోపముతో పూష యొక్క దంతములను వీరభద్రుడు ఊడగొట్టినాడు. వీరభద్రుడు చివరకు దక్షిణి గుండెలపై పాదం మోపి నిలచి వాడి కత్తితో అతని తలకాయను నరికెను. కానీ ఆ శిరస్సు అతని శరీరం నుండి ఊడి రాలేదు. ఇతడు మంత్రముల చేత నరకబడకుండా సాధించి ఉండునని ఆశ్చర్యపడి వీరభద్రుడు ఎట్లు శిరస్సును మొండెమునకు దూరము చేయవలెనా అని ఆలోచించెను. యజ్ఞములో పశువును చంపి ఎట్లు శిరస్సును ఛేదింతురో ఆ విధానముతో వీనిని చంపవలెనని ఆలోచించి యజమానుడను పశువు అయిన దక్ష ప్రజాపతి యొక్క శరీరం నుండి శిరస్సును ఛేదించెను. ఆ శిరచ్చేదము చూచి భూత ప్రేత గణములు శభాష్ అని మెచ్చుకొనెను, కానీ యజ్ఞములో బ్రాహ్మణులు మొదలగు వారు ఛీ అని దూషించిరి. ఇంకా వీరభద్రుడు కోపముతో ఆ శిరస్సును యజ్ఞములో హోమము చేయు దక్షిణాగ్ని యందు హోమము చేసెను.
ఈ విధముగా దక్షిణి దేవ యజనమును నాశనము చేసి కైలాసమునకు మరలి వెళ్ళెను. దక్ష యజ్ఞమును విధ్వంసము చేసిన తరువాత రుద్రి సైన్యములు దేవతలందరును శూలములతో, కత్తులతో, గదులతో, పరిఘలతో, ముద్గరములతో సర్వావయవములను కొట్టి చీల్చివేసిరి. వారు ఓడిపోయిరి. చతుర్ముఖనకు నమస్కరించి యజ్ఞములో పాల్గొనని ఋత్విక్కులు సభ్యులు అందరూ భయముతో కంపించిపోవుచు ఇట్లు మాట్లాడుచున్నారు. యజ్ఞములో పాల్గొనని చతుర్ముఖ బ్రహ్మకు జరిగినదంతయు తెలియును. నారాయణుడు అందరికీ అంతరాత్మగా ఉండుటచే అతనికి కూడా జరిగినదంతయు తెలియును. వారిద్దరూ ముందే ఎరిగిన వారు కాగుటచే ఆ యజ్ఞమునకు రాలేదు. దేవతలు చెప్పిన మాటలను విని బ్రహ్మ ఇట్ల అనుచున్నాడు. మహా తేజస్శాలి రుద్రుని విషయమున అపరాధము చేసినారు. తను తమ మేలును కోరుకునువాడు మహాపురుషుల విషయమున అపచారము చేయుట క్షేమకరము కాదు. మీరందరూ యజ్ఞములో భాగములను పొందినారు కానీ రుద్రునకు భాగము లేకుండా చేసినారు. కావున మీరు నిర్మలమైన మనసుతో దక్షిణి మాటలచే గాయపడిన రుద్రుని మనసు ప్రసన్నమగునట్లు సతీ వియోగముచే బాధపడుచున్న మహాదేవుని పాదములనంటి నమస్కరించి. క్షమార్పణముకు చేసుకొనుడు. పరమశివుడు వేగముగా సంతోషించి అనుగ్రహించు స్వభావము కలవాడు. దక్షిణ యజ్ఞము చెడిపోయినది. దానిని మరల సరిచేయుటకు మీరు రుద్రుని అనుగ్రహింప చేసుకొనవలెను. రుద్రుడు కోపగించిన నాడు దిక్పాలులతో కూడా ఈ లోకము నిలవజాలదు. ఆ రుద్రుని యదార్థ స్వభావమును నేను కానీ ఇంద్రుడు కానీ ఈ మునులు కానీ ఎరుంగజాలము. అతడు భగవానుడగు నారాయణుని యొక్క అంశావతారము. మీరు పాదములను పట్టుకొని ప్రార్థించుటచే అతడు క్షమింపవలెనే గానీ ఇతరములగు ఉపాయములు వానిని అనుగ్రహింపజేయుటకు తగవు. ఈ విధంగా దేవతలతో చెప్పి బ్రహ్మ దేవతలతో ప్రజాపతులతో పితృ దేవతలతో కూడి తన లోకము నుండి రుద్రుని నివాస స్థానము కైలాసమునకు ఏగెను. కైలాసమున సిద్ధి పొందిన వారు ఎందరో వసించి ఉందురు. జన్మ చేత సిద్ధి పొందిన వారు, తపస్సులచే సిద్ధి పొందిన వారు.
మంత్రములచే యోగాభ్యాసములచే సిద్ధి పొందిన వారు అచర వసించుచుందురు. కిన్నరులు, గంధర్వులు, అప్సరసలు అచర నివసించుచుందురు. ఆ పర్వత శిఖరములు అనేకములగు మణులతో రంగు రంగుల గల గైరికాది ధాతువులతో కూడి ఉండును. అనేక విధములగు వృక్షములు, లతలు, పొదలు నిండి ఉండును. అనేకమంది దేవతా స్త్రీలు తమ ప్రియులతో అచట విహరించుచుందురు. రకరకములగు మృగములు సంచరించుచుండును. గుహలు, చెరియలు మున్నగు వానిపై సిద్ధకాంతలు ప్రియులతో విహరింతురు. నెముళ్ళు కూచుచుండును. మత్తిల్లిన తుమ్మెదల తుమ్మెదలు జుమ్మున ధ్వని చేయుచుండెను. మధురములగు కంఠములు గల కోకిలలు మున్నగు పక్షులు కూజితములు ఆ ప్రదేశమును పవిత్రమునరుచుచుండును. ఆ శిఖరముల పైయునున్న చెట్లు తమ కొమ్మలతో పక్షులను చేతులెత్తి రెండు రెండు అని పిలుచుచున్నట్టుండును. ఏనుగులు నడుచుండగా కొండలే నడుచున్నవా అన్నట్లు ఉండును. సెలయేళ్ల ధనులు కొండలు మాట్లాడుచున్నవా అనునట్లు ఉండును. ఆ పర్వతములపై మందారములు, పారిజాతములు, సరళములు, తమాలములు. తాళములు, ఆసనములు, అసనములు, అర్జనములు అను పేర్లు గల రకరకములుగా వృక్షులు ఉండును, వృక్షములు ఉండును. కొండనిండ మామిడి చెట్లు, కదంబ వృక్షములు, కడిమి చెట్లు, పున్నాగ వృక్షములు, చంపక వృక్షములు, ఆమ్లములు, అశోకములు, వకుళములు, కుందములు. కురవకములు, జాజి, మల్లి, మాధవి మొదలగు వృక్షములు, ఫలవృక్షములే కాక పెద్ద పెద్ద వృక్షములు కూడా అచట ఉండెను. బెదరు రకములు కొండ నిండ ఉండెను. సరస్సులలో నదులలో తామర కలువ రకములు ఎన్నో ఉండెను. మధురముగా పక్షులు కూయుచు మనోహరముగా ఉండెను. మృగమును శాఖామృగములు, వరాహములు, సింహములు, ఎలుగుబంట్లు, ముండ్లపందులు, శరభములు, పెద్దపులులు, రురుమృగములు, ఎనుబ్బోతులు, తోడేళ్ళు. కస్తూరి మృగములు మొదలగు మృగములతో ఆ కైలాస పర్వతము నిండి ఉండెను, అచ్చడి నదులు ఇసుక తిన్నెలు అరటి తోటలతో అందగించి ఉండెను, అచ్చడి నంద అనడి నది నిర్మలమైన జలములతో ప్రవహించుచున్నది. అందు స్నానము చేయుటచే పుణ్యము కలుగును. వృద్ధునకు నివాస స్థానము కైలాసమును చూచి దేవతలందరూ ఆశ్చర్యమునందిరి. ఆ కైలాసమునందే సుందరముగు అలకాపురుని కూడా వారు కాంచిరి. అచటనే సుగంధమగు వనము కలదు. ఆ వనమునందు ఉన్న పద్మమునకు సౌగంధికము అని పేరు.
ఆ పట్టణమునకు వెలుపల అలకనంద అని పేర్లు గల రెండు నదులు పారుచుండును. అవి శ్రీహరి పాద పరాగ స్పర్శచే అత్యంతము పవిత్రములైనవి. దేవతా స్త్రీలు తమ వివాహముల నుండి దిగి విహారములో అలసి బడలిక తీరుటకు ఆ నదులలో స్నానము చేసి తమ ప్రియులతో జలక్రెడ నొనరించుచుందురు. ఆ నదులలోని జలములు చాలా మధురముగా ఉండును. దాహము లేకపోయినను ఏనుగులు ఆ నీటిని తాము త్రాగి తమ తోడి ఆడు ఏనుగులకు వసంగుచుండును. దేవతా స్త్రీలు స్నానము చేయుటచే వారి శరీరమునందున కుంకుమ కరిగి ఆ నీరు పచ్చగా ఉండును. ఆ పట్టణమునందు వెండి మేడలు, బంగారు మేడలు, రత్నమయములగు మేడలు వందల కొలది దగ్గర దగ్గరగా ఉండును. యక్ష స్త్రీలు ఆ మెడలపై విహరించుచుందురు. ఆ మేడలు మేఘముల వలె అందు సంచరించు కాంతలు మెరుపు తీగల వలె ఒప్పుచుందురు. యక్షేశ్వరుడగు కుబేరుని అలకాపట్టణం సౌగంధిక వనమును చూచిన తర్వాత అచట. దగ్గరగా ఒక మరిచెట్టును చూచిరి. ఆ వృక్షము చాలా ఆశ్చర్యకయమైనది. అందు అనేక విధములగు పుష్పములు, చిగుళ్ళు, క్రీడలకు ఉపయోగించు పరికరములు ఉండెను. ఆ వృక్షము చుట్టూను కోరికలు వర్షించి వర్షించు వృక్షములు ఎన్నో ఎన్నియో గలవు. కోకిలలు, తుమ్మెదలు, హంసలు అచడి సరస్సులలో మధురముగా కూయుచుండెను. అడవి ఏనుగులు అచట హరిచందన వృక్షములను కాపాడుచుండును. ఆ మదపు వాసన వాయువుచే అంతటా వ్యాపింపగా యక్షస్త్రీల మనస్సులు కామవశము గవుచుండెను. వణులతో కల్పింపబడిన సోపానములు కలోపూల దండలు అక్కడ నిండి ఉండెను ఆ ప్రాంతమందు కింపురుషులు అధికముగా విహరించుచుందురు ఈ విధముగా ఉన్న ఆ వనములను, సరస్సులను, దిగుడు బావులను, ఆయా వృక్షములు చూచుచు దేవతలు దగ్గరగానున్న ఒక వటవృక్షమును చూచిరి. ఆ తర్వాత ఏం జరిగిందో మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the eternal form of the self-realized Guru. To that all-powerful one, salutations. Oh, all-encompassing form that is beyond the reach of the senses, this world is pervaded by it. You are the support for the inert power of Maya, which is the power of knowledge, which is the power of consciousness. Salutations to such a God. Seventh Canto Third Chapter 34th Prayer. Devotees of the Lord, welcome to the fourth episode of Srimad Bhagavata Tattvadipika, the sixth podcast. As part of the conversation between Nidura and Maitreya, we are learning about the story of Dakshina. Sati Devi, unable to bear her father's rejection, seeing him abandon her body, everyone got scared and ran here and there. Let us proceed with the narrative that unfolds next. When Daksha Prajapati was insulted, his wife, Sati Devi, meaning the wife of the old man, Sati Devi, sacrificed her body. And in that sacrificial land, the gods named Bubhulu, after being released from the fire, tried to kill his army, and the army Parashurama heard from Narada that they had fled. Furious. He was biting his lower lip in anger. He took a braid from his hair and hit it on the ground. From those braids that spewed fire, the mighty Veerabhadra was born. His body was touching the sky, it was dark. He had three eyes that were as good as the sun. Having terrible fangs, hair blazing like fire, and skulls. Having fought the wars, he came to Rudra, saluted him, and asked what he should do, and he commanded him. Oh, Rudra, the lord of Bhoothas, and Veerabhadra, the warrior, you are the leader among my soldiers, and he was born from my part.
You shall go and destroy Daksha's sacrifice. With anger, Rudra ordered thus, and as soon as he did, Veerabhadra circumambulated him. He set out with unimpeded speed, with a radiance that could not be tolerated by anyone. Making a loud sound, the Rudra's associates followed him. Death, which is death to the whole world, also holds a spear like death. Of the ornaments sound. He put on the feet, he put on the feet. The members, Daksha's sons, Daksha, Brahmins, and Brahmin wives who were in the land of Daksha, seeing the morning that rose in the north direction. What is this? Is it dust or darkness? How did so much pollen come? Thinking this, strong winds did not come, nor did the thief's army come. While the ancient Barhi Anadi king was ruling, how do thieves come? This is something It will be the product that comes to the world's destruction. Daksha's wife, the women who were with her, were afraid and thought that this was the sinful result of what Daksha had done. Daksha, while everyone was watching, his daughter, who knew no fault He insulted. Rudra is one with a radiance that is beyond endurance. In the time of destruction, he will uncoil his hair, strike down even the giants with the tip of his spear, and make a terrible laugh. He raises his arms like bhajamu and dances. The directions are confused by his roar. He caused such a person unbearable anger in his heart. God is beyond human comprehension. Even the stars that he moved his eyebrows up and down. When anger arises in him, even Brahma will not have safety. Thus, as the women were speaking many words with frightening looks, great great products began. Seeing the produce that is produced in the sky and on the earth, even the south, which has a stable mind, was afraid. Meanwhile, Rudra's followers arrived and reached the sacrificial ground. They entered the sacrificial ground, holding various weapons, short, green, and with a crocodile-like face. A school will be built in the Yagabhoomi.
It has two pillars facing east and west. The Shalika Praga dynasty was built by placing two sticks across it. Some people destroyed it. Some others, sitting in the assembly facing the east of the sacrificial hall, destroyed the pavilion. Others have corrupted the Havirdhanam that is to the east of it. In response, they completely destroyed the Agriddharama, the house where the owner lived, the Patniashala, the kitchen, and the dining hall. Some of the sacrificial vessels were smashed. Some people worshiped the fire, Arpi. Some people urinated in the homa fireplace. Some caught those who were running away and following the gods. Seeing Rudra's followers killing them, the gods' assemblies fled. Stones were thrown at them. Veerabhadra plucked out the beard and mustache of Bhrigu, who was performing homam with sravamu in his hand. They showed everyone and laughed. That day, when Daksha insulted Rudra in the assembly, Bhrigu, who was in that assembly, Veerabhadra, angered by Daksha's inspiration with his eyes, gouged out Bhrigu's eyes. When Pusha Anunathudu was insulting Rudra that day, Veerabhadra broke Pusha's teeth with anger, as if fruits had come out. Veerabhadra finally stood with his foot on the southern chests, and with his sword, he cut off his head. But the head did not come off his body. Veerabhadra, astonished that he had achieved this without being killed by the spells, wondered how he should move his head away from his torso. Thinking that they should kill him in the same way as they slaughter an animal and sever its head during a Yagnya, the master severed the head from the body of Daksha Prajapati, who was the animal. Seeing that beheading, the ghosts and spirits praised, but in the Yagnya, the Brahmins and others cursed. And Veerabhadra, in anger, burned that head in the Yagnya, in the fire of sacrifice.
In this way, having destroyed the southern deity worship, he returned to Kailasam. After destroying the Daksha Yagna, the Rudra armies and all the gods struck and tore all their limbs with spears, swords, shields, and maces. They were defeated. Having bowed to the four-faced one, all the members of the Ritviks who did not participate in the Yagnya are trembling with fear and are speaking thus. The four-faced Brahma, who did not participate in the Yagna, knows everything that happened. Narayana is the inner soul of everyone, therefore he knows everything that happened to him. They both knew beforehand, so they did not come to that yagna. Hearing the words of the gods, Brahma thought thus. They have committed a crime against the great radiant Rudra. He who desires their good will not be safe from doing evil to great men. All of you received parts in the Yagnya, but Rudra was made to have no part. Therefore, may your mind be pleased, as Rudra's mind, wounded by the words of the south, is saddened by the separation from his wife Paying obeisance at the feet of lord Shiv. Forgiveness is a gift. Lord Shiva is quick to be pleased and has a nature of bestowing grace. The southern sacrifice is ruined. You should ask Rudra for forgiveness to make it right again. When Rudra is angry, even the directions cannot stand this world. I, or Indra, or these sages, cannot understand the true nature of that Rudra. He is an avatar of the god Narayana. It is not right that he should be forgiven by praying by holding your feet, but other means are appropriate to grant him. In this way, after telling the gods, Brahma, along with the gods, Prajapatis, and ancestors, left his world and went to Kailasam, the abode of Rudra. Many who have attained liberation in Kailasam reside there. Those who have been accomplished by birth, those who have been accomplished by penance.
Those who have attained perfection through mantras and yoga practices reside in the unmoving abode. Kinnaras, Gandharvas, and Apsaras live there. Those mountain peaks are composed of many gems and colorful gem-like substances. It is full of various kinds of trees, vines, and bushes. Many goddesses are seen frolicking with their lovers there. Various kinds of animals roam. The Siddha women are enjoying themselves with their lovers on the caves, streams, and such places. The creepers will do. The bees were buzzing and making a buzzing sound. The cuckoos with sweet voices, and other birds, their cries sanctify that place. The trees on those peaks, with their branches, seem to be calling the birds, raising their hands, two by two. It would be as if the hills were walking while the elephants were walking. It will be as if the years of the bow and the hills are talking. On those mountains, there are hibiscus, jasmine, sarala, and tamarind trees. There are various types of names such as Taalamulu, Asanamulu, Asanamulu, Arjanamulu There will be trees, there will be trees. On the hill, there are mango trees, kadamba trees, kadimi trees, Punnaga trees, champaka trees, amla trees, asoka trees, vakula trees, and kunda trees. The Kuravakamulu, Jaji, Malli, Madhavi and other trees, not only fruit trees but also large trees were there. The types of Bedar were full of hills. There were many types of lotus flowers in the lakes and rivers. Sweetly the birds sing and delightfully it is. Deer, deer, boars, lions, bears, porcupines, hyenas, bears, wolves, hyenas, elephants, wolves. The Kailasa mountain was filled with animals like musk deer, and the rivers there were supplied with sandbanks and banana gardens, and the Nanda river there was flowing with pure waters. By taking a bath, one attains merit. Seeing Kailasam, the abode of the gods, all the gods were surprised. They also saw the beautiful Alakapuri in Kailasam. There is a fragrant grove nearby. To the lotus in that garden Saugandhika is the name.
Outside that town, two rivers named Alakananda flow. They are the most sacred, by the touch of the lotus feet of Sri Hari. The goddesses, after descending from their marriages and becoming tired from their leisure, bathe in those rivers to relieve their fatigue, and perform water sports with their beloved ones. The waters of the rivers are very sweet. Even if there is no thirst, the elephants drink that water themselves and feed it to the other elephants with them. By the women bathing, the kumkuma dissolves from their bodies, and that water remains green. In that city, there are silver mansions, golden mansions, and mansions made of precious stones, in hundreds, very close to each other. Yaksha women roam around on those necks. Those lamps, like clouds, move in it, the lights agree like lightning wires. After seeing Alakapattanam and Saugandhika Vana of Kubera, who is the lord of Yakshas, there. Nearby, they saw a banyan tree. The tree is astounding. There were various kinds of flowers, buds, and equipment used for sports. The desires rained around that tree There are many rain-bearing trees. Cuckoos, bumblebees, and swans were singing sweetly in the lakes. Wild elephants protect the sandalwood trees there. The fragrance of that intoxicating smell spread everywhere through the air, and the minds of the Yaksha women were filled with lust. The ladders made of vines, the garlands of flowers, were filled there. In that region, Kimpurushas roam in abundance. In this way, those forests, lakes, stepped wells, The gods, seeing the various trees, saw a banyan tree nearby. We'll find out more in another podcast. Jai Srimannarayana and salutations to the Ashmadguru.