అశ్వత్థామ బంధనము - ద్రౌపది అపార కారుణ్యము

Punishment of Ashwatthama & Draupadi's Divine Mercy

bhagavatam

శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, అశ్వత్థామ ఉత్తర గర్భంలోని శిశువుపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన మహాపాపమును గురించి తెలుసుకుంటాము. అర్జునుడు అశ్వత్థామను బంధించి ద్రౌపది సమక్షానికి తీసుకొస్తాడు, తన ప్రతిజ్ఞను నెరవేర్చుటకు సిద్ధంగా ఉంటాడు. తన పుత్రులను సంహరించిన అశ్వత్థామను చూసి కూడా, ద్రౌపది గురుపుత్రుడైన అతనిపై కారుణ్యం చూపి అభయమివ్వమని కోరుతుంది. శ్రీకృష్ణుడు న్యాయమును కాపాడుతూ అశ్వత్థామ శిరోమణిని తొలగించి, శక్తి కంటే కరుణయే ధర్మానికి గొప్ప ఆభరణమని నిరూపిస్తాడు.

In this profound episode from the First Canto of Srimad Bhagavatham, we explore the grave sin of Ashwatthama, who released the deadly Brahmastra against the unborn child of Uttara, drawing the fierce wrath of Arjuna. Arjuna captures Ashwatthama and brings him bound before Draupadi, fully prepared to fulfill his vow of vengeance. In a breathtaking display of compassion, Draupadi — whose own sons were slaughtered by Ashwatthama — pleads for his life, recognizing him as the son of their revered Guru Dronacharya. Sri Krishna, honoring both justice and mercy, strips Ashwatthama of his divine gem as eternal punishment, revealing that true dharma is upheld not only through strength but through the grace of a noble heart.

← Prev Next →
Punishment of Ashwatthama & Draupadi's Divine Mercy bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యద్కీర్తనం యద్స్మరణం యదీక్షణం యద్వందనం యచ్్రవణం యదర్హణం లోకస్స సద్యః విధునోతి కల్మషం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః శ్రీహరిని కీర్తించుట, స్మరించుట, దర్శించుట, నమస్కరించుట, ఆయన గురించి వినుట, ఆయనను పూజించుట వలన మానవుని పాపములు వెనువెంటనే రక్షించును. పరమ మంగళకరము కీర్తి గల అట్టి శ్రీహరికి అనేక నమస్కారములు. సెకండ్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ 15th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 13వ పాడ్కాస్ట్ లో సుస్వాగతం. నారదుని జన్మ వృత్తాంతం మనం తెలుసుకుంటున్నాం ముందు భాగాన్ని తెలుసుకుందాం. నాదోడు అంటున్నాడు వ్యాసా భగవత్పాద సేవనము చేయు జనులు ఏ విధమునను ఎన్నడును సంసారమును పొందరు. పరిపూర్ణ భక్తి యోగ నిష్ఠుడు కాకపోయినను భక్తి అంకురము గలవాడు అయినను కామ్య కర్మాచరణము చేయవాని వలె దుఃఖ భాజనమగు జన్మను పొందడు. ముకుంద చరణారవింద శరణాగతి పూర్వజన్మలో చేసినవాడు. దానిలో పరిణిష్టితుడు కాకపోయినను భగవత్పాదారవింద సేవనమునందు రుచిని ఒకసారి చవి చూచిన వాడగుటచే దానిని మరుసటి జన్మలో వదలలేడు. అందుచే భగవత్ గుణములను లీలలను వర్ణించి లోకులకు భగవత్పాద సేవనము వలన రుచిని కలిగించు ప్రబంధమును రచింపుము. భగవానుడు సకల జగత్ సృష్టి స్థితి లయములకు కారణమైనవాడు. అతడు విశ్వము కంటే వేరుగా కాక దానికి ఆత్మగా విశ్వమే తాను అయినట్లుగా ఉండును. అట్టి జగత్ కారణమైన వాడే మోక్షమును వసంగదగినవాడు. వేదములను సమగ్రముగా అధ్యయనము చేసిన నీకు భగవద్గుణములన్నియు తెలియను. అవి అనంతములని నీవెరుగుదువు. అయినను నేను దిగ్మాత్రముగా నీకు తెలియజేసితిని.

నీవు భగవత్ అంశ సంభూతుడవు. విశ్వమునంతను ఉన్నదానిని ఉన్నట్లు ఎరుంగదగిన వాడవు. నీవు పరమ పురుషుని అంశచే జన్మించిన వాడవు. కర్మాధీనమైన జన్మ కాదు. లోక హితమునకై మీ అంతట మీరు ఈ లోకమునకు వచ్చిరి. అందుచే నీవు భగవానుని జన్మలను, కర్మలను, గుణములను కీర్తింపుము. కృత్య కృత్యుడవు గమ్ము. దానిచే నీ మనస్సులోని అసంతృప్తి తొలగును. మానవుడు జన్మించి కృతార్ధుడు కావలెనని అనినచో చేయవలసినది ఆహారం మానిండుట మాత్రము కాదు, మంత్ర జపము కాదు, అధ్యయనము కాదు, యాగాదులు చేయుట కాదు. వాపి కూప తటాకాదులు నిర్మించుట కాదు. కేవల జ్ఞానము కాదు, దానము కాదు. చేయదగినది ఒక్కటే. ఉత్తమ శ్లోకుడగు భగవానుని వర్ణించుట వెనుట. వీటియందు రుచి కలిగిన వాడికే జన్మ సార్ధకం. అది కలగజేసిన యజ్ఞదాన తపః కర్మలే సార్ధకములు. భగవద్భక్తి లేక ఎన్ని చేసినను వ్యర్థమే. భగవద్గుణములను వర్ణించుట కూడా వేదములను చదువుట వలె ఒక కర్మయే కానీ దానికి అధిక్యమేమి అనిపించును. కానీ భగవద్గుణ లీలా శ్రవణము భక్తి యోగమందు రుచిని కలిగించును. భక్తిని వృద్ధి పొందించును. దానిచే మోక్షము లభింపజేయును. అందుచే మిగిలిన కర్మల వలె భగవద్గుణములను లీలలను కీర్తించుట వినుట. ఎన్నటికీ వ్యర్థము కాదు. దీనికి నిదర్శనము నా చరిత్రమే దానిని వినుము. పూర్వజన్మలో నేను వేదవేత్తల ఇంట పని చేసే ఒకానొక దాసి కుమారుడను. నేను చిన్నవాడనై ఉండగానే చాతుర్మాస్యమునకు వర్షాకాలమున వారింటికి కొందరు సన్యాసులు వచ్చిరి. గృహ యాజమానులైన వేదవేత్తలు వారి సేవకు నన్ను వినియోగించిరి. నేను చిన్నవాడనైనను బాల్య చాపల్యం నాకు ఉండేటిది కాదు. ఆటల యందు నాకు ఆసక్తి లేదు. మితముగా మాట్లాడువాడను. వారి సుశ్రుషను శ్రద్ధతో చేయుచుండెడివాడను. వారు సమదర్శనలు అగుటచే వారికి ఒకరియందు అనురాగము ఒకరియందు ద్వేషము ఉండవు. కానీ నా యందు వారికి కృప కలిగినది. నన్ను అనుగ్రహించి వారు భుజించిన తరువాత మిగిలిన పదార్థమును నాకు పెట్టడి వారు.

అట్లు వారు ఇచ్చిన దానిని ఒక్కసారి మాత్రమే తిని నేను సుఖముగా ఉండడివారను. భాగవత సేవ భాగవతుల ఉచ్చిష్ట స్వీకారము చేత నా మనసున అంటి ఉన్న పాపములన్నీ తొలగి నా అంతఃకరణమునందు భాగవత ధర్మముల యందు రుచి కలిగెను. మనసున భగవద్విషయంపై రుచి కలుగుటచే వారు నిత్యము చెప్పెడి శ్రీకృష్ణ కథలను వారు మనోహరముగా గానము చేసెడి శ్రీకృష్ణ లీలలను శ్రద్ధతో మూడు పూటలా వినుచుండెడి వాడను. అట్లు వినుటచే వినడి వారి మనసులో ప్రీతిని కలిగించడి కీర్తి కలిగిన భగవానుని యందు నాకు అనురాగం ఏర్పడినది. అది క్రమముగా శ్రీకృష్ణ భగవాను యందు భక్తి రూపముగా మారెను. దానితో నాకు పరమాత్మయగు భగవానుని ధ్యానించు ఉండుటచే జగత్తంతయు పరమాత్మకే చెందిన ప్రకృతిచే పరమాత్మయే కల్పించి దానిలో జీవుని ద్వారా తాను ప్రవేశించి నిలుపుచున్నాడు అని వాస్తవము స్పష్టముగా గోచరించినది. సర్వము భోగదాత్మకముగా గోచరింపసాగెను. ఈ విధముగా నాలుగు మాసములు అనగా వర్ష ఋతువు, శరద్ ఋతువు రెండును భగవద్గుణ సంకీర్తనమునే వారి వలన వినుచుండెడి భాగ్యము లభించినది. దానితో మనసున రజస్తమస్సులు లేవనియు శ్రద్ధ గలదనియు ఇంద్రియములు నా వశమందు ఉన్నవనియు వారు గుర్తించిరి. భగవానుడు తానే చెప్పిన జ్ఞానము వారు అచరు నుండి విడలిపోవుచు దాసుడు నేవు నాయందు వాత్సల్యము గలవారులై కృపచే నాకు ఉపదేశించిరి. అది చాలా రహస్యమైన జ్ఞానం. దానిచే విశ్వ శ్రేష్ట అయిన వాసుదేవునకు సంబంధించిన మాయా ప్రభావమును నేను ఎరింగితిని. అందుచే ప్రతిబంధకము తొలగి భగవానుడే ఉపాయమనియు వాడే ప్రాప్యమనియు నిశ్చయముగా ఎరింగితిని. ఓ మహర్షి. మనము చేయు కర్మ భగవతర్పణముగా చేయుటయే మనకు కలిగెడి ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక దుఃఖములకు చికిత్స అని నాకు తెలిసినది. ఫలమును కోరక భగవానుడే భగవాను ప్రీతికై తాను చేయదగిన కర్మను తనచే చేయుచున్నాడని ఎరింగి ధర్మాచరణ చేసినచో జీవునకు ప్రతిబంధకముకు పాపము తొలుగును. భక్తి యోగము నిష్పన్నమగును. తాపత్రయము నివర్తించును అని నేను ఎరంగితిని. రోగములకు కారణమైన ఆహారము మరణముల తీసుకున్నచో రోగము తగ్గదు. సరికదా మందు సేవించుచున్నను రోగం వృద్ధినందుచునే ఉండును.

అట్లే మనము చేయు కర్మలే బంధయేతువు. ధర్మార్థ కామములను కోరి కోరికతో చేయు కర్మలు సంసారమును కలిగించును. ఆ కర్మలే పరమాత్మను కర్తగా, భోక్తగా భావించి తనని ఒక పనిముట్టుగా భావించి చేసినచో ఆ కర్మలు సంసారం తొలగించుటకు సమర్ధులగును, సమర్ధములగును. అట్టి కర్మ యోగముచే జ్ఞానము కలుగును. ఆ జ్ఞానముచే భక్తి కలుగును. ఆ భక్తి యోగముచే దర్శనము లభించును. వర్ణాశ్రమములకు అనుగుణముగా కర్మలను చేయుచు భగవానుని కళ్యాణ గుణములను ప్రకాశింపజేయు నామములను ఎవరు కీర్తించుందురో వారు చేయు కర్మలు వారికి భక్తి యోగమును కలిగించి వృద్ధినందించును. ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమఃసంకర్షణాయ చ అని వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ నామమును కీర్తించుచు ఆ మంత్రములచే ప్రకాశింపచేయెవడు భగవానుని దివ్యమూర్తిని గాని ధ్యానించునచో అతనిని యజ్ఞ పురుషుడుగా భజించినచో భగవత్ దర్శనం బాగుగా లభించును. ఓంకారమును ఉచ్చరించుటచే భగవానుని సర్వ రక్షకత్వము, సర్వ కారణత్వము, సర్వశేషత్వము మనసులో భాసించును. స్వరూపముచే, గుణములచే అపరిచ్ఛిన్నమైన తత్వము బ్రహ్మము. అది కర్మచే పరిమిత జ్ఞానాది గుణములకు గల ఆత్మలకు పరిమితి తొలగించి బృహత్వమును కలిగించునది. మోక్షము వసొంగునది అని ఓం అని పదమును స్మరించుచు అర్థమును భావించుచుండుటచే మనసున బ్రహ్మ సాక్షాత్కారము కలుగును. వాసుదేవ శబ్దమును స్మరించుటచే భగవానుడు సర్వాధారభూతుడనియు నిరతిశయ కాంతిమంతుడనియు గ్రహింపవీలగును. ప్రద్యుమ్న శబ్దముచే నిరతిశయ ప్రకాశము గలవాడని తెలియును. సంకర్షణ పదముచే అతీంద్రియములైన వస్తువులను ఎరుంగగల జ్ఞానము కలయించువాడని తెలియును.

ఇట్లు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నామములను కీర్తించుటచే మన మనసున భగవంతుని స్వరూపము స్వభావము స్పష్టముగా భాసించుండును. ఇట్లు ఆయా నామములను స్మరించుచు భగవత్ ఆరాధనముగా కర్మలు చేయు వారికి భక్తి యోగము జనించును. నేను వారు చెప్పిన విధంగా ఆ మంత్రములని స్మరించుచు భగవానుడు నాకు తన యందు భక్తిని దానిచే కలిగిన దర్శనమును ప్రసాదించినాడు. కావున ఓ మహర్షి ఆ భగవానుని కీర్తిని ప్రతిపాదించు ప్రతిబంధమును రచింపుము. ప్రబంధమును రచింపుము. క్షమించాలి. దానిచే తెలుసుకునగోరెడి వారికి తెలుసుకునవలసిన జ్ఞానము పరిపూర్ణముగా కలుగును. ఆధ్యాత్మికాది తాపములు తొలగింపబడును. ఈ దుఃఖములు తొలగుటకు వేరొక మార్గము లేదు. దీని తర్వాత జరిగిన భాగాన్ని మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. Whatever is chanted, whatever is remembered, whatever is seen, whatever is spoken, whatever is earned, the world is immediately purified. Salutations to that auspicious one. Salutations to Sri Hari, who is praised, remembered, and seen By worshiping and hearing about Him, and by worshiping Him, the sins of mankind will be immediately saved. Salutations to Sri Hari, who is the ultimate auspicious and glorious one. Second Canto Fourth Chapter 15th Prayer. Devotees of God, welcome to the 13th podcast of the first book of Srimad Bhagavata Tattva Deepika. We are learning about Narada's birth story, let's learn the first part. My friend is saying that people who serve Vyasa Bhagavatpada will never attain worldly life in any way. Even if one is not a devotee of complete devotion, even if one is a beginner in devotion, one who does not perform desirable actions does not attain a birth that is full of sorrow. Mukunda Charanaravinda was a renunciate who had taken the vows in his previous birth. Even though he was not a perfectionist, he had tasted the sweetness of serving the lotus feet of the Lord once He will not be able to leave it in the next birth. Therefore, describe the divine qualities and pastimes, and compose a composition that gives pleasure to the people by serving the feet of the Lord. The Lord is the Cause of all existents and the Mover of all existents. He is not different from the universe, but the universe itself is like a soul to it. He who is the cause of this world, He is the one who grants salvation. You, who have studied the Vedas in their entirety, do not know all the virtues of the Lord. You know they go on forever. But I have informed you categorically.

You are a part and parcel of God. You are the one who can know what is there in the universe. You are a part and parcel of the Supreme Being. Not a karmic birth for you. For the good of the world, you came to this world on your own. Therefore, you praise the births, actions, and qualities of the Lord. Be a servant, be a servant. It will remove the dissatisfaction in your mind. If a human being is born and wants to be fulfilled, then what needs to be done is not just giving up food, not just chanting mantras, not just studying, not just performing sacrifices. It is not about building a well or a pond. Not just knowledge, but also the ability to give. There's only one thing I'd ask of you. Describing the best of the best is beyond words. Only the one who has taste for these things will find fulfillment in life. That which caused the sacrifice, the penance, the actions are meaningful. Devotion to God is not enough; no matter how much you do, it is futile. Describing the virtues of the Lord is also a form of action, just like reading the Vedas, but it seems more superior. But listening to the divine play of the Lord's virtues brings taste in the path of devotion and yoga. Devotion will increase. Salvation It provides. Therefore, like the remaining karmas, praising and listening to the virtues and pastimes of the Lord. It is never wasted. Listen to my story as a proof of this. In a previous life, I was the son of a maidservant who worked in the house of a Vedic scholar. When I was a child, during the Chaturmasya and the rainy season, some ascetics came to their house. The householders Vedic scholars used me for their service. Even though I am young, I don't have childish tendencies. I don't follow sports. I am a friendly speaker. I was one who took care of their medical treatment with utmost dedication. Because they are equals, they have no affection for one person and hatred for another. But they have grace in me. After blessing me and they ate, they gave me the remaining food.

I will not be happy to eat only what they gave me once. By the acceptance of the offering of the Bhagavata to the Bhagavatas, all the sins that were attached to my mind were removed, and I developed a taste for the Bhagavata Dharmas in my inner self. Because of the taste in the mind on the subject of God, I used to listen to the stories of Sri Krishna, which they used to tell daily, with devotion, three times a day, singing them beautifully. Thus, by listening, the devotion in their hearts was caused, and I developed affection for the glorious Lord. That gradually transformed into devotion to Lord Krishna. With that, because I meditate on the Supreme Being, the entire universe belongs to the Supreme Being through nature, the Supreme Being himself creates it, and he enters and sustains it through the living being, this truth became clearly apparent. Everything began to appear as a pleasure. In this way, four months, that is, the rainy season and the autumn season, both have been blessed with the fortune of hearing the divine virtues of the Lord through them. With that, the dust settles in the mind They recognized that there was no desire and that the senses were under my control. The Lord, having spoken the knowledge, separated from the unclean, and being servants, having affection for me, have taught me with grace. It is a very secret knowledge. By that, I have erased the illusionary effect related to Vasudeva, who is the best in the universe. Therefore, I have firmly decided that the obstacle is removed and that the Lord is the solution and the means. Oh, Maharshi. The karma we perform as an offering to God is what I know will cure our spiritual, physical, and divine sorrows. Without desiring fruit, the Lord Himself is doing the work that He can do for the pleasure of the Lord. If one performs the righteous conduct, then sin will be removed from the obstacle to the soul. Bhakti yoga is the yoga of devotion. I have decided that the suffering will be relieved. If you take food that causes diseases, the disease will not decrease. Is it right that even while taking medicine, the disease remains with growth?

Similarly, it is the karma that binds us. Desires for dharma, artha, and kama, and actions done with desire, cause worldly existence. If those karmas, considering the Supreme Being as the doer and the enjoyer, and considering Him as a tool, are performed, those karmas will be capable and competent to remove the cycle of life. Such karma yoga leads to knowledge. Devotion arises from that knowledge. That vision is attained through Bhakti Yoga. Those who perform actions in accordance with the Varna system, and who glorify the names that illuminate the virtues of the Lord's marriage, their actions will bring them devotion and yoga, and will increase their age. Om Namo Bhagavate Vasudevaya Vasudevaya Dheemahi Pradyumnaya Aniruddhaya Namahasankarshanaya Cha Aniruddhaya Pradyumna Aniruddha Sankarshana, chanting the names, who illuminates with those mantras, the divine form of the Lord If one meditates and worships him as the Yagnya Purusha, the vision of God will be obtained well. By uttering Omkara, the omnipotence, omniscience, and supreme being of the Lord shine in the mind. By form, by qualities The indivisible essence is Brahman. That which removes the limitation of the souls having knowledge and other qualities, limited by karma, and causes expansion. By remembering the word 'Om' and contemplating its meaning, one attains self-realization, leading to the realization of Brahman in the mind. By remembering the word Vasudeva, one cannot understand that the Lord is the basis of all and is exceedingly radiant. He is known to be the one with unlimited radiance by the sound of Pradyumna. It is known that he is the one who combines the knowledge of knowing the supernatural things through the word interaction.

Thus, by chanting the names Vasudeva, Sankarshana, Pradyumna, and Aniruddha, the form and nature of God clearly shines in our minds. Thus, remembering those names, devotion and yoga are born for those who perform actions as worship of the Lord. As they said, remembering those mantras, the Lord granted me devotion to Him and the vision that came from it. Therefore, O great sage, propose the glory of that Lord, and create obstacles. Write a composition. Forgive me. Those who want to know through it will attain complete knowledge. Spiritual afflictions will be taken away. There is no other way to overcome these sorrows. We will find out what happened next in another episode. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.