బాల్య లీలల స్మరణ - శ్రీకృష్ణుని దివ్య వైభవము

Remembrance of Lord Krishna's Childhood Pastimes

bhagavatam

ఈ శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, మూడవ స్కంధంలో ఉద్ధవుడు మరియు విదురుడు స్మరించిన శ్రీకృష్ణుని బాల్య లీలలను భక్తి భావంతో వివరిస్తున్నాము. వృందావనంలో జరిగిన ఆయన అద్భుతమైన క్రీడలు మరియు దివ్య చర్యలు పరమాత్మ యొక్క సర్వోన్నత స్వరూపాన్ని ప్రకటిస్తాయి. ప్రతి లీల కేవలం బాల్య చేష్టగా కాకుండా, జీవుల ముక్తికి మార్గం చూపే దివ్య సందేశంగా భాసిల్లుతుంది.

In this episode of our Srimad Bhagavatham series, we explore Canto 3's heartfelt remembrance of Lord Krishna's divine childhood pastimes as recalled by Uddhava and Vidura. The sacred narrative invites devotees to meditate on the Lord's enchanting early leelas, from His playful exploits in Vrindavan to the wondrous acts that revealed His supreme nature. Each pastime serves as a powerful reminder that Krishna's childhood was not merely human play, but a divine unfolding of the Absolute Truth for the liberation of all souls.

← Prev Next →
Remembrance of Lord Krishna's Childhood Pastimes bhagavatam

అస్మద్గురుభ్యో నమః నూనం జనైరీహితమీశ్వరాణాం అస్మద్విధైస్తద్గుణ సర్గమాయయా నజ్ఞాయతే మోహిత చిత్తవర్త్మభిహి తేభ్యో నమో వీర యశస్కరేభ్యః ఈశ్వరుని ఈ త్రిగుణాత్మకముగు సృష్టి యొక్క మాయచే మా వంటి వారల చిత్తములు వాటి పోకడులు మోహమును పొందియున్నవి. మాకు హరిభక్తుల చేష్టములు గాని నీ వంటి అవతార మూర్తుల చేష్టములు గాని తెలియవు ఇది నిశ్చయము. దయను చూపుట వీర లక్షణము దాని వలన వారి కీర్తి ఇనుమడించును అట్టి అవతార మూర్తులకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో, 17th చాప్టర్, 36th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపికా తృతీయ స్కంధం ఐదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతకు ముందు విదురుడు మైత్రేయుని దగ్గరికి ఉద్ధవుడు చెప్పిన విధంగా వెళ్లి మైత్రేయునితో ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థించిన మీరుగా మైత్రేయుడు ఇచ్చిన సమాధానం ఏమిటి? ఈ దుఃఖ సంసారం నుంచి బయలుపోవడానికి. మార్గం ఏమిటో మనం ఈ పాడ్కాస్ట్ ద్వారా విందాం. ఇట్లు విదురుడు ప్రశ్నించగా మైత్రేయుడు మానవులను అఖండానందమును ప్రసాదించెడి భగవత్ కథను వినవలెన కోరికను విదురుని గౌరవించుచు ఇట్లు చెబుచున్నాడు. ఓ విదురా, నీవు సత్పురుషుడవు. నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. దాని సమాధానము లోకులందరుకు మేలును కలిగింపగలదు. నీవు భగవంతుని యందే మనసు నిలిపిన వాడవు. భగవద్భక్తి లేని ప్రజలను శిక్షించెడు యముని అంశ వలన మాండవ్య శాపముచే వ్యాసుని వలన దాస్యందు జన్మించిన వాడవు. భగవద్భక్తులతో కూడిన శ్రీకృష్ణునకు నీవు అత్యంత ప్రీతిపాత్రుడవు. అందుచేతనే భగవానుడు ఈ భూమిని విడిచి వెళ్ళుచు నీకు జ్ఞానమును ఉపదేశించమని నాకు ఆదేశించెను. భగవంతుని అమోఘమగు ఆశ్చర్యజనకమగు శక్తిచే ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములు, మోక్షము మొదలగునవి ఎట్లు జరిగినవో నీకు చెప్పెదను. ఈ కనపడుచున్న జగత్తు సృష్టికి ముందు భగవానుడుగానే ఉండెను. అప్పుడు ఒక్కడే ఉండెను. ఈ ప్రకృతి జీవులు నామరూప విభాగము లేనివై సూక్ష్మమగు అవస్థను చెంది భగవానుని కంటే వేరుగా కనపడక భగవానులో చేరి ఉండెను.

ఆ భగవానుడే ఈ జీవులందరిలో ప్రవేశించిన నిలుపువాడు. అతడే స్వామి. సృష్టి చేయవలెనని సంకల్పం కలిగినవాడు. దేవ మనుష్యాది నామ రూపములు గలదిగా భిన్న భిన్నములగు పేర్లతో వ్యవహరింపబడుతున్నదిగా తన శరీరముకు ప్రకృతిని మార్చి. తాన్నే భిన్నముగా కనపడుతును. ఆ భగవానుడు ప్రళయ దశలో కూడా సర్వజ్ఞుడు. కర్మాధీనముగా ఒకనాడు సంకోచించుట ఒకనాడు వికసించుట లేదు. అట్లు సూక్ష్మావస్థలోనున్న చేతన అచేతనములు అనుశక్తులతో కూడిన పరమాత్మ దృశ్యమగు జగత్తును చూచన చూడని వాడై ఉండెను. తనను నామరూప రహితుడుగా తలంచెను. తరువాత అతడే తన సంకల్పముచే తన నుండి విడదీయుటకు వీలు కాకుండా చేరిన ప్రకృతి నుండి. జీవుల నుండి ఈ స్థూలముకు జగత్తును సృష్టించినాడు. ఈ కనిపించుచున్న సత్తు అసత్తు అని పిలువబడే చేతనా చేతనాత్మక జగత్తు అంతయు శక్తి రూపమై వానితో చేరియే ఉండునది. అది మాయ అనగా ప్రకృతి. దాని చేతనే ఈ జగత్తును అతడు నిర్మించినాడు. కాలమును అనుసరించి సత్వ రజస్తమో గుణములు గల ప్రకృతిలో మార్పు కలగగా అందు తాను లోన ప్రవేశించి. జీవులను ప్రవేశింపచేసెను. తాను ఏమియు మార్పు చెందని వాడై తనకంటే వేరుగానుండని జీవునిచే ఈ ప్రకృతిని సృష్టికి అభిముఖమగునట్లు చేసెను. అప్పుడు కాలము యొక్క ప్రేరణచే పరమాత్మ ఆత్మగా గల జీవుడు చేరియున్న అవ్యక్తము నుండి మహత్తత్వము బయలు వెడలెను. సృష్టికి ముందు చీకటి వలె గోచరము కాక సూక్ష్మావస్థలోనున్న ప్రకృతిని ప్రేరణ చేసెను. భగవానుడు తన దేహమునందే అణిగి ఉన్న విశ్వమును అభివ్యక్తము చేసెను. అప్పుడు మహత్తత్వం వచ్చెను. ఆ మహత్వత్వము కూడా జీవుడు సత్వ రజస్తమో గుణములు కాలము అనివానితో కూడినదై భగవానుని సంకల్ప రూపమగు జ్ఞానము ప్రసరింపగా విశ్వమును సృజింపదలచిన భగవంతునిచే మార్పు నొందుటకు సిద్ధమాయెను.

ఆ మహత్తత్వములో జీవుడు అనుప్రవేశించి యుండెను. ఆ జీవునిలో పరమాత్మ ఆత్మగా యుండెను. అందుచే ఇప్పుడు పరమాత్మయే ఆ శరీరమగు మహత్తత్వమును జగద్రూపముగా మార్చుటకు సంకల్పించెను. ఆ మార్పు చెందుచున్న మహత్తత్వము నుండి అహంకారము పుట్టెను. అదియే కార్యములకు, శరీరములకు, ఇంద్రియములకు కారణమైనది. అహంకారము, సాత్విక అహంకారము, రాజస అహంకారము, తామస అహంకారమని గుణభేదముచే మూడు విధములాయెను. సాత్విక అహంకారమును వైకారికము అని పేరు. రాజస అహంకారమునకు తైజసము అని పేరు. తామస అహంకారమునకు భూతాది అని పేరు. సాత్వికాహంకారము నుండి మనస్సు ఆవిర్భవించినది. ఇంద్రియములకు అధిష్టాన భూతములగు దేవ అని వ్యవహరింపబడేది దిక్కు మొదలగునవి సాత్వికాహంకారము నుండియే వచ్చినవి. ఆ ఇంద్రియములే శబ్దము, స్పర్శ మొదలగు వానిని ఎరింగించునవి. తజస అహంకారముచే సహకరింపబడిన సాత్విక అహంకారము నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు బయలు వెడలెను. తామసాహంకారము నుండి ఆకాశాది భూతముల యొక్క సూక్ష్మాంశములు ఆవిర్భవించెను. వానిని సూక్ష్మ భూతములనియు తన్మాత్రనియు అందురు. తామస అహంకారమే భూత సూక్ష్మములకు అనగా శబ్దము మొదలగు వానికి స్థూలముగు భూతములకు కూడా కారణము. బ్రహ్మను ఆత్మ స్వరూపమును ఎరింగించే శబ్దము భూతాది అనే అహంకారము నుండి బయలుబడినది. ఆ శబ్దము నుండి ఆకారం వచ్చినది. భగవత్ సంకర్పముచే జీవ కాల ప్రకృతి సంకలనముచే ఆ శబ్దము అనడి భూత సూక్ష్మము నుండి ఆకాశం వచ్చినది. ఆ ఆకాశము నుండి స్పర్శ తన్మాత్ర జనియించినది, అదియే మార్పు చెందుచు వాయువుగా మారెను. ఆ స్పర్శ నుండి పుట్టిన వాయువు మార్పు చెందుచు ఆకాశం యొక్క గుణమైన శబ్దముతో కూడినదై రూప తన్మాత్రమును సృజించెను.

ఆ తేజస్సు స్పర్శ గుణముతో కూడా కూడినదై ఉండెను. ఇట్లు శబ్దము, స్పర్శ అను రెండు గుణములతో పాటు రూపము కూడా తేజస్సుకు గుణములై ఉండెను. భగవత్ సంకల్పముచే కాలము, జీవుడు, ప్రకృతి సంబంధముచే రసమును సృజించెను. ఆ రసమే రసము గుణముగా గల జలమును సృజించెను. ఆ జలమునందు శబ్దము, స్పర్శ, రూపము కూడా గుణములుగా ఉండెను. సహజముగు రసము కూడా దానికి గుణమైయుండెను. ఆ జలము నుండి గంధము అను గుణము గల భూమి బయలు బడెలెను. ముందు గంధ తన్మాత్రము జనియించి దాని నుండి భూమి వచ్చెను. ఇందు వెనకటి శబ్దము, స్పర్శ, రూపము, రసము కూడా గంధముతో పాటు ఉండెను. ఆకాశమునకు ఒక్క శబ్దము గుణము, వాయువునకు శబ్దము స్పర్శ అను రెండు గుణములు ఏర్పడెను. తేజస్సునకు శబ్దము స్పర్శ రూపము అను మూడు గుణములు ఏర్పడెను. జలమునకు శబ్దము స్పర్శ రూపము రసము అను నాలుగు గుణములు ఏర్పడెను. ఇట్లు భూతములన్నియు సృష్టించబడియు ఇవి అన్నియు భిన్నభిన్నములై కార్యములను జనింపచేయుటకై సమర్థములు కాలేకపోయెను. ఇవి అన్నియు. భగవానునకు శరీర భూతములే కానీ బ్రహ్మాండము నిర్మించుటలో సమర్థములు కావు అప్పుడు మహత్తత్వం మొదలు భూమి వరకు ఉండు తత్వములు పాళ్ళుగా ఒకదానితో ఒకటి కలిసినా గాని అండ సృష్టి చేయుటకు సమర్థములు కావు అందుకే తత్వములు భగవానుని నమస్కరించుచున్నవి. ఇట్లు స్తోత్రము చేయుచున్నవి. దేవా శరణాగతులైన వారి తాపములను గొడవ వలె వారించువాడవు నీవు. నీ పాదారవిందమును ఆశ్రయించి మనసును నియమించుకొన ప్రయత్నించిన యతులు సుఖముగా సంసార దుఃఖమును వీడి మోక్షమును నొందుచున్నారు. సర్వేశ్వరా ఈ సంసారములో నీ పాద పద్మములను తప్ప ఇతరమైన వారిని శమించిన వారిని. తాపత్రయములు ఆక్రమించుచుండును. తాపత్రయములు తగ్గుటకు నీ పాదస్పర్శ సేవనమే ఉపాయము. నీ పాద ఛాయలో ముక్తికి ఉపాయముగు శరణు పొందిన వారము. పాపములను పోగొట్టగలిగిన ఉదకములు గల గంగానది పుట్టిన

నీ చోటు నీ పాదము, నీ పాదము నుండి జనించిన గంగయే పాపములను తొలగించునది. దాని ఉత్పత్తి స్థానమగు నీ పాద పద్మములు ఆశ్రయించిన వారి పాపములు తొలుగుటలో సంశయము లేదు. వేదములు అన్నియు నీ ముఖములనడి గూడుల నుండి ఎగిరిన పక్షులే. పక్షులు గూటిల నుండి ఎగిరి మరల ఆ గూటికే చేరునట్లు వేదములన్నియు నీ ముఖము నుండి వెలువడి మరల నీయందే చేరుచున్నవి. అట్టి వేదములనే సంగర రహితముగు మనస్సునందు ఋషులు పరిశీలించుచుందురు. ఈ వేదములో చెప్పబడిన కర్మ, జ్ఞానము, భక్తి మార్గములను ఆచరించి నిన్ను ఆరాధించుచుందురు. ఈ విషయములందు ఆసక్తి గల సంసారులకు మనస్సులో సంఘము వీడుట నీ కటాక్షము చేతనే శ్రద్ధతో కూడిన భక్తి చేతను వైరాగ్యము జ్ఞానము తోడుగా కలిగిన భక్తి చేతను నీ అనుగ్రహం కలుగును అందుచే మేము నీ పాదపద్మమునే శరణం పొందుచున్నాం సర్వేశ్వరా నిన్ను ఆశ్రయించిన వారికి నీ పాదపద్మమే అభయము సంగును. దానిచే వారికి సంసార భయము తొలుగును. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయములను వనరుచుటకు బ్రహ్మ రుద్రులలో అనుప్రవేశించి స్వయముగా విష్ణువుగా అవతరించి నీవే ఈ జగత్తును రక్షించుచున్నావు. నీవే భక్తులను అనుగ్రహించుచున్నావు. నీవు అంతర్యామి అయి అందరి శరీరములందు ఉందువు. కానీ ఈ శరీరము నాది నేను అనిపించుచుండును. మూఢముకు పట్టుదలతో శరీరమే నేను అని శరీరమునకు చెందినవి నావని భావించు వారులకు నీవా శరీరములో దగ్గరగా ఉన్నను పొందుటకు సాధ్యము కాదు. ప్రకృతి వికారములను శబ్దం మొదలగు విషయములందు ఆసక్తి గల ఇంద్రియములు మనస్సు నిన్ను చేరకుండా దూరముగా లాగివేయుచుండును. అట్టివారు నీ పాదములు ప్రవర్తించెడి మార్గములు గుర్తించెడి భాగ్యమునందలేరు. ఇంద్రియములకు వశపడిన వారు. సత్సంగతి చేయలేరు. సత్సంగతి చేసి సత్పురుషుల శుశ్రూష చేయనిదే ఆచార్య పాదము సేవనము లభింపదు. వారి పాదములను సేవించిన నాడు గాని నీ యందు భక్తి కలగదు. శ్రవణముచే భక్తి కలిగిన వారి మనస్సు నిర్మలమగును. మనస్సును అంటిన పుణ్య పాపములు అనేటి ప్రతిబంధకము తొలుగుటచే వైరాగ్యము విషయములందు మనస్సు లగ్నము కాకపోవుట ఏర్పడును అప్పుడు మనస్సు నిన్నే తలంచుండును.

దానిచే నీ దర్శనము కలుగును. అట్టి ధ్యానముచే నీ లోకమును పొందుదురు. కొందరు మనస్సు స్థిరముగా ఆత్మయందు నిలిపి దాని ద్వారా భగవానుని నిశ్చలముగా స్మరించెడు యోగమును పొందుదరు. వారు ప్రకృతిని జయించి. ఇంద్రియ జయము గలవారై పరమ పురుషుడగు నిన్ను చేరెదరు కానీ అట్లు యోగాభ్యాసము ద్వారా తమ ప్రయత్నముచే తాము చేరెడి వారు ఎక్కువ శ్రమపడి సంపాదించవలసి యుండును. పెద్దలను సేవించి భగవత్ కథలను వినని వారికి నిన్ను పొందుట సులభము. మహత్తు మొదలు పృథ్వి వరకు ఉన్న తత్వములన్నియు ఇట్లు స్తోత్రము చేసి ఇంకను ఇట్లు విన్నవించుకొనుచున్నవి. ఇంకా తరువాత ఇంకా ఎలాంటి స్తోత్రం చేశాయి ఈ తత్వాలన్నీ కూడా అనేది ముందు భాగంలో మనం తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Salutations to Asmadguru. Now, I know the qualities of the gods through the three Gunas. Salutations to the minds of those who are deluded by them. Salutations to the heroes of glory. By the illusion of this threefold creation of God, the minds of people like us are theirs The pokers are armed. We do not know the actions of devotees of Hari or the actions of incarnations like you. This is certain. Showing kindness is a heroic quality, and through it, their fame increases. Salutations to such incarnations. Fourth Canto, 17th Chapter, 36th Prayer. Devotees of God, welcome to the third episode of the third book of Srimad Bhagavata Tattva Deepika, Podcast. Earlier, Vidura went to Maitreya as Uddhava had told him and is praying to Maitreya. What is the answer given by Maitreyi, as you prayed? To walk out of this world of suffering. Let’s hear what that means in this podcast.. Thus, when Vidura asked, Maitreya expressed his desire to listen to the divine story that bestows unending bliss upon humans, Vidura Respectfully, he says so. Oh, Vidura, you are a noble soul. That is a very good question. Its answer can bring good to all the people. You are the one keeping your mind on God. You are the one born in servitude by Vyasa, due to the curse of Mandavya, by the part of Yama who punishes people without devotion to God. You are very dear to Sri Krishna, who is with devotees of the Lord. Therefore, the Lord, leaving this earth, commanded me to give you knowledge and teachings. By the wonderful and astonishing power of God, I will tell you how this world's creation, preservation, dissolution, liberation, and so on, happened. Before the creation of this visible world, the Lord existed. Then it was only one. These natural beings, without any form or name, having attained a subtle state, without appearing different from the Lord, were united in the Lord.

The Lord is the One who enters into all these beings. He is the Lord. The one who has the intention to create. Being with names and forms like gods, humans, etc., being treated with different names, changing nature to her body. It appears to be different. The Lord is omnipresent, even in the phase of dissolution. It is dependent on karma, it does not develop one day or another. Thus, the Supreme Being, which is in a subtle state, is unseen by the conscious, unconscious, and inert powers, and is unseen by those who do not see the visible world. He considered himself to be without a name. Then he, by his own will, from the nature that could not be separated from him. From living beings, he created this gross world. This visible, existing, real and unreal, called consciousness, the conscious, cognitive world, is all in the form of energy and is connected with it. It's the Maya, the nature. It is through that He created this world. Following time, as the qualities of Sattva, Rajas, and Tamas change in nature, it enters within itself. Entered the living. He is nothing He, being unchanging, made this nature, which is different from himself, face towards creation by a being. Then, by the inspiration of time, the Supreme Soul, being the soul, the unmanifest, from which the great essence has emerged. Before creation, it inspired the nature that was in a subtle state, not visible like darkness. The Lord manifested the universe contained within His body. Then the greatness came. That greatness also, the living being, with the qualities of Sattva, Rajas, and Tamas, being united with time, the knowledge that is the form of the Lord's will, spreads, and is ready to be transformed by the Lord who wishes to create the universe.

In that great essence, the soul has entered. The Supreme Soul is the soul of the individual beings. Therefore, now the Supreme Being has resolved to transform that body, which is the great element, into the form of the world. From the great element that is changing, ego was born. That is the cause of actions, of the body, of the senses. Ego, Sattvic ego, Rajasic ego, Tamasic ego, due to the difference in qualities, it became of three types. The Sattvic ego is called Vaikarika. Rajasic ego is called taijasic. Tamas is the name of the egoistic element. The mind is the product of the soul. The deities who are the presiding elements of the senses, such as direction, etc., are said to have originated from Sattvic ego. Those senses are the ones that make us perceive sound, touch, etc. From the Sattvic ego, which is assisted by Tajas, the sense organs and the organs of action have emerged. From the egoistic darkness, the subtle elements of the sky and other beings emerged. They call him the subtle element and the atom. Tamasa Ego is the cause of the subtle elements, that is, sound and other such things, as well as the gross elements. The sound that makes Brahma, the embodiment of the self, emerge from the ego called Bhutadi. The shape came from the sound. By the divine intervention, by the accumulation of the life-time nature, that sound, from the subtle element, the sky came. From the sky, the touch of the tanmatra was born, and that itself changed and became air. The air born from that touch changed and, being filled with the sound, which is the quality of the sky, created the form of the self-manifestation.

That radiance was also combined with the touch quality. Thus, along with sound and touch, form was also a quality of radiance. By the will of God, time, the living being, and nature created the essence. He created the water with the quality of juice. In that water, sound, touch, and form were also qualities. The natural juice was also its quality. From that water, a land with the quality of sandalwood emerged. First, the Gandha Tanmatra originated, and from that, the earth came. Behind this, sound, touch, form, and taste were also present along with smell. The sky has one quality of sound, and the air has two qualities of sound and touch. For radiance, sound and touch are the three qualities that are formed. Water has four qualities: sound, touch, taste, and smell. Thus, all the elements were created, and all of them are different and capable of causing actions to be born. These are all. God has physical and mental beings, but he is not capable of creating the universe Then, from the greatness to the earth, the elements that exist, even if they are partially combined with each other, are not capable of creating an egg. That is why the elements are bowing to the Lord. Thus be the praise. Oh God, you are the one who removes the sufferings of those who have surrendered to you like a calf. Those ascetics who have tried to control their minds by taking refuge in your lotus feet are happily abandoning worldly sorrows and attaining salvation. Oh Lord, in this world, except for your lotus feet, who has subdued others? Troubles will befall. To reduce the three sufferings, your touch and service at your feet is the only solution. We have surrendered to the means of liberation in the shade of your feet. The Ganges river, which has the water that can remove sins, was born

Your place is your feet, the Ganges that originates from your feet removes sins. There is no doubt that the sins of those who take refuge in your lotus feet, which is the place of its production, will be removed. The Vedas are all birds that flew from the nests of your faces. Birds fly from nests and return to the same nest, just as all the Vedas emanate from your face and return to you. Such Vedas are free from conflict, and the sages examine them in their minds. They worship you, practicing the karma, knowledge, and devotion paths described in this Veda. Those who are interested in these matters, to leave the world in their minds, it is only by your grace, with devotion, with detachment, with knowledge, with devotion accompanied by knowledge, your grace will be upon us. Therefore, we seek refuge in your lotus feet We are receiving, O Lord of all, your lotus feet are the only refuge for those who take refuge in you. By that, their family fear will be removed. To create, sustain, and destroy this universe, Brahma, Rudra, and others enter, and Vishnu himself manifests. You are this Protecting the world. You are the one bestowing grace on the devotees. You are the inner self, and you are in all bodies. But this body, I feel is mine. Those who are foolish and determined, thinking that the body is me and that I belong to the body, it is not possible for them to attain you, even if you are close to the body. The senses and mind, which are interested in things like sounds and other things, will pull you away from you. Those who are like that do not have the fortune to recognize the paths your feet will take. Those who are controlled by their senses. They can't do satsang. Without doing good deeds and serving the virtuous, service to the feet of the Acharya is not attained. Unless you serve their feet, you will not have devotion to you. The mind of those who are devoted to hearing becomes pure. By removing the obstacles of the merits and sins that cling to the mind, detachment will occur, and the mind will not be attached to worldly matters. Then the mind will remember only you.

By that, you will have a vision. By such meditation, they attain your world. Some, keeping their minds steady in the self, through that, attain the yoga of remembering the Lord steadfastly. They conquer nature. Those who have conquered the senses will reach you, the Supreme Being, but those who reach you through their efforts through the practice of yoga will have to work harder to earn it. It is easy to attain you for those who serve elders and do not listen to the stories of the Lord. From the greatness to the earth, all the elements are praising thus, and still requesting thus. And then, what kind of hymns were sung, all these elements, let's find out in the front part. Salutations to Asmadguru, Jai Srimannarayana.