నవకన్యల జననము - ప్రజాపతుల కన్యాదాన వైభవము
The Birth of Nine Daughters & Lineage of Sages
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, స్వాయంభువ మనువు మరియు శతరూపల నవకన్యల దివ్యమైన జననం గురించి వివరించబడింది. ప్రజాపతులు ఆ శ్రేష్ఠమైన కన్యలను వివాహమాడి, సృష్టి విస్తరణకు మూలభూతమైన వంశపరంపరలను స్థాపించారు. ప్రతి కన్య మహర్షులతో చేసిన వివాహం, ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులను పోషించే మహత్తర వంశాలకు జన్మనిచ్చింది. ఈ ఘట్టం, సృష్టిలో దైవసంకల్పం పవిత్ర కుటుంబ బంధాల ద్వారా ఎలా నిర్వహించబడుతుందో అద్భుతంగా తెలియజేస్తుంది.
In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, we explore the divine birth of the nine daughters of Svayambhuva Manu and Shatarupa, whose lives became the foundation of creation's great lineage. The Prajapatis, the progenitors of mankind, receive these noble daughters in marriage, marking a momentous chapter in the unfolding of cosmic order. Each daughter's union with a great sage gave rise to illustrious lineages that shaped the spiritual and material worlds as described in the Puranas. This episode beautifully reveals how divine will operates through sacred family bonds to sustain and expand creation.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నయస్య సఖ్యం పురుషో వైతి సఖ్యుహు సఖావసన్ సంవసతః పురేస్మిన్ గుణో యధా గుణీనో వ్యక్త త దృష్టే తస్మై మహేశాయ నమస్కరోమి జీవేశ్వరుడు సర్వకాల మిత్రుడు. నగరమనదగిన ఈ దేహమునందు జీవునితో పాటుగా మిత్రుడవు ఈశ్వరుడు కూడా సర్వ జగత్ సాక్షియే కలిసి నివసించుచున్నాడు. కానీ జీవుడు తన మిత్రుని గుర్తించలేకున్నాడు. శబ్దము మొదలగు విషయములు చెవి మొదలగు ఇంద్రియములచే ప్రకాశింపజేయబడునే గాని ఆ ఇంద్రియములను ఆ విషయములు ప్రకాశింపచేయలేవు. అదే విధంగా జీవుడు నిత్య దృక్ స్వరూపుడగు ఈశ్వరుని తన జ్ఞానములో విషయముగా చేయలేడు. అట్టి సర్వేశ్వరునకు నేను నమస్కరించుచున్నాను. సిక్స్త్ క్యాంటో, ఫోర్త్ చాప్టర్, 24th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక 34వ. పాడ్కాస్ట్లో స్వాగతం తృతీయ స్కంధంలో కపిల గీత 32వ భాగం నుండి మన కపిల గీత ప్రారంభమైంది దీన్ని శ్రద్ధగా వినండి ఒకవేళ ఈ పాడ్కాస్ట్ వినడం ప్రారంభిస్తే 32 కి వెళ్లి విని వస్తే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది కపిల గీత దేవహుతి కి కర్దం కపిలుడు తన తల్లి దేవహుతికి వివరించినటువంటి భాగం. ఇది విదుర మైత్రేయ సంవాదంలోని భాగంగా ఉంది. ప్రకృతి, పురుష, కాలములు మూడును భగవద్రూపములే. ప్రకృతి, పృథివి మొదలగు రూపములతో మనకు కనపడును. కనుక అది స్పష్టముగా గోచరించును. పురుషుడు కాలము గోచరము కావు. అవి శాస్త్రము చేతనే ఎరుంగదగినవి. ఆ పరమ పురుషుడే లోన పురుష రూపములో ఉండి కోరుచున్నాను, ద్వేషించుచున్నాను అని మాటలను అనిపించుచు కోరికకు ద్వేషమునకు సుఖమునకు దుఃఖమునకు ఆశ్రయుడై ఉండును.
జీవుడు శరీరములో పరమ పురుషునకు శరీరమై లోన ప్రవేశించి నియమించుచుండుటచే ఆ భావమును కలవాడగుచున్నాడు. కనపడుచున్న వినబడుచున్న సకల పదార్థములకు నిన్న గడిచినది ఈ రోజు అగుచున్నది రేపు కానున్నది అను వ్యవహారమును కలిగించున్నది కాలము. ఆ కాలమునకు కూడా లోనుండి నియమించువాడు పరమ పురుషుడే. ఇట్లు పరమ పురుషుడే లోక జీవ రూపుడై వెలుపల కాల రూపుడై ఉండును. అట్లు ఉండుటచే ఆ పరమ పురుషుడే ఈ సృష్టికి మూలము. పరమ పురుషుడు తనకే చెందినదగు ప్రకృతి యందు ఒకనాడు తాను సంకల్పించి సత్వరజస్తమో గుణములలో హెచ్చుతగ్గులుగా ఉండుట కలిగించును. ఆ ప్రకృతి యందు ప్రపంచ సృష్టి సామర్థ్యమును నిక్షేపించెను. అప్పుడు ఆ ప్రకృతి ప్రకాశము గల మహత్వత్వముగా ఆయెను. సత్వరజస్తమో గుణములలో ఒక గుణము క్రిందకు పోవుట, ఒక గుణము పైకి లేచుటయే కదలిక అందురు. జగత్తుకు కారణభూతుడగు భగవానుడు సహజముగా ఏ వికారము లేనివాడు. అతని నుండి విడదీయుటకు వీలు కాకుండా శరీరం వలె ధరించి నియమింపదగినదై ప్రకృతి అతనితో చేరి ఉండును. ఈ విశ్వమంతయు లయములో ఆ ప్రకృతి యందు లీనమై ఉండును. దానిని తన సంకల్ప రూప జ్ఞానముచే మరల ప్రకటము చేయవలెనని భగవానుడు సంకల్పించును. అప్పుడు ఆ ప్రకృతి తమో రూపమై జీవాత్మల యొక్క జ్ఞానమును పూర్తిగా సంకోచింపచేయును. వాసుదేవ అను రూపము గల భగవానుని వ్యూహముచే అధిష్టితమగు అవ్యక్తము అనబడెడి మూల ప్రకృతి అంతఃకరణములో ఒకటగు చిత్తమును అనుగ్రహించుచుండును. అది శాంతము అనగా తమోగుణము ఆవరించినది ఆవరించనిది. అది సత్వగుణం ప్రధానముగా గలది కనుక ప్రకాశించుచుండును. అదియే భగవత్ సంకల్పముచే మహత్తత్వముగా వచ్చును. అవ్యక్తమునకు దాని నుండి ఆవిర్భవించిన మహత్తత్వమునకు కూడా వాసుదేవుడే అధిష్టానమై ఉండును.
చిత్తము స్వచ్ఛముగా ఉండి వికారములు ఏమియు లేనిదై రజస్తమస్సులచే కలత చెందకుండా ఉన్ననాడు అది వాసుదేవునిచే అధిష్టింపబడునది అని గుర్తింపవలెను. నీరు కదలిక లేక, నురుగు కెరటముగా ఏర్పడక, పై నుండి తనలో ప్రతిఫలించు వస్తువును ప్రతిబింపగలదై ఎట్లు ఉండునో, అట్లు మనస్సు ఉన్ననాడు ఆ మనస్సును వాసుదేవుడు అధిష్టించి ఉన్నాడు. అదియే పరా ప్రకృతి అని గుర్తించవలెను. భగవంతుని సంకల్పముచే ప్రేరణ చేయబడి మహత్ తత్వములో వికారము కలుగును. అప్పుడది వైకారికము, తేజసము, తామసము అను భేదములచే మూడు విధములుగా ఉండును. అది క్రియాశక్తి లేక అహంకారం అనబడును. ఈ మూడు విధములగు అహంకారము నుండే మనస్సు, జ్ఞాన కర్మేంద్రియములు, ఆకాశము మొదలగు భూతములగు కారణము, కారణముగు శబ్దాది తన్మాత్రులు కూడా ఉద్భవించును. అహంకారమును సంకర్షుడు అధిష్టించి ఉండును. అతనిని అనంతుడు అందురు. అతడు సహస్ర శిరస్సు గలవాడు. పరమ పురుషుని వ్యూహములలో ఇది కూడా ఒక వ్యూహము. మనస్సులో నేను నడుచుచున్నాను, నేను చేయుచున్నాను. అనడి భావములు కలుగుట అహంకారము చేతనే ఇట్లు అహంకారము చేయుట మొదలగు క్రియలే వీటికన్నిటికీ ఆశ్రయముకు దేహమై ఉండును. శాంతముగా ఉన్నప్పుడు ప్రకాశము గలదై ఉండును. అప్పుడు తాను తానుగా గుర్తించుకొనగలుగును. ఘోరముగా ఉన్నప్పుడు చరణము కలదగును. అప్పుడు ఇంద్రియములు ఆయా వ్యాపరములు చేయునవే ఉండును. మూఢమైనప్పుడే జ్ఞానము లేనిదై. జడమై ఉండును. తన్ను తాను గుర్తించుకొనగల శాంత దశలో పంచభూతములతో శరీరమై ఉండును. ఇది అంతయు అహంకారము నుండి వెలువడినది. సాత్విక అహంకారము నుండి మనస్తత్వం బయలు వెళునది. దాని యందు సంకల్ప వికల్పములు కలుగును. సంకల్పం అనగా ఒకటిగా తలంచుట. దేహముతో ఆత్మ ఒకటి అని తలంచుటకు సంకల్పం అని పేరు. వికల్పమనగా ఒకటిగా వివిధ విషయములందు గూర్చి తలుంచుట. మనస్సు ఈ రెండు పనులను చేయుచుండును. తైజస అహంకారము తోడుగా గల సాత్విక అహంకారం వలన మనస్సు ఏర్పడి సంకల్ప వికల్పములను చేయుచుండును. దానికి వ్యూహములలో ప్రద్యుమ్నుడు
అధిష్టానము ఆ ప్రద్యుమ్నుడే కాముడు. అందుచే మనసులో కోరికలు కలుగుచుండును. కోరికలు కలిగి మనసును నియమించువాడు ప్రద్యుమ్నుడు లేక కాముడు. ఇంద్రియములకు అధిష్టాన దేవత అనిరుద్ధుడు. తేజసాహంకారముచే అనుగ్రహింపబడిన సాత్విక అహంకారము ఇంద్రియములను అభివ్యక్తము చేయును. అనిరుద్ధమనడి వ్యూహము ఋషుల చేత ఆరాధింపదగినది. ఇది శరత్కాలములోని నల్ల కలువ వలె నీలమగు వర్ణమై కలదై ఉండును. అనగా ఋషులు చేయవలసినది ఇంద్రియముల మూలస్థానము అనిరుద్ధిని ఉపాసించుటయే. జ్ఞానమును పుట్టించు సామర్థ్యము గలది బుద్ధి. దానిచే ఎరుంగబడును కనుక దేనినేను ఎరుంగునట్లు చేయునది బుద్ధి అనబడును. ఒక వస్తువును చూడగానే వస్తువుగా స్మరించుట. బుద్ధి వృత్తిచే కలుగును. అట్లు ఇంద్రియములలో ఆయా వస్తువులను గూర్చి జ్ఞానమును కలుగునట్లు చేయునది బుద్ధి. బుద్ధిలో భిన్న భిన్న ప్రవృత్తులుండును. బుద్ధి ఇంద్రియములను అనుగ్రహించి జ్ఞానమును కలిగించును. ఇంద్రియములు ఆయా పదార్థములతో కలియగానే కలిగెడి జ్ఞానము ఆ బుద్ధి చేతనే కలుగును. అది భిన్న భిన్నముగా ఉండును. ఒకప్పుడు దాని యందు లేని ధర్మము ఉన్నట్లు ఇంద్రియములు గుర్తించును. తెల్లగా ఉన్న శంఖమును చూచి పచ్చగా ఉన్నది అనుకొనుట అన్యధాజ్ఞానము. ఒకప్పుడు నిలువుగా లావుగా నిలిచిన వస్తువును చూచి మసక చీకటిలో మనిషియో మరాను అనుకొనుటను సంశయ జ్ఞానము. ఒకప్పుడు ఇది ఆ వస్తువే అని నిశ్చయ జ్ఞానము కలుగును. దీనిని ప్రమేయదార్ధ జ్ఞానమందురు. ఒక వస్తువును ఒకసారి ఎరింగిన తరువాత మరల మనసును గుర్తించుట స్మృతి. ఒకప్పుడు ఇంద్రియములు దేనిని గ్రహింపకుండా మానును. దీని నిద్ర లేక స్వాపము అందురు. ఇవన్నీయు బుద్ధి ఇంద్రియములను అనుగ్రహించుటలో కలిగెడి భేదములచే కలుగును. తేజస అహంకారము నుండియే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా ఆవిర్భవించును. కానీ కేవల తేజస అహంకారము నుండి ఆవిర్భవింపవు. వైకారికము లేదా సాత్వికమైన అహంకారముతో కూడిన తేజస అహంకారము నుండియే ఇంద్రియములు ఆవిర్భవించును. ఆ ఇంద్రియములు కర్మి
జ్ఞానేంద్రియములు జ్ఞానేంద్రియములని రెండు విధములు. జ్ఞానేంద్రియములను బుద్ధి అనుగ్రహించును కర్మేంద్రియములను ప్రాణము అనుగ్రహించును అనగా జ్ఞానేంద్రియములు ఆయా పదార్థములతో సంబంధించి జ్ఞానమును కలిగించుట బుద్ధి చేతను కర్మేంద్రియములు అవి చేయదగిన పనులు చేయుటకు ప్రాణము చేతను అని గుర్తించవలెను. భగవత్ సంకల్పముచే వికారము చెందిన తామస అహంకారము నుండి శబ్దము సూక్ష్మము రూపముగా ఆవిర్భవించును. దానిని శబ్ద తన్మాత్ర మందురు. ఆ శబ్ద తన్మాత్రము నుండి ఆకాశము ఆవిర్భవించెను. శ్రోత్రము ఇంద్రియము. ఇది శబ్దమును గుర్తింపజేయు ఇంద్రియము. శబ్దము ఆకాశమునకు అసాధారణముకు గుణము. అది ఒక అర్థమును బోధించును. ఆ శబ్దమే ద్రష్ట అగువానికి పదార్థము తెలిసినది అనుటకు సూచకము. ఒక అర్థమును చూచి ఒక శబ్దముతో దానిని కూర్చి చెప్పిన వాడే దానిని ఎరంగినవాడు. ఆ ఈ శబ్దం వలన ఆ పదార్థము గోచరమగును. అనగా వినిన వానికి తెలియబడును. శబ్దమునకు అర్థమునకు సంబంధము నిత్యము. దాని ఎరింగెడి వాడు ద్రష్ట. దాని చేతనే వానికి కలిగిన జ్ఞానము అభివక్తమగును. లోకములోనున్న సర్వ పదార్థములకు అవకాశం వసొంగునది ఆకాశము. శరీరములోను ప్రాణము కదులుటకు ఇంద్రియములు ప్రసరించుటకు ఆత్మలోన ఉండుటకు వెలుపల సకల పదార్థములు ఉండుటకు అవకాశమును ఇచ్చునది ఆకాశము. శబ్ద తన్మాత్ర నుండి ఏర్పడిన ఆకాశమనడి మహాభూతము నుండి స్పర్శ తన్మాత్ర బయలుబడెను. ఆ స్పర్శయే వాయువును గుర్తింపచేయునది. దానిని గుర్తించునది త్వక్ అనే ఇంద్రియము. మార్ధవము, కఠినత్వము, చల్లదనము, వెచ్చదనము మొదలగు వానిని స్పర్శ చేతనే ఎరుంగుదురు. వాయువు చేతనే చెట్లు కొమ్మలు కదలుట, కలిసి ఉన్నవి దూరమగుట, దూరమైనవి మరల కలుగుట, ఒక ద్రవ్యం ఒక చోటు నుండి వేరొక చోటికి చేరుట, శబ్దం ఒక చోటి నుండి వేరొక చోటికి చేరుట జరుగుచున్నది. ఎక్కడో ఒక చోట ఉన్న వస్తువునందున్న వాసనను దూరముగా ఉన్న ఘ్రానేంద్రియము గ్రహించునట్లు చేయునది వాయువే. ఎచ్చటనో బయలు వెడలిన శబ్దము దూరముగా ఉన్న చెవికి వినబడుట వాయువు చేతనే.
భగవత్ ప్రేరణ చే స్పర్శ తన్మాత్ర గల వాయువు నుండి రూప తన్మాత్ర దాని నుండి తేజస్సు ఆవిర్భవించెను. ఆ రూపమును గ్రహించునది నేత్రము. ఈ రూపము చేతనే ఒక ద్రవ్యము వేరొక ద్రవ్యము కంటే వేరనిదని గుర్తించుటకు సాధనమైన ఆకారం ఏర్పడినది. ఈ రూపము ఒక ద్రవ్యమును ఆశ్రయించి ఉండును. ఒకే రకముగా ఉండు వ్యక్తులన్నిటి యందు సాదృశ్యమును గోచరింపచేయునది ఈ రూపమే. ఈ రూపము చేతనే తేజస్సు ఏర్పడినది. రూపము చేతనే ఇది తేజస్సు అని గుర్తింపబడును. ఈ తేజస్సు చేతనే వస్తువులు ప్రకాశించుచుండును. గట్టిగానున్న బియ్యం మొదలగు వస్తువులు మెత్తనగును. శరీరములో ఆకలి దప్పులు ఏర్పడి దాని ద్వారా త్రాగుట, భుజించుట సంభవించుచున్నవి. మంచును చలిని తొలగించుట, మంచును తేమను ఇంకింపచేయుట తేజస్సు యొక్క లక్షణములు. భగవత్ ప్రేరణమున రూప తన్మాత్ర మార్పు చెందిరి రస తన్మాత్ర అగును. ఈ రస తన్మాత్ర నుండి జలము అనడి మహాభూతం ఏర్పడినది. ఆ రసమును గ్రహించు ఇంద్రియము జిహ్వ. రసము ఏకరూపమే గానీ దానితో చేరిన ద్రవ్యముల యొక్క భేదములచే వగరు, తీపి, చేదు, పులుపు, కారము అను భేదములు ఏర్పడుచున్నవి. జలము గట్టిగా ఉన్న దానిని తడుపుటకు పనికి వచ్చును. మట్టి మొదలగు వానిని ముద్దగా చేయును. మనకు తృప్తి కలిగించునది నీరే. దాహము కలుగుటచే శరీరము కలిగిన బడలిక తీరుట నీటి చేతనే. వస్తువు మెత్తబరుచుట నీటి చేతనే, వెచ్చదనము తొలగించునది నీరే. ఇది భూమిలో అధికముగా ఉండును. మనకు కనపడు పదార్థములన్నియు పంచభూతముల కలయికచే ఉన్నవైనను అందు జలభాగము. అధికముగా ఉండును. దైవ పేరితమగు రస తన్మాత్ర నుండి ఏర్పడిన జలము నుండి గంధ తన్మాత్ర ఆవిర్భవించెను. ఈ గంధ తన్మాత్ర నుండి భూమి ఏర్పడును. భూమియందు వాసన గ్రహించునది ఘ్రాణేంద్రియము. వాసనంతయు ఏకరూపమే గానీ ఆయా పదార్థములు కలిగచే వేరు వేరు వాసనలు మనచే గ్రహింపబడుచుండును. కొన్నిటిలో పులుపు వాసన, కొన్నిటిలో దుర్వాసన, కొన్నిటిలో మిశ్రమ వాసన ఏర్పడుచుండును. కుండలు మొదలు పదార్థములను తయారు చేయుటకు మట్టియే అనగా భూమియే భూమియే సాధనము. చరాచరములు సకల భూతములకు స్థానము భూమియే. బీజముల నుండి మొలకలను రప్పించునుది భూమియే.
ఆయా దేశములలో దేశభేదముచే ఒకే రకమగు విత్తనముల నుండి సారములో భేదము ఏర్పడుట భూమి వలనె. ఆకాశం యొక్క గుణమును శబ్దమును గ్రహించును శ్రోత్రేంద్రియము, వాయువు యొక్క గుణ విశేషమగు స్పర్శను గ్రహించును త్వకింద్రియము, తేజస్సు యొక్క గుణ విశేషణమగు రూపము గ్రహించునది చక్షునింద్రియము, జలము యొక్క గుణవిశేషముకు వాసను గ్రహించునది దిహ్వేంద్రియము, భూమి యొక్క గుణవిశేషముకు వాసనును గ్రహించునది ఘ్రానేంద్రియము, ఏ భూతమునకు ఆ భూతమునందు ఒక గుణము సాధారణముగా ఉండును. ఆ భూతముల కలయ యొక్క కలయికచే ఆ గుణము వేరొక భూతమందు కూడా కనపడుచుండును. ఇట్లు సృష్టికి ముందుండు మూల ప్రకృతి నుండి ఏర్పడిన మహత్తత్వం మొదలు పృథ్వి వరకు ఏర్పడినవి ఇవన్నియు కలియవలెను. దీని తర్వాత భాగాన్ని మనం తెలుసుకుందాం. తన్మాత్రలు, తర్వాత ఇంద్రియములు వాటి యొక్క విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇది. అందరూ కూడా తిరిగి విని అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. తర్వాత భాగాన్ని మళ్ళీ మనం సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. May there be friendship with the good. May there be friendship with the virtuous. May there be a residence in this town. As the virtuous are known by their qualities, I bow to that great lord. The Lord of all beings is the friend of all times. In this body, which is worthy of being called a city, along with the soul, the friend, God also lives together as the witness of the entire world. But the creature cannot recognize his friend. Sound and other things are illuminated by the senses like the ear, but those senses cannot illuminate those things. Similarly, a living being cannot make the eternal, steady form of God a subject of his knowledge. I bow to such a God. Sixth Canto, Fourth Chapter, 24th Prayer. Devotees of God, Srimad Bhagavata Tattva Deepika 34th. Welcome to the podcast. In the third book, from the 32nd part of Kapila Geeta, our Kapila Geeta has begun. Listen to this carefully. If you start listening to this podcast, if you go to 32 and listen, the matter will be understood better. This is Kapila's song, the duty of Devahuti The part that Kapila explained to his mother, the goddess Devahuti. It is part of the Vidurāya-Māta-Uruvari dialogue. Nature, man, and time, all three are forms of God. Nature, the earth, and other forms are visible to us. So it is clearly visible. The male is not visible in time. They are to be learned by heart. That supreme being, being in the form of a man, is pleased, hates, and is pleased, and is the refuge for desire, hatred, happiness, and sorrow.
The living being, being the body of the Supreme Being, enters the body and rules within, thus becoming one with that feeling. Time is what causes the perception of all things that are visible and audible, that are past, that are present, and that are yet to come. Even in that time, the one who is appointed from within is the Supreme Being. Thus, the Supreme Being is the embodiment of the world, and also the embodiment of time. Thus, being so, that Supreme Being is the origin of this creation. The Supreme Being, in the nature that belongs to Himself, once decides and causes fluctuations in the qualities of Sattva, Rajas, and Tamas. That nature deposited the power of the world's creation. Then that nature became a glorious light. In the gunas, the guna of sattva and raja, one guna going down, and one guna rising up, that is movement, they say. The Lord, who is the cause of the universe, is naturally without any distortion. Nature, being appointed, is united with him in such a way that it cannot be separated from him, like the body. This entire universe is absorbed in that nature in rhythm. That's his The Lord will resolve to make it manifest again through the form of resolve. Then that nature, becoming the form of darkness, completely compacts the knowledge of the souls. The unmanifest, which is called the original nature, is blessed by the one mind that is one of the inner instruments, which is subordinate to the form of the Lord who is in the form of Vasudeva. That is peace, meaning the quality of Tamas has covered it, and it has not covered it. It is characterized by the predominance of the quality of goodness, therefore it shines. That itself comes as a great element by the will of God. To the unmanifest, and to the great element that emerged from it, Vasudeva himself is the presiding deity.
When the mind is pure and without any distortions, and when it is not disturbed by the obscurities of passion and delusion, then it should be recognized that it is enthroned by Vasudeva. Without water movement, without forming a foam wave, how it reflects the object reflected in it from above, in the same way, when the mind is there, Vasudeva has established that mind. That itself is the supreme nature, that should be recognized. Inspired by the will of God, a transformation occurs in the great essence. Then it is divided into three types based on the differences of Vaikari, Tejas, and Tamas. It is the energy or ego. From these three types of ego, the mind, the organs of knowledge and action, the sky, and other elements like the elements, the cause, and the elements like sound, etc., also originate. The ego is the one that occupies. He is called Anant. He is the one with the thousand heads. This is also a strategy in the strategies of the Supreme Being. I walk in my mind, I do. The feelings of saying so are caused by ego. Doing ego like this is the beginning The actions are the body that is the support for all of these. It is a light that shines when there is peace. Then he can identify himself. A verse is a line of poetry that has a specific length. Then the senses and their functions will be there. Unintelligence is ignorance. It will be tied up. In the state of peace where one can recognize oneself, one is embodied with the five elements. This is all out of ego. The mind is not free from the Sattvic ego. In it, there will be resolutions and counter-resolutions. Sankalp means to think of something as one. The name of the resolve is to consider the soul as one with the body. Vikalpa means to remember one thing among various things. The mind does these two things. The mind is formed by the Sattvic ego, which is accompanied by Tajasic ego, and makes decisions and alternatives. In that, in the strategies, Pradyumna
The presiding deity is Lord Kama. Therefore, desires arise in the mind. He who, with desires, disciplines his mind, is not Pradyumna, but Kama. Aniruddha is the presiding deity of the senses. The Sattvic ego, blessed by Tejasahkarama, manifests the senses. The strategy of Aniruddha is worthy of being worshiped by the sages. It is like a black lotus in the autumn season, a color that is blue. That is, what the sages should do is to worship the source of the senses, the unobstructedness. Intelligence is the ability to generate knowledge. Therefore, what is made to be known by it, that is called intellect. Recognizing an object as an object when it is seen. The intellect is produced by the activity of the intellect. Thus, the intellect is what creates knowledge about the objects in the senses. There are different tendencies in the intellect. The intellect is the instrument by which knowledge is imparted and wisdom is generated. The knowledge that is gained when the senses are connected with the respective objects is obtained through the intellect. It can be different. Once upon a time, in it The senses perceive the existence of a non-existent righteousness. To consider a white conch as green is a misconception. To doubt, thinking that a man or a woman is seen in the dim darkness, seeing an object that once stood tall and thick. At one time, this is the object, and a definite knowledge arises. It is the knowledge of the intervention. Recognizing the mind again after erasing an object is memory. At one time the senses would stop before anything else. This is called sleep deprivation. All these are caused by the differences that arise in the grace of intellect and senses. From the light of ego, the sense organs of knowledge and the sense organs of action also arise. But they do not arise from mere luminosity ego. The senses originate from the Tejas ego, which is associated with a Vaikari or Sattvic ego. Those senses are karmic
The senses are of two types. The intellect bestows senses, and the organs of action bestow life. That is, the intellect, which is related to the respective substances, causes knowledge, and the organs of action, to perform the tasks that they are capable of It should be recognized as life. From the Tamasic ego, which is distorted by the divine will, sound emerges as subtle form. It is the smallest sound element. From the sound of the primal sound, the sky emerged. The ear is a sense organ. It is the sense that allows one to hear. Sound is a property of the sky, extraordinary. It will teach you a meaning. That sound itself is indicative of the seer knowing the substance. The one who saw a meaning, combined it with a sound, and explained it, is the one who made it clear. That substance will be visible because of that sound. That is, it will be known to the one who hears. The connection between sound and meaning is eternal. The one who is in charge of it is the seer. By that, the knowledge he gained will be revealed. In the world The sky is the possibility of all substances. The sky gives the opportunity for the body to move, for the senses to function, for the soul to be in, and for all external substances to exist. From the sound element, the sound element emerged from the great element called Akasha. That touch is what makes the air move. It is the sense of touch which is the most important sense organ. Heat, hardness, coldness, warmth, etc., are known only by touch. The trees and branches move by the wind, the united become distant, the distant become again united, a substance reaches from one place to another, a sound reaches from one place to another. The air makes the smell in an object somewhere far away be perceived by the sense of smell. The sound that emanates from somewhere far away is heard by the ear that is far away only through the air.
By the inspiration of the Lord, from the air which has the quality of touch, from the quality of form, from that, the quality of light manifested. The eye is the organ that perceives visual information. It is through this form that a substance is created, a form that serves as a means to distinguish one substance from another. This form depends on a substance. This form is what makes the similarity visible in all people of the same kind. The radiance is formed by this form. It is identified by its form and its brilliance. It is by this radiance that things shine. Strong rice and other things become soft. Hunger and thirst are formed in the body, and through them, drinking and eating occur. Removing the coldness of the ice, and increasing the moisture of the ice are the characteristics of radiance. By the inspiration of the Lord, the form and the subtle elements change and become the rasa (essence) and the tanmatra (subtle elements). From this rasa tanmatra, the jala anadi mahabhuta was formed. The tongue is the sense organ that receives the juice. The taste is uniform, but due to the differences in the substances that are added to it, there are differences like sour, sweet, bitter, sour, and spicy They are arranged. Water is useful for soaking the hard one. Mud and clay make it into a lump. The water that quenches our thirst is the same water that satisfies our thirst. The body's fatigue caused by thirst is relieved by water. The object is softened by water, the heat is removed by water. This is the most abundant in the earth. All the visible substances are made up of the five elements, but water is also a part of it. It will be excessive. From the divinely infused rasa tanmatra, from the water formed, from the water, the gandha tanmatra manifested. From this Gandha Tanmatra, the earth is formed. The sense that perceives smell in the earth is the olfactory sense. The smell is uniform, but the different smells produced by the various substances are perceived by us. In some, there is a sour smell, in some a foul smell, and in some a mixed smell is formed. The clay, that is, the earth, is the means to prepare the materials for pottery. The earth is the abode of all beings and creatures. The earth is the one that brings forth sprouts from the seeds.
In those countries, due to differences in countries, the difference in the essence from the same type of seeds is due to the earth. The auditory sense perceives the qualities of sound in the sky, the tactile sense perceives the special quality of air, the visual sense perceives the form that is the special quality of light, The dhīvendriya (sense organ of touch) perceives the qualities of water, and the ghrānendriya (sense organ of smell) perceives the qualities of earth. In any given element, a particular quality is generally present. The combination of those ghosts, that quality is also visible in another ghost. Thus, from the primordial nature that existed before creation, the greatness that was formed, from the earth to the earth, all of these are like a mix. We will learn about the next part. The elements, then the senses, and their subjects, we have learned in this video. This is a very important part. I'd appreciate it if we could discuss it further. Let's save the rest for later. Jai Srimannarayana and salutations to the Ashmadguru.