భీష్మ పితామహుని శరతల్పగత స్థితి - రాజధర్మ ఉపదేశములు
Bhishma on the Bed of Arrows & Final Disquisitions
శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్‌లోని ఈ పవిత్రమైన ఎపిసోడ్లో, మహాత్ముడైన భీష్మ పితామహుడు శరతల్పముపై శయనించి, శుభముహూర్తము కొరకు వేచియున్న అద్భుతమైన దృశ్యమును మనం దర్శిస్తాము. పాండవులు, మహర్షులు, మరియు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో, భీష్ముడు యుధిష్ఠిరునకు రాజధర్మముల గురించి అమూల్యమైన ఉపదేశమును అందిస్తాడు. న్యాయముగా, కరుణతో, మరియు భగవద్భక్తితో రాజ్యమును పరిపాలించవలసిన విధానమును భీష్ముడు వివరించిన తీరు ఈ ఎపిసోడ్లో హృదయంగమంగా ప్రస్తుతించబడింది.
In this sacred episode of the Srimad Bhagavatham podcast, we witness the great Bhishma Pitamaha resting upon his bed of arrows, awaiting an auspicious moment to depart this world. Surrounded by the Pandavas, sages, and Lord Krishna Himself, Bhishma imparts timeless wisdom on Rajadharma — the righteous duties of kings — guiding Yudhishthira on how to govern with justice, compassion, and devotion. The episode beautifully captures the grandeur of Bhishma's unparalleled knowledge, his unwavering surrender to the Lord, and the profound grace that flows from a life lived in dharma.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః కిరాతహుణాంధ్ర పులింద పుల్కసా ఆభీరకంకాయ వనాకశాదయః ఎన్నీచ పాపాయదుపాశ్రయాశ్రయాః శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పులిందులు, పుల్కసులు, ఆభీరులు, కంకులు యవనులు, ఖసులు మొదలగు సర్వదేశముల జనులు మాత్రమే కాక పాపాత్ములకు జనులు కూడా శ్రీహరి యొక్క భక్తులను ఆశ్రయించి పరిశుద్ధులగుతున్నారు. అట్టి సర్వశక్తిమంతుడగు శ్రీహరికి అనేక నమస్కారములు. సెకండ్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ 18th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 16వ పాడ్‌కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితం పాడ్‌కాస్ట్ లో మనం అశ్వద్ధామ యొక్క యుద్ధ వైనము చివరి దశలో జరిగిన విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత ఉత్తర శిక్ష దగ్గరికి వచ్చేసేసి విన్నవిస్తుంది ఆ విషయం తెలుసుకుందాం. దేవదేవా జగత్పతి మహాయోగి కాపాడుము కాపాడుము. నీకంటే వేరొకరు కాపాడు వారు లేరు. నీవు తప్ప మిగిలిన వారందరు మృత్యువునకు వశపడు వారలు. వారు నన్ను ఏమి కాపాడగలరు? ఇనుప బాణం వలె ఒక బాణం నన్ను వెంటాడుచున్నది. నన్ను చంపినను బాధ లేదు, కానీ నా గర్భమున్న పిండము చనిపోకుండా ఉండునట్లు అనుగ్రహింపుము. ఉత్తర ప్రార్థన భగవానుడు విని భక్త వత్సలుడై పాండవులు లేకుండా చేయుటకు అశ్వద్ధామ అపాండవమును అస్త్రమును ప్రయోగించి యుండెను. అది ఈమెను వెంటాడుచున్నదని గ్రహించెను. అప్పుడే పాండవులు కూడా వారి పైకి ఎదురుగా వచ్చుచున్న బాణములను చూచి వానిని మలలించుటకు అస్త్రములను స్వీకరించిరి. ఇట్లు పాండవులకు, ఉత్తరకు, ఉత్తర గర్భమును కలిగిన ఆపదను చూచి శ్రీకృష్ణ భగవానుడు తననే నమ్మియున్న వారిని కాపాడు తన కర్తవ్యమని తన సుదర్శనాస్త్రమును వారి రక్షణకు ప్రయోగించెను.
తర గర్భమున ఉన్న పిండమును అస్త్రము అంతమొందించునని శ్రీకృష్ణుడు స్వయముగా తానే ఆ గర్భమున ప్రవేశించి ఆ గర్భమునకు అస్త్రము చే ప్రమాదము రాకుండా అపాండవాస్త్రమును ఛేదించెను. భగవానుడు ఈ కార్యము చేయుటలో ఆశ్చర్యమేమున్నది? అతడు అచ్యుతుడు కదా? ఆయన గుణములు గాని శక్తి గాని ఏ రూపములోనున్నను అతనిని వీడి ఉండవు. ఈ జగత్తునంతయు తన ఆశ్చర్యకరమైన శక్తినే సృజించును. రక్షించును, సంహరించును. అట్టి శక్తి గల భగవానునకు అపామండవాస్త్రమును నిరసించుట ఆశ్చర్యకరమగు శక్తి కాదు. ఈ విధంగా పాండవులు, ద్రౌపది, ఉత్తర గర్భము కూడా అశ్వద్ధామ బ్రహ్మాస్త్రము నుండి రక్షింపబడినారు. బయలుదేరుటకు సిద్ధముగానున్న భగవానును చూచి ఆయన ఎడబాటును ఓరవలేనిదై కుంతీదేవి ఆయన ప్రయాణము విరమింపజేయుటకు ఇట్లు స్తుతించి ప్రార్థించుచున్నది. సామాన్య మానవుడు కూడా ప్రేమ గల వారిని వదలలేదు కదా? సర్వేశ్వరుడు పరమ పురుషుడిని ఎట్లు వదలగలమని ఆయనకు నమస్కారము చేసి ప్రార్థించుచున్నది. కృష్ణా, నీవు ఆద్య పురుషుడవు. ప్రకృతికి పరమైన ఈశ్వరుడవు. నీకు నమస్కరించుచున్నాను. నీవు సర్వభూతముల యొక్క అంతర్భాగమున బహిర్భాగమున కూడా ఉన్నవాడవు. నీవే నారాయణుడవు. వెలుపల ఉన్నప్పటికిని ఎవరి చేతనీ గుర్తింప వీలు కానివాడవు. తెర ఆచ్ఛాదించినట్లు మాయచే జీవుడు నిన్ను ఎరుంగలేకుండుట ఆవరణమును కల్పించుచున్నావు. నీవు అదోక్షజుడవు. ఇంద్రియ వృత్తులకు నీవు గోచరుడవు కావు. వివిధములగు వికారమును పొందని వాడవు అందుచే నీవు అవ్యయుడవు. యోగము చేత పరిశుద్ధమైన మనసు చేతనే నీవు గ్రహింపబడుదువు కానీ మూఢమొగు భక్తి బుద్ధిచే గ్రహింపబడవు. నీవు రూపమును ధరించి మావలందరు కనబడుచున్నావు. కానీ ఈ రూపము నాటకమును నటుడు స్వీకరించినట్లు స్వీకరింపబడినది. నీ యదార్థ స్వరూపమును ఎరుంగలేరు. నీ అసలు రూపును ఎవ్వరూ ఎరుంగజాలరు. పరమహంసలు, మునులు, నిర్మలమైన మనస్సు గలవారు. భక్తి యోగము చేతనే నిన్ను ఎరుంగగలరు కానీ ఏ శక్తియు లేని స్త్రీలమగు మేము నిన్ను ఎట్లు గ్రహించగలము? కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయచ నందగోప కుమారాయ
గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలిని నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే అని కుంతీదేవి ఇట్లు విన్నవించుచున్నది ఋషీకేశా నీచుడవు కంసునిచే దేవకి చెరసాలలో బంధింపబడినది. చాలా కాలము శోకముని అనుభవించినది. నీవు అవతరించి ఆ బంధము నుండి విడిపించినావు. అట్లే నా బిడ్డలతో నన్ను ఆపదలో ప్రాపై నిలిచి ఎన్నోసార్లు కాపాడినావు. విషం పెట్టిననాడు, ఇంటికి నిప్పు అంటించిననాడు, రాక్షసుల వలన భయం కలిగిననాడు, వనవాసములో క్లేశములు అనుభవించిననాడు, యుద్ధములో మహారథులు అస్త్రములు ప్రయోగించినప్పుడు. అశ్వద్ధామ ప్రయోగించిన ఈ అస్త్రము అందరినీ అంతముందించినప్పుడు నీవే కదా రక్షించినావు. ఈ ఆపదను తొలగించుటకు నీకు ఎంత పాటి పని? నిన్ను ఆశ్రయించిన వారలకు ఆపదలు సంతతము కలుగుటయే మహా భాగ్యము. నిన్ను ఆశ్రయించిన వారికి ఆపదలు కలిగిన నాడు నీవు దర్శనము సంగుదువు. ఆపదలనే కాదు నీ దర్శనము సకల ఆపదలకు మూలమైన సంసారమునే తొలగింపజాలినది. తొలగించజాలినది. ధనము చేత, విద్య చేత, జన్మ చేత గొప్పతనము కలవారు వానిచే మదము కలిగి నిన్ను ఎరుంగజాలక కీర్తింపరు. ఏమియు లేని వారికి, కోరిక లేని వారికి నీవు సులభుడవై యుందువు. నీవు అకించనులగు అనగా ఏమియు లేని వారికి సులభంగా లభించువాడవు. వారు దాచుకొనిన ధనమే నీవు. కామక్రోధాదు లేని వాడవు నీవు. ఆఖరి దప్పులు, శోక మోహములు, జరా మృత్యువులు లేని వాడవు నీవు. లోకములో వేరొక దానిని అనుభవించడం నీకు అవశక్యం అవశ్యకము కాదు. ఆవశ్యకము కాదు. ప్రకృతి సంబంధ రహితుడవు నీవు. మోక్షమును ప్రసాదించు వాడవు నీవు. బ్రహ్మాదులను కూడా నీ అధీనమందు ఉంచుకొనగలిగిన కాలస్వరూపుడవు. సర్వ నియామకుడవు నీవు. సర్వత్ర సమభావము కలవాడవు నీవు. నీవు ఒకరియందు పక్షపాతము ఒకరి దయ లేకపోవుట ఉండదు. వారి వారి కర్మలను అనుసరించి సుఖ దుఃఖమును అనుభవింపజేయుదువు. నీవు చేయు పనులలో రహస్యములను ఎవ్వరూ ఎరుంగలేరు. నీవు కొందరిని శిక్షించుట, కొందరిని రక్షించుట, మనుష్యుడిగా ఉండుటచే గానీ నీకు రాగద్వేషములు లేవు.
ఒకరిని దండించుట కూడా వారిని అనుగ్రహించుటకే విశ్వాత్మకుడవు నీవు జన్మలేని వాడవు నీవు తిర్యక్ జంతువులలో ఋషులలో మనుజులలో జల జంతువులలో వానితో సమానము రూపమును దాల్చి జన్మించుట కేవలం విడంబనమే. నీవు చేసిన ఒక లీల నాకు ఇప్పటికిని మోహమును కలిగించున్నది. ఒకనాడు అమ్మ యశోద తప్పు చేసినావని తాడు పట్టుకొని నిన్ను కట్టుటకు సిద్ధపడినది. నీవు భయపడిపోతివి. కన్నుల నీరు నిండినది. ఆ నీటితో కాటుక కరిగిపోయినది. బెదరి బెదరి చూచుచున్నావు. ముఖము భయముచే వివరణమైనది. వణుకుచున్న నీ కన్నులు తొట్రుపాటుతో చలించిపోవుచున్నవి. అట్లు భయము నటించుచు నిలిచిన నీ ముఖము నాకు ఇప్పటికినే మరుపు వచ్చుటలేదు. సర్వ స్వతంత్రుడవు, మృత్యువు కూడా భయపడినట్టు చేసేడి వాడవు. తల్లి వద్ద అట్లు భయము నటించుట ఎంత ఆశ్చర్యము. ఆ భయము కూడా నీవు నటించిన భయమును చూచి భయపడినది. కొంతమంది జన్మలేని నీవు జన్మించుట నీ భక్తుడైన యదువు యొక్క వంశమును ఉద్ధరించుటకు ఆ వంశను కీర్తి తెచ్చుటకు అని భావింతురు. మరికొందరు సాధులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భూభారమును తగ్గించుటకు అని భావింతురు. మరికొందరు సంసారార్ణవములో అవిద్య కామ కర్మలచే క్లేశపడుచున్న వారికి నౌక వలె నీ నామములను నీ లీలను వినుటకు స్మరించుటకు తగినట్లుగా అందించుటకే అని భావించిరి. ఇట్లు జన్మలేని నీ జన్మను గూర్చి ఎందరో ఎన్నో రకములుగా ఊహించుకొనుచుందురు. అట్లు జన్మించి నీవు చేసిన చేష్టితములను ఏ జనులు వినుచుందురో, గానము చేయుచుందురో, మాటిమాటికి కీర్తించుందురో వారే నీ పాద యుగ్మమున దర్శింపజాలుదురు. ఎవరు నిన్ను చూతురో సంసార ప్రవాహం వారిపై పడక ఆగిపోవును. స్వామి, నేను నీ పాదములనే నమ్మి ఉన్నవారము. నీకు మిత్రులము, నీకు భృత్యులము. మిమ్మమ్ము విడిచి వెళ్ళవలెను తలంచుచున్నావా? మాకు నీ పాదాంభుజం కంటే వేరొకటి శ్రేయమైనది లేదు. మాకు ప్రాప్యము ప్రాపకము కూడా నీ పాదపద్మమే. మనుషులతో సమానమైన నామరూపములు కలిగిన నీ రూపమును దర్శించు భాగ్యము పొందుటకు యాదవుల వలె మాకు ఏ విధమైన అర్హతే లేదు. నీ దర్శనమునకు ఋషులు, తాపసులు మున్నగు వారే అర్హులు కదా. నీ పాద చిహ్నములచే ఈ భూమి శోభించుచున్నది. నీవు వెళ్ళినచో దాని శోభ పోవును.
నీ చూపులచే ఈ దేశము ఐశ్వర్యవంతమై పండి ఔషధులు లతలు కలదై కలకలలాడిన మన వనములతో ప్రవహించని జలాశయములతో భాసిలుచున్నది విశ్వేశా. విశ్వాత్మక విశ్వమూర్తి నీకు పాండవుల యందు నాయందు యాదవుల యందు సమానమైన ప్రేమ కదా దాన్ని తెంపి వేయుదువా? మధురాపతి, మాధవా, నా మనసును చేరక క్షణము కూడా నిలవకుండా ఉండునట్లు అనుగ్రహింపుము. శ్రీకృష్ణా, కృష్ణ సఖా, యాదవ శ్రేష్టా, రాజవంశుల్లో జన్మించి లోకోపద్రవకారులైన రాజులను వెదురు వనము అగ్ని దహించినట్లుగా దహించువాడా? అనంతమైన వీర్యము కలవాడా గోవిందా, గోవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు ఆర్తిని హరించుటకై అవతరించిన యోగీశ్వర, అఖిల గురు భగవాన్ నమస్కారము. అని కుంతీదేవి స్తుతించింది. దీని తర్వాత జరిగిన విషయాన్ని మరో పాడ్‌కాస్ట్ లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Gurus. Kiratahunam, Andhra Pulinda, Pulkasas, Abeerakkay, Vanakashadayah. All these sinners, who take refuge in the abode of the Lord, are purified. Salutations to that Lord. Kiratulu, Hoonulu, Andhrulu, Pulindulu, Pulkasulu, Aabhiras, Kankulas, Yavanas, Khasas, and other people from all countries, not only but also people of sin are becoming pure by taking refuge in the devotees of Srihari. Salutations to that all-powerful Lord Sri Hari. Second Canto Fourth Chapter 18th Prayer. Devotees of God, welcome to the first episode of the Srimad Bhagavata Tattva Deepika, in the 16th podcast. In the previous podcast, we learned about the final stage of Ashwatthama's war. Then, coming to the Uttara Shiksha, she will ask and let us know about it. Oh God, Lord of the Universe, great yogi, protect us, protect us. There is no one else to protect you but you. Except you, all others are subject to death. What can they rescue me from? Like an arrow, an arrow is chasing me. Nannu Even if killed, there is no pain, but grant that my fetus, which is in the womb, may not die. The Lord heard the prayer and, being affectionate towards his devotees, used Ashwatthama's weapon to prevent the Pandavas from being present. He realized that it was chasing him. At that moment, the Pandavas also, seeing the arrows coming towards them, accepted weapons to ward off them. Thus, seeing the danger to the Pandavas, Uttara, and the northern womb, Sri Krishna Bhagavan, believing in himself, used his Sudarshana weapon to protect those who were with him and to fulfill his duty.
Srikrishna himself entered that womb and severed the Apandavastram so that the womb would not be harmed by the arrow that would destroy the fetus in the womb. What is surprising about the Lord doing this work? Isn't he Achyuta? His qualities or power, in whatever form it may be, will not leave him. He creates all the wonders of this world with his amazing power. Protects and destroys. It is not surprising for such a powerful God to reject the Aparaamandavaastram. In this way, the Pandavas, Draupadi, and Uttara were also protected from Ashwatthama's Brahmastra. Seeing the God who is ready to depart, Kunti Devi, unable to bear his separation, praises and prays thus to cause him to cease his journey. Even an ordinary person does not abandon those who are loving, do they? How can we abandon the supreme being, the supreme person? I offer my salutations and pray to him. Krishna, you are the first being. You are the God of nature. I'm greeting you. Nee You are the one who is present in the inner and outer aspects of all beings. You are Narayana. Even though you are outside, you are incomprehensible to anyone. As if the curtain is covering, you are creating a veil so that the living being cannot see you. You are a diviner. You are not visible to the senses. You are one who does not suffer from various distortions, therefore you are imperishable. You will be understood only by a pure mind through yoga, but not by foolish devotion and intellect. You have assumed a form and all of us are visible. But this form was accepted as if the actor had accepted the play. You do not know your true self. No one will ever know your true self. The Paramahamsas are seers, the sages, with a pure mind. Only through Bhakti Yoga can you be understood, but how can we, women without any power, understand you? Krishnaya Vasudevaya Devikinandanaya Cha Nandagopa Kumaraya
Govindaya Namo Namaha Namaha Pankajanabhaya Namaha Pankajamalini Namaha Pankajanetraya Namaste Pankajangre. Thus, Kunti Devi is pleading, O Rishikesha, you are wretched, you were imprisoned in Devaki's prison by Kamsa. It has suffered a lot of grief for a long time. You broke that bond, having made it. Likewise, you have stood by me in times of trouble, saving me many times. When poison was put, when fire was set to the house, when fear of demons was felt, when suffering was experienced in exile, when great warriors used weapons in war. When this weapon used by Ashwatthama brought down everyone, it was you who saved them. How much effort do you need to overcome this difficulty? It is a great fortune for those who have sought refuge in you to be constantly afflicted with calamities. When calamities befall those who have sought your refuge, you will not be seen. Not only obstacles, but your vision can remove the world, which is the root of all obstacles. It can be removed. Those who have greatness through wealth, education, and birth, being arrogant because of them, cannot understand you You will not sing. You will be easy for those who have nothing, those who have no desire. You are the one who is easily available to those who have nothing. You are the treasure they have hidden. You are free from love and hate. You are the one without the final throes, the sorrows, the aging mortality. Experiencing something different in the world is not necessary for you. Not necessary. You are a naturalist. You are the one who grants salvation. You are the form of time, who is able to keep even the Brahma and other gods under your control. You are the one who is appointed. You are the one with the equanimity. You will not have partiality to anyone, nor will there be a lack of someone's kindness. You make them experience happiness and sorrow according to their respective karmas. No one will understand the secrets in the works you do. You are not angry or jealous because you punish some, protect some, or are human.
Even to punish someone, you are the universal soul, you are without birth, you are among the animals, among the sages, among the humans, among the aquatic animals, it is just a display to be born with a form equal to him. A miracle you have performed has stilled my heart. Once upon a time, Mother Yashoda, realizing that you had made a mistake, held a rope and was ready to tie you up. You panicked. Tears welled up in the eyes. The kohl has been dissolved by the water. You are watching Bedari Bedari. The face is described as frightening. Your trembling eyes are shaking with nervousness. Your face, which stood there pretending fear, I still can't forget. You are all-powerful, so you are the one who can make death afraid. It is so surprising to act so scared in front of mother. That fear also, seeing the fear you acted, was frightened. Some believe that you, being without birth, are born to uplift the lineage of your devotee, Yadu, and to bring fame to that lineage. And to protect some saints, to punish the wicked, the burden of the earth They think it should be reduced. And some, in the ocean of worldly existence, to those who are afflicted by ignorance and karmic burdens, like a boat, to provide your names and your play, to remember them, to make them worthy, they thought. Thus, regarding your birth, many people imagine it in many different ways. Those who are born like that, and those who listen to the deeds you have done, and those who sing, and those who praise again and again, they will be able to see your holy feet. Whoever sees you, the flow of life will not stop falling on them. Swami, I have believed in your feet. You are my friends and you are my servants. Are you thinking of leaving me? Nothing shall be greater than your footsteps. Your lotus feet are the source of our attainment. We do not have any qualification like the Yadavas to have the fortune to see your form, which has the same form and appearance as humans. For your darshan, only the sages, ascetics, and others are eligible, right? This earth is adorned by your footsteps. Where you go, its glory departs.
By your sight, this country is prosperous, filled with medicinal herbs and vines, and shining with our forests, flowing with reservoirs, O Visvesha. Oh, universal idol, you have equal love for the Pandavas, for me, for the Yadavas, don't you tear it apart? Oh Madhurapati, Madhava, grant me such grace that I may not even be able to bear to be away from my heart for even a moment. Srikrishna, Krishna's friend, the best of Yadavas, born in royal families, is he the one who burns the kings who are the saviors of the people, like fire burns the bamboo forest? Oh Govinda, possessor of infinite virility, the lord of yogis who incarnated to alleviate the suffering of cows, Brahmins, and gods, salutations to the all-guru Bhagavan. Thus spoke Kunti Devi. We'll find out more in another podcast. Jai Srimannarayana and salutations to the Ashram Guru.