వైకుంఠ సప్తమ ద్వార పాలకులు - జయవిజయుల శాపము
Cursing of the Seven Gates Watchmen Jaya and Vijaya
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, శ్రీహరి నివాసమైన వైకుంఠ సప్తద్వారాలను కాపాడే జయవిజయుల దివ్యమైన కథను వివరిస్తున్నాం. సనక, సనందన, సనాతన, సనత్కుమారులు భగవంతుని దర్శనం కోసం వైకుంఠానికి వచ్చినప్పుడు, అహంకారంతో వ్యవహరించిన ద్వారపాలకులు వారిని అడ్డుకున్నారు. ఈ అగౌరవానికి కోపించిన మహర్షులు, జయవిజయులు భూలోకంలో మానవులుగా జన్మించాలని శపించారు. అహంకారం మరియు గర్వం యొక్క పరిణామాలను, అలాగే భగవదిచ్ఛ వెనుక ఉన్న మహత్తర రహస్యాన్ని ఈ ఘట్టం మనకు తెలియజేస్తుంది.
In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, we explore the divine story of Jaya and Vijaya, the mighty gatekeepers of Vaikuntha, the eternal abode of Lord Vishnu. The four Kumaras — Sanaka, Sanandana, Sanatana, and Sanat — arrive at the seven gates of Vaikuntha seeking the Lord's darshan, only to be stopped and disrespected by the proud gatekeepers. Enraged by this offense, the great sages curse Jaya and Vijaya to be born as mortals on earth, separated from the Lord they faithfully serve. This profound episode reveals how even devoted servants of the Lord must face the consequences of ego and arrogance, and how divine will operates behind every event in creation.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో నమః కారణ విగ్రహాయ సరోప తుచ్ఛీకృత విగ్రహాయ నమో వధూత్వ ద్విజ బంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం రఘూగనుడు ఇట్లు పలికెను ఓ మహాయోగి నీవు కారణ జన్ముడవు. నీవు ఆత్మజ్ఞానముచే భేద దృష్టి నిరాకరించితివి. నీవు సర్వకాలములలో ఆత్మనిష్ఠుడవై యుందువు కానీ నీ బ్రాహ్మణాధముని వేషములో నుటచే ఆ సంగతి అతి రహస్యముగా ఉన్నది. నీకు అనేక నమస్కారములు. ఫిఫ్త్ కాంటో, 12th చాప్టర్, ఫస్ట్ ప్రేయర్. భవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపికా తృతీయ స్కంధం 25వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు హిరణ్యాక్షుని యొక్క వధ విన్యాసాన్ని చక్కగా మనం అనుభవించాం. ఇంతకుముందు పాడ్కాస్ట్ లో తర్వాత జరుగుతున్న విషయం ఏమిటో విదుర మైత్రేయ సంవాదంలో తెలుసుకుందాం. ఈ విధంగా విదురుడు ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానముగా మైత్రేయుడు ఆది వరాహ రూపమును దాల్చి భగవానుడు హిరణ్యాక్షుని అంతమొందించి బ్రహ్మ మొదలగు దేవతలచే స్తుతింపబడి మరలై తన లోకముకేగినాడని వివరించినాడు. ఓ విదురా, వరాహ రూపమున అవతరించిన భగవానుని దివ్య లీలను నీకు రింగించితిని. ఇది శ్రీహరికి శ్రమతో కూడిన పని కాదు. బాలుడు ఆడుకొనినట్లు స్వామి హిరణ్యాక్ష వధను చేసినాడు. కానీ ఇది ఆశ్చర్యపడునది కాదు. భగవానుడగు మైత్రేయుడు చెప్పిన కథను మహా భాగవతుడగు విదురుడు విని పరమానందం ఉందెను. లోకములో గొప్ప కీర్తి కలిగిన పుణ్యాత్ముల చరిత్రలను విననే ఆనందము కలుగుచుండును కదా! అట్టిచో భగవానుని కథను వినునప్పుడు ఆనందము కలుగుటలో ఆశ్చర్యం ఏమున్నది? భగవానుడు తన్ను సేవించిన వారి బాధలను తొలగించుటయే తన ప్రయోజనముగా ఉండును. తన్ను ప్రేమించిన వారికి తాను సుఖమును సుఖముగా లభించును.
వారు కోరిన కోరికలను తాను నెరవేర్చును. అట్టి భగవానుని కథను ఎవడో కృతజ్ఞుడు వినడు కానీ ఎవరు వినకుండా ఉండగలడు? ఒకనాడు చెరువులో మొసలి తన కాలు పట్టుకొని లోనికి లాగుచుండగా తాను రక్షించుకొనలేక రక్షింపలేక ఆడ ఏనుగులన్నియు ఏడుచుండగా మొరపెట్టగా తొందరగా వచ్చి రక్షించిన దయామూర్తి. ఇతరులెవరు రక్షకులు కారని వాడే రక్షకుడు నమ్మిన వారికి అతడు సుఖముగా లభించును. అట్టి నమ్మకము లేని వారికి అతడు వశము కాడు. అట్టి సుఖముగా లభించెడి భగవానుని సేవించిన వారు ఎవరు ఫలం పొందరు? ఈ విధంగా భగవానుడు జగద్రక్షణముకై ఆది వరాహమై హిరణ్యాక్షును చంపిన వృత్తాంతమును ఎవడు వినునో, చెప్పునో, విని ఆనందించునో అట్టివాడు ఎంతటి ఘోరవగు పాపముల నుండి అయినను విముక్తి నందును. ధనమును, కీర్తిని, ఆయుష్షును కోరిన కోరికలను అన్నిటినీ పొంది సాధించును. ప్రాణశక్తిని, ఇంద్రియశక్తిని పెంపొందించును. యుద్ధములో శౌర్యమును వృద్ధి పొందించును. ఈ శరీరము వీడిన తరువాత శ్రీమన్నారాయణు సన్నిధిని చేయుచును. నైమిశారణ్యమున సౌనకుడు సూతిని ఇటు ప్రశ్నించెను. భూమిని యధాస్థానమునకు వరాహమూర్తి చేర్చిన తరువాత చతుర్విధ పురుషార్ధములను పొందుటకు స్వయంభువ మనువు ఏ విధంగా ప్రవర్తించెను అని ప్రశ్నించెను. అది విని దానిని వివరింపమని మైత్రేయుని ప్రశ్నించుచున్న విదురుని సూతుడు ప్రశ్నించుచున్నాడు. విదురుడు మహా భాగవతుడు. అందువలన కృష్ణునకు అసాధారణమైన మిత్రుడు. అతని యందు వందు ప్రేమ చేతనే దుర్యోధనాది కుమారులతో కూడా ధృతరాష్ట్రుని విడిచి వచ్చినాడు. సాక్షాత్తు వ్యాసుల అంశముతో జన్మించినవాడు. వ్యాసుల కంటే ఏ మాత్రము తీసిపోని జ్ఞానము కలవాడు. శ్రీకృష్ణుని యందు భక్తి గల వారిని సేవించువాడు. విదుర మైత్రేయుల సంవాదంలో భగవత్ పాదముల నుండి సర్వ పాపములను తొలగించు గంగాజలమును ప్రవహించునట్లు లోకములను పవిత్రము చేయుటకు భగవత్ కథలు ప్రవర్తించెను.
కీర్తింపదగిన భగవానుని ఉదారము కర్మలను మాకు తెలియజేయుము. శ్రీహరి లీలలు అమృతం వంటివి. ఆ భగవత్ కథలలోని రుచిని ఎరింగిన వారు ఎన్ని విన్నను ఎంతసేపు విన్నను తృప్తి నొందరు అని శౌనకుడు మొదలగు ఋషులు. ప్రశ్నింపగా సూతుడు భగవానుని యందే మనసు నిలిపిన వాడై ఆనాడు పరీక్షిత్తునకు శుకుడు చెప్పిన కథను ఇట్లు వివరించుచున్నాడు. విదురుడు మైత్రేయుని వలన రసాతలము నుండి భూమి వరాహ రూపియగు భగవానునిచే ఎట్లు ఉద్ధరింపబడినదో హిరణ్యాక్షుడు ఎట్లు సంహరింపబడినాడో విన్నాడు. విని సంతోషించిన వాడై మరల ఇట్లు మైత్రేయుని ప్రశ్నించుచున్నాడు. మరీచి మొదలగు ప్రజాపతులను సృష్టి కొరకు సృష్టించి తరువాత బ్రహ్మ ఏమి చేసెను? మరీచి మొదలగు ప్రజాపతులు స్వయంభువ మనువు బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి విశ్వమును ఎట్లు సృష్టించిరి? ఎట్లు నిర్వహించిరి? వారు సృష్టిని భార్యలతో కలిసి సృష్టించినారా లేక స్వతంత్రముగా సృష్టించినారా వివరింపుము. అని విదురుడు ప్రశ్నింపగా మైత్రేయుడు సృష్టి క్రమమును వివరించుచున్నాడు. భగవానుడు సర్వేశ్వరుడు ఊహించుటకు వీలు కాని ప్రభావము కలవాడు. ప్రకృతి పురుషుల కంటే అవ్వలది కాలం. ఆ కాలమునందు పరమాత్మ ప్రవేశించి ఆ కాలములో ప్రకృతిలో జగత్ సృష్టికి అభిముఖమగునట్లు కదలికను కలిగించెను. అట్లు కదలిక కదల కలగగని భగవానుడు లోన వ్యాపించి ఉన్న ప్రకృతి నుండి మహత్తత్వం బయలు వెడలెను. సత్వము, రజస్సు, తమస్సు అనిటి మూడు గుణములు కలది ప్రకృతి. దాని నుండి బయలు వెడలిన మహత్తులో కూడా ఆ మూడు గుణములు ఉండును. అందు రజోగుణముతో కూడిన తమోగుణము ప్రధానముగా గల మహత్తత్వము నుండి భూతాది అనడి అహంకారము బయలుదేరెను. ఇది పంచమహాభూతములకు మూలమగు తన్మాత్రులనడి సూక్ష్మభూతములను సృజించెను. ఆ రాజస అహంకారముతో కూడిన సాత్విక అహంకారము నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు మనస్సు బయలు వెడలను. ఇట్లు ముందుగా మహా భూతములకు సూక్ష్మ రూపములకు తన్మాత్రలను జ్ఞానేంద్రియములను కర్మేంద్రియమును అహంకారం సృజించెను.
ఇవి అన్నియు ఉన్నను ఇవి అన్యోన్యము కలియకపోవుటచే అండమును సృష్టించుటకు సమర్థమును కాలేకపోయెను. భగవానుడు వానిలో అనుప్రవేశించి వానిని ఆయా పాళ్ళలో కలియునట్లుగా చేసెను. దానిచే బంగారం వలె ప్రకాశించు అండము సృజింపబడెను. కానీ ఆ అండమునందు చైతన్యము లేదు. అందుచే అది అంతకుముందే సృష్టించబడిన జలములో పడి ఉండెను. అప్పుడు సర్వేశ్వరుడు అనిరుద్ధ రూపియై ఆ అండమున వెయ్యి సంవత్సరములు అధివసించి ఉండెను. అట్లు అండమున శయనించి ఉన్న ఆ భగవానుని నాభి నుండి వెయ్యి మంది సూర్యుల యొక్క ప్రకాశం వంటి ప్రకాశము గల పద్మము వెలువడెను. ఆ పద్మము సమస్త జీవరాశికి స్థానమై యుండెను. అట్టి పద్మమునందు సకల జీవ సమిష్టి స్వరూపుడగు బ్రహ్మ స్వయముగా ఆవిర్భవించెను. అప్పుడు అతడు వెనక్కల్పములో లోకములు ఎట్లుండెనో అట్టి నామరూపములతో లోకములను సృష్టించెను. తమోగుణముచే అవిద్యను సృష్టించెను. ముందు తామిశ్రము, అంధతామిశ్రము, తమస్సు, మోహము, మహాతమస్సు అనేటి ఐదు విధములగు అవిద్యను సృష్టించెను. ఇట్లు ఆ ఇట్లు అవిద్యా సృష్టికి కారణమైన తన ఛాయా రూపముకు శరీరమును అసహ్యించుకొని బ్రహ్మ దానిని వదలెను. అతడు విడిచిన ఆ శరీరము నుండి యక్షులు, రాక్షసులు పుట్టిరి. వారు ఆకలి దప్పికచే పీడింపబడి వాటికి కారణమగు రాత్రిని ఆశ్రయించిరి. యక్ష రాక్షసులు ఆకలి దాహములచే బాధపడి ఆ శరీరమునే తినుటకు సిద్ధపడిరి. అప్పుడు వారి జనకుడగు బ్రహ్మను తినవలదని కొందరనిరి. తినుడని కొందరనిరి. ఆ శరీరమును జక్షద్ధం తినుడు అని పలికిన వారు యక్షులు అయిరి. రక్షధ అంటే రక్షింపుడు అనిన వారు రాక్షసులైరి. అట్లు తన శరీరమును తినుటకు సిద్ధపడుచున్న యక్ష రాక్షసులను చూచి బ్రహ్మ నన్ను భక్షింపుడు రక్షింపుడు మీరు తమోగుణమును ప్రధానముగా గలవారై నా బిడ్డలై ఉండిరి అనెను. తర్వాత ప్రకాశించుచున్న బ్రహ్మ తన ముందు భాగము నుండి దేవతలను సృష్టించెను. వారు ప్రకాశము గలవారు కనుక దేవతలైరి. వారు ప్రకాశించుచున్న వారై అతని శరీరము నుండి బయలుబడిన వెలుగును స్వీకరించిరి.
బ్రహ్మ తన పృష్టభాగము నుండి కామగుణ ప్రధానులను అసురులను సృజించెను. వారు కామ ప్రవృత్తి గలవారై అతనిపై రమించుటకు పడిరి. అప్పుడు అతడు నవ్వుచు సిగ్గులేని వారలై తనను వెంటాడుచుండగా క్రోధముతో భీతితో శీఘ్రముగా పరిగెత్తిపోయెను. భక్తులను అనుగ్రహించు స్వభావము గల శ్రీహరిని చేరి ఇట్లు చెప్పెను. హే పరమాత్మ నన్ను కాపాడము నీ సంకల్పము చేతనే నేను ఈ ప్రజలను సృష్టించితిని. కానీ ఈ అసురులు నాపై బడి నాతోనే కామ ప్రవృత్తిచే రమింప సిద్ధపడుతున్నారు. నీవే దుఃఖము గల ప్రజలకు క్లేశములను తొలగింపగలవాడవు. నిన్ను ఆశ్రయించిన వారికి క్లేశములు ఉండవు. నిన్ను ఆశ్రయింపని వారే క్లేశములు అందుదురు కదా? బ్రహ్మ ప్రార్థింపగానే బ్రహ్మ అధైర్యమును చూచి అతని మనసులోని భావమును ఎరంగిన వాడై శ్రీహరి కామ ప్రవృత్తిపై చాపల్యమును కలిగించు ఈ శరీరమును విడిచిపెట్టుము అని చెప్పెను. వెంటనే ఆ శరీరమును అతను విడిచెను. అది మనకు సాయం సంధ్య ఆయెను. అందుచే అప్పుడు కామము ఉద్రేకించుచుండును. ఆ సంధ్య ఒక స్త్రీ రూపమును దాల్చెను. ధ్వని చేయుచున్న నూపురములతో ముదముచే బెదురుచు ఇటునడు చూచుచు మొలనూలుతో గట్టిగా కట్టబడిన పట్టుబట్టను మొలపై దాల్చి ఆమె సంచరించుండెను. ఆమె వక్షస్థలము, ఆమె నాసిక, ఆమె దంతములు ఎంతో ఆకర్షణకములుగా ఉండెను. సుందరమగు మందహాసముతో విలాసముతో కూడిన చూపులతో ఆమె సిగ్గుపడుచు పైట చెంగుతో తన అవయవములను కప్పుకొనుచు సంచరించుండెను. అప్పుడు రాక్షసులు ఆ అందమైన సంధ్య అనేడి స్త్రీని చూచి ఆమెపై మొహము గలవారలైరి. ఆమె రూపమునకు పరవశులై ఆమె లావణ్యమును యవ్వనమును తాము అనుభవించవలెనని కోరుచూ ఆమె వెంటపడిరి. ఆమె వారిని లెక్కచేయక వారిని తాను కోరనట్లు ముందుగా నడుచుండెను. వారు ఆమెను గౌరవించి ప్రేమతో ఇట్లు ప్రశ్నించిరి. నీవు దేవతవా? మనుష్య స్త్రీవా? నీవు ఎవరికి చెందిన దానవు? నీ రూపం మమ్మల్ని బాధించుచున్నది. మా భాగ్య వశముచే నీ దర్శనం మాకు లభించినది. మా మనసును నీవు బంతి వలె ఇటునడును ఆడించుచున్నావు. నీవు నీ చేతితో బంతిని కొట్టుచుండగా ఆ శోభ వర్ణింపతరము కాదు. నీ చేతిలో బంతి క్రింద కొట్టుచున్నప్పుడు, నీ ముందుకు వెనకకు నడుచున్నప్పుడు నీ సన్నది నడుము బడలిపోవుచున్నది.
నీ చూపు కలత చెందుచున్నది. నీ కేశబంధము చెదిరిపోవుచున్నది. ఈ స్త్రీ రూపములో ఉన్న సాయం సంధ్య అసురులు చూచి మూడమగు మనస్సుతో ఆమెను స్వీకరించిరి. ఆ తర్వాత జరిగినటువంటి భాగం ఏమిటో తర్వాత తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations, salutations to the cause. Salutations to the trivial, rejected form. Salutations to the hidden, eternal experience of the two-fold bond of women and men. Thus spoke the great Yogi, you are born of cause. You have rejected the dualistic vision of the self. You are self-controlled in all times, but because of wearing the guise of a Brahmin, that matter is very secret. Many salutations to you. Fifth Canto, Twelfth Chapter, First Prayer. Dear devotees, welcome to the third episode of the Srimad Bhagavata Tattva Deepika, the 25th podcast. So far, we have experienced Hiranyaksha's killing scene very well. Let's find out what's happening next in the podcast. In the conversation with Vidura Maitreya. In this way, as an answer to the question asked by Vidura, Maitreya, assuming the form of Adi Varaha, explained that the Lord destroyed Hiranyaksha and, praised by Brahma and other gods, returned to his world. Oh Vidura, the divine play of the Lord who incarnated in the form of a boar to you I have finished it. This is not a laborious task for Srihari. The Lord killed Hiranyakashipu as a child. But it is not any surprise. The story told by the divine Maitreya, the great devotee Vidura heard it and was filled with supreme bliss. Hearing the stories of the virtuous who have great fame in the world, one feels joy, doesn't one! When one listens to the story of the Lord, what is surprising in experiencing joy? The Lord's purpose is to remove the sufferings of those who serve Him. He will be happy and will get happiness for those who love him.
He will fulfill the desires they have. Who is the grateful one who will not listen to the story of such a God? But who can remain without listening? Once upon a time, in a pond, a crocodile was pulling a female elephant in, unable to save her, unable to protect her. As all the female elephants cried out, pleading, the merciful one quickly came and saved them. He who believes that no one else is a savior, the savior who believes, will find him in peace. He is not subject to those who do not have such faith. Those who serve the Lord who is so easily obtained, who will not receive the fruit? In this way, whoever listens to, tells, or enjoys the story of the Lord killing Hiranyaksha as the first boar for the protection of the world, such a person will be liberated from the terrible sins of any kind. He will obtain and achieve all desires, including wealth, fame, and longevity. Increases life force and sensory abilities. It enhances courage in battle. After this body departs, it will be in the presence of Srimannarayana. In the forest of Naimisha, Saunaka asked Sounika this question. Bhumi After Varahamurthy was placed in the proper position, he asked how Swayambhuva Manu behaved to attain the fourfold Purusharthas. Hearing that, the son of Vidura is questioning Maitreya to explain it in detail. Vidur is a great devotee of the Lord. Therefore, he is an extraordinary friend to Krishna. He, with love, also left Dhritarashtra, along with the sons of Duryodhana, because of his affection. He was born with the essence of Vyasa. He is wiser than Vyasa. One who serves those who are devoted to Lord Krishna. In the conversation between Vidura and Maitreya, the stories of the Lord spread to purify the worlds, so that the Ganges water, which removes all sins from the feet of the Lord, flows.
Show us the generosity of the Lord, which is worthy of praise, and the deeds. Sri Hari's plays are like nectar. Those who have tasted the taste of the stories of the Lord, no matter how many times they listen, no matter how long they listen, they will not be satisfied, said Shaunaka and other sages. As the questioner asked, the sage, having fixed his mind on the Lord, thus explained the story told by Shuka to Parikshit that day. Vidurudu heard how Hiranyaksha was killed and how he was rescued from the netherworld by the boar-incarnate Lord Bhagavan through Maitreya. Hearing this, he was pleased and again asked Maitreyi this question. After creating the Prajapatis like Manishi, what did Brahma do? How did the Prajapatis, including Manu, who were self-existent, create the universe according to the order of Brahma? How did you manage? Explain whether they created the creation together with their wives or independently. When Vidura asked, Maitreya is explaining the order of creation. The power that is beyond imagination to imagine God, the Almighty He is a collector. Nature is older than men. In that time, the Supreme Being entered and in that time, in nature, caused a movement that was in the direction of the creation of the world. Thus, the divine being, who is inconspicuously moving, from the nature that is pervading within, the greatness of the essence will emerge. Nature is composed of three gunas: sattva, rajas, and tamas. Even in the greatness that emerged from it, those three qualities are present. From that, from the great element that is predominantly composed of Rajoguna and Tamoguna, the ego that is called Bhutadi Anadi arose. This created the subtle elements called Tanmatras, which are the root of the five great elements. From that Rajasic ego mixed with Sattvic ego, the senses of knowledge, the senses of action, and the mind will not go out. Thus, first, the great beings, the subtle forms, the subtle elements, the senses, the organs of action, and the ego were created.
Even though all these were present, because they did not unite, they could not create an egg. The Lord entered into him and made him join in those parts. And with it, a body shining like gold was created. But there is no life in that egg. Therefore, it was already in the water that had been created. Then, the Lord of all, in the form of Aniruddha, resided in that egg for a thousand years. Thus, from the navel of that Lord who was lying in the womb, a lotus with the radiance of a thousand suns emerged. That lotus was the abode of all living beings. In that lotus, Brahma, the collective form of all living beings, manifested himself. Then he created the worlds in the backward direction with such names and forms. They created ignorance through the quality of darkness. First, they created ignorance in five forms: Tamasic, blind ignorance, darkness, delusion, and great darkness. Thus, thus, that which is the cause of the creation of ignorance, his shadow form, his body Brahma, unable to bear this, abandoned it. Yakshas and Rakshasas were born from the body he left. They were afflicted by hunger and thirst and took refuge in the night, which was the cause of their suffering. The Yaksha demons, afflicted by hunger and thirst, were ready to devour the body. Then some said that they should not eat Brahma, their ancestor. Some people said to eat. Those who said that the body should be eaten by the Yakshas became Yakshas. Rakshadha means one who protects, but they are demons. Thus, seeing the Yaksha demons who were ready to devour his body, Brahma said, "You, who are predominated by the quality of Tamas, are my children." Then the shining Brahma created the gods from his front part. They are the gods, because they are luminous. They were those who shone, accepting the light that came out of his body.
Brahma created the kama guna pradhunulu, the asuras, from his left side. They were lustful and fell for him. Then he laughed and, being shameless, while they were chasing him, he ran away quickly with anger and fear. He said thus, reaching Srihari, who has the nature of blessing devotees. Hey God, save me. It is only by your will that I created these people. But these demons, falling upon me, are ready to be captivated by my lustful nature. You are the one who can remove the sufferings of the people with sorrow. Those who take refuge in you will have no misery. Those who do not seek refuge in you will suffer, won't they? As soon as Brahma prayed, seeing Brahma's despair, Srihari, who understood the feeling in his mind, said, 'Leave this body that causes restlessness on the lustful nature of Kama.' He immediately left the body. It's our evening prayer. Therefore, at that time, lust will be aroused. The evening has taken the form of a woman. With the sound of the drums, being delighted She was walking, looking around, wearing a silk cloth tightly tied with a knot, on her head. Her bust, her nose, her teeth were very attractive. With a beautiful smile and with a look filled with luxury, she was shy and moving around covering her limbs with a veil. Then the demons, seeing that beautiful woman named Sandhya, became enraged. They were fascinated by her beauty and wanted to experience her youth and beauty, so they chased her. She walked ahead of him, as if she wasn't going to count them. They respected her and asked her questions with love. Are you a god? A woman? Who do you belong to? Your appearance is disturbing us. It is our good fortune to have your darshan. You are playing with our heart like a ball. While you are hitting the ball with your hand, that beauty is beyond description. When the ball is hit in your hand, when you walk back and forth, your waist is getting weak.
Your eyes are straining. Your hair is falling out. Seeing the evening twilight in the form of a woman, the demons accepted her with a three-fold mind. Let's find out what happened next. Jai Srimannarayana, salutations to the Gurus