వజ్రాయుధ నిర్మితి - రణరంగమున వృత్రాసురుని భక్తి ప్రబోధము
Forging the Vajra & Vritrasura's Sublime Preaching
ఈ శ్రీమద్భాగవతం పాడ్కాస్ట్ ఎపిసోడ్లో, మహర్షి దధీచి తన అస్థిపంజరాన్ని దేవతలకు అర్పించిన అపూర్వమైన త్యాగము ద్వారా వజ్రాయుధము ఎలా నిర్మించబడిందో వివరంగా తెలుసుకుంటాం. ఆ దివ్యాయుధంతో సన్నద్ధుడైన ఇంద్రుడు వృత్రాసురునితో యుద్ధానికి సిద్ధమవుతాడు, అది భాగవతంలోని అత్యంత ఆధ్యాత్మిక సందర్భాలలో ఒకటిగా నిలుస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా, రణరంగమున వృత్రాసురుడు కేవలం రాక్షసునిగా కాక, భగవంతుని యందు అచంచలమైన భక్తి కలిగిన మహాభక్తునిగా తన తత్త్వోపదేశాన్ని అందిస్తాడు. యుద్ధఘోష మధ్యన అతడు పలికిన భక్తి వాక్యాలు శరణాగతి మరియు జీవిత పరమార్థాన్ని గురించి నేటికీ మనకు మార్గదర్శకంగా నిలబడతాయి
In this profound episode of the Srimad Bhagavatham podcast, we explore how the celestial weapon Vajra was forged from the bones of sage Dadhichi, whose supreme sacrifice made victory possible for the Devas. Indra, armed with this divine thunderbolt, marches into battle against the mighty Vritrasura, setting the stage for one of the most spiritually charged confrontations in all of the Bhagavatham. Remarkably, even on the battlefield, Vritrasura reveals himself not as a mere demon but as a great devotee of Lord Vishnu, delivering luminous teachings on devotion, surrender, and the ultimate purpose of life. His words, spoken amidst the roar of war, stand as a timeless testament to the power of pure bhakti that transcends even death itself.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినీ నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే నాభియందు పద్మము గలవాడు పద్మముల మాలను దాల్చినవాడు పద్మమును పోలిన కన్నులకు వలవాడు అరికాళ్ళ యందు పద్మముల చిహ్నములు గలవాడగు నీకు అనేక నమస్కారములు. ఫస్ట్ క్యాంటో ఎయిత్ చాప్టర్ 22 ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము 15వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు రుత్రాసురు యొక్క వధ. పూర్తి చేసుకొని మనం ఆ తర్వాత పరీక్షిత్తు ప్రశ్న అడుగుతున్నాడు ఎందుకు ఇంత విరూపమైనటువంటి రాక్షసుడికి ఇలాంటి భక్తి ఆయనలో విశ్వాసము కలగడానికి కారణం ఏమిటి అని చెప్పేసి అని దానికి ముందు భాగంలో మనకు శుక మహారాజు శుకయోగి వివరిస్తున్నారు. ఇది చిత్రకేతోపాఖ్యానం. రాజా. శ్రద్ధగా ఈ ఇతిహాసమును వినుము. ఇది చిత్రకేతు ఉపాఖ్యానం. దీనిని వ్యాసుని వలన నారదుడు దేవలుడు వినిరి. దానిని నీకు చెప్పెదను. సూరసేన దేశంలో చిత్రకేతువు అనే సార్వభౌముడు ఉండెను. అతని పరిపాలనలో దేశము సుభిక్షమై కోరికలన్నియు నెరవేరి సుఖముగా ఉండెను. అతనికి కోటి మంది భార్యలు కానీ అతనికి సంతానము లేదు. సంతాన యోగ్యత ఉన్నవాడైనను ఇంతమంది భార్యలలో ఏ ఒక్క భార్య కూడా సంతానవతి కాలేదు. రూపము, ఔదార్యము, వయస్సు, ఉన్నతమైన వంశము, విద్య, ఐశ్వర్యము, సంపద. మొదలగునవి అన్నియు పరిపూర్ణముగా ఉండినను తన భార్యలు గొడ్రాళ్ళు అనగా బిడ్డలు లేని వారే ఉండుటకు చింతించుచున్నాడు.
అంతమంది భార్యలు ఉన్నను ఐశ్వర్యమున్నను అతనికి ప్రీతి కలుగుట లేదు. ఒకనాడు అతని భవనమునకు భగవానుడగు అంగీరసుడు అనేటి ముని లోక సంచారము చేయుచు అనుకొనకుండా వచ్చెను. చిత్రకేతు అతనిని యథాశాస్త్రముగా ఎదుర్కొని పూజించి సుఖాసినుని చేసి ఆదిత్యము సంగెను. అంగీరసుని దగ్గర నేలపై వినయంతో కూర్చొని ఏదో చెప్పవలెనని అనుకొనుచుండెను. అంగీరసుడు చిత్రకేతువు అభిప్రాయము గుర్తించి ఇట్లు ప్రశ్నింపసాగెను. రాజా, నీ శరీరము ఆరోగ్యముగా ఉన్నదా? నీ రాజ్యమున ఉండవలసిన ఏడు విధములకు ప్రకృతులు అనగా స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము. బలము అననవి భద్రముగా ఉన్నవా? జీవుడు మహదహంకార తన్మాత్ముడు అనడి ఏడు ప్రకృతి వికారముల చేత ఎట్లు రక్షింపబడుచుండెనో అట్లే రాజు ఏడు ప్రకృతుల చేతని శ్రేయస్సు నందును. నీ భార్యలు, నీ ప్రజలు, నీ మంత్రులు, నీ భృత్యులు, అమాత్యులు, పౌరులు, జానపదులు, రాజులు, కుమారులు నీ వశవర్తులే మెలుగుచున్నారా? ఎవరికి మనస్సు ఇంద్రియముల వశమున ఉండునో వానికి వీరందరు వశమందురు. లోకులందరు శ్రద్ధతో అర్చించవలసిన కప్పములను అర్చించుచుందురు అర్పించుచుందురు. నిన్ను చూచినచో నీ మనస్సు ఎందుకో సంతోషమునందకుండా దిగులుతో ఉన్నట్లు కనిపించుచున్నది. వెనక చెప్పినవన్నీయు నీ వంశము యందు ఉన్నచో నీ మనసును అసంతుష్టి ఉండుటకు కారణము లేదు. ఏదో కోరిక తీరినట్లు నీ ముఖము తెలియజేయుచున్నది. ముఖము కాంతిహీనమై చింతతో నిండి ఉన్నది. దీనికి కారణం ఏమి? ఇట్లు అగ్నిరసుడు విచారమునకు కారణమును ఎరంగియు ప్రశ్నించినాడని గుర్తించిన చిత్రకేతువు సంతానము కోరుకునవలెనని మునితో ఇట్లు పలుకుచున్నాడు. హే భగవాన్ తపస్సు, జ్ఞానము, సమాధి పరిపూర్ణముగా గల మీకు తెలియనిది ఏముండును? మీ జ్ఞానమును ఆవరించెడి పాపములు యోగాభ్యాసముచే తొలగింపబడినవి. కావున ప్రాణుల లోపలి భావము బాహ్య విషయములు కూడా మీకు గోచరించుచుండును. కానీ మీరు ప్రశ్నించినారు కావున నా మనసులో ఉన్న దానిని విన్నవించెదను. లోకపాలులు కూడా పొందని సామ్రాజ్యము ఐశ్వర్య సంపదలు నాకున్నవి కానీ సంతానము లేదు.
ఆకలి, దప్పి అధికముగా ఉన్నవానికి మిగిలిన సుఖములు ఎన్ని ఉన్నను ఎట్లు మనసునకు ఆనందమును కలిగింపలేవో, సంతానము లేని నాకు ఈ ఐశ్వర్యం ఎంత ఉన్నను తృప్తినిచ్చుటలేదు. మా పూర్వులు దుస్తరమగు నరకమును దాటుటకు సంతానము ఉండవలెను. పితృణము తీర్చక నేను చనిపోయినచో నేను నరకమును పొందెదను. అందుచే ఆ నరకము దాటునట్లు అనుగ్రహింపుము. ఇట్లు చిత్రకేదు ప్రార్థింపగా దయగల అంగీరసుడు త్వష్ట దేవతగా గల ఒక యాగమును చేయించెను. అందు చెరవు అనగా హోమము చేసే ద్రవ్యమును వండించి దానితో తష్ణను గూర్చి హోమము చేసెను. అతని భార్యలో పెద్దది శ్రేష్టురాలగు కృతద్యుతి అను భార్యకు యజ్ఞశేషమును అతడు వసంగెను. ఆమెకు యజ్ఞ ప్రసాదము ఇచ్చి ఓ రాజా. నీకు ఒక్క కుమారుడు కలుగును కానీ అతడు నీకు హర్షమును శోకమును కలిగించును అని చెప్పెను ఆమె ఆ చరువును పుచ్చుకొనెను కృత్తికలు అగ్ని వలన కుమారస్వామిని గర్భమును ఎట్లు దాల్చెనో అట్లే ఆమె గర్భమును దాల్చెను. శుక్ల పక్ష చంద్రుని వలె ఆమె గర్భం వృద్ధినందుచుండెను. ప్రసవ కాలము ఆసన్నము కాగా కుమారుడు కలిగెను. సూరసేన దేశమునందుండు ప్రజలందరూ తమ ప్రభువునకు కుమారుడు కలిగినని పరమానందము నందిరి. రాజు కూడా పుత్ర జననముచే సంతుష్టి నంది స్నానము చేసి పవిత్రముగా అలంకరించుకొని బ్రాహ్మణులచే ఆశీర్వాదములు నంది పిల్లవానికి జాతకర్మ చేయించెను. వారికి బంగారము, వెండి, వస్త్రములు, ఆభరణములు, గ్రామములు, గుర్రములు, ఏనుగులు, నూరు కోట్ల గోవులు దానము సంగెను. ప్రజలకు పరివారమునకు కూడా వారి వారి కోరికలు నిండునట్లు ఇష్ట వస్తువులను వసంగెను. ఎంతో శ్రమతో లభించిన ధనమునందు ధనము లేని వారికి ఎట్లు అధికముగు ప్రీతి ఉండునో అట్లే కుమారుని యందు ప్రేమ అధికమగుచుండెను. కృతద్యుతికి కుమారుడు కలిగినాడని విని సౌతులందరికీ తమకు సంతానము లేదను దుఃఖము అధికమాయెను. సంతానవతియగు కృతద్యుతి యందు రాజునకు ప్రేమ అధికమగుచుండెను. కుమారుని ఎల్లవేళలా లాలించుచు ఆమె వద్దనే కాలము గడుపుచుండెను.
బిగిలిన భార్యల యెడ అంత ప్రేమ లేకుండా ఉండెను. ఆ భార్యలకు సంతానము లేకపోవుట, రాజుగారి ఆదరము లభింపకపోవుట అను రెండు విధములగు దుఃఖములచే మనసులు క్లేశపడి సవతియందు అసూయచే తమను తాము నిందించుకొనుచు. బాధపడుచుండిరి. సంతానము లేని స్త్రీ పాపాత్మురాలు. సంతానము లేని స్త్రీ భర్త ఆదరింపడు స్త్రీని. సంతానము గల భార్య సంతానము లేని వారిని దాసులను చూచినట్లు చూచును. ఎంత సౌఖ్యం పొందినను దాసివులే పరిచర్యలు చేయుటయే గానీ భర్తతో కలిసి సౌభాగ్యం పొందలేని స్త్రీకి ఆనందం ఎక్కడిది? ఇట్లు బాధపడుచు సవతికి కుమారుడు కలిగినాడనియు తమ భర్తపై ప్రేమ చూపుట లేదనియు వారికి ద్వేషము ప్రబలమాయెను. ఓర్వలేని వారలై ద్వేషముచే మతిచెడి కుర స్వభావులై ఆ పిల్లవానికి విషం పెట్టిరి. ఆ బాలుడు చనిపోయెను. సవతులు ఇంత పాపము చేసినారని కృతద్యుతి ఎరుంగలేక బాలు నిద్రపోవుచున్నాడని అనుకొని భవనములో సంచరించుచుండెను. పిల్లవాడు ఎంత కాలమునకు మేలుకొనకుండుట చూచి దాదితో ఏమిటి ఇంతసేపు నిద్రపోవుచున్నాడు లేపి తీసుకుని రమ్మని చెప్పెను. దాది వెళ్ళుసరికి ఆ పిల్లవాడు గుడ్లు తేలవేసి మరణించి ఉండెను. దాది చూచెను హా అని నేలపడెను. చాలా వేగముగా మొరపెట్టుచుండెను. ఆ ఏడుపు విని కృతద్యుతి బానుని దగ్గరికి వెళ్లి చనిపోయి ఉండుటను గుర్తించెను. శోకము పొంగులు వారి నేలపడి ఇటునట్టు కొట్టుకొనుచుండెను. వస్త్రము కేశము చెదిరిపోవుచుండెను. ఆమె ఏడుపును విని అంతఃపురములో ఉన్న పురుషులు స్త్రీలు అందరును చేరి వారు కూడా దుఃఖించుచుండిరి. రాజకుమారుడు చనిపోయినాడని వినెను. కారణం ఏమియు తెలియలేదు. చూపు పోయెను. నేలపడెను. లేచి తొట్రుపాడు పడుచుండెను. బాలునిపై గల ప్రేమచే శోకము అధికమై రాజు మిక్కిలి దుఃఖించుచుండెను. మూర్ఛపడెను. మంత్రి మొదలగువ పరివారము బ్రాహ్మణులు అతని వెంట ఉండిరి. దుఃఖముతో వస్త్రము జారిపోవుచు జుత్తు జల్లుకొని పోవుచు వచ్చి బాలుని పాదముల వద్ద పడి. నీర్ టూర్పులు వదులుచుండెను. కన్నీటిచే మాట రాకుండెను. కృతద్యుతి కూడా శోకించుచున్న భర్తను చూచి మరింత దుఃఖము అధికమై ఏడుచుండెను. ఓ దైవమా, నీవు మూర్ఖుడవు. నీవు సృష్టి చేతువు కానీ సవ్యముగా ఉండదు.
ముందు పుట్టిన తల్లి తండ్రులుండగా తరువాత పుట్టిన పిల్లవాడు మరణించుట అపసవ్యము కాదా? అట్టి క్రమముచే పాటించుచున్నచో నీవు చాలా గొప్పవాడవై యుందువు. అట్లు కాకపోవుటచే నీవు మూర్ఖుడవు. తల్లిదండ్రులు పుట్టక మునుపు కుమారుడు పుట్టడు కదా? చనిపోవుటలో మాత్రము ఆ క్రమం ఎందుకు కల్పింపలేదు? ముందు పుట్టిన వారు, ముందు తర్వాత పుట్టిన వారు తర్వాత చనిపోయినట్టు చేయకూడదా? నీ సృష్టి వృద్ధి పొంది చొందుకొనుటకు పిల్లలపై ప్రేమను నీవే పెంచితివి. ఆ ప్రేమను నీవే ఖండించుచొందువు. ఇట్లు దైవమును నిందించుచు బాలునితో ఇట్లు అనుచున్నాడు. బాబు, దిక్కులేని దీనురాలైన నన్ను వదలి నీవు ఏగకుము. శోకముతో తపించుచున్న నాన్నగారిని చూడుము. బిడ్డలు లేకపోవుట చేయ కలిగిన శోకమును భరించుట కంటే నిన్ను వీడి ఉండుట భరింపరానిది. చీకటి అగుచున్నది. దేవుడు దయలేని వాడై నిన్ను దూరముగా తీసుకొని పోవుచున్నాడు. నాయనా లెమ్ము. నీతో ఆడుకొనుటకు పిల్లలు వచ్చినారు. నీవు పడుకొని చాలా సేపైనది. నీకు ఆకలి వేయుచున్నది. పాలు త్రాగుము. పువ్వు తినుము. మా శోకమును తీర్చవా? అయ్యో, నీ అందమైన ముఖమును నేను ఇక చూడజాలను. కదలాడుచున్న రెప్పలతో అందముగా ఉండెడి నీ నేత్రములను ఇక చూడను కదా? నా మాటలను వినుము. నీ మాటలు విను భాగ్యమున్నదో లేదో దయలేని దైవము వెనకకు వచ్చుటకు వీలు కాని ఏదో లోకమునకు తీసుకొని పోయినాడు అని భార్య ఏడుచుంట చూచి ఆమె విలాపముచే మరింత దుఃఖము గలవాడై చిత్రకేతువు శోకమధికమై గట్టిగా ఏడ్చెను. ఆ దంపతులు ఇట్లు ఏడ్చుంట చూచి పరివారమంతయు ఏడ్చిరి. అందరూ తెలివి తప్పినట్లు ఉండిరి. ఇట్టి మహా దుఃఖప్రదమైన పుత్రశోకముచే రాజు ప్రజలు కూడా తెలివి తప్పిపడి ఉండుటను ఎరింగి అంగీరసురు ముని నారదునితో మరల అక్కడికి వచ్చి చెప్పెను. చనిపోయిన బాలుని వద్ద శోకముచే చనిపోయినట్లు పడి ఉన్న చిత్రకేతువును, అంగీరసుడును, నారదుడును చూచి తమ మంచి మాటలతో అతని ఓదార్చుచు ఇట్లు పలికిరి.
ఆ నారదుడు అంగీరసుడు ఆ రాజుకు ఏ ఉపదేశం చేశాడో మనము తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the lotus-like one. Salutations to the lotus garland. Salutations to the lotus-eyed one. Salutations to the lotus-bearing one. The one with the lotus in the navel, the one who wears the garland of lotuses, the one who is pleasing to the eyes like lotuses, the lotuses on the soles of the feet Many salutations to you, O Manifest One. First Canto Eighth Chapter 22 Prayer. Dear listeners, welcome to the 15th podcast of Srimad Bhagavata Tatva Deepika, the sixth volume. Rudrashura's slaying. After completing, he is asking a question. Why is there such devotion and faith in such a monstrous demon? What is the reason for that? Before that, we have Shuka Maharaja Sukayogi explains. This is the story of Chitraketu. King. Listen carefully to this history. This is the story of Chitraketu. Narada and Devala heard this from Vyasa. I will tell you that. In the Surasena country, there was a sovereign named Chitraketu. During his reign, the country prospered, all desires were fulfilled, and he lived happily. He has a wife who is a crore of wives but he has no children. Even though he was of good lineage, none of his wives became pregnant. Form, generosity, age, high lineage, education, wealth, property. Even though everything is perfect, he is worried that his wives will be widowers, meaning they will be without children.
Even though he has so many wives and is wealthy, he is not pleased. Once upon a time, a sage named Angirasudu, who was the Lord of the world, came to his building without expecting it. Chitraketu confronted him as per the scriptures, worshipped him, made him a comfortable person, and then merged with Aditya. He was sitting humbly on the ground near Angirasu, thinking of saying something. Angirasudu, recognizing Chitraketu's opinion, began to question thus. Your body, Raja? The seven types of things that should be in your kingdom are: Swami, Amatyudu, Suhruthulu, Koshamu, Rashtramu, Durgamu. Are the things that are called strength safe? The living being, being a great egoist, is protected by the seven distortions of nature, just as the king is in the prosperity of the seven natures. Are your wives, your people, your ministers, your servants, your ministers, your citizens, your folk, your kings, your sons, under your control? Those who are controlled by their mind and senses, all these are controlled by them. All the people should worship with devotion They worship and offer cakes. When I see you, my heart seems to be in sorrow, not in joy. If all that was said before is in your lineage, there is no reason for your mind to be dissatisfied. Your face shows that some wish has been fulfilled. The face is pale and full of worry. What is the cause for this? Thus, Chitraketu, recognizing that Agnirasu had inquired about the cause of the sorrow, spoke thus to the sage, saying that he should desire offspring. Oh Lord, what is it that you, who are complete in penance, knowledge, and samadhi, know not? The sins that cover your knowledge are removed by the practice of yoga. Therefore, the inner feelings of creatures and external things will also be visible to you. But since you have questioned, I will present what is in my heart. I have an empire, wealth, and prosperity that even the world's rulers do not possess, but I have no children.
For one who is hungry and thirsty, no matter how many other pleasures there are, how can they bring joy to the mind? For me, who has no children, how much wealth is there, it does not give satisfaction. Our ancestors must have children to cross the difficult hell. If I die without atonement, I shall attain hell. Therefore, grant that we may cross that hell. Thus, when prayed to, the merciful Angirasa performed a yaga (sacrifice) as the deity Twashta. And the offering, that is, the substance used for the homam, was cooked and with that, regarding the heat, the homam was performed. He settled the remainder of the sacrifice on his wife, Kritadyuti, the eldest of his wives. Give her the sacrificial oblation, O King. You will have one son, but he will cause you joy and sorrow, he said. She took that womb, just as the Krittikas carried Kumaraswamy in the fire, she carried her womb in the same way. Like the moon in the waxing phase of the lunar fortnight, her womb was growing. The time of birth was near, and a son was born. In the land of Surasena All the people rejoiced that their Lord had fathered a son. The king, also satisfied by the birth of a son, bathed and decorated himself in a sacred manner, and had the Brahmins perform the Jatakarma ceremony for the Nandi child. They donated gold, silver, clothes, jewelry, villages, horses, elephants, and 100 million cows. He deposited the desired items so that the people and their families would have their desires fulfilled. Just as the rich have more joy in the wealth they have earned with much effort, so also the love for the son was increasing. Hearing that Kritadyuti had a son, all the sons of Sauti were greatly saddened that they had no children. The king's love for the daughter of Krutadhyuti, who was pregnant, was increasing. She spent her time with her son, always caressing him.
He had no love for the women who were left behind. Those wives, due to the lack of offspring and not receiving the king's protection, were afflicted by two kinds of sorrows, and they were condemning themselves with envy towards their own wives. They were suffering. A woman without children is a sinner. A woman without children is not respected by her husband. A wife with children looks at those without children as if they are servants. No matter how much comfort one receives, it is only through serving others that one finds happiness. Where is the happiness for a woman who cannot enjoy life with her husband? Thus, they were grieved that their wife had a son, and that she did not show love to her husband, and their hatred became strong. They became mad with hatred, losing their minds, and were of evil nature, and poisoned that child. The boy is dead. Unable to bear that the wives had committed such a sin, Krutadyuti, thinking that the boy was sleeping, was wandering in the house. Seeing that the child had not woken up for a long time, he asked the nurse, "What is it? He has been sleeping for so long. Please wake him up and bring him." As the grandmother was leaving, that child The eggs had been boiled until they were no longer alive. The old man saw and fell to the ground. He was screaming very loudly. Hearing that cry, Krutadhyuti went to Banu and recognized that he had died. The sorrow overflowed, and it was like a wave crashing against the shore. The cloth and hair were falling apart. Hearing her cry, all the men and women in the palace gathered together and they too were grieving. I heard that the prince has died. The reason for this is unknown. The sight was gone. The ground was submerged. She got up and started to stumble. The king was greatly saddened by the grief caused by the love for the boy. He fainted. The minister and his entourage, including Brahmins, were with him. With sorrow, the cloth slips and falls, and the hair shakes and falls, coming and falling at the feet of the boy. I was letting go of the negative. Tears streamed down my face. Krutadyuti, seeing her husband grieving, became even more sorrowful and cried. Oh, you big sap. You are the creator but you are not perfect.
Is it not improbable for a child born after his parents' death to die? If you follow this order, you will be very great. You are a fool for not doing that. Before the parents are born, a son is not born, right? Why was that order not implemented in the case of death? Should they not die a little while before and a little after the person who is born first? You have increased the love for children so that their creation may grow and reach. You're the one who condemns love. Thus, blaspheming God, he is saying this to the child. Oh, child, abandon me, poor, helpless one, and rise up. Behold my lord, which arises from the weeping. It is more unbearable to leave you than to bear the grief of not having children. It's getting dark. God is merciless and is taking you far away. Come on, son. The kids came to play with you. You've been lying there for a while. You are hungry. Drink milk. Eat the flower. Will you not relieve our sorrow? Oh, I can't look at your face again. With your eyelids moving, your beautiful eyes, I will not see them anymore, right? Please listen to my words. Hearing your words, the wife cried, "Whether it is fortunate or not, the unforgiving God has taken him away to some world that is impossible to return to," and seeing her crying, Chitraketu, saddened by her lament, wept loudly. Seeing the couple crying like this, the entire family cried. Everyone seemed to have lost their senses. Thus, due to the great sorrow of losing his son, the king and his people were also losing their senses, so Angiras, the sage, came there again and told Narada. Seeing the picture of Angirasu, Narada, lying as if dead, near the dead boy, they consoled him with their good words and spoke thus.
We will learn in the next episode what advice Narada gave to that king, Angiras. Jai Srimannarayana Asmatgurubhyo Namaha