సాంఖ్య తత్వ విభాగము - ప్రకృతి పురుషుల విచారణ
Exposition of Material Nature & Spirit Soul Elements
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, మహర్షి కపిలుడు సాంఖ్య తత్వశాస్త్రం ద్వారా ప్రకృతి మరియు పురుషుల స్వభావాన్ని సూక్ష్మంగా విశ్లేషిస్తాడు. సృష్టిలోని చతుర్వింశతి తత్వాలు జీవాత్మతో ఏవిధంగా సంబంధం పెట్టుకొని బంధానికి కారణమవుతాయో అనే సత్యాన్ని ఆయన స్పష్టంగా వివరిస్తాడు. ఈ జ్ఞానం ముముక్షువులకు మాయ నుండి విముక్తి పొందుటకు మార్గదర్శకంగా నిలుస్తుంది.
In this profound episode of Srimad Bhagavatham Canto 3, the great sage Kapila Muni illuminates the Sankhya philosophy by carefully distinguishing between Prakriti (material nature) and Purusha (the spirit soul). He reveals how the twenty-four elements of material creation interact with the conscious self, binding the soul to the cycle of birth and death. Through this timeless wisdom, seekers are guided toward discernment and liberation from material entanglement.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రియాయ సత్సంగ్గ్రహాయ భవపాన్థ నిజాశ్రమాప్తా వందే పరిష్టగతయే హరయే నమస్తే ఓ శ్రీ హరి సూర్య రూపంగానున నీకు నమస్కారము. ఆనంద స్వరూపుడవగు నీవు ప్రాణుల హృదయాకాశములో సాక్షి చైతన్యమై నివసించుచున్నావు. ఉజ్జ్వలమగు కీర్తి గల నీకు ఆది లేదు. సత్పురుషులు నిన్నే ధ్యానమందు గట్టిగా పట్టుకొనుదురు. సంసార మార్గములో బాటసారియగు జీవుడు నిన్ను శరణు పొందినప్పుడు సంసారము అంతమై సర్వోత్తమమగు గతిగా నిన్నే పొందును. భగవత్ బంధువు సిక్స్త్ క్యాంటో నైన్త్ చాప్టర్ 45th ప్రేయర్ భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధంలో 39వ పాడ్కాస్ట్ కి స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా కదురు దేవహుతి దేవహుతికి కపిలుడు. బోధిస్తున్నటువంటి జ్ఞానంలో మనం భక్తి యోగం గురించి తెలుసుకున్నాం. తర్వాత ధ్యానం ఎలా చేయాలనే విషయాన్ని మనం ప్రక్రియ ఇంతకుముందు పాడ్కాస్ట్ లో తెలుసుకున్నాం. వివరంగా విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి కపిల గీత పూర్తిగా వినడానికి. 32వ పాడ్కాస్ట్ నుంచి వింటే మీకు చాలా అర్థమవుతుంది. ప్రార్థన. దేవుడు, మనుష్యుడు మొదలగు శరీరములో జీవాత్మలో ప్రవేశించి దానిని నిలుపును. కానీ ఆ ఆత్మ అన్ని శరీరములందును జ్ఞానాకారమై అణుపరిమాణమై ఏకరూపముగా ఉండును. దేవాది శరీరములన్నియు ఆత్మచేతనే ధరింపబడి నిలుచున్నవి. పై కనిపించు దేవ మనుష్యాది శరీరములన్నియు కర్మచే ఏర్పడిన అవాంతర భేదములే గానీ ప్రకృతి పరిణామములచే ఏర్పడినవి. వీటన్నిటికీ పరమాత్మయే ఆత్మయై ఉండును. అతడే లోన వ్యాపించి, ధరించి, నియమించి ప్రవర్తింప చేయుచుండునని ఎరుంగవలెను. అగ్ని కర్రల యందు గడ్డి పరక యందు
రకరకములుగా కనపడుచుండును. అగ్నికి ఆధారమగు ఆయా ద్రవ్యములలోని పొడుగుతనము, పొట్టితనము, తిన్నన, వంకర, మున్నగునవి అన్నియు అగ్నియందు కనపడినను ఆ భేదము అగ్నికి ఎట్లు లేదో. వివిధములగు శరీరములోని ఆత్మలన్నియు ఏకరూపముగా ఉన్నను పైనుండు శరీర భేదముచే భేదమున్నట్లు కనపడును. ఇట్లు కార్యరూపముగా కారణరూపముగా ఉన్నది ప్రకృతి. ఆ ప్రకృతి జీవుని అంటి ఉండును. కానీ అది విష్ణువునకు సంబంధించినది. అందుచే దైవము అనబడును. అందుచే దానిని ఎవ్వరునూ ప్రయత్నము చేయరుంగలేరు, దాటలేరు. అది ఆత్మను పరమాత్మను తెలియకుండా మరుగుపరచును. ఆ మాయను తొలగించుకొనుటను. కొలగించుకొనుటకు భగవత్ భక్తియే సాధనము. దానిచే ఆ మాయ అనగా ప్రకృతిని దాటి తన స్వరూపమును భగవత్ స్వరూపమును ఎరుంగవలెను. ఈ విధంగా కపిలుడు భక్తి యోగమును సాంగముగా తల్లికి వివరించినాడు. దానిని విని దేవహుతి మరలా ఇట్లు ప్రశ్నించుచున్నది. ఈ సంసారము ఏర్పడుటకు కారణమగు ప్రకృతి స్వరూపమును కాల స్వరూపమును ఎరిగింపుము. స్వర్గ నరకాదులకు కారణమగు ఈ సంసారమును ఎరిగిననే దీని నుండి విడువడి మోక్షము పొందవలెని కోరిక కలిగి వైరాగ్యము కలుగును. కాలము ఈశ్వరుని బాహ్య రూపము. అది బ్రహ్మాదులను కూడా నియమించునది. అట్టి కాల స్వరూపమును ఎరిగింపుము. కాలము చేతనే జననము, మరణము కలుగుచున్నదని దానిని అతిక్రమించుట కొరకు కొందరు ప్రయత్నించుందురు. నీవు యోగ భాస్కరుడవు, నన్ను అనుగ్రహించుటకు నా కుమారుడుగా ఆవిర్భవించితివి. కొంతకాలము ఉండిపోయేడి ఈ శరీరమే తాను అనియు భగవత్ పరతంతుడగు తాను స్వతంత్రుడనియు అజ్ఞానముచే జీవుడు భావించుచున్నాడు. దానిచే అతను తనను గూర్చి పరమాత్మను గూర్చి యధార్థ జ్ఞానము లేని వాడగుచున్నాడు. దానిచే కర్మలు ఆచరించి స్వర్గమును నరకమును పొందుచు ఆ కర్మల యందు ఆసక్తి గల బుద్ధితో అలసి అపారముగు సంసారములో నిద్రించుచున్న జీవులను మేల్కొనుబుటకు నీవు సురుడుగా ఆవిర్భవించి జ్ఞానము ప్రకాశించు ప్రకాశము బృహత్వసంగుచున్నావు.
దేవోహుతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కపిలుడు ఆనందించిన వాడై తల్లికిట్లు బదులు పలికెను. అమ్మా పురుషులకు సత్వరజస్తమో గుణములు సహజములు. వానిచే వారు ప్రవర్తించని మార్గములు భిన్నముగా ఉండును. లోకములో జీవము లేని పదార్థములు కొన్ని, జీవము లేని పదార్థములు కంటే జీవము గల శరీరము గలవారు శ్రేష్టులు. భూమి మొదలగునవి అట్టి చైతన్యము కలవి. చైతన్యము లేని వారి కంటే చైతన్యము గలవారు, జ్ఞానము గలవారు శ్రేష్టులు. వారి కంటే ఇంద్రియ వ్యాపారములు గలవి శ్రేష్టములు. ఇంద్రియ వ్యాపారములు వృక్షములకు కూడా ఉన్నవని మహాభారతం చెప్పినది. దానికంటే స్పర్శేంద్రియము పనిచేయు ప్రాణులు శ్రేష్టులు. అంతకంటే రసేంద్రియం బాగుగా పనిచేయు చేపలు మొదలగునవి శ్రేష్టులు. జంతువులలో అనగా తిరియక్కులలో తుమ్మెదలు మొదలగునవి వాసనను ఎరుంగగలిగినవి. కాకులు మొదలగునవి రూపమును ఎరుంగ కలిగినవి. సర్పములు మొదలగునవి శబ్దమును ఎరుంగ కలిగినవి. ఈ విధముగా ఒక్కొక్క ఇంద్రియమే ప్రధానముగా పని చేయు వాటి కంటే రెండు వైపులా దంతములు గలవి శ్రేష్టములు. వానిలో నాలుగు పాదములు గలవి శ్రేష్టములు. పాదములు గల వానిలో రెండు పాదములు గలవి శ్రేష్టములు అనగా మనుష్యుడు శ్రేష్టుడు. ఆ మనుష్యులలో బ్రాహ్మణాది వర్ణములో బ్రాహ్మణుడు శ్రేష్టుడు. బ్రాహ్మణులో వేదమును అధ్యయనమును చేయువాడు శ్రేష్టుడు. వేదం అధ్యయనము చేసి దాని అర్థమును ఎరింగిన వాడు వేదమును నేర్చుకున్న వాని కంటే శ్రేష్టుడు. అర్థమును ఎనింగిన వాని కంటే మీమాంస చదివి సంశేహం తీర్చువాడు శ్రేష్టుడు. వాని కంటే విషయములందు సంఘము లేనివాడు శ్రేష్టుడు. అట్టి సంఘరహితునకు కామములు ఏమియు ఉండవు. తాను కర్మలను ఆచరించియు ఆ కర్మల ఫలితమును భగవానుకు అర్పించిన వాడు శ్రేష్టుడు. ఆచరించని కర్మలనే కాక తాను కూడా భగవానునికే చెంది భగవానుని కొరకే ప్రవర్తించుచున్నానని ఎరుగిన వాడు శ్రేష్టుడు. అట్టివాడు తన శరీర రక్షణము గాని ఆత్మ రక్షణము గాని తాను చేసుకుందునని భావింపడు. ఎల్లప్పుడూ తనకు భగవానుడితో గల సంబంధమును భావించుచునే ఉండును.
అట్టివాడు జ్ఞాని జ్ఞాని వాడు నాకే ఆత్మ అయినవాడు. వానికంటే అధికుడు వేరొకడు లేడు. నేను తనకు రక్షకుడునని. నేనే తనలో ఉండి నియమించి వర్తింప చేయుచున్నానని తన రక్షణ భారము నాయందు అర్పించి తాను ఆచరించు కర్మలన్నిటిని నాయందే అర్పించిన వాడు అందరికంటే శ్రేష్టుడు. అట్టివాడు తాను ఏ వ్యాపారమును చేయువాడను గానీ భావించి కాను అని భావించి కర్తృత్వాభిమానము లేనివాడై ఉండును. చేతనా చేతనాత్మకమగు జగత్తు అంతయు బ్రహ్మాత్మకమని ఎరింగి అన్నిటినీ సమానముగా చూచును. సర్వభూతములను అతడు మనసులో గౌరవముతో ఆదరించి నమస్కరించును. జీవులలో అంతర్యామిగా భగవానుడు అన్ని శరీరములో ఉన్నాడని అతడు గుర్తించును. ఇట్టివాడే భక్తులలో గొప్పవాడు. ఓ దేవహుతి, ఇంతవరకు నీకు భక్తి యోగమును, జ్ఞాన యోగమును వివరించితిని. ఈ రెండిటిలో ఆత్మను ఉపాసించుట జ్ఞాన యోగము. అది మూడు విధములుగా ఉండును. జీవాత్మ అనగా ప్రత్యగాత్మ బ్రహ్మాత్మకముగా కాక స్వతంత్రమని ఉపాసించుట. రెండు భగవానుని ఉపాసించుట అంగమగు అంగముగా జీవాత్మను ఉపాసించుట. మూడు, తన ఆత్మలో బ్రహ్మ ఆత్మగా ఉన్నాడని బ్రహ్మాత్మకముగా ప్రత్యేకాత్మను ఉపాసించుట. మొదటి ఉపాసనముచే ఆత్మ స్వరూప దర్శనమే అగును కానీ భగవత్ ప్రాప్తి కలగదు. రెండవ దానిచే భగవత్ ప్రాప్తికి సాధనముకు భగవత్ భక్తి కలుగును. ప్రకృతి కంటే వేరైన ఆత్మ స్వరూపము బ్రహ్మ ఆత్మగా కలది. బ్రహ్మకు శరీరముగా తన ఆత్మను ఉపాసించుట మోక్షమునకు సాధనము. ఇంతవరకు నీకు భగవత్ ఉపాసనము, ప్రత్యేకాత్మ ఉపాసనము కూడా వివరించితిని. ప్రధానము అనబడి ప్రకృత, ప్రకృతి, పురుషుడు అనబడి జీవుడు కూడా బ్రహ్మకు శరీరం వంటివారే. వానిచే ధరింపబడి, వానిచే నియమింపబడువారే. వీరిని ప్రేరణ చేయునది దైవము అనగా భగవాను సంకల్పము. దాని నిమిత్తము జీవుల కర్మ అనగా అదృష్టము. ఇవన్నీయు భగవత్ రూపములే. వీటన్నిటికంటే
వేరైనది కాలము. కాలము కనుక సకల భూతములకు రూపములలో భేదములను కలిగించుచున్నది. అనగా సకల భూతములను పరిణమింప చేయుచున్నది. కాల రూపియగు భగవాను వలని దేహాత్మి దేహాత్మాభిమానులకు జన్మ మరణాది భయము కలుగుచున్నది. కాల రూపియగు భగవానుడు లోన ప్రవేశించి భూతములచే భూతములను సంహరించుచుండును. ఈ కాలము సకలాధార భూతులగు విష్ణువే. ఈ విష్ణువే అధియజ్ఞము. ఇతడే బ్రహ్మాదులకు కూడా ప్రభువు. కాలాత్మకుడగు భగవానునకు ఒకడు బాంధవుడు, ఒకడు శత్రువు అని భేదము లేదు. ఆ కాలరూపియగు భగవానుడు తాను పరాకు లేకుండా ఉండి పరాకు చెందిన జనులను సంహరించుచుండును. ఆ కాలరూపియగు భగవానుని భయము చేతనే గాలి వీచుచున్నది. పర్జన్యుడు వర్షించుచున్నాడు, నక్షత్ర గణములు తోచుచున్నవి, నదులు ప్రవహించుచున్నవి, సముద్రం మొదల భయపడి చెలియలు కట్టును. దాని బూటిని దానిని దాటి భూమిని ముంచుట లేదు. వాని నియమనము వలననే సకల ప్రాణులకు ఆకాశము అవకాశం వసంగుచున్నది. గొప్ప వాటి అన్నింటికంటే గొప్పదో కాలాత్మ భావము. ఈ ఏడు ఆవరణములతో ఆవరింపబడిన అండమును తన శరీరముగా పుట్టించుచున్నాడు. రజస్తమోగుణములు. ప్రధానముగా గల బ్రహ్మాది దేవతలు కాలరూపి భగవానుని భయం వలనే ప్రతి కల్పమునందు సృష్టి కార్యకమునందు ప్రవర్తించుచున్నారు. ఆ కాలము భగవద్రూపము అట్టి కాలరూపి యంగు భగవానుడు అనంతుడు అనగా పెట్టినది ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఉన్నది అని చెప్పుటకు వీలుకానిది. అది అంతయును ఆదిని అంతమును కల్పించునది. తండ్రి తల్లి మొదలగు జన్మ కలవారిచే జన్మ గల పుత్రాదులను పుట్టింపచేయునది. అంతమొందించినది కూడా కాలమే. ఈ తర్వాత భాగాన్ని ఇంకా వివరిస్తున్నారు మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Gurus. To the one who burns the darkness of the sun, to the one who watches, to Krishna, to the one who is the cause of the merit of the delicious fame, to the one who is the inactive action, to the one who is the gathering of good deeds, I salute you, O Hara, who is the one who is in the assembly. Salutations to you, O Sri Hari, who is in the form of the sun. You, the embodiment of bliss, reside as a witness consciousness in the hearts and skies of creatures. You, with your radiant fame, have no beginning. The saints firmly hold on to you in meditation. When a traveler in the path of worldly life seeks refuge in you, the world ends and attains you as the supreme destination. Devotees of God, Sixth Canto, Ninth Chapter, 45th Prayer, Devotees of God, welcome to the 39th podcast of Srimad Bhagavata Tattva Deepika, Third Canto. Kadur Devahuti to Devahuti as part of Vidura Maitreyi conversation. In the knowledge that is being imparted, we have learned about Bhakti Yoga. Then we learned about the process of how to meditate in the podcast before. To know all the details, Kapila Geetha completely To hear. If you listen from the 32nd podcast, you will understand a lot. Prayer. God, the human being, enters into the body and the soul and keeps it. But that soul, being in all bodies, is in the form of knowledge, is atomic in size, and is of one form. All the bodies of Gods are sustained by the Spirit. The above-mentioned human-like bodies are all the distinctions formed by karma, but they are formed by the evolution of nature. For all these, the Supreme Being is the Self. It is to be understood that he is pervading, wearing, and appointing to act. In the firewood, on the grass
It appears in various forms. Even though the length, shortness, thickness, crookedness, and other such things in the substances that are the basis of fire are visible in the fire, that difference is not there for the fire. Although all the souls in different bodies are of the same form, they appear to be different due to the difference in the body above. Thus, nature is both the cause and the effect. That nature will be attached to the creature. But it belongs to Vishnu. Thus, it is called the Divine. Therefore, no one can try it, cannot cross it. It covers up the soul and the Supreme Soul. The elimination of that illusion. Devotion to God is the means to measure. By that, that illusion, that is, transcending nature, one should understand one's own form, the form of the divine. In this way, Kapiludu explained Bhakti Yoga to his mother. Hearing that, Devahuti again asked like this. Understanding the nature of the universe and the form of time that causes this world to be created. Knowing this world, which is the cause of heaven and hell, one should be free from it and attain liberation Desire leads to detachment. The time is the external form of God. It also appoints the Brahmaṇas. To understand the nature of such times. Some people try to transgress this, thinking that birth and death are caused by time. You are the Yoga Bhaskara, you appeared as my son to bless me. The ignorant being thinks that this body, which remains for some time, is himself, and that he, being the supreme being, is independent. Because of that, he is becoming someone without true knowledge about himself and about the Supreme Being. By performing actions through it, attaining heaven and hell, with an interest in those actions, with tiredness, awakening the beings sleeping in the immense world, you appear as a Surudu, and the light of knowledge shines brightly You're getting swell.
In response to the question asked by Devahuti, Kapiludu, filled with joy, replied as a mother would. Mother, for men, the qualities of Sattva, Rajas, and Tamas are natural. The ways they do not behave will be different. In the world, some things without life, those with a living body are superior to those without life. The earth and the like are conscious. Those who have consciousness are superior to those who do not have consciousness, those who have knowledge. They are superior to them in sensory transactions. The Mahabharata says that the senses are also present in trees. Those creatures whose sense of touch works better are superior. Fishes that work better than that are excellent. In animals, such as ants, honeybees, etc., they are able to smell. Crows and the like are capable of learning forms. Snakes and other such things have the ability to understand sound. In this way, those with teeth on both sides are superior to those whose one sense organ works primarily. It has four legs The best. Among those who have feet, those who have two feet are the best, meaning a human being is the best. Among those men, in the Brahmin caste, the Brahmin is the best. The best among Brahmins is one who studies and performs the Vedas. He who has studied the Vedas and understood their meaning is superior to one who has learned the Vedas. He who is better than the one who understands the meaning by reading the Mimamsa. He is better than he is, without a church in matters. Such a person, without association, will not have any desires. He who performs his duties and offers the fruits of those duties to God is the best. He who realizes that he himself belongs to God and acts for the sake of God, other than the actions not practiced, is the best. Such a person does not consider that he is doing either physical or spiritual protection. Always, he/she keeps in mind his/her relationship with God.
Such a person is a wise person, a wise person, he is my soul. There is no one greater than him. I am the protector of his honor. I am the one who is within him, appointing and applying, and having dedicated his protection burden to me, the one who has dedicated all the actions he practices to me is the greatest of all. Such a person, considering himself to be a businessman, will be without ego and without the sense of being the doer. The conscious, cognitive world is all Brahman, and seeing everything equally, it is equal. He respectfully and reverently honors and salutes all beings in his heart. He realizes that God is inherently present in all living beings. Such a great devotee. Oh, Devahuti, until now I have explained to you the path of devotion and the path of knowledge. In these two, worshipping the soul is the yoga of knowledge. It can be of three types. The soul, meaning the individual self, is not Brahman-like but is independent, and is worshipped as such. Two, worshipping God as an integral part of worshipping the soul. Three, that Brahma is in his soul as a soul The worship of a personal god. The first worship leads to the vision of the self, but does not lead to the attainment of God. Through the second, devotion to God is attained and achieved. The soul, which is different from nature, is the form of Brahma, the soul. Worshipping his soul as the body of Brahma is the means to liberation. Until now, I have explained to you the worship of God and the worship of the individual soul. Being the main one, being the nature, being the man, even the living being is like a body to Brahma. Those who are appointed by Him, those who are appointed by Him. What inspires them is God, that is, the will of the Lord. For that reason, the karma of living beings means luck. These are all forms of the Divine. More than all of these
The time of the day is different. Time, therefore, causes differences in the forms of all beings. That is, it is causing all the beings to transform. The body-conscious, the body-conscious, and the self-conscious are afraid of birth and death. The form of time, the Lord, enters the heart and destroys the beings through beings. Vishnu is the only one who is eternal and independent. This Vishnu is the Athiyagna. He is also the lord of the Brahma's. For the Lord of time, there is no distinction between a friend and an enemy. That formidable Lord, without being distracted, destroys the people who are distracted. The wind is blowing because of the fear of that time-limited God. The rain is pouring down, the constellations are appearing, the rivers are flowing, and the ocean is afraid and is closing its doors. Its boot does not cross it and does not sink into the earth. It is only by His appointment that the sky is providing opportunity for all living beings. The greatest of all things is the feeling of time. He is giving birth to an egg surrounded by seven enclosures as his body. The qualities of Rajas. The Brahma and other gods, being primarily fearful of the Lord of Time, are acting in every cycle and in the creation process. That time is the form of God. Such a time-form, the Lord, is infinite. That is what was placed, what is here now, it is impossible to say. That which creates all that is beginning and end. It is the father and mother who give birth to sons and daughters born from the womb of those who are born. Time is the only thing that can kill you. We will discuss the next part in the podcast later. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.