అజామిళుని పూర్వ చరిత్ర - బ్రాహ్మణ ధర్మ పతన వృత్తాంతము

Ajamila's Past History & Deviation from Brahminical Duties

bhagavatam

ఈ శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, ఒకప్పుడు వేద విద్యలో నిష్ణాతుడైన, బ్రాహ్మణ ధర్మాన్ని పాటించిన అజామిళుడు ఒక నీచ స్త్రీ మోహంలో పడి తన ధర్మ మార్గాన్ని ఎలా వదిలాడో తెలుసుకుంటాము. సద్గుణ సంపన్నుడైన ఆ బ్రాహ్మణ యువకుడు కుసంగతి వలన క్రమంగా తన కుటుంబాన్ని, వేద కర్తవ్యాలను, మరియు సదాచారాన్ని విసర్జించాడు. ఈ కథ మనకు చెడు సాంగత్యం మరియు ఇంద్రియ వాంఛలు మానవుని పతనానికి ఎంతగా దారితీస్తాయో హృదయపూర్వకంగా బోధిస్తుంది.

In this episode of the Srimad Bhagavatham podcast, we explore the fascinating past of Ajamila — a once-virtuous brahmin who fell from his righteous path after being enchanted by a low-born woman. We learn how this devoted young man, disciplined in Vedic study and brahminical conduct, gradually abandoned his duties, family, and dharma under the spell of material attachment. This poignant account from Canto 6 serves as a profound reminder of how even the most cultivated souls can succumb to the influence of bad association and sensory temptation.

← Prev Next →
Ajamila's Past History & Deviation from Brahminical Duties bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నారాయణాయ ఋషయే పురుషాయ మహాత్మనే విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమః సకల ప్రాణులలో దేశ పరిచ్ఛేదము లేని ఆత్మ రూపుడై ఉన్న పూర్ణ పరబ్రహ్మయే నారాయణ మహర్షి. జగద్రూపముగా ప్రకటమై జగత్తునకు అంతర్యామి అయిన ఆ పరబ్రహ్మకు నమస్కారము. సెవెంత్ క్యాంటో ఫిఫ్త్ చాప్టర్ థర్టీయత్ ప్రేయర్. భగవన్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము రెండవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు వ్యక్తికి పాప నివృత్తికి ప్రాయశ్చిత్తానికి కావలసినటువంటి విషయాలు, తపస్సు చేసే పద్ధతులు, భక్తిని అవలంబించే పద్ధతుల గురించి చక్కటి వివరం పరీక్షిత్తు మహారాజ్ అడగగా శుకుడు బోధించాడు. దానిని సంబంధించి ఒక కథను ఇప్పుడు మనకు చెప్తున్నాడు అజామిలి యొక్క వృత్తాంతం శ్రద్ధగా లెక్కిద్దాం. కన్యాకుబ్జ దేశమున అజామీలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండెను. వానికి ఒక తక్కువ జాతి స్త్రీతో సంబంధం ఏర్పడెను. ఆమె సంపర్కముచే అతని ఆచారం అంతయు నశించెను. తన వర్ణాశ్రమ ధర్మములను పూర్తిగా మరచెను. ఆమెనే భార్యగా ఉంచుకొని బిడ్డలను కనెను. ఆ కుటుంబమును పోషించుటకు నిందింపదగిన మార్గములను ఆశ్రయించి ధనమును ఆర్జించుచుండెను. జూదము, దొంగతనము, మోసము మున్నగునవి చేసి ధనమును ఆర్జించి కుటుంబమును పోషించుకొనుచుండెను. ఇంకను డబ్బు చాలక పక్షులను, మృగములను హింసించి వాటిని అమ్ముకొని కుటుంబ పోషణము చేయుచుండెను. ఇట్లు పిల్లలతో ఆ ఉంపుడు కత్తెతో కాలమును గడుపుచు ఉండసాగెను. వయస్సు మళ్ళినది. పది మంది కుమారులు కలిగిరి. అందు కడసారి వానికి నారాయణుడు అని పేరు పట్టుకొనెను.

వానిపై తల్లిదండ్రులకు ఇద్దరికీ ప్రేమ ఎక్కువే. వాడు ముద్దుగా మాట్లాడుచుండుట చూచి అతడు ములిసిపోవుచుండెను. వాని ఆటలు, పాటలు, చేష్టలు ముసలి వయసులో అజామిణులకు తృప్తినిచ్చుచుండెను. తాను ఏది తీసుకున్నను త్రాగుచున్నను నారాయణ అని పిలిచి వానికి కూడా పెట్టుచు త్రాగుంచుచు ఆనందించుచుండెను. పుత్ర వ్యామోహములో మృత్యు సమీపించుచున్నదని కూడా అతడు గుర్తింపకుండెను. ముసలి వయస్సులో అతనికి ఆ నారాయణుని యందే ప్రేమ. నారాయణుడే సర్వము అయి ఉండెను. అలా ఉండగా మృత్యువు ఆసన్నమైనది. ప్రాణము పోవుచున్నను అతని మనస్సు నారాయణ అని పేరు గల బాలునే తలంచుండెను. ఏ భటులు వచ్చినారు? పాశము చేతులతో ధరించి వంకర ముక్కులతో, పొడువైన రోమములతో, తీవ్రమగు చూపులతో, భయంకరమగు కోరలతో ముగ్గురు భటులు అతనికి ఎదురుగా నిలిచిరి. కొంచెం దూరములో నారాయణుడు ఆడుకొనుచుండెను. అజామిణునకు భయం వేసి మనసు చెదిరి నారాయణా అని కెవ్వున కేక వేసి కుమారుని పిలిచెను. ఇంకా ప్రాణము పోవుచున్నది నారాయణ అనుచున్నాడు కావున ఇతనిని మనము తీసుకొని వెళ్ళవలెనని విష్ణుదూతలు అచడికి వచ్చిరి. మహా పాపాత్ముడు గనుక అజాముడిని తామే తీసుకొని వెళ్ళవలెనని త్రాడు వేసి యమదూతలు లోనుండి ఆత్మను ప్రాణములతో వెలికి లాగుచుండిరి. వారిని విష్ణుదూతలు వచ్చి అడ్డగించిరి. యమధర్మరాజు శాసనమును అడ్డగించడి వారు ఎవరుందురని ధైర్యముతో ఉన్న యమదూతలు మీరు ఎవరు అని వారిని ప్రశ్నించిరి. మీరు ఎవరి దూతలు? ఎందుకు జరిగి వచ్చినారు? ఎందువలన మమ్మలను వారించుచున్నారు? మీ వేషములు చూచినచో మీరు దేవతలో, గంధర్వులో, సిద్దులో అన్నట్లు ఉన్నారు. మీ నేత్రములు తామర పువ్వు రేకుల వలె ఉన్నవి. పచ్చని పట్టు వస్త్రములు ధరించి. ఉన్నారు. కిరీటములతో, కుండలములతో ఉన్నారు. తామర పూసల మాలలు కంఠములందు అలంకరింపబడి ఉన్నవి. యవ్వనములో ఉన్నారు సుందరులు. ధనస్సు మొదలగు ఆయుధములు ధరించిన నాలుగు భుజములు గలవారులై ఉన్నారు. కత్తి, గద, శంఖము, చక్రము దాల్చి ఉన్నారు. మీ కాంతులు ఇతట ఆవరించిన చీకట్లను తొలగించుచున్నవి. మీరు ఎవరి దూతలు? మేము యమధర్మరాజు దూతలము.

మమ్ములను ఎందుకు అడ్డగించుచున్నారు అని ప్రశ్నించిరి. యమదూతలు ఇట్లు అడగగానే వాసుదేవుని ఆజ్ఞను నెరవేర్చుటకై వచ్చిన విష్ణుదూతలు నవ్వుచు పొరువు వలె గంభీరమగు నవ్వుతో ఇట్లు బదులు పలికిరి. మీరు యమధర్మరాజు దూతలమని అనుకొనుచున్నారే? మీకు ధర్మము తెలియనా? ధర్మ లక్షణములు చెప్పుడు. ఎవరిని దండింపవలెను? ఎందుకు దండింపవలెను? అన్న వివేకం మీకు కలదా? ఎట్టి వారు దండింపదగిన వారు చెప్పుడు అని ప్రశ్నించిరి. యమదూతలు ఇట్లు సమాధానము చెప్పుచున్నారు. వేదము చేయదగినది అని చెప్పిన దానిని ఆచరించుట ధర్మము. చేయరాదని చెప్పిన దానిని మానుట ధర్మము. వేదం సాక్షాత్తు నారాయణుడే అనగా నారాయణ నుండి వెలువడినది. అది నారాయణుని వలనే ఎల్లప్పుడూ తనంత తాను ఉండునదే కానీ ఒకనాడు పోవునది ఒకనాడు బయలుపడునది కాదు. నారాయణుడే తాను లోన ప్రవేశించి ఈ లోకమున ఉండుడి దేవ మనుష్యాది పదార్థములను వారు చేయు కర్మలను సాగించుచున్నాడు. వారి యొక్క గుణములు వారు చేయు వ్యాపారములు వారి రూపములు మొదలగు అన్నిటిలో నారాయణుడే ఉండును. లోకములో ఎవరు ఏమి చేయుచున్నను వానిని ప్రత్యక్షముగా సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, చంద్రుడు, గోవులు, సంధ్యాకాలములు. పగలు, దిక్కులు, జలము, భూమి, కాలము, ధర్మము అనునవి చూచుచుండును. అవి వీడు చేసినాడని తెలియజేయును. అట్టి వారిని శిక్షింతురు. వారు చేసిన అధర్మమునకు తగిన దండము విధింపబడును. వాటిని వారు అనుభవించి తీరవలెను. పుణ్యము చేయువారు ఆ పుణ్య ఫలమును అనుభవింతురు. అట్టి పుణ్యమును చేయువారు కూడా కొన్ని అధర్మ కార్యములను తప్పనిసరిగా చేయుచుందురు. వారికి ఆ తప్పునకు ఫలితము అనుభవింప చేయవలెను. లోకములో ధర్మము ఆచరించువారు, అధర్మమును ఆచరించువారు కూడా దండమునకు అర్హులే అవుదురు. అధర్మము ఆచరించు వారికి అధర్మమునకు దండము తప్పదు. ధర్మం ఆచరించువారు కూడా అప్పుడప్పుడు తప్పనిసరి అయి చేసిన అధర్మములకు ఫలముగా దండమును అనుభవింపవలెను. జీవుడు సత్వరజస్తమో గుణముల ప్రకృతి వికారమగు శరీరముతో చేరి ఉండి

ఆ గుణముల ప్రేరణచే బుద్ధీంద్రియ మనప్రాణముల సంఘాతముకు దేహముతో కోరి కొన్ని పనులు చేయును. దాని ఫలితముగా స్వర్గమును నరకమును అనుభవించుచుండును. కోరి తన శరీరమునకై ఎంత ధర్మం ఆచరించునో అంతటి సుఖమును స్వర్గములో అనుభవించును. ఎంతటి అధర్మము ఆచరించునో అంతటి దుఃఖమును నరకములో అనుభవించును. ఈ శరీరములో కూడా వారి వారి గుణముల భేదములను బట్టి సాత్విక, రాజస, తామస కర్మలు వెనక జన్మలలో ఆచరించి వాని ఫలముగా ఈ జన్మలో సుఖములను దుఃఖములను అనుభవించుచుందురు. ఈ జన్మలో ఏమి చేయకపోయినను సుఖములను దుఃఖములను అనుభవించుటకు కారణము వెనకటి జన్మలలోని కర్మల ఫలమే అని తెలియుచున్నది. అట్లే ఈ జన్మలో చేసిన ధర్మాధర్మముల ఫలము పైలోకములో అనుభవింపవలెను. గడిచిన కాలములో చేసిన కర్మల ఫలము వర్తమాన కాలములో అనుభవింతురు. కాలము కర్మ జీవుడు విడక ఉండును. సత్వాది గుణములు జీవుని అంటిపెట్టుకొని ఉండును. ఆ గుణములచే సుఖము, దుఃఖము, మోహము కలుగుచుండును. ఈ కాలములో సుఖముగా కానీ దుఃఖము గాని మోహము గాని అనుభవించుచున్నదో దీనికి కారణము గడిచిన కాలములో సత్వర్జస్తమో గుణముల ఆదిక్యముచే చేసిన ధర్మాధర్మములే కారణం. సత్వగుణము ధర్మము కర్మము చేయి కర్మను చేయించి తర్వాతి కాలమున సుఖమును కలిగించును. అట్లే రజస్తమస్సులు అధర్మమును ప్రవర్తింపచేసి తర్వాత కాలమున దుఃఖమును మోహమును కలిగించును. ఇప్పుడు సుఖము అనుభవించుచున్నచో వెనుక సత్వగుణము అభివృద్ధి అయి మంచి కర్మ చేసి దాని ఫలితమును ఇప్పుడు అనుభవించునట్లు వెనకటి జన్మలలో కర్మల ఫలమును పై జన్మలలో అనుభవింతురు. సత్వరజస్తమో గుణములే అన్నిటికీ మూలము. వాని వలననే ధర్మాధర్మ రూపమైన కర్మలు చేయును. వాని ఫలముగా వచ్చిన సుఖదుఃఖములచే వెనుక జన్మలలో చేసిన కర్మలను సత్వాది గుణములను ఊహింపవచ్చును.

అందుచే కర్మయే సుఖమునకు దుఃఖము. మనకు కారణము కర్మ చేయగానే నశించినను జీవునకు అంతర్యామిగా ఉన్న పరమాత్మ మూడు కాలముల యందు సంకోచింపకుండా ఉన్న తన జ్ఞానముచే వెనక జన్మలలో ఈ జీవుడు చేసిన పుణ్య పాప కర్మలకు అనుగుణముగా అనుభవింపజేయును. జీవుడు తమోగుణం ఆవరించి జ్ఞానము సంకోచించిన వాడగును. అందుచే వానికి శరీరము కంటే వేరుగా తాను ఉన్నానని కానీ శరీరములో భగవానుడు ఉన్నాడని కానీ తెలియదు. అప్పుడు కనబడుచున్న శరీరమునే చూచుకొని ఇప్పటికీ ఆ శరీరమును చూచుకొని ఏది సుఖమో దానినే కోరుచుండును చేయుచుండును. ముందు వెనకలు తెలియవు. ఇట్టి శరీరము తనకు వెనక ఒకటి ఉండెను అని గాని ఇట్టిది వేరొకటి వచ్చును అని గాని ఎరుంగడు. పరమాత్మ అనుగ్రహముచే సుఖ దుఃఖమును లభించునని ఎరుంగక తాను చేయు కర్మయే ఫలమునిచ్చునని ఆ దేహమునకు అప్పటికి. ఏది సుఖమునిచ్చునునో అనుకొనునో దానిని ఆచరించును. భగవానునకు ప్రీతి కలిగించు పనిని చేయుడు. అనాదిగా ఉండెడి అవిద్యా కర్మ వాసనల చేత ఆత్మ స్వరూపం మరుగుపడును. సత్వరజస్తమో గుణములు గల ప్రకృతి వికారమగు శరీరమును చేరి ఉండును. ఆ గుణముల యొక్క ఆవిర్భావముచే ధర్మమును అధర్మమును ఆచరించుచుండును. దానిచే సుఖదుఃఖములను అనుభవించుచుండును. ఇట్లు ఎడదిగక సంసారము సాగుచుండును. శరీరములో జీవుడు ఉన్నప్పుడు కర్మేంద్రియములు ఐదింటిచే మాట్లాడుట, ఇచ్చిపుచ్చుకొనుట, నడుచుట, మలమును విడుచుట, మూత్రమును విడుచుట. అన్ని అను వ్యాపారములను ఐదింటిని చేయుచుండును. జ్ఞానేంద్రియములు ఐదింటిచే శబ్దమును, స్పర్శను, రూపమును, రసమును, గంధమును. ఎరుంగుచుండును. వీటి వెనక మనస్సు కూడా జ్ఞానేంద్రియములకు సహాయపడుచుండును. పంచభూతములతో శరీరము ఏర్పడి ఉండును. జీవుడు ఒక్కడే పంచభూతములతో ఏర్పడిన శరీరముతో ఐదు పనులు చేయును.

ఐదు విషయములను ఎరుంగుచు వాటికి తోడుగా తన మనస్సును చేర్చుచు తాను ఆ పదునారింటికి వెనుక పదునేడవ వాడుగా ఉండి మూడింటిని అనగా సుఖదుఃఖ మోహములను అనుభవించుచుండును. జీవుడు సూక్ష్మ శరీరము పదునారు భాగములు గల దానిని ధరించి ఉండును. శరీరమునకు ప్రకాశ, క్రియ, ఆవరణ, శక్తులు గల సత్వము, రజస్సు, తమస్సు అనేటి మూడు శక్తులు ఉండును. సూక్ష్మ శరీరముతో జీవుడు స్థూల శరీరమును చేరి ఉండును. అది జీవునకు హర్షమును, శోకమును, భయమును కలిగించునట్టి సంసార పరిభ్రమణమును కలిగించును. గర్భ, జన్మ, బాల్య, యవ్వన, వార్ధక్య, మరణ, స్వర్గము లేక నరకము అనడి ఏడు అవస్థలలో తిరుగుచుండుటయే సంసారము. లింగ శరీర సంబంధమే జీవునకు సంసార ప్రారంభము. పురుషుడు శరీర సంబంధము కలగగానే దేహము తాను అభిమానము కలగ కలవాడగును. దానిచే ఇష్టము లేకున్నను తప్పనిసరిగా ధర్మాధర్మములను అనగా కర్మలను ఆచరించుచుండును. తాను చేసిన కర్మలచే పట్టుపురుగు దారమునల్లుకొని దానిలో తాను బంధింపబడినట్లు బంధింపబడును. తానెవడో తాను ఎరుంగకుండా చేయును. దేహమే తాననడి మోహమును పొందును. పట్టుపురుగు ఎట్లు పట్టు దారముల నుండి వెలుపలికి రాజాలదో. అట్లే జీవుడు కూడా మోహము నుండి బయలుపడడు. సహజముగానున్న సత్తరజస్తమో గుణములచే ప్రేరితుడై జీవుడు కర్మ చేయుచునే ఉండును. ఏ పనియు చేయకుండా ఒక్క క్షణకాలము కూడా ఉండచాలడు. ఈ విధముగా మరణించి సూక్ష్మ శరీరముతో సాగుచుండును. శరీరములు కర్మానుసారముగానే ఏర్పడుచుండును. కర్మను అనుసరించి చీమలో ఏనుగులో చేరి ఆ ఏ ఏను నుండి తాను పుట్టునో ఆ తల్లి వంటి రూపము తండ్రి వంటి. సాత్వికాది కర్మ వాసనా రూపముకు స్వభావము కలుగుచుండును. ఈ విధముగా జీవునికి ప్రకృతి సంబంధముచే సంసారం ఏర్పడెను. సంసారము జీవునకు సహజము కాదు. ప్రకృతి సంగముచే కలిగిన ఈ సంసార ఈ శరీర సంబంధము పరమ పురుషుని యందు భక్తిచే శీఘ్రముగా లయమగును.

తర్వాత విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అజామిణ వృత్తాంతం చాలా అంతరార్థంగా మన జీవితానికి కావలసిన విషయాలు తెలిపి తెలిపేటువంటి చక్కటి కథ ముందు భాగాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru, Narayana, the sage, the great soul, the Lord of the universe, the lord of all beings, salutations. Among all beings, the complete Supreme Brahman, who is the form of the soul without any distinction of country, is Narayana Maharshi. Salutations to that Supreme Being, who is proclaimed as the embodiment of the universe and is the inner controller of the universe. Seventh Canto, Fifth Chapter, Thirty-second Prayer. Devotees of God, welcome to the second podcast of the sixth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, when Parikshit Maharaj asked for a detailed explanation about the things needed for a person's sin atonement and expiation, and the methods of doing penance, and the methods of following devotion, Shuka explained. Regarding that, he is now telling us a story, let's carefully calculate the account of Ajamila. In the Kanyakubja country, there lived a Brahmin named Ajamila. He had a relationship with a woman of a lower caste. Her contact with him has destroyed his culture. He completely forgot his Varnasramadharma. She kept them as wives and children He did not. He was earning money by resorting to shameful ways to support that family. He was earning money by doing gambling, theft, and deception, and was supporting his family. Still, not having enough money, he was torturing birds and animals, selling them, and supporting his family. Thus, he began to spend his time with the children, with that hidden thief. The age has changed. Ten sons were there. Therefore, finally, he took the name Narayana.

Both his parents have a lot of love for him. Seeing him speaking sweetly, he was getting upset. His games, songs, and antics gave satisfaction to the old women in their old age. He would call out 'Narayana' to whatever he took, drink it, and then put it in his mouth and drink it, enjoying himself. He did not even realize that he was approaching death due to the infatuation with his son. In his old age, he was in love with that Narayana. Narayana is the one who is everything. And so, death was inevitable. Even though his life was leaving him, his mind was thinking of a boy named Narayana. Which soldiers came? Wearing a noose, with crooked noses, with long hair, with intense gazes, with terrifying fangs, three soldiers stood before him. Narayana was playing at a little distance. Ajamina was frightened and her mind was disturbed. She shouted "Narayana!" and called her son. And Narayana is saying that his life is going, therefore we should take him, said the Vishnu's messengers to Achadi They came. Because he was a great sinner, the messengers of Yama were pulling Ajamudu out of the underworld with a rope, taking him away. Vishnu's messengers came and stopped them. The Yama's messengers, who were brave enough to question who were the ones who obstructed Yama's law, asked them, "Who are you?" Whose messengers are you? Why did you come? Why are they scolding us? Looking at your costumes, you seem to be a god, a gandharva, a siddha. Your eyes are like the petals of a lotus. They are wearing green silk clothes. They are with crowns and earrings. They are adorned with lotus flower beads garlands around their necks. The young are beautiful. They are four-armed, bearing weapons like bows and other arms. They are wearing a sword, a mace, a conch shell, and a discus. Your lights are removing the darkness here. Whose messengers are you? We are messengers of Yama, the god of death.

They questioned why they were being obstructed. As soon as the messengers of Yama asked this, the Vishnu messengers who came to fulfill Vasudeva's command laughed and replied with a solemn laugh like a drum. Do you think you are the messengers of Yama, the god of death? You don't know dharma? The characteristics of dharma. Who should be punished? Why should I be punished? Brother, do you have any sense? They questioned whether they should be punished. The messengers of Yama are thus replying. It is dharma to perform what is said to be worthy of being done. It is dharma to abandon what is said to be unsuitable. The Vedas were revealed by Narayana, the very Narayana. That is always with Narayana, but it is not something that goes away one day and appears another. Narayana himself, entering within, is sustaining the beings, gods, humans, and other substances in this world, and the actions they perform. Their qualities, the businesses they do, their forms, and everything else, Narayana is present in them. In the world, whoever is doing what, him Directly, the sun, fire, sky, air, moon, cows, and twilight. He sees the day, the directions, the waters, the earth, time, and righteousness. They will let you know what he's up to.. They punish people like that. They will be punished according to the injustice they have done. They should experience it themselves. Those who do good deeds will experience the fruits of their good deeds. Those who perform such good deeds also inevitably perform some unrighteous acts. They should be made to suffer the consequences of that mistake. In this world, those who practice righteousness and those who practice unrighteousness are also eligible for punishment. Those who practice unrighteousness will surely be punished for unrighteousness. Those who practice righteousness should also sometimes experience punishment as a result of their unjust deeds, which are inevitable. The living being, being associated with the body, which is the nature of the three gunas - sattva, raja, and tamo

Inspired by those qualities, the intellect, senses, and mind, along with the body, desire and do certain things. As a result, he experiences heaven and hell. As much righteousness as one practices for one's body, one will experience that much happiness in heaven. The more unrighteous one acts, the more suffering one experiences in hell. In this body also, depending on the differences in their qualities, they perform Sattvic, Rajasic, and Tamasic actions in previous births, and as a result, they experience happiness and sorrow in this birth. Even if one does not do anything in this life, the reason for experiencing happiness and sorrow is the fruits of the deeds of previous births, it is known. Similarly, the fruits of righteousness and unrighteousness performed in this life should be experienced in the afterlife. The fruits of past actions are experienced in the present time. The time, karma, the living being is separated. The Satvadhis are the one who is attached to the soul. By those qualities, happiness, sorrow, and delusion arise. In this time, whether experiencing happiness, sorrow, or delusion, the reason for this is the past time, the virtues of Sattva, Rajas, and Tamas The reason is the dharma and adharma done by the supreme. The quality of goodness, righteousness, and action, by performing actions, brings happiness in the future. Similarly, the Rajasic passions cause unrighteousness, and then in due course, cause sorrow and delusion. Now, while experiencing happiness, the quality of goodness develops in the past, and by doing good deeds, they experience its results now. In past lives, they experience the fruits of their actions in future lives. The three Gunas are the building blocks of all that is subtle. It is through him that actions, which are in the nature of righteousness and unrighteousness, are performed. The pleasures and sorrows that come as a result can be imagined from the karmas done in past lives with the good qualities of being truthful.

Therefore, karma is both happiness and sorrow. The reason for us is that even if the karma is destroyed as soon as it is done, the Supreme Soul, who is the inner controller of the living being, experiences the merits and sins done by this living being in previous births according to the knowledge that he has without being constrained in all three times. The living being, covered by the quality of ignorance, becomes one who has contracted knowledge. Therefore, he does not know that he is different from the body, but that the Lord is in the body. Then, looking at the body that is visible, even now, looking at that body, he desires and does what is pleasing. You never know what you're up against. He does not know whether such a body exists behind him or whether something else comes. Without knowing that happiness and sorrow are obtained by the grace of the Supreme Soul, until that body says that the karma he does gives the fruit. Whatever gives happiness, whatever you think, you will practice it. One who does the work that pleases the Lord. Due to the ignorance, karma, and the smell of actions that have been there from time immemorial, the true form of the self is obscured. The nature, which has the qualities of sattva, rajas, and tamas, is united with the body, which is a distorted form Due to the emergence of qualities, one practices dharma and adharma. By it, one experiences happiness and sorrow. Thus, without stopping, the family life continues. When the soul is in the body, the five senses speak, give, take, walk, excrete, and urinate. All the businesses are doing five. The five senses, namely sound, touch, form, taste, and smell, are perceived. Behind these, the mind also helps the senses. The body is made up of five elements. The living being alone performs five actions with the body formed from the five elements.

Knowing five things, and adding his mind to them, he, being the seventeenth person behind that four-room house, experiences three things, namely, pleasures and sorrows. The living being possesses a subtle body, which consists of fiveteen parts. The body has three powers: Prakasha (illuminating power), Kriya (action power), Avarana (enclosure power), and Tamas (inertia power). The soul, with its subtle body, is united with the gross body. That causes joy, sorrow, and fear to the living being, causing the cycle of worldly existence. The cycle of birth, death, and reincarnation, or the cycle of birth, death, and reincarnation, is the cycle of existence. The physical body is the beginning of life for the individual. As soon as a man has a physical relationship, his body becomes attached to it. Even if one does not like it, one must necessarily perform dharma and adharma, that is, karmas. By the karma he has done, the silkworm is bound to the thread, and he is bound in it. He makes himself unaware. The body itself is the delusion. Silkworm The king does not come out of the silk threads. Similarly, the soul also does not come out of delusion. The soul, inspired by the qualities of Sattarajastamo, which is naturally present, continues to perform actions. He must not be idle for a single moment. In this way, after death, it continues with a subtle body. The bodies are formed according to karma. Following karma, joining in the ant, in the elephant, from that elephant, from which he is born, that mother-like form, father-like. The nature of the actions of the Sattvic nature is to be in the form of a desire. In this way, the world is formed for the living being through nature. Family life is not natural for a being. This world, which is caused by the union with nature, this body-related matter, will be quickly destroyed by devotion to the Supreme Being.

We'll learn more about it in another podcast. Let's learn about the beginning of the wonderful story that tells the things needed for our lives in a very meaningful way in the next podcast. Jai Srimannarayana, salutations to the Gurus