భవాటవి వర్ణన - అరణ్య పోలిక (భాగం 1)

Description of Bhavatavi — The Forest Metaphor (Part 1)

bhagavatam

ఈ శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, పంచమ స్కంధంలో వర్ణించబడిన భవాటవి — సంసారమనే దట్టమైన అడవి — యొక్క లోతైన రూపకాన్ని విశ్లేషిస్తాము. శుకబ్రహ్మ మహర్షి, ప్రాపంచిక జీవితాన్ని ఒక భయంకరమైన అరణ్యంతో పోల్చుతూ, జీవుడు అజ్ఞానంతో అందులో ఎలా సంచరిస్తాడో అద్భుతంగా వివరిస్తారు. కుటుంబం, సంపద, మరియు ఇంద్రియ సుఖాల మోహంలో చిక్కుకున్న జీవుడు వాటినే శాశ్వతమైన ఆశ్రయంగా భ్రమపడతాడని ఈ రూపకం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సంసారారణ్యం నుండి బయటపడాలంటే సద్గురువు ఆశ్రయం తప్పనిసరి అని ఈ ఎపిసోడ్ మనకు హృదయపూర్వకంగా బోధిస్తుంది.

In this profound episode of the Srimad Bhagavatham podcast, we explore the allegory of Bhavatavi — the vast and bewildering forest of material existence — as described in the Fifth Canto. Shukadeva Goswami masterfully compares the cycle of worldly life to a dense, dangerous forest where the conditioned soul wanders in confusion, bound by desire and ignorance. Through vivid and deeply symbolic imagery, we come to understand how the soul becomes entangled in the illusions of family, wealth, and sensory pleasure, mistaking them for true shelter. This episode invites sincere reflection on the urgent need to seek the guidance of a true spiritual master to find the path out of this forest of suffering.

← Prev Next →
Description of Bhavatavi — The Forest Metaphor (Part 1) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తే దేవ దేవేశ శంఖ చక్ర గదాధర భక్తేచ్ఛోపాత్త రూపాయ పరమాత్మన్ నమోస్తుతే ఓ పరమాత్మ దేవతలకు ప్రభువులగు బ్రహ్మాదులకు కూడా నీవు శాసకుడవు. శంఖమును, చక్రమును, గదను ధరించే నీవు భక్తుల ఇచ్చచే అవతారమును స్వీకరించెదవు. నీకు నమస్కారమగుగాక. టెన్త్ క్యాంటో 59th చాప్టర్ 25th ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధం 18వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రియవర్తుని చరితము ఆ తరువాత భూగోళ వర్ణనాన్ని మనం వింటున్నాం. భూగోళ వర్ణనలో ఉన్నటువంటి భాగాలు భరత వర్షం గురించి మనం ఇక్కడ వర్ణన ముందు జరగబోతుంది శ్రద్ధగా తెలుసుకుందాం. ఎనిమిది వర్షములలో ఉండేటి పురుషులు అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఎనిమిది వర్షములు ఆ భాగంలో వచ్చినవి కదా దానిలో. త్రేతాయుగములో ఉన్నట్లు ఉత్కృష్టముగు సుఖమును అనుభవింతురు. కృతయుగములో అందరూ ధ్యానమునందే ఉందురు. ద్వాపర యుగములో కలియుగములో దుఃఖము అధికముగా సుఖమును అనుభవించుందురు. త్రేతాయుగములో సుఖం అధికముగా అల్పాల్పముగా దుఃఖమును అనుభవింతురు. ఎనిమిది వర్షములలోని జనులు దేవతల వలె ఉందురు. అచట పురుషులు వెయ్యి ఏనుగుల బలము కలిగి ఉందురు. వారి బలము, వయస్సు, ఆనందము తరుగక ఉండును. దీర్ఘాయుర్ధాయము కలిగి ఉందురు. స్త్రీ పురుషులు అన్యోన్యము ఆనందమును అనుభవించుచుందురు. ఎంతో కాలము స్త్రీ పురుషులు కలిసి ఉన్నను ఆయుర్ధాయము పరిసమాప్తి అగుటకు సంవత్సర కాలము ఉండగా ఒక సంతానము కలుగును. పై ఎనిమిది వర్షములలో దేవతా శ్రేష్టులు మహోపచారములతో విలాస విహారములతో వినోదించుచుందురు. సుందరమగు ఉద్యానవనములు.

పుష్పములతో నిండిన వృక్షములు, తుమ్మెదలతో నిండిన పుష్పములు, నిర్మలముగు జలాశయములు, అందు రకరకములగు జలపక్షులు, రంగు రంగుల విలాస వినోదములు నిండి యుండును. ఆ ప్రదేశములలో వానిని వారు అనుభవించుచు సుఖముగా సంచరించుచుందురు. ఇలా వ్రతము మొదలు తొమ్మిది వర్షములలో భగవానుడగు నారాయణుడు ఆయా వర్షములకు అధిపతిగా అచట నుండి పురుషులను అనుగ్రహించుటకు శరీరధారులగు జీవులతో సమానముగు రూపముతో కళ్యాణ గుణములు దివ్య మంగళ విగ్రహము గలవాడై ఆయా రూపములతో సన్నిధానము చేసి ఉండును. ఇలా వ్రతములో భగవానుడు వృద్ధుడు ఒక్కడే ఆరాధుడుగా ఉండును. అచట మిగిలిన అందరూ స్త్రీలే అయి ఉండురు. పార్వతీ దేవి ఆ వర్షములో ఏ పురుషుడు ప్రవేశించినా స్త్రీయగునుని శాపమును సంగెను. ఆ శాపం ఒక్క శివునికి మాత్రం వర్తింపదు. అందుచే ఆ శాపము నిరంగిన శివుడు తప్ప పురుషులు ఆ వర్షమున ఉండరు. అచట భవానియే నియమించి పాలనము చేయు తత్వమై ఉండును. ఆ భవాని వారికందరికీ స్వామిని. ఆమెను అనుసరించి పరిచర్యలు చేయు స్త్రీలు కొన్ని వేల కోట్ల మంది అచట ఉందురు. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ అను నాలుగు మూర్తులతో ఉండెడి మహాపురుషుడగు నారాయణుని నాలుగవ మూర్తియగు సంకర్షణుడు ఆ వర్షమునందు ఆరాధ్యుడుగా ఉండును. అతడే వృద్ధునకు అధిష్టాన దైవతం దైవము. తమోగుణ ప్రధానముగా గల ప్రకృతి అతని వశమునందుండును. అచట ప్రళయకర్తయగు వృద్ధుడు సంకర్షణ మూర్తిని ఎల్లప్పుడూ ఈ క్రింది మంత్రము జపము చేయుచు సమాధిలో దర్శించుచు సేవించుచుండును. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యాన్యాయ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ. ఆ మంత్రమునకు అర్థము ఓం అను శబ్దము బ్రహ్మను తెలియజేయును. ఓం తత్ సత్ అనునవి మూడును బ్రహ్మ వాచకములు. తనకంటే వేరైన చేతనులు ప్రకృతి పురుష తత్వములతో కూడిన జగత్తు నిత్య విభూతి కూడా తనకే శేషముగా అనగా ఉపయోగపడుననిదిగా స్వీకరించినవాడు అని ఓం అను అక్షరమునకు అర్థము.

భగవానుడు అనుటలో జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అను ఆరు గుణములు పరిపూర్ణముగా గలవాడు. మహాపురుషుడు అనుట చేత నిఖిల జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు ఒక ప్రయోజనము కొరకు కాక శ్రమ లేకుండా లీల వలె చేయువాడు అని అర్థం. చేతనములలో గాని అచేతనములో గాని ఉండుటకు అవకాశము లేని గుణమును కలవాడు. జగత్కారణముగా ఉండుటకు జీవులచే ఆశ్రయింపబడుటకు ఆశ్రయించిన వారి కార్యములు నెరవేర్చుటకు తగిన సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, వాత్సల్యము, సౌశీల్యము. సౌలభ్యము, జ్ఞానము, శక్తి సహజముగా గలవాడు. ఈ దేశమునందుండును, ఈ దేశమునందు ఉండడు అని చెప్పుటకు వీలు కానివాడు. అనగా అంతటా వ్యాపించి ఉండువాడు ఈ కాలమునందుండును. ఈ కాలమునందు ఉండడు అని చెప్పుటకు వీలు కాకుండా ఉండు నిత్యుడు. అన్ని వస్తువులలో తాను ఉండుటచే అన్ని వస్తువులు తానే అగుటకు ఈ వస్తువు కాదని చెప్పుటకు వీలు కాని సర్వాత్మకుడు స్వరూపముచే గుణములచే ఇంతవాడు ఇట్టివాడని చెప్పుటకు శక్యము కానివాడు. కావున అనంతుడు అనబడును. ఏ ఇంద్రియముల చేతను గ్రహించకు శక్యము కానివాడు కనుక అవ్యక్తుడు. అట్టివాడే నాకు రక్షకుడు అని రుద్రుడు ఆ వర్షమునందు శంకరసునుని ఈ మంత్రముచే ఉపాసించుచుండును. వెనుక చెప్పిన మంత్రముని వివరముగా శ్లోకములలో తాత్పర్య రూపముగా తెలుసుకుందాము. ఇలా వృత వర్షములో ఈ శ్లోకములతో ధ్యానము చేయుచుందురు. దాని అర్థము మహాపురుషా నిన్నే ఉపాయముగా ఆశ్రయించుచున్నాము. నీ భక్తి గలవారిచే ఉపాసింపదగిన వాడవు. నీ చరణములే ప్రాప్యములు. సమస్తమైన ఐశ్వర్యములకు ఆశ్రయమైనావు. భక్తుల విషయమున నీ గుణములను ప్రకటించిన వాడవు. సర్వ భూతములను సృజించిన వాడవు. సర్వ భూతములకు అభ్యుదయమునకు కారణమైన వాడవు. నీ సంకల్పముచే నీ భక్తులకు కలిగిన సంసార బంధమును తొలగించువాడవు. అట్టి నీవే మాకు శరణము.

సర్వలోకములను, సకల పదార్థములను స్వతః ఎరుంగగల జ్ఞానము గలవాడవు. మా యొక్క గుణములచే గాని, ఆ గుణములచే కలుగు రాగద్వేషాది చిత్త వృత్తులచే గాని ఆక్రమింపబడని వాడవు. క్రోధ వేగమును జయింపలేని వారము మేము. నీవు వానిని నియమించిన వాడవు. అట్టి భగవానుడగు నిన్ను సంసారము జయించవలెనని కోరిక గలవారు ఎవరు ఆదరించరు? దేహమే ఆత్మ అని అభిమానించు జనులకు మాయ అనగా అజ్ఞానమును మత్తును కలిగించి కన్నులను ఎర్రబడుచుందువు. నీ నేత్రములు కూడా ఎర్రగనే ఉండును. కానీ నీకు ఎట్టి దోష స్పర్శ ఉండదు. నీవు విశుద్ధ సత్వమూర్తివి. మేము నీ పాదములను ఎట్లు స్పృశింపగలము? నాగలోకములోనున్న స్త్రీలు కూడా నీ పాదములను పూజించుటకు సమర్థులు కాజాలని వారే. చేతన చేతన మిశ్రమమగు ఈ జగత్తు యొక్క స్థితి లయములు నీ అధీనములు. నీవు సర్వ జగత్తుకు కారణమైనను సత్వాది గుణములు అంటవు. స్వభావముచే పరిచ్ఛేదము లేని వాడవు. వెయ్యి పడదలు గల శేషుని శిరస్సుపై ఒక చిన్న ఆవగింజ ఉన్నట్లు ఈ భూమి ఉన్నది. ఈ భూమండలము ఆ అనంతునకు భారమా? నీ నుండియే నిర్మాణముకు కావలసిన జ్ఞానము, శక్తి గల శరీరము కలిగిన బ్రహ్మ పుట్టినాడు. ఆ బ్రహ్మ నుండి రుద్ధుడు పుట్టినాడు. రుద్రుడు అహంకారమునకు అధిష్టాన దైవము. మూడు విధములగు అహంకారమును అతడే ప్రవర్తింపజేయుచుండును. ఇలావృత వర్షమునందు అధిదేవతయగు సంకర్షణ మూర్తిచే రుద్రుడు జన్మించినాడు. మహత్వము, అహంకారమును, అహంకారము నుండి బయలువెళిన ఇంద్రియములు, మనస్సు, సూక్ష్మభూతములు, స్థూలభూతములు, బ్రహ్మాదులు అందరును నీ ఆజ్ఞకే వశపడి నడుచుచున్నారు. నీ చేత నిర్మింపబడిన ఈ జగత్తు అంతయు కర్మలు అనిటి ముడులతో నిండిన మాయచే బంధింపబడి ఉన్నది. దేహేంద్రియ సంబంధముచే మోహమునంది తనను గూర్చి గాని పరమాత్మను గూర్చి గాని ఎరుంగజాలక దేహము తానని తాను స్వతంత్రునని భావించుచుండును. ఎట్లు ఈ మాయను తరించవలెనో జీవుకు తెలియదు. నీవు దయతో తరింపచేయవలెను. ప్రకృతి సంబంధము కలిగించువాడవు, తొలగించువాడవు కూడా నీవే కదా. అట్టి పరమ పురుషులు.

సంకర్షునకు నమస్కారము. భద్రాశ్వ వర్షమునకు భద్రశ్రవుడు అధిపతి. అచట ఉండు ఉపాసకులందరూ సాక్షాత్ భగవానుడగు వాసుదేవుని యొక్క ప్రతిరూపమగు హయగ్రీవుడను నామముతో వ్యవహరింపబడు. మూర్తిని ధ్యానము చేయిస్తారు. మనము భద్రాసి వంశమునకు సంబంధించిన విషయాన్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇలా మనము ప్రతి వర్షములో ఉన్నటువంటి అధిష్టాన దేవత ఆ విషయాలు తెలుసుకుంటాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the God of Gods, the bearer of conch, disc, and mace, the form of devotion to the devotees. Salutations to the Supreme Soul. Oh Supreme Soul, you are the ruler of the gods, Brahma, and others. You, who wear the conch, the discus, and the mace, will accept the incarnation of the devotees' wish. I'm here to greet you. Tenth Canto 59th Chapter 25th Prayer. Dear listeners, welcome to the 18th podcast of Srimad Bhagavata Tattva Deepika, the fifth book. Until now, we have heard about the history of Priyavartuni, and after that, we are listening to the geographical description. Let's carefully learn about the parts of geography description, about Bharatavarsham, which is going to happen here. The men who were in the eight rains, that is, the eight rains that were mentioned earlier, came in that part, right? They experience the excellent happiness as if it were in the Treta Yuga. In the Krita Yuga, everyone is in meditation. In the Dvapara Yuga and Kali Yuga, people experience more sorrow and less happiness. In the Treta Yuga, they experience happiness in abundance and sorrow in abundance. The people in the eight rains are like gods. There, men have the strength of a thousand elephants. Their strength, age, and joy will not diminish. Long life. Men and women experience mutual pleasure. Even if men and women are together for a long time, if there is a year for the end of life, there will be a child. In the upper eight rains, the gods, with great services and luxurious pastimes, are enjoying themselves. Beautiful gardens.

Trees full of flowers, flowers full of bees, clear water reservoirs, and various kinds of water birds, colorful recreational activities are all filled in it. In those places, they experience it and travel happily. Thus, starting the vow, in the nine rains, Lord Narayana, as the lord of those rains, from there, to bless the men, with a form equal to the embodied beings, with auspicious qualities, with a divinely auspicious idol, with those forms It will be done. In this way, in the vow, the Lord is the only old man who is worshipped. All the people left there were women. Parvati Devi, in that rain, any man who enters becomes a woman, she fulfilled the curse. The curse only affects one Shiva. Therefore, except for Shiva, who is the destroyer of that curse, men will not be there in that rain. There, Bhavani is appointed and governs as the essence. Swami to all in the Bhavani temple. Following her, thousands of crores of women are there to do ministries. Vasudeva, Pradyumna, Aniruddha, Sankarshana, who is the fourth form of Narayana, who has four forms, will be worshiped in that rain. He is the presiding deity of the elderly. Nature, dominated by the quality of Tamas, is under his control. There, the old man who is the destroyer of the world, the embodiment of Sankarshana, always chants the following mantra, meditates in Samadhi, and serves. Om Namo Bhagavate Mahapurushaya Sarvaguna Sankhyanyaaya Sankhyanaya Anantaaya Avyaktaya. The meaning of that mantra is that the sound 'Om' reveals Brahman. Om, Tat, Sat, these three are Brahma Vachakas (words denoting Brahma). The world, which is different from himself, is composed of nature, man, and the essence of reality, and is also eternally radiant to him, and he accepted it as his own, that is the meaning of the Om symbol.

In the word 'Bhagavan', one who possesses knowledge, power, strength, wealth, virility, and radiance, all six qualities are complete. The meaning is that the great man, by being said, the creation, preservation, and destruction of the entire universe, is not for a purpose, but he performs it like a play without effort. One who possesses a quality that does not have the opportunity to be in consciousness or unconsciousness. To be the cause of the world, to be sheltered by living beings, to fulfill the deeds of those who have taken refuge, to have sufficient omniscience, omnipotence, affection, and goodness. He is a man of ease, wisdom, and power. He is someone who cannot be said to be in this country or not in this country. That is, the one who is pervading everywhere will be in this time. He is eternal, impossible to say that he does not exist in this time. Because he is in all things, to be in all things, to be himself, to be able to say that this is not an object, to be the form of the all-pervading, to be the one who is not able to say that he is this, he is like this. Therefore, he is called infinite. Because he is not able to perceive through any of the senses The unborn one. Such is the protector for me, so Rudra, in that rain, Shankarasuni is worshiping with this mantra. Let us learn in detail about the mantra mentioned earlier, in the form of its meaning in the verses. Thus, in the rainy season, they meditate with these verses. Its meaning is, O great man, we are taking refuge in you as a means. You are worthy of being worshiped by those who are devoted to you. Yours sincerely. You are the support of all fortunes. You are the one who proclaimed your virtues in the matter of devotees. You are the creator of all beings. You are the cause of the progress of all beings. You are the one who removes the worldly bondage that your devotees have by your will. You alone are our refuge.

You are the one who has the knowledge of knowing all the universes and all the substances by yourself. You are one who is not occupied by the qualities of our own, or by the mental activities arising from those qualities, such as attachment and aversion. We are not people who cannot control our anger. You've got him. Who are those who desire to conquer the world, such as you, the Lord? For those who believe that the body is the soul, Maya, which means ignorance and intoxication, causes the eyes to turn red. Your eyes are also red. But you'll be untouched. You are the embodiment of purity. How can we touch your feet? Even the women in Nagaloka are not capable of worshiping your feet. The state and rhythm of this world, which is a mixture of consciousness, are under your control. Even though you are the cause of the entire world, you are not of the nature of goodness. You are one step away from being a pure soul. This earth exists with a small mustard seed on the head of Sesha, who has a thousand hoods. Is this earth a burden to that infinite being? From you, the body with the knowledge and power needed for creation The Brahma who is united is born. Rudra was born from the Brahma. Rudra is the presiding deity of ego. He is the one who makes the ego of three kinds manifest. Thus, in the rainy season, Rudra was born by the presiding deity, Sankarshana Murthy. Importance, ego, senses that emerge from ego, mind, subtle elements, gross elements, Brahma and all are obeying your command and acting accordingly. This world, created by you, is bound by the illusion filled with karmas. Being deluded by the body-mind relationship, he cannot understand himself, neither about himself nor about the Supreme Soul, and he thinks that he is the body and he is independent. How to overcome this illusion, the soul does not know. You must be kind. You are the one who creates and destroys nature. Such great men.

Hello Sankarshan. Bhadraswa is the ruler of Bhadraswa rain. All the devotees who are there are known by the name Hayagriva, who is the direct form of Lord Vasudeva. They will guide you to meditate on the Murti. We will learn about the matter related to the Bhadrasi dynasty in another episode. In this way, we learn about the presiding deity in each rain. Jai Srimannarayana. Salutations to the Guru