క్షీరసాగర మథన ఘట్టము (Part 4)
Churning of the Milk Ocean (Part 4)
శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధంలో అత్యంత మహిమాన్వితమైన క్షీరసాగర మథన ఘట్టం యొక్క నాల్గవ భాగంలో మనం ఈ అద్భుత గాథను మరింత లోతుగా అనుభవిస్తాం. సముద్రమథనం పరాకాష్ఠకు చేరుకుని, చిరకాల వాంఛితమైన అమృతం చివరకు ఆవిర్భవిస్తుంది. శ్రీమహావిష్ణువు మోహినీ రూపాన్ని ధరించి, అసురులను మాయతో మభ్యపెట్టి, దేవతలకు అమృతాన్ని అందించే దివ్యలీలను ఈ ఘట్టంలో శ్రద్ధగా శ్రవణం చేయవచ్చు.
In this fourth installment of the Churning of the Milk Ocean episode from Canto 8 of Srimad Bhagavatham, we continue to witness the magnificent unfolding of one of the most celebrated events in all of Vedic literature. The great churning of the Kshirasagara reaches its most climactic moments as the divine nectar of immortality, Amrita, finally emerges from the cosmic ocean. Lord Vishnu, in His enchanting Mohini form, intervenes with divine grace to ensure that the Devas alone receive the nectar, outsmarting the cunning Asuras through His supreme illusive power.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కం శాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామిన త్వాం వినా ఓ గోపాలా, కరుణా సముద్ర, లక్ష్మీపతి, కంసారి, గజేంద్ర రక్షక, మాధవా, రామానుజ, జగన్నాథ, పుండరీకాక్ష, గోపీజన వల్లభ రక్షించుము. నీవే తప్ప నితప్పరంబు నేను ఎరుగను. ముకుందమాల 22 ప్రెయర్ భవద్బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపికా అష్టమ స్కంధం నాలుగవ పాడ్కాస్ట్ లో స్వాగతం ఇంతవరకు గజేంద్ర మోక్షణం వృత్తాంతాన్ని చక్కగా సేవించాం ఇప్పుడు క్షీరసాగర మథనం వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాం. దుర్వాస మహర్షి ఇంద్రునకు ఒక పుష్పమాలికను వసంగినాడు. ఇంద్రుడు అహంకారముతో కనులకు అద్దుకొని శిరమును దాల్చక తన వాహనముగు ఐరావతముపై పడవేసినాడు. ఆ ఏనుగు తొండముతో క్రింద పడవేసి కాళ్ళతో తొక్కివేసెను. ఇది మహాపచారం. భగవంతు నిర్మాల్యమును భాగవతులు వసంగిన దానిని నిర్లక్ష్యముగా చూడరాదు. ఆ భాగవతాపచారం వలన ఇంద్రుడు దుర్వాసిని శాపమునకు గురి అయ్యెను. మూడు లోకములు ఇంద్రుడు కూడా శ్రీదేవిచే విడవబడిరి. యజ్ఞాది క్రియలు చేసినను ఐశ్వర్యం మరల కలగలేదు. రాక్షసులు దేవతలను యుద్ధములో ఎదిరించి చంపుచుండిరి. మరల శ్రీమంతులగుటకు తేజస్శాలురగుటకు ఏమి చేయవలెనో తెలియక మహేంద్రుడు వరుణుడు మొదలగు వారందరూ దేవతలతో కలిసి దేవసభకు వెళ్లి బ్రహ్మకు విన్నవించిరి.
ఇంద్రుడు మొదలగు దేవతలందరూ బలహీనులై మంగళరహితులై ఉండిరి. మూడు లోకములు అమంగళముతో నిండినవాయను. అప్పుడు బ్రహ్మ ఆలోచించి ఇట్లు చెప్పెను. నేను, రుద్రుడు, దేవతలు అందరము కూడా భగవాను యొక్క జ్ఞాన శక్తియాది గుణలేశములచే సృజించబడిన వారము. ఆ భగవానుడు లోకం యొక్క సృష్టి, స్థితి, లయములను చేయుటకు తానే రజస్సత్వ తమస్సులను గల మూర్తులను ధరించుచుండును. ఆ గుణములచే ఆయా కర్మలను ప్రవర్తింప చేయుచుండును. ఇప్పుడు అతడు జగద్రక్షణమునకు సిద్ధపడుచున్నాడు. కావున జగద్దురోగు అతనిని మనము రక్షించుటకు ఉపాయముగా స్వీకరించం. శరణు పొందిన వానిని రక్షించుట అతని స్వభావము. ఇట్లు చెప్పి బ్రహ్మ దేవతలతో కలిసి తమస్సు కవతలనున్న అజితుడనెడి భగవానుని స్థానమునకు చేరెను. దేవతలకు కూడా భగవానుడు కనపడడు. వేదములలో ఇట్టి వాడని వినినారు కనుక ఆ వాక్యములందు విశ్వాసముంచి మనసును దృఢముగా నిలిపి అట్లు స్తోత్రము చేసిరి. హే దేవా! నీవు వికార రహితుడవు, సత్య స్వరూపుడవు, వరేణ్యుడవు, సకల జగత్ కారణమైన వాడవు. ప్రాణ మనోబుద్ధులను సకల ఆత్మలను ఒక్కసారి దర్శింపగలవాడవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనడి అవస్థలు లేనివాడవు. శబ్దాది విషయములను, శ్రోత్రాదీంద్రియములను ప్రకాశింపచేయగలవాడవు. కర్మాయత్తమగు శరీరము లేనివాడవు. రాగద్వేషములు కల పురుషులకు ఉండెడి ఈ అజ్ఞానము లేని పరిశుద్ధ జ్ఞానము కలవాడవు. సర్వత్రా వ్యాపించి ఉందువు. జ్ఞాన శక్త్యాది గుణములు ఆరు కలవాడవు. అట్టి నిన్ను శరణముగా నమ్మియున్నాము. భగవానుని యొక్క మాయచే మనోవ్యాపార మూలమగు సంసార చక్రము కదులుచున్నది. ఈ చక్రమునకు సత్వరజస్తమో గుణములు మూడును ఇరుసు వంటివి. 10 ఇంద్రియములు, ప్రాణాది పంచవృత్తులు మొత్తం 15 రేకులు గలది ఈ చక్రము. ఇది మెరుపు కంటే వేగముగా తిరుగుచుండును. దీనికి ముఖ్యమగు మూలాధారము పరమాత్మ సంకల్పం.
పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము అనునవి ఎనిమిది ఎను చక్రమునకు పైకమ్మి వలె ఉండునని ఈ చక్రమునకు మూలముగు పరమాత్మను శరణముగా నమ్మియున్నాము. భగవానుడు కేవలము సత్వప్రధానుడు. తమస్సునకు అనగా ప్రకృతి మండలమునకు ఆవలివాడు. సంసారులచే చూచుటకు శక్యము కానివాడు. ఇంద్రియ గోచరుడు కాడు. అవధులు లేనివాడు. బంగారం వలె అధికమగు ప్రకాశము గలవాడు. అట్టి వానిని ముముక్షువులు యోగ మార్గమున ధ్యానించుచుందురు. లోకములో భగవన్ మాయచే తిరోహితమైన జ్ఞానము గలవారై పరమ పురుషార్ధముగా పరమాత్మను ఎరుంగజాలరు. ఎంత జ్ఞానము గలవారైనను తమ ప్రయత్నముచే ఆ మాయను దాటలేరు. బ్రహ్మాది దేవతలు, ఋషులు సత్వగుణము ప్రధానముగా ఆవిర్భవించిన వారైనను జ్ఞానము కలవారైనను ఆ భగవానుని సూక్ష్మమైన గతిని ఎరుంగలేరు. భూమి మొదలగు సమస్త లోకములను సర్వభూతములను ఆ భగవానుని శరీరము. పురుష సూక్తములో వర్ణింపబడినట్లుగా చరాచరములన్నియు వాని నుండి వెలువడినవే. ఆ భగవానుని బలం వలన మహేంద్రుడు, అనుగ్రహం వలన దేవతలు, క్రోధం వలన రుద్రుడు, హర్షం వలన బ్రహ్మ, ఇంద్రియముల వలన ఛందస్సులు ఆవిర్భవించినవి. వాని వక్షస్థలము నుండి శ్రీ జన్మించినది. ఛాయచే పితృ దేవతలు స్తనముల నుండి ధర్మము, వీపు నుండి అధర్మము, శిరస్సు నుండి ఆకాశము ఆవిర్భవించినవి. బ్రాహ్మణాది వర్ణములు అతని అవయవములు. ఆ అవయవముల నుండి ఆవిర్భవించినవి ఈ విధముగా తన మాయ చేతనే సకల లోకములను సకల భావములను సకల వాంగ్మయమును సృజించినాడు. దానినంతను తన శరీనముగా ధరించినాడు. ఒకనాడు వాననన్నిటినీ ఉపసంహరించి స్వానందానుభవముచే పరిపూర్ణుడై ఉండువాడు. సత్వరజస్తమో గుణముల సంబంధము లేనివాడు అగు ఆ సర్వేశ్వరునకు నమస్కారం. ప్రభువు పైన చెప్పిన గుణములు కల నీ దివ్య మంగళ విగ్రహమును దర్శింపవలెనని శరణు పొందిన మా నేత్రములకు గోచరమగునట్లు చేయుము.
మందహాసముతో నిండిన నీ ముఖమును దర్శింపజేయుము. ఆయా కాలములలో స్వేచ్ఛచే నీవు అనేక రూపములను దాల్చి సాధింప శక్యముగాని కార్యములను మా కొరకు చేయుచున్నావు కదా. మేము చేయు కర్మలలో క్లేశం అధికము, ఫలము స్వల్పముగా సాగుచున్నవి. అవి వ్యర్థములు. నీ స్తోత్రము, నీకు నమస్కారము ఒక్కసారి చేసినను అధికముగు ఫలముల సొంగును. లోకములో మేము చేయు ఏ వ్యాపారమైనను నీకే సమర్పించినచో వ్యర్థము కాదు. నీవే సకల లోకముల సకల లోక మూలము. చెట్టునకు మొదట పోసిన నీరు. ఎట్లు కొమ్మలకు, ఆకులకు అంతకు చేరునో అట్లే విష్ణువును ఆరాధించుట సకల లోకారాధనము సకల ఫలప్రదమగును. ఈ విధముగా దేవతలే చేస్తుతింపబడిన భగవానుడు వెయ్యి మంది సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లు వారికి దర్శనము సంగెను. దేవతలు ఆ తేజస్సును చూడజాలకపోయిరి. బ్రహ్మ రుద్రుడు దివ్య తేజో విరాజితమగు ఆ భగవానుని దివ్య మంగళ విగ్రహమును దర్శించిరి. ఆ రూపము బంగారు కాంతితో ప్రకాశించుచున్నది. పీతాంబరమును ధరించినది. సుందరమగు ముఖము, మణికిరీటము, కేయూరములు, కరణాభరణములు. హారములు, మొలనూలు, వలయములు, కౌస్తుభము, నూపురములు మున్నగు దివ్యాభరణములతో ప్రకాశించుచున్నదా రూపం. వనమాల, లక్ష్మి, కౌస్తుభము వక్షస్థలమున ప్రకాశించుచున్నవి. చక్రాది ఆయుధములు తమ తమ మూర్తులతో స్వామిని సేవించుచున్నవి. ఇట్టి రూపమును దర్శించి దేవతలతో రుద్రునితో కూడా బ్రహ్మ నేలకు ఒరిగి నమస్కరించెను. లేచి ఇటు స్తుతిస్తున్నారు. భగవానునకు విగ్రహము లేదని అనుకొనుచుందురు. మనవలె కర్మచే ఏర్పడని రూపము లేదు. కానీ తనకే అసాధారణముకు ఒక రూపము ఉన్నది. ఆ రూపము అందరుకు గోచరము కాదు. ఆయన అనుగ్రహముచే దర్శింపచేసిన నాడు బ్రహ్మాదులు కూడా దర్శించగలరు. అతడు కర్మాధీనములగు జన్మము లేనివాడు. దుఃఖముతో కలియని ఆనంద మహోదధి. అణువైన జీవుని కంటే అణువై లోన వ్యాపింపగలవాడు. ఇట్టి వాడని ఇక్కడ ఉండునని ఇప్పుడు ఉండునని ఎవరికినీ తెలుసుకునుటకు
శక్యము కానివాడు. యోగ సాధనముచే దర్శించుటకు మాత్రమే వీలైనవాడు. విశ్వమంతయు తన రూపమైన వాడు. తనతో విడదీయుటకు వీలుకానట్లు కలిసి ఉన్న ప్రకృతిని తన సంకల్పముచే స్థూలముగా చేసి దానిలో జీవునితో పాటు తాను ప్రవేశించి. నామరూపములను కల్పించుచున్నవాడు. అగ్ని నుండి విస్ఫలింగములు బయలువెడినట్లు బ్రహ్మ, రుద్రుడు, దేవతలు, ప్రజాపతులు మొదలగు వారందరూ ఆ విష్ణువు నుండి వెలువడినవారే. ఇట్లు బ్రహ్మ మొదలగు వారు తామెరిగినంతగా భగవత్ స్వరూపమును స్తుతించిరి. అప్పుడు భగవానుడు బ్రహ్మను శంభుని ఉద్దేశించి ఈ విధంగా పలికెను. ఓ దేవతలారా, శ్రద్ధగా వినుడు. మీకు శ్రేయము కలుగును. రాక్షసులతో సంధి చేసుకొనుడు. సాధించవలసిన కార్యమును అనుసరించి ఒకప్పుడు శత్రువులతో కూడా సంధిని చేసుకొనవలెను. ఒక పాము ఎలుక బుట్టలో పడి ఉన్నవి. అప్పుడు తెలివైన పాము తనకు ఆహారము కదా అని ఎలుకను ముందు తినదు. ఆ ఎలుక బుట్టకు కన్నము చేసి వెలుపరకు దారి ఏర్పరచు దాకా నిరీక్షించును. అప్పుడు ఆ ఎలుకను తిని పాము బయటకు పోవును. మీరు కూడా అట్లే సమయమునకు నిరీక్షింపుడు. యుద్ధములో చనిపోకుండా చేసుకొనుటకు అమృతమును సంపాదించవలెను. పాల సముద్రమును మధించి అమృతమును పొందవలెను. మందరము కవ్వముగా వాసుకి త్రాడుగా ఉండవలెను. బలము గల రాక్షసులు మథనమున ఎక్కువ కష్టపడి అమృతం వచ్చునట్లు చేయునప్పుడు ఆ సముద్రము నుండి విషం వచ్చును. విలువైన వస్తువులు వచ్చును. విషమును చూచి భయపడరాదు. విలువైన వస్తువులకు ఆశపడరాదు. రోషం ఎన్నడూను రారాదు. ఇట్లు మీరు ప్రవర్తించిన మీకు శ్రేయము కలుగును. ఇట్లు చెప్పి పురుషోత్తముడు అంతర్ధానమాయెను. ఆ తరువాత మరి వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనము మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Hey Gopalaka, Hey Kripajalanidhe, Hey Sindhu Kanyapate, Hey Kam Shantaka, Hey Gajendra Karunaparina, Hey Madhava, Hey Ramanuja, Hey Jagatraya Guru, Hey Pundarikaksha, Hey Gopi Jananatha, protect me, I know you without a doubt Oh Gopala, Protect us, O compassionate ocean, Lakshmi's husband, Kamsa, Gajendra's protector, Madhava, Ramanuja, Jagannath, Pundarika, and Gopijanavala. I know no one but you. Mukundamala 22 Prayer, devotees of Bhavadbandhus, welcome to the fourth episode of Srimad Bhagavata Tatva Deepika, Ashtama Skandham. So far, we have served the story of Gajendra Mokshanam well. Now we will Let's find out. Durvasa, the sage, offered Indra a garland. Indra, with arrogance, pressed his eyes, and without bowing his head, he threw his vehicle, Airavata, down. He knocked it down with his trunk and trampled it with his feet. This is a sin. The Lord's creation and the Bhagavatas' creation should not be neglected. Because of that Bhagavata's actions, Indra was cursed by Durvasa The target has been hit. Indra and the three worlds were also released by Sridevi. Even after performing yajna and other rituals, wealth did not return. The demons were fighting and killing the gods in the war. Not knowing what to do to become wealthy again and to become radiant, Mahendra, Varuna, and all others went to the assembly of gods and pleaded with Brahma.
Indra and all the other gods were weak and inauspicious. The three worlds are filled with inauspiciousness. Then Brahma thought and said thus. I, Rudra, along with all the gods, are created by the qualities like the power of knowledge of the Lord. That God, to create, sustain, and destroy the world, Himself assumes forms possessing Rajas and Tamas. By those qualities, those actions are being performed. Now he is ready for Jagadrakshana. Therefore, we will not accept the world as a means to protect him. Protecting the one who has taken refuge is his nature. Thus saying, Brahma, along with the gods, reached the abode of the Lord Ajitudu, who was in a state of darkness. Even the gods cannot see the Lord. Because they heard that such a person was not in the Vedas, they believed in those words, strengthened their minds, and praised him accordingly. Hey Deva! You are without distortion, you are the embodiment of truth, you are the best, you are the cause of all the world. You are the one who can see all the souls and the life force at once. Be careful, Swapna, you are in a state of sleep. You are the one who can illuminate the subjects of sound and the organs of hearing. You are a body without a karmic destiny. You are the one who has this pure knowledge without ignorance, which exists for men who have raga and aversion. You are everywhere. You are endowed with six qualities, namely, the powers of knowledge, energy, and so on. We have trusted you with this. The illusion of God is causing the cycle of worldly affairs, which is the root of our mental activity, to move. In this chakra, the sattva, rajas, and tamas qualities are like three nails. This chakra has 10 senses, the five aggregates of clinging, and a total of 15 petals. It is faster than lightning. The main source for this is the Supreme Soul's will.
The five elements, mind, intellect, ego, these eight are like a wheel above, and we have surrendered to the supreme soul, which is the origin of this wheel. The Lord is spiritually primary. Tamas is the one who is on the other side of nature. He is someone who cannot be seen by the family. The one who sees the senses is not the seer. One without bounds. He is as radiant as gold. Those who are like that, the seekers, meditate on the path of yoga. In the world, those who have knowledge that is dispelled by the illusion of God cannot understand the Supreme Being as the ultimate goal. No matter how knowledgeable they are, they cannot overcome that illusion through their efforts. Even though the Brahma and other gods and sages, who have manifested with predominance of the quality of goodness, and who are endowed with knowledge, cannot understand the subtle state of that Lord. The earth and all the worlds, all beings, that Lord's body. As described in the Purusha Sukta, all animate and inanimate beings emanated from him. Mahendra by the strength of that God, the gods by the grace, Rudra by the anger, Brahma by the joy, and the meters by the senses They were born. From his chest, Sri was born. From the breasts, the ancestors obtained righteousness; from the back, unrighteousness; and from the head, the sky. The Brahmanas and other Varna are his limbs. Those that emerged from those organs, in this way, by his illusion, he created all the worlds, all the feelings, and all the literature. He has taken it as his own. Once upon a time, he who had withdrawn all rain and was perfect through the experience of self-bliss. Salutations to that Supreme Being, who is beyond the qualities of goodness, passion, and ignorance. Lord, make it visible to our eyes, so that we may see your divine auspicious idol, which has the qualities mentioned above.
Make me look at your face full of sadness. In those times, freely, you assume many forms and are doing for us the things that are possible to achieve. The karmas we perform are causing more suffering and yielding less fruit. They are wastes of space. Your praise, your salutations, even if done once, is a great reward. Whatever business we do in the world, if we dedicate it to you, it will not be in vain. You are the origin of all the worlds. Water to the tree first. Just as the branches and leaves reach that point, similarly, worshiping Vishnu is worshiping all the worlds, and all fruits will be obtained. In this way, the God, who was made by the gods themselves, appeared to them as if a thousand suns had risen at once. The gods could not see the light. Brahma and Rudra saw the divine auspicious idol of that Lord, who was adorned with divine splendor. That form is shining with golden light. Wearing a dhoti. A beautiful face, a crown of jewels, earrings, and ornaments. Necklaces, earrings, rings, Kaustubha gems, Is the form shining with divine ornaments like a garland? Vanamala, Lakshmi, and Kaustubha are shining on the chest. The Chakra and other weapons serve the Lord. Having seen this form, Brahma, along with the gods and Rudra, bowed down to the earth. They are praising him. They think that God does not have an idol. There is no form that is not created by karma, like us. But he has a form of extraordinary. That form is not visible to everyone. When he is blessed, even Brahma and others can see. He is unborn, due to karma. The ocean of joy without any sorrow. He is more pervasive than an atom, more diffuse than a molecule. I don't know if anyone knows that he is here or not
One who cannot. He is the only one who can be seen by the practice of yoga. He is the one who is the form of the universe. He entered into it, making the nature that was together, as if it could not be separated from him, gross by his will, and with the living being in it. The one who creates the names and forms. Brahma, Rudra, the gods, the Prajapatis, and all others who emerged from the fire, all emerged from that Vishnu. Thus, Brahma and others, as much as they could, praised the divine form. Then the Lord addressed Brahma and Shambhu in this way. Oh Gods, listen with your ears of trumpets. You will be blessed. One who makes treaties with monsters. Following the task that needs to be accomplished, sometimes even with enemies, a treaty should be made. A snake had fallen into a mouse hole. Then the clever snake does not eat the mouse first, thinking that it is its food. That mouse waits until it makes a hole in the basket and makes a path to the outside. Then the snake will eat the mouse and come out. You should also wait for the time. In the war One must acquire nectar to avoid death. One must churn the ocean of milk to obtain nectar. The Mandara should be like a churning rod, and Vasuki should be the rope. When strong demons work hard in the churning to bring nectar, poison comes from that ocean. Valuable items are included. Fear not the poison of the snake. Valuable items are not worth seeking. Passion never ceases. Thus, may you behave, may you be blessed. Thus saying, Purushottama disappeared. After that, let's find out in another podcast what they did. Jai Srimannarayana, salutations to the Gurus