బలి చక్రవర్తి విముక్తి మరియు వామనావతార రహస్యం

Bali Chakravarti's Liberation and the Secret of Vamana's Three Steps

bhagavatam

త్రివిక్రముడు రెండు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించగా, బలి చక్రవర్తి మూడవ పాదమునకు తన శిరస్సు అర్పించి, అపకీర్తి కంటే నరకమే మేలని ధైర్యంగా పలికాడు. ప్రహ్లాదుడు మరియు వింధ్యావళి భగవంతుని మహిమను కీర్తించి, సర్వమూ ఈశ్వరుని సొత్తేనని నొక్కి చెప్పారు. భగవానుడు అనుగ్రహించదలచిన వారి ధనమును హరించి అహంకారమును తొలగిస్తాడని వివరించాడు. బలికి సుతలాధిపత్యం ప్రసాదించి, తానే ద్వారపాలకుడిగా నిలిచెదనని వాగ్దానం చేశాడు. వామనావతారంలో మూడు పాదాల రహస్యం—ఐహిక మమకారం, ఆముష్మిక మమకారం, అహంకారం తొలగించుటయే—అని ఈ పాడ్కాస్ట్ లో వివరించబడింది.

After Trivikrama covers all three worlds with two steps, Bali humbly offers his head for the third step, declaring he fears disgrace more than hell or bondage. Prahlada and Vindhyavali praise the Lord's grace, recognizing that all possessions and even the body belong to God alone. The Lord explains that He removes wealth from those He wishes to bless, as prosperity breeds ego and delusion. Bali is rewarded with rulership of Sutala, with the Lord Himself standing as his doorkeeper. The deeper teaching is that Vamana's three steps symbolize removing attachment to worldly things, heavenly things, and bodily ego—mirroring the Gita's call to offer all actions to God.

← Prev Next →
Bali Chakravarti's Liberation and the Secret of Vamana's Three Steps bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః మదన పరిహర స్థితిం మదీయే మనసి ముకుంద పదారవింద ధామ్ని హర నయన కృషానునా కృషోసి స్మరసిన చక్ర పరాక్రమం మురారీహి ఓ మదనా నా మనసులో ముకుంద చరణారవిందములు పాదుకొని ఉన్నవి నీవచరకు చేరుకొన ప్రయత్నింపకుము పరమశివుని నేత్రాగ్నిచే కృషించిన వాడవైతివి. ఇంక మురారి చక్ర పరాక్రమము గూర్చి ఎరింగి మసలుకొనుము. ముకుందమాల 30th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. అష్టమ స్కంధములో 11వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు గజేంద్ర మోక్షణం, క్షీరసాగర మథనం పూర్తి చేసుకుని. వామన వృత్తాంతములో బలి చక్రవర్తి వద్ద వామనుడు మూడడుగులు అడగటం తర్వాత రెండు పాదాలతో త్రివిక్రమావతారముగా మారి పూర్తిగా ఆక్రమించటం తర్వాత అసురులు యుద్ధానికి బయలుదేరితే బలిద్వాన్ని వారిస్తాడు. వారించిన తర్వాత దైచులంతా రసాతులకు వెళ్లారు. ఆ తర్వాత భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్పుడు గరుడుడు శ్రీ మహావిష్ణుడి యొక్క అభిప్రాయమును ఎరింగి వారుణ పాశములతో బలిని బంధించెను. బలిని బంధించుట చూచి భూమి ఆకాశములలో సర్వ దిక్కుల యందు హాహాకారములు బయలు వెడలెను. వారుణ పాశములచే బంధింపబడిన బలితో శ్రీ మహావిష్ణువు ఇట్లు పలుకుచున్నాడు. ఐశ్వర్యం పోయినది కానీ ప్రజ్ఞా కీర్తి నీకు తగ్గలేదు. నాకు మూడడుగుల నీళ్ళనిచ్చెదనంటివి. ఒక పాదముతో భూమిని నక్షత్ర గ్రహ పంక్తులతో కూడా ఆక్రమించితిని. స్వర్గలోకం మొదలు సత్యలోకం వరకు రెండవ పాదమును వ్యాపించినది. నీవు అనుకొనిన మూడు లోకములు నా రెండు పాదములకే సరిపడలేదు. ఇంకా మూడవ పాదము పాదమునకు నీది ఏదీ మిగలలేదు. ఇచ్చెదనని పలికి ఇయ్యలేని వారికి నరకము తప్పదు. కలవాడనను అహంకారము నిన్ను ఆక్రమించినది. అందుచే నీ వాడిన మాట సత్యమైనది.

నీవు దానిని దాని ఫలమును అనుభవింపు అని శ్రీ మహావిష్ణువు పలుకుచున్నప్పుడు బలి మనసు ఏమియు ఖేదము నొందలేదు మాట తొట్రు పడలేదు బలి ఇట్లు పలుకుచున్నాడు ఏమిటంటే ప్రభు నేను ఆడిన మాట సత్యమాయెను అనుటకు నేను సహింపలేను. నీ మూడవ పాదము నా శిరస్సుపై ఉంచుము. నరకమును నరకమునకు నేను జంకను. పదచ్యుతికి నేను భయపడను. పాశములతో బంధించినను నేను భయపడను. కానీ ఆడిన మాట తప్పితినను అపకీర్తిని మాత్రము భరింపలేను. పరమ పూజ్యుడవైన నీవు నన్ను శాసించుట నా భాగ్యము. మా అసుర జాతికి నీవు పరోక్షముగా హితమును కలిగించువాడవు. నీ కటాక్షము చేతనే కదా అహంకారము తొలగునది. యోగాభ్యాసముచే నీయందు మనసు నిలిపి ధ్యానించెడి భక్తులు పొందెడి ఫలమును మావాడు మావారు నిరూఢముగు వైరముచే పొందజాలిరి కదా మహానుభావుడవగు నీచే వారణ పాశములచే బంధింపబడుట నాకు గౌరవమే. వ్యధా హేతువు కాదు. సాధు సత్తముడగు మా తాత ప్రహ్లాదుడు నీకు ప్రియతముడు. నిన్ను ప్రేమించి నీ శత్రువైన తన తండ్రిచే హింస అనుభవించినాడు. శరీరం ఎన్నటికైనా నశించునది. దానిని కాపాడుకునే ప్రయోజనమేమి? భార్య, బిడ్డలు అను వారు ఆస్తిని పొందుటకై బంధువులను పేరుతో పంచుకున్న దొంగలు. ఈ గృహము సంసారమునకు మూలస్థానమని నిశ్చయించుకొని మహా జ్ఞానియగు మా తాత ప్రహ్లాదుడు ఏ విధముగు భయములకు తావులేని నీ పాదపద్ములనే దృఢముగా నమ్మియున్నాడు. దైవ వశమున నీవే ఐశ్వర్యమును పోగొట్టి నీ పాదముల దగ్గరకు నన్ను చేర్చుకొంటివి. ఇది నా భాగ్యము. ఈ జీవితము సంతతము మృత్యు సమీపముననే సాగుచున్నది. అస్థిరమైనది అని బలి చక్రవర్తి పలుకుచున్న మాటలను శ్రీ మహావిష్ణువు వినుచు ఆనందించుచుండెను. ఇంతలో ప్రహ్లాదుడు అతనికి వచ్చెను. బలి వారున పాశములతో బంధింపబడి యుండెను. పూర్వం వలె అతని ఆరాధనము చేయలేకపోయెను.

కంట నీరు పెట్టుకొని సిగ్గుతో తల వంచుకొని శిరస్సుతో ప్రహ్లాదునకు నమస్కరించెను. ప్రహ్లాదుడు భాష్పముతో గగుర్పాటుతో శ్రీ మహావిష్ణువు పాదములకు నమస్కరించెను. ప్రభు నీవే ఈ బలికి ఇంద్ర పదవిని వసగితివి ఈనాడు మరల నీవే హరించితివి. ఇది మహానుగ్రహము, ఐశ్వర్యము, మోహజనకము. అది ఆత్మ వినాశమును చేయును. విద్వాంసుడు కూడా దానిని మోహము చెందక ఉండలేడు. దానికి మోహము చెందక ఉండలేడు. అఖిలో అఖిలలోక సాక్షివి దిగదీశ్వరుడవు నారాయణ నీకు నమస్కారము. ఇట్లు పలికి నమస్కరించుచు ప్రహ్లాదుడు నిలిచి ఉండెను. బలిచక్రవర్తి భార్య బంధింపబడిన భర్తను చూచి భయపడుచు ఉపేంద్రుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి ఇట్లు పలికెను. స్వామి ఈ మూడు లోకములు నీ లీలకై నీవు కల్పించుకున్నవే. తెలివిలేని తనముచే కొందరు ఈ లోకములను తమ సొత్తుగా భావింతురు. నేను చేయువాడను, నేను స్వతంత్రుడను, నేను పాలకుడను అనుట సిగ్గులేనితనము. కర్తవు నీవు, పాలకుడవు నీవు. నీది కానిది ఏమి ఉన్నదని తెలివిగలవారు నీకు అర్పించగలరు. మూడవ పాదమును మోపుటకు నా శరీరమును వసంగిదనన్న ఇతని మాటకు అర్థం ఉన్నదా? అది నీదే కదా ఇట్లు వింధ్యావళి ప్రహ్లాదుడు కూడా భగవానునకు తనది అను అహంకారముతో బలి చక్రవర్తి దానము చేయుట లేని దోషమును వ్యక్తమునచ్చి క్షమాపణను కోరిది. ఈ బలి చక్రవర్తి చరిత్రమును మాయా మోహితముకు సర్వప్రాణి జాతము జాత సర్వప్రాణి జాతమునకును నిత్యానుసంధ్యయము. శరీరముతో కర్మవశమున జీవుడు చేరి ఉండును. అజ్ఞానము ఆవరించును. శరీరమే ఆత్మ అనిపించును. తెలివి గలది ఆత్మ. తెలివి లేనిది శరీరము. ఇది శరీరము అని ఎరుంగువాడు జీవుడు. అదే ఆత్మ. ఎరుకలేనిది శరీరము. ఈ రెండింటి భేదము మాయచే అజ్ఞానముచే మనుగున పడును. శరీరమే తాను అనిపించును. శరీరము చెందినవన్నీయు తనవి అనిపించును. శరీరమే తాను అనుకొనుట అహంకారము. శరీరములు చెందనివి చెందినవి తనవి అనుకొనుట మమకారము. వీటిని ఎరుంగినవాడు శరీరంలో నున్నంత కాలము తను నేరుగా ఎరుంగి జీవింపవచ్చును. ఇట్లు జీవించనిచో అవి పోయిననాడు బ్రతకలేమన్నంత దుఃఖము కలుగును.

బలి చక్రవర్తి దానము ధర్మము చేయుచున్నాడు. యజ్ఞమును చేయుచున్నాడు. కానీ ఇచ్చునవి అన్నియు తనవి అనియు ఇచ్చువాడు తాను అనియు చేయువాడు తాను అనియు భావించుచున్నాడు. ఇదే అవివేకం. అవివేకముతోనైనను దేవతా ప్రీతికరములగు యజ్ఞయాగాదులను దానమును చేయుచు సత్యమునే పాటించిననాడు సత్యమునే పాటించినాడు కావున భగవానుడు యాచక రూపమున అతని వద్దకు వచ్చినాడు. మూడు పాదములు ఇమ్మని అడిగినాడు. మనము ఈ లోకములో ఎన్నిటినో నావి అనుకొంచుందము. బలి భూలోకమును నాది అనుకొయెను. స్వర్గమును కూడా నాది అనుకొనినాడు. ఈ రెండింటికీ శ్రీ మహావిష్ణువు తన పాదములతో ఆక్రమించి తనవిగా చేసుకునినాడు. ఇంకా మూడవ పాదమునకు మిగిలినది నేను అనుకొనిడి శరీరము. రెండు పాదములతో బలి మమకారమును హరించినాడు. మూడవ పాదముతో బలి నేను అనుకున్న శరీరమునకు కలిగిన అహంకారమును హరించినాడు. ఐహికమగు వస్తువులపై ఆముష్మికమగు వస్తువులపై మమకారం వదలి అంతయు ఈశ్వరుని అనుబుద్ధితో జీవించవలెను. ఈ శరీరము నేను అనుకొనక ఇది కూడా వానికి చెందినదే అనుజ్ఞానముతో ఉండవలెను. ఇది మనకు నేర్వలసిన పాఠము. దీన్ని నేర్పుటకై స్వామి వామన అవతారమున మూడు పాదములతో ఐహికమైన మమకారమును, ఆముష్మికమైన మమకారమును, అహంకారమును తొలగించినాడు. యత్ కరోషి, యదశ్నాసి, యజ్జుహోషి, దదాసియత్, యత్ తపస్యసి కౌంతేయ, తత్ కురుష్వ మదర్పణం అని భగవద్గీతలో ఒక శ్లోకములో భగవానుడు ఈ మూడు పాదముల రహస్యమును వివరించినాడు. నేను చేయుచున్నాను, నేను అనుభవించుచున్నాను ఇది మొదటి పాదము. నేను హోమము చేయుచున్నాను, నేను దానము చేయుచున్నాను అను భావము తొలగవలెను ఇది రెండవ పాదము. నేను బ్రహ్మ విచారము చేయుచున్నాను అను భావము పోవలెను. అది మూడవ పాదం. మానవుడు అన్నియు చేయవలెను, అనుభవించవలెను, అన్నిటిని ఆర్జింపవలెను.

ఆత్మ స్వరూపును ఎరంగవలెను కానీ వాని యందు తాను చేయుచున్నాను అను భావమును ఇది తనది అను భావమును వదిలి ఉండవలెను. దీనిని వదిలించుటయే వామనావతార రహస్యము. అందుచే నిత్యము నిద్ర లేవగానే వామను స్తుతించుచు లేవవలెనని పూర్వులు చెప్పుచుండిరి. నాది నేను అనే భావములు తగ్గి ఈశ్వర భావనతో సకల కర్మలు చేయుట అనుభవించుట మానవ జీవితమున బంధ విముక్తికి సాధనము. దీన్ని ఎరుంగించుటయే వామనావతార కథాసారము. అప్పుడు బ్రహ్మ త్రివిక్రముని ఇట్లు ప్రార్థించెను. దేవదేవా జగన్మయా సకల లోక స్వామి, ఈ బలి సర్వస్వమును స్వీకరించితివి. ఇతన్ని శిక్షించుట తగదు. ఇతడు తాను సంపాదించిన భూమిని స్వర్గాది లోకమును కూడా చెదరని బుద్ధితో నీదిగా వసంగినాడు. ఈ శరీరమును కూడా నీదిగా అర్పించినాడు. జ్ఞానము కలిగి నీ పాదములపై జలముతో అభిషేకము చేసి దూర్వాంకురములతో పూజ చేసినంత మాత్రమున ఉత్తమ గతిని పొందును కదా. ఈ బలి తన సర్వస్వమును సంకోచము లేని మనసుతో నీకు అర్పించినాడు కదా, ఇతడు క్లేశమును అనుభవించుట తగదు. ఇతనిని బంధము నుండి విడిపింపుము. బ్రహ్మ ప్రార్థన చేసిన తర్వాత మరి భగవంతుడు ఏమన్నాడు ఆ విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః బ్రహ్మ ప్రార్థన విని భగవానుడు ఇట్లు చెబుచున్నాడు. నేను అనుగ్రహింపదలిచిన వాని ధనమును స్వీకరింతును. అర్థము అనగా ధనము. అనర్థము అని లోకము గుర్తించలేదు. ఆ ధనము ఉండగానే మదము కలుగును. దానిచే వివేకము పోవును. వినయము చెడి గర్వము కలుగును. దానిచే లోకమునంతను తిరస్కరించును. లోకమందట వ్యాపించి ఉన్న నన్నే భావింపలేక తానే అంతయు తనదే అంతయును భావించును. దీనిచే అనేక విధములగు కర్మలు చేసి దాని ఫలముగా అనేక విధములగు శరీరమును పొందుదురు.

జన్మ చేత, తాను చేయు కర్మ చేత, వయస్సు చేత, అందము చేత, చదువు చేత, నియమన శక్తి చేత, ధనము చేత. తనంత వాడు లేడను గర్వము కలుగును. వానిచే వాని శ్రేయస్సు అడ్డగింపబడును. నన్ను భావించుచు చేయించు వాడను నేనని చేయునది నా పని అని చేయునది నా ప్రీతి కొరకని భావించు వారులకు. ఐశ్వర్యాదులున్నను అహంకారము గర్వము కలగదు. ఆ స్థితి ఇతనికి లభించినది. ఇతడు దానవులలో శ్రేష్టుడు. జయించుటకు శక్యముగాని మాయను జయించినాడు. ధనము పోయినను, స్థానభ్రంశము కలిగినను, శత్రువులచే బంధింపబడినను, జ్ఞాతులందరూ వదిలి వెళ్ళినను, గురువులచే శపింపబడినను, పాశములచే బంధింపబడినను ఆడిన మాట తిరగలేదు. నేనంత కృత్రిమముగా అతన్ని శ్రమ పెట్టినను ధర్మమును అతడు వదలలేదు. ఈతడు సావరణ మన్వంతరమున దేవతలకు కూడా పొంద శక్యము గాని ఇంద్ర పదవిని అధిరోహించును. అంతవరకు విశ్వకర్మ నిర్మితమైన సుతలమున అధిపతియై విరాజిల్లును. నా కటాక్షముచే ఆధులు, వ్యాధులు, పరాభవము, ఉపద్రవములు అతడ నివసించు వారికి కలగవు. ఇట్లు పలికి బలి చక్రవర్తితో ఇంద్రసేన మహారాజా దేవతలకు కూడా కోరుకొన తగిన సుతలమునకు నీవేగుము. నిన్ను ఎవ్వరును ఎదిరింపలేరు. నా చక్రము నీకు రక్షకమై నిలిచి నీ ఆజ్ఞను ధిక్కరించు వారిని శిక్షించును. నేను సర్వదా సుతలమైన నీ ద్వారమున రక్షకుడిగా నిలిచి యుందును. నన్ను నీవు సదా దర్శనము చేయుచుండుటచే అసుర సహవాసము చేయ కలిగే నీ కలిగెడి అసురత్వము తొలగిపోవును అని భగవానుడు పలికెను. మహానుభావుడగు బలి చక్రవర్తి చేతులు జోడించి నమస్కరించి ఆనంద బాష్పములతో భక్తి మాట తొట్టృ పడుచుండా ఇట్లు పలికెను. ప్రభు. నిన్ను నమస్కరించవలెనని ఉద్యమించిన మాత్రమునని నీ శరణాగుతులకు అభిమతము చెల్లీడేరును. నా భాగ్యం ఎంత గొప్పదో లోకపాలురగు దేవతలకు కూడా లభింపని అనుగ్రహము నాపై చూపితివి.

శ్రీహరి అనుగ్రహముచే బంధములు వీడిన బలి శ్రీహరికి నమస్కరించి బ్రహ్మకు రుద్రునకు కూడా నమస్కరించి అసురులతో కూడా సుతలమునకు ఏగెను. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు అతితి కోరికను తీర్చి ఇంద్రునకు స్వర్గ రాజ్యమును మరల వసంగెను. ప్రహ్లాదుడు మనుమడు భగవదనుగ్రహ పాత్రకుటను చూచి సంతసించి భక్తితో ఇట్లు పలికెను. ప్రభు, ఇట్టి అనుగ్రహమును బ్రహ్మ గాని, లక్ష్మి గాని, పరమ శివుడు గాని పొందలేదు. సకల లోక వందనీయుడగు నీవు అసురులమగు మాకు రాజ్యమున దుర్గపాలుడవై ఉండుట ఏమి ఆశ్చర్యము. బ్రహ్మాదులు నీ పాదపద్మ మకరంద పానముచే తమ తమ పదవులు పొందుచున్నారు. మాకేమియు తెలియదు. మేము పాపాత్ములము. నీ కృప చేత ఇట్టి అనుగ్రహమును పొందగలిగితిమి. నీకు ఒకరి యందు పక్షపాతము లేదు. నీవు సమదర్శనుడవు. ఆ స్థితులను అనుగ్రహించుటకు అనుగ్రహించుటయే నీ స్వభావము. భగవానుడు ప్రహ్లాదుని మాటలు విని సంతోషించి ప్రహ్లాదుని నీవు కూడా నీ మనుమనితో సుతలము కేగుము. అచర గదాపాణియై నేను నీకు దర్శనము వసంగుచుండును. నిత్యము నా దర్శనము చేయుచుండుటచే కర్మ బంధములన్నియు తొలగిపోవును అని ప్రహ్లాదునితో పలికాడు. ఇట్లు భగవానుడు ఆజ్ఞ వసంగగా ప్రహ్లాదుడు బలితో కలిసి స్వామికి ప్రదక్షిణము చేసి నమస్కరించి సుతలమున కేగెను. అప్పుడు శ్రీహరి ఋత్విక్కుల మధ్యలో కూర్చొని ఉన్న శుక్రాచార్యుని చూచి నీ శిష్యుని యజ్ఞములో సంభవించిన విఘ్నములకు ప్రాయశ్చిత్తమును చేయించి యజ్ఞమును పూర్తి చేయించుము. అనేను. సిరిహేరట్టు చెప్పగానే శుక్రుడు ప్రభు యజ్ఞేశ్వరుడవు యజ్ఞ పురుషుడవగు నీవు ఆరాధింపబడితివి. నీ నామ సంకీర్తనము మంత్ర లోపములను దేశ కాల వస్తు వైగుణ్యమును తొలగించును. ఈ యజ్ఞమున నీవే ఆరాధింపబడితివి. ఇంకా యజ్ఞమునకు లోపమేమి? అయినను ఆజ్ఞా పాలనము కర్తవ్యము కనుక అట్లే నిర్వర్తించుదును అని చెప్పి ఋషులతో కలిసి యజ్ఞ విఘ్నము చేయ కలిగిన దోషమును పరిహరింప చేసెను. అందరూ దేవతలు వారి వారి స్థానములకేగిరి. బ్రహ్మాది దేవతలందరూ ఉపేంద్రుని సర్వలోకాధిపతి అని పేర్కొనిరి. సర్వభూతులకు స్వామిగా ఉపేంద్రుని కల్పించిరి.

ఉపేంద్రుడు ఇంద్రునకు స్వర్గమున సమర్పించెను. ఉపేంద్రునితో కలిసి ఇంద్రుడు స్వర్గమునకేగి త్రిభువనములను పాలించుచుండెను. బ్రహ్మాది దేవతలు విష్ణువు యొక్క త్రివిక్రమ చరిత్రను త్రివిక్రముని యొక్క లీలను గానము చేయుచు వారి వారి స్థానములకేగిరి. త్రివిక్రముని దివ్య లీలను ఎవ్వరునూ కీర్తింపలేరు. ఈ భూమియందు పరాగరేణువులను ఎట్లు లెక్కించుటకు శక్యము కాదో అట్లే త్రివిక్రముని గుణములు కూడా కీర్తించుటకు శక్యము కావు. అని వేదము పేర్కొనినది. దేవదేవుడగు శ్రీహరి త్రివిక్రమ అవతార చరిత్రమును వినిన వారు పరగతిని పొందుదురు. దేవతారాధనె యందు గాని పితృ కార్యములందు గాని. మానుష్య కార్యమునందు గాని ఈ త్రివిక్రమ చరిత్రను కీర్తినిచ్చునచు ఆ కర్మ సంపూర్ణమగును. ఇంతటితో వామన వృత్తాంతం పూర్తయింది. తర్వాత మనం మరొక అవతార కథ మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. I am in a state to remove the intoxication of Madana, my mind is on the lotus feet of Mukunda, I am in a state of fatigue, remembering the mighty prowess of the Chakra. Oh Mudana, in my mind, the lotus feet of Mukunda are adorned by you, the charanalotus of the Vedas Do not try to reach. You have been weakened by the fire of Parameshwara's eyes. Now, let's discuss the valor of the Murari Chakra. Mukundamala 30th prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the 11th podcast in the Ashtama Skandam. Having completed the Gajendra Moksham, the churning of the ocean of milk. In the Vamana story, Vamana asks Bali Chakravarti for three steps, then transforms into Trivikrama with two feet and completely occupies him. Then, when the Asuras set out for war, Bali Deva saves them. After the battle, all the Daichula went to Rasatul. We will proceed with the rest of the process. Then Garuda, with the opinion of Sri Maha Vishnu, tied Bali with the Yerungi Varna noose. Seeing the sacrifice being bound, the earth and the sky, all Hell was made in the valleys. Sri Maha Vishnu, bound by the noose of Varuna, speaks thus to the sacrificial victim. Wealth is gone, but your wisdom and fame have not diminished. You told me you'd give me three measures of water. I have occupied the earth with one foot along with the star and planetary lines. It pervades the second stage, from the heavens to the earth. The three worlds that you thought were not enough for my two feet. And the third verse, nothing is left for the foot to hold onto. Those who promise and fail to deliver will face hell. The pride of Kalavada has taken over you. Therefore, the word you used is true.

When Sri Maha Vishnu says that you experience its fruit, Bali's mind was not saddened by anything, he did not falter, Bali is saying this, that Lord, I cannot bear to say that the word I spoke was true. Place your third foot upon my head. I will not sin with hell. I'm not afraid of failure. I will not be chained by my shackles. But I cannot bear the shame of breaking my word. Oh! You, the most revered one, it is my fortune to govern me. You are the one who indirectly brings goodness to our demonic race. It is only by your grace that ego is removed. Those who practice yoga, keeping their minds focused on you, the fruits they attain, we are determined to attain through enmity, aren't we? It is my honor that I am bound by the noose of Varana, being a great person, by you. Suffering is not the cause. Our beloved grandfather Prahlada, who was a saint, is dear to you. He loved you and suffered torture by his father, your enemy. The body is mortal. What is the purpose of protecting it? Wife, Children are thieves who share their property in the name of relatives to gain it. Having determined that this home is the root of family life, the great sage, our grandfather Prahlada, firmly believed in your lotus feet, which have no place for any kind of fear. By the grace of God, you have lost your wealth and brought me to your feet. It's my luck. This life is constantly approaching death. Sri Maha Vishnu was listening to the words of Bali Chakravarthi, who was saying that it was unstable, and was rejoicing. In the meantime, Prahlada came to him. The sacrificer was bound with ropes. He was unable to perform his worship as before.

Having kept the water, with shyness, bowing his head, he bowed to Prahlada with his head. Prahlada, with tears and with awe, bowed to the feet of Sri Maha Vishnu. Oh Lord, you are the one who bestows the Indra position for this sacrifice, and today you have again taken it away. This is the grace of the great, the wealth, the allure. It leads to the self-destruction of the soul. Even a scholar cannot be indifferent to it. He couldn't help getting attracted to her. Oh Lord, the witness of all the worlds, the Lord of the earth, Narayana, I salute you. Thus saying, Prahlada stood there. Seeing his wife, the imprisoned husband, and being frightened, Upendra, the great Vishnu, saluted and spoke thus. Swami, these three worlds are created by you for your play. Some people, due to their lack of intelligence, consider these worlds as their own. To say that I am a doer, I am independent, I am a ruler is shamelessness. You are the doer, You are the ruler. The wise can offer you what you do not have. To bear the burden of the third part, to restrain my body, to him who said this Do you understand? That is yours, isn't it? Thus, Vindhyavali Prahlad also, with the arrogance that it belongs to the Lord, Bali Chakravarti, having realized the fault of not donating, sought forgiveness. This Bali Chakra's history is an eternal ritual for all beings, for all beings born of birth, and for all beings. The soul is united with the body by the power of karma. Ignorance is a curse. The body seems to be the soul. The spirit of the wise man. The body is in an immature state. It is the body, and the one who knows it is the living being. It's the same spirit. The body is ignorant. The difference between these two is that it is caused by illusion and ignorance. The body seems to be the only thing that matters. All things that belong to the body belong to him. The body is the ego. Considering that the bodies are not ones, belonging to oneself is attachment. The one who knows these things can live directly as long as he is in the body. If we don't live like this, we will feel so much sorrow that we won't be able to live even if they are gone.

King Bali is doing charity and righteousness. He is performing a yajna. But he thinks that all that is given is his, and the giver is himself, and the doer is himself. That's the rut. Even with ignorance, while performing sacrifices and charities that are pleasing to the gods, and while following the truth, he followed the truth. Therefore, the Lord came to him in the form of a beggar. He asked for three feet. We think that in this world, we are many. Bali thought that the earth belonged to him. He even thought he had heaven. For these two, Sri Maha Vishnu, with his feet, occupied and made them his own. And what remains in the third stage, I thought, is the body. He who has conquered attachment by two feet. With the third step, Bali, the ego that I thought was in the body, was destroyed. One should abandon attachment to worldly objects and other worldly objects, and live with the understanding that everything belongs to God. This body, I thought, this also belongs to him, with the understanding that it should be. This is a lesson for us. This For the sake of learning, Swami Vamana incarnated with three steps and removed worldly attachment, otherworldly attachment, and ego. Yat karoshi, yadashnasi, yajnahoshishi, dadasiyat, yat tapasyasi kaunteya, tat kurushva madarpanam, in a verse in the Bhagavad Gita, the Lord has explained the secret of these three steps. I am doing, I am experiencing, this is the first step. I am doing homam, I am doing charity, this feeling should go away, this is the second verse. The feeling that I am contemplating Brahma should go away. That is the third part. Man must do everything, experience everything, acquire everything.

The form of the soul is like a mirror, but one should abandon the feeling of doing it in oneself, and the feeling that it is one's own. The secret of the Vamana avatar is to get rid of this. Therefore, the elders used to say that one should wake up praising Vamana as soon as one wakes up every day. Reducing the sense of 'I' and experiencing all actions with the feeling of 'God' is the means to liberation from bondage in human life. The essence of the Vamana avatar is to be understood. Then Brahma prayed to Trivikrama. Oh God, Lord of all, Lord of the Universe, you accepted this offering as your own. It is not appropriate to punish him. He settled the land he had earned with the wisdom that he would not leave even the heavens and the worlds. He also offered this body as His own. Having knowledge, if you anoint your feet with water and worship with turmeric, you will attain the best state, right? This sacrifice has offered his everything to you with a mind without hesitation, right? It is not appropriate for him to suffer hardship. Free him, and let him out of prison. After the prayer to Brahma And what did God say? Let's find out about that in another podcast. Jai Srimannarayana, salutations to the Gurus. Having heard the prayer of Brahma, the Lord says thus. I will accept the wealth of the one I choose to bless. Artham means money. The world did not recognize the disaster. MAD, BRAINS, MAD, MAD, MAD. Wisdom is lost in it. Pride complicates humility. And through it, he rejected the whole world. He who cannot understand me, who is spread throughout the world, considers himself everything, and considers everything as his own. By this, they perform various kinds of actions and as a result, they obtain various kinds of bodies.

By birth, by the karma one does, by age, by beauty, by education, by the power of regulation, by wealth. He will be proud that he was not alone. His own welfare is hindered by him. Those who think that I am the one who makes me do things, that my work is what I do, that my love is what I do. Even with wealth and possessions, there is no ego or pride. That's the situation he found himself in. He is the best among the Danavas. He conquered the illusion that was impossible to conquer. Even if wealth is lost, even if there is displacement, even if imprisoned by enemies, even if all the acquaintances leave, even if cursed by teachers, even if bound by bonds, the word spoken does not return. Even though I have made him suffer artificially, he has not abandoned his dharma. This one, in the Vasava Manvantara, will ascend the position of Indra, which is not even attainable for the gods. Until then, he shone as the lord of the Sutalam created by Vishwakarma. By my grace, he will not suffer from poverty, diseases, calamities, or disasters. Thus speaking, Indrasena Maharaja, along with Bali Chakravarti, also desires the gods Go to the Sutlej. No one can match you. My circle will stand as your protector and punish those who disobey your command. I will always stand as a protector at your door, which is always filled with gold. Because you always keep visiting me, the demonic association that occurs will be removed, said the Lord. The great Bali Chakravarti, joining his hands, bowed and with tears of joy, he spoke thus. Lord. I have strived to salute you, but I have not yet expressed my desire to your refuge. How great is my fortune! You have shown me such grace that even the gods, who are the protectors of the world, cannot obtain.

Srihari, by his grace, having broken the bonds, Bali, after saluting Srihari, after saluting Brahma and Rudra as well, ascended to Sutalam with the demons. In this way, Sri Maha Vishnu fulfilled the guest's wish and again gave Indra the kingdom of heaven. Prahlada, seeing the blessed vessel of the grandson, was pleased and spoke thus with devotion. Oh Lord, Brahma, Lakshmi, and the Supreme Shiva have not received such grace. Oh, you who are praised by all the worlds, what is surprising that you, being the king of demons, are the fortress in our kingdom? Brahma and others are attaining their respective positions by drinking the nectar of your lotus feet. We have no idea. We are sinners. By your grace, we have been able to receive such a blessing. You have no partiality. You are a true visionary. Your nature is to bestow and bestow those conditions. The Lord, hearing Prahlada's words, was pleased and said, Prahlada, you too, with your son, go to the gold mine. Oh, mighty-handed one, I will grant you my darshan (vision). By constantly seeing me, all bondages of karma will be removed He said to Prahlada. Thus, as per the order of the Lord, Prahlada, along with Bali, circumambulated the Lord, offered salutations, and went to the golden palace. Then Srihari, seeing Shukracharya sitting among the priests, said, "Please remedy the obstacles that occurred in your disciple's Yagnya (sacrificial ritual) and complete the Yagnya." As soon as Siri Herrattu is mentioned, Shukra, the lord, Yajneshwara, you who are the Yajna Purusha, are worshipped. Your name's praise, mantra's flaws, country, time, object, and adornment will be removed. You were worshipped in this Yagna. What is the deficiency in the Yagna? However, since obedience and governance are duties, I will perform them accordingly, and by saying this, along with the sages, he removed the sin of causing obstacles to the Yagnya. All the gods went to their respective places. All the gods, including Brahma, called Upendra the lord of all the worlds. Upendra was created as the lord of all beings.

Upendra offered Indra's heaven. Indra, along with Upendra, went to heaven and ruled the three worlds. The Brahma and other gods, singing the Trivikrama history of Vishnu, the pastimes of Trivikrama, and going to their respective places. No one can praise the divine play of Trivikrama. It is not possible to count the pollen grains on this earth, similarly, it is not possible to praise the virtues of Trivikrama. The Vedas have mentioned it. Those who listen to the story of the incarnation of Srihari, the God of Gods, Trivikrama, will attain salvation. In the worship of gods or in the duties of ancestors. In human actions, or in this Trivikrama's history, that which glorifies, that action will be complete. The story of Vamana is complete. We will learn about another incarnation story in another podcast. Jai Srimannarayana. Salutations to the Guru