నారద మహర్షి ముక్తి సిద్ధి - వ్యాసదేవునికి దివ్యోపదేశము
Narada's Ultimate Liberation & Core Guidelines to Vyasa
ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, నారద మహర్షి తన పూర్వ జన్మలో అచంచలమైన భక్తి మరియు భగవంతుని కృపతో మోక్షమును పొందిన గొప్ప వృత్తాంతమును తెలుసుకుంటాము. అనంతరము ఆయన నారదుడిగా దివ్యంగా పునర్జన్మించి, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నుండి భక్తి మార్గమునకు సంబంధించిన ఉపదేశములను పొందిన విధానమును వివరిస్తాము. చివరగా, నారద మహర్షి వ్యాసదేవునికి కీలకమైన మార్గదర్శనమొసగి, తన సాహిత్య ప్రతిభను పూర్తిగా భగవత్ మహిమను కీర్తించుటకు అర్పించమని హృదయపూర్వకంగా ఉపదేశించిన సన్నివేశమును శ్రద్ధగా వినండి.
In this sacred episode, we explore the culmination of Narada Muni's spiritual journey — how, through unwavering devotion and the grace of the Supreme Lord, he attained ultimate liberation at the end of his life. We then witness his divine rebirth as Narada and the profound instructions he received directly from Lord Vishnu, shaping him into the eternal messenger of bhakti. Finally, Sri Narada imparts core guidelines to Vyasadeva, urging him to dedicate his literary genius entirely to glorifying the Supreme Personality of Godhead for the liberation of all souls.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః తద్విశ్వనాభిన్త్వతివర్త్య విష్ణోహో అణీయసా విరజేనాత్మనైకః నమస్కృతం బ్రహ్మ విదాముపయితి కల్పాయుషో యద్విభుధారమంతే సెకండ్ క్యాంటో సెకండ్ చాప్టర్ 25త్ ప్రేయర్ శ్రీహరికి సంబంధించిన ఆ శిశుమార చక్రము విరాట్ పురుషుని నాభి వంటిది. దోషములు లేని మిక్కిలి సూక్ష్మము దేహముతో కూడియున్న ఆ యోగి ఒక్కడే దానిని అతిక్రమించి సర్వులచే నమస్కరించబడే మహర్లోకమును పొందును. అది. సగుణ బ్రహ్మోపాసకులు పొందే లోకం అచట ప్రళయం వరకు ఆయుర్దాయం గల దేవతలు రమించుచుందురు. భగవత్ బంధువులారా. శ్రీమద్భాగవతం తత్వదీపిక ప్రథమ స్కంధం తొమ్మిదవ పాడ్కాస్ట్ లో సుస్వాగతం. మనం ఇంతకుముందు 22 అవతారాల యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. ముందు భాగం. ఈ అవతారములు ప్రతియుగమున అసురులచే కలత చెందిన లోకమును సుఖింప చేయునవై ఉండును. భగవాను యొక్క ఈ అవతార రహస్యమును ప్రాతఃకాలమున సాయంకాలమున ప్రసన్నమైన మనసుతో కీర్తించువారు సంసారము నుండి విముక్తులగుదురు. అవతారములు కర్మకృతములు కావు. లోకానుగ్రహముచే భగవానుడు తానే సంకల్పించి స్వీకరించినవి. అందుచే దీనిని ఎరుంగట భగవత్ తత్వమును ఎరుంగుట అగును. ఈ కనపడుచున్న జగత్తు అంతయు భగవానుని యొక్క రూపమే. ఈ జగత్తులోనున్న దేవ మనుష్యాది శరీరములన్నియు భగవంతుని రూపములే ఒకటచే జీవులు నేను దేవుడను నేను మనుష్యుడను అని అనుకొనుట భ్రమయే. ఆకాశ యధార్త స్వరూపమును ఎరుగని వారు మేఘములు ఆకాశమునందు ఉన్నవని అనుకొంచుందురు. అట్లే భూమి నుండి ఎగసిన భూవికారమైన ధూళి గాలికి చెందినది అనుకొందురు. అట్లే
ఆత్మ స్వరూప యధార్థ జ్ఞానము లేని వారు జ్ఞానము గల జీవుని యందు జ్ఞానము లేని జీవునిచే ఎరుగబడిన శరీరమును ఆత్మ అనుకొని నేను నాది అని కలిపించుకొని భావించుందురు. జీవుడు శరీరమును తాను అనియు శరీరమునకు చెందినవి తనవి అనియు కల్పించుకొని భావించుచుండును. జీవుడు శరీరములో ఉండి శరీరమును ధరించుచుండును. కానీ శరీరంలో ఉన్న జీవునిలో పరమాత్మ వ్యాపించి ఉండి శరీరముతో కూడిన జీవుని ధరించుచుండును. అందుచేత ముఖ్యముగా ధరించువాడు పరమాత్మయే కనుక శరీరము శరీరంలోనున్న జీవుడు కూడా పరమాత్మ యొక్క రూపమే కానీ వానితో సంబంధం లేనిది కాదు. అట్లు బ్రహ్మము ఆత్మగా శరీరములో జీవుడు ఉండునని ఎరుంగనివాడు ఈ దేహమునే ఆత్మని భావించును. ఆత్మకు లోపల పరమాత్మ ఉండునని ఎరుంగనివాడు తాను తనంత తాను ఉండగల స్వతంత్రుడను అనుకొనును. కానీ ఇవి రెండును భ్రాంతిచే కల్పితములే. ఈ జ్ఞానరహితమగు కనబడు ప్రపంచము కంటే ప్రత్యేకమైన తత్వము జీవతత్వము. అది బాహ్యమైన ఇంద్రియములేచే గ్రహించుటకు వీలువైనది కాదు. అది కంటితో చూచుటకు కానీ చెవితో వినుటకు కానీ శక్యము కానిది. అనేక రకములుగా విభజింపబడిన సత్వ రజస్తమో గుణములు కల ప్రకృతి పదార్థములచే స్థూలముగా ఉండదు. కనుక ఇంద్రియములకు గోచరము కాదు. అచేతనముగు ప్రకృతి కూడా కారణ దశలో సూక్ష్మమై ఇంద్రియములకు గోచరము కాకుండా ఉండును. కానీ జీవుడు కార్యావస్థలో కూడా సత్వాది గుణములు కల ప్రకృతి వికారములకు శరీరముతో కూడినను స్థూలముగా ఉండడు. అందుచే జీవతత్వము అవ్యక్తము అనగా ఇంద్రియములచే గ్రహింపబడనిది. ఆ జీవుడే ప్రకృతి సంబంధం వలన మరల మరల జన్మ కలవాడగుచున్నాడు. ఈ సూక్ష్మ అవస్థలో ప్రకృతి కారణరూపముగా ఉండును. స్థూలావస్థలో కార్యరూపముగా ఉండును. ఈ రెండు దశలు ఆత్మకు లేవు. కానీ అజ్ఞానముచే శరీరమందు కలగడి ఉత్పత్తి వినాశము అనబడి సత్ అసత్ రూపములు జీవునియందు ఆరోపింపబడి
పుట్టినాడు, చనిపోయినాడు, ఉన్నాడు, లేడు అందుము. జీవుడు పరమాత్మను గూర్చిన జ్ఞానము వాస్తవముగా తెలిసినవాడు, జీవుని స్వరూపమును వాస్తవముగా ఎరింగినవాడు మరలా జన్మలేని వాడగును. శరీరమే తాను అనుకొని. శరీరము చేయుచున్నవన్నీయు తానే చేయుచున్నానని శరీరముకు చెందినవన్నీయు తనకే చెందినవనుకొని శరీరముతో కర్మలు చేసి జీవుడు మరల మరల జన్మించున్నాడు. తన స్వరూపము తనకు తెలిసిన వాడు శరీరముతో తనకు గల భేదమును గుర్తించును. పరమాత్మ తనకు ఆత్మగా ఉన్నాడు కనుక తాను స్వతంత్రుడను కానని ఎరుంగును. అప్పుడు జన్మ లేకుండా పోవును. ఈ విధంగా తన స్వరూపమును తాను ఎరింగి శరీరము గల ఉత్పత్తి వినాశములు తనకు లేవనియు తాను అనుస్వరూపుడనియు పరమాత్మకు పరతంతుడనియు ఎరుంగుటయే ముక్తినందుటకు మార్గము. తాను గుణములచే సంకోచము లేక అకుంచితమగు జ్ఞానము గలవాడైనను బ్రహ్మ దర్శనం చేయగలవాడగును. మహత్తు మొదలగు ప్రకృతి వికారములచే విస్తరించి ఉన్న ఈ ప్రకృతి సంబంధముచే కలిగెడి దేహాత్మాభిమానము మొదలగు అజ్ఞానము ఎప్పుడు పోవునో అప్పుడు జీవుడు తాను పరమాత్మకు శరీరముగా పరమాత్మతో ఎల్లప్పుడూ చేరియే ఉండునడెడి జ్ఞాన వికాసం కలవాడగును. ప్రకృతి సంబంధం ఇంతవరకు అతని జ్ఞానమును సంకోచింపచేయును. ఇప్పుడు అతని సహజ గుణములు వికసించును. ఏ విధమముగు దోషములు అంటనివాడై శరీరమునకు కలిగెడి ముసలితనము, చావు, శోకము, దప్పిక, ఆకలి లేనివాడై. తాను అనుకున్నవన్నియు నెరవేరగల సత్య సంకల్పుడును కోరబడునవన్నియు సిద్ధముగా ఉండు సత్యకాముడును అగును. అపహతపాప్మా విజరః విమృత్యుః విశోకః విజిఘత్సః అపిపాసః సత్యకామః సత్య సంకల్పః అని ఉపనిషత్తు చెప్పిన ఎనిమిది గుణములు ఆవిర్భవించిన వాడగును. ఈ విధంగా తన మహిమను తాను పొంది పరమ పదమున అందు ఉండు వారిచే ఆరాధింపబడు వాడై పరబ్రహ్మమును అనుభవించుచుండును.
భగవానుడు జీవుని వలె కర్మాధీనమగు జన్మలు లేనివాడు. జీవుని శరీరమందు హృదయ కమల మధ్య భాగమందు వసించి యుండి సర్వ శరీరధారులను నియమించుండును. అట్లు సర్వాంతరాత్మయగు భగవాను యొక్క జన్మములు కర్మలు జ్ఞానాదికులు వేద రహస్యములుగా వర్ణించుందురు. వీనిని మహా జ్ఞానులే ఎరుంగ జాలుదురు కానీ ఇతరులు ఎరుంగ లేరు. శృతులు భగవానుడు జన్మించుననియు జన్మములు లేనివాడనియు గుణములు కలవాడనియు, లేనివాడనియు, కర్మలు చేయువాడనియు, చేయనివాడనియు, జీవుడు బ్రహ్మ వేరనియు, ఒకడనియు భిన్న భిన్నములుగా చెప్పుచున్నవి. వేద రహస్యమును ఎరింగిన వారు మాత్రమే దాని యదార్థమైన తాత్పర్యమును వివరించి చెప్పగలరు. భగవానుడు యదార్థమగు లీలలు కలవాడు. ఈ కనపడుచున్న చేతనాత్మకమగు జగత్తును బ్రహ్మమే సృజించియున్నాడు, సంహరించుచున్నాడు. ఈ జగత్తునందు సంఘము లేనివాడై యుండును. ఈ వ్యాపారములన్నియు భగవానునకు లీలగా సాగుచుండును. ఒక ఫలమును పొందుటకు గానీ, ఒక కర్మను అనుభవించుటకు గానీ, ఒకని చే నియమింపబడి గానీ చేయబడినవి కావు. తనంత తాను తన ఇచ్చ వచ్చినట్టు హేలగా చేయును. అతడు చేయు వ్యాపారమును ఎవ్వరును అడ్డగింప చాలరు. ఈ శరీరముతో కూడిన జీవులందరి యందును అతడు అంతరాత్మగా ఉన్నప్పటికిని వారిచే ఎరుంగబడడు. తర్వాత ఇంకా భగవత్ అవతార రహస్యాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ విషయం కొంచెం కఠినమైనది. రెండు సార్లు. మీరు విని అర్థం చేసుకుంటారని భావిస్తూ జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. That Vishnu, who is beyond the universe, who is beyond the separation of the self, is worshiped by many. He is described as Brahma, and he is approached through the Kalpa Yuga. The second canto, the second chapter, 25th prayer to Sri Hari The child-like chakra is like the navel of the cosmic being. That yogi, who is without faults, very subtle, and united with the body, alone will transgress it and attain the great world, which is praised by all. That is it. The world attained by those who worship the virtuous Brahman, there, gods with lifespan up to the time of the apocalypse, enjoy. Beloved brothers. Welcome to the ninth podcast of the first book of Srimad Bhagavatam Tattvadipika. We have previously learned about the glory of the 22 avatars. Front. These incarnations will be pleasing to the world, disturbed by demons in every age. Those who praise the secret of this incarnation of God in the morning and evening with a pleasant mind will be liberated from worldly life. The incarnations are not karmic. By the grace of the world, the Lord himself made the resolution These are accepted. Therefore, it is to understand the essence of God. This visible world is all a form of the Divine. All the bodies of gods, humans, etc., in this world are forms of God. Thinking that I am God and I am a human is an illusion. Those who do not know the true form of the sky assume that clouds are in the sky. Similarly, they assume that the dust that rises from the earth belongs to the wind. Like that
Those who do not have true knowledge of the self, consider the body known by the ignorant being in the being with knowledge, as the self, and think that I am mine. The living being considers the body as itself and the things belonging to the body as his own. The living being is in the body and assumes the body. But the Supreme Being pervades the being in the body, and assumes the being associated with the body. Therefore, since the one who wears it is the Supreme Soul, the body, and the living being in the body, is also the form of the Supreme Soul, but is not unrelated to it. Thus, one who does not understand that Brahman is the soul and the living being in the body considers this body as the soul. He who does not know that the Supreme Soul resides within the Self considers himself to be independent. But both of these are myths. The unique essence is the life essence, more than this world which appears to be ignorant. It is not worthy of being perceived by the external senses. It is not possible to see with the eyes or hear with the ears. Anekha The nature of matter, which is divided into qualities, is not gross because of the qualities of Sattva, Rajas, and Tamas. Therefore, it is not visible to the senses. Even the unconscious nature is subtle in the causal stage, and remains invisible to the senses. But even in the state of being, the living being, having the qualities of goodness and beauty, though united with the body, is not gross. Therefore, the essence of life is unmanifest, meaning it cannot be perceived by the senses. That being is repeatedly born due to the connection with nature. In this subtle state, nature is causal. It is in a state of being in a state of being in a state of being in a state of being. These two steps are not present in the soul. But ignorance causes the production and destruction of the body. True and false forms are imposed upon the soul
Born, died, is, is not. The one who truly knows the knowledge about the Supreme Soul, the one who truly understands the form of the soul, will be without birth again. The body's own. The body thinks that it is doing everything, and that everything belonging to the body belongs to it, and doing actions with the body, the living being is born again and again. He who knows his own form will recognize the difference between his body and himself. The Supreme Being is in himself, therefore he does not say that he is independent. Then it will be without birth. In this way, knowing that one's own form, one's own body, is not destroyed, and that one is of the same form as the Supreme Being, and that one is the Supreme Soul, is the way to attain liberation. He, though endowed with knowledge, without any hesitation or doubt, and unclouded, is capable of having a vision of Brahman. When the egoistic pride that arises from this nature-related relationship, which is expanded by the greatness and other natural phenomena, will ever disappear, then the soul, as the body of the Supreme Soul, with the Supreme Soul He is always connected, therefore he is a person with knowledge and development. Nature's connection so far has been to his knowledge. Now his natural qualities are revealed. He who does not commit any kind of sins, he who is free from old age, death, sorrow, thirst, and hunger that afflict the body. He is the one who fulfills all that he desires, the one who is truthful, the one who is ready, and the one who is truthful. Apahata papma vijaraha vimrtyu vishokaha vijighatsaha apipaasaha satyakamaaha satya sankalpaha, thus the eight qualities mentioned by the Upanishads have manifested. In this way, having attained his glory, he is worshiped by those who are in the supreme abode, and he experiences the Supreme Brahman.
The Lord is unborn and eternal, just like the individual souls. Residing in the heart-lotus in the middle part of the heart in the body of the living being, it regulates all the embodied beings. Thus, the births, actions, and knowledge of the all-pervading God are described as the secrets of the Vedas. Even the great wise men cannot understand him, but others cannot understand him. The Shrutis say that the Lord is born, has no births, has qualities, has no qualities, performs actions, does not perform actions, the living being is different from Brahma, and is one. Only those who have understood the secret of the Vedas can explain its true meaning. The Lord is the Creator and is very active. Brahma created and destroyed this visible, conscious world. In this world, he will be without a community. All these businesses are going on as a play for God. They are not done to receive a fruit, or to experience a deed, or to be appointed by someone. He does it casually, as if it comes naturally to him. He does No one can stop the business. He is not known by them, even though he is the inner spirit in all the beings with this body. Next, let's learn in detail about the secret of the incarnation of God. This is going to be a tough one. Twice. Hoping that you will listen and understand, Jai Srimannarayana, salutations to the Asmadgurus