వేనరాజు దౌర్జన్యము & పృథు ఆవిర్భావము (Parts 17-24)

King Vena's Tyranny & Advent of Prithu (Parts 17-24)

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, వేనరాజు తన అహంకారంతో యజ్ఞయాగాదులను నిషేధించి, పరమాత్మకు జరగవలసిన పూజలను రద్దు చేసిన దుష్టపాలన గురించి తెలుసుకుంటాము. ధర్మాన్ని నిలబెట్టడానికి మహర్షులు తమ దివ్యశక్తితో వేనుని శపించి అతని అధర్మానికి తెరదించారు. అటుపిమ్మట, వేనుని నిర్జీవ శరీరం నుండి తేజస్వియైన పృథు మహారాజు అద్భుతంగా ఆవిర్భవించి, భూమిపై ధర్మపాలనకు నాంది పలికారు.

In this sacred episode from Canto 4 of the Srimad Bhagavatham, we explore the dark reign of King Vena, whose arrogance and impiety led him to forbid all worship and sacrifice meant for the Supreme Lord. The great sages, unable to tolerate his adharma, ultimately brought about his downfall through the power of their divine curse. From the lifeless body of Vena, the noble and radiant King Prithu is then miraculously manifested, heralding a new era of righteousness and divine order upon the earth.

← Prev Next →
King Vena's Tyranny & Advent of Prithu (Parts 17-24) bhagavatam

జై శ్రీమన్ నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో నమస్తే ఖిల కారణాయ నిష్కారణాయాద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ సర్వమునకు కారణమైన నీకు మరియొక కారణము లేదు సర్వము నీ నుండియే ఉద్భవించినా సర్వము నీయందు వాస్తవముగా లేదు నీవు వాటి ఆశ్చర్యమును గొలిపే జగత్కారణుడవు. నదులు, సముద్రమునందువలె సకలములైన శాస్త్రములు, వేదములు నీయందే పర్యవసానమును చెందుచున్నవి. మోక్ష స్వరూపుడవగు నీవే సాధకులు పొందే సర్వోత్తమమైన గతిని గతివి నీకు అనేక నమస్కారములు. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధములో 17వ పాడ్కాస్ట్ లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దక్షుడు ధ్రువుడు వృత్తాంతం తెలుసుకొని మనం పృథురాజు యొక్క వృత్తాంతంలో అడుగు పెట్టాం. అయితే విదురుడు ప్రశ్నిస్తున్నాడు. పృథ్వు యొక్క ధ్రువు యొక్క ధ్రువుడి యొక్క సంతానం లోపల తరతరాలుగా ముందుకు వెళుతూ వేణుడు అనేటువంటి ఒక పుత్రుడు పుట్టినప్పుడు ఆయన దుష్ట స్వభావంతో ఎందుకు పుట్టాడు దానికి కారణం ఏంటి వెనక ఉన్న విషయాలు అడుగుతున్నాడు దాన్ని మనం తెలుసుకుందాం. మైత్రుడు ఇలా చెబుతున్నాడు అన్నమాట. అంగ మహారాజు ఒకప్పుడు క్రతువులలో ఉత్తమమైన అశ్వమేధం ఆరంభించెను. వేదాధ్యయన సంపన్నుల గురుత్విక్కులు మంత్రములతో ఆహ్వానించినను దేవతలు భాగములను స్వీకరించుటకు రాలేదు. ఈ అంగ మహారాజు యొక్క పుత్రుడే వేణువు. ఆ వేణువు యొక్క విషయాన్ని తెలపటానికి అంగమహారథ వృత్తాంతం మనకు అందిస్తున్నారు. దేవతలు భాగమును స్వీకరించుటకు రాలేదు. అప్పుడు ఋత్విక్కులు ఆశ్చర్యపడి మహారాజుతో యథాశాస్త్రముగా చేయుచున్న యజ్ఞములో స్వల్పముగానైనను దేవతల విషయమున అవమానం జరగలేదు. దేవతలు కర్మలలోని గుణదోషమును చూడగలవారు. మనకు తెలియని అపచారము ఏదో జరిగి ఉండును అని ఋత్విక్కులు చెప్పిరి. వారి మాట విని యజమానియగు అంగరాజు మనసు చెడిన వాడై దీక్షలో మాట్లాడకూడదని నియమమును ఉల్లంఘించి ఓ సదస్సులారా. ఏమి అపచారము చేసితెనో తెలియదు. దేవతలు భాగమును గ్రహించునకు వచ్చుట లేదు. ఏమి తప్పు చేసితెనో మీరు సెలవియ్యవలెను అని కోరెను. అప్పుడు సదస్సులు ఇటు చెప్పిరి. ఓ రాజా, నీవు బ్రహ్మవేత్తవు. ఈ జన్మలో నీవేమియు దోషము చేయలేదు. కానీ పురాతనమైన ఒక పాపము నీకున్నది.

అందుచే గుణవంతుడవైన నీవు సంతాన రహితుడవైతివి. సంతానమునకే యజ్ఞము నీవు ఆచరించవలెను. యజ్ఞ భోక్తయగు భగవానుడు నీవు యాగము చేయుటచే సంతోషించి నీకు సంతానము సంగగలడు. అట్లయినచో నీవు ఇచ్చిన భాగమును గ్రహించగలరు. శ్రీహరి యజ్ఞ పురుషుడు. అతడు దేవతలతో కూడి వచ్చి నీ కోరికను ఈడేర్చును. భగవంతుని ఆరాధించిననే కోరికలు ఈడేరును ఇట్లు చెప్పగా అంగరాజు సంతానము కొరకు విష్ణువునకు పురోడాశమును కల్పించి యజ్ఞము చేయ ఆరంభించెను. అప్పుడు ఆ అగ్నిహోత్రము నుండి బంగారు మాలికను వస్త్రములను దాల్చిన ఒక పురుషుడు బంగారు పాత్రతో పాయసమును పట్టుకొని వెలికి వచ్చెను. ఆ రాజు ఋత్విక్కుల ఆజ్ఞచే ఆ పాయసమును అగ్నిపురుషుని నుండి స్వీకరించి దానిని ఆఘ్రాణించి తన భార్యకు సంగెను. ఆయన భార్య అగు సునీథ గర్భవతి అయి నెల నిండిన తరువాత కుమారుని ప్రసవించెను. ఆ పురుషుడు బాల్యము నుండినే నుండి అధార్మికుడాయెను. సునీత అనునామి మృత్యువు కుమార్తె. అధర్మం యొక్క అంశం వలన ఉద్భవించినది మృత్యువు. ఆ తల్లి తండ్రి పోలిక వచ్చి ఆ కుర్రవాడు అధార్మికుడాయెను. అతడు విల్లు పట్టి అడవికేగి దుష్టబుద్ధియై దీనములైన మృగములను చంపుచుండెను. అతనిని చూచి అందరూ మొరపెట్టుచుండిరి. ఆటలలో ఆడుకొనుచున్న బాలులను క్రూరముగా దయలేని వాడై పశువులను చంపినట్లు చంపుచుండెను. అంగరాజు దురాత్మకుడవు తన కుమారుని బాగు చేయవలెనని అనేక విధములా ప్రయత్నించెను. కానీ అతడు బాగుపడలేదు. తండ్రి చాలా దుఃఖించెను. దుఃఖించి ఇట్లు అనుకొనుచుండెను. భగవంతుని పరిపూర్ణముగా ఆరాధించి భగవననుగ్రహం పొందని గృహస్తులు సంతానము లేని వారైన అగుదురు. లేదా దుష్టముకు సంతానముచే భరింపరాని దుఃఖమునైనను పొందుదురు. చెడ్డ సంతానం వలన అపకీర్తి, అధర్మము కూడా వచ్చును. అందరితో విరోధం వచ్చును. తీవ్రమగు మానసిక వేదన కలుగును. అందుచే పుత్రుడు అను పేరుతో బంధించు బంధమే పుత్ర వ్యామోహము. పండితులు దీనిని ఆదరింపరు. పుత్రులు జన్మించి చెడి మనసుకు బాధ కలిగించుటకు కారణమైన వారు కదా అని వారు సంసారమునే పరిత్యజింతురు.

కానీ నా ఉద్దేశములో యోగ్యముకు సంతానము కంటే దుష్టుడగు పుత్రుడు కలుగుటయే మంచిదనిపించుచున్నది. కుమారుడు మంచివాడైనచో ఇంటియందు గాని సంసారమునందు గాని విరక్తి కలగదు. సంతానము దుష్టమైనచో తల్లిదండ్రులకు విరక్తి కలిగి క్లేశములకు ఆటపట్టు అయిన గృహమును వీడుదురు అని చాలా దిగులు చెంది అర్ధరాత్రి వేళ లేచి సర్వైశ్వర్యములకు నిలయమైన భవనమును వీడి మనుష్యులు కంటపడకుండా నిద్రించుచున్న భార్యను వదిలి వనమునకేగినాడు. ప్రజలు, పురోహితులు, మంత్రులు, మిత్రులు కుమారుని గూర్చిన విచారముతో రాజుల్ని వదిలి అడవికేగినాడని ఎరింగి అతనికై అంతటా వెతికిరి. కానీ అతని జాడ ఎవ్వరికిని తెలియలేదు. ఇంకా లాభము లేదని తిరిగి వచ్చి అచ్చట చెరి ఉన్న ఋషులతో ఏడ్చుచు పూర్వంశము రాజువుగు అంగరాజు కనపడకుండా పోయిన పోయిన విషయమును తెలిపిరి. ప్రజలకు క్షేమమును కాంక్షించు భృగువు మొదలగు మునులు రాజ్యమున పాలకుడు లేనిచో ప్రజలు పశువుల వలె ఒకరినొకరు హింసించుకొనుచు ఆహారము సంతానోత్పత్తియే ప్రధానముగా జీవింతురని సునీతను పిలిచి ఆమె కుమారుడగు వేనుని ప్రజలకు బాధలు కలిగించువాడని ఎరింగియు రాజు ఒకడు ఉండవలెనని వానికి పట్టాభిషేకము చేసిరి. సింహాసనమును దుష్ట స్వభావుడు ఉగ్రశాసనుడును అగు నీచుడు అధిష్టించినాడు. దొంగలు మున్నగు వారు అతడు తమను తీవ్రముగా శిక్షించినను భయముచే ఎముకలు కన్నములోనికి పారిపోయినట్లు కనపడకుండా పోయిరి. వేణుడు అష్టైశ్వర్యములతో సమృద్ధుడై గర్వించి వివేకహీనుడాయెను. తాను గొప్పవాడనియు, మహా బుద్ధిమంతుడనియు, మహా భాగ్యవంతుడనియు భావించుకొని గర్వించుచుండెను. మదించిన ఏనుగు అంకుశమునకు లొంగనట్లు మదాంధుడై ఎవరికిని వశము కానివాడై రథమెక్కి భూమి ఆకాశములను గడగడ వణికించుచు పరిటనము చేయుచుండెను. నాకంటే గొప్పవారులు ఎవ్వరూ లేరు. వేరొకరికి ఎవరికీ మీరు యాగములు చేయనవసరం లేదు. దానములు, హోమములు చేయనవసరం లేదు అని శాసనము చేసి ధర్మమును ఆచరింపకుండా అందరినీ వారించెను. భృగు మొదలగు యాజ్ఞికులు వేణుని చెడు నడవని చూచి ఇట్లు ఈతడు ధర్మమును నివారించుటచే లోకమునకు ఆపద కలుగునని తలంచి ఇట్లు పలికిరి.

ఒక కర్రకు రెండు వైపులా నిప్పు అంటుకొనిన నాడు మధ్యనున్న చీమలు ఏ వైపునకు వెళ్ళలేక బాధపడుచున్నట్లు ప్రజలు రాజు వలన దొంగల వలన కూడా బాధలను అనుభవించుచున్నారు. దొంగలు రాజుని ఆరాధించి దేశమును కొల్లగొట్టుచుండిరి. ధర్మాచరణము మాన్పించి రాజు పరలోక సుఖము కూడా లేకుండా చేసెను. ఇట్లు ప్రజలు ఈ లోకములో సుఖము లేక పై లోకములో సుఖము లేక దుఃఖపడుచుండిరి. అప్పుడు ఆ మునులందరూ మనము చేసిన పొరపాటే ఇటువంటి అనర్థమును తెచ్చునది తెచ్చినది పాముకు పాలు పోసినట్లు దుర్మార్గుడని తెలిసియు సునీత కుమారుడు వదా అని ఇతనిని ప్రజాపాలకుడిగా చేసితిమి. ధర్మం ఎరింగి అతనిని వారింపకున్నచో అతని అధర్మం మనలను కూడా హింసించును. కావున చెప్పచూతము. అధర్మమును పూణిక గలవాడై మన మాటను వినినచో ప్రజలు అసమ్మతితో ఇప్పటికే చెడియున్న రాజును మన శాపముచే దహింతుము. అని నిశ్చయించుకొని వేనుని వద్దకేగి మునులిట్లు చెప్పిరి. ఓ రాజా, మా విజ్ఞాపనమును వినుడు. మేము చెప్పునది నీకు ఆయుష్షును, ఐశ్వర్యమును, బలమును, కీర్తిని, వృద్ధిని కలిగించును. మనుష్యులు వాక్కు చేత, మనస్సు చేత, శరీరము చేత భగవదారాధనమునకు రూపముగా ధర్మమును ఆచరింపవలెను. అట్లు చేసినచో లోకము దుఃఖరహితమై ఉండును. కోరికలు ఉన్నచో ఈడేరును, లేనిచో మోక్షము లభించును. అట్టి ధర్మము నశింపరాదు. ధర్మము నశించినచో రాజు ఐశ్వర్యము నుండి భ్రష్టుడగును. సన్మార్గవర్తులు గాని మంత్రుల నుండి దొంగల నుండి ప్రజలను రాజు శిక్షింపవలెను. వారి నుండి రక్షణకు ఆవశ్యకమగు ఆవశ్యకము పనులను స్వీకరించుచుండవలెను. అట్లు చేసినచో ఈ లోకములో సుఖము నొంది చనిపోయిన తరువాత స్వర్గము నొంది సుఖించును. జనులు వర్ణాశ్రమ ధర్మములను పాలించుట ఎవరి రాజ్యములో యజ్ఞ పురుషుని ఆరాధించుచుందురో ఆ రాజ్యము భగవానుని అనుగ్రహముచే సుఖముగా ఉండును. తాను పరిపాలింపవలసిన పద్ధతిని అనుసరించి ప్రజాపాలన చేయుచు ధర్మమును పాలించిన నాడు విశ్వాత్మకుడు సర్వ జగత్కారణ భూతుడు అగు భగవానుడు సంతసించును.

భగవానుడు సంతసించినచో అతనిచే నియమింపబడు వారగు బ్రహ్మాదులు లోకపాలురందరు సంతసింతురు. అప్పుడు రాజు పొందజాలనిది ఉండదు. అందుచే భగవదారాధన రూపమగు యజ్ఞములను ప్రతిపాదించిన వేద విహితమగు కర్మాచరణముచే భగవానుని ఆరాధించి భగవత్ ఉపాసనారాధనము చేత భగవానుని అర్పించి భగవత్ ప్రీతిని కలిగించు వారులకు సర్వ సమృద్ధులు లభించును. అట్టి రాజు తన రాజ్యమును శాసింపగలవాడగును. నీ దేశములో బ్రాహ్మణులు యజ్ఞములు చేయుచు భగవాని శరీరం వంటి వారగు ఇంద్రాది దేవతలను సంతుష్టి పరుచుచున్నారు. అందుచే వారు కోరికలను ఈడేర్చుచున్నారు. వారిని సంతోషపరచు యజ్ఞములను నిరోధించుట వారిని అవమానపరచుటయగును. ఆ పని నీవు చేయరాదు. ఇట్లు మునులు చెప్పగా విని వేణుడు దుష్టవర్తనుడై బుద్ధిహీనుడై ఇట్లు పలుకుచున్నాడు. తనను పోషించు భర్తను వదిలి జారుడగు పురుషునిపై ప్రేమ చూపెడి స్త్రీ వలె మీరందరూ మిమ్ము పోషించరు నన్ను వదిలి యజ్ఞ పురుషుని భక్తితో ఆరాధించుచున్నారు. రాజే ఈశ్వరుడు. రాజును వదిలి ఇతర దేవతలను ఆరాధించువారు ఈ లోకములో పైలోకములో కూడా సుఖమునొందరు. వరములను సంగుట శాపము సంగుట అనేటి రెండు శక్తులు గల విష్ణువు. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, వాయువు, యముడు, సూర్యుడు, పర్జన్యుడు, కుబేరుడు, చంద్రుడు, భూమి, అగ్ని, వరుణుడు అను వారందరూ రాజు శరీరమునందు ఉందురు. రాజు సర్వ దేవతా స్వరూపుడు. రాజును ఆరాధించుటయే సర్వ దేవతలను ఆరాధించుట. అందుచే మీరు మాత్సర్యమును వీడి నన్ను ఆరాధించుడు. నాకే యజ్ఞములో భాగములను కల్పింపుడు. ఆరాధింపదగిన వాడను నేను. వేరొకడు ఎవరున్నారు అని మునులతో పలికెను. బుద్ధిహీనుడై, పాపాత్ముడై, దుష్టవర్తనుడై మునుల యాచనకు పాలింపక ఐశ్వర్మును తొలగించుకొనిన వాడైనాడు. వారు చెప్పిన హితమును అహంకారముచే వినక వారి ప్రార్థనను మన్నింపకపోవుటచే మునులకు కోపము వచ్చెను. పుట్టుకతో క్రూరుడగు ఈ పాపాత్ముని చంపుడు చంపుడు. ఇతడు జీవించి ఉన్నచో జగత్తును అతను భస్మము చేయును. చెడు నడువడి గల ఇతడు రాజ సింహాసమును అధిష్టింప తగదు. సిగ్గు లేని వాడై యజ్ఞపతియగు విష్ణువును దుషించుచున్నాడు.

విష్ణు యొక్క అనుగ్రహముచే ఐశ్వర్యము రాజ్యమును పొంది ఇప్పుడు ఆ విష్ణువునే నిందించుచున్నాడు. మనము చంపకపోయినను భగవంతుని నిందించుటచే ఇతడు చంపబడును అని మునులందరు హుంకరించి తమ తేజస్సుచే వేణుని చంపిరి. ఋషులు అతను చనిపోవగానే తమ ఆశ్రమను కేగిరి. సునీత తన మంత్ర ప్రభావముచే ఆ కుమారుని శరీరము కాపాడుచుండెను. ఋషులందరూ వారి ఆశ్రమములో అనుష్టానము చేసుకొనుచు ఒకనాడు సరస్వతి జలములలో స్నానము చేసి అగ్నిహోత్రం ఆచరించి భగవత్ కథలను చెప్పుకొనుచుండిరి. లోకములో ఉత్పాదములు అధికముగా కనపడుచుండెను. మునులు ఆ ఉత్పాదములు చూచి రాజు లేకపోవుటచే ఇట్టి ఉపద్రములు కలుగుచున్నదని బాధపడి. తర్వాత పృథ్ చక్రవర్తి యొక్క చరిత్రను మనం తెలుపుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Sriman Narayana, salutations to the Guru. Salutations, salutations to the cause of all causes, the cause of the causeless, the cause of the wonderful, the ocean of all the scriptures, the ocean of salutations, the ocean of salutations, the ocean of salutations. You are the cause of everything, there is no other cause. Everything originated from you, everything There is no truth in you, you are the cause of the world that amazes them. Like rivers and the ocean, all the scriptures and Vedas are subject to your consequences. You are the embodiment of salvation, the ultimate path that seekers attain. Many salutations to you. Devotees of God, welcome to the 17th podcast in the fourth book of Srimad Bhagavata Tatva Deepika. As part of the conversation between Vidura and Maitreya, after learning the story of Daksha and Dhruva, we have stepped into the story of Prithu Raja. Vidur questions, however. Prithu's, Dhruva's, Dhruvudu's, within the lineage, going forward for generations, when a son named Venudu was born, why was he born with a wicked nature? What is the reason behind it? The things behind it He is asking, we Let's find out. Maitrudu is saying this. King Anga once again performed the great Aswamedha of Krittivasa. Even though the gurus of the learned in Veda were invited with mantras, the gods did not come to accept the portions. The flute was the son of the king of this realm. They are providing us with the story of Angama Maharatha to explain the matter of that flute. The gods did not come to take the share. Then the priests were surprised and said to the Maharaja, "In the Yagnya (sacrificial fire) that we are performing according to the rules, there has been no insult to the gods, not even a little." The gods can see the good and the bad in karmas. The priests said that some unknown misdeed must have happened. Hearing their words, the master Angaraja, having a broken heart, violated the rule not to speak in the assembly, O assembly members. I don't know what mischief he has done. The gods do not come to take the share. He asked that you tell him what he has done wrong. Then the meetings were told this way. Oh, King, you are a magician. In this life, you have not committed any fault. But you have an ancient sin.

Therefore, you, who are virtuous, became childless. You should perform the yajna only for the progeny. Oh Lord, the enjoyer of sacrifices, by performing your sacrifice, you will be pleased and will be able to have children. If that's the case, you can understand the part you gave. Srihari is a yagnapurusha. He will come with the gods and fulfill your wish. As the desires of those who worship God are fulfilled, Angaraja, for the sake of his progeny, offered a Purodasham to Vishnu and began to perform the Yagnya. Then, a man wearing a golden garland and clothes came out from that fire, holding a golden vessel and a sweet dish. That king, by the order of the priests, accepted that payasam from the Agni Purusha, smelled it, and gave it to his wife. His wife, Suneetha, became pregnant and after a month, gave birth to a son. The man was a bastard from the cradle. Sunita Anunami is the daughter of Mr. and Mrs. Mr. Death is caused by the element of Adharma. The resemblance of the mother and father came, and that boy became an unrighteous person. He took the bow The wicked one, with a cruel mind, was killing the innocent animals in the forest. Seeing him, everyone was crying. He was cruelly killing the children who were playing in the games, like killing animals, without mercy. Angaraju, being a wicked person, tried in many ways to heal his son. But he didn't get better. The father was devastated. He was grieving and thinking like this. Those householders who do not fully worship God and do not receive God's grace will become childless. Or they will suffer unbearable sorrow from the offspring of evil. Bad offspring also bring dishonor and unrighteousness. Everybody gets jealous. Severe mental anguish. Therefore, the bond that binds a son in the name of is the infatuation of a son. This is not a respectable profession. They abandon their families because they are the ones who cause suffering to their minds by having sons who are born and ruined.

But in my opinion, it is better to have a wicked son than a worthy son. If a son is good, there will be no aversion in the house or in the world. If the offspring is wicked, they will abandon the house that is a cause of disgust and suffering to the parents, and they will get very worried and wake up at midnight and leave the building that is the abode of all prosperity and sleep without being seen by humans He left his wife and went to the forest. People, priests, ministers, and friends, with concern about their son, searched everywhere for him, saying that he had left the kings and gone to the forest. But no one has any idea about his whereabouts. Having returned, saying there is no more profit, they wept with the sages present there, and told the matter of Angaraja, the king of the ancient lineage, disappearing without being seen. The sages, including Bhrigu, who desire the well-being of the people, said that if there is no ruler in the kingdom, the people will live like animals, torturing each other, and food and progeny will be the main things. Calling Suneetha, her son Venu, to the people Suffering They crowned him, saying that there should be a king named Erngiu who would unite them. The throne is seated by a wicked person, a cruel ruler, and a vile man. The thieves and others, even though he severely punished them, were afraid and fled as if their bones had fled into the earth. Venudu, being rich in eight kinds of wealth, became arrogant and became a fool. He was proud, believing that he was great, very intelligent, and very fortunate. Like a drunken elephant that does not yield to the goad, like a madman, uncontrollable, mounting a chariot, shaking the earth and the heavens, he was making a ruckus. No one greater has ever been born. You don't have to sacrifice for others. He forbade everyone without practicing Dharma, by making a decree that there is no need to perform donations and homams. Bhrigu and other Yajnikas, seeing that Venu's bad conduct was not right, thus, thinking that this person would cause trouble to the world by preventing Dharma, spoke thus.

When fire is applied to both sides of a stick, the ants in the middle are suffering as if they cannot go to any side. People are suffering from the same kind of suffering from kings and thieves. The thieves worshipped the king and looted the country. He removed the practice of righteousness, and made the king without heavenly happiness. Thus, people in this world, without happiness, and in the higher world, without happiness, are suffering. Then all those sages, because of the mistake we made, brought such a disaster, brought it, knowing that he was wicked as if pouring milk to a snake, we made Suneetha's son Vadha the ruler of the people. If righteousness does not forbid him, his unrighteousness will also oppress us. Therefore, let's see. If he who is full of iniquity listens to our words, we will burn the king who is already ruined by dissent with our curse. And having decided, they went to Venu and told him. O King, hear hear our cry. What we say will give you longevity, wealth, strength, fame, and growth. By the word of man By mind, by body, and as a form of devotion to God, one should practice Dharma. If that is done, the world will be free from suffering. If there are desires, this is the path; if not, salvation is attained. Such a dharma cannot be destroyed. If dharma is destroyed, the king will be ruined from his wealth. The king should punish the people from the righteous, from the ministers, from the thieves. They should accept the necessary tasks that are required for protection from them. If done that way, one will attain happiness in this world, and after death, one will attain heaven and enjoy. In whose kingdom the people follow the rules of Varnaashrama Dharma, worshiping the Yagnya Purusha, that kingdom will be happy by the grace of God. When he governs according to the method he should govern, and when he rules the people and upholds righteousness, the Lord, who is the cause of all the world, is pleased.

If God is pleased, all the Brahmins and other world leaders appointed by him will be pleased. Then the king will not be able to obtain it. Therefore, those who perform yagnas (sacrifices) in the form of worshiping God, who worship God through the prescribed actions of the Vedas, who offer to God through devotion, and who bring God's pleasure, will attain all prosperity. Such a king is able to govern his kingdom. In your country, Brahmins perform yagnas (sacrifices) and satisfy Indra and other gods who are like the body of the Lord. Therefore, they are fulfilling their desires. To please them, to stop the sacrifices, to humiliate them, it will be. You can't do that job. Thus, hearing what the sages said, Venudu, being wicked and foolish, is speaking thus. Like a woman who leaves her husband, who nourishes her, and shows love to a man who sways, you all do not nourish yourself. Leaving me, you are worshiping the Yagnya Purusha with devotion. The King of Gods. Those who abandon the king and worship other gods will not find happiness in this world or the next. Varamanusu sanguata Vishnu with two powers, called Sangata. Brahma, Rudra, Indra, Vayu, Yama, Surya, Parjanya, Kubera, Chandra, Bhumi, Agni, Varuna, all of them reside in the body of the king. The king is a manifestation of the divine. Worship the king means to worship all the gods. Therefore, abandon your jealousy and worship me. Give me a share in the sacrifices. I am a worshiper. He said to the sages, "Who else is there?". He became a fool, a sinner, a wicked man, and one who did not obey the requests of the sages, and he removed Aishvaramu. They did not listen to the good advice they gave, and they did not heed their prayer, so the sages became angry. Kill this sinner who is cruel from birth. If he lives, he will burn the world. This person, who has a bad character, is not fit to ascend the royal throne. He is shameless and is criticizing Vishnu, the lord of sacrifices.

Having obtained wealth and kingdom by the grace of Vishnu, he now blames Vishnu. Even if we do not kill, by blaspheming God, this one will be killed, thus all the sages roared and killed the flute with their splendor. As soon as the sages died, they went to their hermitage. Sunita, through her magical powers, was protecting the boy's body. All the sages, while performing their rituals in their ashram, one day, after bathing in the Saraswati waters, performed the Agnihotra, and were telling the stories of the Lord. In the world, the products are appearing more. The sages, seeing those products, were saddened that the king was not there, and that such troubles were occurring. Next, let's learn about the history of Prithviraj. Jai Srimannarayana, salutations to the Asmadgurus