భద్రకాళి ఆలయంలో జడభరతుని రక్షణ
Jada Bharata's Protection in the Bhadrakali Temple
శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, తన ఆత్మజ్ఞానాన్ని జడత్వం వెనుక దాచుకున్న మహాత్ముడు జడభరతుని అద్భుతమైన కథను వివరిస్తాము. దొంగలచే పట్టుకోబడి బలి కోసం భద్రకాళి ఆలయానికి తీసుకువెళ్ళబడినప్పటికీ, జడభరతుడు సంపూర్ణ సమభావంతో, మనసు భగవంతునిపై లగ్నం చేసి నిశ్చలంగా నిలబడతాడు. భద్రకాళి దేవి స్వయంగా ప్రత్యక్షమై ఈ నిర్మల భక్తుని రక్షించడం, భగవంతుని శరణు పొందిన వారిని దైవమే కాపాడుతుందనే సత్యాన్ని నిరూపిస్తుంది. లోకానికి జడుడుగా కనిపించే మహాత్ముడు దైవకృపకు ఎల్లప్పుడూ పాత్రుడని ఈ ఘట్టం హృద్యంగా తెలియజేస్తుంది.
In this sacred episode from Canto 5 of the Srimad Bhagavatham, we explore the remarkable story of Jada Bharata, the great soul who concealed his spiritual realization beneath a veil of apparent madness. Captured by thieves and brought to the Bhadrakali temple as a human sacrifice, Jada Bharata faces mortal danger with complete equanimity, his mind undisturbed and fully surrendered to the Lord. The goddess Bhadrakali herself intervenes to protect this pure devotee, revealing that the divine always shields those who have taken refuge in the Supreme. This episode beautifully illustrates how a true saint, though appearing inert to the world, is ever protected by the grace of the Divine Mother.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః స్వచ్ఛందోపాత్త దేహాయ విశుద్ధ జ్ఞాన మూర్తయే సర్వస్మై సర్వ బీజాయ సర్వభూతాత్మనే నమః కేవల జ్ఞాన ఘనుడవగు నీవు యథేచ్ఛగా అవతారమును స్వీకరించెదవు సర్వ కారుణవైన నీవే సర్వమై ఉన్నావు సకల ప్రాణులలో ఆత్మరూపుడవైన నీకు నమస్కారము. టెన్త్ క్యాంటో 27th చాప్టర్ 11th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము. 14వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు రహుగణుడు జడభరతుడి యొక్క వృత్తాంతములో వారి మధ్య జరిగినటువంటి సంవాదము, తత్వజ్ఞాన ఉపదేశము విన్నాము. ఇంకా ముందు భాగంలో సంప్రదించించేటువంటి భాగాన్ని తెలుసుకుందాం. 11, 12 చాలా ముఖ్యమైనటువంటి విషయాలు పాడ్కాస్ట్ లో తప్పుగా వినాలని ప్రార్థిస్తున్నాను. ముందు భాగం వెళ్దాం. సంసారమునందు వైరాగ్యము కలిగిన గాని తత్వమును ఎరింగినను సంఘము వదలదని ఈ సంసారమును అడవిగా నిరూపించుచు చెబుచున్నాడు. ఏంటంటే మానవుడు దాటుటకు శక్యము గాని కర్మ మార్గమునందు ప్రకృతి వేషమున ప్రవేశించినాడు. మానవుడు శుభాశుభములు కలిసి ఉన్న కర్మలను చేయగోరుచుండును. జీవులందరూ ధర్మకామార్థములయందు ఆసక్తి గలవారై సంసార అటవిలో సంచరించుచుందురు. చేసిన కర్మల వలన సుఖమునో దుఃఖమునో పొందుచుందురు. కానీ సుఖమునే పొందరు. వ్యాపారి డబ్బును సంపాదించుటకు అడవిలో పయనించుచు ధనార్జనము చేయుచునను. ఎట్లు సుఖమును అందడో అట్లే జీవుడు సంసార అడవిలో ప్రయాణము చేయుచు సుఖమునే పొందడు. భవాటవిలో ఇంద్రియములు పొంచి ఉండి చంపెడి దొంగల వలె దుష్ట జంతువుల వలె మానవును దోచుకొనుచుండును. హింసించుచుండును. ఈ జీవును నడిపించు నాయకుడు బుద్ధి. జీవ సమూహమునంతను బుద్ధి నడిపించును. తోడేళ్ళు అమాయకము గొర్రెను ఎత్తుకొని పోయినట్లు భార్యా బిడ్డలు బుద్ధిని దోచుకొని పోదురు. హింసింతురు.
ఈ అడవిలో లతలు, పొదలు, ముళ్ళతుప్పలు దట్టముగా వ్యాపించి ఉండును. పెద్ద పెద్ద దోమలు తీగలు నిండుగా ముసురుకొని ఉండును. గంధర్వ నగరం వలె ఉన్నట్లు మెరిసి మాయమయ్యేడి వస్తువులను ఇందు ఎన్నిటినో చూచుచుండును. అతి వేగముగా కొరివి దయ్యములు యందు పరిగెత్తుచుండును. దాహం వయుచుండుటచే నీరు వలె కనిపించు ఎండమావుల వైపుడు అడవిలో మానవుడు పరిగెత్తుచుండును. కొన్ని చోట్ల సుడిగాలి బలముగా వీచి ధూళి ఎగిరి దిక్కులను అలముకొనును. కళ్ళు ధూళితో నిండిపోయి ఎటు పోవలెనో దారి తెలియకపోవుచుండును. కొన్ని చోట్ల కనపడకుండా ఉండి చీకట్లో జుమ్ అని అరచెడి చీకురు వాయులు అరుచుండును. ఆ ధ్వనులు ములుకుల వలె చెవులకు బాధ కలిగించుండును. దానితో మనసులో భయము కలుగుచుండును. ఆకలిచే బాధపడి తినకూడని విషప్పండ్లు పండెటి చెట్లను చేరుచుండును. నిజముగా నీరు అనుకొని నీరు లేని చోట పరిగెత్తుచుండును. నీరు లేని నదులను చూచి నీరు ఉన్నదని భ్రమించి పరిగెత్తి పడి దెబ్బలు తగిలి బాధపడునే కానీ దాహము తీరదు. అడవిలో తిరుగుచుండగా కార్చిచ్చు వ్యాపించును. దానితో చాలా బాధపడును. కొన్ని చోట్ల భూత ప్రేతములు పైబడి ప్రాణములు తీయును. త్రోలో కొందరు చోరులు మీద పడి దోచుకొందురు. దానిచే మనసు భీతిచే తల్లడిల్లి శోకించుచు మూర్ఛనందుదురు. లేకుండానే ఉన్నట్లు కనపడి గంధర్వపురమును ప్రవేశించి క్షణకాలము సుఖమునందినట్లే ఆనందించును. ఎత్తైన కొండలు కనపడును. ఆ కొండ పైకి ఎక్కవలెనని ప్రయత్నించి ముళ్ళతో, గులకరాళ్లతో కాళ్ళు గాయములై బాధపడును. కొండను ఎక్కలేడు, వెనకకు మళ్లలేడు. తీవ్రమైన కోపము తెచ్చుకొనుచుండును. అట్లే ఆ అడవిలో ఏగుచుండగా ఒక చోట కొండ చిలువము రెంగి వేయును. కొన్ని చోట్ల కష్టపడి తేనె పట్టులను తీసి తేనెను ఆస్వాదించవలెనని ప్రయత్నించి ఆ తేనెటీగలచే ఒకప్పుడు బాధపడును.
ఎట్లో కష్టపడి ఆ రుచి అనుభవించే అవకాశం లభించినను ఇంతలో వానిని మోసగించి వేరొకరు దానిని అపహరించుకొని పోదురు. ఆ అడవిలో చలికి, ఎండకు, గాలికి, వానకు తట్టుకొనలేక బాధపడుచుండును. ప్రతీకారము చేయలేని వాడై బాధపడుచుండును. ఒకప్పుడు ఆ అడవిలో తిరుగుచుని క్రయవిక్రయాదులను చేయుటకు సిద్ధపడి ఇతరులచే మోసగింపబడి ద్వేషమును పొందును. ఇట్లు సంసార అడవిలో తిరుగుచు దొంగలు డబ్బు దోచుకొని పోగా ధనము లేని వాడగును. ఇల్లు లేక కూర్చునుటకు చోటు లేక పడుకొనుటకు పాన్పు లేక వేసుకొనుటకు ఆచ్ఛాదనము లేక ఎవరిని కోరినను ఎవరిను సాయము చేయుటకు లేక అవమానములను పొందుచుండును. ధనము కారణముగా విరోధులు, వివాదములు ఏర్పడును. వైరములు పెరుగును. వాటిచే ఎన్నో కష్టములను అనుభవించి తన తోడి వారందరూ తనని వదిలిపోవుచుండగా చనిపోవుచుండగా వారందరినీ వదిలి బిడ్డలను భార్యలను వదలలేక వారితోనే అడవిలో తిరుగుచుండును. ఇట్లు ఈ సంసారాటవి మార్గమును ప్రవేశించిన వాడు అడవిలోనే తిరుగుచుండును. కానీ బయటపడిన వాడు ఒక్కడును ఉండడు. శూరులు మనస్సులు, దిగ్గజములను జయించిన బలశాలలు ఈ దేశము నాది, ఈ దేశము నాది అని అభిమానించి ఒకరితో ఒకరు యుద్ధము చేసి చనిపోవుచుందురే కానీ ఆవలి అంతు చేరలేరు. ఆ ఆవలి ఒడ్డున పరమ సుఖమునకు స్థానమగు వైష్ణవ పదమున్నది. దాని చేరుటకు రెండే మార్గములు. సర్వభూతమునందు వైరము లేకుండా ఉండవలెను. భగవానుని యందే మనసును నిలిపి ఉండవలెను. కానీ ఈ సంసారాడవిలో తిరుగుచున్న వారికి లతల వంటి భుజములు గల స్త్రీలే ఆశ్రయములే ఉందురు. చెట్లను తీగలను పట్టుకొని నడుచుందురు. ఆ చెట్లపై లతలపై ఉన్న పక్షులు మధురముగా మాటలకు మధురముకు మాటలకు మురిసిపోవును. ఒకప్పుడు మృత్యువు వచ్చునని భయముతో ఎవరోనో ఒకరిని తమను హింసించెడు గద్దలను, రాబందులను, కొంగలను తమను రక్షించురేమో అని ఆశ్రయింతురు. వాని వలన బాధలే కానీ రక్షణ లేదని ఒకనాడు తెలిసి హంసల గుంపులో చేరును. కానీ వెనుకటి వాసనలు వదలక కోతుల వలె శిరరహితులైన వారిని సంస్కార హీనులను ఆశ్రయింతురు కానీ హంసల వంటి
వారితో కలిసి ఆనందింపలేరు. కోతుల వలె మైధునమునే ఆనందజనకముగా భావించి ఆ సుఖమునకు లొంగి పొంగిపోవుచు కిచకిచమనుచు ఒకదానితో ఒకటి కలిసి ఉండటమే మహానందము అనుకొనుచు మృత్యువు వచ్చునని గుర్తింపరు. ఇళ్ళ యందే రమించుచుందురు. బిడ్డలపై, భార్యలపై ప్రేమను వదలలేరు. మైధునేచ్చ తగ్గక అది లభింపక దిగులు చెందుదురు. తనను బంధించిడి బంధనము. విడదీసుకొనలేక లొంగిపడి ఉందురు. ఇట్లు సాగుచుండగా మృత్యు భయం వలన పరిగెత్తి ఒక కొండలోయలో పడి ఒక తీగ పట్టుకొని వేలాడుచుందురు. ఎట్లో ఈ ఆపదల నుండి భయల్పడి మరల తనతో పాటు సంచరించు వారలతో చేరి సంచరించుచుందురు. అది సంసార దుర్గ మార్గము. దీనిని భవాటవి అందురు. భగవన్ మాయచే జీవులు ఇందు ప్రవేశింతురు. ఎంత కాలము సంచరించినను దానిని దాటజాలరు. రహుగణ, ఓ రాజా, నీవు కూడా ఈ భవాటవిలో ఉన్నావు. ఈ అడవి మార్గమును దాటవలెను. దీనికి ప్రధానముగా కావలసినది భూత మైత్రి. ఎవ్వరినీ మాటలతో కానీ చేతతో కానీ హింసంపకుండా దయ కలిగి ఉండవలెను. విషయములపై అభినివేశం ఉండరాదు. తాను చేయవలసిన ధర్మమును హరి సేవగా చేయుచుండవలెను. భగవదారాధనచే తత్వజ్ఞానము కలుగును. అదే ఖడ్గము. ఆ ఖడ్గముతో ఈ సంసారాటవిలో వృక్షములను ఛేదించుకొని ఆవలి వైపున్న వైష్ణవ పదము చేరుదురు. ఇట్లు సంసారములో ఉండుడు దుఃఖములను బాధలను పరోక్షముగా రోగనునకు కథతో భరతుడు చెప్పెను. భరతుడు తత్వరూప స్వరూపమును నిరూపించి సంసారములో అసారతను ఉపదేశింపగా వైరాగ్యము కలిగి రౌగణుడు తాను కృతార్ధుడనైతిని భావించి భరతును అభినందించుచు ఇట్ల అనుచున్నాడు. ఈ లోకంలో పైలోకంలో దేవ మనుష్యాది జన్మలు ఎన్ని ఎత్తినను సత్పురుషులతో సహవాసం లభించిన మనుష్య జన్మయే సార్ధకమైనది. ఎన్ని జన్మలు ఎత్తినా
ఏమి ప్రయోజనము? భగవానుని కీర్తిని గానము చేయుటచే పరిశుద్ధమైన మనస్సు గల నీ వంటి మహాపురుషుల సహవాసం లభించని నాడు అన్ని జన్మలను వ్యర్థమే. జన్మల నెత్తుటకు ప్రయోజనము పొందవలసిన విష్ణు పదమును పొందుట అది పొందుటకు భాగవత సంఘము ప్రధాన సాధనము. నా భాగ్యవశముచే ఈనాడు నాకు మీతో సమాగమము లభించినది. భగవానుని యందు నిర్మలమైన భక్తి కలిగినది. నీవంటి వారి కలయగచే పాపము పోవుట, భక్తి కలుగుట ఆశ్చర్యము కాదు. ఒక్క క్షణకాలం మీతో నేను కలిసి ఉంటిని. ఇంత స్వల్పకాలము సమాగము చేతనే దుష్కరముచే వేళ్ళు పాతుకొని పోయిన నా అజ్ఞానం అంతరించిపోయినది. ఏమి ఆశ్చర్యము అందరిలో వాసుదేవుడు వ్యాపించి ఉన్నాడు అని నాకు నీ సహవాసముచే తెలిసినది. తెలిసినది అందుచే పెద్దలకు నమస్కారము. పిల్లలకు నమస్కారము, శిశువులకు నమస్కారము, యువకులకు నమస్కారము, బ్రహ్మచారులకు నమస్కారము, బ్రహ్మవేత్తలే తమ మహత్వమును. భయపడకుండా సామాన్యుల వలె సంచరించడి. ఏ ఆడంబరము లేని బ్రహ్మవేత్తలైన వారికి క్షేమము అవుగాక. వారు సుఖముగా ఉండుటచే మా వంటి అహంకారముతో నిండి ఉన్న రాజులకు శుభము కలువుగాక. అని రహుగణుడు జ్ఞానము కలిగి కృతజ్ఞతతో స్తుతించి నమస్కరించెను. తర్వాత భాగంలో చూస్తున్నాడు. శుకుడు ఓ పరీక్షణ మహారాజా బ్రహ్మర్షి కుమారుడగు భరతుడు రహుగనునకు పరమ కారుణికుడై ఆత్మతత్వమును ఎరిగించినాడు. రహుగనుడు అతని పాదమునకు నమస్కరించినాడు. నిండు సముద్రం వలె నిశ్చలమైన ఇంద్రియములు కలవాడై ఆకలి దప్పులు శోక మోహములు జరా మృత్యువుల వలన బాధనందని మనసు కలవాడై భరతుడు ఈ భూమినంతటా సంచరించుటకేగెను. రౌగనుడు కూడా పరమాత్మతోను ఎరింగెను. ఆత్మ యందు దేహము నేను అనేటి భ్రాంతి ఇంతకాలం అనుకొని ఉండెను అది తొలగెను. ఈ భరతరావు గణ సమాగమముచే భగవానుని ఆశ్రయించిన వారిని ఆశ్రయించిన వారి ప్రభావము వర్ణనాతీతము అని తెలిసినది.
తర్వాత భవాటవి యొక్క వర్ణనాన్ని మనము మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. చక్కటి విషయము దీన్ని మరల మరల విని మనం అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Gurus. May the pure body be the embodiment of pure knowledge. Salutations to all, to all seeds, to all beings. You, the embodiment of pure knowledge, will freely accept incarnations. You, the compassionate one, become everything You are present in all living beings. Salutations to you, who are the embodiment of the soul. Tenth Canto 27th Chapter 11th Prayer. Devotees of God, Srimad Bhagavata Tattva Deepika, Fifth Canto. Welcome to episode 14. Until now, we have heard about Rahugana and Jada Bharata's story, the conversation between them, and the teachings of philosophical knowledge. Let's learn about the part that contacts in the front. 11, 12, I pray that very important things are heard wrongly in the podcast. Let's take the front. Even if one has detachment in worldly life and understands the essence, he says that he will not leave the world, proving this world as a forest. What it means is that man, though capable of crossing, has entered the path of nature in the guise of karma. Man desires to perform actions that have both good and bad consequences. All beings, being interested in dharma and kama, wander in the forest of samsara. They receive happiness or sorrow due to the deeds they have done. But they wouldn't have any happiness. The merchant travels in the forest to earn money and makes a profit. Just as a person who does not find happiness in this world does not find happiness in the forest, similarly, a living being who travels in the forest does not find happiness. In the world, the senses are like hidden thieves, like wicked animals, they rob and torment humans. The leader who guides this being is the intellect. Intelligence guides the entire living community. Just as wolves take away an innocent sheep, so do husbands and children steal away their minds. They inflict violence.
In this forest, vines, bushes, and thorny bushes are densely spread. Big big mosquitoes are full of veins. Like a city of Gandharvas, it shines and disappears, seeing so many things. The demons run very fast. Because of thirst, a man runs towards the forest, appearing like a mirage, like water. In some places, a whirlwind blows strongly, dust flies up, and it blows in all directions. The eyes are filled with dust, and I don't know where to go. In some places, hidden, in the dark, a whooshing sound, a rustling sound, and a chirping sound are heard. Those sounds, like a flute, cause pain to the ears. With that, fear arises in the mind. Hungry, distressed, poisonous fruits that should not be eaten are reaching the trees. Actually, thinking it is water, it runs where there is no water. Seeing rivers without water, mistaking it for having water, running, falling, getting hurt, suffering, but thirst will not be quenched. A wildfire can spread rapidly in a forest. I feel terrible about it. In some places, ghosts and spirits take lives. In the throaw, some thieves fall on the people and rob them. Because of that, the mind is terrified, they are in agony, they are in a state of fainting. As if it were not there, appearing, entering the Gandharva city, and for a moment, as if having enjoyed happiness, he rejoices. There are high mountains. Trying to climb that hill, he got injured by thorns and pebbles, and is suffering. He couldn't climb a hill, he couldn't turn back. Severe anger. Similarly, while climbing in the forest, a mountain lizard spreads its tail in one place. In some places, I tried to extract honey by working hard and enjoying the honey, but I was once troubled by those honeybees.
Even though he got the opportunity to experience that taste with so much difficulty, someone else deceived him and stole it away. In that forest, unable to bear the cold, heat, wind, and rain, he is suffering. One who cannot take revenge suffers. Once upon a time, wandering in that forest, he prepared to do buying and selling, was deceived by others, and received hatred. Thus, wandering in the forest of worldly affairs, thieves steal money and leave, leaving the one without wealth. Without a house, without a place to sit, without a bed to sleep on, without a roof to cover oneself, without asking anyone for help, and without being able to help anyone, one suffers humiliation. Enemies and disputes will arise due to money. Viral infections are common. Having suffered many hardships because of them, while all his companions are leaving him, while he is dying, unable to leave them all, children, wives, he wanders in the forest with them. Thus, one who has entered the path of this worldly life will wander in the forest. But no one turned out to be the one who came out. The courageous hearts, the mighty forces that conquered the giants, this The country is mine, this country is mine, they admire each other, fight with each other, and die, but they cannot reach the other end. On that shore, there is a Vaishnava abode that is the place of supreme happiness. There are only 2 ways to reach it. There should be no animosity among all beings. The mind should be fixed on the Lord. But for those who wander in this world, women with shoulders like bars are their only refuge. They walk holding onto the trees and vines. The birds on the trees and vines are delighted with the sweet words. Once upon a time, fearing death, they sought refuge in the hope that some one or the other would protect them from the vultures, eagles, and cranes that would torment them. He suffers from pain, but one day he will join the flock of swans, knowing that there is no protection. But without leaving behind the past smells, like monkeys, those who are headless, they embrace those who are culture-less, but like swans
You can't rejoice with them. Considering love as a joyful experience like monkeys, being overjoyed and chattering, being together with each other, considering it a great joy, not realizing that death is coming. They are enjoying themselves at home. They cannot give up their love for their children and wives. They suffer from depression because they cannot get what they desire. The bond of being bound. They are unable to separate and are submissive. Thus, as it continued, due to the fear of death, they ran and fell into a mountain valley, holding onto a vine and hanging. In what way, from these dangers, being frightened, again, along with those who travel with him, they join and travel. That is the path to worldly ruin. This is called a bhavaṭṭa. The beings enter the Indra because of the illusion of God. No matter how long you ride, you will never cross it. Rahugana, o Raja, you too are in this world. You've got to cross the forest path. The main thing needed for this is Bhuta Maithri. Do not be angry with anyone, neither by words nor by actions, but have compassion. There should not be any bias towards the subjects. One should perform the duty that he has to do as service to Hari. Devotion to God leads to the knowledge of the Self. It's the same sword. With that sword, in this cycle of life, they cut down the trees and reach the Vaishnava feet on the other side. Thus, Bharata indirectly told the story of the sorrows and sufferings of living in the world to Roga. Bharata, having proved the nature of reality and taught the invalidity in the world, having attained detachment, Rauganudu, feeling that he had become accomplished, congratulating Bharata, says thus. In this world and the next, however many births of gods, humans, etc., the human birth in which association with virtuous people is attained is meaningful. No matter how many births I take
What is the benefit? By singing the praises of God, when the company of great men like you, who have a pure heart, is not available, all births are in vain. To attain the Vishnu position, which is beneficial for the blood of births, the Bhagavata Sangham is the main means to attain it. By the grace of God, today I have attained union with you. Devotion to the Lord is pure. It is not surprising that the sin of adultery committed by someone like you is removed and devotion arises. I was with you for a couple of moments. In this short time, through union, through the difficult, my ignorance, which was rooted in roots, has been destroyed. What a surprise! I learned through your association that Vasudeva is pervading everyone. Greetings to the elders, who know this. Salutations to the children, salutations to the infants, salutations to the youth, salutations to the celibates, the Brahmins themselves have their greatness. Do not be afraid, move like a common man. May those who are Brahmavadis, without any pomp, be blessed with well-being. It is auspicious for kings like us, filled with arrogance, for them to be happy May there be a connection. Thus, Rahugana, having knowledge, with gratitude, praised and bowed. He's watching in the next part. Shukudu, the king of Parikshana, Bharata, the son of Brahmarshi, became the ultimate compassionate to Rahugana and revealed the essence of the self. Rahuganu saluted his feet. Bharata, being one with steady senses like an ocean, free from hunger, thirst, sorrow, delusion, and the suffering caused by old age and death, desired to wander throughout this earth. Rougain also joined the Lord. The illusion that the body is the self, that I am, has been held for so long, it has been removed. It is known that the influence of those who have taken refuge in the Lord through this Bharata Rao Gana Samagama is beyond description.
After that, let's learn about the description of Bhavatavi in another podcast. A beautiful thing, praying that we understand this again and again, Jai Srimannarayana, salutations to the Gurus