నారదుని పూర్వజన్మ వృత్తాంతము - దాసీపుత్రుని సాధన
Narada's History in Previous Life as a Maidservant's Son
ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, మహర్షి నారదుడు వ్యాసదేవునికి తన పూర్వజన్మ వృత్తాంతమును వివరిస్తాడు, అందులో అతడు ఒక దాసీపుత్రుడిగా జన్మించాడు. అల్పమైన పరిస్థితులలో జన్మించినప్పటికీ, ఆ బాలుడు వర్షాకాలంలో తమ గృహంలో నివసించిన సాధుసంతులకు నిష్కల్మషమైన సేవ చేసి, వారి ఉచ్ఛిష్టమును స్వీకరించి, భగవత్కథలను శ్రద్ధగా శ్రవణం చేశాడు. ఆ సాధువుల కృపాప్రసాదంతో అతనికి దివ్యజ్ఞానం లభించి, దేహత్యాగానంతరం అతడు శాశ్వతమైన నారద మహర్షిగా ఉద్ధరింపబడ్డాడు. జన్మపరిమితులను అధిగమించగల భక్తి మరియు భాగవతసేవ యొక్క మహిమను ఈ ఘట్టం అద్భుతంగా తెలియజేస్తుంది.
In this sacred episode, the great sage Narada reveals to Vyasadeva the remarkable story of his previous birth as the humble son of a maidservant. Though born in lowly circumstances, the young boy devoted himself wholeheartedly to serving the saints and sages who resided in his home during the rainy season, partaking of their remnants and listening attentively to their discourses on Lord Vishnu. Through this sincere devotion and the grace of the sages, he received divine knowledge and, upon leaving his body, was ultimately elevated to his glorious form as the eternal sage Narada. This episode beautifully illustrates that pure devotion and selfless service to the Lord's devotees can transcend all limitations of birth and circumstance.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః శ్రీ కృష్ణ కృష్ణ సక వృష్ణ వృష భావ నిద్రిక్ రాజన్య వంశ దహనానపవర్గ వీర్య గోవింద గోద్విజ సురార్తి హరావతార యోగీశ్వరాఖిల గురో భగవన్ నమస్తే ఓ శ్రీకృష్ణ నీవు అర్జునునకు మిత్రుడవు యదువంశ శ్రేష్టుడవు భూలోకమునకు చేటును తలపట్టే రాజుల వంశములను నశింపజేసే నీ ప్రభావం అనంతమైనది ఓ గోవిందా గోపికలు, భక్తులు గుంపులుగా నీ పావనమైన కీర్తిని గానము చేయుదురు. నిన్ను గురించి వింటే కళ్యాణములు కలుగును. నీవు భక్తులను రక్షించుము. 12th క్యాంటో, 11th చాప్టర్, 25th ప్రేయర్. భవద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపికా ఫస్ట్ క్యాంటో సెవెంత్ పాడ్కాస్ట్ లో సుస్వాగతం. విష్ణు భక్తులు దేవతాంతరముల యందును వారిని ఉపాసించి వారి యందును అసూయ లేని వారే ఉంటారు. రజస్తమస్సులు ప్రధానముగా గలవారు రజస్తమ స్వభావములు గల పితృ దేవతలను భూతపతులను రుద్రాదులను ప్రజాపతులకు హిరణ్య గర్భాదులను ఇతర దేవతలను సంపద కొరకును, ఆధిపత్యం కొరకును, సంతానం కొరకును ఆరాధించుందురు. వేదములు పూర్వోత్తర భాగములలో వాసుదేవుని గూర్చియే ప్రధానముగా ప్రతిపాదించునవి అయి ఉండును. పూర్వ భాగములో అగ్ని మొదలగు దేవతలను ఉపాసించిన యాగములు ప్రతిపాదింపబడినను అవి అన్నియు అగ్ని మొదలగు దేవతలలో అంతర్యామిగానుండు వాసుదేవుని ఆరాధనను ప్రతిపాదించునవే. యోగాభ్యాసాదులు ఇతర కర్మలు కూడా వాసుదేవుని గూర్చి ప్రవర్తించునవే. జ్ఞానము వాసుదేవునే ప్రతిపాదించునది. తపస్సు వాసుదేవుని గూర్చియే చేయబడునది. ధర్మం వాసుదేవుని ప్రీతికే సాగునది. ధర్మములచే పొందబడునవి అన్నియు వాసుదేవుని అనుగ్రహముచే లభించునవే. సృష్టికి ముందు భగవానుడగు వాసుదేవుడే తన సంకల్పముచే నామరూపములు గల స్థూలముగు జగత్తును సృష్టించెను.
ఆనాడు సృష్టికి ముందు చేతనా చేతనములు సూక్ష్మములై వాసుదేవునితో చేరి యుండుటచే ఒక్కడే ఉన్నట్లు ఉండును. తరువాత సత్వ రజస్తమో గుణములు గల తన శరీరముగా గల ప్రకృతిచే మహత్తు మొదలు పృథ్వి వరకు పరిణమించు స్వభావము గల ప్రకృతిని పరిణమింపచేసి అందు వ్యాపించు శక్తి గల తాను వ్యాపించి స్థూలముగు నామరూపములు గల పదార్థములలో వ్యాపించియుండియు అందరిలో దోషములు అంటనివాడై నిర్గ్ణుడై యుండును. అగ్ని ఆవిర్భవించుటకు కర్ర, తృణము, పర్ణము, శాఖ మున్నగున్నవి అనేకములు భిన్న భిన్న నామ రూపములు గల కారణములుగా కనపడుచుండును. కానీ అన్నింటి నుండి వెలువడు అగ్ని వాటి నామరూపములతో సంబంధము లేక అగ్నిగానే ఉండును. అట్లే పరమాత్మ జీవ శరీరకుడై దేవ మనుష్య తిరియక్ స్థావ రూపములు దాల్చిన ప్రకృతి వికారములయందు ఉండియు తాను తానుగానే ఉండును. పరమాత్మకు శరీరముగా అనగా అధేయమై విధేయముగా నియామ్యముగా ఉన్న ప్రకృతి పురుషుల వలె పరమాత్మకు నానాత్వము గాని వికారము గాని ఉండదు. అతడు ఎప్పుడూ ఏకరూపుడే. అట్లే ప్రకృతి వికారములగు భూతములు అనగా పృథివ్యాధులు వాని సూక్ష్మ రూపములగు శబ్ద స్పర్శాదులు. శ్రోత్రాది ఇంద్రియములు, వాగాది కర్మేంద్రియములు మున్నగు వానిలో జీవుని ద్వారా వ్యాపించి యుండి వాని వాని గుణములను గంధాదులను జీవుని ద్వారా అనుభవించుచుండును. కానీ స్వయముగా అతడు విషయములకు భోక్త కాడు. అంతర్యామి అగుటచే జీవుని ద్వారా పుణ్య అపుణ్య కర్మలు చేయుచుండును గాని తాను జీవునిచే చేయించువాడే కానీ తాను చేయువాడు కాదు. భగవానుడు ఈ లోకంలో నామరూపములతో అవతరించుట, లోకములను సృజించుటకు, వాటిని రక్షించుటకు వారిని ఉజ్జీవింప చేయుటకే గానీ వేరొకటి కాదు. ఆ స్వామి త్రియక్కులలో, దేవతలలో, నరులలో తానొకడుగా దిగివచ్చి
తన కథల చేత తన చేష్టితముల చేత లోకులను రక్షించుండును. భగవానుడు లోకమును సృజించుటకు జీవులతో కూడిన శరీరములను తన రూపముగా స్వీకరించి పురుష రూపమున ఉండును. 11 ఇంద్రియములు, పంచభూతములు కలిసి 16 భాగములతో కూడిన అండమునకు కారణమైన సమిష్టి తత్వమును శరీరముగా స్వీకరించి విరాట్ పురుష రూపుడాయెను. దాని నుండియే బ్రహ్మాండము ఆ బ్రహ్మాండమునందరి కార్యవర్గమును సృజింపబడినవి. ఆ పురుష రూపమునున్న భగవానుడు జలములో శయనించి యోగ నిద్ర సేవించుచుండును. అనిరుద్ధుడు అను పేరు గల ఆ పురుషుని యొక్క నాభిను నాభి అనడి ప్రహదమున అంటే మడుగున పుట్టిన తామర పువ్వు నుండి మరీచ మరీచియాది ప్రజాపతులకు ప్రభువగు చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించెను. మొదట లోక సృష్టి చేయవలెనని కోరికతో భూతేంద్రియాభిమానియగు పురుష రూపమును అనగా అనిరుద్ధ రూపమును స్వీకరించెను. ఈ భగవత్ రూపమే నానా విధములగు అవతారములకు మూల కారణం. సమస్తమైన జగత్తును సృష్టించు చతుర్ముఖుడు పుట్టినది ఈ పురుషుడి నాభికమలమునందే. ఆ రూపము విశుద్ధము సత్వగుణము గలది. వినాశము మొదలగు వికారము లేనిది అది అప్రాకృతము. ఆ అనిరుద్ధ రూపియగు భగవానుని యొక్క అంశాంశ చేతనే దేవాదులు సృష్టింపబడినారు. ఆ పరమ పురుషుడే సహస్ర పాదములతో, భుజములతో, సహస్ర శరీరములతో, శ్రవణములతో, నాసికలతో, కిరీట, అంబర, కుండలాది ఆభరణములతో ప్రకాశించువాడు. దానిని జ్ఞాననేత్రము గల మహాపురుషులు దర్శింతురు. దీని నుండి దేవ తిర్యక్ స్థావరాది నానా రూపములు ఆవిర్భవించినవి. ఆ పరమ పురుషుడే చతుర్ముఖుడు అను శరీరం కలవాడై మొదట సనకాది కుమారులను సృష్టించినాడు. వారు బ్రహ్మచర్యమును అనగా భగవత్ ఉపాసనను చేసిరి. ఆ విధంగా అనిరుద్ధు నుండి మొట్టమొదట వెలబడిన చతుర్ముఖ సనకాదులు భగవానులకు నారాయణి ప్రథమ రూపము.
ఇది అవతారము కాదు. జీవులలో అనుప్రవేశించి తన అంశచే భగవత్ తత్వను ప్రకాశింపచేసిన అనుప్రవేశావతారము. భగవానుని రెండవ అవతారము వరాహ అవతారం. పాతాళమునకు తీసుకొని పోబడిన భూమిని జగత్తు యొక్క అభ్యుదయం కొరకు ఉద్ధరించవలెనని. యజ్ఞ వరాహ రూపమును భగవానుడు స్వీకరించెను. ఇది భగవానుడు ఎత్తిన సాక్షాత్ అవతారం. మూడవ అవతారము. ఋషి రూపమును స్వీకరించి జ్ఞానమును లోకమునకు అందించుటకు విచ్చేసినది. ఆ అవతారమే నారదుడు. ఆ అవతారమందు భగవానుడు దేవ ఋషియగు నారదమునిలో ఆవేశించి పాంచరాత్ర శాస్త్రమును ప్రవర్తింపజేసెను. ఇది కర్మ మార్గమునందు ప్రవర్తించు వారలు ప్రవృత్తి ధర్మమును వీడి నివృత్తి ధర్మమును ఆచరించు విధానమును తెలియజేసినది. ఒక ప్రయోజనమును కోరి కర్మ చేసి ఆ కర్మలచే కలిగిన ఫలమును అనుభవించున ప్రవృత్తి మార్గము. ఏ కోరిక లేకుండా భగవానుడు వసంగిన శరీరముతో భగవానునకు సేవ చేయుటయే కర్తవ్యమని శాస్త్రముతో చేయదగినవి అని చెప్పిన కర్మలను ఫలమునందు ఆసక్తి లేకుండా భగవత్ ఆరాధన రూపంగా చేయుట నివృత్తి ధర్మము. ఈ విధానము పాంచరాత్ర శాస్త్రమున నిరూపింపబడినది. నాలుగవ అవతారం నరనారాయణ రూపం. నరనారాయణులను పేరుతో ఇద్దరు ఋషులుగా అవతరించి ఇంద్రియ నిగ్రహముతో చేయుటకు శక్యము కాని తపస్సు చేసి నారాయణ మంత్రమును లోకమునకు అందించిరి. ఐదవ అవతారం కపిలుడు. ఆత్మ యాధాత్మ్యమును యోగాభ్యాసముచే అనుసంధించి సస్వరూప దర్శనము చేసిన వారికి ఇతడు మార్గదర్శకుడు. మనకు కనబడుచున్న సకల పదార్థములు ప్రకృతి వికారములు. అందులో చైతన్యము గల జీవతత్వం ఉన్నది. శరీరముగా ఉన్న ప్రకృతి వికారములు ఎన్నో ఎట్లు ప్రకృతి నుండి వెలికి వచ్చినవో అనే తత్వ నిర్ణయం చేసిన శాస్త్రము సాంఖ్య శాస్త్రము. ఆ శాస్త్రము కొంత కాలం మరుగున పడినది. అప్పుడు భగవానుడు కపిలుడుగా అవతరించి ఆ శాస్త్రమును అసురికి ఉపదేశించెను. ఆరవ అవతారము దత్తాత్రేయులు.
అత్రి అనడి ప్రజాపతి అనసూయ అనడి భార్య యందు కుమారుడిగా జన్మించవలెనని భగవాన్ని ప్రార్థించెను. అప్పుడు భగవానుడు దత్తాత్రేయ అనే రూపముతో అనసూయ అత్రి మహర్షులకు కుమారుడిగా అవతరించి అధ్యాత్మ విద్యను అర్కునకు ప్రహ్లాదునకు ఉపదేశించెను. ఏడవ అవతారము యజ్ఞుడు రుచి అనువానికి ఆకూతి అనే భార్య యందు యజ్ఞుని పేరుతో జన్మించెను. రుచి అనునతడు యాముడు మొదలగు దేవతలతో స్వాయంభువ మనువద్దమున పరిపాలించెను. ఎనిమిదవ అవతారం నుండి మిగతా భాగాన్ని మనం తరువాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమనారాయణ. స్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Sri Krishna, Krishna, the son of Vrishna, the destroyer of the royal lineage, the one with virility, Govinda, the one who removes the suffering of the gods, the one who is the incarnation of Rahu, the lord of Yogis, salutations to all the Gurus, Lord. Oh Sri Krishna, you are to Arjuna You are a friend, you are the best of the Yadava dynasty, your influence is infinite in destroying the dynasties of kings who think of destruction to the world. Oh Govinda, Gopikas, Devotees sing your glorious praises in groups. Hearing of your arrival, there will be a wedding. Protect your devotees. 12th Canto, 11th Chapter, 25th Prayer. Greetings to all relatives, welcome to the seventh podcast of the first canto of Srimad Bhagavata Tatva Deepika. Vishnu devotees are those who have no jealousy towards the gods and the deities they worship. Those who are mainly Rajas, those who have Rajas nature, worship the ancestors, the ghosts, Rudra, the Prajapatis, Hiranyagarbha, and other gods for wealth, for dominance, and for progeny. The Vedas, in the Purvottara and Poorvottara sections, are about Vasudeva It will be mainly proposed. In the former part, even though sacrifices offered to gods like Agni are proposed, all of them propose the worship of Vasudeva, who is the inner controller among the gods like Agni. Yoga practices and other actions also act towards Vasudeva. The knowledge itself is the offering to Vasudeva. The penance is done for Vasudeva. Dharma is served to Vasudeva. All that is obtained by righteousness is obtained by the grace of Vasudeva. Before creation, Lord Vasudeva, by his will, created the gross world with names and forms.
In those days, before creation, the subtle consciousnesses were united with Vasudeva, and it was as if there was only one. Then, by nature, which has the qualities of Sattva, Rajas, and Tamas, transforming nature, which has the nature to evolve from the great to the earth, and by transforming it, and by transforming oneself, which has the power to pervade, pervading in the substances that have the gross, named, and form He is spread out and does not have faults in everyone, he is without fault. The reasons for the manifestation of fire are various, including wood, grass, leaves, branches, and so on, with different names and forms. But the fire that emanates from all things remains fire without any connection to their name and form. Similarly, the Supreme Being, being in the form of a living being, remains in the forms of gods, humans, and other creatures, and remains as He is. The Supreme Being, being the body, that is, being the supreme, being the subordinate, being the appointed, being the appointed, the Supreme Being has no diversity or distortion. He was always consistent. Similarly, the ghosts that are the distortions of nature, that is, the earthly diseases, their subtle The sounds and touches that make up the physical world. The senses like the ear, the organs of action like the tongue, etc., are pervaded by the soul, and the qualities and smells are experienced by the soul. But he himself is not the enjoyer of the things. Because of being the inner controller, he performs good and bad deeds through the living being, but he is the one who gets it done by the living being, but he is not the one who does it. God incarnating in this world with names and forms, to create worlds, to protect them, to revive them, is not something else. That Swami, among the three, among the gods, among the humans, descended as one
He protects people through his stories and his actions. The Lord, to create the world, accepts bodies with living beings as His form and exists in the form of a male. 11 senses, the five elements together, accepting the collective essence that is the cause of the egg consisting of 16 parts as the body, became the form of the great man. From that, the universe, and in that universe, the workforce of all is created. That Lord, who is in the form of a man, sleeps in the water and performs yoga sleep. And from the navel of that man named Aniruddha, from the lotus flower that was born in the womb, the four-faced Brahma, who was the lord of the Prajapatis Marichi and others, appeared. First, with the desire to create the world, he accepted the form of a man, that is, the form of Aniruddha, who is devoted to the earth and senses. This divine form is the root cause of various incarnations. The four-faced one who created the entire universe was born in this man's navel. That form is pure, possessing the quality of goodness. It is without destruction and other distortions Unmanifest. By the very essence of that unmanifest form of the Lord, the gods were created. That Supreme Being shines with a thousand feet, with shoulders, with a thousand bodies, with ears, with nostrils, with crown, sky, and earrings. It is visited by great men of wisdom. From this, various forms such as Deva, Tiryak, Sthavara, etc., emerged. That supreme being, the four-faced one, having a body, first created the sons of Sanaka. They practiced Brahmacharya, which means devotion to God. In that way, the first to appear from Aniruddha were the four-faced Sanakadu, the first form of Narayani to the Gods.
It's not an avatar. The incarnation of the incarnation, who entered into living beings and illuminated the divine essence through his part. The second avatar of the Lord is Varaha. That the land taken to hell should be raised for the prosperity of the world. The Lord accepted the sacrifice in the form of a boar. This is the direct incarnation of the Lord who has risen. The third incarnation. Having assumed the form of a sage, it came to deliver knowledge to the world. The incarnation is Narada. In that incarnation, the Lord, enraged at the sage Narada, the divine sage, made the Pancharatra scripture prevalent. This explains the method of those who act in the path of karma, abandoning the path of inclination and practicing the path of disinclination. The path of inclination to perform actions desiring a benefit and to experience the fruits of those actions. Without any desire, serving God with a body that is inhabited by God is the duty, and doing the actions that can be done with the scriptures is the duty of renunciation. This method is in the Pancharatra Shastra It is proven. The fourth incarnation is the form of Narayana. Narayana, in the name of Naranarayana, incarnated as two sages and performed penance that was not possible to do with control of the senses, and delivered the Narayana mantra to the world. The fifth incarnation was that of the monkey. He is a guide to those who have connected their soul's identity with the practice of yoga and have had a vision of their true form. All the substances that we see are the distortions of nature. It has the element of life with consciousness. The science that determines the nature of the many distortions of nature that exist in the body and how they came out of nature is Sankhya Shastram. That science was buried for a period of time. Then the Lord incarnated as Kapila and preached that scripture to the Asuras. The sixth avatar is Dattatreya.
Atri, the son of Anadi, Prajapati, Anasuya, the wife, prayed to Bhagavan that she should be born as a son. Then, the Lord, in the form of Dattatreya, incarnated as a son to Anasuya and Atri Maharshis and imparted spiritual knowledge to Arjuna and Prahlada. The seventh incarnation was Yagnaudu, born to Aakuti, his wife, in the name of Yagnuni. Ruchi Anunataadu, along with the gods like Yama, ruled with Swayambhuva Manu. We will learn the rest of the part from the eighth avatar in the podcast later. Jai Shri Ram. Smadgurubhyo Namah