నరకలోక స్థితి మరియు వర్ణన
Condition & Description of the Hellish Planets
శ్రీమద్భాగవతంలోని ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు నరకలోకాల స్వభావాన్ని మరియు స్థితిని వివరంగా తెలియజేస్తారు. పాపకర్మలు చేసిన జీవులు వారి పాపాల తీవ్రతను బట్టి వివిధ నరకలోకాలకు పంపబడతారని, అక్కడ వారు తగిన శిక్షలను అనుభవిస్తారని సవివరంగా వర్ణించబడింది. ఈ బోధ మనకు పాపమార్గం నుండి దూరంగా ఉండాలని మరియు ధర్మంగా జీవించి భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వాలని స్పష్టంగా హెచ్చరిస్తుంది.
In this profound episode of the Srimad Bhagavatham, Shukadeva Goswami reveals to King Parikshit the detailed nature and conditions of the hellish planets as described in the Fifth Canto. The various realms of suffering are vividly described, showing how souls who engage in sinful activities are sent to specific hells suited to the gravity of their transgressions. This sacred teaching serves as both a warning and a guide, reminding us of the importance of righteous living and devotion to the Lord in this human birth.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమోస్తుతే ధ్యాత్మ విదాం పరాత్మనే ధ్యానాత్మనే స్వాత్మ విభక్త మృత్యవే సకారణాకారణ లింగమీయుషే స్వమాయయా సంవృతరుద్ధ దృష్టయే నీవు ఆత్మజ్ఞానులకు అంతరతమమగు ఆత్మవు. కానీ దేహాభిమానికి నీవు నీయుండి మృత్యువును పంపెదవు. మహత్తత్వం మొదలైన కారణ తత్వములు అవ్యక్త మాయా శక్తి నీకు ఉపాధులు. మాయా శక్తి నీకు ఆవరకము కాకున్నాను సంసారుల వివేక దృష్టిని కప్పివేయును. అట్టి నీకు నమస్కారం. టెన్త్ క్యాంటో 86 చాప్టర్ 48 ప్రేయర్. బహుద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. పంచమ స్కంధము 28వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు పరీక్షిత్తునకు శుకుడు వివరించినటువంటి భూగోళ వర్ణనము, ద్వీప వర్ణనము, జ్యోతిర్మండల వర్ణనము. అధోలోక వణనము ముఖ్యంగా సంకర్షణ యొక్క వృత్తాంతాన్ని ప్రార్థనని కూడా మనం తెలుసుకున్నాం. చక్కటి విషయాలు ముందు పాడ్కాస్ట్ లో విని అందరూ కూడా ఆనందించాలని భావిస్తూ ముందు భాగాన్ని మనం తెలుసుకుందాం. పై విషయంలో విన్న తరువాత పరీక్షిత్తు అడుగుతున్నాడు. ఓ మహర్షి, నీవు ఈ లోకములో జీవులు భిన్న భిన్నములుగా సుఖ దుఃఖములను అనుభవింతురు అని చెప్పితిరి కదా. శరీరముతో చేయు కర్మ ప్రవృత్తి ధర్మం అనబడును. ఆ ధర్మము చేతనే ఆయా లోకములలో జన్మించుచుందురు. వారిలో కొందరు సుఖమును, కొందరు దుఃఖమును, కొందరు మిశ్రితమైన సుఖ దుఃఖములను అనుభవించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. దానికి ఋషి ఇటు సమాధానం చెప్పుచున్నాడు. శరీరముతో చేసెడి కర్మ సమానమే అయినను కర్మ చేసెడి జీవుడు సత్వరజస్తమో గుణములు కలవాడిడవుటచే ఆ కర్మ చేయుటలో వారి శ్రద్ధ సాత్వికము రాజసము. తామసమని భిన్నముగా ఉండును. కర్మల చేతనే ఫలం వచ్చినను ఆవరించినప్పుడు వారికి గల శ్రద్ధలో తారతమ్యం వలన ఫలములో భేదం వచ్చుచుండును.
ఆచరించడి కర్మ ధర్మము, అధర్మము అని రెండు విధములు. ధర్మమును ఆచరించుటలో శ్రద్ధలో తారతమ్యముచే ఫలములో భేదము కనిపించును. అట్ల ఇట్లే అట్లే చేయకూడదని నిషేధించిన అధర్మమును అధర్మమునకు కారణము కేవలము తామస శ్రద్ధ. దానిలో కూడా తారతమములు ఉండును. అందుచే అధర్మములచే కలిగెడి దుఃఖములో కూడా తారతమ్యం ఉండును. శరీరమే తానని శరీరముకు చెందినవి తనవని భావించి వాటిపై రాగద్వేషములు జీవులకు కలుగుచుండును. దానిచే శరీరముకు లోనున్న ఆత్మకు కొన్ని సుఖములు కావలెనని కోరికలు కలుగుచుండును. ఈ శరీరముతో ఇంతకంటే గొప్ప సుఖములు అనుభవించవలెనని యజ్ఞ యాగాదులు చేయుచుండును. దానములు చేయుచుండును. అట్లు కోరికలు వేరువేరుగా ఉండును. కోరికలను సాధించుటకు కర్మలు వేరువేరుగా ఉండును. ఆ కర్మలను చేయుటకు శ్రద్ధ భిన్న భిన్నముగా ఉండును. వాని ఫలము అధర్మము యొక్క ఫలమగు దుఃఖమును కూడా ఏకరూపముగా అనుభవింపరు. ధర్మము యొక్క సుఖము ఎట్లు భిన్న భిన్నమో, అధర్మము యొక్క ఫలముగా అజ్ఞానము కలిగి, అహంకార మమకారములు ఏర్పడి, కోరికలు కలిగి ఆయా ఫలములను సాధించుటకు కర్మలు చేయుటచే పాపము కలుగును. ఆ పాపములు భిన్న భిన్నములుగా ఉండును. అవి అనంతములు. పూర్తిగా వర్ణించుటకు శక్యము కాదు. ఆ పాప ఫలములను అనుభవించు స్థానములు అనేకములు. వాడిని అన్నిటినీ నీకు వర్ణించెదను వినుము. భూహు భూవః సువః అనేటి మూడు లోకములకు ఆవలనున్నవా నరకములు లేక మధ్యలోనున్నవా ఆ దేశములు ఎచ్చెడనుండును అని పరీక్షిత్తు ప్రశ్నింపగా శుకుడు ఇట్లు సమాధానం చెబుతున్నాడు. మనం ఇప్పుడు నరకముల యొక్క వణనాన్ని తెలుసుకుంటున్నాం. నరకములు అనేటి దేశములు లేదా లోకములు ఈ మూడు లోకముల మధ్యలోనే ఉన్నవి. అవి దక్షిణం వైపు భూమి క్రింద అండమునకు చుట్టూ ఆవరించుకొని ఉన్న జలములకు పైన ఉన్నవి. ఆ దక్షిణ దిక్కునందే అగ్నిశ్వాత్తులు మొదలగు పితృగణములు ఉండును.
వారు సమాధిలో జ్ఞానముతో తమ గోత్రమున జన్మించిన వారికి క్షేమమును కలిగించుచుందురు. ఆ దిక్కునందే పితృ దేవతలకు అధిపతియగు యముడు వసించి ఉండును. శరీరమును వీడిన జీవులను భగవానుడగు నారాయణుని శాసనమును అనుసరించి యముడు తన భటులచే తన లోకమునకు చేర్పించును. వారు చేసిన పనులలో కొన్ని ఆయా దేశములలో చేయకూడనివి. కొన్ని శాస్త్రములలో నిషేధింపబడినవి ఉండును. వాటిని ఎరింగి వారు చేసిన కర్మలకు దోషములకు అనుగుణముగా దండమును విధించును. అట్టి పాపములు చేసేడి వారు అనుభవించేడి నరకములు 21 యొక్క విధములుగా ఉండునని చెప్పుదురు. వాటి పేర్లు వాటి స్వరూప స్వభావములు వివరింతును. నరక లోకముల పేర్లు. ఒకటి తామిశ్రము, రెండు అంధతామిశ్రము, మూడు రౌరవము, నాలుగు మహారౌరవము, ఐదు కుంభీపాకము, ఆరు కాలసూత్రము, ఏడు అసివ్రతవనము, ఎనిమిది సూకరముఖము, తొమ్మిది అంధకూపము. 10 అసివ్రతనము క్రిమి భోజనము 11 సందంశము 12 తప్తసూర్మి 13 వజ్రకంటక శాల్మరి 14 వైతరిణి 15 పూయోదము 16 ప్రాణరోధము 17 విశసనము, 18 లాలాభక్షము, 19 సారమేయాదనము, 20 అవీచి, 21 అయఃపానము ఇవి కాక వేరు వేరు విధములగు దుఃఖములను అనుభవించు లోకములు కూడా ఉన్నవి. ఒకటి క్షార కర్దమము, రెండు రక్షోగుణ భోజనము, మూడు శూలప్రోతము, నాలుగు దందశూకము, ఐదు అవట నిరోధము, ఆరు పర్యావర్తనము, ఏడు సూచిముఖము. మొత్తము 28 రకముల దుఃఖములను అనుభవించు స్థానములు. ఒకటి తామిశ్రము. ఇది చీకటిగా ఉండును. ఇందులో పరుల ధనము అపహరించిన వారు, పరుల బిడ్డలను దొంగిలించిన వారును, పరుల భార్యలను అపహరించిన వారును ఉందురు. యమపురుషులు దుష్కర పాశములలో బంధించి అతి భయంకరములగు బంధనములతో బిగించి తామిశ్ర నరకములో బలవంతముగా అనుభవింపజేతురు. భోజనము పెట్టరు.
త్రాగుటకు నీరు ఇవ్వరు. కర్రలతో కొట్టుచుందురు, బెదురుచుందురు. ఆ బాధలు అనుభవించుచు జీవుడు దుఃఖముచే మూర్ఛబడి క్రింద పడిపోవుచుండును. రెండు అంధతామిశ్రము. మగవానిని వంచించి వానికి మిత్రుని వలె ఉండి కొందరు వారి భాయలతో రమించుచుందురు. ఆ నరకములో వారిని పడదోసి వివిధములగు బాధలను అనుభవింపచేతురు. వేదనను అనుభవించుచు మతి చెడి చూపు పోయి. చెట్టు మొదలు వేళ్ళు నరకగా నరకగా చెట్టు నేల కూలినట్లు ఒక్కొక్క ఇంద్రియము పోయి పోయి వాడు నేల పడునట్లు చేయును. రౌరవం. నరకం మూడవది. శరీరమే నేనని, శరీరముకు చెందినవి అన్నియు నావని, శరీర పోషణకు, కుటుంబ పోషణకు, ప్రాణులను హింసించుచు, ద్రోహము చేయుచు. ప్రతిదినము ఎవడు తనను తన వారిని పోషించుకొనుచుండునో అట్టివాడు కుటుంబములోని వారు ఎవ్వరూ లేకుండా ఒక్కడు రౌరవు నరకములో పడి బాధపడుచుండును. అతడ సర్పము కంటే క్రూరమైన పెద్ద కొమ్ములు గల రురువు అను పేరు గల జంతువులు కరిచి పొడచి కుమ్మి హింసించును. అందుచే దానికి రౌరవము అందురు. నాలుగు మహారౌరవం. మహారవరములో కూడా వెనుకటి నరకములో వలె రురు మృగముల హింస ఉండును కానీ ఈ నరకములోని మృగములు మాంసమును తినునవి. అవి ఈ పురుషుని పడద్రోసి వాని శరీరమునందలి మాంసమును తినును. మాంసము కొరకే అనేక మృగములను చంపి తన శరీరమును పోషించుకొనెడి వారు ఈ నరకమును పొందుదురు. కుంభీపాకము. శరీర పోషణకు మాత్రమే క్రూరముగా మృగములను, పక్షులను బ్రతికి ఉండగానే కొందరిని కాల్చి తినుచుందురు. దయలేకుండా రాక్షసులు కూడా ఏవగించుకొనునట్టి హింసను వారు చేయుదురు. అట్టి వారిని యముని భటులు కుంభీపాకమున పడవేతురు. పెద్ద కడుపు, సన్నని మూతి గల కుండలో నూనె పోసి మరిగించి ఆ నూనెలో వీరిని పడవేసి ఉడికింతురు. అట్లు కడవలో ఉడికించు నరకము యొక్క నరకము కనుక దీనిని కుంభీపాకమందురు. ఆరు కాలసూత్రం. ఈ నరకము
వేయి యోజనములు విశాలమై ధ్యానం ఉడకబెట్టెడి రాగి తావ వలె ఉండును. తల్లిదండ్రులకు, బ్రాహ్మణులకు ద్రోహము చేసిన వారిని ఇందు పడవేతురు. దీనికి అడుగున అగ్నిచే తాపము, పైన సూర్యుని తాపము తగులుచుండును. వానికి దాహము ఆకలి వేయుచుండును. క్రిందిని మీదిని వేడి తగులుచుండును. బాధపడుచుందురు. వారి దానిలో కూర్చునుచుందురు. పరుండుచుందురు. పరిగెత్తుచుందురు. నిలుచుందురు. అనవర ఆనర పశువునకు ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరములు మరుగుచుందురు. ఏడు అసిపత్ర వనము తనకు విహితమైన వేద మార్గమున నడవక అనవసరముగా వేద బాహ్యమగు నాస్తిక మతముల చేరిన వానిని ఇందు పడవేయుదురు. ఇది ఒక అడవి. ఇందు ఆకులు కత్తుల వలె ఉండును. వెనక నుండి కొరడాలతో కొట్టి. ఆ వనములో వారిని పరిగెత్తిచుందురు పరిగెత్తించుచుందురు. ఇటు నటు పరిగెత్తుచున్నప్పుడు రెండు వైపులా వాడియగు ఆ చెట్ల ఆకులచే వాని అవయవములన్నియు తెగుచుండును. చచ్చితిని చచ్చితిని అని తీవ్రమగు వేదనతో మూర్ఛనంది అడుగు అడుగునా పడిపోవుచు మర లేచిపోవుచు బాధపడుచుండును. ఎనిమిది సూకర ముఖము ఈ నరకములో పడి పంది ముట్టి వంటి వాడియగు మూతిగల జంతువులు ఉండును. తప్పు చేయు వారిని శిక్షించుటకు నియమింపబడిన రాజు గాని అధికారులు గాని శిక్షింపబడదగిన వారిని శిక్షించినను బ్రాహ్మణుని శిక్షింపచేసినను అతనిని ఈ నరకమున పడవేతురు. ఆ నరకములో సూకరములు చాలా బలమైనవి. అవి ఈ పాపము చేసిన వారిని చెరకు కర్ణను నమిలినట్లు నమిలి వేయుచుండును. ఆ బాధ తాలలేక వాడు చాలా బాధపడుచు మూర్ఛనందును. దిక్కు తోచక పరిగెత్తుచుండును. అంధకూపము తొమ్మిదవది. భగవానుడు జీవులందరికీ వారి వారికి వేరు వేరు జీవికలను బ్రతుకు తెరువులను కల్పించినాడు. ఒకరినొకరు హింసించుకొనకుండా జీవించుకొనదగిన వృత్తులు ఉన్నను తనంత తాను ఒకరికి బాధ కలుగునని గుర్తింపక వారిని బాధించి వారి రక్తమును పీల్చి తన జీవనమును గడుపుకొనుచుండును. అట్టి వారిని అంధకూపమున పడవేతురు.
నల్లులు, దోమలు మొదలగు వానిని మనుషులు రక్తము పానము చేయుట జీవికగా కల్పించినాడు. ఆ వృత్తిచే అవి జీవించవచ్చును. వాని బాధను తప్పించుకొనుటకు మనుషులు వానిని చంపకుండా ఉపాయములను చూచుకొనవలెనే కానీ చంపరాదు. వానిని చంపినచో అది మహా పాపం. అట్లు చంపిన వారిని ఈ అంధకూపమును నరకములో పడవేతురు. ఈ నరకము చీకటి నుయ్యి వలె ఉండును. అందు దోమలు, పురుగులు మొదలు సూక్ష్మక్రిములు మనము ఇంతకు మునుగు చంపిన పురుగుల వంటివి ఎన్నియో ఉండును. అవి కాక అనేకములగు పర్శువులను, మృగములను, పక్షులను, పాములను, ఈగలను, దోమలను చంపిన వారిని అవి కరచి హింసించుచుండును. చీకటిలో కుట్టుటచే నిద్ర పట్టదు. ఒకచోట కూర్చునుటకు, నిలుచునుటకు అవకాశం ఉండదు. అట్లు బాధతో ఈ నరకమున అలమటించుచుండును. దీని తరువాత మరికొన్ని నరకాల గురించి తెలుసుకుందాం. ఇవి భయపెట్టాలని కాదు విషయాలు తెలుసుకోవటాని కోసం మనము తప్పనిసరిగా అర్థం చేసుకోవలసినటువంటివి. మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the knower of the Self, the Supreme Self, the meditator, the self-realized, the divided, the cause of death, the cause of all causes, the lingam that is inseparable, the seer of the unseen, You are the Self, the inner Self of those who know the Self. But for the sake of body, you are yourself and send death. The greatness, the beginning, and other causal elements, the unmanifest Maya power, are your resources. Maya Shakti (divine power) has covered you, it covers the wisdom of the world. Greetings to you. Tenth Canto 86, Chapter 48, Prayer. Many relatives, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the 28th podcast episode of Panchama Skandham. Until now, the geographical description, island description, and constellation description explained by Shuka to Parikshit. We have also learned about the story of interaction, especially the low-worldly shivering, and also the prayer. Let's learn about the beginning, thinking that everyone should enjoy listening to the good things in the podcast first. After hearing about the above mentioned matter, Parikshit is asking. Oh sage, in this world, beings are different You said that they experience happiness and sorrow in different ways, didn't you? The karmic tendency to act through the body is called dharma. By that dharma, they are born in those worlds. Some of them asked what is the reason for some experiencing happiness, some experiencing sorrow, and some experiencing mixed happiness and sorrow. The sage is giving this answer. Even if the action done with the body is the same, the being who does the action, being of Sattva, Rajas, and Tamas qualities, their devotion in doing that action is Sattvic, Rajasic. Tamasic is different. Even if the fruit comes through karma, when it is controlled, there is a difference in the fruit due to the difference in their devotion.
The karma is of two types, namely, adharma and adharma. In practicing dharma, differences in results are seen due to differences in devotion. Thus, it is forbidden to do so and so, the unrighteousness that is prohibited, the cause of unrighteousness is only Tamasic devotion. There will be a difference in that too. Therefore, even in the sorrow caused by unrighteousness, there is a difference. The body is the body, considering what belongs to the body as one's own, and feeling attachment and aversion towards it, these feelings arise in beings. Because of that, the soul within the body desires some pleasures. With this body, they perform yagnya and yagadi so that they can experience greater pleasures than this. Giving alms. Thus, desires are different. The karmas are different to achieve the desires. The attention to perform those karmas will be different. They do not experience the fruit of unrighteousness, the fruit of sorrow, in the same way. How the happiness of dharma is different, as the fruit of unrighteousness, having ignorance, having ego and possessiveness, having desires, by doing karmas to achieve those fruits Sin will be found. Those sins will be different. They are endless. It is beyond description. There are many places to experience the consequences of that sin. I will describe him to you, listen. Bhoohu, bhuvaah, suvaah, are they located in the three worlds? Are they in the middle without hells? Where are those countries located? When Parikshit asked this, Shuka is answering thus. We're learning about the screams of hell now. Hells are countries or worlds that exist between these three worlds. Those are above the waters that surround the earth's crust in the south. In that southern direction, there are Agnishvattas and other ancestral deities.
They will bring well-being to those born in their clan with wisdom in the grave. In that direction, Yama, the lord of the ancestors, resides. The beings who have abandoned their bodies, following the command of Lord Narayana, Yama will send them to his world by his servants. Some of the things they did were things that should not have been done in those countries. Some are prohibited in some scriptures. They will impose punishment according to the deeds and faults done by the Erangi. They say that the hells experienced by those who commit such sins will be in the manner of 21. I will explain their names and their characteristics. The names of the hells. One, Tamisramshu; two, Andhatamisramshu; three, Rauravam; four, Maharauravam; five, Kumbhipakam; six, Kalasutram; seven, Asivratavanam; eight, Sukaramukham; nine, Andhakupam. 10. Asivratanamu Krimi Bhojamu 11. Sandamshamu 12. Taptasurmi 13. Vajrakantaka Shalmari 14. Vaitarini 15. Puvodamu 16. Pranarodhamu 17. Visanamu, 18. Lalabhakshamu, 19. Sarameyadanamu, 20. Avichi, 21. Ayahapanamu. Apart from these, there are others There are also worlds where different kinds of sorrows are experienced. One, alkaline cardamom; two, Rakshoguna Bhojam; three, Shulaprothamu; four, Dandasukamu; five, Avatar Niruddhamu; six, Parivartanamu; seven, Suchimukhamu. The total number of places where one experiences 28 types of suffering. One is Tamil. It's going to get dark. In this, there are those who steal the wealth of others, those who steal the children of others, and those who kidnap the wives of others. The Yamapurushas bind in the most terrible bonds, tighten with very terrible bonds, and forcefully make them experience in their own hell. They don't serve food.
They don't give water to drink. They beat with sticks, they are afraid. The being, experiencing those sufferings, faints with sorrow and falls down. Two blind men. Some people, deceiving men, act like friends to them and enjoy their company. They cast them into hell and subject them to various kinds of suffering. Experiencing pain, the mind is lost and gone. As the tree's roots are cut off, the tree collapses to the ground, and each sense goes away, making him fall to the ground. Hell is the third. The body is me, and all that belongs to the body is me. For the nourishment of the body, for the nourishment of the family, torturing creatures, betraying. Every day, whoever nourishes himself and his family, without anyone in the family, will be alone, suffering in hell. He, more cruel than a serpent, with large horns, animals called Ruru, bite and torture Kummi. Therefore, it is called Raurava. Four great powers. Even in the great flood, like in the previous deluge, there was the cruelty of the animals It is, but the beasts in this hell eat meat. They will cast this man out and eat the flesh of his body. Those who kill many animals for meat and feed on their bodies will attain this hell. Kumbhipaka. Only for body nourishment, cruelly, they kill animals and birds while they are still alive and burn some of them. Without mercy, even demons inflict such violence that they cannot be tolerated. Yama's servants throw them into Kumbhipaka. They pour oil into a pot with a large belly and a narrow mouth, boil it, and then put them in the oil and cook them. Thus, the hell that is cooked in the pot, therefore, this is called Kumbhipaka. The six-step formula. This hell
A thousand yojanas wide, a meditation that boils like a copper pot. They throw out those who have betrayed their parents and Brahmins. Below this, the heat of fire, and above, the heat of the sun, are felt. He will be thirsty and hungry. The bottom and the top are getting hot. They are suffering. They are sitting in it. They run. They run. They stand. As many hairs as a wild animal has, they will be hidden for thousands of years. Seven, the forest of letters, not walking in the prescribed path of the Vedas, unnecessarily, those who have joined the atheistic religions that are outside the Vedas, will be thrown into this. It's a jungle out there. The leaves of this are like swords. From the back with whips. In that forest, they run them, they make them run. When the actor runs this way, his limbs are being cut by the leaves of the trees on both sides. I am dead, I am dead, with intense pain, fainting, falling step by step, waking up, and suffering. Eight pig-faced demons fell into this hell There are animals with a snout like a muddy mouth. If a king or officials appointed to punish those who make mistakes punish those who deserve punishment, or if a Brahmin is punished, they will throw him into this hell. The jaws of the crocodile are very strong. They will eat those who have committed this sin, as if they have chewed sugarcane. Unable to bear that pain, he fainted. Running in circles, not knowing where to go. The ninth is the dark cave. God has provided different livelihoods and means of sustenance for all living beings. Even though there are professions that allow one to live without harming each other, without recognizing that it causes pain to oneself, he harms them, sucks their blood, and lives his life. They cast them into the abyss.
He has made it a necessity for humans to drink blood, including rivers, mosquitoes, and so on. They can live by that profession. To avoid his suffering, people should try to find ways to kill him, but not to kill him. It is a great sin to kill a man. Thus, those who are killed are thrown into this dark pit, into hell. This hell will be full of dark wells. Therefore, there are many microorganisms, starting from mosquitoes and insects, like the insects we have killed before. Besides that, they will bite and torment those who kill many kinds of people, animals, birds, snakes, flies, and mosquitoes. “Sleep is elusive in the dark. There is no opportunity to sit or stand in one place. Thus, suffering, this hell is tormented. Let's learn about some more ghats after this. These are not to scare, but to understand things, which we must understand. We will meet again. Jai Srimannarayana. Salutations to the Asmadgurus