పరశురాముడు, జమదగ్ని మరియు విశ్వామిత్రుడు – నవమ స్కంధం భాగం 9

Parashurama, Jamadagni & Vishwamitra – Navama Skandha Part 9

bhagavatam

ఈ ప్రవచనంలో చంద్రవంశ వర్ణనలో భాగంగా రుచీకుని చరువుల కథ, జమదగ్ని జన్మవృత్తాంతం వివరించబడ్డాయి. కార్తవీర్యార్జునుడు జమదగ్ని కామధేనువును అపహరించడంతో పరశురాముడు అతనిని వధించిన కథ వివరించబడింది. తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లిని, సోదరులను వధించి, తండ్రి అనుగ్రహంతో వారిని తిరిగి బ్రతికించిన వృత్తాంతం చెప్పబడింది. కార్తవీర్యుని కుమారులు జమదగ్నిని హత్య చేయడంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియులను సంహరించి శమంతపంచకమును ఏర్పరచెను. చివరగా విశ్వామిత్రుని కుమారుల శాపం, సునశ్శేపుని దేవరాతుడుగా స్వీకరించిన కథ వివరించబడింది.

This discourse from the Navama Skandha covers the lineage of the Chandravamsha and the story of Ruchika, whose mixed charus led to the birth of Jamadagni. It then narrates the tale of Parashurama, who slew Kartaviryarjuna after he stole Jamadagni's Kamadhenu, and later killed his own mother and brothers on his father's command, only to have them revived. After Kartaviryarjuna's sons murdered Jamadagni in revenge, Parashurama annihilated the Kshatriya race 21 times, forming the five pools of blood known as Shamantapanchaka. The session concludes with the story of Vishwamitra, his curse upon his elder sons, and the adoption of Shunahshepa (Devarata) into his lineage.

← Prev Next →
Parashurama, Jamadagni & Vishwamitra – Navama Skandha Part 9 bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః రజనీకరః ఖలు శీతో రజనీకరా చందనో మహా శీతః రజనికర చందనాభ్యాం సజ్జన వచనాని శీతాని చందమామ చలన చందమామ కంటే కడు చలన చందనం చందమామ కంటేను చందనం కంటేను కడు చల్లగా ఉంటాయి మంచి వారి మాటలు. ఆర్యోక్తి 14th. భగవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వ దీపిక. నవమ స్కంధము తొమ్మిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు సుకన్య చరిత్ర, అంబరీష ఉపాఖ్యానం, ఇక్ష్వాకు వంశ వర్ణనం దానిలో భాగంగా హరిశ్చంద్రుని కథ, సగరుని కథ. తరువాత శ్రీరామచంద్రుని యొక్క కథ ఆ తరువాత నిమి వంశం యొక్క వృత్తాంతము పురూరవుడి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకొని ముందు భాగంలో మనం వెళ్తున్నాం. కృతయుగమున సర్వ వాక్కులకు బీజమగు ప్రణవరూపముని వేదముండెను. నారాయణుడు ఒక్కడే దేవుడుగా ఉండెను. ఇతర దేవతలు లేరు. అగ్ని కూడా ఆనాడు ఒక్కటియే అయి ఉండెను. ఈ లోకములో వర్ణము కూడా ఒక్కటియే ఉండెను. త్రేతాయుగమున పురూరవునిచే మూడు వేదములు ఆవిర్భవించెను. అప్పుడు పురూరవుడు కర్మ మార్గమును లోకమున ప్రకటించెను. పురూరవుడు ఆ అగ్ని అను పుత్రునిచే గంధర్వ లోకమును పొందెను. ఆ పురూరమునకు ఆరుగురు కుమారులు. ఇట్లు చంద్రవంశం విస్తరించి లోక రక్షణమును ధర్మ రక్షణమును గావించినది. ఆ వంశమున జహ్ను జన్మించినాడు. అతడే గంగను భగీరథుడు తెచ్చుండగా పానము చేసి మరల వదిలెను. అందుకే గంగకు జాన్హవి అని పేరు వచ్చినది. ఆ వంశముననే కుశునకు కుశాంబుడు మొదలగు నలుగురు కుమారులు కలిగిరి. అందు కుశాంబునకు గాధి అను కుమారుడు సత్యవతిని కుమార్తె కలిగిరి. ఆ సత్యవతిని భృగువంశమందలి రుచీకుడు తనకు భార్యగా వసంగుమని యాచించెను. అప్పుడు గాధి

అతడు ఆమెకు తగిన వరుడు కాదని ఒకవైపు నల్లగా చెవి ఉండి మిగిలిన శరీరమంతయు తెల్లగా ఉండెడి గుర్రములను వేయి నొసంగ వలెను కోరెను. రుచియుకుడు అది విని వరుని వద్దకు వెళ్లి యాచించి అట్టి అశ్వములను పొంది తెచ్చి ఇచ్చి ఆమెను వివాహమాడెను. ఒకప్పుడు ఆ రుచియుకుని భార్య అగు సత్యవతి ఆమె తల్లి కూడా సంతానం కలుగునట్లు చేయమని ఆర్ధించిరి. అప్పుడు ఆ రుచీకుడు బ్రహ్మ మంత్రములతో చరువు వండి భార్యకు ఇవ్వవలెననియు క్షాత్ర మంత్రములతో మరియొక చరువును అత్తగారికి ఇవ్వవలెననియు సిద్ధము చేసి ఉంచి స్నానము చేయుటకు వెళ్ళెను. అంతలో సత్యవతి తల్లి సత్యవతి కొరకు సిద్ధము చేసిన చరువును కుమార్తెను అడిగి తాను భక్షించెను. తల్లికై సిద్ధము చేసిన చరువును సత్యవతి భక్షించెను. రుచీకుడు స్నానము చేసి తిరిగి వచ్చి ఈ విషయం ఎరింగి చాలా తప్పు చేసితివి. చర్వులలో ఒకరి ఒకరిదొకరు భక్షించినారు. మీ అమ్మకు నేను సోదరుడుగా మీ అమ్మకు నీకు సోదరుడుగా లోక శిక్షకుడగు ఘోరమైన స్వభావము గల ఒక బ్రహ్మవేత్త జన్మించును. అని పలికెను. సత్యవతి అట్లు జరగకుండా చేయమని ప్రార్థించెను. కుమారుడు శాంతుడు జన్మించినను కానీ మనుమడు ఘోర స్వభావుడు, లోక హింసకుడు జన్మించునని చెప్పెను. అట్లే ఆమెకు శాంతుడుగా జమదగ్ని జన్మించెను. సత్యవతి కౌశికి కౌశికి అను పేరు గల నదిగా మారి లోక పావనాయెను. సత్యవతి కౌశికి అను పేరు గల నదిగా మారి లోక పావని ఆయెను. జమదగ్ని రేణు యొక్క కుమార్తెయగు రేణుకను వివాహమాడెను. ఆమెకు వాసుదేవాంశమున రాముడు జన్మించెను. అతనిని పరశురాముడు అందురు. అతడు క్షత్రియులు రాజసులై లోకమును బాధించుట చూచి సహింపలేక 21 సార్లు పరశువును ధరించి అంతమొందించెను. హైహయ వంశమును సంహరించెను. ఆ హైహయులకు అధిపతి పురుష శ్రేష్టుడు కార్తవీర్యార్జునుడు. అతడు నారాయణాంశ సంభూతుడగు దత్తాత్రేయుని ఆరాధించి వెయ్యి బాహులను పొందెను.

యోగేశ్వరత్వమును పొందెను. ఎవరిను ఎదిరించలేని శక్తిని పొందెను. ఇట్లు సకల శుద్ధులను ఆర్జించి లోకములో అడ్డులేని వాడై సంచరింపసాగెను. ఒకనాడు సుందరులగు స్త్రీలతో వైజయంతి మాలను దాల్చి రేవాని జలములో విహరించుచుండెను. తన వెయ్యి బాహులతో ఆ నది ముందుకు సాగకుండా అడ్డగించెను. రావణాసురుడు ఆ సమయమున కార్తవీర్యార్జుని పట్టణమగు మహిష్మతి నగరమునకు సమీపమున నదీ తీరమున దేవతారాధన చేయుచుండెను. కార్తవీర్యార్జునుడు అడ్డగించుటచే నర్మదా నది పొంగి అతని ఆశ్రమమును ముంచివేసెను. రావణుడు ఆగ్రహముతో ఆ అర్జునుని తన పిడికిలితో పట్టుకొని స్త్రీల ముందు కోతిని పట్టుకొని లాగుకొని వచ్చినట్లు పట్టణమునకు తెచ్చి వదలెను. ఒకనాడ అర్జునుడు అంటే కార్తవీర్యార్జునుడు వేటకై అరణ్యమునకేగెను. అనుకొనకుండా జమదగ్ని ఆ రాజునకు తన అతని పరివారమునకు తన కామధేనువుచే కల్పింపబడిన పదార్థములతో విందు చేసెను. కార్తవీర్యార్జునుడు తనకంటే అధికమగు శక్తులు గలవాడు జమదగ్నిని అసూయపడి అతని హోమధేనువును తన సైన్యముచే బలాత్కారముగా పట్టణమునకు తీసుకొని పోయెను. అతడు వెళ్ళిన తరువాత పరశురాముడు ఆశ్రమమునకు వచ్చెను. ఆ అర్జునుని దుండగము సహింపలేక పరశును దాల్చి ఆ అర్జునుని వెంబడించెను. అతనిని అర్జునుడు గజ తురగ పదాతులతో పదునేడు అక్షోహిణీల సౌన్యముతో ఎదిరించెను. కానీ పరశురాముడు ఒక్కడే అందరినీ సంహరించెను. కార్తవీర్యార్జునకు తీవ్రమవు కోపం వచ్చెను. 500 ధనుస్సులను ఒకేసారి సంధించి పరశురామును ఎదిరించెను. పరశురాముడు అన్ని ధనుస్సులను ఒకేసారి ఛేదించెను. అప్పుడు అర్జునుడు పర్వతములను వృక్షములను తన వెయ్యి చేతులతో పట్టుకొని అతనిపై ప్రయోగింప సిద్ధపడెను. పరశురాముడు వెయ్యి బాహులను ఛేదించెను. శిరస్సును ఖండించెను. తండ్రిని పరశురాముడు చంపుట చూచి సహింపలేక అతని కుమారులు కామధేనువును దూడను తెచ్చి పరశురామునికి సమర్పించిరి.

ఆ ఆవును తెచ్చి పరశురాముడు తండ్రికి సమర్పించెను. జమదగ్ని, పరశురాముడు రాజులను చంపినాడని విని రామా తప్పు చేసితివి. భూపాలులు సర్వదేవతా స్వరూపులు. ముర్ధాభిషక్తుడగు రాజును చంపుట బ్రహ్మహత్య కంటే పాపిష్టమైనది. బ్రాహ్మణునకు క్షమాగుణం ప్రధానము. ఆ క్షమాగుణము చేతనే బ్రహ్మ ఆ పదవిని పొంది ఉన్నాడు. బ్రహ్మ తేజస్సు క్షమచేతనే ప్రకాశించును. క్షమాగుణము కలిగినచో సర్వేశ్వరుడు శ్రీహరి సంతుష్టి నొందును. గంగాది తీర్థములను సేవించి ఆ పాపమును ప్రక్షాళనము చేసుకొనుము అని ఆదేశించెను. తండ్రి ఆజ్ఞను అనుసరించి ఒక సంవత్సరము తీర్థయాత్ర చేసి పరశురాముడు మరల ఆశ్రమమునకు వచ్చెను. ఒకనాడు తల్లి రేణుక జలము తెచ్చుటకు గంగకేగెను. ఆ జలములో చిత్తరథుడు అను గంధర్వుడు విహరించుచుండగా చూచి ఆమె మనస్సు వానిపై నిలచి భర్తకు అగ్నిహోత్ర సమయం అవుచున్నదని మరచి ఆలస్యము చేసెను. సమయం మించినది. జమదగ్ని తప్పక శపించును అని భయపడి ఆమె జలపూర్ణము కలసెను. భర్త ఎదురుగా నుంచి చేతులు జోడించి నిలిచెను. ఆమె మనసు చిత్తరథునిపై కోరిక కలదాయను అని ఎరింగి జమదగ్ని ఆమె మానసిక వ్యభిచారమునకు ఆమెను చంపుడు అని కుమారులను ఆజ్ఞాపించెను. ఆ కుమారులు తల్లిని చంపలేకపోయిరి. తల్లిని సోదరులను కూడా చంపమని జమదగ్ని పరశురామునకు ఆదేశించెను. పరశురాముడు తండ్రి తప ప్రభావము నెరింగినవాడు. చంపుట వలెన తాత్కాలికముగా బాధ కలుగునే కానీ శక్తి సంపన్నుడగు తండ్రి మరల వారినందరినీ బ్రతికించును. పితృ వాక్యమును పాలింపనిచో నేను పతితుడనగునుదును. శాపమును పొందుదును అని భావించుటచే ధర్మమును వసరించి తల్లిని సోదరులను చంపెను. జమదగ్ని సంతోషించెను. నీకేమి కావలనో కోరుకొనుము అనగా చనిపోయిన వారు మరల బతుకున్నట్లు వారిని చంపినట్లు వారికి జ్ఞాపకం లేనట్లును చేయమని కోరెను.

అతను అట్లే అనుగ్రహించెను. వెంటనే వారందరూ నిద్రపోయి లేచినట్లు లేచిరి. పరశురాముడు చంపిన వృత్తాంతమే వారికి గుర్తులేదు. తండ్రి మహాత్మ్యము ఎరింగిన పరశురాముడు ఇట్లు మాతృ భ్రాతృ వధ చేసి పాపమంటకుండు ధార్మికుడై నిలిచెను. కార్తవీర్యార్జున కుమారులు తమ తండ్రిని చంపిన వైరము మరువలేక పరశురామునిపై పగపట్టి ఉండిరి. ఒకనాడు పరశురాముడు సోదరులతో ఆశ్రమమును లేని సమయము చూచి ఆశ్రమములో ప్రవేశించి రేణుక ప్రార్థించుచున్నను వినక జమదగ్నిని చంపి శిరస్సును పట్టుకొని పోయిరి. రేణుక, రామా, రామా రక్షించుము అని మొరపెట్టిన కేక విని పరశురాముడు తొందరగా ఆశ్రమమునకు వచ్చెను. వెంటనే చనిపోయిన తండ్రిని చూచి సహింపలేక తన సోదరులకు తండ్రి కళేబరమును అప్పగించి మహిష్మతీపురమునకు వెళ్లి కార్తవీర్యుని కుమారులను చంపెను అంతేగాక 21 సార్లు దుఃఖావేశముతో కడుపు బాదుకొని 21 సార్లు రామా రక్షించు అని అన్నదని 21 సార్లు క్షత్రియులను వధించెను ఆ క్షత్రియ దేహమున నుండిన కాలిన రక్తము ఐదు మడుగులు ఏర్పడినవి. దానికే శమంత పంచకము అని పేరు కలిగెను. తరువాత పరశురాముడు తన తండ్రి శిరమును తెచ్చి శరీరముతో చేర్చి యజ్ఞమును చేసి సర్వ దేవతా సమారాధనము గావించెను. యజ్ఞాంతమందు భూమినంతను పృత్విక్కులకు దానము ఇచ్చి అవభృద స్నానము చేసి సకల పాప నిర్ముక్తుడై సరస్వతి నది వద్ద ప్రకాశించుచుండెను. జమదగ్ని స్మృతి రూపమగు శరీరమును పొంది సప్తఋషి మండలములో ఒకడై ప్రకాశించుచుండెను. పరశురాముడు కూడా రాబోవు మన్వంతరమున వేద ప్రవర్తకుడు కాగలడు. ఇప్పటికిని అతడు మహేంద్ర పర్వతమునందు ప్రశాంత చిత్తుడై ఒక విఖ్యాతుడై ప్రకాశించుచున్నాడు. శ్రీహరి లోకమునందలి రాజస భారమును తొలగించినాడు. గాధి కుమారుడు విశ్వామిత్రుడు. అతడు క్షత్రియత్వమును వీడి తపస్సుచే బ్రహ్మ వర్చస్సును పొందెను. విశ్వామిత్రునకు 101 మంది కుమారులు అందు మధ్యముడు మధుచ్చందుడు. అతని పేరుతో అందరినీ మధుచ్చందనులు అందురు.

ఒకప్పుడు హరిశ్చంద్రుని కుమారుడగు రోహితుడు యజ్ఞ ప్రాయశ్చిత్తముకై ఒక నరుని పశువుగా కల్పించవలెనని ప్రయత్నించుచు బృగువంశుడగు అజగీర్తుని వద్దకు వెళ్ళెను. అతని కుమారుడు సునశ్షేపుడు ముగ్గురిలో నడిమివాడు. తండ్రి, తల్లి జ్యేష్ఠుని, కనిష్టుని వదలలేము అనుటచే మధ్యముడు కొనసేపునుడు రోహితుని వెంట వచ్చెను. విశ్వామృతుని ప్రార్థించి మంత్రమును పొంది. దేవతల అనుగ్రహముచే యజ్ఞమున పశువుగా వసంగబడియు అతడు బ్రతికెను. అందుచే సునసేపునకు దేవరాతుడు అని పేరు. విశ్వామిత్రుడు తన మంత్రోపదేశముచే బ్రతికిన సునసేపుని కుమారునిగా ప్రేమించెను. తన నూరుగురు కుమారులలో మొదటి యాభై మందిని ఆ సునసేపుని జ్యేష్ఠునిగా స్వీకరింపుడని విశ్వామిత్రుడు శాసించెను. కానీ వారు నిరాకరించి విశ్వామిత్రునికి కోపం వచ్చి మదచ్చందుడు అని మధ్యమ కుమారునకు ముందున్న యాభై మంది మ్లేచ్ఛులగుదురు గాక అని శపించెను. మదచ్చందుని తరువాత ఏబది మంది తండ్రి ఆదేశమును పాలించి సునసేపుని తమకు జ్యేష్టునిగా స్వీకరించిరి. ఆ సునసేపుడు మంత్ర ద్రష్ట విశ్వామిత్ర సంతతి రెండు వర్గములైనది. అందొక వర్గమునకు దేవరాతుడు జ్యేష్ఠుడై వంశకర్త ఆయను. ఇంతటితో మనకు పరశురాముని యొక్క చరిత్ర విశ్వామతుని యొక్క కొంత విషయము మనం పూర్తి చేసుకున్నాం. ఈ తరువాత మనం యాది చరిత్రాన్ని మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. The moon is the coolest. Sandalwood is the coolest. The moon is the coolest. With sandalwood, the words of good people are cool. The moon is cooler than the moon. Sandalwood is cooler than the moon. Sandalwood is cooler than sandalwood. Good people are very cool Words. Aarohi 14. Oh, devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the ninth podcast episode. Until now, Sukanya Charitra, Ambarisha Upakhyanam, Ikshvaku dynasty description, as part of that, the story of Harishchandra, the story of Sagara. Then, the story of Sriramachandrudu, and then the account of the Nimi dynasty, after learning about Pururava's account, we are moving forward. In the Krita Yuga, the Vedas were the seed of all speech, the form of Pranava. Narayana is the only God. There are no other gods. Fire was also one of them. In this world, even caste was one. In the Treta Yuga, the three Vedas were manifested by Pururava. Then Pururava proclaimed the path of Karma in the world. Pururavudu, by the son named Agni, the Gandharva world He received. That Pururama had six sons. Thus, the Chandravamsha expanded and protected the world and dharma. Jahnu was born in that lineage. He himself, while Bhagiratha was bringing Ganga, drank it and then released it again. That is why the Ganges is named as Janhavi. In that lineage, Kushan, Kushambu, and four other sons were born. Therefore, Gadhi, the son of Kushambhu, had a daughter with Satyavati. That Satyavati, the beautiful woman from the Bhrigu dynasty, asked that he marry her as his wife. Then Gadhi

He thought that he was not a suitable groom for her, and that he should have a horse with a black ear on one side and the rest of the body white. The one who was pleased heard that and went to the groom, begged, obtained such horses, brought them, gave them, and married her. Once upon a time, Satyavati, the wife of Ruchi, and her mother also prayed to God to grant them children. Then that cook, having prepared with Brahma mantras to cook a meal and give it to his wife, and with Kshatra mantras to give another meal to his mother-in-law, went to take a bath. Meanwhile, Satyavati's mother asked her daughter for the food prepared for Satyavati and ate it herself. Satyavati ate the food that was prepared for the mother. Ruchiku, after taking a bath and returning, said that Erngi had made a big mistake. In the rituals, they devoured each other. To your mother, as a brother, to your mother, as a brother to you, a Brahmin scholar with a terrible nature, who is the teacher of the world, will be born. He said so. Satyavati, so that it doesn't happen like that He prayed. Even though the son was born peaceful, he said that the grandson would be born with a terrible nature and a violent temperament. Similarly, Jamadagni was born to her as a peaceful being. Satyavati became a river named Kaushiki, and Kaushiki became a river. Satyavati, having become a river named Kaushiki, became the savior of the world. Jamadagni married Renu, the daughter of Renuka. She was born as Rama in Vasudeva Samhita. He is taken by Parashurama. He, unable to bear seeing the Kshatriyas, the kings, and the world being troubled, wore the Parashu 21 times and destroyed them. Slayed the Haihayas. The lord of the Haihayas was Purusha Shrestha Kartaviryarjuna. He worshipped Dattatreya, who is a part of Narayana, and attained a thousand arms.

Yogeswaratvam ani podhinchinaadu. He gained the power to resist no one. Thus, having attained all purity, he began to wander in the world, without any obstacles. Once upon a time, a beautiful woman, wearing a Vaijayanti garland, was frolicking in the Revani water. With his thousand arms, he blocked the river from moving forward. Ravanasura, at that time, was performing the worship of the deities on the banks of the river near the city of Mahishmati, which is the city of Kartaviryarjuna. Kartikeya, by obstructing, the Narmada river overflowed and submerged his hermitage. Ravana, with anger, grabbed Arjuna with his fist, brought a monkey in front of the women, dragged it, and brought it to the town and released it. Once upon a time, Arjuna, that is, Kartavirya Arjuna, went to the forest for hunting. Without expecting, Jamadagni, to that king, to his family, with the substances created by his Kamadhenu, he feasted. Kartaviryarjuna, jealous of Jamadagni, who had more powers than him, forcibly took his homadhenu to the town with his army. He went Parashurama then arrived at the hermitage. Unable to bear Arjuna's mischief, he disguised himself as a Parashu and followed Arjuna. Arjuna, along with his elephants and infantry, fought him with the strength of Akshauhini. But Parashurama was the only one who killed all of them. Kartikeya became very angry. He joined 500 arrows at once and confronted Parashurama. Parashurama cut down all the arrows. Then Arjuna, holding the mountains and trees with his thousand hands, was ready to attack him. Parashurama cut off a thousand arms. He cut off the head. Unable to bear to see his father Parashurama killed, his sons brought Kamadhenu, the calf, and offered it to Parashurama.

Parashurama brought the cow and offered it to his father. Jamadagni, hearing that Parashurama killed the kings, Rama, you have done wrong. The Bhupalas are the manifestations of the gods. Killing a king who is a usurper is worse than Brahmahatya. For a Brahmin, humility is supreme. By the quality of forgiveness, Brahma attained that position. The radiance of Brahma shines forth from the forgiveness of the heart. If one has the quality of forgiveness, then the Lord of all, Sri Hari, will be pleased. He ordered to serve the Ganges and other sacred waters and to wash away that sin. Following his father's command, Parashurama made a pilgrimage for a year and returned to the hermitage. Once upon a time, mother Renu went to the Ganges to fetch water. While Chitrarathudu, a Gandharva, was frolicking in that water, she, seeing him, stood on her mind on him and forgot that it was the time of Agnihotra for her husband and delayed. It was over. Fearing that Jamadagni would surely curse her, she became restless. The husband stood before her, joining hands. She, Jamadagni, said that her mind was filled with desire for the chariot He commanded his sons to kill her for incest. The sons were unable to kill the mother. Jamadagni ordered Parashurama to kill his mother and brothers as well. Parashurama was the son of Tapasya. It is temporary to kill, but the mighty father will revive all those who are dead. If I do not follow the words of my father, I will be a sinner. Thinking that he would receive a curse, he practiced dharma and killed his mother and brothers. Jamadagni was pleased. He asked to be asked what you want, meaning to be as if the dead are alive again, as if they are killed, as if they do not remember.

He was so kind. Soon, they all woke up as if they had already fallen asleep. They do not remember the story of Parashurama killing them. Parashurama, who knew the greatness of his father, thus, having killed his mother and brother, stood as a righteous man, without sin. The sons of Kartavirya Arjuna, unable to forget the enmity that killed their father, held a grudge against Parashurama. Once, Parashurama, seeing that there was no shelter for his brothers, entered the shelter and, not listening to Renu's prayer, killed Jamadagni and took his head. Renu, Rama, Rama, protect me, hearing this cry, Parashurama quickly came to the hermitage. Unable to bear seeing his father who had died immediately, he handed over his father's corpse to his brothers and went to Mahishmatipuram and killed the sons of Kartavirya. Moreover, he beat his stomach with sorrow 21 times and said, 'Rama, protect me 21 times.' And having said that, he killed the Kshatriyas 21 times. The burnt blood from that Kshatriya's body formed five ponds. It is also called Shamant Panchakam. After Parashurama brought his father's head, joined it with his body, performed the Yagnya (sacrifice), and performed the worship of all the gods. At the end of the Yagnya, after giving donations to all the creatures on the earth, he bathed and was freed from all sins, and he was shining near the Saraswati River. Jamadagni, having obtained the body in the form of memory, shone as one among the seven sages. Parashurama will also be a Vedic scholar in the coming Manvantara. Even now, he is shining, famous, and calm in the Mahendra mountain. Srihari removed the luster from the world. Gadhi's son was Vishwamitra. He abandoned his Kshatriya nature and through penance attained the glory of Brahma. Vishvamitra had 101 sons, among them Madhucchandudu was the middle one. Everyone is called Madhuchandana by his name.

Once upon a time, Rohita, the son of Harishchandra, tried to get a human as an animal for the sake of atonement for a yagna, and went to Ajageerthu, who belonged to the Bhrigu dynasty. His son, Sunashsepu, was middle among the three. Father, mother, and elder brother could not leave the younger brother, so the middle brother Konaseepu came along with Rohita. Vishwamrutan prayed and obtained the mantra. By the grace of the gods, he was sacrificed as an animal in the yajna and he survived. Therefore, Sunasena was named Devaratudu. Vishwamitra loved the son of Sunashepa, who lived by his teachings. Vishwamitra ordered that the first fifty of his hundred sons be accepted as the eldest son of that son. But they refused, and Vishwamitra became angry and cursed, saying that Madachandudu, the middle son, should be the fifty Mlecchas who were in front of him. After Madachandu, the father of eighty people, obeying his orders, they accepted Sunasepu as their eldest son. That Sunasepudu, the seer of mantras, the descendants of Vishwamitra, two It is a category. For one category, Devarathudu is the eldest and the heir. With this, we have completed the history of Parashurama and some information about Vishwamatu. After this, let's learn about the history of Yadi in another podcast. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.