హరిణి దేహత్యాగం - భరతుని పునర్జన్మ

The Deer's Death & Bharata's Rebirth

bhagavatam

శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని ఈ గాఢమైన ఘట్టంలో, మహారాజు భరతుడు అమితంగా ప్రేమించిన హరిణి మరణం మరియు దాని ఫలితంగా అతనికి కలిగిన పునర్జన్మను వివరిస్తారు. హరిణిపై అతి ఆసక్తి కారణంగా భరతుడు తదుపరి జన్మలో లేడిగా జన్మించాడు, అయినప్పటికీ పూర్వజన్మ పుణ్యఫలంగా అతనికి జాతిస్మరణ లభించింది. సూక్ష్మమైన ఆసక్తులు కూడా మహాత్ములను సంసారబంధంలో చిక్కుకొనేలా చేస్తాయని, అయినా భగవంతుని కృప వారిని మోక్షమార్గం వైపు నడిపిస్తుందని ఈ ఎపిసోడ్ స్పష్టంగా తెలియజేస్తుంది.

In this profound episode of Srimad Bhagavatham Canto 5, we witness the passing of the beloved deer whose intense attachment had bound the great King Bharata to another cycle of birth. Due to his deep affection for the deer, Bharata takes rebirth as a deer himself, yet by the grace of his previous spiritual merit, he retains memory of his past life. This episode reveals how even noble souls can be ensnared by subtle attachments, and how the Lord's mercy guides them back toward liberation across lifetimes.

← Prev Next →
The Deer's Death & Bharata's Rebirth bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః పరావర గతిజ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః అవిశ్వాయ చ విశ్వాయ తద్రృష్ట్రేస్య చ హేతవే మాయాశక్తి మొదలగు కారణముల తత్వము పంచభూతాది కార్యముల తత్వము సర్వ సాక్షివగు నీకే తెలియును. నీవు జగద్రూపముగా ప్రకటమైనను జగత్తులోని వికారము నీకు లేవు. ఈ జగత్తునకు కారణమైన నీవే జగత్తునకు సాక్షివై జగత్తును ప్రకాశింపచేయుదు. నీకు నమస్కారము. 10th క్యాంటో, 16th చాప్టర్, 48th ప్రేయర్. బహుద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధం 12వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు రహుగనుడు జడభరతుడు మధ్యలో జరిగిన సంవాదంలో భాగంగా రహుగనుడు అడిగిన ప్రశ్నలకు తత్వార్ధంగా జడబరుదురు కొంత భాగం వివరించాడు. ఇంకా అతను వివరించబోయేటువంటి తత్వార్ధాన్ని మనం తెలుసుకుందాం. రజస్తమో గుణముల ప్రభావము తగ్గిన నాడు మనస్సు క్షేమమును కలిగించును. మోక్షము లభించును. నేతిలో వత్తిని తడిపి దీపం పెట్టినప్పుడు నేతితో తడిపిన వత్తిని అగ్ని కాల్చున్నప్పుడు పొగతో కూడా జ్వాల వచ్చును. లేనప్పుడు నిర్మలముగా ప్రకాశించును. అట్లే పుణ్యాపుణ్య కర్మలచే కలుషితమైన మనస్సు దీపం వంటిది. గుణత్రయముతో చేసిన పుణ్యాపుణ్య కర్మలు నెయ్యి వంటివి. అప్పుడు రాగద్వేషములనేటి పొగవచ్చును. నేతితో సంబంధము లేనిచో అనగా కర్మలతో సంబంధము లేనిచో సత్వగుణము ప్రస్ఫుటమై నిర్మలము ప్రకాశం వలె సాత్వికములగు చిత్తవృత్తులు కలుగును. సత్వరజస్తమో గుణములు కలిగిన మనసునకు 11 ఇంద్రియముల వలన ఏర్పడు 11 వ్యాపారములు ఉండును. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనసు అను పదునకొండటి యొక్క వ్యాపారములు ఏర్పడుటకు కారణము మనస్సే.

ఈ వృత్తులు 11ను ఆకూతులు అనబడును అనగా కర్మేంద్రియ వ్యాపారములు ఐదు పంచభూతములతో జ్ఞానేంద్రియ వ్యాపారములు ఐదు మనస్సు వ్యాపారము కలిస్తే 11 అయినది. ఈ శరీరమున జ్ఞానేంద్రియముల వలన శబ్ద, స్పర్శ, రూప, రసగంధములను గూర్చిన ప్రవృత్తులు కలుగును. కర్మేంద్రియములు ఐదింటి వలన మలమూత్ర విసర్జన, సంభోగము, గమనము, మాట్లాడుట, ఇచ్చుట, పుచ్చుకొనుట మొదలగునువి జరుగును. ఇంకా మనసు ఇది నాది అని శరీరమును ఇంద్రియములను స్వీకరించుచుండును. జీవుడు శరీరము కంటే వేరైన తనను గుర్తింపక శరీరము తాను అనుకొనుచుండుటచే తాను అను భావము శరీరమందే విశ్రమించును. ఇట్లు మనోవికారములు 11 అందురు కానీ అవి ద్రవ్యములో భేదం వలన స్వభావములలో భేదం వలన ఆశయములలో భేదం వలన కర్మలలో భేదం వలన కాలములో భేదం వలన వందల వేల కోట్లు అయి ఉండును. వీటిని అన్నింటినీ పరమాత్మయే జీవుని ద్వారా మనసును అధిష్టించి కలిగించుచు వానితో సంబంధించిన వాడై ఉండును. రాగద్వేషాది భావములచే కలుషితమైన కర్మలు కర్మలు చేయు జీవుని యొక్క మనస్సు యొక్క వ్యాపారములు వివరింపబడినవి. ఇవి మేల్కొని ఉన్నప్పుడు కలలు కనుచున్నప్పుడు గాఢనిద్రలో కూడా సాగుచునే ఉండును. పరమాత్మ కూడా జీవునితో శరీరమునందు ఉన్నను అతనికి ఈ వికారములు ఏమియు అంటవు. పరమాత్మ కర్మలతో గాని వాటిని చేయుటలో గాని ఆ ఫలములను అనుభవించుటలో గాని జీవునితో ఉండి చూచుచుండునే గాని తాను అనుభవింపడు. తనంత తాను ప్రకాశించుచుండును. జీవనులో ఉండు పరమ పురుషుడు సాక్షాత్తు స్వప్రకాశ స్వరూపుడు. అతడు ప్రకృతి పురుషుల్లోన వ్యాపించి నియమించుచు ధరించును. తనంత తాను ప్రకాశించుచుండును. జీవుడు ప్రకాశ స్వరూపుడే అయినను బంధములో ఉన్నప్పుడు తాను ఇంద్రియముల కంటే మనస్సు కంటే వేరని ఎరుంగ చాలడు.

భగవానుడు అనుగ్రహించిన ముక్తి దశలో అతనికి అట్టి జ్ఞానము కలుగును. భగవానుడు మాత్రం మరొక దాని అధీనము గాక స్వతంత్రముగా భాసించుచుండును. అతడు పుట్టుట, మారుట మొదలగు వికారములు లేనివాడు. అతడు అందరికంటే పరులకు బ్రహ్మాదులకు కూడా నియామకుడు. జీవ సమూహమునకు అతడు ఆధారమై ప్రాప్యమై ప్రాపకుడై ఉండును. తన అధీనమందున్న మాయచే జీవునితో తాను ఉన్నను ప్రకృతి పరవశులకు చూచుటకు శక్యముగాని వాడే ఉండును. వాయువు చరాచరములగు భూతములకు అన్నిటికీ లోనుండి ఆయా పనులు చేయుచున్నప్పుడు తోడ్పడుచున్నది. కానీ అది నియమించదు. పరమాత్మ చేతనా చేతనములలో వ్యాపించి నియమించును. ఓ రాజా దేహి అయిన జీవుడు జ్ఞానం గలవాడై నేను నాది అని శరీరమును శరీర సంబంధులను భావించిన స్థితిని తొలగించుకొని దేహమునందు దేహ సంబంధుల యందు సంఘమును వీడవలెను. జ్ఞానేంద్రియములు ఐదింటిని మనస్సును బలము గలవాడు శత్రువును లొంగ తీసుకునినట్లు లొంగ తీసుకునవలెను. పరమాత్మ తత్వమును ఎరుంగవలెను. అంతవరకు ఈ సంసారమునందు పరిభ్రమించుట తప్పదు. అందుచే సంసారమునకు మోక్షమునకు కారణము మనస్సే. అది ఎప్పుడు మనకు శోకమును కలిగింపదో అప్పుడు మోక్షమునందును. అది కలగనంత కాలము జ్ఞానము కలగదు. ఈ మనస్సు పరాగును కలిగించును, రోగమును కలిగించును. పగను గుర్తు చేయించుండును. లోభము మొదలగు వానిని పెంచును. ఇట్లు ముందు మమకారమును ఏర్పరిచి దాని వెంటనంటి శోకాదులు ఏర్పరచును. మనస్సు రజస్తమో గుణములతో సంబంధం వదిలి సత్వమే నిండినది అయిననాడు గాని జ్ఞానము కలగదు. మానవునకు సహజ శత్రువు మనస్సు అది చాలా అధికముగు పరాక్రమము కలది అదియే.

అప్రియమును కలిగించునది. అది ఆత్మనే దొంగిలించుకొని పోవును. నిత్య జాగరూకుడై గురు యొక్క శ్రీహరి యొక్క పాద సేవను అనే అస్త్రముతో దానిని సంహరించిన నాడు. తనకి దాన్ని సంహరించిన నాడు కానీ జ్ఞానోదయం కలగదు. భరతుడు ఇట్లు ఉపదేశించిన తర్వాత రహుగనుడు అతనిని ప్రసన్నుని చేసుకొనుచు మరల ఇట్లు ప్రశ్నిస్తున్నాడు. ఓ మహానుభావా, నీవు మా వంటి వారి రక్షణకై దేహమును స్వీకరించి ఉందువు. ఆత్మ స్వరూపానుసంధానము లేక తప్పు చేసిన మా వంటి వారలపై కూడా విరోధం లేని వాడవే ఉన్నావు. అందరి చేతను తిరస్కరింపబడదగిన వేషముతో ఉన్నావు. బ్రాహ్మణులలో నీచుని వలె వేషముచే నీవు కనిపట్టుచున్నావు. కానీ నిత్యము పరమాత్మానుభవముచే అనుభవించుచున్నావు. జ్వరముతో, రోగముతో బాధపడుచున్న వానికి మందు వలె, వేసవి ఎండకు తాపముందొందిన వానికి చల్లని నీరు వలె, ఈ నీచమగు దేహమే ఆత్మనడి అభిమానమే పాము వలె కాటు వేయగా. ఆత్మ స్వరూపమును, భగవత్ స్వరూపమును చూచెడి చూపు పోయి ఉన్న మాకు నాకు మీ మాటలు అమృతం వలె ఔషధం వలె భోగ్యమై రోగ నివారకమై ఉపయోగపడినది. అయినను మిమ్మల్ని మరల ఒక్క విషయము సందేహము తీర్చుకొనుటకు ప్రశ్నించుచున్నాను. ఇంతసేపు మాకు చెప్పినది ఆధ్యాత్మ విద్య. అది బోధపరచుకొనుట కష్టముగా ఉన్నది. కానీ అందులోని రహస్యములను తెలుసుకొనవలెనని నా మనసున కుతూహలముగా ఉన్నది. దానిని నాకు సుఖముగా బోధపడనట్లు చెప్పవలెను. మీరు ప్రత్యక్షముగా కనబడుచున్న బరువు మోయుటచే నడుచుటచే కలిగిన శ్రమ మొదలగునది బాధింపబడని వ్యవహారముచే మోయుచున్నాము అనుకొనవచ్చు కానీ. అది తత్వము కాదని చెప్పినారు. నా మనసు తిరుగుడు పడుచున్నది కావున దానిని వివరముగా సులభముగా బోధపడనట్లు చెప్పుమని ప్రార్థించుచున్నాను.

దేహమునకు ఆత్మకు ఉండేటి భేదము రాజు మనసున స్పష్టముగా ఇంకను గోచరం కాలేదు. శరీరము శ్రమపడినప్పుడు శ్రమపడలిక కలుగుట వ్యవహార మాత్రమే కానీ వాస్తవము కాదు అన్నారు. శరీరము లావుగా ఉండుట, కృషించుట స్పష్టముగా గోచరము అవుచున్నది కదా. అది కూడా మనం అనుకొనుట మాత్రమే అనుట ఎట్లు పొసగును? అట్లే నేను రాజుగా పాలించుచు దండించుచున్నాను. అది స్పష్టముగా గోచరించుచున్నది. అది కూడా వ్యవహారం మాత్రమేనని మీరు చెప్పినారు. అది ఎట్లు? భరతుని అభిప్రాయములో నేను కృషించినాను, నేను బడలినాను అనుకొనుచున్నాము కానీ నేను ఆ నేను శరీరము అను వాస్తవము తెలిసినచో భ్రాంతి అగునని భావించి చెప్పినాడు. అది రహుగుణకు బోధపడలేదు. అందుచే మరల ప్రశ్నించినాడు. ఇప్పుడు భరతుడు వివరముగా స్పష్టముగా వివరించుచున్నాడు. ఆ వివరాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. చాలా తత్వంతో కూడినటువంటి విషయము. 11వ పాడ్కాస్ట్, 12వ పాడ్కాస్ట్ రెండు కలిపి మరొకసారి విని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the knower of the path to the supreme abode. Salutations to the lord of all. Salutations to the cause of the non-existent and the non-existent. The essence of the Maya power, the essence of the Panchabhuta and other causes, the essence of all witnessing. Only you know. Even though you are proclaimed as the form of the world, you have no distortion in the world. You are the cause of this world, and you are the witness to the world, illuminating the world. Namaskar. 10th Canto, 16th Chapter, 48th Prayer. Many relatives, welcome to the 12th podcast of Srimad Bhagavata Tatva Deepika, fifth book. Until now, as part of the conversation between Rahuga and Jada Bharata, Rahuga explained the answers to the questions asked by Jada Bharata in a philosophical manner, explaining some part of it. Let us understand the philosophical meaning that he is about to explain. When the influence of Rajas and Guna decreases, it brings peace of mind. Salvation will come. When a wick soaked in ghee is lit, and a wick soaked in ghee is lit, a flame will come out with smoke. It shines brightly when it's not there. Like that A mind polluted by bad karma is like a candle. Good deeds done with the three Gunas are like butter. Then one can speak of raga-dvesha (dislike towards raga). If there is no connection with the essence, that is, if there is no connection with actions, then the quality of goodness becomes clear, pure, and like light, and the activities of the mind become virtuous. The mind, which has the qualities of Sattva, Rajas, and Tamas, has 11 functions formed by the 11 senses. The five senses, the five organs of action, the mind, and the other ten, the reason for the formation of these businesses is the mind itself.

These professions are called 11, that is, the five karmendriya vyaparas (organs of action) and the five panchabhutamulu (five elements) and the five manas vyaparas (organs of mind), when combined, become 11. In this body, through the senses, there are tendencies related to sound, touch, form, taste, and smell. The five karmendriyas (organs of action) perform actions such as excretion of feces and urine, sexual intercourse, locomotion, speech, giving, and receiving. Furthermore, the mind accepts this as its own, including the body and the senses. The soul, not recognizing itself as different from the body, considers the body as itself, and therefore, the feeling of being oneself rests only in the body. Thus, these mental distortions are said to be 11, but they are due to differences in substance, differences in nature, differences in aspirations, differences in actions, differences in time, and it can be hundreds of thousands of crores. The Supreme Being, through the living being, assumes the mind and causes all these things to happen, and remains associated with it. The actions, which are contaminated by the emotions of attachment and aversion, the activities of the mind of the being who performs actions are described. When these are awake When dreams are being seen, even in deep sleep, it continues. The Supreme Being, being in the body with the living being, does not feel any of these distortions. The Supreme Being, whether through actions, or in performing them, or in experiencing those fruits, remains with the individual, but does not experience himself. It shines on its own. The supreme being who resides in the living being is the very self-illuminating form. He pervades and regulates the natural and the mundane. It shines on its own. Even though a being is of the nature of light, when in bondage, he cannot understand that he is different from the senses and the mind.

In the stage of liberation granted by God, he will attain such knowledge. The Lord alone is independent, not subordinate to anything else. He is one who is without birth and change. He is the most benevolent of all, even to Brahma and others. He is the basis, the recipient, and the giver of the living community. He who is in the illusion under his control, even though he is with the living being, is capable of seeing the natural ecstasies. The wind is helping the moving and stationary beings, all of them, while they are doing their respective tasks. But it doesn't regulate. The Supreme Soul pervades all the conscious beings. Oh king, the being who is given, being knowledgeable, removing the state of considering oneself as mine and the body and the body's relations, one should leave the association in the body and in the body's relations. One who has five senses and a strong mind should subdue the enemy as if he were subduing them. The Supreme Being must be known. Until then, it is inevitable to wander in this world. Therefore, the mind is the cause of worldly life and liberation. That When it does not cause us sorrow, then it is in liberation. “Never mind that the night has not yet fallen. This mind causes delusion and disease. It will remind you of the day. Greed will increase them. Thus, first, it establishes affection, and then, following it, it establishes sorrow and other such things. When the mind is free from the qualities of passion and quality and is filled with goodness, then only knowledge is attained. The mind is the natural enemy of man; it is very powerful and has great prowess.

It's annoying. It steals the soul. Being constantly vigilant, when he destroyed the Guru's, Srihari's, service to the feet, with that weapon. He will not have enlightenment unless he has destroyed it. After Bharata preached thus, Rahuga, pleased with him, again asks thus. Oh great one, you have accepted the body for the protection of those like us. Without the connection of the soul, you are the one who is not against those like us who have made mistakes. You are in a disguise that everyone should reject. You are appearing like a lowly person among the Brahmins. But you are experiencing the Supreme Being daily. Like medicine to one suffering from fever and disease, like cool water to one afflicted by the heat of summer, this vile body is like a snake that bites when the soul is proud. The sight of seeing the form of the soul and the form of God has gone away. For us, your words have become like nectar, like medicine, enjoyable, and have been useful in curing diseases. However, you again one I am asking to clarify the doubt. All this time we have been told that this is spiritual education. It is difficult to learn. But I have a curiosity in my mind to know the secrets in it. It should be told to me so that I can understand it comfortably. You may think that we are bearing the burden of being seen directly, of bearing the burden of walking, without being troubled by such a matter, but. He said it is not philosophy. My mind is restless, therefore I pray that you explain it to me in detail and easily.

The difference between the body and the soul is not clearly visible in the king's mind. When the body is tired, the feeling of tiredness is only a matter of appearance, not reality, they said. The body is getting fat, it is clearly visible, isn't it? How is it that we only think of that? Likewise, I am ruling as king and punishing. It is clearly visible. You also admitted that it was a matter of convenience. How is that? In Bharata's opinion, I have worked hard, we think I have become poor, but if I know the reality that I am the body, he said, considering it as an illusion. RahuGuna was not aware of it. Therefore, he asked again. Now Bharata is explaining in detail and clearly. We will learn about that in another podcast. A very philosophical matter. Requesting to listen to the 11th podcast and 12th podcast together once again and understanding, let's meet again. Jai Srimannarayana. Salutations to the Guru