జడభరతుని అవతారం & బ్రాహ్మణ కుల జన్మ

Jada Bharata's Incarnation & Birth in a Brahmin Family

bhagavatam

ఈ శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, పూర్వజన్మలో మహారాజు భరతుడిగా ఉండి, లేడిపిల్లపై మమకారం వల్ల ముక్తిని కోల్పోయిన మహాత్ముడు జడభరతుడిగా పునర్జన్మ ఎత్తిన అద్భుతమైన కథను వివరిస్తున్నాం. ఆ అనుభవం నుండి పాఠం నేర్చుకున్న ఆ మహాత్ముడు ఈసారి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, లోక వ్యవహారాల నుండి తనను తాను రక్షించుకోవడానికి జడుడిలా నటిస్తాడు. వైరాగ్యం నిరంతర సాధన అవసరమని, భగవంతుని భక్తులు మనకు అత్యంత సామాన్యమైన రూపాల్లో కనిపించవచ్చని ఈ దివ్య లీల మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.

In this profound episode of the Srimad Bhagavatham podcast, we explore the sacred story of Jada Bharata, the great soul who took rebirth after his previous life as King Bharata ended in spiritual distraction due to his attachment to a deer. Having learned from that experience, his soul incarnates into a noble Brahmin family, deliberately concealing his wisdom behind the appearance of a simple, indifferent person to avoid further worldly entanglements. This divine leela reminds us that true renunciation requires constant vigilance, and that the Lord's devotees may walk among us in the most unexpected forms.

← Prev Next →
Jada Bharata's Incarnation & Birth in a Brahmin Family bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మని వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః ఓ కృష్ణ భగవానుడా, నీవు పూర్ణ పరమాత్మవు. వసుదేవ పుత్రుడవగు నీవు యాదవులను భక్తులను పాలించెదవు. నీకు అనేక నమస్కారములు. టెన్త్ క్యాంటో 27th చాప్టర్ టెన్త్ ప్రేయర్. భోద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధం 13వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు రహుగనుడు జడభరతుల మధ్యలో జరిగే సంవాదంలో తత్వబోధని మనం అనుభవిస్తూ వచ్చాం. ఈ తత్వబోధన చేస్తూ ఉండగా రహుగనుడు రాజుకి ఇంకా మరీ ప్రశ్న వచ్చిందన్నమాట. అంటే మన శరీరము లావుగా ఉండటము. కృషించిపోవటం అనేది స్పష్టంగా కనబడుతుంది కదా? అది మనం అనుకొనుట మాత్రమే ఎట్లా అవుతుంది? అలాగే రాజు దండిస్తున్నాడు, స్పష్టంగా కనబడుతుంది. అది కూడా వ్యవహారం మాత్రమే ఎలా అవుతుంది అని జడభరతుని ప్రశ్నించాడు. దానికి విషయంగా మనకు బోధిస్తున్నారు. ఓ రాజా, ఈ పల్లకి మోయుచున్న మనుష్యులు కూడా ప్రకృతి వికారమై ఏర్పడిన వారే. వారు ఒకానొక కారణం వలన చైతన్యం అభివ్యక్తమై కదలుచు మోయుచున్నారు అని భావింపబడుచున్నారు. ఒక పాషాణము కూడా పృథ్వి వికారమే అది కదలదు. మనుష్యుడు కదలును. వారి వారి కర్మ భేదముచే అట్టి శరీరము లభించినవి. కానీ రాతి మీద మనిషి కూర్చున్నచో రాయి మోయుచున్నదని కానీ శ్రమపడుచున్నదని కానీ అనుకున్నాం. కారణము కదలిక లేకపోవుట. మనుష్యుడు పృథ్వి వికారముకు శరీరముతో కదులుచున్నాడు. కనుక కదులుచున్నది బడలినది అని అనుకొనుచున్నాం. పృథ్వి వికారమైన శరీరము కూడా పాషాణం వలె అచేతనమే. రాయి మీద రాయి, రాయి మీద రాయి పెట్టినచో అడుగున ఉన్న రాయికి శ్రమ కలిగినదని అనుకొనుము.

ఇక్కడ కూడా అంతే. పృథ్వి వికారములు అయినవి. పాదములు, పాదములపై చీలమండలు, చీలమండలపై పిక్కలు, పిక్కలపై మోకాళ్ళు, మోకాళ్ళపై తొడలు, తొడలపై నడుము, నడుముపై గుండె, గుండెపై శిరస్సు. దాని పక్కన భుజ శిరస్సు అనగా మూపు. ఆ మూపుపై కర్రతో చేయబడిన పల్లకి ఉన్నది. ఆ పల్లకి కూడా పృథ్వి వికారమే. దానిలో రాజు కూర్చున్నాడు. అతనికి రాజు అని పేరు. ఆ రాజు అనే పేరు గల శరీరము. పృథ్వి వికారమే దానిలో ఉన్నది ఆత్మ. ఆత్మ ఈ శరీరము కంటే వేరు కానీ నీవు శరీరమే రాజు అనుకొనుచున్నావు. అనుకొనుటచే నేను గొప్పవాడను నేను శాసించువాడను అని మదం ఏర్పడింది. కానని మోయబడువాడు రాజు కాదు. మోయబడునది శరీరము అది పార్థివం. కాబట్టి మోయుచున్నవాడు అలసిపోయినవాడు ఎవడో నీవు విచారించుకొనుము. కష్టపడి మోయుచున్న ఆ వాహకులను చూచి అయ్యో కర్మవశము చేయుట్టి శరీరములే ఉన్నారే అని నీవు వారి కర్మను తలంచి శోకించుటకు బదులు దయలేని వాడవై దండించుచున్నావు. దాని కారణము నీ స్వరూపము నీకు తెలియక శరీరమే నేను అని అనుకొని రాజుగా గర్వించినావు. నేను ఈ జనులందరిను రక్షించువాడను శాసించువాడను అని నువ్వు పెద్ద పెద్ద మాటలు అనినావు. ఆ మాటలు పెద్దలు విననచో నవ్వుదురు. నీవు అనగా ఆత్మ అది స్వరూపముచే శాసించుచున్నది కాదు. చరములు, అచరములు అనగా కదలునవి, కదలనివి అని రెండు విధములుగా శరీరములు ఈ భూమియందే పుట్టుచున్నవి. మరల భూమిలోనే రక్షించుచున్నవి. భూమి నుండి పుట్టి మరల భూమిలోనే లయమగు ఈ చరాచరములు అన్నియు ఆ పేరుతో ఆకారముతో ఎల్లప్పుడూ ఉండవు. అందుచే నామరూపములు అనిత్యములు. కావున ఆ ఆత్మ మోయబడునది కాదు శరీరం మోయునది కాదు. ఇదంతయు వ్యవహారము. ఆయా పనులు చేయునప్పుడు ఆ పేరుతో, ఆ ఆకారముతో ఆ శరీరం ఉండును. అంత మాత్రముచే అది అట్లే ఉండును అనుకొనుట భ్రాంతి. ఆ దేహములో ఆత్మ ఉన్నంత సేపు మోయువాడు మోయబడునది అను వ్యవహారం జరుగును కానీ శరీరము వీడిననాడు ఆత్మ మోయునది కాదు మోయబడునది కాదు.

కావున మోయుచున్నాడు, మోయబడుచున్నాడు అనుకొనుట భ్రాంతి. భూమి నుండియే పృథ్వి వికారములగు చరాచరములన్నియు ఏర్పడుచున్నవి. కనుక ఆ భూమి నిత్యము అనుకొందువేమో అది కూడా అనిత్యమే. పంచభూతముల యొక్క సూక్ష్మ పరమాణువుల సమూహము కలిసి భూమండలం ఏర్పడింది. ఆ పరమాణువులు సర్వేశ్వరుని సంకల్పముచే కర్మానుగుణముగా మనసుతో కూడి దేహమై జీవనం కల్పింపబడినది. అట్లు దేహముతో చేరగనే అజ్ఞానము చేరును. ఆత్మ ఆ దేహమును నేను అనుకొనును. ఆ దేహమునకు చెందిన వానిని నావి అనును. ఈ భూమి అని వ్యవహరింపబడుచున్నది కూడా అనిత్యములగు తన కారణమునందు మరల లయమగును. కావున అవి కూడా అనిత్యములే. కృషించినది, లావుగా ఉన్నది అని మనం అనుకొనుచున్న దేహము జీవునితో చేరిన భూత సంఘాతం. అది కార్యము, కారణము అని రెండు విధములుగా కనపడుతును. అదే గొప్పది. తక్కువది అనునట్లు కనపడును. కదలునది, కదలనిది, చరము, అచరము అనబడును. కానీ ఇవి అన్నియు శరీరములకు చెందినవే. దీనికి అంతకు కారణము ప్రకృతి. ఆ ప్రకృతియే ఇన్ని విధములకు పరిణమించును. మనస్సు ఆయా వ్యవహారములకు తగినట్లు మారుచున్నది. ఆ ప్రకృతియే పృథ్వి మొదలగు పంచభూతములుగా ఏర్పడుచున్నది. వానికి మారిన స్వభావము కలదు. అదియే శరీరములో మనసుగా ఏర్పడినది. మనసులో వాసనలుగా చేరి ఉన్నది. ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమో గుణములను కదిలించేడి కాలము. అదే. ఇన్ని విధములుగా ఉన్న ప్రకృతియే దేహము. అది ఆత్మ కాదు. ఆత్మ జ్ఞాన స్వరూపము అనగా తనంత తాను తనకు ప్రకాశించునది సహజము జ్ఞానము కలది. కర్మ సంబంధము లేనిది. అగుటచే సప్తశుద్ధము శరీరముతో ఉన్న జీవుడు కోరి పొందవలసినది ఒకే ఒక పురుషార్ధము ఆత్మజ్ఞానము. ఏ శరీరములో ఉన్నను జ్ఞానమే ఆకారముగా గలది. జీవునికి లోపల వెలుపల అనేటి ప్రవేశము లేదు. అది నిరవయము.

జ్ఞానం అనేటి గుణముచే అంతటా వ్యాపించి ఉండును. కనుక దీనిని బ్రహ్మము అని కూడా అందురు. ఇది సత్యము. అనగా నిత్య అసంకుచిత జ్ఞానముతో ఎల్లప్పుడూ ఉండునది. ఇది మూడు కాలముల యందును ఉండునది. ఇది తనకు తానే ప్రకాశించునది. వేరొక దానిచే ప్రకాశించునది కాదు. ఆకలి దప్పులు, శోక మోహములు, జరా మృత్యువులు అనడి ఆరు విధములగు ఊర్ములు చేరనది కనుక ప్రశాంతము. భగవానుడు అనడి శబ్దముచే వ్యవహరింపబడునది. భగవత్ శబ్దము వాసుదేవుని యందే పూర్ణమై ప్రకాశించును. అట్టి వాసుదేవుడు ఆత్మగా గలది అగుటచే ఆత్మను కూడా వాసుదేవుడు భగవానుడు అని ఆత్మ యాధాత్మ్యమును తెలిసిన వారు వ్యవహరించును. ఈ విధమగు ప్రకృతి కంటే విలక్షణమై కర్మవశమగు జీవుల కంటే భిన్నమై ఉండునది. పరమాత్మ ఆత్మగా గలది. అపరమాత్మచే శిర సంబంధముచే పాలింపబడి నియమింపబడి వాని కొరకే వినియోగపడున్నది ఆత్మ. దేహము కంటే వేరైన స్వరూపము స్వభావములు గల ఆత్మ తత్వమును చేతనా చేతనముల కంటే విలక్షణమైన పరమాత్మ తత్వమును ఎరుంగటకు మహాపురుషుల సేవ తప్ప వేరొక సాధనము లేదు. ఆ జ్ఞానము తపస్సుచే లభింపదు. గృహస్తు ధర్మములను ఆచరించుటచే లభింపదు. వేదాధ్యయనము చేయుట మాత్రమే దీనికి సాధనము కాదు. జలములలో అగ్ని మధ్యమున నిలచి తపస్సు చేసిన లభింపదు, సూర్యోపాసన చేసినను లభింపదు. అన్నిటికంటే ముందుగా మహాపురుషుల పాద పరాగమును శిరస్సుపై దాల్చునట్లు మహాపురుష సేవనము చేయుటయే ఆత్మ పరమాత్మ యధార్త జ్ఞానము కలుగుటకు సాధనము. మహాపురుషుల సేవనములో ఉండుటచే గ్రామ్య కథల ప్రసంగం ఉండదు. సంతతము ఉత్తమ శ్లోకుడకు భగవానుని గుణములే ప్రస్తావింపబడును. ప్రతిదినము భగవద్గుణములను వినుచు చెప్పుచు మననము చేయుచున్నచో సద్బుద్ధి కలుగును. వాసుదేవుని యందు మనసు స్థిరముగా నిలుచును. దానిచే ఆత్మ పరమాత్మ యాధార్థ యధార్థ జ్ఞానము కలుగును.

నా చరిత్ర చెప్పదని వినుము. ఇప్పుడు జడభరతుడు తన యొక్క చరిత్ర చెప్తున్నాడు. నేను పూర్వం భరతుడను, రాజును. నాకు ఐకశోకముల యందు గాని, ఆముష్మకముకు తర్గాదుల యందు గాని సంఘము పూర్తిగా పోయినది. నిస్సంగుడనై భోగదారాధనము చేయుచును నాకు ఒక లేడిపై మనసున ప్రేమ కలిగి ఆ సంఘముచే భోగదారాధన నుండి భ్రష్టుడనైతిని. తరువాత జన్మమున లేడినై పుట్టితిని. శ్రీకృష్ణార్చన ప్రభావం వలన లేడి శరీరములో ఉన్నను భగవద్విషేకమగు స్మరణ నాకు తొలగలేదు. ఆ శరీరమును వీడి బ్రాహ్మణుడే జన్మించితిని. ఈ జన్మలో మరల జనులతో సంఘం ఏర్పడినది. భ్రష్టుడునగుదునేమో అని శంకచే నా స్వరూపం బయల్పడకుండా సంచరించుచున్నాను. అందువలన నేను నీకు ఎరిగించినది నా అనుభవం చేతనే. నరుడు సంఘము చేతనే చెడును. సంఘము చేతనే బాగుపడును. విషయ సంఘము నరుని బంధించును. మహాపురుష సంఘము అజ్ఞానమును కృషింపచేసి బాగు చేయును. దుస్సంగమును వీడి సుసంగము చేయుటయే జ్ఞానము కలుగును. దుస్సంగమును వీడి సుసంగము చేయుటచే జ్ఞానము కలుగును. ఆ జ్ఞానమును కత్తిగా ఉపయోగించుకొని మోహమును ఛేదించుకొనవలెను. శ్రీహరి చరిత్రమును గుణములను చెప్పుచుండవలెను వినుచుండవలెను ఈ విధముగా జీవితమును సాగించినచో భగవద్విషేకముకు స్మృతి మరుపు రాక స్థిరముగా నిలుచును దానిచే సంసారము అడవిలోని దారిని సులభముగా దాటి అవతలి ఒడ్డు చేరును. ఈ విధంగా భరతుడు రౌగుణనకు తత్వ నిరూపణ చేసినాడు. దీని తర్వాత భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. స్వద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Guru, salutations to you, the Lord of the universe, the great soul, the Vasudeva, the Krishna, salutations to the Sattvata Pattaya. Oh Krishna Bhagavan, you are the complete Supreme Soul. Oh, son of Vasudeva, you will protect the Yadavas and their devotees. Many salutations to you. Tenth Canto 27th Chapter Tenth Prayer. Welcome to the 13th podcast of Srimad Bhagavata Tattva Deepika, Panchama Skandham, Bhod Bandhilo. Until now, we have been experiencing the philosophical teaching in the conversation between Rahuga and Jadaabharata. While this philosophical teaching was going on, Rahuga Nadu had another question for the king. That means our body is getting fat. It is clearly visible that it is getting dried up, isn't it? How can that be just our imagination? Also, the king is being punished, it is clearly visible. He also questioned Jada Bharata how that could be just a matter of course. They are teaching us about it. Oh king, even the people carrying this palanquin are formed from the distorted nature of nature. They are moving and wandering, their consciousness manifested for a reason It is believed. Even a stone is a vibration of the earth and it does not move. The man's getting warm. Such bodies are obtained according to the differences in their respective karmas. But we thought that where a man is sitting on a stone, he is carrying a stone, or he is toiling. The reason is the lack of movement. Man is moving with body to the earth's vikaram. Therefore, we assume that it is moving and collapsing. The earth's distorted body is also inert like a stone. If you put a stone on a stone, consider that the stone at the bottom has suffered.

It's the same here. The earth's transformations are happening. Feet, ankles on the feet, calves on the ankles, knees on the calves, thighs on the knees, waists on the thighs, hearts on the waists, heads on the hearts. Next to it is the shoulder, meaning the hump. The hump has a palanquin that is made of wood. The palanquin itself is a metaphor for the earth's rotation. The king is seated in it. His name is Raju. The body, which has been called the king. The soul is the essence of the earthly vibration. The soul is different from this body, but you consider the body to be the king. Thinking that I am great, that I am the one who rules, arrogance has formed. He who carries the burden of the nation is not a king. The body is the mortal one. Therefore, consider who is weary and tired, the one who is carrying. Seeing those vehicles that are carrying hardships, instead of grieving by considering their karma, thinking that they are just bodies due to the effects of karma, you are being cruel and punishing them. Because of that, without knowing your form, you thought the body itself is me and proudly considered yourself a king. I am the protector of all these people You have said big things about me being a dictator. The elders would laugh at words. You are not the soul that is being governed by form. Charamulu, acharamulu, meaning those that move and those that do not, bodies are born in this earth in two ways. Again, they are protecting themselves in the earth. Born from the earth and dissolving back into the earth, all these moving and non-moving things do not always have a form with that name. Therefore, the name and form are impermanent. Therefore, that soul cannot be carried, nor can the body. This is the whole deal. When doing those works, that body will be with that name, with that shape. That is an illusion to think that it will remain as it is. As long as the soul is in that body, the one who carries it will be carried, such a practice happens, but when the body is gone, the soul is neither carried nor carried.

Therefore, to think that he is being carried, that he is being carried, is a delusion. From the earth, all the earthly and moving things are being formed. Therefore, if we consider that earth as eternal, that too is impermanent. The earth is formed by the combination of the subtle atoms of the five elements. Those atoms, by the will of the Supreme Being, according to the nature of karma, together with the mind, became the body and life was created. Thus, as it joins the body, ignorance joins. I think of the body as the soul. He calls the one who belongs to the body, a servant. This earth, which is being considered, also ceases to exist in its cause, and is again dissolved. Thus they are also eternally unfinished. The body that we consider to be cultivated and thick is the ghostly association that has joined the living being. It appears in two ways, as an effect and as a cause. That's great. It seems like less. It is called Kadalunadi, Kadalunadi, Charamu, Acharamu. But they all belong to the body. The reason for this is nature. The nature itself changes in so many ways. The mind changes according to the respective matters. That Nature itself is formed into the five elements, starting from the earth. He has a changed nature. It is the mind that is formed in the body. The smells that are in the mind. The time that stirs the qualities of Sattva, Rajas, and Tamas in nature. That is it. The body is nature itself, in so many ways. It is not spirit. The form of self-knowledge, that is, the one that shines on its own, is natural and knowledgeable. It is without karmic connection. Therefore, the only purpose that a being with a sevenfold pure body should desire and attain is self-knowledge. Whatever is in the body is knowledge itself. The soul has no entrance or exit. It is a constant.

Knowledge is pervasive and spreads throughout. Therefore, it is also called Brahmam. This is the truth. That is, it is always with eternal, unconditional knowledge. This is for all three seasons. It's self-illuminating. It is not illuminated by something else. Hunger, thirst, sorrow, delusion, old age, death, these six kinds of emotions do not reach, therefore it is peaceful. The word Bhagavan is used for sound. The sound of the Lord shines forth in the fullness of Vasudeva. Thus, because Vasudeva is the soul, those who know the soul's divinity treat Vasudeva as the Lord. This is different from nature, different from the beings subject to karma. The Supreme Soul is the Self. The soul is being used for him, being governed and appointed by the Supreme Soul. There is no other means to understand the soul, which has a different form and nature than the body, except the service of great men, to know the supreme soul, which is different from the senses and consciousness. That knowledge is not attained by penance. Householder Righteousness cannot be obtained by practicing righteousness. Only studying the Vedas is not the only means to this end. One who performs penance standing in the middle of water and fire will not attain it, nor will one who worships the sun. First of all, to serve the great men, as if placing the dust of their feet on one's head, is the means to attain the true knowledge of the soul and the Supreme Soul. Being in the service of great men, there will be no discourse on village stories. The best verses are those that praise the Lord's virtues. If we listen to, speak of, and contemplate the virtues of God every day, we will gain good sense. May the mind be steadfast in devotion to Vasudeva. By that, the soul, the supreme soul, true knowledge is attained.

Listen, you listen to my story. Now Jadabharata is narrating his history. I was once a king, Bharath. My association with the Ikashwokas or the Targadus has completely disappeared. I, being a slave, was devoted to pleasure, and having a love for a deer in my mind, I was defiled by the pleasure-seeking of that church. I was born after my next birth. Due to the effect of Lord Krishna's worship, even though I am in a leather body, the remembrance of the Lord's sacred bath has not diminished for me. I was born a Brahmin, leaving that body. In this life, a union with people has been established again. I am wandering without revealing my true form, fearing that I might be corrupted. Therefore, what I have informed you is based on my experience. Man is evil, by society. The community itself is the cure. The subject association binds the man. The association of great men will remove ignorance and improve it. Abandoning bad company and associating with good ones is wisdom. By abandoning bad company and associating with good people, knowledge is gained. That knowledge should be used as a sword to cut off attachment. Shrihari One should speak and listen about history and virtues. If life is conducted in this way, the memory of the divine bath will not fade, and it will remain firm. By that, the family life will easily cross the path in the forest and reach the opposite bank. In this way, Bharata proved the essence of Rau guna. We will learn about the next part in another podcast. Jai Shri Mannarayana. Swagatam!