లీలావతారముల వైభవము - భాగవత ప్రశంస
The Glories of Scheduled Incarnations
ఈ ఎపిసోడ్లో శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలో వర్ణించిన భగవంతుని లీలావతారముల వైభవమును మనం తెలుసుకుంటాము, ధర్మసంస్థాపన కొరకు పరమాత్మ ఎట్లు అవతరిస్తాడో అర్థమవుతుంది. ఆదివరాహుడు మొదలు సుపరిచిత అవతారముల వరకు ప్రతి అవతారమూ ఒక దివ్య సంకల్పముతో సృష్టిలో ప్రవేశించి భక్తులను అనుగ్రహిస్తుందని ఈ ప్రసంగం స్పష్టపరుస్తుంది. అంతేకాక, సమస్త వేద విద్యలకు సారభూతమైన భాగవతం యొక్క అపూర్వ మహిమను కూడా ఈ ఎపిసోడ్ కీర్తిస్తుంది.
In this episode, we explore the magnificent leela avatharas of Lord Vishnu as described in the First Canto of the Srimad Bhagavatham, revealing how the Supreme Lord descends into creation through His divine will to uphold righteousness. Each incarnation — from the primeval forms to the celebrated avatharas — is shown to carry a sacred purpose, restoring cosmic order and showering grace upon devoted souls. The episode also illuminates the unparalleled glory of the Bhagavatham itself, honoring it as the ripened fruit of all Vedic wisdom and the most direct path to liberation.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమస్యే పురుషం త్యాద్యం ఈశ్వరం ప్రకృతేః పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం నాలుగవ భాగంలో పాడ్కాస్ట్ లో స్వాగతం. నైమిశారణ్యము దేవతలు ఆదరించుడి క్షేత్రం. బ్రహ్మ ప్రవర్తింపచేసిన సంసార చక్రం యొక్క నేమి రిమ్ ఈ క్షేత్రమునందు శిథిలమైనది అనగా ఇచ్చట సంసారం ప్రవర్తింపదు. నేమిహి సీర్యతే అత్ర ఇతి నేమిశం తదైవ నైమిశం అని దాని యొక్క ఉత్పత్తి. ఒకప్పుడు ఈ క్షేత్రమునందు నిరతిశయానంద ధామమగు పరమ పదమును పొందవలెనని కోరి. శౌనకాది మునులు వెయ్యి సంవత్సరములు చేయు సత్రయాగమును అనుష్ఠించినారు. వృత్తిక్కులే యజమానులై ఉండెడి యాగమును సత్రయాగమందురు. అట్టి సత్రయాగమును శౌనకాది మునులు చేయుచుండే. ఆ సత్రయాగమునందు ఒకనాడు శౌనకాది మునులు ప్రాతఃకాలముననే హోమము చేయదగిన నేయి, పాలు మొదలగు ద్రవ్యములతో అగ్నిని ఆరాధించి అనంతరం అచర కూర్చొని ఉన్న సూతుని సత్కరించి ఆదరంతో ఈ క్రింది విధంగా ప్రశ్నించిరి. అనగా నీకు శాస్త్రార్థ జ్ఞానము కలగకుండా చేయు అజ్ఞానమునకు కారణమగు పాపము లేదు. జాతిచే జ్ఞానమునకు యోగ్యత లేకున్నాను జ్ఞానమునందు యోగ్యతను కలిగించు సంస్కారం కలవాడవు. నీవు ఇతిహాసములను, పురాణములను, ధర్మశాస్త్రములను అధ్యయనము చేసినవాడవు. ఎన్నోసార్లు చెప్పి ఎందరికో వినిపించినవాడవు. వేదవేత్తలలో అగ్రేసరుడగు బాదరాయణ భగవానుడును పరమాత్మ తత్వమును ప్రకృతి పురుష తత్వములను ఎరింగిన వారలగు పరాశరుడు మొదలగు మునులు ఏ పురాణములను ఎరుంగుదురో వానినన్నిటినీ నీవు ఎరుంగుదువు.
మహాపురుషుల అనుగ్రహం నీకు పరిపూర్ణముగా లభించినది. నీవు వారికి అత్యంత ప్రియ శిష్యుడవు. గురువులు ప్రేమించిన శిష్యులకు రహస్యమైన విషయములు కూడా ఎరంగింతురు. మీరు వినిన పురాణములలో ఏది నిరతిశమైన శ్రేయస్సును కలిగించునదని నిర్ణింపబడి ఉన్నదో దానిని మాకు ఎరిగింపు ప్రార్థించుచున్నాం. ఈ కలియుగంలో మానవులు అల్పాయుర్ధాయం గలవారు. అందుచే భోగమును అనుభవించిన తరువాత కలగవలసిన మోక్షమునందు కోరిక కలుగుటకు అవకాశము తక్కువ. వారు బుద్ధులు కూడా విషయములను గ్రహించుటకు సమర్ధులు కావు. తాపత్రయములచే పీడింపబడుచుందురు. అదృష్టహీనులు. అందుచే వారు పొందదగిన ఫలమును పొందుటకు చేయదగిన కర్మలు ఆచరింపజాలిన వారు కారు. కర్మలు ఈ కలికాలంలో ఆచరించుటకు సాధ్యములు కావు. అందుచే ఏది వినినచో మనసులో పొందదగిన దానిని పొందవలెననేది నిశ్చయము కలిగి దానికే ప్రయత్నించి పొందగలమో అట్టి సారభూతమగు విషయమును మాకు ఎరంగింపుము. దాని ఎరుంగ వలెనడి శ్రద్ధ కలవారము మేము. సూతా, భగవాను దివ్య చరిత్రమే వినదగినదని పెద్దల వలె వింటివి. ఆ భగవానుడు వసుదేవునకు దేవకీ దేవి యందు కుమారుడిగా జన్మించినాడని విన్నాము. అట్లు జన్మించుటకు కారణం ఏమి? ఏమి చేయుటకు ఈ లోకమును అవతరించినాడు? ఈ శ్రీ కృష్ణావతారం లోకులకు క్షేమమును కలిగించునదని అభిష్టమును పొందుటకు సాధనమని వింటిమి. అనిష్టమును పరిహరించుటకు, ఇష్టమును కలిగించుటకు ఆ భగవానుడి నామమే ప్రధానముగు సాధనము. సంసారమనడి ఆపదను పొందిన వారు భగవన్ నామమును అప్రయత్నముగా పలికినను సంసార బంధుమును విడుడు. వినుట మాత్రమే కాదు. నామ సంకీర్తనము చేసిన వానిని చూచి సంసారం భయపడి మరల వాని దరికి చేరదు. భగవాని పాదారవిందములకు తమకు. ప్రాప్యమని మనసును దృఢముగా నమ్మిన వారు కూడా భగవానుని వంటి మహత్యమును కలిగి యుందురు. భగవద్భక్తుల పాదములను ఆదరించిన వారు కూడా ఆకాశ గంగా జలమును సేవించుటే సేవించుటచే ఎట్లు పవిత్రులగుదురో అట్లు పవిత్రులగుదురు. గంగకు భగవత్పాద సంబంధముచే తను సేవించిన వారి పాపములను తొలగించు శక్తి కలిగినది. అట్లే భగవత్ పాదారవిందములను ఆశ్రయించిన వారికి తమను సేవించిన వారి పాపములను తొలగించే శక్తి సహజంగా కలుగును.
భగవానుడు పుణ్య శ్లోకుడు. అనగా వినిన వారిని, కీర్తించిన వారిని కూడా పవిత్రము చేయువాడు. అతని చరిత్రము స్తుతింపదగినది. అతని యశస్సు. కలి మాలిన్యం నశింపచేయునదు. చిత్తశుద్ధి కావలెనని కోరెడు వారు భగవన్ నామములను చరిత్రలను తప్పక వినవలెను. భగవాను యొక్క ఉదారముల చరిత్రములను నారదాదులు గానము చేసినారు. భగవానుని లీలావతార చరిత్రములను వినవలెనటి త్వర కలిగిన మాకు వివరింప ప్రార్థించున్నాం. భగవత్ చరిత్రములను వినుటలో మాకు విసుగు కలగదు. చాలు అని అనిపించదు. రుచిని ఎరింగి వినిన వారలకు ప్రతి పదము మధురముగానే ఉండును. భగవానుడు శ్రీకృష్ణుడుగా అవతరించి బలరామునితో కలిసి కపట మానవుడై తన దివ్యత్వము బయలుపరచక మర్త్యులు చేయజాలని చేష్టితములన్నీ ఎన్నిటినో చేసినాడు కదా. కలియుగం వచ్చినది మరియు ఒక సాధనముచే ఈ కలిదోషములను దాటచాలమని మేము ఎరుంగుదుము. భగవత్ కథా శ్రవణము చేయవలెనని భగవత్ గుణములను అనుభవింపవలెనని ఉత్సాహం కలవారమై దీర్ఘ సత్రయాగమున విష్ణు సంబంధము గల ఈ నైమిజ క్షేత్రమున మేమందరము చేరి ఉన్నాము. వేరొక ఉపాయముచే దాటుటకు శక్యముగాని సంసార సముద్రమునందు పడవను నడిపిడి చుక్కాని తిప్పువానిగా నిన్ను మాకు భగవానుడు చూపినాడు. యోగేశ్వరుడును బ్రాహ్మణ కులమునందు ప్రేమ గలవాడును ధర్మమునకు కవచం వలె రక్షకుడును భక్తి యోగముచే సేవింపదగునవాడును ఆగు శ్రీకృష్ణుడు నేడు వైకుంఠమునకేగినాడు. కలియుగం ప్రవేశించింది ధర్మమునకు రక్షకుడు ఎవరూనూ లేరు. ధర్మము శ్రీకృష్ణుని శరణు పొంది ఉన్నది. ఆ కృష్ణ చరిత్రము వినిన ధర్మమును బాధించు కలి తన ప్రభావమును చూపలేదు. అందుచే కలి దోషమును హరించడి కృష్ణ చరిత్రను మాకు ఎరుంగింపుము. తర్వాత భాగం మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the first Purusha, the supreme Ishwara, beyond the nature. Without considering the inner and outer states of all beings, devotees of Bhagavat, in the first part, fourth part of the Srimad Bhagavata Tattva Deepika podcast You're welcome. Naimisharanya is the abode of the gods. The cycle of life that Brahma has created, the end of that cycle is in this field, meaning that life will not be created here. Nemihi seerite atra iti nemisham tadaiva naimisham, that is its origin. Once upon a time, I desired to attain the supreme abode, the abode of unending bliss, in this field. The sages like Shaunaka performed the Satra Yaga for a thousand years. The sacrifices that were performed by the owners are called Satrayagam. Such a Satra-yagam was being performed by the sages like Shaunaka. In that Satra Yagam, one day, Shaunakadi sages, in the early morning, worshiped the fire with ghee, milk, and other substances that could be used for Homa, and then, after honoring Sootuni, who was sitting in Achara, with affection, inquired in the following manner. That is, it will prevent you from having scientific knowledge Evil is not the cause of ignorance. I am not worthy of knowledge by caste; you are one who has the culture that makes you worthy of knowledge. You are the one who has studied epics, Puranas, and Dharmashastras. You've told so many people and they haven't forgotten. Among the Vedic scholars, Badarayana, who is the foremost, and Parashara, who knew the essence of the Supreme Being and the essence of nature and man, and other sages who knew, you will not know all of them.
The grace of the great men has been fully received by you. You are the most beloved disciple of our Lord. Teachers also reveal secrets to their beloved students. We pray to know which of the Puranas you have heard, which has been decided to bring immense prosperity. In this Kali Yuga, humans are shortlived. Therefore, after experiencing pleasures, there is less chance of having a desire for liberation that should occur. They are also not able to understand the matters. They are afflicted by the three sufferings. They are unlucky. Therefore, they are not able to perform actions that can be done to obtain the fruits they are destined to receive. Karmas are not possible to perform in this Kali Yuga. Therefore, whatever is heard, having the determination to attain what is attainable in the mind, and to try and attain it, such a fundamental subject, please explain to us. We are devoted to it like a yoke. Suta, you have heard the divine story of the Lord, as heard by elders. That Lord, to Vasudeva, in Devaki Devi We've heard it was born a son. What is the reason for being born like that? What has he come down to do? We have heard that this Sri Krishna Avatar is the means to attain the desired goal of bringing well-being to the people. To remove dislikes and to bring likes, that God's name is the main means. Those who have faced the calamity called family life, even if they utter the name of God effortlessly, will not leave the family bonds. Not just listening. Seeing the one who sings the name, the world is afraid and does not reach his door again. To the lotus feet of the Lord. Those who firmly believe in the attainment of the mind also possess the greatness of being like God. Those who have honored the feet of devotees of God, just as they become pure by serving the water of the Akasha Ganga, so they become pure. Ganga has the power to remove the sins of those who serve her, due to her association with the feet of the Lord. Similarly, those who take refuge in the lotus feet of the Lord naturally have the power to remove the sins of those who serve them.
The Lord is a benefactor. He who sanctifies those who hear and those who praise. His history is one of remarkable defiance. His glory. Lack of friendship does not destroy it. Those who desire purity of heart must listen to the names and stories of the Lord. Narada and others sang the stories of the Lord's charities. We are eager to hear the stories of the Lord's divine incarnation and are praying to be informed of the details. We are not bored listening to the stories of the Lord. I don't think so. For those who have heard the taste, every word will be sweet. The Lord, as Sri Krishna, incarnated and, along with Balarama, as a deceitful human, without revealing his divinity, performed many deeds that mortals cannot do, didn't he? The Kali Yuga has arrived, and we are determined to overcome these Kali doshas through a means. Having the enthusiasm to listen to the divine stories and to experience the divine qualities, we all have gathered in this Naimisha Kshetra, which is related to Vishnu, during the long Satrayagam. It is not possible to overcome it by another means The Lord has shown us you as the helmsman who steers the boat in the ocean of life. Yogeshwarudu, who is full of love for the Brahmin caste, is like a shield to Dharma, a protector, and one who can be served through devotion. That Sri Krishna has come to Vaikuntha today. The Kali Yuga has begun; there is no protector of Dharma. Dharma is the one who is under the shelter of Sri Krishna. Kali, who heard the story of Krishna, did not show the effect of his power, which hurt Dharma. Therefore, remove the fault of Kali, Krishna's history, let us know. We can learn about the next part in another podcast. Jai Srimannarayana. Salutations to the Gurus