శ్రీ వరాహమూర్తి ఆవిర్భావము - శ్వేతవరాహ వైభవము

The Auspicious Appearance of Lord Varaha

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించిన అద్భుతమైన కథను మైత్రేయ మహర్షి విదురునికి వివరిస్తారు. బ్రహ్మదేవుని నాసికా రంధ్రం నుండి అతిచిన్న వరాహరూపంలో ఆవిర్భవించిన స్వామి, క్రమంగా విశ్వమంతటినీ ఆక్రమించే మహావిశాల రూపాన్ని ధరించి సమస్త లోకాలను విస్మయపరిచారు. శ్వేతవరాహ స్వామి తన దంతాలపై భూదేవిని రసాతలం నుండి పైకి లేపి, సృష్టిలో దివ్యమైన క్రమాన్ని పునరుద్ధరించిన వైభవం ఈ ఎపిసోడ్‌లో హృదయంగమంగా వర్ణించబడింది.

In this sacred episode of Srimad Bhagavatham Canto 3, we explore the magnificent appearance of Lord Varaha, the divine Boar incarnation of Sri Maha Vishnu, who emerged to rescue the earth from the depths of the cosmic ocean. Maitreya Maharshi narrates to Vidura how the Lord manifested first as a tiny boar from the nostril of Brahma and then expanded into a massive, resplendent form that filled the universe with awe and wonder. The glories of Sveta Varaha, the White Boar incarnation, are described in breathtaking detail, revealing how the Lord effortlessly lifted the submerged earth on His tusks, restoring cosmic order and divine grace.

← Prev Next →
The Auspicious Appearance of Lord Varaha bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వ సాత్వతాం విశుద్ధ సత్వ స్వరూపునకు సకల దోషములను పాపములను హరించువానికి హరించగల మేధస్సు కలవానికి సకల జగములలో వ్యాపించి ఉన్నవానికి అపరిచ్ఛిన్న ఆనంద స్వరూపునకు సకల సాత్వత పతికి నమస్కారము. ఫోర్త్ క్యాంటో 30th చాప్టర్ 24th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధములో 20వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం కశ్యపుడు దితి వారు సమాగనము విషయంలో చర్చించుకోవటము, తను ఆ ప్రదోషకాల సమయంలో సమాగమను కావాలని కోరటము, తను వారించడం వరకు మనం తెలుసుకున్నాం. ఇంకా ముందు విషయాన్ని అనుభవిద్దాం. కశ్యపుడు సమాగమమునకు సమాగమునకు ఇది సమయము కాదని ఎంత చెప్పినను మన్మధ ఉద్రేకముచే వేశ్య వలె సిగ్గు లేనిదై అతని వస్త్రములను పట్టుకొని లాగెను. సంధ్యా సమయంలో నిషిద్ధమగు కామ వ్యాపారమందు ఆమె నిర్బంధనము చూచి ఆమె ఉద్రేకమును ఆపలేక దైవమునకు నమస్కరించి ఏకాంతమున ఆమెతో కలిసెను. తర్వాత ఆచమనము చేసి, ప్రాణాయామము చేసి, మౌనము అవలంబించి, నిర్వికారము, జ్ఞాన స్వరూపము, నిత్యమునగు బ్రహ్మను ధ్యానము చేయుచు ప్రణవమును జపించెను. తరువాత చేసిన పనికి సిగ్గునందినదై దితి భర్తయగు కశ్యపుని చేరి తలవంచుకొనిట్లు పలికెను. ప్రభు భూతాధిపతియగు రుద్రుని యెడల అపచారము చేసితిని. మహాదేవుడగు రుద్రునకు నమస్కారము. కోరికలను వర్షించు ఉగ్రునకు నమస్కారము. అపరాధము చేసిన వారిని దండించు శివునకు నమస్కారం. నిరపరాధులను క్షమించడి ఆ పరమశివునకు నమస్కారం. మా సోదరి భర్తయగు ఉమాపతి నాయందు అనుగ్రహించు కాక అని రుద్రుని ప్రార్థించెను. ఇట్లు చేసిన తప్పునకు భయపడుచు

తన గర్భమునకు హాని కలగకుండా ఉండవలెనని కోరుచున్న భార్యను చూచి సంధ్యాకాల నియమ పాలన అయిన తరువాత కశ్యపుడు ఇట్లు పలికెను. నీ మనసు అపవిత్రమై చేయరాని పనికి సిద్ధపడితివి. సంధ్యాకాలము దుష్టమైనది. నా ఆజ్ఞను అతిక్రమించితివి. రుద్రునకు అపచారము నర్చితివి. అందువలన నీకు చాలా హీనమైన ఇద్దరు కుమారులు కలుగుదురు. వారు చాలా తీవ్ర స్వభావులై. లోక పాలులతో మూడు లోకములను పీడించుచుందురు. ఏ తప్పు ఎరుగని జీవులను హింసించుచుందురు. ప్రాణులను చంపుచుందురు. స్త్రీలను చెరపట్టుచుందురు. దానిచే మహాత్ముల కోపమునకు పాత్రులగుదురు. దానిచే అనుగ్రహించి ఆగ్రహించి సర్వేశ్వరుడు లోకములకు సుఖమును కలిగింపదలచి వరాహ నృసింహ రూపములతో అవతరించి పర్వతములను వజ్రాయుధము ధరించి ఇంద్రుడు ఛేదించినట్లు. అంతమొందించును. కశ్యపుడు ఇట్లు చెప్పగా విని సుందర బాహుశాలియగు భగవానునిచే నా కుమారుడు చనిపోదురని చెప్పితిరి అది నాకు సంతోషమే కానీ. బ్రాహ్మణుల కోపముచే చనిపోవట మాత్రం నేను సహింపలేను. బ్రాహ్మణ కోపముచే చనిపోయిన వానిపై నరలోకములో ఉన్నవారు కూడా దయ చూపరట. అతడు ఏ జన్మను ఎత్తినను లోకలందరి దేశమునకే పాత్రగుచుండును. కావున బ్రాహ్మణ క్రోధముచే నా కుమారులు చనిపోకుండా భగవానుచే చంపబోటియే నాకు సమ్మతము. దితి ఇట్లు పశ్చాత్తాపము నొంది పలికిన పలుకులు విని దితితో కశ్యపుడు ఇట్లు అనుచున్నాడు. నీవు చేసిన తప్పునకు పశ్చాత్తాప పడితివి. పరమ పురుషుని యందు, నా యందు, వృద్ధుని యందు ఆదరము చూపితివి. అందుచే నీ కుమారులలో ఒకనికి ధార్మికుడు, సత్పురుషులచే ప్రశంసింపదగిన వాడనగు కుమారుడు కలుగును. అతని పరిశుద్ధమైన కీర్తిని, భగవంతుని కీర్తిని ప్రశంసించినట్లు అందరూ ప్రశంసింతురు. ఆయా రసాయన పదార్థములు చేర్చి బంగారమును శుద్ధి చేసినట్లు నీ మనుమని గుణములను భావన చేసి సత్పురుషులు తమ అంతఃకరణములను పవిత్రము చేసుకొందురు. నీ మనుమని అనన్యమైన భక్తిచే విశ్వమునంతను తన అనుగ్రహంచే రక్షించువాడును విశ్వమునంతను తనకు శరీరముగా దాల్చి ఉన్నవాడును సర్వజ్ఞుడగు పరమాత్మ సంతసమందును.

నీ మనమడు భగవానుని యందు నిరతిశయమగు భక్తిని కలిగి ఉండును. నిర్మలమగు అంతఃకరణము కలిగి మహా ప్రభావము కలవాడగును. మహాత్యము గల మహాపురుషులలో అగ్రసేలు అగ్రేసరుడగును. అత్యధికమగు భక్తిచే పరిశుద్ధమైన మనసులో సంతతము భగవాను నిలుపుకొని వాని కంటే ఇతరములగు ఐశ్వర్యమును విడిచిపెట్టును. అతడు విషయములందు లాలసత లాలసత. లేని వాడై ఉండును, మంచి స్వభావము కలవాడై గుణములకు ఉత్పత్తి స్థానమై ఉండును. ఇతరుల దుఃఖమును చూచి తాను శోకించును. లోకములో ఎవ్వరిని శత్రువుగా అతను భావింపడు. లోకములో అందరి శోకమును తొలగించువాడై ఉండును. చంద్రుడు వేసవి కాలమందలి తాపమును తగ్గించి ఆహ్లాదమును ఇచ్చునట్లు ఇతడు జనులందరుకు ఆధ్యాత్మికాది తాపములను తగ్గించి ఆనందమును కలిగించుచుండును. సకల పదార్థముల యందు లోన బయట లక్ష్మీ వల్లభుడైన పుండరీకాక్షుని దర్శించుచుండును. ప్రకాశించుచున్న కుండలములచే అలంకరింపబడిన ముఖము గల భగవానుని దివ్య ముఖ మండలమును చూచుచుండును. ఇట్లు కశ్యపుడు. తన కుమారులను శ్రీ మహావిష్ణువు చంపుననియు మనవడు మహా భక్తుడగు నేను చెప్పగా విని ఆనందించెను. దితి కశ్యపుని దివ్యశక్తిచే గర్భవతి అయి. ఆ గర్భమును ఇంద్రుడు ఎక్కడ అంతమొందించును అని భయపడుచు నూరు సంవత్సరములు గర్భమును ధరించి ఉండెను. ఆ గర్భము యొక్క తేజస్సు లోకమంతటా వ్యాపించి సూర్యకాంతి కూడా సాటిగా లేనిదిగా ప్రకాశించుండెను. దేవతలందరూ కాంతిహీనులగుచుండిరి. అన్ని దిక్కులా చీకటి వ్యాపించి ఇవి తూర్పు పడమరలని తెలియకుండెను. ఇట్లుండుటను చూచి దేవతలందరూ బ్రహ్మ వద్దకేగి ఇట్లు నివేదించిరి. ఓ విభూ మేమెందుకు ఇంత భయపడుచున్నామో నీవు ఎరుంగుదువు. నీ జ్ఞానము కాలవశముచే సంకోచము నందునది కాదు. నీ జ్ఞానమునకు ఏ విషయము గోచరము కానిది ఉండదు. దేవదేవా, జగన్ నిర్మాత, లోకనాథులకు శిరోభూషణమైన వాడా, అందరి హృదయములలోని భావమును ఎరుంగువాడా, నీకు నమస్కారము. ఇంద్రియ గోచరముకు జగత్తునకు కారణమైన వాడవు నీవు. పరమాత్మయే సర్వ జగత్తునకు కారణమైనను రజోగుణమును ప్రధానముగా స్వీకరించిన నీవే ఈ జగత్తును సాక్షాత్తు సృష్టించుచున్నావు.

విజ్ఞానమే నీకు బలము. దేవ మనుష్యాది రూపములను కల్పించువాడవు నీవు. నీ సంకల్పమునందే ఈ లోకములన్నియు చేరి ఉన్నవి. యోగులు కార్యకారణ రూపమగు పదార్థముల కంటే ప్రత్యేకమైన వానినిగా నిన్ను ఎల్లప్పుడూ భావించుందురు. ఇంద్రియ జయము కలిగి ప్రాణాయామము చే మనసును వశపరుచుకొందురు. పరిపూర్ణమైన యోగనిష్ట గల వారులకు నీ అనుగ్రహం లభించును. నీ అనుగ్రహం నందిన వారికి పరాభవం ఉండదు. నీ నుండి వెలువడిన వేద వాక్కు చేతనే సకల ప్రాణిజాతము గోవుల త్రాడుతో కట్టినట్టు కట్టబడి ఉన్నవి. అందరూ తమ తమ వ్యాపారములు నీ ఆరాధనముగానే సాగించుందురు. అట్టి నీకు నమస్కారము. దితి గర్భ తేజస్సు వ్యాపించి లోకములో చీకటి ఆవరించి ఉన్నది. రాత్రింబ బలు తెలియుట లేదు. లోకములకు క్షేమమును కలిగించుము. అధికమగు నీ దయాదృష్టిచే ఈ లోకములను చూచి ఆపదను తొలగించుము. కశ్యపుని దివ్య తేజస్సు దితి గర్భమునందు వృద్ధినందుచు లోకమును చీకటి చేయుచున్నది. నీవే రక్షింపుము. ఇట్లు దేవతలు ప్రార్థింపగా వేద వేద్యుడగు బ్రహ్మ మందహాసము చేసి మధుర వాక్యతో దేవతలకు ఇట్లు బదులు పలికెను. ఓ మానస పుత్రులారా, మీకంటే ముందు సనకాదులు నా నుండి జన్మించినారు. కానీ వారు విషయాభిలాష లేని వారై ఆకాశ మార్గమున సంచరించుందురు. ఆ సనక సనందాదులు ఒకసారి శుద్ధ సత్వమయమును దివ్యమగు భగవానుని వాసస్థానము వైకుంఠమునకేగిరి. ఆ స్థానము సర్వలోకమును నమస్కరింతురు. ఏ కోరికలు లేక నిష్కామముగా తాము తమ ధర్మమును ఆచరించుచు భగవదారాధనము ఏ పురుషులు చేయుచుందురో వారు ఆ వైకుంఠమందు శాస్త్రముల చేతనే ఎరంగదగిన భగవానుడు జ్ఞాన శక్త్యాది గుణములచే పరిపూర్ణుడై పరమ కారణమైన రజో సంపర్కము లేని శుద్ధ సత్వమైన శరీరముతో తన భక్తులను సుఖింప చేయుచు వేంచేసి ఉండును. అచట నిశ్రేయసము అను వనము గలదు. అచట వృక్షములు సర్వ ఋతువులందుడు ఋతువులందుండెడి పుష్పాదులు కలిగి కోరికలన్నిటిని ఈడేర్చుండును. మూర్తి భవించిన కైవల్యం వలె ఆ లోకము ప్రకాశించుండును. ఆ వనమునందు విమానారూఢులైన దేవతలు తమ స్త్రీలతో కూడా లోక భర్తయగు భగవానుని పాప హరములకు చరిత్రములను గానము చేయుచుందురు. అచట వసంత ఋతువునందలి మాధవీ కుసుమములందలి మకరందము. పరిమళములతో నిండిన వాయువు వీచుండును. భగవాని చరిత్రములు పాడేడి దేవతలు అట్టి వాయువును ఆఘ్రాణించునును. భగవత్ చరిత్రలో ఉండెడి మాధుర్యముచే ఆ వాయువుచే ఆకర్షింపును.

పడరు. ఆ లోకమందరి దేవతలే కాదు పావురములు, కోకిలలు, దాతకములు, నెమిళ్ళు మొదలగు పక్షులు కూడా తమ కలకల ధ్వనిలో హరికథలనే గానము చేయుచున్నట్లు ఉండును. అచడ తుమ్మెదలు ధ్వని చేయుచుండగా ఆ ధ్వనిని భగవత్ చరిత్రము వినుచున్నట్లు విని పక్షులు తమ కోలాహలమును మాని ఉండును. ఆ వనమునందలి మందార పారిజాతాది వృక్షములు కుంద కుటజాది లతా విశేషములు అధికమగు పరిణములు పరిమళములు గల పుష్పములు గలవై భగవానునిచే విశేషముగా ఆదరముతో అలంకరించుకొనబడుచుండును. తులసిని చూచి తమ అంత వాసన లేకపోయినను భగవత్ ప్రీతిని పొందెడి ధన్యత ఈ తులసికి ఎట్టి తపస్సుచే లభించినదో అని దానిని గౌరవించుచుండును. వైకుంఠమునందు భక్తుల నివాస భవనములు వైఢూర్యములతో మరకతములతో నిర్మింపబడినవై ఉండెను. ఆ భవనములు భగవంతుని పాదముల యందు భక్తిచే వారికి లభించినవి కానీ వారు ఆర్జించుకొనినవి కావు. ఆ విమానములను అధివసించడి అధివసించి ఉండడి భక్తులు భగవంతుని యందే మనసు లగ్నమైన వారు అగుటచే విశాలము కటి ప్రదేశములు. మందహాస శోభిత ముఖములు కలవారైన స్త్రీలు పరిహాసాదులచే అలిరింపజూచినను వారి మనసును రజోగుణము ఆవరింపదు. ఆ వైకుంఠమున భగవన్ మందిరమందు లక్ష్మీదేవి స్వయముగా విలాసముకై చేతదాల్చిన తామర పువ్వుతో స్ఫటికమయములగు గోడలపై పడిన ధూళిని తుడుచుండును. ఆమె అనుగ్రహం పొందవలెనని బ్రహ్మాది దేవతలు ఆమె వెంటననుసరించి ఆశపడుచుందురు. ఆ వైకుంఠమున దిగుడు బావులు పగడములతో ఒడ్లు నిర్మింపబడి యుండెను. అందలి జలములు అమృత తుల్యములై యుండెను. లక్ష్మీదేవి ఆ జలములతో తులసితో భగవానుని ఆరాధించుచు ఆ ఉదకములో ప్రతిఫలించిన తన ముఖమును చూచుకొని భగవానుడు తన ముఖమును ముద్దు పెట్టుకొనుచున్నాడని భావించుకొనుచుండెను. పాప వినాశకుడగు భగవంతుని గూర్చి గాక బుద్ధిని చెదగొట్టెడి అర్ధకామార్జనమునకు ఉపయోగించు ఉపాయములను తెలియచేయు దండనీతి కామశాస్త్రమును ఎవరు వినుచుందురో వారు వైకుంఠమును జేరజాలరు. నిర్భాగ్యులగు నరులు భగవత్ కథల కంటే ఇతరముల కథలను విని పుణ్యము పోయిన వారై నిరాలంబములగు అంధ తమస్సు ఆవరించిన నరకములో పడుచుందురు. కొందరు కోరి పొందదగిన మనుష్య జన్మను పొందినను ధర్మజ్ఞానములతో భగవదారాధన చేయక దౌర్భాగ్యులై మోహమునందుచుందురు. భగవత్ ఆరాధన చేయరు అట్టివారు ఆ లోకమును పొందజాలరు కొందరు భాగ్యశీలురు దేవతా శ్రేష్టుడగు వైకుంఠవాసియగు భగవానుని భక్తితో సేవించుందురు నియమాదులచే మంచి శీలము కలిగిన శ్రీహరి గుణకీర్తనము ఒడలు మరిచి ఆనందించుందురు అట్టివారు

సుఖముగా ఆ లోకమును చేరి ఆనందించుచుండిరి. ఆ లోకానికి సనక సనందాదులు వెళతారు. మరి వెళ్ళిన తర్వాత జరిగిన కథ ఏమిటో మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to Vishuddha Satvaya, Hara, Harimedhasa, Vasudeva, Krishna, the radiance of all Sattvatas. To the embodiment of Vishuddha Satva, to the one who removes all sins and sorrows, to the one who has the intellect to remove, in all the worlds Salutations to the one who is pervading, to the unchanging blissful form, to the lord of all goodness. Fourth Canto, 30th Chapter, 24th Prayer. Devotees of God, welcome to the 20th podcast in the third book of Srimad Bhagavata Tattva Deepika. Until now, we have learned about Kasyapa and Diti discussing the matter of Sangama, him wanting Sangama during the twilight hours, and him refusing. Let's experience the next step. Kasyapa, even after being told that this is not the time for the union, Manmadha, with excitement, like a prostitute, without shame, grabbed his clothes and pulled him. In the evening, seeing her compulsion in the forbidden lust business, unable to stop her excitement, he bowed to God and met her in solitude. After that, perform Achamanam, do Pranayama, and observe silence Having relied, without change, as the form of knowledge, meditating on the eternal Brahma, he chanted the Pranava. Shameless for the work done afterwards, Diti, feeling ashamed, went to her husband Kashyapa and said, bowing her head. I have committed an offense against Rudra, the lord of the elements. Salutations to Lord Rudra, the great God of energy. Salutations to the fierce one, to the one who showers desires. Salutations to Shiva, who punishes those who commit sins. Salutations to Lord Shiva, who forgives the innocent. She prayed to Rudra, saying, "May Umapati, who is my sister's husband, bestow grace upon me." Afraid of the mistake made

Seeing his wife who wished that her womb should not be harmed, Kasyapa spoke thus after the evening rituals were completed. Your heart is corrupted and you are ready to do something that is unholy. Evening is bad. Uh, you have disobeyed my orders. You have wronged Rudra. Therefore, you will have two very wicked sons. They are very serious people. With the milk of the world, they torment the three worlds. They torture innocent creatures. They kill animals. Women are being kidnapped. They will be subjected to the wrath of the great ones. By that, being pleased and angered, the Lord of all, wishing to bring happiness to the worlds, incarnated in the forms of Varaha and Narasimha, holding mountains and a thunderbolt, as if Indra had cut them. It will end. Kasyapudu, having heard this, said that my son would not die by the hands of the beautiful Bahushali Bhagavan. I am happy about that. I can't stand by and see you killed by a bunch of Brahmins. Even those in the world of humans do not show mercy on someone who died due to the anger of a Brahmin. He is Even if one is born again, one remains a part of the world's nation. Therefore, I agree that, by the wrath of the Brahmin, my sons should not die, but should be killed by the Lord. Diti, hearing the words spoken with remorse, Kasyapa said thus to Diti. You have admitted to doing wrong. You have shown respect to the Supreme Being, to me, and to the old man. Therefore, among your sons, one will be born a righteous man, worthy of praise by the righteous. Everyone praises his holy glory and the glory of God. Just as gold is purified by adding various chemical substances, similarly, the virtuous people purify their inner selves by contemplating the qualities of your mind. He who protects the entire universe with his unique devotion and by his grace, and he who has taken the entire universe as his body, is in the joy of the omniscient Supreme Soul.

Your grandson will have immense devotion to God. He will have a pure inner self and will be very influential. Among the great men of greatness, Agrasalu is the foremost. By the most devotion, in a pure heart, constantly keeping the Lord, one should renounce other riches than Him. He is greedy for things. He who is without, being of good nature, is the place of production of qualities. He feels the pain of others and cries. He does not consider anyone as his enemy in the world. He is the one who removes everyone's sorrow in the world. The moon, as if reducing the heat of summer and giving pleasure, he reduces the spiritual and other afflictions of all people and brings joy. In all substances, both inside and outside, one sees Pundarikaksha, the Lord of Lakshmi. He is seeing the divine face of the Lord, adorned with a face decorated with shining earrings. Thus ends the tale of Kashyapa. He was pleased to hear that his sons were killed by Sri Maha Vishnu, and that his grandson, a great devotee, was pleased to hear it. Diti became pregnant by the divine power of Kashyapa. Fearing where Indra would end the pregnancy, she remained pregnant for a hundred years. The radiance of that womb spread throughout the world, shining as brightly as the sunlight. All the gods became light. Darkness spread in all directions, and they did not know east and west. Seeing this, all the gods went to Brahma and reported it. Oh Vibhu, why are we so afraid? You don't know. Your knowledge is not subject to the limitations of time. There is nothing that your wisdom cannot perceive. Oh God, the creator of the universe, the one who is the crown jewel to the lords of the world, the one who understands the feelings in everyone's hearts, I salute you. You are the cause of the visible world and the world. Even though the Supreme Being is the cause of the entire universe, you, who have accepted the quality of passion as primary, are directly creating this universe.

Knowledge is your strength. You are the one who creates forms like gods and humans. It is in your will that all these worlds have gathered. Yogis always consider you as something unique, different from the material things that are causal. By having control over the senses and doing pranayama, one can master the mind. Those who are perfect in yoga and devotion will receive your grace. Those who receive your grace will not have any misfortune. By the Vedic words emanating from you, all living beings are bound together like a rope of cows. Everyone will continue their respective businesses and your worship. Greetings to you. The radiance of the womb of Diti has spread, and darkness has enveloped the world. I can't tell you what night is like. Bless the world. By your exceedingly merciful disposition, look upon these worlds and remove the danger. Kasyapa's divine light, growing in the womb of Diti, is darkening the world. Protect yourself. Thus, as the gods prayed, Brahma, the knower of the Vedas, smiled and replied to the gods with sweet words. Oh Manasa Sanaka and others were born before you. But they are without desire, they wander in the sky. Those Sanaka and Sanandadulu once went to Vaikuntha, the abode of the pure, virtuous, and divine Lord. That place is worshiped by all the world. Those men who perform their duty without any desires, performing the worship of God, in that Vaikuntha, the Lord who is capable of being enraged only by the scriptures, being complete by the qualities of knowledge, power, etc., the supreme cause, the contact of Rajo He who is without a pure, virtuous body, delights in pleasing his devotees. There is a forest called Nishreyasamu. There, the trees, in all seasons, having flowers, fulfill all desires. Like the liberation attained by the idol, that world shines. In that forest, the gods, who are seated in airplanes, along with their wives, sing the stories of the sin-remover, the Lord, of the world. The nectar from the Madhavi flowers in the spring season. The air is filled with fragrance. Bhagavaani The gods who sing of history will smell such air. The sweetness that exists in the divine history attracts that air.

They do not fall. Not only the gods of the world, but also pigeons, cuckoos, koel birds, and other birds, sing Harikatha in their chirping sounds. While those thumping sounds are making noise, hearing that sound as if listening to the history of God, the birds will stop their chirping. In that forest, the hibiscus, Parijata, and other trees, the Kunda, Kutaja, and other vines, the specialty, the abundant fruits, the fragrant flowers, are being specially adorned with affection by the Lord. Seeing the Tulasi, even though it has no fragrance, this Tulasi is blessed to attain the love of God, and it respects it. In Vaikuntha, the residences of devotees were built with Vaidurya stones and ruby stones. Those buildings were obtained by devotion at the feet of God, but they were not earned. Those who are seated on those planes, those who are seated on them, devotees, because their minds are fixed on God, have broad and expansive thighs. Women with smiling faces, even when ridiculed by jesters, their hearts The quality of passion does not cover. In that Vaikuntha, in the Lord's temple, Goddess Lakshmi herself, for her own pleasure, with the lotus flower she held in her hand, wipes away the dust that has fallen on the crystalline walls. Brahma and other gods, desiring to receive her grace, follow her. In that Vaikuntha, the steps were built with coral and the walls were built with coral. The waters there were like nectar. Lakshmi Devi, worshiping the Lord with those waters and Tulasi, seeing her face reflected in that water, thought that the Lord was kissing her face. Those who listen to the Danda Nishadhi Kama Shastra, which explains the means to use for the destruction of the sinful, and for the sake of misleading the intellect, will not be able to reach Vaikuntha. The unfortunate men, having lost their merit by listening to stories other than those of the Lord, fall into hell, which is covered with darkness, and become dependent. Some, having attained human birth, which is desirable and attainable, do not worship God with righteous knowledge, and become unfortunate and deluded. They do not worship God Those who are like that cannot attain that world. Some are fortunate and serve the Lord, the best of the gods, with devotion. They are Srihari, who has good character, who has good character, who forgets the burden of rules and rejoices. Such people

They happily reached that world and were enjoying. Sanaka and Sanandadas will go to that world. We will find out what happened after that in the podcast later. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.