శ్రీమద్ భాగవత తత్వదీపిక | పంచమ స్కంధం భా 25 | జ్యోతిర్మండలం భా 2

Srimad Bhagavatam Canto 5 Pt 25 | Jyothirmandalam Part 2 | Tatwa Deepika

bhagavatam

ఈ ప్రవచనంలో పంచమ స్కంధంలోని జ్యోతిర్మండల వర్ణనం కొనసాగింపు తెలుసుకుంటాం. నారాయణుడే సూర్య రూపంలో ప్రకాశిస్తూ మూడు వేదాల స్వరూపుడై కాలాన్ని నియమిస్తున్నాడని, ఆరు ఋతువులను నడిపిస్తున్నాడని వివరించారు. సూర్యుని ఆరాధన ద్వారా స్వర్గమోక్షాలు పొందవచ్చని, చాంద్రమానం మరియు సౌరమానం ఏర్పడే విధానం కూడా వివరించారు.

Continuing the Panchamaskandha discourse, this session explores the Jyothirmandalam (celestial luminaries) as described in Srimad Bhagavatam. The speaker explains how Narayana manifests as Surya (the Sun), who embodies the three Vedas, regulates time, and governs the six seasons. The discourse also covers the solar and lunar calendars, the twelve rashis (zodiac signs), and how the Sun is worshipped through Vedic yajnas to attain svarga and moksha.

← Prev Next →
Srimad Bhagavatam Canto 5 Pt 25 | Jyothirmandalam Part 2 | Tatwa Deepika bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః ప్రణమిల్లిన వారి చిత్త మలములను నశింపజేసే శ్రీహరి వసుదేవ పుత్రుడగు శ్రీకృష్ణుడై గోవులను పాలించెను. ప్రాణులలో ప్రత్యగాత్మ రూపుడై ఉన్న ఆయన కొరకు పలు నమస్కారములు. టెన్త్ క్యాంటో 73rd చాప్టర్ 60th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. పంచమ స్కంధం 25వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రియవరద చరిత్రము, భూగోళ వర్ణనము. దీపముల వర్ణనము తెలుసుకొని జ్యోతిర్మండల వర్ణనములో కొంత భాగాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకా ముందు భాగాన్ని మనం తెలుసుకుందాం. ఆది పురుషుడగు భగవానుడు నారాయణుడే లోకముల క్షేమమునకై సూర్య రూపమును మనకు దర్శనమిచ్చుచున్నాడు. ఆ నారాయణుడే సూర్యుని శరీరముగా స్వీకరించి ప్రకాశించుచున్నాడు. సూర్యుడు మూడు వేదముల స్వరూపము. అతడు కాలమును నియమించుచున్నాడు. కర్మల సాద్గుణ్యము కొరకు తననే పండ్రెండుగా విభజించి. ఆరు ఋతువులలో ఆయా కర్మలకు వేరు వేరు విధములగు భోగములకు అనుగుణముగా చలి, ఎండ, గాలి, వర్షము కలిగించుచుండును. త్రయ్యీమయమగు సాత్వికమగు వైష్ణవ శక్తియే సూర్యుని యందు ఉండి ప్రజ్వలించుచుండును. తన కిరణములతో సమస్త జగత్తులకు స్థితిని నాశనమును కలిగించుచుండును. సూర్యాంతర్యామియగు నారాయణుని ఋగ్వేదములోని రుక్కులు పూర్వాన్నమునందు స్తుతించుచుండును. సాయంకాలమందు బృహద్రదంతారాది సామువులతో స్తుతించుచుండును.

అతని స్వరూపము వేదముల చేతనే ఎరుంగదగినదై యుండును. జ్ఞానులచే ఉపాసించబడుచుండును. ఆదిత్య రూపముగా ఉన్న భగవానుని లోకములో వర్ణాశ్రమాచారములను పాలించువారు మూడు వేదములతో శ్రద్ధతో ఆరాధించుందురు. వేదములలో చెప్పబడిన అనేక విధములగు యాగముల చేతను ఉపాసనము చేతను ఆరాధించి శీఘ్రముగా స్వర్గాది లోకములను మోక్షమును కూడా పొందుదురు. లోకములకు అంతరాత్మయగు భగవానుడే భూలోకమునకు ద్యులోకమునకు మధ్యలోనున్న అంతరిక్ష మధ్యములో శించుమారము అను పేరుగల కాలచక్రమునందుండును. మేషము మొదలగు రాశులలో నక్షత్రములకు అభిముఖముగా సంచరించుచు సంవత్సరము అనబడు 12 మాసములను అనుభవించుచుండును. మకరము మున్నగు రాశులలో సంచరించుటచే మాసములు ఏర్పడుచున్నవి. సంవత్సరములకు అవయవములు 12 రాశులు. అవే మాసములుగా వ్యవహరింపబడుచున్నవి. చంద్రుని గమనము బట్టి చాంద్రమానము ఏర్పడును. రెండు పక్షములను మాసమందురు. చిత్తా నక్షత్రము మొదలు పూర్ణిమ నాడు ఏ నక్షత్రమునందు చంద్రుడు ఉండునో ఆ మాసమునకు ఆ పేరు వచ్చును. చిత్తా నక్షత్రముతో కూడిన పూర్ణిమ గల మాసము చైత్రము. సౌరమాసములో రెండు నక్షత్రముల ఒక పాదము ఒక రాశిగా ఉండును. ఒక్కొక్క నక్షత్రమునకు నాలుగు పాదములు. తొమ్మిది పాదములు సూర్యగమనం సాగుటచే ఒక రాశి అగును. సంవత్సరములో ఆరవ వంతు అనగా రెండు మాసములు సూర్యుడు నడిచినచో ఋతువు అందురు. కాలచక్రములో ఆరు రాశులలో సూర్యుడు సంచరించుటచే ఆయనములు ఏర్పడును. మకరము మొదలు ఆరు రాశులలో సూర్యుడు నడిచిన కాలము ఉత్తరాయణం. కర్కాటకము నుండి ఆరు మాసములు దక్షిణాయనం. నభోమండలం 12 రాశులుగా విభజింపబడినది. ఆ 12 రాశులలో సూర్యుడు సంచరించు కాలమును సంవత్సరము అందురు. సౌరమానమునకు

చాంద్రమానమునకు 12 రోజుల తేడా వచ్చును. శుక్లపాడ్యమి నాడు మేష సంక్రమణము వచ్చినచో సౌర చాంద్రమానములు ఒక్కసారి ఆరంభమగును. సంవత్సరమునకు సౌరమానములో ఆరు రోజులు పెరుగుచుండును. ఈ విధముగా 12 రోజులు ఈ రెండు మాసములకు తేడా వచ్చును. ఐదు సంవత్సరములలో రెండు మాసములు వ్యవధానము ఏర్పడును. కావున రెండు అధిక మాసములు ఏర్పడును. దీనిని మలమాసమందురు. సంవత్సరము, పరిసంవత్సరము, ఇడాత్సరము, అనువత్సరము, వత్సరము అని సూర్యుని మందగతి, శీఘ్రగతి సమగతులచే వివరించుచుందురు. చంద్రుడు మండలాకారముగా ప్రసరించు. సూర్యకిరణముల కంటే లక్ష యోజనముల పైగా శీఘ్రముగా పయనించును. సూర్యుడు ఒక సంవత్సర కాలములో గడిచిన కాలము చంద్రుడు రెండు పక్షములలో గడుచును. రెండు నక్షత్రములు ఒక పాదము కాలములో సూర్యుడు ఒక నెల గడిచిన కాలమును అతిక్రమించును. ఒక పక్షములో సూర్యుడు పయనించిన భాగమును చంద్రుడు 30 ఘడియలలో పయనించును. శుక్ల పక్షములో వృద్ధినందుచున్న కళల చేతను కృష్ణ పక్షములో తరుగుచున్న కళల చేతను పితృ దేవతలకు శుక్ల పక్షము కృష్ణ పక్షము అహోరాత్రములు ఏర్పడును. జీవులకు జీవనము కలిగించువాడు చంద్రుడు అతడే ప్రాణములకు పోషకుడు. చంద్రుడు మనస్సునకు అధిదేవత. చంద్రుడు అన్నస్వరూపుడు. ఔషధీశుడు. సర్వ ప్రాణి జీవ హేతువు అగుటచే అతనిని సర్వమయుడుగా వర్ణింతురు. భగవానుడగు సర్వేశ్వరుడే పదనారు కలలు గల చంద్రునికి అంతరాత్మగా ఉండి. దేవ, పితృ, మనుష్య, భూత, పశు, పక్షి సర్వ తరులతలకు పోషకుడై ఉండును. చంద్రునికి పైని

ప్రతి 3 లక్షల యోజనముల దూరమున మేరువునకు దక్షిణ మార్గమున అభిజిత్తుతో కూడిన నక్షత్రములు 28 ఉన్నవి. 27 నక్షత్రములు అశ్విని మొదలు రేవతి వరకు మనకు తెలియును. ఉత్తరాషాఢ శ్రవణా నక్షత్రముల మధ్యలో అభిజిత్తు అనేటి ఒక నక్షత్రము గలదు. దానితో కలిసి నక్షత్రములు 28. ఈ నక్షత్ర మండలమునకు 2 లక్షల యోజనముల అవతల శుక్రుడు ఉండును. శుక్రుడు సూర్యుడు ఉండేడి రాశికి ముందు రాశిలో గాని వెనక రాశిలో గాని లేదా అతనితో సమముగా గాని సంచరించుచుండును. శుక్రుని గమనం బట్టియే వర్షమును ఊహించుచుందురు. శుక్రుని వలె బుధుడు కూడా సూరునికి ముందు రాశిలో గాని వెనక రాశిలో గాని సమాన రాశిలో గాని సంచరించుచుండును. బుధుడు శుక్ర మండలమునకు రెండు లక్షల యోజనముల పైన ఉండును. లోకమునకు సాధారణముగా శుభమును కలిగించుచుండును. పాపగ్రహము కూడా అతడు సురునకు దూరమై సంచరించుచున్నప్పుడు పెనుగాలులు గాని మేఘములు అధికముగా ఉండుట గాని అనావృష్టి గాని సంభవించుచుండును. బుధ మండలమునకు 2 లక్షల యోజనముల పైన కుజుడు సంచరించుచుండును. అతడు మూడు పక్షములకు ఒక్కొక్క రాశిని దాటుచుండును. ఒక్కొక్కప్పుడు వక్రగతిలో వెనకకు వచ్చి మరల ముందుకు పోవుచుండును. కుజుడు అశుభ గ్రహమే వక్రగతి లేనిచో అనుకూలుడగుచుండును. కుజ మండలమునకు 2 లక్షల యోజనముల పైన బృహస్పతి మండలం అనగా గురుడు సంచరించుచుండును. వక్రగతి లేనిచో ఈతడు బ్రాహ్మణులకు అనుకూలుడై ఉండును. అతడు ప్రతి రాశి యందును ఒక్కొక్క సంవత్సరము సంచరించుచుండును. బృహస్పతి మండలమునకు రెండు లక్షల యోజనముల పైని శని గ్రహం ఉండును. అది ఒక్కొక్క రాశిలో ముప్పది మాసములు సంచరించుచుండును.

మెల్లగా సంచరించువాడగుటచే మందుడు అని శనికి పేరు. అతడు జన్మరాశికి ముందు జన్మరాశిలో ఉన్నప్పుడు 60 మాసములు అందరకు అశుభమును కలిగించువాడై ఉండును. శని మండలమునకు పైని పదునొక లక్షల యోజన దూరములో సప్తర్షి మండలము ప్రకాశించుచున్నది. వారు లోకమునకు సుఖమును కలిగించుచుందురు. ఈ సప్తర్షులు అన్నిటికంటే ఉన్నత స్థానమందు ధ్రువ మండలమునకు ప్రదక్షిణముగా పరిభ్రమించుచుందురు. సప్తర్షి మండలమునకు 13 లక్షల యోజనముల దూరమున ధ్రువ మండలం ఉన్నది. అది ప్రసిద్ధమగు పరమపదము. విష్ణువు యొక్క అభివ్యక్తి స్థానమని వర్ణింతురు. అచ్చటనే మహా భాగవతుడు ఉత్తానపాద పుత్రుడగు ధృవుడు అగ్నిచే, ఇంద్రునిచే, ప్రజాపతిచే, కశ్యపునిచే, ధర్మునిచే మిక్కిలి గౌరవముతో ప్రదక్షిణము చేయుచుండును. చేయబడుచుండును. ఉపాసింపబడుచుండును. ఈ కల్పములో జీవించే వారికి ఆ ధ్రువుడే సేవింపదగినవాడు. భగవానుడు కాలముచే పరిభ్రమింప చేయబడుచున్న సకల గ్రహ నక్షత్ర మండలమునకు నిశ్చలమగు ఆధారమగు ఆధారముగా ధ్రువుడు భగవానునిచే స్థిరముగా నిలపబడినాడు. గానుగకు మధ్యలో ఒక కర్ర పాతి చుట్టూను ఎడ్లను తిప్పుచుందురు. ఆ మధ్యలో స్తంభమునకు మేడి స్తంభమని పేరు. ధాన్యము నూరుచున్నప్పుడు ఆ మేడి స్తంభమునకు పశువులను కట్టి త్రిప్పుచుందురు. అట్లే నక్షత్రములు, సూర్యాది గ్రహములు ఈ మేడి స్తంభమునకు దగ్గరగా కొన్ని. దూరముగా కొన్ని వెలుపల కొన్ని ఉండునట్లు వాయువుచే ప్రేరణ చేయబడుచు కల్పాంతము వరకు పరిభ్రమించుచుండును. వాయు పాశమునకు వశమై ధ్రువ మండలం యొక్క ఆకర్షణ శక్తిచే గ్రహములు నక్షత్రములు అంతరిక్షము నుండి క్రింద పడవు. ఎట్టు ఆకాశమున మేఘములు, డేగలు మొదలగు పక్షులు ఎగురుచు అంతరిక్షమున నేలపడకుండా సంచరించుచుండునో. అట్లే గ్రహ మండలములు, నక్షత్ర మండలములు నేల పడకుండా అంతరాణంలో సంచరించుండును. ప్రకృతి పురుష సంయోగముచే ఏర్పడిన ఈ విచిత్రము కర్మగతులు ఆశ్చర్యకరముగా ఉండును.

అగ్ని ఊర్ధ్వముగా మండుచుండుట, వాయువు అడ్డముగా విజుచుండుట, గ్రహమండలాదులు ఆకాశమున నీలపడకుండా పరిభ్రమించుచుండు సర్వేశ్వరుని విచిత్ర శక్తికి నిదర్శనములు. శించుమారము చక్రాకారముగా ఉండు గ్రహమండలములకు ఆధారముగా ఉండు స్థానము భగవానుడగు వాసుదేవుని శరీరము. సకల చేతనా చేతనాత్మకమైన జగత్తును తన యోగ ధారణ అనగా మన సంకల్పము చేతనే వాసుదేవుడు నిలుపుచున్నాడు. అని యోగులు తమ సమాధిలో దర్శించి వర్ణించుచున్నారు. ఈ సించుమార చక్రము భగవదాత్మకముగా ఉపాసింతురు. ఒక సర్పము వర్తులాకారముగా దేహమును చుట్టుకొని క్రింద వైపు శిరస్సు వచ్చుచున్నట్లు ఉన్నచో ఎట్లు ఉండునో అట్లే సించుమార వలె ఉండును. వలయాకారముగా సర్పము వంటి ఈ శంచుమారము భగవానుని శరీరమే. దాని తోక చివర ధృవుడు ఉండునని యోగులు దర్శించిరి. ఆ సింషుమారం అనడి వలయాకార సర్పపుచ్చము చివరకు ముందు భాగమునందు ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు అను వారు నలుగురు ఉండురు. పుచ్చ మూలమందు ధాత విధాత ఉందురు. ఇట్లు శించుమార చక్రమును భగదాత్మకముగా ఉపాసించి యోగులు దర్శింతురు. కటిప్రదేశమునందు సప్తర్షులు ఉందురు. కుడివైపుగా కుడివైపు సుడిగ తిరిగి ఈ సించుమారం ఉండును. అట్లు దక్షిణావర్తము గల వలయాకారమున ఉన్న శరీరము గల సించుమారమునకు దక్షిణపు వైపు ఉత్తరాయణ నక్షత్రములు అనగా అభిజుత్తు మొదలుకొని పునర్వసు వరకు 14 నక్షత్రములు ఉండును. దక్షిణాయన నక్షత్రములు పుష్యమి మొదలు ఉత్తరాషాఢ వరకు ఎడమవైపు ఉండును. ఈ సించుమారము అను సర్పాకారముగా వర్తులముగా ఉన్న ఈ స్థానము రెండు పార్శ్వములలో అన్ని భాగములు సమానముగా ఉండును. ఈ పాము వలె ఉన్న అడుగు భాగమున నక్షత్రములు ఉండును. వీపు అజవీధి అనబడును. అజవీధి అనగా సూర్యుని దక్షిణాయనమందలి శీఘ్రగతి సాగిని మార్గము. ఆకాశ గంగ ఉదర భాగమున ఉండును. ఈ సర్పం యొక్క కుడి, ఎడమ తుంట్లు వలె పునర్వసు పుష్యమి నక్షత్రములు ఉండును. పునర్వసు నక్షత్రము ఉత్తరాయణమునకు చివర నక్షత్రం.

పుష్యమి నక్షత్రము దక్షిణాయనమునకు మొదటి నక్షత్రం. ఆర్ద్ర ఆశ్లేష నక్షత్రములు కుడి ఎడమ పాదముల వెనక భాగమునందుండును. ఉత్తరాయణ నక్షత్రములలో అభిజిత్తు మొదలు పునర్వసు వరకు ఉండేటి నక్షత్రములలో పునర్వసు, ఆర్ద్ర, అభిజిత్తు, శ్రవణము, ధనిష్ట అను నక్షత్రములు ఈ సుంచుమారము యొక్క తుంటి, పాదము, నాసిక, నేత్రము, చెవి స్థానములో ఉన్నట్లు భావింతురు. మృగశిర, రోహిణి, కృత్తిక, భరణి, అశ్విని, రేవతి, ఉత్తరాభాద్ర, పూర్వాభాద్ర అను నక్షత్రములు దక్షిణం వైపు ఉండేడి ఎముకలు. మఘా మొదలు అనారా అనురాధ వరకు ఉండెడి ఎనిమిది నక్షత్రములు ఎడమవైపు ఉండెడి ప్రక్కటముక ప్రక్కటెముకలుగా ఉండును. శతాభిషా నక్షత్రం మొదలు దక్షిణం వైపు మూపునందుండును. దక్షిణాయన నక్షత్రములలో పుష్యమి, ఆశ్లేష, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, మూల అనేటి ఐదు నక్షత్రములు పాదములు. నాసిక, నేత్రములు, కర్ణములు, స్థానములలో ఉండును. జ్యేష్ట ఎడమవైపు ఉండును. ఈ విధంగా శినుషుమారం యొక్క శరీర భాగములుగా ఆయా నక్షత్రములు ఉపాసించి భావించిరి. పై దవడ యందు అగస్త్యుడు, క్రింద డవడ యందు యముడు, ముఖమునందు అంగారకుడు, ఉపస్థయందు శని, మెడ వెనక భాగమున బృహస్పతి, వక్షస్థానమందు సూర్యుడు, హృదయములో నారాయణుడు. మనసునందు చంద్రుడు, నాభియందు శుక్రుడు, స్తనములయందు అశ్విని దేవతలు, ప్రాణాపానములందు బుధుడు, రాహువు మడయందు, కేతువు సర్వాంగములయందు. రోమములయందు సకల నక్షత్ర గణములు ఉండును. ఇట్లు సర్వ సర్వదేవతామయమగు శ్రీ మహావిష్ణువు యొక్క రూపముగా ప్రతిదినము సంధ్యా సమయంలో జ్యోతిర్మండలమును ఉపాసించవలెను. నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనుమిషాధిపతయే మహాపురుషాయ అను మంత్రములో కాలచక్రమును శరీరముగా కలిగి ఉన్న సర్వ దేవతామయమగు జ్యోతిర్మండలమును

భగవత్ స్వరూపముగా ధ్యానింపవలెను. ఈ విధముగా శించుమార చక్రపు ఆకారముగా ఉన్న భగవాను రూపమును మూడు కాలములు నమస్కరించుచు వెనక చెప్పినట్లు జపించు వారల పాపం వెంటనే రశించును. సంశయము లేదు. ఇంతవరకు. సూర్యుడు మొదలు ధ్రువుని వరకు జ్యోతిర్మండల సన్నివేశమును వర్ణించినాడు. ఇప్పుడు సూర్యునికి క్రింద వైపు 10,000 యోజనముల దూరములో రాహు నక్షత్రములే సంచరించుచుండునని. కొందరు వర్ణింతురు. ఈ రాహువు భగవానుని కృపచే అమరత్వమును గ్రహత్వమును పొందెను. అతడు జన్మచే సింహికా కుమారుడు. అసురులలో చేరినవాడు అమరత్వమునకు అర్హుడు కాడు. లోకమునంతను తన కాంతిచే వేడి చేయుచుండును. సూర్యమండలము 10,000 యోజనముల విస్తారము గలదని చెప్పుదురు. సూర్యమండలమునకు పైగా 12,000 యోజనముల విస్తీర్ణముతో చంద్రమండలము ఉన్నది. సూర్య మండలమునకు ముందుగా 3000 యోజనముల విస్తీర్ణములో రాహు మండలం ఉన్నది. ఇది సూర్య మండలము కంటే చంద్ర మండలము కంటే పెద్దది. అందుచే ఇది సంచారములో సూర్యునకు చంద్రునకు వ్యవధానము కలిగించును. ఇదియే గ్రహణమని అందురు. ఉపరాగమని కూడా అందురు. అమృతము తాగినప్పుడు సూర్యచంద్రులు తనకు అపకారము చేసినారని పగతో రాహువు వారికి ఎదురు నడిచి వారిని మరుగుపరుచుండునని చెప్పుదురు. సూర్యచంద్రులకు రాహువు వలన ఉపద్రవము కలగకుండా భగవానుడు తన సుదర్శన చక్రమును త్రిప్పుచుండునని చెప్పుదురు. సహించుటకు శక్యము గాని దాని తేజస్సుచే రాహువు సూర్యచంద్రుల వైపు వెళ్ళక దూరముగా ఉండునని చెప్పుదురు. ఆ రాహు మండలమునకు క్రిందకు సిద్దులు, చారణులు, విద్యాధరులు నివసించు స్థానములు ఉన్నవి. దాని క్రిందుగా యక్షులు, రాక్షసులు, పిశాచములు, పరేతములు, భూతములు వేరించు స్థానం ఉండును. అదియే అంతరిక్షము. వారికి గృహములు ఉండవు. అంతరిక్షమునకు క్రిందు భాగమున 100 యోజనములు దూరమున భూలోకమున్నది. ఈ భూమికి పైన హంసలు, భాసములు, అను పక్షులు, శేనములు అనగా డేగలు, సుపర్ణములు అనగా గ్రద్దలు ఎంతవరకు ఎగురుచుండునో అంతవరకు భూలోకమందురు. ఇది పూర్తిగా భూలోక వర్ణనము.

జ్యోతిర్మండల వర్ణం దీనితో పూర్తయింది. అధోలోక వర్ణనాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. ఈ రెండు భాగాలు అంటే జ్యోతిర్మండల వర్ణనము. 25వ పాడ్కాస్ట్, 24వ పాడ్కాస్ట్ లో కలిపి విని అర్థం చేసుకుంటారని భావిస్తూ మరొక పాడ్కాస్ట్ లో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Krishna, Vasudeva, Hara, the Supreme Soul, for the destruction of the sufferings of those who bow down. Salutations to Govinda. Srihari, the son of Vasudeva, who destroyed the impurities of the minds of those who bowed down, ruled the cows as Srikrishna. Salutations to the one who is the very form of life in the living beings. Tenth Canto 73rd Chapter 60th Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the 25th podcast episode of Pancham Skandham. So far, the story of Priyavarada, the description of the globe. We have learned about the description of lamps and a part of the description of the Jyotirmandala. And we'll learn about the front part. The first being, the Lord Narayana, is giving us the vision of the sun form for the welfare of the worlds. That Narayana accepts the body of the Sun and shines. The sun is the form of the three Vedas. He is the one setting the time. For the sake of the virtues of karma, he divided it into twelve. In the six seasons, according to the different types of pleasures for their respective actions, cold, sun, wind, It will cause rain. The three-fold, virtuous, and Vaishnava power is in the sun and blazes forth. With its rays, it causes the entire world to be in a state of destruction. The Rigveda's verses praise Narayana, the lord of the sun, in the morning meal. In the evening, he praises with the Brihadratha and other Samu.

His form is understandable only through the Vedas. Worshiped by the Sages. In the world of the Lord, who is in the form of the Sun, those who follow the rules of Varna and Ashrama worship the three Vedas with devotion. By performing various types of sacrifices and worship mentioned in the Vedas, one can quickly attain heaven and other worlds and also liberation. The Lord, who is the inner spirit of all the worlds, is in the middle of the earth and the heavens, in the middle of the space, in the wheel of time called Shaktumaramu. The year, which is called the year, is the one that travels in the zodiac signs starting from Aries and experiencing the 12 months. Months are formed by transiting in the signs like Makaram. There are 12 different organs in a year. They are being treated as months. The lunar calendar is based on the lunar motion of the moon. Both sides will be represented. From the star Chitta, on the full moon day, whichever star the moon is in, that month gets that name. The month of Chaitra is a full moon with the star Chitta. In the solar month, two A star is a group of stars that form a pattern. Each Nakshatra is made up of four padas. Nine padas make one rasi as the sun transits. A sixth of a year, that is, two months, if the sun moves, it is called a season. In the cycle of time, the sun moves through the six zodiac signs, and these zodiac signs are formed. The time when the sun transits through the six signs starting from Capricorn is called Uttarayanam. Six months from Cancer is the Southern Solstice. The celestial sphere is divided into 12 constellations. They call the time when the sun travels among the 12 zodiac signs a year. To the solar system

The lunar day is 12 days long. If Mesha Sankramana occurs on the day of Shukla Padyami, the solar and lunar months will begin simultaneously. The solar year increases by six days every year. In this way, there is a difference of 12 days between these two months. In five years, there will be a gap of two months. Therefore, two extra months will be formed. It is called Malamasam. Year, peri-year, idathasaramu, anuvarshamu, vatsaramu, thus, they explain the slowness and speed of the sun. The moon shines round. It travels faster than lightning, a million times faster than the speed of sunlight. The sun spends one-twelfth of a year in each of the two phases. Two stars cross the time of one foot of time, the sun crosses the time of one month. The moon travels the same distance as the sun in 30 hours. In the Shukla Paksha (waxing phase of the moon), the days of the Shukla Paksha are for the deities, and in the Krishna Paksha (waning phase of the moon), the days of the Krishna Paksha are for the deities. To the living beings The moon gives life, he is the nourisher of life. The moon is the lord of the mind. The moon is the embodiment of Anasuya. He is the physician. Because he is the cause of the life of all beings, he is described as the all-pervading one. The Lord, the Supreme Being, is the inner self of the moon, which has nineteen phases. God, father, human, ghost, animal, bird, he is the protector of all trees. Above the moon

At a distance of every 3 lakh yojanas, there are 28 constellations with Abhijit in the southern path to Meru. We know 27 constellations from Ashwini to Revati. In the middle of the Shravana Nakshatra, there is a star called Abhijit. With that, the stars are 28. Venus is 2 lakh yojanas away from this constellation. Venus, being in the sign before or after the sign of the Sun, or being equal to it, is moving. They predict the rain based on the movement of Venus. Like Venus, Mercury also moves in the same sign as the Sun, either in the front sign or the back sign, or in an equal sign. Mercury is above two lakh yojanas in the Venus mandala. It generally brings good fortune to the world. When the evil planet is far from the sun and moving, there will be strong winds or clouds, or drought. Mars will transit over 2 lakh yojanas to the Budha Mandala. He gave each of the three parties a zodiac sign It is crossing. Sometimes, in a curved motion, it comes back and then goes forward again. Mars is an inauspicious planet; if it doesn't have retrograde motion, it will be favorable. Jupiter is transiting over 2 lakh yojanas in the Kuja Mandala, which is the Guru Mandala. If he were not of crooked gait, he would be favorable to Brahmins. He travels in each zodiac sign for one year. Saturn is located over two lakh yojanas from the Jupiter mandala. It travels for thirty months in each zodiac sign.

Because he moves slowly, he is called the slow-moving one, hence the name of the planet is Saturn. When he is in the birth sign before the birth sign, he will be inauspicious to everyone for 60 months. Above the Shani Mandala, at a distance of one hundred thousand yojanas, the Saptarshi Mandala shines. They bring comfort to the world. These seven sages, in the highest position of all, revolve in the Dhruva Mandala as a circumambulation. The Dhruva constellation is 13 lakh yojanas away from the Saptarshi Mandala. It is the most famous Paramapada. It is described as the place of manifestation of Vishnu. There, the great devotee, the son of Uttanapada, Dhruva, is being circumambulated with great respect by Agni, Indra, Prajapati, Kashyapa, and Dharma. It is being done. It is being worshiped. For those who live in this world, Dhruva is the one worthy of service. The Lord, being made to revolve by time, to all the planets and constellations, as a firm, stable foundation, Dhruva was established by the Lord. A stick is planted in the middle of the well, and the oxen are around it They are turning it. In the middle, the pillar is called the maddi pillar. When the grain is being ground, they tie the cattle to the milestones and make them run. Similarly, stars, sun and planets are close to this pillar. It is being propelled by air, as if some are outside, some are inside, and it is revolving until the end of the universe. Being subject to the air-pull, the planets and stars do not fall from space due to the attraction force of the Dhruva Mandala. How are the clouds in the sky, the eagles and other birds flying in the sky without touching the ground? Similarly, planetary systems and star systems move in the interplanetary space without falling to the ground. This peculiarity, formed by the union of nature and man, is surprisingly the result of karma.

The fire burning vertically, the wind blowing horizontally, the planets revolving in the sky without turning blue, are examples of the strange power of the Lord of all. The place that is the basis for the planets that are in a circular shape, is the body of Lord Vasudeva. The entire world, which is full of consciousness, is sustained by Vasudeva through his yoga practice, that is, through our will. And the yogis are describing their visions in their samadhi. They worship this auspicious chakra as being full of God. If a serpent coils its body in a circular shape and its head appears to be coming downwards, it will be like a snake. This Shankhamaramu, which is like a serpent in a spiral shape, is the body of the Lord. Yogis saw that Dhruva was at the end of its tail. That Sinhsumaram, a serpent with a circle, finally, in the front part, there will be four people named Prajapati, Agni, Indra, Dharmudu. The giver and the creator are at the root of the watermelon. Thus, the yogis, worshipping the Chakra, which is full of devotion, see. In the pelvic region The Saptarishis are present. Turn right, turn right and this will be the turn. Thus, for the Sinchumaramu with a circular shape and a body, on the southern side, the Uttarayana constellations, that is, from Abhijuthu to Punarvasu, there will be 14 constellations. The southern stars are on the left side from Pushyami to Uttara Ashada. This place, which is like a serpent and in the form of a circle, has all parts equal on both sides. There are stars on the foot part that looks like a snake. The back is called the Ajwadi. Ajavidhi means the path of the quick movement of the sun in the southern hemisphere. The sky is full of stars. Like the right and left arms of this serpent, there will be Punarvasu and Pushyami constellations. Punarvasu is the last nakshatra in Uttarayanam.

Pushya is the first nakshatra in the Dakshinayanam. The Ardra Ashlesha nakshatram is located on the back of the right and left feet. In the Uttarayana constellations, from Abhijit to Punarvasu, in the constellations, Punarvasu, Ardra, Abhijit, Shravana, Dhanishta, these constellations are the hip, foot, nose, eye of this Sunchumaram, They think it is in the ear location. Mrigashira, Rohini, Krittika, Bharani, Ashwini, Revati, Uttarabhadra, Purvabhadra are the constellations that are on the south side. From Magha to Anarada, the eight stars that are there, the left side, the side, the side, the side, will be like ribs. The Shatabhisha star starts from the south and ends at the north. In the Dakshinayana Nakshatrams, there are five Nakshatras named Pushyami, Ashlesha, Uttarashada, Purvashada, and Moola. It is in the nose, eyes, ears, and place. Jyeshta will be on the left. In this way, the various stars were considered as the body parts of Shinushumaram. Agastya in the upper jaw, Yama in the lower jaw, Mars in the face, Saturn in the forehead, Jupiter in the back of the neck, the Sun in the chest, and Narayana in the heart. The moon in the mind, Venus in the navel, the Ashwini deities in the breasts, Mercury in the life force, Rahu in the stomach, Ketu in all limbs. In the hair, all the constellations are there. Thus, as the form of Sri Maha Vishnu, who is the embodiment of all gods, one should worship the Jyotirmandalam every day in the evening. Salutations to the one who is the lord of time, the lord of the universe, the great being, the one who has the wheel of time as his body, the all-divine Jyotirmandala

Meditate on the form of the Lord as you would a deity. In this way, the form of the Lord, which is in the shape of a churning wheel, as said before, the sin of those who chant it immediately will be removed. There is no doubt. Until now. From the sun to Dhruva, he described the scene of the solar system. Now, it is said that Rahu Nakshatra is moving at a distance of 10,000 yojanas below the sun. Some people describe it. This Rahu attained immortality and omniscience by the grace of God. He is the son of Simhika, born out of birth. One who joins the Asuras is not worthy of immortality. Heat the whole world with his light. They say that the solar system is 10,000 yojanas in extent. The lunar sphere has an area of over 12,000 yojanas above the solar sphere. Before the solar system, there is Rahu Mandalam in an area of 3000 yojanas. It is bigger than the solar system but smaller than the lunar system. Therefore, this provides a gap between the sun and the moon in the transit. It is the eclipse, they say. They also call it Uparagam. Amrutham When drunk, they say that the sun and moon have harmed them, and that Rahu, in revenge, is walking against them and hiding them. They say that the Lord turns his Sudarshana Chakra to prevent any calamity to the Sun and Moon due to Rahu. It is said that because of its intensity, Rahu will not go towards the Sun and Moon and will stay far away, which is impossible to bear. Below that Rahu Mandala, there are places where Siddhas, Charanas, and Vidyadharas reside. Below that, there is a place where Yakshas, Rakshasas, Vishachas, Peretamulu, and Bhutamulu reside. It's the cosmos. They don't have houses. In the lower part of space, 100 yojanas away, there is the earth. Above this earth, swans, bhasamulu, and other birds, senamulu meaning cranes, and suparnamulu meaning eagles, will fly as far as they can in the earthly realm. This is a complete earth description.

The Jyotirmandal varnam is complete with this. We will learn about the description of Adholoka in another podcast. These two parts are the description of the Jyotirmandala. Hoping that they will understand by listening together in the 25th podcast and 24th podcast, let's meet in another podcast. Jai Srimannarayana. Salutations to the Gurus