సృష్టి-ప్రళయ కాల విచారణ - ద్వితీయ స్కంధ సమాప్తి

Inquiry into Cosmic Dissolution & Conclusion of Canto 2

bhagavatam

ద్వితీయ స్కంధపు ఈ గంభీరమైన ముగింపు ఎపిసోడ్‌లో, శుకదేవ గోస్వామి మరియు మహారాజు పరీక్షిత్తు కలిసి సృష్టి, స్థితి, మరియు ప్రళయముల స్వరూపమును శ్రీ విష్ణు భగవానుని సంకల్పముతో అన్వేషిస్తారు. బ్రహ్మదేవుని పద్మము నుండి జగత్తు ఉద్భవించి, చివరకు పరమాత్మలో లయమగు ఈ కాల చక్రము — సృష్టి-ప్రళయము రెండూ భగవంతుని శ్వాసయే అని ఈ సందర్భము సుస్పష్టము చేస్తుంది. శ్రీమద్భాగవతముయొక్క దశ లక్షణములు ఇచట పరిచయమై, మిగిలిన స్కంధములకు అధ్యాత్మిక దిశానిర్దేశనము చేయుచున్నవి.

In this profound concluding episode of Canto 2, Śukadeva Gosvāmī and Mahārāja Parīkṣit engage in a deep inquiry into the nature of cosmic creation, sustenance, and dissolution as they unfold within the supreme will of Lord Viṣṇu. The discussion illuminates the cyclical rhythms of time — from the emergence of the universe through Brahma's lotus to its eventual reabsorption into the Lord — revealing that both creation and dissolution are simply the breath of the Infinite. The Canto closes with the ten essential topics of Śrīmad Bhāgavatam beautifully introduced, establishing the scriptural and spiritual framework that will guide all remaining cantos.

← Prev Next →
Inquiry into Cosmic Dissolution & Conclusion of Canto 2 bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః అంశాంశాస్తే దేవ మరీచ్యాదయ ఏతే బ్రహ్మేంద్రాద్యాదేవ గణారుద్ర పురోగాః క్రీడా భాండం విశ్వమిదం యస్య విభూమన్ తస్మై నిత్యం నాధ నమస్తే కరవామ కలవ్యాపక సర్వేశ్వర దేవతలు మరిత్యాదులు బ్రహ్మేంద్రాదులు రుద్ర ప్రభృతులు నీ అంశాంశలుగా నొందురు. ఈ ప్రపంచమంతా నీకు క్రీడా భాండముగా నుండును. అట్టి నీకు నమస్కరించెదను. ఫోర్త్ క్యాంటో, సెవెంత్ చాప్టర్ 43rd ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపికలో ద్వితీయ స్కంధము 17వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితం మనము భగవంతుడి యొక్క సృష్టి ఎలా అవుతుంది, మన ఇంద్రియములో ఎలా ప్రవేశిస్తాడు, ఒక్కొక్క ఇంద్రియం ఎలా మనకు ఆ మార్పు చెందుతుంది ఈ విషయాల్లో తెలుసుకున్నాం. ఈ భాగాన్ని ఇంతక్రితం చెప్పిన భాగాన్ని మరొకసారి కూడా వినాలి. ఈ వచ్చే భాగంతో మనకు ద్వితీయ స్కంధం పూర్తవుతుంది. సో ఈ భాగాన్ని కూడా చాలా జాగ్రత్తగా వినాలి. రెండోసారి కూడా వినాలని మనవి. అప్పుడు ఆ సమిష్టి పురుషునకు చక్షునింద్రియము బయలు వెడలెను. ఆ ఇంద్రియము నుండియే వ్యష్టి శరీరములో నేత్రములు ఏర్పడెను. ఇప్పుడు కన్ను అధిష్టానము, ఇంద్రియము చక్షువు. ఆ కంటిలో రూపమును ఎరుగుటకు అభిమాన దేవత సూర్యుడు లేదా వెలుగు. అది గ్రహించు విషయము రూపము. ఇట్లు ఇంద్రియములు అన్నియు సమిష్టి పురుషునిలో ఏర్పడి వ్యష్టి శరీరమునకు కలిగినవి. వేదములలో తెలియజేయబడు జ్ఞానమును ఎరుంగుటకు కోరిక కలిగిన సమిష్టి పురుషునకు కరణములు ఏర్పడెను. ఆ కరణముల యందు శ్రోత్రమును ఇంద్రియము ఏర్పడెను. అది శబ్దమును గ్రహించును. శ్రోత్రమునకు అభిమాన దేవత దిక్కులు.

తర్వాత ఆ పురుషునకు వస్తువుల యొక్క మెత్తదనము, గట్టిదనము, వెచ్చదనము, చల్లదనము గ్రహించవలెనడి కోరిక కలిగెను. అప్పుడు చర్మము ఇంద్రియము అధిష్టానముగా త్వక్ అనబడి ఇంద్రియము బయలుదేరెను. దానికి వాయువు అభిమాన దేవత దానిచే గ్రహింపబడున్నది స్పర్శ తేలిక బరువు మొదలగు వానిని గ్రహించున్నది కూడా త్వక్ ఇంద్రియమే త్వక్ ఇంద్రియము బాహ్య చర్మమునందు అంతర్ చర్మమునందు కూడా ఉండును. బాహ్య చర్మమున స్పర్శ తెలియును, అంతర్ చర్మమున దురద తెలియును. రెండు చోట్లను త్వక్ ఇంద్రియము స్పర్శనే గ్రహించును. దానికి వాయువు దేవత సమిష్టి పురుషునిలో ఇచ్చుట పుచ్చుకొనుట మొదల కర్మలు చేయవలెనని కోరిక కలిగెను. అప్పుడు అతనికి చేతులు బయలు విడలెను. ఆ చేతుల నుండియే వ్యష్టి శరీరములో చేతులు ఏర్పడెను. పాణి అనునది ఇంద్రియము, దానికి హస్తము స్థానము. ఈ ఇంద్రియమునకు ఇంద్రుడు అధిష్టాన దేవత. హస్తద్వయమును ఆశ్రయించి ఉండు పాణి అను ఇంద్రియమునకు ఇచ్చుట, పుచ్చుకొనుట మొదలగునవి వ్యాపారములు. తరువాత సమిష్టి పురుషునకు పాదములు బయలు వెలిగినవి. వాని నుండియే వ్యష్టి శరీరములో పాదములు వచ్చెను. పాదములు అధిష్టానము. ఆ పాదముల యందు నడుచు సామర్థ్యము కలిగిన పాదములు అనేటి ఇంద్రియము ఇంద్రియము ఆవిర్భవించెను. దానిచే గమనము ఆగమనము అనగా రాకపోకలు జరుగుచుండెను, దీనికి విషయము యజ్ఞములో ఉపయోగించు హోమ ద్రవ్యమును తెచ్చుట. దీనికి విష్ణువు అధిదేవత సంతానమునకు కారణమగు ఆనంద హేతువుకు రతిని అనుభవింపవలెనని చతుర్ముఖ బ్రహ్మకు సంకల్పం కలిగెను. అప్పుడు శిష్ణము అను అధిష్టానమందు ఉపస్థ అనేటి ఇంద్రియం ఆవిర్భవించెను. దీనికి ప్రజాపతి అధిష్టాన దేవత. ఇవి చేయు కర్మ రతి. ఆనందము దీనిచే పొందెడి విషయము. స్త్రీ పురుషుల కలయికలో కలుగు సుఖము ఇంద్రియ ఆధీనమై ఉండును. సమిష్టి పురుషునకు స్వీకరించడి ఆహారములోని మలమును వెలుపలికి. వదలవలెనని కోరిక కలిగెను. అప్పుడు గుదము అను అధిష్టానమందు పాయువు అనేటి ఇంద్రియం ఆవిర్భవించెను. దానికి మిత్రుడు అధిష్టాన దేవత లోనున్న మలమును విడుచుట దీని యొక్క వ్యాపారము.

శరీరము నుండి వేరు శరీరములకు వెళ్ళవలెనని కోరిక సమిష్టి పురుషునకు కలిగెను. అప్పుడు ఆ బ్రహ్మకు నాభి అను ద్వారము బయలు బడెలను. ఆ నాభి ద్వారమందు అపానము అను వాయువు ఇంద్రియముగా ఉండును. ఆ అపానం వలన మృత్యువు ఏర్పడును. దీని అధిష్టాన దేవత మృత్యువు. దీని వలననే జీవుడు శరీరమును వీడిపోవును. అన్నమును నీటిని లోపలకు స్వీకరించవలెనని కోరిక కలగని కడుపులోని ప్రేగులు ఏర్పడెను. కుక్షి అనగా కడుపు అధిష్టానము దానియందు అంత్రములు అనగా ప్రేగులు అన్నము గ్రహించుటకు సాధనము నాడులు నీటిని గ్రహించుటకు ఉపకరించును. అంత్రములు, నాడులు అనునవి రెండు మన కడుపులో ఏర్పోవుటకు ఆ సమిష్టి పురుషుని కడుపులో ఏర్పడిన అంత్రములు నాడులే కారణము. వీనికి నదులు, సముద్రములు అధిదేవతలు. వీని వలనే మనకు సంతుష్టి, పుష్టి కలుగును. తినినది, త్రాగునది చాలును అనిపించుట తుష్టి. శరీరము పెరుగుట పుష్టి. మన స్వరూపమును మరుగుపరచడి మాయను గూర్చి ఎరంగవలెనని కోరిక చతుర్ముఖునిలో కలగగానే హృదయము ఏర్పడెను. ఆ హృదయమునడి అధిష్టానమునందు మనస్సు అనడి ఇంద్రియము ఏర్పడెను. దానికి అభిమాన దేవత చంద్రుడు. సంకల్పము అనడి వ్యాపారమును మనస్సు చేయును. ఆ సమిష్టి పురుషుని మనస్సు నుండి వ్యష్టి శరీరములో మనస్సు ఏర్పడెను. ఈ విధముగా సమిష్టి పురుషుని ఆయా భాగముల నుండి వ్యష్టి పురుషుని అవయవములు ఏర్పడినవి. ఇవి అన్నియు భూతముల యొక్క సంబంధం కలవే. అయినను ఒక్కొక్క ఇంద్రియములో ఒక్కొక్క భూతం యొక్క ప్రాబల్యము కలదు. చర్మము త్వక్ అనడి స్పర్శను గ్రహించు ఇంద్రియము రెండు విధములు స్థూలమైన లోపలది చర్మమని పైనుండే సూక్ష్మము చర్మమును త్వక్ అందురు ఈ త్వక్ చర్మము మాంసము రక్తము కొవ్వు మజ్జ ఎముకలు అననవి ఏడు ధాతువులు ఈ ఏడు ధాతువులు భూమి, జలము, తేజస్సు అను మూడు భూతములచే ఏర్పడినవి. ప్రాణము, ఆకాశము, జలములు, వాయువు అను వానిచే ఏర్పడినవి ఇంద్రియములు. శబ్దము మొదలగు గుణములు గ్రహించుట స్వభావముగా గలవి. శబ్దము మొదలగు గుణములు భూతాది అను అహంకారము నుండి పుట్టినవి. ఇంద్రియములు కూడా ఆ భూతాది అనేటి అహంకారము నుండి వెలువడినవే.

మనస్సు, కామము, సంకల్పము మొదలగు సర్వ వికారములకు ఆశ్రయమైనది. బుద్ధి అన్నిటినీ ఎరింగెడి స్వభావము కలది. అదే మహత్తత్వం. ఈ చేతనా చేతనాత్మకమగు దేవ మనుష్య తిర్యక్ స్థావర రూపమగు శరీరములతో నిండిన ఈ అండము భగవానుని యొక్క స్థూల రూపము కంటే ఆవల సూక్ష్మ తరమగు పరిశుద్ధ ఆత్మ స్వరూపము కూడా భగవానుని రూపమే. అది చాలా సూక్ష్మమైనదగుటచే కన్ను మొదలగు ఇంద్రియములచే గ్రహింపబడదు. కావున అది అవ్యక్తము. శబ్ద స్పర్శాది గుణములు లేనిదగుటచే అది నిర్విశేషము. అందుచే ఇంద్రియములచే గ్రహింపబడదు. అది వాక్కునకు మనస్సునకు అందనిది. దేవుడు మనుష్యుడు అని వ్యవహరింపబడిన నామములకు గాని బుద్ధికి గాని గోచరము కానిది. ఆది, మధ్యము, అంతము లేనిది. ఇది మూడు కాలముల యందు ఉండునదగుటచే ఒక కాలమందు పుట్టునది, ఒక కాలమందు ఉన్నది, ఒక కాలమందు పోవునది అని చెప్పుటకు వీలు కానిది. ఈ విధముగా ప్రకృతి మండలమును దాటి ఉన్న ముక్తాత్మ స్వరూపము కూడా భగవాను రూపము. ఆ రెండు రూపములు కూడా ఉపాసకులు తమ మనస్సుకు శుభాశ్రయముగా ఆశ్రయించుటకు తగునవి. సర్వజ్ఞుడైన పరమాత్మ యొక్క సంకల్పాధీనమైన స్థితి కలవి కనుక అవి ధ్యానమునకు ఉపకరించునవి కావు. ప్రకృతితో కూడియున్న జీవులు అవిద్యచే ఆవరింపబడిన వారు కనుక వారు అపరిశుద్ధులు. వారు ధ్యానింప తగరు. ముక్తి పొంది ప్రకృతి సంబంధము లేకపోయినను ఆత్మలు సహజముగా పరిశుద్ధములు కావు కనుక వానిని కూడా ధ్యానింప తగదు. వేదాంతములచే ప్రతిపాదింపబడిన ఆదిత్య వర్ణము సర్వ జగతాకారమైన పరమాత్మ రూపమే ఉపాసించ ఉపాసింపదగినది. వీటిని అన్నిటినీ భగవానుని విభూతిగా ఉపాసన చేయవచ్చును గానీ భగవత్ తత్వముగా ఉపాసింపరాదు. భగవానుడే శబ్దములుగా ఆ శబ్దములచే ప్రతిపాదింపబడు అర్థములుగా ఏర్పడినాడు. అందుచే చతుర్ముఖుడు సృష్టి చేసిన వాడుగా కనపడినను ఆ చతుర్ముఖుడు కూడా బ్రహ్మాత్మకుడు గావున లోకములో దేవుడు మనుష్యుడు మొదలగు పేర్లు గల సకల రూపములు.

అవి చేయు వ్యాపారములను కూడా ఆ భగవానుడే తాను లోన ఉండి ధరించుచున్నాడు. కర్మకు వశము కాని వాడై తన సంకల్పం మాత్రము చేత విశ్వమునంతను తన నుండి బయలు విడువినట్టు చేసి తాను అందు చేరి. వాని దోషములు ఏవియు తనకు అంటక ధరించి నియమించుచుండును. ప్రజాపతులు, మనువులు, దేవతలు, ఋషులు, పితృ దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, అసురులు. గుహ్యకులు, కిన్నెరలు, అప్సరసలు, నాగములు, సర్పములు, కింపురుషులు, ఉరగములు, రాక్షసులు, పిశాచములు, ప్రేతములు, భూతములు, వినాయకులు, కూష్మాండములు, ఉన్మాదములు, బేతాళములు, బేతాళములు, యాతుదానులు అనే రాక్షసులు. గ్రహములు, పక్షులు, మృగములు, పశువులు, వృక్షములు, కొండలు, ప్రాకడి జంతువులు మొదలగు వాని అన్నిటినీ ఆ భగవానుడే లోన ఉండి ధరించుచున్నాడు. తల్లి కడుపులో ఉండి, మావిలో ఉండి పుట్టినవి కనుక జరాయుజములు. గుడ్డుగా పుట్టి బయలుబడినవి అండజములు. చెమట వలన పుట్టెడి పేలు మొదలగు శ్వేతజలములు. భూమి నుండి మొలచున్నవి ఉద్బిజములు అనే నాలుగు రకముల జీవరాశి దేవతలు, మనుష్యులు, తిర్యక్కులు అనగా పశుపక్షాదులు, స్థావరములు, కొండలు, వృక్షములు మొదలగు వానిని కూడా భగవానుడే ధరించుచున్నాడు. చేతనములు అనగా చైతన్యము గల జీవులు, అచేతనములు అనగా చైతన్యము లేని జడమగు ప్రకృతి కూడా ఆ భగవానుడి చేతినే ధరింపబడుచున్నది. నీటిలో ఉండునవి. భూమిపై ఉండునవి, ఆకాశమందు ఉండునవి కూడా ఆ భగవానుని చేతనే ధరింపబడుచున్నవి. ఇట్టి శరీరములో జీవులు చేయు వ్యాపారముల వలన. ఉత్తమములు, మధ్యమములు, అధమమగు ఫలములు సిద్ధించుచుండును. సత్వము, రజస్సు, తమస్సు అనేటి గుణముల వలనే ఆయా దేహములు కలుగుచున్నవి. సాత్వికమగు కర్మలగు ఫలముగా సుఖముతో నిండిన దేవ శరీరం వచ్చును. రజోగుణం వలన సుఖము, దుఃఖము కలిగి కలిసి ఉండడి శరీరములు స్థావర జన్మములు వచ్చును. వీరిలో కూడా మరల ఒక్కొక్క తమోగుణం వలన దానిలో మూడేసి రకముల వారుందురు. కావున కర్మలచే కలిగెడి ఫలములు అనంతములు.

గా ఉండును. ఈ విధముగా భగవానుడు చతుర్ముఖ బ్రహ్మలో తాను ఆత్మగా ఉండి సృష్టి చేయును. వరాహ రూపమును, మీన రూపమును, కూర్మ రూపమును, హంస రూపమును దాల్చి. తిర్యగ్రూపమున ఉండియు రాముడు, కృష్ణుడు మొదలగు నరరూపమున ఉండియు వామనుడు, యజ్ఞుడు మొదలగు దేవరూపమున ఉండియు ఈ విశ్వమును స్వయముగా పాలించును. అతడే ధర్మమే శరీరముగా గలవాడై లోకమును పోషించును. ఒకనాడు అతడే కాలము అనగా మృత్యువునకు, అగ్నికి, రుద్రునకు తాను ఆత్మగా ఉండి వానిని తన శరీరముగా ధరించి వారి ద్వారా ఈ విశ్వమును కల్పాంతమునందు అణిగిపోవునట్లు చేయును. సంహరించును. గాలి మేఘమును లేకుండా చేయునట్లు భగవానుడై విశ్వమును లేకుండా చేయును. జీవుని వ్యాపారములు కర్మాధీనములు. పరమాత్మచే జగత్ వ్యాపారములు కర్మాధీనము కావు. భగవానుడు జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులచే అధికుడు. అతడు జ్ఞాన శక్త్యాదులు కలిగిన బ్రహ్మ రుద్రాదుల కంటే పరిపూర్ణ జ్ఞానం కలవాడవుటచే భాగవోత్తం భాగవోత్తముడు. జ్ఞానులు బ్రహ్మవేత్తలు ఇట్టివాడుగా భగవాన్ని గుర్తింపజాలరు. పరమాత్మ తనచే సృజింపబడిన జగద్రూపమున ఉండును సృజింపబడు జీవుడగును. జీవుడుగాను ఉండును. అతడు జన్మలేని వాయుడై వాడైయును జన్మించును. తానే జన్మించు వాడైయు తాను జన్మింపబడని మనకు ఉపనిషత్తులు చెప్పుచున్నవి. ఇట్ అది ఎట్లు కుదురునో ఎరంగవలెను. పరమాత్మ తాను స్వరూపముచే జన్మింపడు. సృజింపబడినవాడు తానే అగును. అతడు స్వరూపముచే జన్మ లేనివాడు కానీ చేతనా చేతనములు సృజింపబడుచుండును. కనుక వారిలో ఆత్మగా ఉండుటచే తానును పుట్టుగలవాడెగును. భగవానుడు ఈ జగత్తును కర్తాగునా కాదా? జీవుల వలె ప్రకృతి వికారములగు ఇంద్రియములతో కూడిన శరీరముతో సృష్టించువాడు కనుక శరీరాధీనము కరుతృత్వం అతనికి లేదు. సంకల్పం మాత్రముచే అతడు సృజించును కనుక అతడు కర్తయే. ప్రపంచం వలె కర్మాధీనమగు పరమాత్మకు జన్మలు లేవు. తన సంకల్పముచే తాను జన్మించును. అందుచే జన్మలేని వాడని జన్మించును అని ఉపనిషత్తులు చెప్పును. భగవానునకు జన్మము, కర్మము మొదలగనివి తన సంకల్పముచే కల్పించబడినవి. ఆ సంకల్పమునకే మాయ అని పేరు. మాయావైనం జ్ఞానం అని నిఘంటులో మాయకు జ్ఞానము పర్యాయపదంగా చెప్పబడినది.

భగవద్గీతలో భగవానుడు సంభవామి ఆత్మమాయయా నా సంకల్పము చేతనే నేను జన్మింతును అని చెప్పెదను. అందుచేత భగవానుడు తన మాయచే అనగా తన సంకల్పముచే జన్మలేని తనయందు జన్మను కర్మను కలిగించుకుంటున్నాడు. ఇంతవరకు బ్రహ్మ యొక్క మహా కల్పము అవాంతర కల్పము సంగ్రహంగా చెప్పబడినది. ఈ కల్పమునందు వలనే ఇతర కల్పములు నందు కూడా సృష్టి ప్రళయము జరుగును. ప్రకృతి యొక్క వికారములకు మహత్తు మొదలగు పృథ్వి వరకు బయలు వెడలిన మార్పులకు ప్రాకృత సృష్టి అని పేరు. వాని యొక్క కలయికచే సృష్టింపబడిన వ్యష్టి రూపములకు వైకృత సృష్టి అని పేరు. ఇక ముందు కాలం యొక్క పరిణామమును కల్పం యొక్క లక్షణమును తెలియజేసెదను. పాద్మ కల్పమును నీకు వివరించెదను వినుము అని సుఖయోగి పరీక్షిత్తునకు అడిగిన ప్రశ్నకు సమాధానముగా చెప్పెను. ఇట్లు సూతుడు చెప్పుచున్న భాగవత పురాణము శ్రవణము చేయుచున్న శౌనక మహర్షి నైమిశారణ్యమున సూతుని ఇట్లు ప్రశ్నించినాడు. విదురుడు విడుచుటకు శక్యముగాని బంధువులను వదిలి భూమండలమున గల తీర్థములను సేవించుటకు వెళెనని చెప్పిరి కదా. అతడు మైత్రేయుని ఎచర కలిసినాడు? ఆత్మజ్ఞానం ఆ మైత్రేయుని వలన ఎట్లు ఎరంగినాడు? విదురుడు అడగగా మైత్రేయుడు ఎరంగించిన తత్వను మాకు ఎరంగింప కోరుచున్నాను. విదురుడు బంధువులను విడుచుట, మైత్రినితో కలుచుట మొదల వృత్తాంతం ఎరుంగింప గోరుచున్నాను. ఇట్లు షానుగుడు ప్రశ్నింపగా వెనుక పరీక్షిత్తు ప్రశ్నింపగా మహాముని యొక్క శుకయోగి అతని ప్రశ్నను అనుసరించేట్లు సమాధానం చెప్పెను చెప్పెదని వినుడు అని సూతుడు చెప్పుచున్నాడు. దీనితో ద్వితీయ స్కంధము సమాప్తము. ఈ స్కంధంలో ఈ చివరి మూడు పాడ్కాస్ట్లని రెండు సార్లైనా సరే విని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ యొక్క స్కంధము నుండి. మరొక పోడ్కాస్ట్ లో మనం తృతీయ స్కంధంలో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmad Gurubhyo. These are the parts of the gods, Maricha and others, Brahma, Indra, and other gods, Ganarudra, Purogaha. This universe is His playground, His glory. To Him, I eternally bow. Karaiva, the destroyer of the illusion, the Lord of all, the gods Thus, the Brahma, Brahma, Rudra, and other deities, as parts of you, you receive. The whole world is your plaything. I will bow down to you. Fourth Canto, Seventh Chapter 43rd Prayer. Devotees of God, welcome to the second episode of the second book, Srimad Bhagavata Tatva Deepika, in the 17th podcast. Previously, we learned how God's creation happens, how he enters our senses, and how each sense changes for us. This part, the part I mentioned earlier, should be listened to once again. With this coming part, our second Skandha is completed. So this part also needs to be listened to very carefully. We'd like to hear it a 2nd time. Then, the collective man's eye-sight was revealed. From that sense, individual Eyes were formed in the body. Now the eye is the locus of attention, the sensory organ, the eye. The eye's form is known as the sun god or light. That which is perceived is the form. Thus, all the senses are formed in the collective being and are related to the individual body. For the collective man who has a desire to know the knowledge revealed in the Vedas, instruments were created. In those ears, the ear and the sense organ were formed. It can take in sound. The directions are the deity's favorite direction for the ear.

Then that man desired to know the softness, hardness, warmth, and coldness of the objects. Then the skin, the sensory organ, the lid, as the presiding organ, the sense organ emerged. To that, the air is the beloved deity, it is perceived by touch, light, weight, etc., that is also perceived by the skin. The skin is also present in the outer skin and the inner skin. The external skin feels the touch, the inner skin feels the itch. The two senses perceive touch. For that, a desire arose to perform actions such as giving and receiving in the collective male deity of air. Then his hands were let loose. From those hands, the individual body was formed. Pani is the sensory organ, and the hand is its place. Indra is the presiding deity of the sense. Giving, receiving, etc., to the sense of the hand, which is dependent on the two hands, are transactions. Then the feet of the collective man were revealed. From him, individual The feet have come into the body. The feet are the base. The feet that have the ability to walk, the feet, the senses, the senses manifested. By that, movement and arrival, meaning arrivals and departures, were happening. The matter for this is to bring the sacrificial material used in the Yagnya. For this, Vishnu, the cause of the supreme deity's progeny, to experience the blissful cause, a resolve arose in the four-faced Brahma. Then, in the supreme abode called Shishnam, the sense of Upastha (or Upastha-indriya) manifested. It is the presiding deity of the Prajapati. These are the karmic duties. Joy is the subject that can be obtained from this. The pleasure derived from the union of man and woman is dependent on the senses. The collective man accepts the excrement in the food outside. A desire arose to let go. Then, in the abode called the anus, the organ called the anus manifested. For that, the friend, the deity of the establishment, to release the dirt within, this is its business.

The desire to go to separate bodies from the body arose in the collective man. Then, through the navel, the door of Brahma opened. That apana vayu is the sense organ in the navel. Death is caused by that disease. Its patron deity is the goddess of death. It is because of this that the soul leaves the body. A desire to take food and water inside developed, and the intestines formed in the stomach. Kushi means the stomach, its openings, that is, the intestines, are the means for the body to absorb food, and the nerves are useful for absorbing water. The pores and nerves, these two, to form in our stomach, the pores and nerves formed in the stomach of that collective man are the reason. He is the god of rivers and seas. It is the one who take the vow who is to be the object of veneration and reverence. Satisfaction of the need to eat and drink. Body mass index. The desire to hide our true form and to speak ill of Maya arose in the four-faced one as soon as it occurred. In that heart, in the base, in the presiding, the mind, the sensory organ, was established. To that The moon is the deity of affection. The mind makes the intention and the business. From the mind of that collective man, the mind was formed in the individual body. In this way, the individual parts of the collective male are formed from the various parts. All of these are related to ghosts. However, each sense organ has the influence of a different element. The skin, the skin, the sensory organ that perceives touch, is of two types: the gross one inside is the skin, and the subtle one above is the skin. They call the skin the skin, the skin, the flesh, the blood, the fat, the marrow, the bones, and so on. These seven elements, these seven elements Land, They are made up of three elements, namely water, light, and heat. Life, sky, water, and air are the senses that are formed by them. They are inherently capable of perceiving sounds and other qualities. The qualities like sound etc. are born from ego, which is the beginning of the world. The senses also originate from the ego called bhutadi.

The mind, desire, resolve, and all other distortions are dependent on it. Intelligence is all about the nature of the prey. That is the great element. This conscious, active, divine, human, and stable form of body, filled with these eggs, is more subtle than the gross form of the Lord, and the pure soul form is also the form of the Lord. It is very subtle, therefore it cannot be perceived by the senses like the eye. Therefore, it is unmanifest. Because it is devoid of sound, touch, etc., it is indivisible. Therefore, it cannot be perceived by the senses. It is beyond words and mind. That which is not visible to the name or intellect that is considered as God and man. It is a timeless entity. Because it exists in three periods, it is impossible to say that it is born in one period, exists in one period, and goes in one period. In this way, the form of the soul that transcends the natural realm is also the form of the Lord. Those two forms are also suitable for devotees to take refuge in their minds. Of the omniscient Supreme Being Because they are a state dependent on resolve, they are not conducive to meditation. Living beings who are connected with nature, because they are covered by ignorance, they are impure. They don't need to meditate. Having attained liberation, even if there is no connection with nature, souls are not naturally pure, therefore, they should not be meditated upon. The Aditya Varnam, propounded by the Vedas, is the form of the Supreme Soul, which is the form of the entire universe, and is worthy of worship. All of these can be worshipped as the manifestation of God, but not as the essence of God. God himself is formed as the sound and as the meaning that is proposed by those sounds. Therefore, even though the four-faced one appears to be the creator, that four-faced one is also the Brahmateemakudu, therefore, in the world, God, man, and all forms with names like these.

He Himself is also the one who is within and wears out the businesses that He Himself does. He, being beyond the control of karma, made it so that the entire universe was released from him by his determination alone, and he reached it. Whose faults are he appointing to himself, holding them close. People, humans, gods, sages, ancestors, siddhas, charanas, gandharvas, Vidyadharas, and Asuras. Gupyakulu, Kinneralu, Apsarasalu, Nagamulu, Sarpamulu, Kimpurushulu, Uragamulu, Rakshasulu, Pishachamulu, Pretamulu, Bhutamulu, Vinayakulu, Kushmandamulu, Unmadhamulu, Betaalamulu, Betaalamulu, Yathudanulu are the demons. Planets, birds, animals, cattle, trees, mountains, wild animals, etc., all of them are being protected by that Lord residing within. Those born from the mother's womb, from the womb, are Janayujas. Eggs are born and hatch as ovipositors. Sweat-born worms and other white water. Those that sprout from the earth are four types of living beings: gods, humans, and animals Animals, birds, settlements, mountains, trees, etc., are also adorned by the Lord. Conscious beings, meaning living beings with consciousness, and unconscious beings, meaning inanimate nature without consciousness, are also being governed by that Lord. The ones that live in water. Those that are on earth, those that are in the sky, are also being ruled by that God. From the businesses that creatures do in this body. The best, the medium, and the inferior fruits are being prepared. Sattva, Rajas, and Tamas are the qualities by which the respective bodies are formed. As a result of virtuous deeds, a divine body filled with happiness will come. Due to the quality of passion, happiness and sorrow are combined, and stable bodies and births are obtained. Among them also, again, due to each of the three types of Tamoguna, there are three types of them. Therefore, the fruits obtained through actions are infinite.

It will be. In this way, the Lord, being in the four-faced Brahma, creates the universe. Having assumed the form of a boar, the form of a fish, the form of a tortoise, the form of a swan. Even being in the form of a serpent, Rama, Krishna, and others, being in the form of humans, Vamana, Yagna, and others, being in the form of gods, he himself governs this universe. He is the one who is the body of righteousness, and he nourishes the world. Once upon a time, he was the time, that is, to death, to fire, to Rudra, being himself, holding him as his body, through them, this universe will be subdued at the end of the eon. Will destroy. As the wind removes the cloud, so the Lord removes the universe. The activities of a living being are dependent on karma. The worldly affairs are not dependent on karma, by the Supreme Soul. The Lord is the Lord of strength, splendour, splenic power and splendour. He is more complete in knowledge than Brahma, Rudra, and others who have the power of knowledge. The wise and the Brahmins cannot recognize the Lord as such. The Supreme Being is in the form of the world created by Himself The creature will be created. It will be alive. He is without birth, he is born. He is the one who is born, and the Upanishads tell us that he is not born. It is like how it is possible. The Supreme Being is not born in form. The creator is one himself. He is without birth by form, but consciousness and awareness are created by him. Therefore, being in them as a soul, he too will be born. Is God the creator of this world or not? Because he created with a body endowed with senses like those of living beings, he has no body-dependent, compassionate nature. He is the creator because he creates only with determination. The Supreme Being, who is dependent on Karma, has no births like the world. He is born of his own will. Therefore, the Upanishads say that one is born as one is not born. For God, birth, karma, etc., are created by His will. The name of the illusion is Sankalpam. Mayavanam jnanam, in Nigandu, jnanam is said to be synonymous with maya.

In the Bhagavad Gita, the Lord says, 'Sambhavami, Atmamaya, Yena sankalpam cha yena nimitta cha, I am born by my own will.' Therefore, the Lord, through his illusion, that is, through his will, is causing birth and karma in the unborn. Until now, Brahma's great kalpa and the intervening kalpa have been briefly described. In this kalpa, as well as in other kalpas, creation and destruction occur. The changes that emerged from the earth, starting from the greatness of the distortions of nature, are called Prakrita creation. The individual forms created by their combination are called Vaikhrutha Srishti. Now, I will explain the evolution of the future time and the characteristics of the kalam. I will explain the Padma Kalpa to you, listen, said Sukha Yogi in response to the question asked to Parikshit. Thus, Shaunaka Maharshi, who was listening to the Bhagavata Purana being narrated by Suta, asked Suta this in Naimisharanya. Vidurudu, unable to leave his relatives, left them and went to serve the pilgrimages in the world, they said, didn't they? He is Maitreyi's Did he meet? How did self-knowledge arise from Maitreya? When Vidura asked, Maitreyi, I ask you to make us understand the essence that you have explained. I am telling you the story of Vidura, how he separated from his relatives and mingled with the people. Thus, when Shanugudu was questioned, and when Parikshit was questioned, the great sage Shukayogi answered in such a way that he followed his question. The Suta says that he is the one who heard it. With this, the second book ends. In this episode, you should listen to these last three podcasts at least twice to understand them. This is a very important matter from this chapter. We will meet in the third Skandha in another podcast. Jai Srimannarayana and salutations to the Ashmadguru.