అంబరీష స్తుతి, దుర్వాస విముక్తి – నవమ స్కంధం, భాగం 4
Ambarisha's Praise of Sudarshana & Durvasa's Redemption – Canto 9, Part 4
ఈ ప్రవచనంలో అంబరీష మహారాజు సుదర్శన చక్రమును స్తుతించగా, చక్రము దుర్వాసుని విడిచిపెట్టిన విషయం వివరించబడింది. దుర్వాసుడు తన తప్పును గుర్తించి అంబరీషుని పాదాలు పట్టుకొని, ఆయన మహాత్మ్యమును కొనియాడెను. అంబరీషుడు ఒక సంవత్సరం పాటు ఋషి రాకకై నిరీక్షించి, వారికి ఆతిథ్యమిచ్చి తర్వాత భోజనం చేసెను. భక్తి జ్ఞానము మరియు తపస్సు కంటే శ్రేష్ఠమైనది అని, భగవానుడు భక్తులకు వశుడని ఈ ఉపాఖ్యానం ద్వారా తెలుపబడింది. తదుపరి పాడ్కాస్ట్‌లో ఇక్ష్వాకు వంశ వర్ణనం మరియు రామావతార కథ తెలుసుకుంటామని ప్రకటించబడింది.
This discourse concludes the Ambarisha episode from the Ninth Canto of Srimad Bhagavatam. Ambarisha praises the Sudarshana Chakra, which then releases the tormented Durvasa Muni. Durvasa, humbled, glorifies Ambarisha's greatness as a devotee and accepts his hospitality after a full year of wandering. The session highlights that true devotion surpasses even knowledge and austerity, and that the Lord Himself is controlled by His devotees. The talk concludes with a preview of the upcoming Ikshvaku dynasty narrative, including a brief account of the Rama avatar.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః అప్రియ ముక్తాః పురుషాః ప్రయతంతే దిగుణమప్రియం వక్తుం తస్మాదవాచ్యమప్రియం అన్య ప్రియ వాక్య కామేనా మనం ఎవరినైనా అప్రియాలు పలికితే వారు రెట్టింపుగా మనకు అప్రియాలు పలుకుతారు. అంచేత అవతలి వారు మనతో ప్రియ భాషలు పలకాలంటే మనము అప్రియాలు పలకరాదు. ఆడియోక్తి నెంబర్ సెవెన్. భగవంతులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక నవమ స్కంధము నాలుగవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు సుకన్య చరిత్ర అంబరీష ఉపాఖ్యానంలో కొంత భాగాన్ని తెలుసుకున్నాం. అంబరీషుడు ద్వాదశి వ్రతంలో జలాన్ని గ్రహించినప్పుడు దుర్వాసన మహాముని వచ్చి తనకు ఉపయోగించుకున్న తర్వాత ఆయనపై ప్రదర్శించి ఆయనపై సుదర్శన చక్రము వెళుతుంది. దాన్ని రక్షించడాని కోసమని తన రక్షణ కోసం. బ్రహ్మ దగ్గరికి, రుద్రుడు దగ్గరికి, శ్రీహరి దగ్గరికి అని చొగ్గరు వెళ్తాడు. ఆ తరువాత ఆ చక్రాన్ని స్తోత్రం చేయమని శ్రీహరి చెప్తాడు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తరువాత నుంచి తెలుసుకుందాం. భగవానుని ఆజ్ఞానుసారము దుర్వాసుడు అంబరీషుని చేరి దుఃఖముతో అతని పాదములను పట్టుకొనెను. ఋషి తన పాదములను పట్టుటకు అంబరీషుడు సిగ్గుపడెను. దుర్వాసునిపై జాలిపడి చక్రముని ఇటు స్తోత్రము చేసెను. హే సుదర్శనా నీవే అగ్నివి, నీవే సూర్యుడవు, చంద్రుడవు, జ్యోతిర్మయి మండలమునకు అధిపతివి. నీ దివ్య తేజస్సే సకల తేజ పదార్థములకు తేజస్సును ప్రసాదించునది. హే సహస్రారా సుదర్శనా నీకు నమస్కారం. సర్వాస్త్రములను అంతమొందించు వాడవు నీవు. ఈ బ్రాహ్మణునకు మంగళమును కల్పించుము. ధర్మము, ధైర్యము, యజ్ఞము. తేజస్సు, పౌరుషము మున్నగునవి అన్నియు నీచే ప్రవర్తింపచేయబడినవి. నీవు సకల ధర్మములను మర్యాదలను కాపాడువాడవు. అధర్మ శీరులగు అసురులకు అనర్థమును ఆపాదించువాడవు. త్రైలోక్య పాలకుడవు, శుద్ధ తేజ స్వరూపుడవు.
నీ తేజస్సు చేతనే ధర్మం నిర్వహింపబడుచున్నది. భక్తుల అజ్ఞానము నీ చేతనే తొలగించబడుతున్నది. శ్రీహరి ప్రయోగించగానే దైత్య దానవ సంఘములను యుద్ధమున నీవు చెండాడెదవు. సకల జగద్రక్షణమునకు, దుష్ట శిక్షణమునకు నీవే నిమిత్తము. మా కులమును కాపాడుటకు ఈ బ్రాహ్మణుని కాపాడుము. మేము చేసిన దానము, యజ్ఞము, ధర్మాచరణము మొదలగునవి ఏవి ఉన్నవో అవి అన్నియు ఈ బ్రాహ్మణుని తాపమును ఉపశింపజేయును గాక. సకల కళ్యాణ గుణరాశియగు భగవానుడు నేను చేయు ఆరాధనచే సంతుష్టుడైనచో ఆ ఈ బ్రాహ్మణుడు తాపము నొందక శాంతి నొందు కాక. ఇట్లు విష్ణు చక్రమగు సుదర్శనమును అంబరీషుడు స్తుతింపగా అతని ప్రార్థనను మన్నించి ఆ చక్రము బ్రాహ్మణుని వదిలిపోయెను. దుర్వాసుడు తీవ్రమగు తాపమును తొలగి సుఖియై అంబరీషుని ప్రశంసించి ఆశీస్సులను వసంగెను. దుర్వాసుడు ఇట్లనుకొనుచున్నాడు ఆహా! భగవద్దాసుల మహాత్యము ఎంతటిది ఈనాడు నేను ఎరుంగి ప్రశంసింపగలిగితిని. తన విషయమును తప్పు చేసిన వారికి కూడా. మంగళమును కాంక్షించు మహానుభావుడు కదా అంబరీషుడు. సాధువులు వదలలేనిది ఏదీను లేదు. మహాత్ముడు చేయలేనిది ఏదీను ఉండదు. అన్నిటికీ మూలమగు భగవానుని వశపరచుకొనే వారులు వారు. ఏ భగవాను నామము విన్నంత మాత్రమున సకల పాపములు పోవునో అట్టి భగవానుని వశపరుచు కొని కొని వశపరుచుకొనిన వారులు వారు వారికి వేరొక కోరిక ఏముండును రాజా కరుణామయుడవగు నీ చేత నేను అనుగ్రహింపబడితిని. నేను చేసిన అపరాధము లెక్కచేయక నా ప్రాణములు కాపాడితివి. అంబరీష మహారాజు దుర్వాసుడు వచ్చువరకు భోజనము చేయక ఉండెను. వచ్చిన తరువాత అతని పాదములు పట్టుకొని క్షమింపమని వేడుకొని భోజనము చేయ ప్రార్థించెను. దుర్వాసుడు ఆతిథ్యమును స్వీకరించి భుజించి సంతుష్టుడై రాజా ఇక నీవు భుజింపుము. నేను చాలా సంతుష్టుడనైతిని, అనుగ్రహింపబడితిని. నీ దర్శనముచే, స్పర్శచే, సంభాషణచే, ఆతిథ్యముచే నేను ధన్యుడనైతిని. నీ నిర్మలమైన చరితమును పరమ పవిత్రము కీర్తిని స్వర్గలోకమున భూలోకమున కీర్తించుచుందురు. ఇట్లు దుర్వాసుడు ఆ రాజును స్తుతించి బ్రహ్మలోకమునకు వెళ్ళెను.
దుర్వాసుడు చక్రం వెంబడింప తిరిగి తిరిగి మరల అంబరీషుని వద్దకు వచ్చేసరికి ఒక సంవత్సర కాలం గడిచెను. అంతవరకు అంబరీషుడు ఋషిరాకకై నిరీక్షించుచు జలముననే గ్రోలుచు గడిపెను. ఈ విధంగా అంబరీష మహారాజు సంతతము పరబ్రహ్మము వాసుదేవుని యందే భక్తితో సర్వ కర్మలను సమర్పించుచు వేరొక లోకమునకు పోవుటకు ఇష్టపడక ఆ లోకములన్నిటిని నరకములుగా భావించుచుండెను. అంబరీషుడు తన కుమారులకు రాజ్యమున సంగి వాసుదేవ పద ధ్యానముతో వనమున కాలము గడుపుచు సర్వవంద విముక్తుడాయను. అంబరీషోపాఖ్యానము వినిన వారికి కూడా భగవాను అనుగ్రహముచే ముక్తి కలుగును. స్వప్రయత్నముచే జ్ఞానమును తపస్సును ఆర్జించిన వారల కంటే భక్తులు అధికులు. పరమ సాత్వికులగు భక్తులకు రాజస తామస భావములు ఉండవు. తపస్యాలు రఘు ఒక్కొక్కప్పుడు అహంకారము, ఆవేశము కలుగుచుండును. భక్తి గలవారికి భగవానుడే లొంగి ఉండును. భగవత్ భక్తుల శక్తిని బ్రహ్మ రుద్రాదులు కూడా వారింపలేరు. అందుచే సకల శ్రేయస్ సంధానము చేయునది భక్తియే. ఇంతటితో మనకి అంబరీశ్వర భాఖ్యానము ఉంచినది. దీని తర్వాత మళ్ళీ మనము ఇక్ష్వాగవంశం యొక్క వర్ణాన్ని వర్ణనాన్ని చేసుకుంటాం. ఇక్షాగ్ మొక్షం వర్ణనం అన్నప్పుడు రాముని యొక్క కథ రామావతారం కూడా మనకి భాగవతంలో వర్ణించబడినది ఈ విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తుంది. వివరంగా లేకున్నా సూక్ష్మంగా మనకి రాముని యొక్క కథా భాగము మరొక పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. ఇక్ష్వాక వంశ వర్ణనము మనం తర్వాత భాగంలో ఉంటుంది. అందరికీ కూడా తప్పనిసరి వినాల్ని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. The unpleasant are the men who try to speak unpleasant things. Therefore, it is unspeakable and unpleasant. If we speak unpleasant words to anyone, they will speak unpleasant things to us twice as much. Therefore, if others want to speak our favorite languages, we should not speak theirs. Audio number seven. Oh Gods, welcome to the fourth podcast of the ninth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, we have learned some part of the Sukanya Charitra and the Ambarisha Upakhyan. When Ambarisha accepted water during the Dwadashi Vrata, the great sage Durvasa came and after using it for himself, he showed it on him, and the Sudarshana Chakra went on him. To protect it, for his own protection. He goes to Brahma, to Rudra, to Srihari. Sri Hari then tells him to chant the cycle. We will learn about it later. Following the orders of the Lord, Durvasa approached Ambarisha and with sorrow touched his feet He held on. Ambarisha was ashamed to hold the feet of the sage. Pitying Durvasa, he praised the Chakra. Hey Sudarshana, you are fire, you are the sun, you are the moon, you are the lord of the Jyotirmayi Mandala. Your divine light bestows radiance on all light substances. Hey Sahasrara Sudarshana, greetings to you. You are the destroyer of all worlds. Oh Brahmin, please perform the auspicious ceremony. Righteousness, courage, and sacrifice. Radiance, masculinity, and all that are all done by you. You are the protector of all righteousness and virtues. You are the one who causes misfortune to the Asuras who are the embodiment of unrighteousness. Oh!, you are the lord of the three worlds and of the purest light.
Dharma is being performed by your radiance. The ignorance of the devotees is being dispelled by you. As soon as Srihari is launched, you will destroy the demon and demoniac groups in battle. For the protection of the entire world, for the punishment of the wicked, you are the cause. Save this Brahmin to save our caste. May all the charity, sacrifices, and religious practices that we have done, may they all alleviate the suffering of this Brahmin. If the Lord, who is the embodiment of all auspicious qualities, is pleased by my worship, then that Brahmin will not suffer from heat and will not attain peace. Thus, as Ambarisha praised Sudarshana, the Sudarshana Chakra, honoring his prayer, left the Brahmin. Durvasudu, having removed the intense heat, became happy, praised Ambarisha, and received his blessings. Durvasudu is thinking like this. Aha! What is the greatness of the devotees of the Lord? Today, I was able to praise Erugi. And to those who have sinned against him, even more. Ambarisha is a great man who desires auspiciousness, isn't he? There is no such thing as a non-ascetic. Great person There's nothing you can't do. They are the ones who have taken control of the Lord, who is the root of everything. Whose name, upon hearing, all sins are removed, such a God, having taken control, having taken control, those who have taken control, they, they have another desire, what is it, O King, I have been granted by you, who is compassionate. You spared my life without counting the sins I have committed. King Ambarisha did not eat until Durvasa arrived. After coming, he held his feet, begged for forgiveness, and prayed to have a meal. Durvasudu accepted the hospitality, ate, and was pleased. O King, now you may eat. I was very satisfied and very blessed. I am blessed by your vision, your touch, your conversation, and your hospitality. They praise your pure history, your supreme sanctity, and your fame in heaven and on earth. Thus, Durvasa praised the king and went to Brahmaloka.
Durvasudu, following the Chakra, went back and forth, and by the time he returned to Ambarisha, a year had passed. Until then, Ambarisha waited for the sage and spent his time wandering in the water. In this way, King Ambarisha, with devotion to the Supreme Brahman, Vasudeva, and performing all his duties, did not like to go to another world and considered all those worlds as hells. Ambarisha, along with his sons, spent time in the forest with the meditation of Vasudeva's feet, and became liberated from all vows. Those who listen to the story of Ambarisha will also be liberated by the grace of God. Devotees are superior to those who have acquired knowledge and penance through their own efforts. Those who are supremely virtuous and devout do not have Rajasic and Tamasic tendencies. Raghu's penances sometimes cause ego and passion. The Lord is very merciful to those who are humble. Even Brahma, Rudra, and others cannot tame the power of the devotees of God. Therefore, devotion is the only means to achieve all good. With this, we have kept the description of Ambarisha. After this, again we Ikshvaku dynasty We will describe the color. When it is described as Ikshag Moksham, the story of Rama, the incarnation of Rama, is also described in the Bhagavatam. We learn about this here. Even without details, subtly, let's learn about the story of Rama in another podcast. The description of the Ikshvaku dynasty will be in the next part. Requesting everyone to listen compulsorily, Jai Srimannarayana, salutations to the Asmad Gurubhyo