పంచమ స్కంధ సమాప్తి - పుణ్యఫల శ్రవణం
Conclusion of the Fifth Canto — Fruits of Hearing
పంచమ స్కంధపు ఈ చివరి ఘట్టంలో, శుకదేవ గోస్వామి భూమండల వర్ణనను, సప్తద్వీప సప్తసముద్రాల వివరణను, మరియు భగవంతుని విశ్వరూప మహిమలను శ్రద్ధగా వినడం వల్ల కలిగే అపారమైన పుణ్యఫలాలను వివరిస్తారు. ఈ పవిత్ర కథనాలను భక్తిపూర్వకంగా శ్రవణం చేసే వారి పాపాలు నశించి, మోక్షమార్గం సుగమం అవుతుందని శాస్త్రం నిర్ధారిస్తుంది. ఈ స్కంధం మొత్తం శ్రీ విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా శుక మహర్షి ప్రకటించి, శ్రోతలను భగవత్సేవలో స్థిరంగా నిలవమని ఆశీర్వదిస్తారు.
In this concluding episode of the Fifth Canto, Śukadeva Gosvāmī reveals the profound spiritual merits bestowed upon those who faithfully hear and recite the sacred descriptions of Bhū-maṇḍala, the cosmic arrangement of planetary systems, and the glories of the Lord's universal form. The text emphasizes that even a single devoted hearing of these narrations purifies the listener of accumulated sins and elevates the soul toward liberation. Śrī Śuka affirms that this Canto, rich with cosmological wisdom and devotional depth, is a direct means of pleasing Lord Viṣṇu and attaining His eternal abode.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తస్మై భగవతే కృష్ణాయామల కీర్తయే యోధత్తే సర్వభూతానాం అభవాయోశతీ కలాః స్వచ్ఛమైన కీర్తి గల ఆ శ్రీకృష్ణ భగవానునకు నమస్కారం. ఆయన సకల ప్రాణులకు సంసార దుఃఖము ఉపశమించుటకై మనోహరమైన మూర్తులను స్వీకరించుచుండును. 10th క్యాంటో, 87th చాప్టర్, 46th ప్రేయర్. భగవంతువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము 29వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు భూలోక వర్ణనము, దీప వర్ణనము, జ్యోతిర్మండలం వర్ణనము, అధోలోక వర్ణనము, తరువాత నరకలోకంలోని 28 పేర్లు తెలుసుకొని వాటిలో తొమ్మిది. నరకలోక వర్ణనాలని విషయాలను తెలుసుకున్నాం. ఇంకా ముందు మిగతా నరకలోకాల గురించి తెలుసుకుందాం. అక్కడ జరిగేటువంటి బాధలు. 10 క్రిమి భోజనము. మనము ఆహారము తినుటలో కొన్ని నియములు పాటించవలెను. ఉన్నదానిని అంతను మనమే తినరాదు. అతిథులకు, భూతములకు, దేవతలకు, పితృ దేవతలకు, ఋషులకు పెట్టి ఆ శేషమును మనం తినవలెను. ఎవ్వరికీ అర్చించకుండా తన కొరకే వండుకొని తానే తినునాడు క్రిమి భోజనము అనేడి నరకమున పడును. అది లక్ష యోజనముల పురుగుల గుంట దానిలో పడవేయుదురు. వీనిని ఆ పురుగులు పొడుచుకొని తినుచుండును. వీడు ఆకలికి తాళలేక ఆ పురుగులను తినుచుండును. జీవించి ఉన్నప్పుడు ఒకనికి పెట్టకుండా దేవతలకు నివేదింపకుండా తినువారందరూ ఈ నరకములో బాధలు అనుభవించుచుందురు. 11 సందంశం. పవిత్రుడగు బ్రాహ్మణుల ధనమును, బంగారమును, రత్నములను బలాత్కారముగా దోచుకొని పోయేడివారు. ఈ నరకమున పడి ఉందురు. యమభటులు అగ్నిలో కాల్చిన ఇనుప ఊచెలతో వారి శరీరమును కాల్చుచు, పొడుచుచు, నరకుచు హింసింతురు. 12 తప్త సూర్మి పురుషుడు తనకు శాస్త్రోక్తముగా పొందదగినది అని నిర్ణయింపబడిన స్త్రీని కాక పొందదగిన స్త్రీని పొందినచో
అట్లే స్త్రీ అయినను తాను అనుభవింపదగిన భర్తను కాక ఇతర పురుషుని పొందినచో తప్త సూర్మి అనే నరకములో పడవేతురు. అచ్చట ఇనుప ఆకారములో స్త్రీ పురుష మూర్తులు కలిపింపబడి ఉండును. అవి అగ్నిచే కాలుచుండును. పరస్త్రీతో రమించిన పురుషుని ఆ కాల్చిన ఇనుప స్త్రీ విగ్రహమును ఆలింగనము చేసుకున్నట్లు చేయును. పరపురుషునితో రమించిన స్త్రీని కాల్చిన ఇనుప పురుష విగ్రహమును ఆలింగనము చేసుకున్నట్లు చేయును. వెనక నుండి కొరడాలతో కొట్టుచుందురు. కాలిపోవుచుండును. దుఃఖమును అనుభవించుచుందురు. వజ్రకంటక శాల్మలి 13వ నరకం. ఇందు వజ్రముల కంటే వాడి అయిన ముళ్ళు గల బూరుగు చెట్లుండును. లోభముచే ఎవరైనాను చేయకూడని పనులు చేసి శరీరమును పోషించుకోవలనని ప్రయత్నించడి వారిని ఈ నరకమున పడవేతురు. బ్రతువు తెరువునకై చేయకూడని పనులు చేయుట సేవింపరాని వారిని సేవించుట చేయువారిని ఈ నరకమున పడవేతురు. వజ్రము వంటి ముళ్ళు గల ఆ చెట్లను ఎక్కించి దించుచు దిగకుండా కొరడాలతో కొట్టుచు మరల మీదికెక్కించుచు మరల క్రిందికి దించుచుందురు. 14 వైతరిణి. ధర్మ రక్షణము చేయుటకు నియమింపబడిన అధికారులు, రాజులు ధర్మపు కట్టుబాట్లను అతిక్రమించి తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినచో వారు వైతరణి అనే నదిలో త్రోయబడుదురు. ఈ నది నరకలోకమునకు చుట్టూ అగర్త వలె ఉండును. అందు చాలా క్రూరమైన మాంస భక్షణము చేయు రాక్షస గణములు ఉండును. వారు వీనిని కొరికి తినిచుందురు. ఆ నిధిలో అమేధ్యము, మూత్రము, దుర్గంధము కల రక్తము. కేశములు, గోళ్ళు, ఎముకలు, రక్తము, కొవ్వు, మాంసము మొదలగునవి అన్నియు నిండి ఉండును. అందులో పడి ఉండి ఆ దుర్వాసనలను భరించుచు ఈ క్రూర రాక్షస గణములచే హింసింపబడుచు బాధపడుచుందురు. 15 పుయోదం. బ్రాహ్మణులై ఉండి శూద్ర స్త్రీలతో సంబంధము కలవారలై తమ వర్ణాచారములను పూర్తిగా వదిలినవాడు ఈ నరకమున పడి ఉందురు. వీరు బ్రాహ్మణులే ఉండియు సంధ్యావందనం మొదలగు వాటిని వదలి తినదగినవి తినుచు పశువుల వలె సిగ్గు లేక స్వేచ్ఛగా కామవృత్తిచో ప్రవర్తింపబడుచుండువారు ఈ నరకములో పడి ఉందురు.
దుర్వాసన గల అమేధ్యము, మూత్రము, మలము, కఫము నిండి సముద్రం వలె ఉండును. ఈ నరకములో పడి ఉండి వానిని తినుచు త్రాగుచు అందు ఉండురు. 16 ప్రాణ నిరోధము. కొందరు బ్రాహ్మణులై ఉండియు గాడిదలను కుక్కలను పెంచి వాటితో వేటలకు పోయి అది ఒక విహారముగా వినోదముగా మృగములను చంపుచొందురు. రాజులు లోక రక్షణముకై క్రూర మృగములను చంపుచొందురు. అట్లు లోక రక్షణముకై వేటాడి మృగములను చంపుట దోషము కాదు. పవిత్రములైన ప్రదేశములలో మనుషులు సంచరించుటకు వీలు కాకుండా దుష్ట మృగములు సంచరించినప్పుడు వానిని చంపుట కూడా దోషము కాదు. అట్లు కాకుండా కేవలము వినోదము కొరకు విహారమునకు మృగములను వధించువారు ఈ నరకమున పడి ఉందురు. వారిని యమభటులు తమ బాణములతో వెంటాడి హింసించుచుందురు. ఆ బాణములతో ప్రాణములను ప్రాణములు పోకుండా తీవ్రముగా వేదన కలుగునట్లు చేయుదురు. 17 విశసనము కొంతమంది లోకములో ఇతరులను వంచించుటకై యజ్ఞమును ఆచరించుచుందురు. వీరు యజ్ఞానుష్ఠానము చేయువారని కీర్తినందుటకు యజ్ఞములలో పశువులను చంపుదురు. వారు వైశసనము అగు నరకమున పడి ఉందురు. ఆ నరకములో యమభటులు వీరిని తీవ్రము హింసలకు గొరిచేయుదురు. 18 లాలా భక్షం. బ్రాహ్మణుడై ఉండి కామమోహితుడై తన వర్ణమునకు చెందిన భార్యతో రమించుచు ఆమె చేత వీర్యమును పానము చేయించు దుష్ట చేష్టితమునకు కామ ప్రవృత్తిచే పాల్పడును. అట్టి వానిని పురుష వీర్యముతో ఏర్పడిన ఒక పెద్ద కాలువ యందు పడవేచి హిమభట్లు వానిచే ఆ వీర్యమును త్రాగింతురు. 19 సారమేయాదనము. దొంగలు ఇంటికి నిప్పు పెట్టుదురు. కొందరు తెలియకుండా విషమిచ్చి చంపుదురు. కొందరు ఊరును దోచుకొందురు. రక్షించవలసిన రాజులు, రాజభటులు కూడా పట్టణములో ఉన్న వారిని హింసించి చుందురు. అట్టి వారిని ఈ నరకమున పడవేతురు. ఈ నరకములో 720 బలమైన కుక్కలు ఉండును. ఆ కుక్కలు వానిని కరుచునట్లు భటులు పెరిన చేతురు. అవి అతివేగంతో వచ్చి మీద పడి కరుచును. 20 న్యాయస్థానములో అవీచి న్యాయస్థానములో అసత్య సాక్ష్యము చెప్పినవాడు క్రయవిక్రమములో అన్రుతమాడినవాడు ఈ నరకములో పడి ఉందురు.
ఇది కొన్ని వందల యోజనములు పరిమితి కలది. అట్టి వారిని ఈ నరకములో కొన్ని వేల యోజనములు ఎత్తైన కొండ పైకి ఎక్కించి క్రిందకు పడవేతురు. క్రిందనేమియు పట్టుకొనుటకు ఆధారం ఉండదు. కింద నీరు ఉన్నట్లు కనపడును. అది నీరు కాదు, అది పెద్ద మెరిసెడి పాషాణము. అది నీటి కెరిటం వలె కనపడును. ఆ కొండ మీద నుండి ఆ రాతి మీద పడి నూగింజలంత చిన్న చిన్న ముక్కలుగా వాని శరీరం ప్రిదిలిపోవును. కానీ చనిపోదు. మరల వానిని అట్లే కొండపైకి ఎక్కించి పడద్రోయిచుందురు. 21 అయఫ్పానము. బ్రాహ్మణుడు గాని, రాజు కానీ, వైశ్యుడు కానీ. వ్రతములో ఉండి సోపానము చేసెడి వాడై ఉండి పొరపాటుగానైనను సురాపానము చేసినచో ఈ నరకమునందు పడవేయబడును. అచట యమభటులు వాని గుండెల పైన కాలు వైచి తొక్కి ఉంచి నోరు పెకిలించి ఇనుము కరిగించిన ద్రవమును పోయుదురు. యజ్ఞములో బ్రాహ్మణుడు సోమలత రసమును త్రాగును. దాని సోపానమందురు. అది త్రాగిన వారు సురాపానము చేసినచో మహా దోషము. 22 క్షార కర్దమం. జన్మ చేత, విద్య చేత, నడువడి చేత, శ్రేష్టత లేకుండియు ఏదో ఒక గొప్పదనము ఉన్నదని అహంకరించి జన్మదే జన్మచే నడువడిచే విద్యచే గొప్పవారిని గౌరవింపక అవమానించువాడు ఈ నరకమున పడి ఉండును. ఇది కారము ముద్దగా చేసి పెద్ద లోతన కూపము ఏర్పరుతురు. దానిలో వానిని తల కిందకు పడునట్టు తోయుదురు. 23. రక్షోగుణ భోజనం. కొందరు పురుషులు నరబలులు ఇచ్చి దేవతలను ఆరాధించుచుందురు. కొందరు స్త్రీలు కూడా శాస్త్రంలో చెప్పబడిన బలులు ఇచ్చి క్షుద్ర దేవతలను ఆరాధించుచుందురు. వారినందరినీ ఈ నరకములో పడవేతురు. ఇచ్చట రాక్షసులు వధశాలలో కసాయి వారి వలె తమ కత్తులతో వీరిని నరికి రక్తమును త్రాగుచుందురు. దేవతలకు బలులు ఇచ్చి వీరు పాడుచు నృత్యము చేసినట్లు వీరు రక్తమును తాగి ఆడుచు పాడుచు నాట్యము చేయుచుందురు. 24 శూలప్రోతము కొంతమంది గ్రామములో గాని అరణ్యములో గాని
ఈ అపరాధము ఎరుగని జంతువులను వానికి నమ్మకము కలుగునట్లు చేసి ఉరిపోసి వలపన్ని చంపుదురు. వాటిని బాధించి ఆడుకొనుచొందురు. వారిని ఈ నరకములో పడవేతురు. నరకములో కాకులు, గద్దలు, వాడియగు ముక్కులు గల పక్షులు ఉండును. అవి వీరిని ముక్కులతో పొడుచుకొని తినుచుండును. వీరిని ఒక శూలమునకు గుర్చి ఉంచుదురు. వీరిని ఆ పక్షులు పొడుచుకొని తినుచుండును. వీరికి ఆకలి దాహం ఎక్కువగా ఉండును. 25 దందసూకం. కొంతమంది క్రూర స్వభావులు పాముల వలె ఒకరిని మాటలచే చేతలచే కాటు వేసి బాధింతురు, భయపెట్టుదురు. వారిని ఈ నరకమున పడవేతురు. ఈ నరకమున ఐదు లేక ఏడు ముఖములు గల పాములు ఉండును. అవి వీరిని కరుచుచుందును. మ్రింగుచుండును. మరల పైకెక్కుచుండును. 26 అవట నిరోధము. కొందరు మనుషులు చిన్న పిల్లలను, గుడ్డి వారిని, బలహీనులను గోతులలో పడవేచి వినోదించుచుందురు, బాధించుచుందురు. అట్టి వారిని ఈ నరకములో పడవేతురు. ఈ నరకము ఒక గొయ్యి వలె ఉండును. అందులో విషముతో కూడిన అగ్నిహోత్ర జ్వాలలు నివేచిచుండును. అందులో పడవైచి బయటికి రాకుండా నిరోధించుచుందురు. అపర్యావర్తనం. గృహస్తు అయి ఉండి తన ఇంటికి వచ్చిన అతిథులను వారు తమ ఇంటికి వచ్చినారన్న కోపముతో అనాదరముతో వానిని దహించునేమో అన్నంత కోపముతో చూచెడి వారిని ఈ నరకములో పడవేతురు. అచ్చట వంకర ముక్కులు గల కాకులు, గ్రద్దలు, డేగలు మున్నగునవి ఎగిరి వచ్చి వీరిపై వ్రాలి ముక్కులతో వీరి కళ్ళను ఊడబెరుకును. 28 సూచి ముఖము. ఈ లోకములో తాను ధనవంతుడునను గర్వము గలవాడై తాను శ్రేష్టుడనని భావించి. ఇంటికి వచ్చిన పెద్దలను గురువులను కూడా తన ధనమును దొంగలింతురేమో అని భావించుచుండును. వారిని చూచి ధనము ఖర్చు అగునని బెంగతో గుండెలు ఎండి ముఖము వాడి బెంగతో కృంగుచుండును. ఒక భూతము నిధిని కాపాడినట్లు ధనమును కాపాడుచుండును. అట్టి వానిని ఈ నరకములో పడవేతురు. ఆ నరకములో ధన పిశాచముండును. ఆ ధన పిశాచమే పాప పురుషుడు అనేటి యమపురుషుని భటునిగా వచ్చి వానిని తన భటులచే శరీరమంతటా బలమైన సూదులతో
దారములతో కుట్లు వేయుచుండును. వడలు అంతకు దారములతో కుట్టి ఉంచుదురు. యమలోకములో ఇట్టి నరకములు వందలు వేలు ఉన్నవి. అధర్మములకు ప్రవర్తన గలవారు. ఈ నరకములకు చేరుచుందురు. ధర్మ మార్గమున సంచరించువారు స్వర్గమునందు చేరుచుందురు. ఈ నరకములో స్వర్గములో అనుభవింపగా మిగిలిన పుణ్య పాపములతో ఈ మర్త్యలోకములో జన్మించుచుందురు. అండకోశము ఇంతవరకు వర్ణింపబడినది. 14 లోకములు పురాణములో వర్ణింపబడినవి. ఇది భగవాను యొక్క స్థూలతమమైన రూపము. సత్వరజస్తమో గుణములు గల ప్రకృతి యొక్క గుణములచే కలుగు మార్పులు ఈ లోకములలో కనపడుచుండును. దీనిని ఎవరు విందురో, చదువుదురో, వినిపిస్తురో వారు పరమాత్మ యొక్క ఉపనిషత్తులలో ఎరుంగదగిన సూక్ష్మాతి సూక్ష్మము సర్వవ్యాపకమగు దివ్య మంగళ విశిష్టమగు దివ్యాత్మ స్వరూపమును ఎరింగి శ్రద్ధా భక్తులతో ధ్యానించి విశుద్ధమగు బుద్ధి గలవారగుదురు. భగవానుని యొక్క స్థూల రూపమే ఈ విశ్వము. దీనిని ఎరింగి దీనిచే మనసులో ఏ విధమగు వికారము నందక దానిని భగవానుని దివ్య రూపముగా భావించి ధ్యానించిన నాడు వాడు. ఆ ఈ బాహ్యమగు రూపమునగు అంతర్యామిగా ఉన్న సూక్ష్మగు భగవత్ తత్వమునందు మనసు నిలుపు వాడగును. ఈ భగవంతుని యొక్క స్థూల శరీరమందున్న భూమి, దాని అవాంతర భేదములు, ద్వీపములు, వర్షములు, భూమిలో ఉన్న నదులు, పర్వతములు, అంతరిక్షములు, సముద్రములు, పాతాళం వరకు ఉండడి భూమి అడుగు భాగములు, నరకములు, నక్షత్ర గణములు, ధ్రువ మండలము మొదలగు వాని యొక్క విశేషములు వర్ణింపబడినవి. ఈ జగత్వంతయు సకల జీవరాశికి ఆశ్రయమగు భగవానుని యొక్క స్థూల శరీరమని ఎరింగి ఉండవలెను. ఇంతటితో పంచమ స్కంధము సమాప్తమవుతుంది. తర్వాత మనము షష్ట స్కంధములో కలుసుకుందాం. చాలా విశేషమైనటువంటి అధ్యాయాలు నరిసింహ స్వామి యొక్క స్వరూపం గురించి మనం తెలుసుకుంటాం. ఆ యొక్క కథా భాగాలు తెలుసుకుంటాం. దానిలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Gurus. Salutations to the Lord. Those who sing the praises of Krishna, the destroyer of all beings, are blessed with a hundred arts. Salutations to that pure and glorious Sri Krishna Bhagavan. He accepts beautiful forms to alleviate the suffering of all living beings. 10th Canto, 87th Chapter, 46th Prayer. Oh Gods, welcome to the 29th podcast of Srimad Bhagavata Tatva Deepika Panchama Skandham. Until now, the description of the earth, the description of the lamp, the description of the universe, the description of the netherworld, then knowing the 28 names of the hell, nine of them. We have learned about the descriptions of hell. And then we'll learn about the other hells. The sufferings that were happening there. 10 ghee bhog. We must follow some rules in eating food. We can't eat all that stuff anyway. We should eat the leftovers that are given to guests, ghosts, gods, ancestors, and sages. Without offering to anyone, cooking only for himself and eating only himself, he will fall into hell, which is called 'Krimi Bhojamu' (worm food). That is a worm of one hundred thousand yojanas The hole is punched in the dough. These insects pierce and eat them. He cannot bear the hunger and is eating insects. When alive, without offering to anyone, without offering to the gods, all those who eat will suffer in this hell. 11 o'clock. They would forcibly rob the wealth, gold, and jewels of the pious Brahmins. They will fall into this hell. The Yama's servants, with iron tongs heated in the fire, burn, pierce, and tear their bodies, torturing them. 12 Tapat Suryam Purushudu, if he obtains a woman who is determined to be obtainable according to the scriptures, not a woman who is obtainable
Similarly, even if a woman is, if she gets another man instead of a husband she can experience, she will fall into the hell called Tapta Surmi. There, in the shape of an iron, male and female figures are combined. They are burning with fire. The man who loved another man's wife will make her embrace the iron statue of his wife. He will make the woman who enjoyed intercourse with another man as if she is embracing an iron male statue. They are being beaten with whips from behind. They are burning. They are experiencing sorrow. Vajrakantaka Salmali is the 13th hell. There are thorny bushes with thorns that are stronger than diamonds. Those who do things that should not be done by greed, and try to nourish their bodies, will be thrown into this hell. Doing things that should not be done to get life, serving those who cannot be served, and throwing those who do away with those who do not serve into this hell. They would climb up and down those trees with thorns like a diamond, hitting them with whips without descending, and then climbing up again and descending again. 14 Vaitharini. To protect dharma If the appointed officials and kings transgress the rules of dharma and act as they please, they will be thrown into the river called Vaitarani. This river is like a gateway to hell. There are many cruel cannibalistic demons. They will eat it by biting it. In that treasure, there is inedible, urine, and blood with a foul smell. Hair, nails, bones, blood, fat, flesh, etc., are all filled. Falling into it, enduring those bad smells, they are being tortured and tormented by these cruel demon groups. 15 ounces. Those who are Brahmins and have relationships with Shudra women, those who have completely abandoned their caste customs, will fall into this hell. Those who, being Brahmins, abandoning the evening prayers and other things, eat what is permissible, and behave freely like animals without shame, fall into this hell.
A foul-smelling, impure substance, filled with urine, feces, and phlegm, is like an ocean. They are in this hell, eating and drinking. 16 Anti-life. Some Brahmins, even while being Brahmins, raise donkeys and dogs, and go hunting with them, considering it a pastime and entertainment, and kill animals. Kings kill wild animals for the protection of the world. Thus, it is not a sin to hunt and kill animals for the protection of the world. It is not a sin to kill a wicked beast when it roams in sacred places where people cannot roam. Instead of that, those who kill animals for mere entertainment and recreation will fall into this hell. They are chased and tormented by the servants of Yama with their arrows. With those arrows, they will cause severe pain so that lives are not lost. 17 Vishanamu Some people in the world perform yagnas to deceive others. They kill animals in sacrifices to glorify them as they perform sacrifices. They will fall into the hell called Vaishasanam. In that hell, the servants of Yama They are causing severe violence. 18 Lala Bhakshan. Being a Brahmin, being deluded by lust, enjoying with his wife belonging to his caste, making her drink semen, being involved in evil deeds due to lust, being involved. Having cast such a man into a large canal formed with male semen, Himabhats will drink that semen through him. 19 Saramayadan. The burglars had set their house on fire. Some people kill by poisoning, unknowingly. Some people rob the village. The kings and soldiers who should be protected also torture those who are in the town. They will throw them into this hell. In this hell, there are 720 strong dogs. The soldiers are like dogs that bite him. They come at great speed and strike with a suddenness. In 20 courts, in those courts, one who tells false testimony, one who makes a mistake in buying and selling, will fall into this hell.
It has a limit of a few hundred yojanas. They will take such people to a high mountain in this hell for thousands of yojanas and throw them down. There is no basis to hold any position below that. There's a fresh supply of water down below. It is not water, but a large crystal of mercury. It looks like a water tank. From that hill, falling on that stone, his body will be crushed into small pieces like a grain of rice. But it doesn't kill. Again, they will climb him up the hill and throw him down. 21 AYP. Brahmin or Raja or Vysya. If one who is in a vow and is about to do a step, even by mistake, drinks alcohol, he will be thrown into this hell. There, the servants of Yama place their foot on his chest, press down, and pierce his mouth, pouring in the liquid made by melting iron. The Brahmin drinks the Somalata rasa in the yajna. They will go to its steps. It is a great sin if those who drink it also consume alcohol. 22 Sodium carbonate. By birth, by education, by behavior, even without excellence, one who boasts that there is some greatness is born One who does not respect and insult the great people by their birth and education will fall into this hell. This makes the curry thick and forms a large cavity. In that, they push him to sleep under his head. 23. Rakshoguna Bhojanam. Some men offer human sacrifices and worship the gods. Some women also offer sacrifices mentioned in the scriptures and worship evil gods. They throw all of them into the lake. Here, the demons, like butchers in a slaughterhouse, cut them with their swords and drink their blood. As if they are singing and dancing after offering sacrifices to the gods, they drink blood, play, sing, and dance. 24 Shulaprothamu, some in the village or in the forest
They kill the animals who do not know this crime by making them believe and hanging them. They play with the idea of hurting themselves. They'll be thrown in Hell. In hell, there will be crows, eagles, and birds with beaks. They will pierce their noses and eat them. They are tied to a spear. Those birds will peck and eat them. They have a lot of hunger and thirst. 25 Dandasukam. Some cruel people, like snakes, bite and torment others through their words and actions, and frighten them. They will be thrown into this hell. In this hell, there will be snakes with five or seven heads. They will swallow these people. They will swallow them. They will rise again. 26. It is the prevention. Some people make fun of small children, the blind, and the weak by throwing them into pits, and they also hurt them. They throw such people into this hell. This hell will be like a pit. In it, fire-filled Agnihotra flames are being offered. They prevent it from falling into it and coming out. Aparayavartanam. Being a householder, with the anger and disrespect of the guests who came to his house, they throw those who look with such anger as if they might burn him, into this hell. There, crows, eagles, and vultures with crooked noses flew and perched on them, pecking at their eyes with their beaks. 28. The index face. In this world, being proud that he is rich, thinking that he is superior. He thinks that the elders and teachers who came home might steal his wealth. Seeing them, with the worry that money will be spent, the heart dries up, the face withers, and the worry makes one depressed. Like a ghost protecting a treasure, it protects the wealth. They throw him into the fire of hell. There is a money demon in hell. That money demon, the sinful man, came as a servant of Yama, the god of death, and with his servants, with strong needles all over his body
Stitched with threads. The vadas are also packed with string. In Yamaloka, there are hundreds of thousands of such hells. Those who behave immorally. They will reach these hells. Those who walk the path of righteousness will reach heaven. Those who experience heaven and hell, along with the merits and sins left over, are born in this mortal world. The ovary has been described so far. The 14 worlds are described in the Puranas. It is the grossest embodiment of the Divine. The changes caused by the qualities of nature, which have sattva, rajas, and tamas, are visible in these worlds. Whoever he is, listen to him Those who listen to it, with faith and devotion, meditate on the subtle, supremely subtle, all-pervading, divine, auspicious, and unique divine form of the Supreme Being, which is beyond comprehension, and become pure-minded. The universe is the gross form of the Lord. By this, by this, whatever kind of distortion in the mind, when he meditates by considering it as the divine form of the Lord, he... That which is external One who is subtle and is within, in that subtle divine essence, one should keep the mind. In this gross body of God, the earth, its anomalous differences, islands, rains, rivers in the earth, mountains, spaces, seas, the earth's subsoil, hells, constellations, The characteristics of the polar region and others are described. This universe is the gross body of the Lord, who is the refuge of all living beings. With this, the fifth book concludes. We will meet in the sixth book. We will learn about the form of Narasimha Swamy, which are very special chapters. We will learn about those story parts. We will meet again there. Jai Srimannarayana, salutations to the Gurus