మత్స్యావతారం – సత్యవ్రతుని రక్షణ మరియు బ్రహ్మవిద్యోపదేశం

Matsya Avatara – The Divine Fish and Satyavrata's Salvation

bhagavatam

అష్టమ స్కంధంలో చివరి కథగా మత్స్యావతార వృత్తాంతం వివరించబడింది. సత్యవ్రత మహారాజు కృతమాలా నదిలో తర్పణము చేయుచు ఒక చిన్న చేపను పొందగా, అది అద్భుతంగా పెరిగి తాను నారాయణుడనని తెలిపెను. ప్రళయ సమయంలో నౌకలో ఋషులతో కలిసి సత్యవ్రతుడు రక్షింపబడి, మత్స్య రూపియైన భగవానుని స్తుతించి బ్రహ్మవిద్యను పొందెను. శ్రీహరి హయగ్రీవుని సంహరించి అపహరింపబడిన వేదములను తిరిగి తెచ్చెను. సత్యవ్రతుడే ఈ కల్పమున వైవస్వత మనువుగా జన్మించి ధర్మ రక్షణ చేయుచున్నాడు.

This discourse concludes the Eighth Skandha of Srimad Bhagavatam with the Matsya Avatara story. King Satyavrata discovers a miraculous fish that grows rapidly, ultimately recognizing it as Lord Narayana. The Lord warns Satyavrata of an impending deluge, instructs him to board a divine boat with sages and seeds, and promises protection. During the flood, Satyavrata praises the Lord as the only true Guru and receives the Matsya Purana containing knowledge of Brahmavidya, bhakti, and karma yoga. The Lord also slays the demon Hayagriva and restores the stolen Vedas, after which Satyavrata becomes Vaivasvata Manu of the current age.

← Prev Next →
Matsya Avatara – The Divine Fish and Satyavrata's Salvation bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః తత్వం బ్రువాణాని పరం పరస్మాత్ మధుక్షరంతీవ సతాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలి రశ్మి జిహ్వే నామాని నారాయణ గోచరాణి ఓ జిహ్వా దోసుల యోగి ప్రార్థించుచున్నాను. పరతత్వముగు నారాయణుని ప్రతిపాదించుచు సత్పురుషులకు అమృతమును స్రవించు ఫలముల వంటివైన నామములను మరల మరల ఉచ్చరింపుము. ముకుందమాల 31st ప్రేయర్. భో బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక అష్టమ స్కంధం 12వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు గజేంద్ర మోక్షణం క్షీరసాగర మథనం వామన బలి వృత్తాంతం చక్కగా సేవించుకున్నాము. ఇవన్నీ కూడా జీవితానికి ఉపయోగపడేటువంటి మంచి విషయాలు. తెలపడానికి మంచి భక్తి మార్గంలో మనం ప్రయాణించడానికి చక్కటి కథలు. ముందు పాడ్కాస్ట్ లో అవి వినాలని ప్రార్థిస్తూ ఇక ముందు మనం మరొక అవతార కథలో ప్రవేశిస్తున్నాం. మత్స్య అవతార కథ. పరీక్షిణ్ మహారాజు శుకయోగిని ఇటు ప్రశ్నిస్తున్నాడు. భగవానుడు మత్స్య రూపమును స్వీకరించినని వెంటనే ఈ రూపం లోకములో ఏవగించుకొనదగినది. తమ స్వభావము కలది. తమః స్వభావము కలది. సర్వేశ్వరుడు కర్మచే జన్మించు వారి వలె అట్టి రూపమును పొందుటకు హేతువేమి? ఉత్తమ శ్లోకుడకు భగవానుడి చరిత్ర సర్వలోకములకు సుఖమును కలిగించునది. దానిని వివరింపగోరుచున్నాను. ఇట్లు కోరగానే శుకయోగిందుడు మత్స్యావతార కథను వివరిస్తున్నాడు. భగవానుడు గోవులను, విప్రులను, దేవతలను, సాధువులను, వేదములను కాపాడుట తన కర్తవ్యముగా భావించును.

ధర్మమే లోక రక్షణకు కారణం. ఆ ధర్మమును ప్రతిపాదించునవి వేదములు. ఆ వేదములను అధ్యయనము చేసి వారిలో చెప్పిన యజ్ఞములను ఆచరించి లోకమునకు శ్రేయమును కలిగించువారు బ్రాహ్మణులు. వారు చేసిన కర్మలచే సంతుష్టులై లోక హితమును కలిగించువారు దేవతలు. యజ్ఞములకు ఉపయోగపడు నేయి, పాలు, పెరుగు మొదలగు హవిస్సులను వసంగునవి గోవులు. కావున భగవానుడు వీరిని లోక హితమునకై కాపాడుచుండును. దానికి అవశ్యకములైన రూపములను నికృష్టములైనను ఉత్కృష్టములైనను స్వీకరించును. వాయువు ఎట్లు అన్ని భూతములలో సంచరించుచుండునో అట్లే ఈశ్వరుడు సర్వ భూతములలో వ్యాపించి ఉండును. కావున అతనికి ఒకటి గొప్పది ఒకటి తక్కువది అను తారతమ్యం ఉండదు. ఏ రూపమైనను తన సంకల్పముచే లోక రక్షణముకే స్వీకరించును. ఎందులో ఉన్నను వాటి దోషములు వానికి అంటవు. గడిచిన కల్పము చివర ప్రళయము ఏర్పడినది. బ్రహ్మకు పగలు గడిచి రాత్రి కాగానే భూహు, భువః, సువః అను మూడు లోకములు లయమగును. దానిని నైమిత్తిక ప్రళయమందురు. రాత్రి వేళ బ్రహ్మ నిద్రించును. నిద్రించునప్పుడు ఆ బ్రహ్మ ముఖము నుండి వేదములు విడలుట చూచి హయగ్రీవులను రాక్షసుడు ఆ వేదములను అపహరించెను. ఆ రాక్షసుని సంహరించుటకు భగవానుడు మత్స్య రూపం స్వీకరించెను. గడిచిన కల్పమున సత్యవ్రతుడు అని పేరు గల గొప్ప రాజర్షి ఉండెను. అతడు ఆత్మగుణ సంపన్నుడు నారాయణపరుడు. జలముని ఆహారముగా స్వీకరించువాడు. అతడే ఈ కల్పములో వివస్తుతునకు కుమారుడుగా జన్మించి శ్రాద్ధ దేవుడని పేరుతో ఈ మన్వంతరమున మనువుగా ఉండెను. అతడు ఒకనాడు కృతమాలా నీలో దోసిలితో నీటిని తీసి తర్పణము చేయపోనెను. అప్పుడు ఆ నీటిలో ఒక మత్స్యము కరబడెను.

సత్యవ్రతుడు దోసిటిలో నీటిని చేపతో కూడా నదీ జలములలో వదిలెను. మత్స్యము అతి కరుణముగా దయాశీలుడవు సత్యవ్రతుడిని నేను ఒంటరి దానను నన్ను మింగివేయగల పెద్ద చేపలు ఇందున్నవి నన్ను కాపాడుడు అని ప్రార్థించెను. తనను రక్షించుటకు మత్స్య రూపము దాల్చి వచ్చినది శ్రీహరిని ఎరుగని సత్యవ్రతుడు తానే దానిని రక్షించవలెనని అనుకొనెను. దాని దీనమైన ప్రార్థన విని తన చేతిలో ఉన్న జలములతో ఆ చేపను ఆశ్రమమునకు తీసుకొని పోయెను. ఆ మత్స్యమును కలశమునందు ఉంచెను. ఆ మత్స్యము పెరుగుచుండెను. కలశము నుండి కమండలమునందు ఉంచెను. అప్పుడు ఆ చేప స్వామి ఈ కమండలము నాకు ఇరుకుగా ఉన్నది. విశాలముకు స్థానము నాకు కల్పించుము అని ప్రార్థించెను. అప్పుడు సత్యవ్రతుడు దానిని ఒక పెద్ద అండాలో ఉంచెను. ఒక్క క్షణంలో అది మూడు మూరల పాడాయెను. మూడు మూరల పుడవాయెను. నాకు ఈ స్థలము చాలదు. ఇంతకంటే విశాలముకు స్థలమును చూపుము అని ప్రార్థించెను. అప్పుడు ఒక సరస్సున ఉంచెను. అప్పుడు ఆ మత్స్యము ఈ సరోజలము నాకు చాలా చాలదు ఎన్నడూ తరగని నీరు గల ఒక మడుగును నన్ను ఉంచుము అని కోరెను. అప్పుడు ఆ మత్స్యమును మార్చి మార్చి ఒక సముద్రమున పడవేసెను. అప్పుడు ఆ మత్స్యము సముద్రమున పెద్ద పెద్ద జలచర్ములు ఉండును అవి నన్ను తినివేయగలవు అందుచే ఇందులో పడవేయడం నీకు తగదు అనెను. అప్పుడు ఆ సత్యవ్రతుడు ఇది సామాన్యమైన మత్స్యము కాదు అని భావించి ఇట్లు ప్రశ్నించెను. ఇట్టి శక్తి గల జలచర్ములను ఇంతకుముందు నేను చూడలేదు, వినలేదు. ఒక రోజులో నూరు యోజనలు వ్యాపించితివి. నీవు సాక్షాత్తు నారాయణుడివే. సర్వ భూతములను అనుగ్రహించుటకు జలచర రూపమును స్వీకరించి ఉందువు. పురుషోత్తమా సృష్టి స్థితి లయకారణ భూత.

నీవే ఉపాయమని నమ్మిన భక్తులమగు మాకు నీవే రక్షకుడవు. నీవు లీలచే అనేక అవతారములను సకల భూత శ్రేయమునకై స్వీకరించుచుందువు. హే పుండరీకాక్ష నీవు సర్వ సుహృత్తువు. నీవు ఆత్మగా లేని వస్తువు ఈ లోకంలో లేదు. నేను స్వతంత్రుడను అని భావించు వారలకు జ్ఞానము కలుగుటకు నీ పాదపద్మ భజనమే సాధనము. ఈ రూపం ఏమియో మాకు వివరింపుము అని ప్రార్థించిన సత్యవ్రతునితో భగవానుడు ఇట్లు చెప్పెను. నేటికి ఏడవ రోజున ఈ మూడు లోకములు ప్రళయ జలములతో నిండును. అప్పుడు అంతయు జలమయమగును. ఒక విశాలమగు నౌక నా సంకల్పముచే మీ సమీపమునకు వచ్చును. నీవు సకల ఔషధులను బీజములను ఆ నౌక యందుంచి సప్త ఋషులతో సకల ప్రాణి సమూహముతో ఆ నావను ఎక్కి స్వేచ్ఛగా సంచరింతువు. అప్పుడు ఈ సూర్యుని వెలుగు ఉండదు. ఋషులు ఋషుల వెలుగే ప్రకాశించుచుండును. ప్రళయ వాయువులు ఆ నౌకను ఒకచోట నిలవనియ్యక ఇటు అటు ఊపుచుండును. అప్పుడు ఆ నావను ఒక సర్పముతో నా కొమ్మునకు బంధించుము. నేను ఋషులను నిన్ను ఆ నౌకతో కాపాడుచు బ్రహ్మ రాత్రి పూర్తి అగువ వరకు నిలపగలను. నా మహిమనే పరబ్రహ్మము అని పేర్కొందురు. దాని నీవు నీ హృదయమున ఎరుంగగలవు అని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యెను. ఇది ఒక యోగశాస్త్ర ప్రక్రియ నిరూపించును. శరీరములో నుండి శక్తి చేత యోగులు దర్శించే దర్శనమునందు దర్శనము ఇందు వివరించబడినది. ఈ బాహ్యమైన నామరూపములు గల పదార్థములు లేనప్పుడు చీకటి ఆవరించినప్పుడు బ్రహ్మ వర్చస్సుతో దివ్యమైన కారణ తత్వమును దర్శింపజాలుదురు. ఈ కార్యజాతమంతయు అందు లీనమై యుండుట వారు గుర్తింతురు. అట్టి రహస్యమైన యోగ భూమిక ఇందు వివరించబడినది. సత్యవ్రతుడు భగవానుడు చెప్పిన కాలమునకై ఎదురు చూచుచుండెను. నదీ తీరమున ఈశాన్య దిక్కునకు అభిముఖుడై మత్స్య రూపమున కనపడిన శ్రీహరి పాదమునని స్మరించుచు

దర్భలపై కూర్చుండెను. సముద్రం పొంగి భూమిని ముంచి వేయుచుండెను. మహా మేఘములు వర్షించుచుండెను. భగవదాజ్ఞను తలంచుకొనుచుండగా ఒక నౌక వచ్చెను. వెంటనే ఋషులతో కలిసి ఆ నౌకనెక్కెను. లక్ష యోజనముల శరీరము గల ఒంటి కొమ్ము గల మత్స్యము ఒకటి ఆ రాజునకు దర్శనము సంగెను. ఈశ్వరాజ్ఞను అనుసరించి ఒక పాముతో ఆ నౌకను ఆ మత్స్యము కొమ్మునకు బంధించెను. భగవానుని ఇట్లు స్తోత్రము చేయుచుండెను. అనాదిగా అవిద్యావరించి ఆత్మజ్ఞానము నశించి సంసారమును పరిభ్రమించు వారలకు అనుకొనకుండా లభించిన జన్మలు కర్మచే బంధింపబడి సుఖమును కాంక్షించి కర్మ చేసి దుఃఖములను పొందుచుందురు. శ్రీహరి సేవచే అజ్ఞానము తొలగి అహంకార గ్రంథి వీడును. అతడే మనకు గురువు. బంగారమునకు పట్టిన మాలిన్యము అగ్నిచే తొలగింపబడునట్లు. ఆత్మను ఆవరించిన అజ్ఞానములు అజ్ఞాన మలము శ్రీహరి గురు చరణ సేవచే తొలగుగాక. ఆ శ్రీహరి అనుగ్రహములో వెయ్యి వంతు కూడా దేవతలు కారు. వారందరూ రక్షించుటకు సమర్ధులు కారు. మోక్షమున సంగువాడు శ్రీహరి. నీ చరణములను శరణముగా నమ్మియుంటిని. కన్నులు లేని వారికి కన్నులు గలవాడు దారి చూపునట్లు ఆత్మరక్షణకు ఆవశ్యకము జ్ఞానము లేని జీవులకు జ్ఞానము గల నీవే సురుని వలె ప్రకాశము నొసంగు గలవాడవు. కానీ ఇతరులు ఎవరునూ గురువులు కారు. నీవు తప్ప మిగిలిన వారు గురువును కొనుట గుడ్డివానికి గుడ్డివాడు అజ్ఞానికి జ్ఞానవీహీనుడు దారి చూపుట వంటిదే కానీ ఉపయోగం లేదు. ఈ లోకములో జనన మరణాదులు గల ఒక సంసారి జీవుడు గురువునను అహంకారముతో సంసారులకు చెడు దారలని ఉపదేశించును. ఆ మార్గములో పయనించు శిష్యుడు దాటొక శక్యము గాని అంధ తమస్సును పొందును. నిజమైన జ్ఞానము సంగు గురువు నీవే. నిన్ను ఆశ్రయించిన వాడు నీ స్థానమును పొందును. నీవు సర్వలోకములకు మిత్రుడవు.

ప్రియుడవు. లోన వ్యాపించి నియమించువాడవు. ఆత్మ వలె ధరించువాడవు. హితమును ఉపదేశించు గురువు నీవే. జ్ఞానమును ప్రవర్తింపజేయువాడవు. అభీష్టమును సిద్ధింపజేయువాడవు నీవే. ఇట్టి నీవు. హృదయ కమలమున వసించి ఉండగా లోకం ఎరుంగలేక ఇతరులను ఆశ్రయించును. హే దేవా నేను నిన్నే వరణీయుడవగు దేవదేవునిగా దృఢముగా నమ్మియున్నాను. నాకు జ్ఞానమును నీవే ప్రసాదించవలెనని అర్ధించుచున్నాను. పరమార్థ ప్రకాశమును కలిగించు దీపం వంటి నీ వాక్కులతో నా హృదయమున ముడివీడని దేహాత్మాభిమానములను దేహాత్మాభిమానాదులను ఛేదింపుము. స్వరూపమును ప్రకాశింపచేయును. ఇట్లు సత్యవరదులు ప్రార్థించగా మత్స్య రూపియగు ఆదిపురుషుడు మత్స్య పురాణమును అనుగ్రహించెను. అందు స్వరూప యదార్ధ జ్ఞానమును, భక్తి యోగమును, కర్మ యోగమును సకల రహస్యములను అతనికి వివరించెను. ఋషులతో కలిసి ఆ సత్యవ్రతుడు నౌకలో భగవానుడు ఉపదేశించిన సనాతన బ్రహ్మ విద్యను తెలుసుకొనెను. అప్పుడు శ్రీహరి వేదములను దోచుకొని పోయిన హయగ్రీవుని సంహరించి వేదములను మరల తెచ్చెను. ఆ సత్యవ్రత మహారాజే జ్ఞాన విజ్ఞాన సంపన్నుడై ఈ కల్పమున వైవసత మనువుగా భగవత్ కృప వలన ధర్మ రక్షణము చేయుచున్నాడు. ఈ మత్స్యావతార కథ శ్రవణము చేసిన సకల పాపములు తొలగి సమస్త సంకల్పమును ఈడెరును. పరమగతిని పొందుదురు. ఇంతటితో మత్స్యావతార కథ పూర్తయింది. దీనితో అష్టమ స్కంధము కూడా సంపన్నమవుతుంది మనము. దీని తరువాత నవమ స్కంధములో మరొక పాడ్కాస్ట్ లో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. May the essence be spoken by all, beyond the supreme, like the sweetness of honey, may all the fruits be manifested. O Giver of salutations, O radiant ray on the tongue, the names of Narayana are visible. I am a Yogi, offering prayers with my tongue. Presenting the supreme essence, Narayana, and repeatedly uttering the names that are like the fruits that emanate nectar to the virtuous. Mukundamala 31st Prayer. Dear relatives, welcome to the 12th podcast of Srimad Bhagavata Tattva Deepika, Ashtama Skandham. Until now, we have served the story of Gajendra Mokshanam, the churning of the ocean of milk, and the story of Vamana Bali very well. These are all good things that are useful for life. Great stories to help you travel the path of great devotion. Praying that they listen in the podcast, we are now entering another incarnation story. The story of the fish avatar. King Parikshit is questioning Shukayogi. The Lord assumed the form of a fish, and immediately this form is worthy of being accepted in the world. Of their own accord. Tamaha swabhavam dvishayam. Sarveshwara is by karma What is the reason for attaining such a form, like those who are born? The history of the Lord, which is the best verse, brings happiness to all the worlds. I would like to explain that. As soon as this was requested, Shukayoginda began to narrate the story of Matsya Avatar. The Lord considers it his duty to protect cows, Brahmins, gods, sages, and Vedas.

Righteousness is the source of worldly protection. The Vedas are the primeval texts of Dharma. Those who study the Vedas, perform the sacrifices mentioned in them, and bring good to the world are Brahmins. Those who are pleased with the deeds they have done and who cause the welfare of the world are the gods. Cows are the ones that give ghee, milk, curd, etc., which are used for sacrifices. Therefore, the Lord protects them for the good of the world. It accepts the necessary forms, whether inferior or superior. Just as the air moves in all beings, similarly, God pervades all beings. Therefore, there is no distinction between what is great and what is less for him. He accepts any form for the protection of the world through his will. Those who are in it, their faults will not affect them. The end of the eon was the apocalypse. When the day ends for Brahma and the night falls, the three worlds - Bhuva, Bhuva, Suva - dissolve. It is called Naimittika Pralayam. At night, Brahma sleeps. When sleeping, the Vedas are released from the mouth of Brahma Seeing this, the demon abducted the Vedas from the Hayagriva. The Lord took the form of a fish to destroy the demon. In the past, there was a great king named Satyavrata. He is endowed with the quality of the soul, Narayana. One who is nourished by water. He was born as a son to Vivastutun in this kalpa, and with the name Shraddha Deva, he was Manu in this Manvantara. One day, Krutamala took water in a vessel from you and offered it as an oblation. Then a fish bit the hook in the water.

Satyavrata released water from his hand into the river with a fish. You are very merciful and compassionate, Satyavrata. I am alone, a humble person. There are big fishes here that can swallow me. Save me, he prayed. To protect himself, Satyavrata, who had taken the form of a fish and come, thought that he himself should protect it, as he did not know Srihari. Hearing its humble prayer, he took the fish to the ashram with the water in his hand. The fish was put in the pot. The fish was growing. From the Kalasha, he placed the kamandalam in the kumbha. Then that fish Swami, this kamandalam is tight for me. He prayed that He would grant him a place in the vast. Satyavrata then placed it in a large ocean. In one second it was three quarters broken. It was three mounds. This place is not enough for me. He prayed to show a place wider than this. Then he placed it in a lake. Then that fish said, "This lake, these lotuses, are not enough for me. Keep me in a pond with inexhaustible water." Then he changed the fish and threw it into a sea. Then that fish said, "In the sea, there are big aquatic creatures, they can eat me, therefore, throwing me in here is not appropriate for you." Then that Satyavrata, thinking that this was not an ordinary fish, asked thus. I have never seen or heard of such a powerful aquatic creature before. You have spread over a hundred yojanas in a day. You are none other than Narayana. You have assumed the form of a fish to bestow blessings on all beings. Purushottama is the lord of all beings, preserving and destroying the universe.

For we, who believe that you are a means, are your own, your own. You, through your play, accept many incarnations for the welfare of all beings. Hey Pundarikaksha, you are the best friend of all. There is nothing in this world that you cannot find in your soul. For those who think I am independent, your lotus feet's devotion is the means to gain knowledge. The Lord thus spoke to Satyavrata, who had prayed to explain what this form was. On the seventh day, these three worlds will be filled with the waters of the flood. And the whole thing will be ruined. A vast ship will come to your vicinity by my will. You place all the medicines and seeds in that boat, and with the seven sages and the entire group of creatures, you board that boat and roam freely. Then the light of the sun will not be there. The sages shine as the light of sages. The destructive winds are tossing the ship from one place to another. Then, tie up the boat with a serpent to my horn. I, the sages, can protect you with that ship and keep you standing until the Brahma Ratri is complete. My glory is the Supreme Brahman, they say. That Saying that you can understand in your heart, Srihari disappeared. This is a yoga science process that proves it. The vision that yogis see through the power of their bodies is described here. When external names and forms, when there is no substance, when darkness covers, they cannot see the divine causal essence with the power of Brahma. They realize that all of this work is absorbed in it. Such a mysterious yoga ground is described here. Satyavrata was waiting for the time that the Lord had told him. Remembering the feet of Sri Hari, who appeared in the form of a fish, facing the northeast direction on the banks of the river

Sitting on the darbha grass. The sea was rising and flooding the land. The rain fell in torrents. While he was thinking of God's command, a boat came. Immediately he boarded the ship with the sages. A one-horned fish with a body of a hundred thousand yojanas and a trunk, a vision of that king occurred. Following the order of God, he bound the ship to the fish's horn with a snake. Thus he was praising the Lord. Those who, having been ignorant from the beginning, have lost self-knowledge and wander in the world, without considering, their births are bound by karma, they desire happiness and perform karma, and suffer sorrows. By serving Sri Hari, ignorance is removed and the knot of ego is untied. He is our Guru. Just as impurities attached to gold are removed by fire. May the ignorance that has covered the soul, the impurities of ignorance, be removed by the service of Sri Hari's Guru's feet. Not a thousand gods, but only one part in a million of Sri Hari's grace. Not everyone is capable of protecting themselves. Sri Hari is the one who is liberated. I have always believed in surrendering to your feet. He who has eyes for those without eyes Like a guide, it is necessary for self-defense. You, who have knowledge, are like a Suri, shining like one. But no one else is a guru. Except for you, it is like a blind man showing the way to a blind man, a blind man, an ignorant man, a knowledgeable man, to a blind man, but it is of no use. In this world, a worldly being with births and deaths, with pride, preaches to the worlds that bad paths are the paths to destruction. A disciple traveling on that path will attain blind ignorance, which is impossible to overcome. You are the true guru of knowledge. He who has taken refuge in you will inherit your position. You are a friend to the whole world.

You are beloved. You are the one who pervades and rules. You are the one who wears the soul. You are the guru who preaches well-being. You are the one who is going to implement the knowledge. You are the one who fulfills desires. You the bitch. While residing in the lotus of the heart, unable to understand the world, one seeks refuge in others. Oh God, I firmly believe in you as the God of gods, the only savior. I understand that you are the one who bestows me with knowledge. With your words that illuminate the ultimate truth, sever the egoistic attachments and egoistic pride that do not cling to my heart. It illuminates the form. Thus, as Satyavaradi prayed, the first man in the form of a fish granted the Matsya Purana. And explained to him the true knowledge of the form, the yoga of devotion, the yoga of action, and all the secrets. Along with the sages, that Satyavrata learned the eternal Brahma Vidya taught by the Lord in the boat. Then Srihari killed Hayagriva, who had stolen the Vedas, and brought back the Vedas. That Satyavrata Maharaja, being full of knowledge and wisdom, this In the world, as the Manu of Vaivasvata, by the grace of God, he is protecting Dharma. By listening to this Matsya Avatar story, all sins are removed and all desires are fulfilled. They will attain the supreme good. The story of Matsya has been completed by this. With this, the eighth Skandha also becomes prosperous, we. We'll meet in a new podcast episode after this. Jai Srimannarayana, salutations to the Gurus