మొసలి పట్టు - గజేంద్రుని వేయి సంవత్సరముల ఘోర పోరాటము & అనన్య శరణాగతి
The Crocodile's Attack & A Thousand-Year Fierce Battle & Surrender
శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, గజేంద్రుడు అనే మహా బలశాలియైన ఏనుగు రాజు ఒక శక్తివంతమైన మొసలితో వేయి సంవత్సరాలు భీకరమైన పోరాటం చేస్తాడు. క్రమంగా శరీర బలం క్షీణించిన తర్వాత, లౌకిక సహాయమేదీ అందకపోవడంతో గజేంద్రుడు శ్రీహరిని అనన్య శరణాగతితో ప్రార్థిస్తాడు. భగవంతుని కృపకు పాత్రులు కావడానికి బాహ్య శక్తి కాదు, హృదయపూర్వకమైన శరణాగతి మాత్రమే మార్గమని ఈ కథ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.
In this profound episode from Canto 8 of Srimad Bhagavatham, we witness the mighty elephant king Gajendra engaged in a fierce and harrowing battle with a powerful crocodile for a thousand long years. As Gajendra's strength slowly fades and all hope of rescue from worldly sources vanishes, he turns his heart entirely toward the Lord in an act of pure, unconditional surrender. This episode beautifully illustrates that true liberation comes not through personal strength or effort, but through complete and selfless surrender at the lotus feet of Sri Hari.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః బద్ధేనాంజలినానతేన శిరసా గాత్రైసరోమోద్గమయీహి కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ భాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవింద యుగల ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ పుండరీకాక్షా, నీకే ముగిడిచ్చిన దోసిలి, వంగిన శిరస్సు, గగుర్పొడిచిన యవయవములు, గద్గద స్వరములు గల కంఠము కన్నీటితో నిండు కన్నులు ఎల్లప్పుడూ నీ పాదారవింద ధ్యానామృతమును ఆస్వాదించుచుని మా జీవితమంతయు సాగునట్లు అనుగ్రహింపుము. ముకుందమాల 21st ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక అష్టమ స్కంధం మూడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు గజేంద్ర మోక్షం కథా భాగంలో గజేంద్రుడు భగవంతుని చివరి దశలో ప్రార్థించినటువంటి ప్రార్థన విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇదే ప్రార్థన విషయం మనకి తెలుగులో ఒక పద్యం కూడా ఉంది. దాన్ని ఇప్పుడు తెలుపుకొని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడనాది మధ్య ఇలయునెవ్వడు. సర్వము దానయిన వాడెవ్వడు వానినాత్మ భౌనీశ్వరునే శరణంబు వేడెదన్ పోతన గారు రాసినటువంటి పద్యం దాని అర్థాన్ని సృష్టికి ముందు ఈ జగమంతయు ఎవ్వరి యందు ఉన్నదో సూక్ష్మ చేతనా చేతనములతో కూడిన ఏ పరమాత్మ నుండి ఈ స్థూలమైన చేతనా చేతనాత్మకమైన జగము వచ్చినదో
ఎవ్వనిచే సృష్టించబడి రక్షింపబడుచున్నదో, ఎవడు సకల పదార్థములలో వ్యాపించి ఉన్నవాడో, ఎవడు అచేతనము కంటే పరుడైన జీవుని కంటే పరుడై పరాత్పరుడగుచున్నాడో, ఎవడు తనంతట తాను ఉండగలవాడో వానిని ఉపాయముగా రక్షకుడుగా నమ్మియున్నాను. బ్రహ్మ యొక్క నూరేళ్ళు ఆయుర్దాయం సమాప్తము కాగానే ఈ జగత్తుకు కారణములగు మహాభూతములగు తత్వములు, లోకములు, లోకపాలకులు లయమును పొందుదురు. అప్పుడు ఈ జగమంతయు అత్యంత సూక్ష్మ దశను పొంది పెంజీకటి అగును. అట్టి పెంజీకటి కవ్వల ఎవడు వెలుగుచుండునో వానిని ఆశ్రయింతును. యోగులు, దేవతలు కూడా ఎవ్వని పదమును ఎరుంగలేరో, పొందలేరో అట్టి వానిని సామాన్యమైన జీవులెట్టు ఎరుంగగలరు? నటుని వలె అనేక వేషములతో ఎవడు ఈ లోకమున కనపడుచున్నను గుర్తించుటకు శక్యము కాడో వానిని నేను శరణు పొందుదును. మునులు ఏ మహాత్ముని నిత్యానంద రూపమగు స్వరూపమును దర్శింపగోరి భార్యా పుత్రాదులందు మమకారములు వీడి ధర్మాచరణ నిష్ఠులై సర్వత్ర సమదర్శనము చేయుచు ఇతరులెవ్వరూ చూడలేని గహనమైన స్థానమున ధ్యానించుచుందురో అట్టి వానిని శరణు పొందుచున్నాను. ఎవ్వనికి కర్మకృతమగు జన్మ గాని కర్మ గాని లేదో ఎవ్వనికి నామరూపములు లేవో అట్టివాడు సాధు పరిత్రాణమునకై దుష్టుద్వినాశనముకై ఒక రూపముతో తన సంకల్పముచే స్వేచ్ఛగా జన్మించుచుండునో అట్టివానిని నేను శరణు పొందుచున్నాను. బ్రహ్మాదులకు కూడా నియామకుడు, అనంత శక్తి సంపన్నుడు, తనకు ఏ రూపము లేనివాడైయు స్వేచ్ఛచే అనేక రూపములతో జన్మించువాడగు ఆశ్చర్య కరుమునకు నమస్కారము. తనంత తాను ప్రకాశించువాడు, అన్నిటినీ ఒక్కసారిగా చూడగలిగినవాడు, అన్ని ఆత్మలలో వ్యాపించి ఉన్నవాడు, మాటకు మనసునకు అందని వాడగు భగవానునకు నమస్కారము. జ్ఞానులు వేరొక ప్రయోజనమును కాంక్షించక ఉపాసించినచో లభించువాడు, ప్రకృతి సంబంధము అంటనివాడు, ఇతరులకు అంటకుండా చేయువాడు, దుఃఖము కలియని జ్ఞానానంద స్వరూపుడగు భగవానునకు నమస్కారం.
అఖిల కారణుడు, నిష్కారణుడు, అద్భుత కారణుడు, సకల నదులకు సముద్రము వలె వేదాది వాంగ్మయమునకు గమ్యముగు భగవానునకు నమస్కారము. దేహమునందు, బిడ్డలయందు, గృహములయందు మమకారములు వదలని వారికి అందనివాడు. సత్తరజస్తమో గుణములతో సంబంధము లేనివాడు. రాగాది దోషములు లేనివి మనసు కలవారిచే ధ్యానింపబడువాడగు జ్ఞాన స్వరూపుడగు సర్వేశ్వరునకు నమస్కారము. కొందరు మహానుభావులు భగవానుని ఉపాయముగా ఫలముగా నమ్మి వేరొక దానిని కోరక భగవానుని ఆశ్రయించి అత్యద్భుతమగు లీలలను గుణములను గానము చేయుచు ఆనంద సముద్రములో మునిగి ఉందురు. భగవానుడు దేవత్వము మనుష్యత్వము మొదలగు జాతులకు చెందనివాడు. స్త్రీత్వము, పుంస్థవము మొదలగు లింగములు లేనివాడు అతడు ప్రాణి కాదు. గుణ కర్మలు. లేనివాడు అందుచే జీవకోటిలో చేరడు. అన్నియు అతనిని ఆశ్రయించి ఉండును ఉండును. అతని స్వరూపము స్వభావము గ్రహించుటకు వీలు కాదు. అట్టి వానికి నమస్కారములు. నేను ఈ గజ శరీరముతో జీవింప కోరిక కలవాడను కాను. లోపల వెలుపల కూడా అహంకార మమకారములను పూయినది ఈ శరీరము. ఈ శరీరము నుండి విడువడి, జ్ఞానమును ఆవరించడి, కర్మ బంధము నుండి విడువడి, మరల జన్మమెత్తకుండా ఉండవలెని కోరుచున్నాను. ఆ భగవానుని అఘటిత ఘటనా శక్తి విచిత్రము, తననే ఉపాయముగా నమ్మెడి వారిని రక్షించువాడు, ఇంద్రియములను జయింపలేని వారికి. అందనివాడు అట్టి భగవానుని దివ్య చరణారవిందములను నేను శరణముగా నమ్ముచున్నాను. ఈ విధముగా గజేంద్రుడు స్తోత్రము చేసెను. హే గుణములు లేనివాడు కళ్యాణ గుణములు కలవాడు సకల జగత్తుకు కారణమైన తత్వము కలవాడు తనకొక తనకు వేరొక కారణము లేనివాడు. అని వర్ణించిన విశేషములు బ్రహ్మాదులకు ఎవ్వరికీ లేకపోవుటచే వారెవ్వరు రక్షించుటకు ముందుకు రాలేదు. సకల జగత్తుకు తాను ఆత్మగా ఉన్నవాడగుటచే.
అఖిల దేవతా సమూహము తనకు శరీరముగా గల శ్రీహరి ఆ గజేంద్రుని రక్షించుటకు ఆవిర్భవించెను. ఆతుడు గజేంద్రుని స్తోత్రము విని విలంబము చేయలేక వేద స్వరూపుడవు గరుడునిచో గరుణుడిచే సహింపబడుచున్న వాడై చక్రాయుధమును దాల్చి శ్రీహరి సరస్తీరమున ప్రత్యక్షమాయెను. భగవానునికి భక్తుల రక్షణకై గల తొందరను మహాకవులెందరో చాలా అందముగా వర్ణించిరి. పూతన గారు ఆంధ్ర మహాభాగవతమున కూడా సిరికింజెప్పడు మొదల పద్యములలో భగవానుని త్వరను చాలా అందముగా వర్ణించినారు. బలమైన ముసలిచే పట్టుబడి సరస్సులో ఉన్న గజేంద్రుడు చక్రమును దాల్చి గరుత్మంతుని పైనున్న శ్రీహరిని చూచి తామర పువ్వు ధరించి ఉన్న తన తొండమును పైకెత్తి అతి కష్టముతో నారాయణా అఖిల గురు భగవన్ నమస్తే అనినాడు దీనిచే వెనక గజేంద్రుడు వర్ణించిన సకల జగత్కారణము తత్వము నారాయణుడే అని స్పష్టముగా తెలియుచున్నది. శ్రీమన్నారాయణుడు వెంటనే గరుత్మంతుని నుండి దిగి చెరువులో ప్రవేశించెను. మొసలిని గజేంద్రుని కూడా చేతులతో పట్టి ఒడ్డునకు తెచ్చెను. చక్రముతో మొసలి నీటిని తేల్చి గజేంద్రుని విడిపించెను. దేవతలందరూ భగవానుని కృపకు ఆశ్చర్యపడి చూచుండిరి. సంసారములో నుండి భగవంతుడి ఉపాయమని దృఢమైన నమ్మకం కలిగి ప్రార్థించినచో భగవానుడే దిగి వచ్చి మనకు ఈ బంధమును విడినట్లు చేయును. వాడే ఉపాయము దృఢమైన విశ్వాసము కలిగి ఉండుట కంటే వేరొక ప్రయత్నం ఏదియు. చేయవలసిన అవసరం లేదు. మోక్షమునకు అదే ఉపాయమని గజేంద్రుడు నిరూపించినాడు. బ్రహ్మ రుద్రాదులు మొదలగు దేవతలు ఋషులు పుష్ప వర్షమును కురిపించిరి. దుందుపులు మ్రోగెను. గంధర్వులు నృత్యము చేసిరి. గానము చేసిరి. చారణులు సిద్దులు స్తోత్రము చేసిరి. ఆ ముసలి శాపము వీడి పరమాశ్చర్యముగు రూపమును ధరించి హూ హూ అను గంధర్వుడుగా తన రూపమును పొందెను. అతనికి దేవలుడు ఇచ్చిన శాపము భగవననుగ్రహముచే తొలగెను. గజేంద్రుడు సంసార బంధము వీడి శంఖ చక్రములు చతుర్భుజములు కల భగవంతుని రూపం వంటి రూపమును పొంది పరోపదముకేగెను.
ఈ గజేంద్రుడు పూర్వము పాండ్యపు దేశము రాజు ఇంద్రద్యుమ్నుడు. విష్ణు భక్తుడు. ఒకనాడు వ్రతమును స్వీకరించి మంచి నియమముతో జటలు దాల్చి తాపసుడై మలయ పర్వతమున ఒక ఆశ్రమమున మౌనముతో భగవదారాధన యందు నిమగ్నుడై ఉండెను. అచ్చటికి అగస్త్య మహర్షి వచ్చెను. మౌనముతో భగవత్ ధ్యానములోనున్న ఇంద్రద్యుమ్నుడు అగస్త్య మహర్షికి అర్ఘ్యపాద్య సత్కారమును చేయలేదు. వెంటనే అగస్త్యుడు కోపించి మహా తపస్శాలిని అవమానపరిచినాడు కావున అజ్ఞానమయమగు బుద్ధిహీనమగు గజజన్మను పొందుదువు కాక అని శపించెను. భగవంతుని ఆరాధన కంటే భగవత్ భక్తులను ఆరాధించుట ప్రధానము. దానిని ఎరుగక ఇంద్రద్యుమ్నుడు మౌన వ్రతమున ఉండుటచే భగవత్ ఆరాధన మాని అగస్త్యుని ఆరాధించుటకు వీల్లేవలేదు. ఇది మహా అపచారము. మనము జపము చేసుకొనుచున్నను ఆరాధన చేసుకొనుచున్నను జ్ఞానులగు పెద్దలు విచ్చేసినప్పుడు ఆ నియమమును వీడి వారిని ముందు ఆరాధించవలెను. అది చేయక రాజు గజజన్మము నెత్తెను. పరిపూర్ణమైన భక్తితో శ్రీహరిని ఆరాధించుటచే గత జన్మలో కూడా శ్రీహరిని గూరుచ్చిన స్మృతి కలిగినది. ఈ విధముగా గజేంద్రుడు జన్మ కర్మ బంధ మోక్షము నొందెను. మొసలి దేవలుని శాపము నుండి విముక్తి పొందెను. ఈ గజరాజ మోక్షణ కథను విన్నవారికి కలి కల్మషములు ఉండవు. దుస్వప్న నాశనము కలుగును. శ్రీహరి సంతసించును. ఎవరు ఉదయమున నిద్ర నుండి లేవగానే గజేంద్రుని సరస్సును ఆ వనమును శ్రీహరిని స్మరింతురో వారికి ఈ శరీరం విడినప్పుడు తనను గూర్చిన స్మరణ కలుగునట్లు చేసి పాప విముక్తులగునట్లు చేయుదునని శ్రీహరి పలికెను. శ్రీహరి దేవతలను ఆనందింపజేయుచు మరల గరుత్మంతుని అధిరోహించి తను లోకమునకు పోయెను. ఐదవ మన్వంతరము రైవత మన్వంతరము. ఇందు రైవతుడు మనువు. ఈ మన్వంతరమున శుభ్రునకు వికుంఠ అని భార్య యందు వైకుంఠుడు అని పేరుతో భగవానుడు అవతరించెను.
లక్ష్మీదేవి ప్రార్థన చే లోకాలోక పర్వతము పైభాగమున వైకుంఠము అను లోకము కల్పించెను. ఈ వైకుంఠము కార్య వైకుంఠము. కారణ వైకుంఠము అని వేరొకటి ఉన్నది అది నిత్యం. అది లీలా విభూతికి అవతల ఉన్నది. ఈ వైకుంఠుడే వరాహ రూపమున హిరణ్యాక్షుడు సంహరించినట్లు వెనక వర్ణించబడినది. చాక్షుజ మన్వంతరము ఆరవ మన్వంతరము. ఇందు రాక్షస చాక్షుడు మనువు. ఇందు వైరాజునకు సంభూతి అను నామ యందు. అజితుడు అను పేరుతో భగవానుడు జన్మించెను. ఆ అజితుడు అను భగవానుడే దేవతలు, రాక్షసులు అమృతమునకై సముద్రమును మధించినప్పుడు కూర్మ రూపమును దాల్చి మందరమును ధరించెను. మనం తర్వాత ఎపిసోడ్లో కూర్మావతారం యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇంతటితో గజేంద్ర మోక్షణం కథ పూర్తయినది. తర్వాత భాగంలో మనం క్షీర సాగర మథనాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. With folded hands, with eyes filled with tears, I offer my head and body. With my throat, with the sound of the divine Ganges, with my eyes, with the tears of the lotus-like eyebrows, I always drink the nectar of the meditation of your lotus feet. May our lotus-like eyes always be on the lotus feet of the Lord Luxury is a life. Oh, Pundarikaksha, the bowl that you have finished, the bent head, the organs that have been shaken, Oh, one with a throat filled with choked voices, with eyes filled with tears, always, may our lives continue as long as we enjoy the nectar of meditation on your lotus feet. Mukundamala 21st Prayer. Devotees of God, welcome to the third podcast of Srimad Bhagavata Tattva Deepika, Ashtama Skandham. Until now, in the Gajendra Moksham Katha part, we have learned about the prayer that Gajendra prayed to the Lord in his final stage. This is the prayer matter, we also have a poem in Telugu. Let's go through that step by step. The world that is born of youth, who is within? Being absorbed in the youth, who is in the youth? Who is the supreme Lord in this? Who is the root cause? Who is the middle? Who is the end? Sarvam Who is the giver? I seek refuge in that soul, the lord of the earth. The poem written by Potana Garu, its meaning is, before creation, this entire universe is in whom? From that supreme soul, which is united with subtle consciousness and consciousness, this gross body Has the world become conscious
He who was created by no one and is being saved, He who is pervading all substances, He who is beyond the unconscious, beyond the living being, is becoming the Supreme Being I believe in the one who can be alone on his own, as a savior through a trick. As Brahma's hundred years of life come to an end, the great elements, the principles, the worlds, and the lords of the worlds that are the causes of this world will be destroyed. Then this universe attains the most subtle state and becomes a particle. I will seek refuge in the one who shines brightly in the darkness of the dark pit. Yogis and gods also, who cannot understand or attain anyone's word, how can ordinary beings understand such a person? Like an actor, I will surrender to the one who cannot be recognized in this world with many disguises. Those sages, desiring to see the form of the eternal bliss of the great soul, abandoning attachments to wife, children, etc., being steadfast in the practice of Dharma, meditating in a secret place where no one else can see, such a one I seek refuge. To whom I surrender to such a person who is free from karmic birth and karma, who has no name or form, who is free from the destruction of the wicked for the sake of salvation, who is born freely with his own will, with one form. Salutations to the wondrous and merciful one, the one who is the ruler of even the Brahmas, the possessor of infinite power, and who, without any form, freely takes birth in many forms. He who shines on his own, he who can see everything at once, he who is pervading in all souls, salutations to the Lord who is beyond speech and mind. If the wise worship without desiring any other benefit, he who is attained, he who does not say anything related to nature, he who does not cause others to be attached, salutations to the Lord who is the embodiment of knowledge and bliss without causing sorrow.
The all-causing, the uncausing, the wonderful cause, like the ocean to all rivers, salutations to the Lord who is the destination of Vedic literature. He is the one who does not get those who do not give up attachment to the body, children, and houses. The one who is not connected with the qualities of Sattva, Rajas and Tamas. Salutations to the Lord, the Supreme Being, who is the embodiment of knowledge, who is without sin and fault, who is meditated upon by those with a mind. Some great people, believing in the divine's means and as a result, without desiring anything else, taking refuge in the divine, sing the wonderful plays and virtues, and immerse themselves in the ocean of bliss. The Lord is not of the race of gods or of men. He who is without gender, such as femininity and masculinity, is not a living being. Virtues. He who has no, therefore, will not be among the living. Everything will depend on him. It is not possible to understand his form and nature. Greetings to the one who is like that. I am not one to want to live in this body. This body is covered with ego and attachment, both inside and outside. Leaving this body, knowledge I wish to be freed from the bondage of karma and not to be born again. That God's unforeseen power is strange, He is the protector of those who trust Him as a means, for those who cannot conquer the senses. I, who am unattainable, believe in the divine lotus feet of such a God. In this way, Gajendra praised. He who has no qualities, one who has auspicious qualities, one who has the essence that is the cause of the entire world, one who has no cause for himself. And the special qualities described, because no one, including Brahma, had them, none of them came forward to protect. For He is the Self-Existent, the One without a Beginning, the Entire.
The entire group of gods, with Srihari as their body, appeared to protect Gajendra. Hearing the praise of Gajendra, unable to delay, you are the embodiment of the Vedas, being endured by Garuda, being endured by Garuda, assuming the Chakra weapon, Sri Hari appeared in the Sarastira. Many great poets have beautifully described the eagerness of the devotees of God for their protection. Poethana Garu, in Andhra Mahabhagavatam also, in the beginning verses of Sirikinjepadu, has described the speed of the Lord very beautifully. The strong old man, holding the chakra, seeing Garuda on top of Garuda, holding the lotus flower, lifting his trunk, with great difficulty, Narayana, Akhila Guru Bhagavan, Namaste, he said. By this It is clearly understood that the cause of all the worlds, the essence, is Narayana, as described by Gajendra. Srimannarayana immediately descended from Garutmanthu and entered the pond. The crocodile also caught Gajendra by the hand and brought him to the shore. With a chakra, the crocodile separated the water and freed Gajendra. All the gods were amazed at the grace of the Lord. If we have a firm belief that God is the solution to the world and pray, then God himself will come down and make us free from this bondage. There is no other effort greater than having firm faith in the means used. No need to do that. Gajendra proved that it is the only way to salvation. Brahma, Rudra, and other gods and sages showered flowers. The drums have gone round. The Gandharvas began to dance. They sang. The charanas and siddhas praised. That old curse was broken, and he assumed a wondrous form, and became a Gandharva named Hoo Hoo. The curse that Devaludu gave him was removed by the grace of God. Gajendrudu, abandoning worldly bonds, attained a form like that of the Lord, who has conch, disc, and four arms, and ascended to the supreme abode.
This Gajendra was once a king of the Pandya country, Indradyumna. A devotee of Vishnu. Once upon a time, he accepted the vow, wore matted hair with good discipline, became an ascetic, and was engaged in the worship of the Lord with silence in an ashram on the Malaya mountain. Agastya Maharshi had come there. Indradyumna, who was in meditation on the Lord, did not offer arghya and pradhakshya to Agastya Maharshi. Immediately, Agastya, enraged, cursed him, saying, "Because you have humiliated the great ascetic, you will be born as an elephant, not as a person of ignorance and foolishness," thus he cursed him. Worship of Gods is more important than the worship of Gods. Not knowing that, Indradyumna, being in a vow of silence, abandoned the worship of the Lord and was unable to worship Agastya. This is a disgrace. Even if we are chanting or worshiping, when elders who are wise come, we should abandon that rule and worship them first. The king, not doing that, took the elephant birth. By worshipping Sri Hari with complete devotion, even in the past life, there was a memory of worshipping Sri Hari. In this way, Gajendra Birth, karma, bondage, liberation, he attained. The crocodile was freed from the curse of the gods. Those who listen to this Gajaraja Mokshana story will not have any kali-kalusha (impurity). Dream destruction will occur. Srihari is happy. Whoever, upon waking up in the morning, remembers the Gajendra lake and that forest, and Srihari, when this body is separated, Srihari said that he would make them remember about himself and make them liberated from sins. Srihari, delighting the gods, again mounted Garuda and went to his world. The fifth Manvantara is the Rivata Manvantara. Indra is the Manu. In this Manvantara, the Lord incarnated as Vikuntha, with a wife named Shuddha, and as Vaikuntha.
Lakshmi Devi prayed and created a world called Vaikuntha on the top of the world mountain. This Vaikuntha is the Vaikuntha work. The reason is that there is another one called Vaikuntha, it is eternal. It is beyond the reach of Leela Vibhuti. It is described in the previous verse that this Vaikuntha was destroyed by Hiranyaksha in the form of a boar. Chakshuja Manvantara is the sixth Manvantara. Indra is the demon-eye man. In this, to Vairajuna, in the name of Sambhuti. The Lord was born with the name Ajita. That Ajitudu, the god, when the gods and demons churned the ocean for nectar, assumed the form of a tortoise and wore the Mandara mountain. We will learn about the Kurma Avatar in the next episode. With this, the story of Gajendra Mokshanam is completed. In the next part, we will learn about the churning of the ocean of milk. Jai Srimannarayana. Salutations to the Gurus