దక్ష ప్రజాపతి సభా వృత్తాంతము - శివునిపై ఆగ్రహము
Daksha's Assembly Grievance Against Lord Shiva
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, దక్ష ప్రజాపతి మహర్షులు మరియు దేవతలతో నిండిన సభలో ప్రవేశించినప్పుడు జరిగిన సంఘటనలను వివరిస్తారు. అందరూ లేచి గౌరవించినా, తన అల్లుడైన శివుడు మాత్రం లేవకపోవడం దక్షుని అహంకారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఘట్టం అహంకారం మరియు మానప్రతిష్ఠలకు అతుక్కుపోవడం వల్ల మహానుభావులు సైతం ఎలా మోహంలో పడతారో స్పష్టంగా చూపిస్తుంది.
In this sacred episode from the Fourth Canto of Srimad Bhagavatham, we explore the dramatic events that unfold when Daksha Prajapati enters a grand assembly of sages and celestial beings. When all present rise to honor him except Lord Shiva, Daksha's pride is deeply wounded, igniting a fierce resentment toward his own son-in-law. The episode reveals how ego and false prestige can cloud even the most distinguished souls, and how devotion to the Lord must be free from arrogance and attachment to honor.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః అల్హంతే నిరపేక్షాయ పూర్ణకామ నమోస్తుతే మహావిభూతి పతయే నమః సకల సిద్ధయే ఏ భగవన్, నీవు ఆప్తకాముడవు. నీకు అపెక్షలు లేవు. నీకు సర్వము సుసంపన్నము. నీవు గొప్ప మహిమలకు ప్రభువుడవు ప్రభువు సకల సిద్దులు నీయందే ఉన్నవి నీకు అనేక నమస్కారములగు గాక సిక్స్త్ క్యాంటో 19th చాప్టర్ ఫోర్త్ ప్రేయర్ భగద్బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము రెండవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం స్వయంభూ మను యొక్క సంతానము తరువాత దానిలో భాగంగా అత్రి మహర్షి. చేసుకునే తపస్సు గురించి తెలుసుకున్నాం. ఆయన తపస్సు చేస్తూ ఉండగా దేవతలందరూ వచ్చి నిలబడతారు. వారిని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు మీరు ఇక్కడికి వేయించేశారు అని చెప్పేసి దాని బదులుగా తను ఇచ్చేటువంటి దేవతల యొక్క జవాబు ఏమిటి ఆ భాగాన్ని ముందు మనం తెలుసుకుందాం. ఇట్లు అత్రి ప్రార్థింపగా దేవతలు నవ్వి ఆ ఋషితో మధురమైన వాక్కుతో ఇట్లు బదులు పలికిరి. ఓ మహర్షి నీవు సత్యమైన సంకల్పమునే చేసితివి. సృష్టి స్థితి లయములకు కారణమైన జగదీశ్వరుని నీవు ప్రార్థించితివి. అతడే బ్రహ్మలో వృద్ధునిలో అంతరాత్మ అయి ఉండి తాను సాక్షాత్తుగా విష్ణువు అను పేరుతో నిలిచి బ్రహ్మ ద్వారా సృష్టిని శివుని ద్వారా లయమును తాను స్వయముగా రక్షణమును చేయుచున్నాడు. అందుచేత మేము ముగ్గురమును ఒక్కని రూపముగా ఉన్నవారమే. ముగ్గురము అనుకొనుచున్న మాలో ఆత్మ నారాయణుడే అగుటచే మేము ముగ్గురము ఒక్కటే. కానీ నారాయణుడే బ్రహ్మ అను పేరు గల శరీరములోనున్న జీవుని ద్వారా సృష్టిని చేయుచు. రుద్రుడను పేరు గల శరీరములోనున్న జీవునులో ఉండి రుద్రుని ద్వారా లయమును చేయుచు అతనే స్వయముగా విష్ణువు అను పేరుతో బ్రహ్మ రుద్రుల మధ్య నుండి రక్షణము చేయుచున్నాడు.
అందుచే మూడు వ్యాపారములు చేయువాడు ఒక్కడే. ఆ ఒక్కడే ఆయా కార్యములను చేయుచున్నప్పుడు మూడు రూపములుగా కనపడును. కనుక నీవు మూడు రూపములతో దర్శనము. నీకు మూడు రూపములతో దర్శనము కలిగినది. నీవు కోరినట్లే మా ముగ్గురి అంశలతో నీకు కుమారులుగా లోకములో ప్రసిద్ధమైన కీర్తి గలవారు జన్మింతురు. నీకు మంగళమవుగాక. నీ కీర్తిని లోకమున విస్తరింప చేయువారమగుదుము. అత్తిరిచే ఆరాధింపబడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చూచుండగానే వెనక్కి ఎగిరి. అందు బ్రహ్మ యొక్క అంశచే సోముడు అనగా చంద్రుడు జన్మించెను. విష్ణు యొక్క అంశచే యోగ విధుడగు దత్తుడు జన్మించెను. శంకరుని యొక్క అంశచే దుర్వాసుడు జన్మించెను. కర్ధముని మూడవ కుమార్తె శ్రద్ధ. ఆమె అంగిరసుని పత్ని. ఆమెకు నలుగురు కుమార్తెలు కలిగిరి. సినీవాళి, కుహు, రాక, అనుమతి అనువారు ఆమె కుమార్తెలు. ఆమెకే ఉతద్యుడు బృహస్పతి అను పేరు గల ఇద్దరు కుమారులు కూడా జన్మించిరి. కర్దముని నాలుగవ కుమార్తె హవిర్భూ పులస్తుడు అను ప్రజాపతికి ఆమెయందు అగస్త్యుడు అను కుమారుడు కలిగెను. ఆ అగస్తుడే మరియొక జన్మలో జఠరాగ్నిగా జన్మించెను. వానిని దహరాగ్ని అని కూడా అందురు. పులస్తుని కుమారుడే మహా తపశ్శాలియగు విశ్రవసువు. ఆ విశ్రవసువునకు ఇలా బిల అనడి భార్య యందు యక్షులకు రాజగు కుబేరుడు జన్మించెను. ఆ విశ్రవసువు రెండవ భార్యయగు కైకసి అను నామనెందు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అను ముగ్గురు కుమారులు జన్మించిరి. కర్ధముని ఐదవ కుమార్తె గతి. ఆమె పులహుని భార్య. ఆమె ముగ్గురు కుమారులను కనెను. కర్మ శ్రేష్టుడు, వరీయసుడు, సహిష్టుడు అని ఆ ముగ్గురి పేర్లు. కర్ధముని ఆరవ కుమార్తె క్రియ. ఆమె క్రతువు భార్య. ఆమెకు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్న వాలఖిల్యుడు మొదలగు ఆరు వేల ఆరు పది వేల మంది.
క్షమించాలి. 60 వేల మంది ఋషులు కుమారులుగా జన్మించిరి. కర్ధముని ఏడవ కుమార్తె ఊర్జ ఈమెను అరుంధతి అని కూడా వేరొక పేరుతో వ్యవహరింతురు. ఆమె వశిష్టుని భార్య. ఆమె యందు నిర్మలమగు నడువడి గల ఏడుగురు బ్రహ్మఋషులు జన్మించిరి. వారు చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు. వసుభృత్ తేజస్వి అగు యానుడు అని వారి పేర్లు. శక్తి మున్నగు వారు వశిష్టునకు వేరొక భార్య యందు జన్మించినారు. కర్ధముని ఎనిమిదవ కుమార్తె శాంత. ఆమెకు చిత్తి అను పేరు కూడా కలదు. ఆమె అధర్వుని భార్య. ధృతవ్రతుడు, దధ్యంచుడు, అశ్వశిరసుడు అను కుమారులు కలిగిరి. కర్దముని తొమ్మిదవ భార్య, తొమ్మిదవ కుమార్తె ఖ్యాతి. ఆమె భృగు భార్య, భృగు మహానుభావుడు. ఆమె ధాత, విధాత అనేటి ఇద్దరు కుమారులను భగవంతునిచే ఆశ్రయించిన లక్ష్మీదేవి అంశచే ఒక కన్యను. కనెను. మేరువు తన కుమార్తెలగు అయతి, నియతి అను వారలను ధాతకు, విధాతకు భార్యలుగా ఉసంగెను. వారిద్దరికీ మృకండువు, ప్రాణుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి. మృకండువునకు మార్కండేయుడు, ప్రాణునకు వేదశిరుడు అను కుమారులు కలిగిరి. ఆ వేదశిరుని కుమారుడు శుక్రుడు. అతనిని కవి అనియు ఉషనసుడు అనియు అందురు. ఇట్లు శుక్రుడు బృగవంశమున జన్మించినవాడు. ఈ విధముగా కర్ధమని కుమార్తెలు తొమ్మండు గురునిని వివాహమాడి. మునులందరూ లోకమున వంశములను వృద్ధినందించిరి. ఇంతవరకు కర్ధముని కుమార్తెల సంతతి వివరింపబడినది. స్వయంభువ మనువు మూడవ కుమార్తె ప్రసూతి బ్రహ్మపుత్రుడగు దక్షుడు ఆమెను వివాహమాడెను. ఆమె యందు అందమైన నిర్మలమైన నేత్రములు గల 16 మంది కన్యలను కనినాడు. అందులో 13 గురిని ధర్మునకు వసంగెను. ఒక ఆమెను అగ్నికి వసంగెను.
ఒక ఆమెను భవనమును ఛేదించు భవనకు వసంగెను అనగా రుద్రునకు వసంగెను. పితృ దేవతలందరుకును ఒక ఆమెను భార్యగా వసంగెను. బుద్ధ, మేధ, దీక్ష, హ్రీ, మూర్తి, శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి అనువారు ధర్ముని భార్యలు. ధర్మమును పాలించినచో లభించడి ఫలితములనే భార్యలుగా పేర్కొన్నట్లు వారి పేర్లలో సుచితమగుచున్నది. ధర్మమును పాలించినచో మనము చేయు కర్మల యందు శ్రద్ధ కలుగును. అందరి యెడ మైత్రి ఏర్పడును. బాధపడుచున్న వారిపై దయ కలుగును. కోరికలు తగ్గి మనసున శాంతి కలుగును. ఉన్నదానితో మనసున సంతుష్టి కలుగును. శరీరము, మనస్సు పుష్టి నందును. సర్వేంద్రియములతో సర్వ వ్యాపారములు చేయు శక్తి ఏర్పడును. గొప్పదనము ఏర్పడును. బుద్ధి కలుగును. ఆత్మజ్ఞానము కలుగును. ఓరిమి కలుగును. చేయకూడని పనులయందు సిగ్గు ఏర్పడును. ఇట్టి సూచన చేయుచు ధర్మునకు 13 భార్యలు ఏర్పరిచిరి. ఇచట వీరి పేర్లన్నియు అన్వర్ధములు అనగా అర్థములు కలవి. నిరర్థకములు కావు. అందు శ్రద్ధకు శుభుడు అను పేరు గల కుమారుడు కలిగెను. మైత్రికి ప్రసాదము అని పేరు గల కుమారుడు కలిగెను. దయకు అభయము అను పేరు గల కుమారుడు కలిగెను. దీనిచే మనకు శ్రద్ధ ఉన్నచో శుభము కలుగుననియు, దయ ఉన్నచో అభయము కలుగుననియు, మనసులో కోరికలు లేకుండా శాంతి ఉన్నచో సుఖములు కలుగునని సూచించుచున్నది. ఇట్లే తుష్టి అనునామే ఆనందమును, పుష్టి అనునామే గర్వమును, క్రియ అనునామే యోగమును, ఉన్నతి అనునామే దర్పమును, బుద్ధి అనునామే అర్థమును కనినారు. వీటన్నిటిలోనూ ఏ గుణములు ఉన్నవో ఎట్టి ఫలము ఫలిని లభించునో సూచించుచున్నారు. మేధ అనునామే స్మృతిని, తితీక్ష అనునామే క్షేమమును, హ్రీ అనునామే ప్రశ్రయమును అనగా వినయమును మూర్తి అనునామే సమస్త కళ్యాణ గుణములకు ఆవాస స్థానమగు భగవదవతారములగు నరనారాయణులను ఋషులను పుత్రులుగా
ఈ వంశ చరిత్ర మన జీవితమును నిర్దేశించినది. ఏ ఏ గుణములు మానవుడు అలవరచుకొనవలెనో సూచించుచున్నది. మానవుడై మానవులందరిలో సకల పదార్థములలో అంతర్యాముగా ఉన్న నారాయణుని దర్శించుట పరమ ప్రయోజనము. దక్షిణి పదముగ్గురు కుమార్తెలలో ధర్ముడు మొదలగు వారి వలన జన్మించిన ఆయా పేర్లు మనలో ఆవిర్భవించవలసిన గుణములను సూచించును. ధర్ముని చివరి భార్య మూర్తి. ఆమె యందు నరనారాయణులు అనేటి ఋషులు జన్మించిరి. వారు జన్మించినప్పుడే ఈ విశ్వమంతయు సుఖమును అనుభవించినది, ఆనందించినది, పరిపూర్ణమగు శాంతి నందినది, అందరి మనసులు ప్రసన్నములైనవి. దిక్కులు, నదులు, సముద్రములు ప్రసన్నమైనవి. దేవతలు అంతరిక్షమున వాద్యములను మ్రోగించిరి. పుష్పవృష్టి కురిసెను. మునులందరూ సంతసించిరి, స్తోత్రము చేసిరి. కిన్నరులు, గంధర్వులు గానము చేసిరి. దేవతలు, దేవతా స్త్రీలు. అవతరించిన నరనారాయణులని అనేడి ఋషులను చూచుటకు వచ్చి దగ్గరగా ఉండి స్తోత్రములతో స్తుతించిరి. పరివారు దేవతలు నరనారాయణులను ఏ రకంగా స్తుతించారో మనము తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the one without partiality, the complete desire. Salutations to the great glory, the leader. O Lord, you are the one who fulfills desires. You have no preferences. Everything is good for you. You are the Lord of great glories, Lord. All the glories are in you. May you have many salutations. Sixth Canto, 19th Chapter, Fourth Prayer, Bhagadbandhusara. Srimad Bhagavata Tatva Deepika, Fourth Skandha, Second Welcome to the podcast. Until now, we have the descendants of Swayambhu Manu, and then, as part of that, Athri Maharshi. We learned about the penance that is done. All the gods come and stand by him while he is in penance. He's questioning them. Why did you have it put here, and instead of that, let's first understand what is the answer of the gods that he gives. Thus, as Athri prayed, the gods laughed and replied to that sage with sweet words. Oh great sage, you have made a true resolution. You are the Lord of the universe, the cause of creation, preservation, and destruction You prayed. He is the inner soul in Brahma, in the old, and he stands as Vishnu himself, and through Brahma, he creates, through Shiva, he dissolves, and he himself protects. Therefore, we three are one in form. Among us who consider ourselves as three, the soul is none other than Narayana, therefore we three are one. But Narayana himself, through the being in the body called Brahma, creates. Being in the body of the being named Rudra, and through Rudra, performing dissolution, he himself, with the name Vishnu, is protecting from between Brahma and Rudra.
Therefore, only one person does three businesses. That one alone, while performing those tasks, appears in three forms. Therefore, you are a vision with three forms. You have a vision with three forms. As you have asked, with the elements of the three of us, you will be born as sons, famous in the world, with fame. May you be blessed. May we make your fame spread throughout the world. Brahma, Vishnu, and Maheshwara, who were worshipped by the elephant, flew back as they watched. Therefore, by the part of Brahma, Somudu, that is, the moon, was born. Dattatreya was born to Vishnu as his part. Durvasa was born as a part of Shankar. Kardhamuni's third daughter was Shraddha. She was the wife of Angiras. She had four daughters. Cinwali, Kuhu, Raka and Parvati are her daughters. She was also blessed with two sons, named Brihaspati. Kardamuni's fourth daughter, Havirbhu, to the king named Pulastudu, she had a son named Agastya. That Agastya, in another birth, as Agastya He was born. They also call him Daharaagni. Vishravasu, the son of Pulastya, was a great ascetic. To that Vishravasu, thus, in the wife of Bila, Anadi, Kubera, the king of Yakshas, was born. That Vishravasu's second wife, Kaikasi, gave birth to three sons named Ravana, Kumbhakarna, and Vibhishana. The Gati of Kardama's fifth daughter. She was the wife of Pulahu. She had three sons. Karma is the best, Variyasu is the best, and Sahishtu is the best, these are the names of those three. Kriya was the sixth daughter of Kardama Muni. She is the wife of Kratu. She has six thousand, sixteen thousand people shining with the radiance of Brahma's light.
Excuse me. 60,000 sages were born as sons. Kardhamunu's seventh daughter, Urja, is also known as Arundhati by another name. She was the wife of Vashishta. Seven Brahma Rishis were born in her, who had a pure and walking nature. They are Chitraketu, Surochi, Virajudu, Mitrudu, and Ulbanudu. Their names are Vasubhruttejasvi and Yanudu. Those who possessed power were born to Vasishta from another wife. Kardhamunu's eighth daughter was Shanta. She also has a name, Chitti. She was the wife of Adharva. Dhrutavrata, Dadhyancha, and Ashwashiraasu were the sons. Kardamuni's ninth wife and ninth daughter was Khyati. She was the wife of Bhrigu and the father of the great Bhrigu. She, Lakshmi Devi, who took refuge in God with two sons named Dhata and Vidhata, gave birth to a daughter. Mayuru entrusted his daughters, Ayati and Niyati, to Dhata and Vidhata as wives. They had two sons, Mrigankudu and Pranudu. Markandeya and Vedashirudu were the sons of Mrkundu Kaligiri. That Vedasiru's son is Shukra. He is called a poet and a sage. Thus, Shukra was born in the Bhrigu dynasty. In this way, the daughters of Kardham married the guru for nine months. All the sages increased the lineage in the world. The lineage of Kardhamuni's daughters has been described so far. Daksha, the son of Brahma, married the daughter of Swayambhuva Manu, the third son. She saw 16 virgins with beautiful, pure eyes. In it, 13 goals were settled to Dharmu. One of them set fire to a woman.
One, she, the building, was torn apart, meaning it was torn apart to Rudra. She was married to all of the gods of the dead. Buddha, wisdom, dedication, Hreem, idol, devotion, friendship, compassion, peace, satisfaction, nourishment, action, and those who are elevated are Dharmuni's wives. If one follows dharma, the results are mentioned as wives, as if they are being mentioned in their names. If we follow Dharma, we will have faith in the fruits of our actions. Friendship will be established. May thou have at thy side a spare hand to sympathize with the afflicted. Desire diminishes and the mind becomes peaceful. Contentment comes from within. The body and mind are nourished. The power to perform all actions with all senses is established. Greatness is achieved. It will make sense. Self-realization will come. It will be a little difficult. Shame on doing things that should not be done. Thus, giving this indication, they appointed 13 wives to Dharma. Here, all their names are synonyms, meaning they have meanings. They are not useless. Then, a son named Shubhudu was born. The one called Maitri's Prasadam The son has arrived. A son named Abhayamu was born. It indicates that if we have faith in this, we will have goodness; if we have mercy, we will have fearlessness; if there is peace without desires in our mind, we will have happiness. Similarly, they have seen that name of satisfaction is happiness, name of nourishment is pride, name of action is yoga, name of elevation is arrogance, name of intellect is meaning. They indicate what qualities are present in all of these and what kind of results will be obtained. Medha, the name of the mind, Titiksha, the name of the austerity, Hre, the name of the refuge, that is, humility, and Murthy, the name of the idol, are the abode of all auspicious qualities, the incarnations of Bhagavad, the Narayanas, the sages, as sons
This lineage has determined our destiny. It indicates the qualities that a human being should adopt. The ultimate purpose is to see Narayana, who is inherent in all beings and all substances. The names of the three daughters of Dakshi, including Dharmudu, indicate the qualities that should be manifested in us. Dharmu's last wife was Murthy. In her, sages named Naranarayana were born. When they were born, this entire universe experienced happiness, rejoiced, attained complete peace, and all minds became pleased. The directions, the rivers, the oceans are pleasant. The gods played musical instruments in the sky. The rain showered flowers. All the saints were filled with joy and praise. The Kinnaras and Gandharvas perform the music. Gods and goddesses. They came to see the sages who had manifested, the Narayana, and stood close to them and praised them with hymns. We will learn later in the podcast how the people, gods, and Narayana were praised. Jai srimannarayana Asmad gurubhyo namah