భూమండల స్వరూపం - జంబూద్వీప వర్ణన

Structure of Bhumandala — Description of Jambudvipa

bhagavatam

ఈ శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, పంచమ స్కంధంలో శుకమహర్షి వర్ణించిన భూమండల స్వరూపాన్ని విశదంగా చర్చిస్తున్నాం. జంబూద్వీపంలోని తొమ్మిది వర్షాలు, మహాపర్వతాలు మరియు పవిత్రనదుల గురించి అద్భుతమైన వివరణ ఈ ఎపిసోడ్‌లో అందించబడింది. వేద దృష్టిలో ఈ భూగోళ వర్ణన కేవలం భౌతిక భూగోళం మాత్రమే కాక, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతిబింబంగా అర్థమవుతుంది. ఈ వర్ణన సమస్త సృష్టి పరమాత్మ మహిమతో నిండి ఉందని మనకు స్పష్టంగా బోధిస్తుంది.

In this episode of our Srimad Bhagavatham podcast, we explore the magnificent cosmological vision presented in Canto 5, where Shukadeva Goswami describes the vast structure of Bhumandala, the great planetary system. The episode focuses on Jambudvipa, the central island-continent, with its nine varshas or divisions, towering mountain ranges, and the sacred rivers that flow through each region. We come to understand how this ancient Vedic geography reflects a profound spiritual geography, where each land is presided over by a deity and inhabited by souls at various stages of consciousness. This enlightening description reminds us that the universe is not merely a physical reality but a divine creation suffused with the glory of the Supreme Lord.

← Prev Next →
Structure of Bhumandala — Description of Jambudvipa bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః అజాయ జనయిత్రేస్య బ్రహ్మణేనంత శక్తయే పరావరాత్మన్ భూతాత్మన్ పరమాత్మన్ నమోస్తుతే ఓ పరమాత్మ కారణ కార్యముల సారము నీవే పంచభూతముల రూపముగా ప్రకటమైనది నీవే లేని నీవి జగత్తును సృష్టించినావు. అనంత శక్తి గల పరబ్రహ్మము నీవే నీకు నమస్కారము. టెన్త్ క్యాంటో 59th చాప్టర్ 28th ప్రేయర్. భోద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. పంచమ స్కంధం 21వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం ప్రియవర్తన చరితాన్ని పూర్తి చేసుకుని భూగోళ వర్ణనంలో భాగంగా తొమ్మిది వర్షాల యొక్క విషయాల్ని తెలుసుకుంటున్నాం. ఇలా వ్రతముతో మొదలయ్యి భద్రాశ్వ, హరి, కేతుమాల, రమ్యక, హిరణ్మయ, ఉత్తరకురు, కింపురుష వర్షాల వరకు పూర్తి చేసుకున్నాం. ఒక్కొక్క వర్షములో ఒక్కొక్కరిని ఆరాధిస్తారని. కింపురుష వర్షంలో శ్రీరాముని యొక్క ఆరాధ్యం గురించి, ఆరాధన గురించి తెలుసుకున్నాం. వారు జపించేటువంటి మంత్రం గురించి ఇవన్నీ కూడా ఒక్కొక్క వర్షం ఒక్కొక్క అవతారాన్ని విశేషంగా అందించినది. జాగ్రత్తగా. ముందు పాడ్కాస్ట్ లో విని ఆనందిస్తానని భావిస్తూ మనం భరత వర్షంల విషయానికి బయలుదేరుతున్నాం. భరత వర్షమునందు భగవానుడు నారాయణుడుగా నరునితో కూడి కల్పాంతం వరకు తపస్సు చేయుచుండును. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, శాంతి, అణిమాది సిద్ధులు, ప్రాణ జయము, బాహ్యేంద్రియ జయము కలవాడై భక్తులకు అనుగ్రహించుట కొరకు ఈ భరత వర్షమున తపస్సు చేయుచుండును. ఇట్లు అందరూ తపస్సు చేయవలెనని నిర్దేశించుచు వేంచేసి ఉండును. భగవానుడగు నారదుడు వర్ణాస్మ ధర్మములను అనువర్తించుచు భరత వర్షమును నివసించు ప్రజలతో కూడి ఆత్మ యాధాత్మ జ్ఞానము కర్మ యోగము అంగముగా గల భక్తిచే నారాయణుని సేవించుచుండును. నిరతిశయమగు భక్తి యోగముచే తాను అనుభవించిన భగవతనుభవమును ఐదు రాత్రులలో సావర్ణి అనడి మనువునకు ఉపదేశించినాడు. అదియే పాంచరాత్రమనడి ఆరాధనా విధానము.

భారత వర్షమున నారాయణుడు భక్తి భావముతో సేవించుచు ఈ క్రింది క్రింది మంతమును జపించుచుందురు. ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మ్యాయ నమో అకించన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంసాయ పరమ గురువే గురువే ఆత్మారామాధిపతయే నమో నమః జ్ఞాన, శక్తి, బలాది షడ్గుణములతో కూడినవాడగు నరనారాయణునకు నమస్కారము. ఈతడు నిరతిశయముగు సౌశీల్యము గలవాడు. అందరిచే ఆశ్రయింపబడుటకు వీలుగా సులభుడై బదరికాశ్రమంలో నెలకొని ఉన్నాడు. దేహ ధర్మములగు ఆకలి దప్పులు మున్నగునవి లేనివాడు ఏ కోరిక లేక మోక్షము కావలనడి కోరెటి ముముక్షువులకు విధి అయినవాడు సమస్త దోషములను హరించువాడు. ఏ దోషమును అంటని వాడు అగుటచే హంస అనబడును. అట్టి హంస ఆత్మలలో ఆత్మకు అంతకంటే మించిన వాడు లేడు. అని అనదగిన వాడెగుటచే పరమహంస అని నారాయణుని కీర్తింతురు. అతడు జీవులకు ఉపదేశము హితమును ఉపదేశించుటకు గురువు. అతడు ఆత్మారాముడు, నిత్యము అసంకుచితము, అపరిచ్ఛిన్నమగు ఆనందము గలవాడు. అట్టి నరనారాయణునకు నమస్కారము. నారదుడు అతని గుణగణములను ఇట్లు స్తోత్రము చేయుచుండును. నారాయణుడు చేతనా చేతనాత్మకమగు జగత్తును సృష్టించును గాని ఆ కర్మ చేతనికి బంధము కలగదు. నేను సృష్టించిన వాడనని అతడు అనుకొనడు. ఆయా జీవుల గుణ కర్మలే దేవ మనుష్యాది జీవులకు కారణము గాని తాను కర్తను కానని అతడు భావించుచుండును. అతడు సకల దేహములలోనున్న జీవులలో చేరి అంతరాత్మగా ఉన్నను దేహ సంబంధముచే కలిగిన సుఖ దుఃఖములచే అతడు ఆవరింపబడడు. ఈ దృశ్యమగు ప్రకృతి యొక్క రజస్సు మొదలు గుణములచే అతని జ్ఞానము సంకుచితము కాదు. అతడే అందుచే అతడు రాగద్వేషాదులు లేనివాడు. అతడు అద్వితీయుడు అనగా అతనితో

తనతో సమానులు కానీ అధికులు కానీ అగు రెండవ వారు లేనివాడు. చేతనా చేతనాత్మకమగు జగత్తునంతను సంఘము లేనివాడై వేరు వేరుగా అతడు దర్శించుచుండును. ఈ జగన్ నిర్మాణమంతయు లీలా రూపము గుటచే సుఖ దుఃఖాది ఫలానుభవము అతనికి ఉండదు. అతడు ఏ విధముగు దోషము అంటనివాడు. సమస్త కళ్యాణ గుణములకు నిలయమైనవాడు. జీవుని వలె జ్ఞానము సంకుచితము కాని వాడై అన్నిటినీ ఎల్లవేళలా పరిపూర్ణముగా వేరువేరుగా తాను సాక్షియై దర్శించునే ఉండును. పరమాత్మ సాక్షిగా చూచుచున్నను అతనికి సంఘం ఉండదు. చూచెడి వాటిని అన్నిటినీ ప్రత్యక్షముగా పరిపూర్ణముగా చూడగలుగును. అందుచే నారాయణుడు అసక్త సాక్షి, వివిక్త సాక్షి అనబడును. జీవుడు తాను చేయు కర్మల యొక్క ఫలమును సిద్ధించినను సిద్ధించకపోయినను సమత్వ బుద్ధి గలవాడే ఉండి ఈ శరీరము అంతమగు వరకు ధ్యానముతో నారాయణు యందే మనసు నిలిపి ఉంచవలెను. యోగీశ్వరుడైన నారాయణుడే శ్రీకృష్ణుడుగా అర్జునుడుగా ఉన్న నరునకు ఉపదేశించినాడు. దేహమును అపేక్షింపక పరమాత్ముని భక్తి కలిగి ఉండుటయే జీవునకు అనర్థకరమగు సంసారము తొలగించుటకు సాధనము. అట్టి భక్తి లేకుండా ఐహికములగు పశు, పుత్ర, అన్నాదుల యందు ఆముష్మికములగు స్వర్గాదుల యందును తగులాటము గలవాడై ఉండరాదు. వాటినే చింతించుచు వాటిని పొందుటయే పరమ ప్రయోజనమని భావించువాడు శాస్త్రము చదువుకొనెను ఈ నీచమగు శరీరము కొరకు ఇది నశించునేమో అని భయపడుచునే ఉండును. అట్టివాడు శాస్త్రములను చదువుట మొదలగునవి అన్నియు నిష్ఫలమే. కావున ఓ ప్రభు అధోక్షజా నీవు మాకు సహజముగా నీ యందు భక్తి నిలుచునట్లు చేయుము. నీ అనుగ్రహముచే మాకు భక్తియోగము కలిగిననాడు, నీ మాయచే కల్పింపబడిన ఈ శరీరము నేను అనడి భావము అనగా అహంకారము, ఈ శరీరముకు చెందినవే నావి అనడి భావము అనగా మమకారము తొలగిపోవును కదా?

నీ అనుగ్రహముచే మాకు భక్తి యోగము కలిగి అహంకారములు తొలగినట్లు నీవే అనుగ్రహింపుము. ఇట్లు నారదుడు నరనాయుడును స్తోత్రము చేయుచుండును. ఈ భరత వర్షమునందు పవిత్రములగు నదులు పర్వతములు ఎన్నో గలవు. పవిత్రములగు పర్వతములను ముందు పేర్కొనుచున్నాను చున్నారు. మలయము, మంగళప్రస్థము, మైనాకము, త్రికూటము, వృషభము, కూటకము. కొల్లకము, సహ్యము, దేవగిరి, ఋష్యముకము, శ్రీశైలము, వెంకటము, మహేంద్రము, వారిధరము, వింధ్యము, గోవర్ధనము, రైవతకము. కకుభము, నీలము, కాకముఖము, ఇంద్రకీలము, రామగిరి అను పర్వతములు ప్రధానములు. ఇవి కాక ఇంకను వందలు వేలు పర్వతములు ఈ భారత వర్షమున ఉన్నవి. వాని చర్యల నుండి ఎన్నో నదములు పశ్చిమాభిముఖముగా పారుచున్నవి. ఎన్నో నదులు తూర్పు ముఖముగా పారుచున్నవి. తూర్పుగా పారేడి వానిని నదులు అందురు. పశ్చిమముగా పారేడి వాటిని నదములు అందురు. ఈ నదములు. నదులు నదుల జలములు స్నానము చేతనే గాక నామ సంకీర్తనము చేయకూడ మనసు పవిత్రము చేయునని ప్రజలు వానిని కీర్తించుచుందురు. ఈ జలములలో స్నానము చేయుచుందురు. అట్టి నదులలో తామ్రపర్ణి, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, వయస్విని, శర్కరావర్త, తుంగభద్ర, వేణితో కూడిన కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, తపతి. రేవా సురస నర్మదా ఆ చర్మాన్వతి సింధు శోణము మహానది వేదస్మృతి ఋషికుల్య త్రిసమ కౌశికి మందాకిని యమునా సరస్వతి దృషద్వతి, గోమతి, సరయు, భోగవతి, సప్తవతి, సుషోమ, శతధ్రువు, చంద్రభాగ, మరుధ్రుద అసక్ని విశ్వ అనునవి మహానదులు. ఈ భారత వర్షములో బ్రాహ్మణాది జన్మలందిన వారు సత్వరజస్తమో గుణముల కలయికచే లభించిన శరీరముతో కర్మలను ఆచరించి సుకర్మచే దేవ మార్గమును రజ ప్రధానము కర్మచే మనుష్య లోకమును.

తామస కర్మచే నరక మార్గమును పొందుదురు. ఈ వర్షమునందు బ్రాహ్మణ క్షత్రియాది వర్ణానుగుణముగా కర్మానుష్ఠానము చేయుటకు నియమము ఏర్పడినది. వారి వారి కర్మలను ఆచరించి దానితో కూడిన భక్తిచే ఈ భారత వర్షమునందు మానవులు మోక్షమంద చాలుదురు. మానవులు భారత వర్షములో కర్మలను ఆచరించి అవిద్యా గ్రంథిని దహించుకొనవలెను. అప్పుడు భక్తి యోగము పుట్టకుండా ఇంతకాలం అడ్డగించిన ప్రాచీన కర్మ అంతమగును. అప్పుడు భగవానుని యందు మనస్సు లగ్నమగును. దానిచే ధ్యానము ఏర్పడును. ధ్యానముచే మోక్షము లభించును. కర్మ ఫలమునందు కోరిక లేకుండా కర్మలు చేసినప్పుడు మోక్షమునకు ప్రతిబంధకమగు పాపము తొలగును. అది తొలగిన నాడు భక్తి కలుగును. భక్తిచే మోక్షము కలుగును. భగవానుడు సర్వభూతములకు ఆత్మ అయినవాడు, శరీర సంబంధము లేనివాడు, శబ్దముచే ఇట్టి వాడని చెప్పుటకు శక్యము కానివాడు. దేవ మనుష్యాది శరీరము లేకపోవుటచే వ్యవహరింపదగిన నామరూపములు లేనివాడు. మరొకరిపై ఆధారపడి ఉండనివాడు. జీవులు పరమాత్మపై ఆధారపడి ఉండినట్లు భగవానుడు ఎవ్వరిపై ఆధారపడి ఉండడు. అట్టి పరమాత్మయగు వాసుదేవుని యందు వేరొక ప్రయోజనముల కొరకు కాక ప్రేమించుటయే ప్రయోజనముగా భక్తి యోగం ఏర్పడును. దానిచే అవిద్య వాసనలు పూర్తిగా క్షాళనమగును. దానిచే భగవానుని యందు నిరతిశయమగు ప్రీతి ఏర్పడి మోక్షము లభించును. ఇట్లు మోక్షము ప్రసాదించుటకును తగిన దేశము ఈ భారత వర్షము. భారత వర్షములో మనుష్యులు జన్మనెత్తుట ఎంతో పుణ్యము చేయగాని లభింపదు. భగవానుడు ఈ భారత వర్షమున జన్మించిన వారికి కర్మాచరణమునందు శ్రద్ధను, భక్తిని, మోక్షమును అనుగ్రహించును. భారత వర్షములోని జన్మ ముకుంద సేవకు ఉపయోగపడినదిగా కీర్తింపబడినది. చేయుటకు శక్యముగాని దుష్కర్మములకు ఎన్ని కృతములు చేసినను, ఎన్ని తపస్సులు చేసినను, పుణ్యములు చేసినను, స్వర్గమునే పొందినను. నారాయణ పాద పద్మ స్మరణము కలగని నాడు అవన్నియు వ్యర్థము. ఆ దేశములో ఉండుట కూడా వ్యర్థము. భారత వర్షము తప్ప ఇతర వర్షముల యందు ఇంద్రియ సుఖముల చే భగవంతుని యందలి స్మరణము నశించిపోవును.

పైలోకములో కల్పాంతం వరకు సుఖములను అనుభవించుచున్నను ప్రయోజనము లేదు. చివరి వరకు అచట నుండి మరల జన్మించుట తప్పదు. ఈ భారత భూభాగమందు ఒక క్షణకాలము జీవించి ఉన్నను ఆ క్షణములో మానవుడు తాను చేయు కర్మలను భగవంతునికి సమర్పించి భగవంతుని ధ్యానించి భైరహితముకు విష్ణు పదమును చేరగలడు. నయత్ర వైకుంఠ కథా సుధాపగా నసాధవో భాగవతాస్తదాశ్రయాః నయత్ర యజ్ఞేశ మఖా మహోత్సవాః సురేశ లోకోపి నవైస సేవ్యతాం ప్రాప్తాన్ రుజాంతింత్వితి హయేచ జంతవో జ్ఞాన క్రియా ద్రవ్య కలాప సంభృతాం నవైతేరరన్న పునర్భవాయతే భూయోవనౌకాయివ యాంతి బంధనం ఏ దేశములో భవత్కథారూపములగు అమృత నదులు ప్రవహించునో ఏ దేశములో భగవత్ కథామృత నదీ పానము చేయు సాధువులగు భాగవతులు నివసింపరు. ఏ దేశములో భగవదుత్సవములు నిత్యము సాగుచుండవో అట్టి దేశము ఇంద్రలోకమైనను బ్రహ్మలోకమైనను శవింపదగనిదే. అట్టి దేశమున ఉండరాదు. ఈ భారత వర్షములో ఏ జీవులు భోగదారాధనకు ఉపయోగించు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు కలిగి ఉండియు దానికి ఉపయోగింపదగిన ద్రవ్యములు అన్నియు కలిగి ఉండియు మనుష్య జన్మనంది ఉండియు భక్తితో భగవాన్ని సేవించి ముక్తికై ప్రయత్నింపరో వారు అడవిలో పక్షుల వలె ఎప్పుడో ఒకప్పుడు వేటగాని వలలో పడియో కాలము మూడియో చనిపోయి మరల బంధము నొందుదురు. భగవాను భరతవాసులగు నరులు యజ్ఞములో శ్రద్ధతో శాస్త్రములో చెప్పినట్లు మంత్రములతో ఆయా దేవతలకు కల్పింపవలసిన హవిస్సును అర్పించినచో ఆ దేవతా అంతర్యామియుగు భగవానుడు సమస్త మనోరథములను నెరవేర్పదగిన వాడై పూర్ణుడై ఉండియు కొరికి గలవాని వలె మనము అర్పించిన వానిని స్వీకరించును. ఆయా పురుషార్ధములను కోరెడి వారికి వారిచే ఆరాధింపబడిన భగవానుడు వారు కోరునట్లు వానిని వసంగును అనుట సత్యము. మానవుడు ధర్మార్థ కామములు ఎన్నో లభించినను ఏదో ఒక కోరికను మరల మరల కోరెడి నిత్య దరిద్రుడై ఉండును. వేరొక కోరికను కోరక తనను కోరిన ముముక్షువులకు భగవానుడు మరల కోరిక కలగకుండా మూత వేయునట్టి తన పాదమును వారి మనసున ఉంచును.

భగవంతునే కోరు వారికి కోరికలు కలగకుండా చేసి భగవానుడు తననే వసుంగును. వెనకటి జన్మలలో చేసిన సుకృతముల ఫలముగా స్వర్గముల సుఖమును అనుభవించి. మిగిలిన కొంత పుణ్యముతో భరత వర్షములో జన్మింతురు. ఆ పుణ్యముచే భగవద్విషేకముకు స్మరణము లభించును. ఆ స్మరణం వలన శ్రీహరి వారికి మోక్షరూపము సుఖమును ప్రసాదించును. ఇంతటితో భరత వర్షము. సంపన్నమైంది. ఈ విషయాన్ని మరొకసారి మరొకసారి నెమరు వేసుకుంటూ భరత వర్షంలో ఉన్నటువంటి భాగాన్ని అందరూ కూడా అనుభవించాలని ప్రార్థిస్తూ మరొక పారకాస్ట్లో దీపముల గురించి మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Oh, mother of the unborn, with infinite power, the supreme soul, the individual soul, the ultimate soul. Salutations to you. Oh, supreme soul, the essence of cause and effect, you are manifested in the form of the five elements. Without you, this world You created it. You are the infinite power, the Supreme Brahman. Salutations to you. Tenth Canto 59th Chapter 28th Prayer. Bhod Bandhala, Srimad Bhagavata Tatva Deepika. Welcome to the 21st podcast episode of Pancham Skandham. Until now, we have completed the history of Priyavrata and are learning about the nine rains as part of the geographical description. Thus, starting with the vow, we have completed up to Bhadraswa, Hari, Ketumala, Ramyaka, Hiranmaya, Uttarakuru, and Kimpurusha varshas. That they worship different people in different religions. In the Kimpurusha rain, we learned about the worship of Sri Rama, about the worship. About the mantra they chant, all of these, each rain, each incarnation, has given a special presentation. Carefully. I will listen to the podcast first and enjoy it We are about to embark on a journey that touches the very fabric of our nation, Bharat, and our collective consciousness. In the Bharata Varsham, the Lord, as Narayana, along with man, performs penance until the end of the Kalpa. Dharma, knowledge, detachment, wealth, peace, and the attainment of the six perfections, conquering of life force, conquering of external senses, being such, to bestow upon the devotees, in this Bharata Varsha, he performs penance. Thus, it is ordained that everyone should perform penance. Narada, the divine one, observing the duties of Varna and Ashrama, along with the people residing in Bharata Vasu, serves Narayana through devotion, which includes self-realization, knowledge of karma, and yoga. Through constant devotion, he imparted the divine experience he had to Savarni Anadi Manu in five nights. It is the Pancha Ratra worship method.

In the rain of India, Narayana, with devotion, serves and chants the following mantra. Om Namo Bhagavate Upashamasheelaya Uparatanatmyaya Namo Akinchina Vittaya Rishi Rishabhaya Naranarayanaya Paramahamsaya Parama Gurave Gurave Atmaramadhipataye Namo Namaha. Salutations to Naranarayana, who is united with the six qualities of knowledge, power, strength, etc. Salutations. He is a man of unflagging courage and good character. He is easily accessible to everyone and resides in Badrikashila. He who has no hunger, thirst, and other bodily desires, and who is free from all desires, and who is destined to attain liberation without any desire, is the destroyer of all faults. He who does not accuse himself is called a swan. There is no one greater than the soul of the swan. Because he is the one who can be called so, they praise Narayana as the Paramahamsa. He is a guru to teach and benefit living beings. He is the soul, eternally unblemished, inimitable, and full of bliss. Salutations to Lord Narayana. Narada praises his virtues thus. Narayanudu chetana The imaginative world is created, but that action does not bind the doer. He would never have guessed it was me, the creator. The qualities and actions of those beings are the cause of the beings like gods and humans, but he thinks that he is not the cause. He, being united with the beings in all bodies and being the inner self, is not covered by the pleasures and sorrows caused by bodily relations. His knowledge is not narrowed by the qualities of the beginning of the beauty of this visible nature. He is the one, therefore he is without raga and dvesha. He is unique, meaning with him

He is the one who has no second, either peers or superiors. The mind, the cognitive world, without association, he sees separately. This Jagan's entire construction is in the form of a play, so he will not experience the fruits of happiness and sorrow. He is one who does not commit any kind of sin. The abode of all aesthetic virtues. Like a living being, being without narrow knowledge, he always witnesses everything perfectly, separately, and distinctly. Even though the Supreme Being is watching, he does not have a community. He who sees them all, directly and completely, can see them. Therefore, Narayana is called the detached witness, the detached witness. Even if a living being has attained the fruits of his actions, or has not attained them, one should remain with equanimity and keep the mind fixed on Narayana until this body is destroyed. Narayana, the lord of yogis, taught Arjuna, who was a human being, as Sri Krishna. Without expecting the body, having devotion to the Supreme Being is the means to remove the miserable world that is harmful to the soul. Atti Without devotion, one should not be quarreling in worldly things like animals, sons, and food, and in otherworldly things like heaven. He who considers it the ultimate benefit to contemplate them and attain them, reads the scriptures, but is always afraid that it may perish for this vile body. Such a person, starting with studying scriptures, everything is fruitless. Therefore, O Lord, Oh Lord, make us naturally have devotion in you. When we have devotion through your grace, this body created by your illusion, I am the feeling of 'I', that is ego, belonging to this body, my feelings, that is attachment, will be removed, right?

By your grace, grant us the yoga of devotion, so that our ego is removed, as you please. Thus, Narada and Narayana are praised. In this Bharatavarsha, there are many sacred rivers and mountains. They say that they are mentioning the sacred mountains first. Malayam, Mangalaprastham, Mainakam, Trikutam, Vrishabham, Kootakam. Kollakamu, Sahyaamu, Devagiri, Rushyamukamu, Srisailamu, Venkatamu, Mahendramu, Varidharamu, Vindhyamu, Govardhanamu, Raivatakamu. Kakubhamu, Neelamu, Kakamukhamu, Indrakilamu, Ramagiri are the main mountains. Besides these, there are hundreds and thousands of mountains in this Indian rain. Many rivers flow westward from their courses. Many rivers flow east. The rivers flow eastwards. They call the rivers that flow west. These rivers. Rivers, the waters of rivers, not only by bathing but also by chanting the name, purify the mind, and people praise him. They bathe in these waters. In such rivers, Tamraparni, Krutamala, Vaihayasi, Kaveri, Veni, Vayasvini, Sharkaravarta, Tungabhadra, Krishnaveni, Bhimarathi, Godavari, Nividhya, Tapati. Reva, Surasa, Narmada, that Charmanvati, Sindhu, Shona, Mahanadi, Vedasamruti, Rishikulya, Trisama, Kaushiki, Mandakini, Yamuna, Saraswati, Drishadvati, Gomati, Sarayu, Bhogavati, Saptavati, Sushoma, Shatadhruva, Chandrabhaga, The Marudhruda Asakni and Viswa are great rivers. In this Indian rain, those who are born as Brahmins, with the body obtained by the combination of Sattva, Rajas, and Tamas qualities, perform their duties, and through good deeds, they attain the path of gods, which is Raja-pradhana, and through karma, they attain the human world.

They attain the path of hell by their tamasic karma. In this rain, a rule has been established for performing rituals according to the Varna (caste) of Brahmins, Kshatriyas, etc. By performing their respective duties and with devotion associated with them, humans will be sufficiently liberated in this Bharatavarsha. Humans should perform rituals in the rain of India and burn the ignorance. Then, the ancient karma that has been hindering the birth of Bhakti Yoga for so long will end. Then the mind is attached to the Lord. Meditation is achieved through it. Salvation is attained by meditation. When actions are performed without desire for the fruits of karma, the sin that hinders liberation will be removed. Devotion happens when that is removed. Salvation is obtained through devotion. The Lord is the soul of all beings, without body, and beyond description as being in the form of sound. He is one who is devoid of name and form, capable of being dealt with, since he has no body like gods and humans. One who does not rely on others. Living beings depend on the Supreme Being, but the Lord does not depend on anyone. Such is the Supreme Being, Vasudeva Love for the sake of other benefits is not the purpose, but devotion yoga is formed. By that, the smell of ignorance will be completely cleansed. By that, immense love is established in the Lord, and liberation is attained. Thus, this Indian land is suitable for bestowing salvation. In the rain of India, it is not possible to get birth as a human being without doing a lot of good deeds. The Lord bestows upon those born in this Bharata Varsha, in the performance of their duties, devotion, and liberation. Born in the rain of India, it is praised as useful for the service of Mukunda. Even if many deeds are done for bad deeds that are impossible to do, even if many penances are done, even if merits are done, even if one attains heaven. When the remembrance of the lotus feet of Narayana does not occur, all those things are in vain. It is also useless to stay in that country. Except for the rain of India, in other rains, the remembrance of God is destroyed by sensual pleasures.

In the afterlife, even if one enjoys pleasures until the end of the kalpa, there is no benefit. Until the very end, it is inevitable to be reborn from there. Even if one lives for a moment in this Indian territory, in that moment, a human being, by offering the deeds he does to God, by meditating on God, can reach the feet of Vishnu for freedom. Where the stories of Vaikuntha are sung, where the gods are not satisfied, where the Bhagavatas are not dependent, where there is no sacrifice, where there is no great festival, where there are no gods, where there is no service, where there is no attainment, where there is no joy, where there is no destruction, where there is no destruction In which country do the naked and bound souls flow, in which country do the nectar rivers, which are the stories of the Lord, flow, in which country do the saints and devotees who drink the nectar river of the Lord's story not reside? In which country are the divine celebrations not continuously going on? Such a country is neither Indra's world nor Brahma's world, it is not worthy of being killed. Such a country should not exist. In this rain of India, having all the organs of action and senses used for the enjoyment of pleasures, having all the substances that are useful to it, having human birth, with devotion Those who do not serve God and try for salvation, like birds in the forest, will one day or another be caught in a hunter's net, and will die and be bound again. The gods residing in Bharata, if the humans who are the servants of the Lord, offer the oblation that should be offered to those deities with devotion and as prescribed in the scriptures, that Lord, who is the inner controller of those deities, being able to fulfill all desires, being complete Like a moth, we accept what we have offered. It is true that the God who is worshiped by those who desire those Purusharthas will grant them as they wish. Even though a human being obtains many dharma, artha, and kama, he remains eternally poor, yearning for one desire again and again. Without asking for another wish, the Lord keeps his feet in their minds so that the seekers who asked for him do not have a wish again.

Those who desire God, the Lord makes their desires cease, and the Lord Himself is the Vasungu. Having enjoyed the pleasures of heaven as the result of the good deeds done in past lives. With some of the remaining merit, they are born in Bharatavarsha. By that merit, remembrance of the Lord's sacred bath is attained. By that remembrance, Srihari will grant them salvation and happiness. With this, Bharata Varsham. It is prosperous. Thinking about this matter once again, once again, praying that everyone should experience the part that is in Bharata Varsham, let us learn about the lamps in another para. Jai Srimannarayana, salutations to the Gurus