శమీక ముని మెడలో మృతసర్పమును వేయుట - కలి ప్రవేశము
Placing a Dead Snake Around the Sage Shamika's Neck
శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, వేటకు వెళ్ళిన పరీక్షిత్ మహారాజు అలసటతో మరియు దాహంతో పీడింపబడి, మౌనముద్రలో ఉన్న శమీక మహాముని మెడలో ఒక మృతసర్పమును వేస్తాడు. ముని పుత్రుడైన శృంగి మహర్షి ఈ అవమానమును తెలుసుకుని, పరీక్షిత్ మహారాజు ఏడు రోజులలో తక్షక సర్పదంశనముచే మరణించగలడని శాపమిస్తాడు. ఈ ఘట్టంలో కలిపురుషుడు భూలోకంలో ప్రవేశించి, మహారాజు మనస్సును కూడా దుష్ప్రభావానికి గురిచేస్తాడని భాగవతం వివరిస్తుంది. పరీక్షిత్ మహారాజు మరణవార్త శుక మహర్షి నోటి ద్వారా భాగవత మహాపురాణ శ్రవణానికి దివ్యమైన నిమిత్తమవుతుంది.
In this sacred episode from the First Canto of Srimad Bhagavatham, we explore the fateful moment when the young King Parikshit, while hunting and overcome with thirst and weariness, places a dead snake around the neck of the silent sage Shamika. The sage's son, Shringi, upon learning of this disrespect shown to his father, pronounces a curse that Parikshit shall die from a serpent's bite within seven days. This pivotal episode also marks the entry of Kali, the lord of the current age, who begins to exert his corrupting influence over the world and even over the mind of the great king. Together, these events set the stage for the entire narration of Srimad Bhagavatham, as Parikshit's impending death becomes the divine occasion for Shuka Maharshi to impart the highest wisdom.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః యోవా అహంచ గిరిశశ్చ విభుస్వయంచ స్థిత్యుద్భవ ప్రళయ హేతవ ఆత్మ మూలం భిత్వా త్రిపాద్వివృధ ఏక ఉరుప్రరోహ తస్మై నమో భగవతే భువనద్రుమాయ అద్వితీయుడగు ఆ పరమేశ్వరుడు తనను అధిష్టించియున్న తన మాయాశక్తిని రజస్తత్వ తమో గుణములు అనే భేదముచే విడగొట్టి క్రమముగా ఆ గుణములను ఉపాధులుగా చేసుకొని బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనే మూడు మూర్తులను దాల్చి క్రమముగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయుచున్నాడు. ఆ మాయాశక్తియే ఇంకను పరిణమించి మరీచి, మనువు మొదలగు ప్రజాపతులకు ఉపాధి అగుచున్నది. ఈ విధముగా త్రిమూర్తులే మ్రాణులు కాగా ప్రజాపతులు మొదలగు వారు శాఖోపశాఖలు కాగా ఆ పరమేశ్వరుడు జగత్తనే వృక్షము రూపములో ప్రకటమైనాడు. ఆ భగవానునకు నమస్కారం. థర్డ్ క్యాంటో నైన్త్ చాప్టర్ సిక్స్టీన్త్ ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 25వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితం పాడ్కాస్ట్ లో మనం పాండవుల యొక్క మహా ప్రస్థానాన్ని విన్నాం. ముందు భాగం తెలుసుకుందాం. పితామహుడు ఈ లోకములో వీడి వెళ్ళిన తరువాత మహా భాగవతుడగు పరీక్షిత్తు పుట్టగానే జాతకం ఎరింగిన పెద్దలు చెప్పినట్టు ఉత్తమ గుణవంతుడై మహా భాగవతుడై భూమిని పరిపాలించెను. అతడు మేనమామయగు ఉత్తరుని కుమార్తెయగు ఇరావతి అనునామెను వివాహమాడెను. వానికి జనమేజయుడు మొదలగు నలుగురు కుమారులు కలిగిరి. కృపాచార్యుని గురువుగా చేసుకుని గంగా తీరమందు మూడు అశ్వమేధ యాగములను ఆచరించెను. దేవతలు ఆ యజ్ఞ భాగములను గ్రహించుటకు వచ్చి ఆనాడు అందరకు కంటికి కనబడునట్లుగా నిలచిరట. ఒకసారి దిగ్విజయమునకై దేశమున బయలుదేరి శూద్రుడు ఒక వృషభమును గోవును పాదముతో తనుచుండగా చూచి రాజచిహ్నములను దాల్చి క్షత్రియులు కాని వారు రాజుల వలె పరిపాలించుట చూచి
కలియుగము లోకమున ప్రవేశించినదని గుర్తించెను. కలియుగము రాగానే గోవులను వృషభములను పాదముతో తన్నవలెనని యోగ్యత లేని వారు రాజ్యమును పాలింపవలెనని కోరికలు కలిగినవి. అట్లు బుద్ధులు కలుగుటకు కారణం ఏమని శౌనకుడు కృష్ణ కథకు సంబంధించిన విషయములను నాకు చెప్పవలెనని కోరెను. మానవ శరీరమును పొంది అల్పమైన ఆయుర్దాయము కలిగి కలియుగమున జీవించడి మర్త్యులకు ఆయుష్షును క్షణింప చేసుకొనడి వ్యర్థ ప్రసంగములతో ప్రయోజనమేమి? కృష్ణ కథలే వినదగినవి సౌనకాదు ఋషులు కోరిరి. వీరందరూ నైమిస్య క్షేత్రములో సత్రయాగమును పాల్గొనుచుండిరి. పాపమును తొలగించు భగవద్గుణములను అనుభవించెడి బ్రహ్మ సత్రమునందు వారు పాల్గొనుచుండిరి. వారు అచటికి మృత్యువును ఆహ్వానించిరి. మృత్యువు ఒకరిని చంపుటకే నియమింపబడినది అయినను భగవత్ గుణ శ్రవణము చేయుచు సంహరింపవలెనని మరిచిపోయినది. భగవత్ గుణములను వినునంతవరకు చెప్పుచున్నంతవరకు మృత్యువు వారి సన్నిధికి చేరదు. అట్లు గుణ శ్రవణమును చేయక బుద్ధిహీనులగు నీచమతులు. మందాయుష్కులై వయస్సును వ్యర్థముగా నిద్రతో నిరర్ధముగా వ్యాపారములతో గడుపుచుందురు. కావున మాకు మీరు కృష్ణ కథలనే ఎరంగింపవలెనని ప్రార్థింపగా సూతుడు శౌనకాదిలోకి ఇటు చెప్తున్నాడు. పరీక్షిత్తు చతురంగ సైన్యముతో దిగ్గిజయమునకై బయలుదేరెను. అతను నల్లని గుర్రమును పూంచిన సింహధ్వజముచే అలంకరింపబడిన రథమును అధిష్టించి బయలుదేరెను. భద్రాశ్వము, కేతుమాలము, భారతము, ఉత్తరకురు, కింపురుషాది నగరములను జయించి అచటి రాజుల నుండి కప్పమును స్వీకరించెను. శ్రీకృష్ణ మహాత్మ్యమును సూచించు తమ పూర్వుల చరిత్రను అచటి వారు పాడుచుండగా అతడు వినుచుండెడివాడు. అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము నుండి శ్రీకృష్ణ భగవానుడు తమను కాపాడిన వార్తను యాదవులకు పాండవులకు మైత్రి బంధమును శ్రీకృష్ణుని యందు అపారమైన భక్తిని వారు పాడి పాటలో విని ఆనందించెను. వానిని విని పరమానందము నంది ప్రీతితో వికసించిన నేత్రములు కలవాడై వారికి మహా ధనములను, వస్త్రములను, హారములను వసంగెను.
ఆ మహాపురుషుడగు శ్రీకృష్ణుడు తన తాతలకు సారధ్యము చేసినాడు. కొలవులో తాను ఒక సభ్యుడిగా ఉండడివాడు. వారికి భృత్యుని వలె సేవ చేసెను, దౌత్యమును చేసెను. వారు సింహాసము ఎక్కినప్పుడు వారిని అనువర్తించి ఉండెను. వారిని స్తోత్రము చేసెను, నమస్కరించెను. ఏమి కృష్ణుని ప్రేమ అని గానము చేయుచున్న గాయకుల వలన విని శ్రీకృష్ణ చరణారవిందములయందు పరీక్షత్తు ప్రీతి గలవాడై తమ పూర్వుల మార్గముని అనుసరించి ప్రవర్తించుండెను. అతడు చూచుండగా మహాశ్చర్యకరమగు సంఘటన కనపడెను. ధర్మ దేవత ఒక వృషభ రూపమును ధరించి యుండెను. భూమి గోరూపముతో ఒక పాదముతో సంచరించి యుండెను. తేజో విహీనమై దూడలేని గోవు వలె కళ్ళనీరు కార్చుచు నిలిచిన భూమిని చూచి ధర్మ దేవత ఇట్లు ప్రశ్నించుచున్నది. ఓ మంగళకరులారా. నీవు సుఖముగా ఉన్నావా? కాంతి విహీనురాలై ఉన్నావు, ఏదో విచారంతో వాడిపోయినట్లు ఉన్నావు, మనసులో ఏదో బాధించుచున్నట్లు ఉంది, బంధువులెవరో దూరమునందు ఉన్నట్లు కనపడుచున్నావు, నీ నాలుగు పాదములు ఉండినట్లు కనపడుట్లేదు. అయోగ్యులు నిన్ను పరిపాలించుచున్నారని శోకించుచున్నావా? దేవతలకు యజ్ఞము చేసినను భాగములు అందుటలేదని శోకించుచున్నావా? ఇంద్రుడు వర్షించుటలేదా? స్త్రీలకు రక్షణ లేదని శోకించుచున్నావా? రాక్షసులచే పసివారు హింసింపబడి శోకించుట చూచి ఓర్వలేక బాధపడుచున్నావా? బ్రాహ్మణులు వేదమును అధ్యయనము చేయక బ్రహ్మ తేజస్సు లేని వారగుచున్నాని శోకించుచున్నావా? రాజవంశము బ్రాహ్మణ శ్రద్ధలైన వారనైన వారలైనాడని శోకించుచున్నావా? క్షత్రియులు తమ స్వభావములు మారి నీచులై తాము పాలించు రాష్ట్రములను పాడు చేయుచున్నారని బాధపడుచున్నావా? దేశములో జనులు ఆకలితో, దాహముతో బాధపడుచు కేవలం తినుట, పిల్లలను కనుటయే ప్రధానముగా జీవించుచున్నారని బాధపడుచున్నావా లేదా శ్రీకృష్ణ భగవానుడు అవతారము చాలించి ఈ భూమియందు కనబడకుండా అంతర్ధానమైనాడని అతని చరిత్రను స్మరించు బాధపడుచున్నావా? నీ మానసికమైన పీడకు కారణం ఏమో చెప్పుము. దేవతలు కూడా గౌరవింపదగిన సౌంధ్యము గల దానివి నీవు. ప్రబలము కాలముచే అది తొలగినట్లు కనబడుచున్నావు. ఇట్లు వృషరూపం దాల్చిన ధర్మదేవత ప్రశ్నింపగా గోరూపం దాల్చి ఉన్న భూమి ఇట్లు చెబుచున్నది.
ఓ ధర్మ దేవతా, నీవు నన్ను అడుగుచున్న విషయం అంతయు నీకు తెలిసినదే. లోకమునకు శుభమును కలిగించెడు నాలుగు పాదములతో నీవు ఈ లోకమున సంచరించుందువు. లోకములో గొప్పతనము కోరెడివారందరు కోరతగిన గుణములన్నియు కలవాడు భగవానుడు. సత్యము, శౌచము, దయ, క్షమ, త్యాగము, సంతోషము, ఆర్జవము, శాంతి, తపస్సు, సమత్వము, ఓరిమి, వైరాగ్యము. పాండిత్యము, జ్ఞానము, ఐశ్వర్యము, శౌర్యము, తేజస్సు, బలము, స్మృతి, స్వాతంత్ర్యము, కాంతి, ధైర్యము, మార్ధవము, ప్రాగల్భ్యము, వినయము, శీలము. ప్రాణశక్తి, శరీరశక్తి, జ్ఞానాది గుణ సంపత్తి, గాంభీర్యము, స్థైర్యము, ఆస్తికత్వము, కీర్తి, మానము, అహంకారము లేకపోవుట అనేటి గుణములు భగవానుని వలె తమకు కూడా ఉండవలెనని గొప్ప ధనము కావలెనని కొన వారు కోరుకొనుచుందురు. సమస్త కళ్యాణ గుణాకరుడు శ్రీనివాసుడు నేడు నన్ను వదిలి ఏగినాడు. పాపపు కలి ఆక్రమించినది. ఇట్లు ఉండుటచే నా పరిస్థితిని తలంచుకొని దేవతలకు యాగాదులు జరగవని వారిని తలంచుకొని ధర్మం ఇంకా నాలుగు పాదములతో నడవదని నిన్ను గురించి. దేవతలకు, పితృ దేవతలకు, ఋషులకు, సత్పురుషులకు, సర్వాశ్రమముల వారికి ఇంకా సుఖముండదని భావించి శోకించుచున్నాను. ఆ శ్రీకృష్ణ భగవానుడు నన్ను వదిలి ఏగినాడు. బ్రహ్మాది దేవతలు కూడా ఆ లక్ష్మీదేవి కటాక్ష ప్రసారమును కాంక్షించి భగవానుడే శరణమని విశ్వసించి ఎంతో కాలము తపస్సు చేసినారు. అట్టి లక్ష్మీదేవి తమ నివాస స్థానమగు తామర వనమును వదలి భగవాను సౌందర్యమునకు వశపడి వానినే సేవించున్నది. అట్టి భగవానుడు ఈ భూమిపై తన పాద చిహ్నముతో నడిచి పవిత్రము చేసినాడు. ఆ స్వామి ధ్వజ, వజ్ర, అంకుశ, చక్ర, శంఖ లాంచితములగు శ్రీపాద చిహ్నములు నన్ను అలంకరించుటచే అన్ని లోకముల కంటే నేను గొప్పదానిని అని అందరూ గౌరవించుచుండిరి. అట్టి స్వామి నన్ను వదిలి వెళ్ళినాడు. నాకు బరువుగానున్న అసుర సంపదతో నిండిన రాజ సైన్యములను అంతమొందించినాడు. రెండు పాదములతోనున్న ధర్మ
నరుపు పొడవుగా నన్ను నిన్ను నాలుగు పాదములతో నడుచుచున్నట్లుగా చేయవలెనని సంకల్పించి యాదవులలో తాను ఒకడే అవతరించినాడు. ఆ భగవానుని ప్రేమతో కూడిన చూపులకు సుందరమగు మందహాసమగు మధురమగు సంభాషణమునకు యాదవ స్త్రీలు మోహపడి వానినే తప్పితరమైన వానిని విస్మరించిరి. ఆ శ్రీకృష్ణుని పాదములచే స్పృశింపబడి నా శరీరము రోమాంచము కలదైనది. అట్టి పురుషోత్తముని విరహమును ఏ స్త్రీ సహింపగలదు? ఈ విధంగా భూదేవి ధర్మదేవతో విషయం చెప్పింది. దాని తర్వాత భాగాన్ని మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Yova, I am the mountain, the lord of the mountains, the self-existent, the cause of creation and destruction, the origin of the self. Having penetrated the three steps, he enters the one-sidedness. Salutations to that Lord, the Lord of the worlds, the unique one, that Parameshwara, himself Having established his illusory power, dividing it into the qualities of Rajas, Tamas, and Rajas, and gradually making those qualities his objects of enjoyment, Brahma, Vishnu, Rudra, these three forms, assuming them, are gradually performing the creation, preservation, and destruction of the universe. That magical power still manifests and becomes the livelihood of the people like Manu and others. In this way, while the Trinity is the roots, the Prajapatis and others are the branches, that Parameshwara manifested the world in the form of a tree. Salutations to the Divine. Third Canto Ninth Chapter Sixteenth Prayer. Devotees of God, welcome to the 25th podcast of Srimad Bhagavata Tatva Deepika, the first volume. In the previous podcast, we heard about the great journey of the Pandavas. Let's start with the basics. The father in this world After going, the great devotee Parikshit, as the elders who knew his horoscope at birth said, became excellent in character and ruled the earth as a great devotee. He married Iravati, the daughter of Uttara, his maternal uncle. He had four sons, including Janamejaya. Having made Kripacharya his guru, he performed three Ashwamedha yagas on the banks of the Ganges. The gods came to receive the portions of the Yagnya, and on that day, they stood in a way that was visible to everyone. Once, for the sake of victory, the country set out, and seeing a Shudra treading a bull and a cow with his foot, and seeing that those who wear royal symbols and those who are not Kshatriyas rule like kings
He recognized that the Kali Yuga had entered the world. As soon as the Kali Yuga arrives, those who do not deserve to rule the kingdom should rule it, desires arose to kick cows and bulls with their feet. So, Shaunaka asked what was the reason for the Buddhas to be born, and that he should be told about the matters related to Krishna's story. Having obtained the human body and having a short lifespan, what is the use of making the lifespan of mortals increase in Kali Yuga by making vain speeches? The stories of Krishna are worth listening to, said the sages Saunaka and others. All of them were participating in the Satra Yagam in the Naimisya Kshetram. They were participating in the Brahma Satram, which removes sins and experiences divine qualities. They invited death to come to them. Even though death is appointed to kill someone, it forgets to kill while listening to the virtues of God. Death does not reach their presence until one listens to and narrates the virtues of the Lord. Thus, without listening to the qualities, you are foolish and lowly. Being young, wasting time, sleeping in vain, and doing business in vain They are spending time. Therefore, when we prayed that you should narrate Krishna's stories, Suta is telling Shaunaka and others this. Parikshit set out with a fourfold army to achieve victory. He set out riding on a chariot decorated with a lion flag, which was adorned with a black horse. Having conquered Bhadrasvamu, Ketumalam, Bharatam, Uttarakuru, and Kimpurusha and other cities, he received tribute from the kings there. While those there were singing the history of their ancestors, indicating the greatness of Sri Krishna, he was listening. From the Brahmastra used by Ashwatthama, the news that Sri Krishna Bhagavan saved them, the news of the Yadavas and Pandavas, the bond of friendship, and the immense devotion to Sri Krishna, they sang and listened to in a song and rejoiced. Having heard him, with great joy and delight, having eyes that blossomed with love, he gave them great riches, clothes, and garlands.
That great man, Sri Krishna, guided his grandfathers. He was a member of the Kolavu. He served them like a servant, he did diplomacy. He had followed them when they went up the throne. He praised and greeted them. Hearing the love of Krishna from the singers who were singing, he, being pleased with the lotus feet of Sri Krishna, followed the path of his ancestors and acted accordingly. As he watched, a very surprising event appeared. The god of dharma had taken the form of a bull. The earth was moving with one foot in the form of a body. Seeing the earth, which has lost its radiance and is standing with tears in its eyes like a cow without a calf, the goddess of righteousness is questioning thus. Oh, Mangala. Are you happy? You are without light, you seem to be withered with some sorrow, it seems like you are suffering something in your mind, it seems like some relatives are appearing to be far away, your four feet do not seem to be there. Are you grieving that the unworthy are ruling you? Are you grieving that even after performing sacrifices to the gods, you are not receiving any share? Is Indra raining? Are you grieving that women are not protected? Are you suffering, unable to bear to see the young ones being tortured and mourned by the demons? Brahmins, without studying the Vedas, are becoming without the radiance of Brahma. Are you grieving? Are you grieving that the royal family is one of the Brahmin Shraddhas? Are you worried that the Kshatriyas, having changed their nature and become vile, are destroying the kingdoms they rule? In the country, people are suffering from hunger and thirst, only eating, Are you grieving that children are living mainly by seeing, or are you grieving remembering and grieving that Srikrishna Bhagavan, having ended his incarnation, disappeared from this earth without being seen? Tell me what is the reason for your mental distress. You are the one with the divine grace to be respected by the Gods. You seem to have been overcome by the prevailing time. Thus, when the Dharma Devata, who assumed the form of a bull, was questioned, the earth, which had assumed the form of a cow, thus spoke.
Oh God of justice, you know everything I ask of you. You, with four feet that bring goodness to the world, roam in this world. In the world, the one who desires greatness, the one who possesses all the qualities desirable, is God. Truth, purity, compassion, forgiveness, sacrifice, happiness, wealth, peace, penance, equanimity, humility, detachment. Scholarship, knowledge, wealth, courage, radiance, strength, memory, freedom, light, courage, arrogance, audacity, humility, character. Life force, body strength, the quality of knowledge, etc., seriousness, courage, stability, possessiveness, fame, honor, Those who desire to have the qualities of not having ego, like the Lord, and to have great wealth, they wish for it. The all-auspicious Srinivasa has left me today. The sinister hand of evil. Because of this, considering my situation, thinking that sacrifices will not be performed for the gods, thinking that Dharma will not walk with four feet, about you. To the gods, to the ancestors, to the sages, I am grieving, thinking that there will be no more happiness for the virtuous and all the householders. Lord Krishna has left me. Even the Brahma and other gods desired the grace of that Lakshmi Devi, believed that they were surrendered to the Lord, and performed penance for a long time. Thus, Lakshmi Devi, having left her abode in the lotus forest, has become subservient to the Lord's beauty and serves him. Such a God walked on this earth with his footprints and sanctified it. That Swami, adorned with the flag, diamond, goad, chakra, and conch, all the worlds were honoring me, saying that I am greater than all the worlds, because of the symbols of his feet. Such a Swami left me. He destroyed the king's armies, filled with the demonic wealth that was heavy on me. Dharma with two legs
Narupu, long, to make me and you walk with four feet, having resolved, he incarnated as one among the Yadavas. The Yadava women were captivated by the beautiful, smiling, and sweet conversation, filled with the love of that Lord, and forgot the one who was to be saved. My body, touched by the feet of Lord Krishna, felt a thrill. Which woman can bear the separation from such a Purushottama? In this way, the goddess Bhudevi told the matter to Dharmadeva. We will find out the next part in another podcast. Jai Srimannarayana. Salutations to the Asmadgurus