కాలస్వరూప గణనము - పరమాణు కాల వివరణ
Calculation of Cosmic Time from the Atom
ఈ భాగవతం ఎపిసోడ్‌లో, మైత్రేయ మహర్షి విదురునికి కాలస్వరూపాన్ని అత్యంత సూక్ష్మ స్థాయి నుండి వివరిస్తారు — పరమాణువు నుండి ప్రారంభించి యుగాలు మరియు కల్పాల వరకు కాలగణన ఏ విధంగా జరుగుతుందో తెలియజేస్తారు. రెండు పరమాణువులు కలిసి ద్వి-పరమాణువుగా ఏర్పడుతూ, క్రమంగా విశ్వ కాలమాన విభాగాలు ఎలా నిర్మితమవుతాయో ఈ అధ్యాయం స్పష్టంగా వెల్లడిస్తుంది. పరమేశ్వరుని సృష్టిలోని అనంత సూక్ష్మతను గ్రహించి, మన జీవితాన్ని భగవత్ స్మరణతో అర్థవంతం చేసుకోవడానికి ఈ జ్ఞానం మనకు స్ఫూర్తినిస్తుంది.
In this profound episode of our Srimad Bhagavatham series, we explore Canto 3's remarkable revelation of how cosmic time is measured, beginning from the smallest unit — the paramanu, or atom. Maitreya Maharshi explains to Vidura how two paramanus combine to form a dvi-paramanu, and how these progressively build into larger units of time all the way up to the cosmic cycles of yugas and kalpas. This ancient Vedic framework of time calculation reflects the infinite precision of the Lord's creation and invites us to contemplate our own place within the vast sweep of cosmic existence.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్త ఆశిషామీశ మనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ కుంఠమేధసే పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ ఆశలకు, అభిలాషులకు, అధిపతికి, మనువునకు కారణ స్వరూపునకు, బృహత్ ధర్మ స్వరూపునకు, అపయచ్ఛిన్నానంద రూపునకు, అకుంఠ మేధస్సు కలవానికి, పురాణ పురుషునకు, సాంఖ్య యోగేశ్వరునకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో 24th చాప్టర్ 42 శ్లోక్ ప్రేయర్. భగద్బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము. 16వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనము విదురుడి మైత్రుడి సంవాదంలో కాలం యొక్క గణన యుగాలు, యుగాల యొక్క కలయికతో ఆ మన్వంతరాలు, తర్వాత కల్పాలు, తర్వాత బ్రహ్మకు పగలు రాత్రి ఎలా ఏర్పడతాయని విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం, అనుభవించాం. దీని విషయాన్ని మరొకసారి వివరంగా వినడానికి ఈ ముందున్న పాడ్కాస్ట్లో వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఇక ముందు కాలం వివరం ఎలా ఇచ్చాడో మైత్రేయుడు మనం అనుభవిద్దాం. మైత్రేయుడు ఇంతవరకు కాలస్వరూపమును వివరించెను. ఇక వేదగర్భుడనెడి బ్రహ్మ సృష్టి ఎట్లు చేసునో వివరించుచున్నాడు. వెస్ట్టి సృష్టికి ముందు చతుర్ముఖుడు అంధతామిశ్రము, తామిశ్రము, మహామోహము, మోహము, తమస్సు అను ఐదు విధములగు అవిద్యను సృష్టించెను. దీని వలన జ్ఞానము గల జీవునకు జ్ఞానము పోయి అజ్ఞానము ఆవరించుచున్నది. శరీరమునకు ఆత్మకు భేదమును వివేచించుకొను శక్తి లేకపోవుట తమస్సు. దేహములు ఇంద్రియములు మొదలగునవే నేను అనుకొనని మానసికముకు భ్రాంతికి మోహము అని పేరు. గ్రామ్యములగు భోగములను అనుభవించి సుఖించవలెనని కోరిక మహామోహము. ఆ భోగములకు ఆటకము కలిగినప్పుడు కలిగిన ప్రతీకార వాంఛచే కలుగు మానసిక వికారము క్రోధము.
ఆ భోగములు నశించినప్పుడు తానే చనిపోయినట్లు బాధపడుట అంధతామిశ్రము. ఈ అజ్ఞాన వృత్తులను మొదట సృజించి ఈ పాపపు సృష్టిని చేసితినని బ్రహ్మ తనను తాను నిందించుకొనెను. భగవత్ ధ్యానము చేసి మనస్సును పరిశుద్ధము చేసుకొని వేరొక విధముకు సృష్టి చేయుటకు ఉపక్రమించెను. అప్పుడు సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులను నలుగురు కుమారులను సృష్టించెను. వారు ఎల్లప్పుడూ శుభమగు భగవానునే మనసులో ధ్యానించువారు. విషయ భోగములపై ఆసక్తి లేక అంతర్ముఖులై ఉండెడివారు. ఇంద్రియ జయము గలవారలై ఉండెడివారు. బ్రహ్మ వారిని సృష్టి చేయుడన నియమించెను. కానీ వారికి మోక్షమునందు ఆసక్తి కలిగి వాసుదేవునే తమకు ప్రాప్యముగా భావించుచుండెడివారు. అందుచే వారు సృష్టి చేయుటకు అంగీకరించలేదు. వారిపై కోపం వచ్చెను. పట్టలేనంత కోపం వచ్చి దానిని అరికట్టుకొనవలెనని ప్రయత్నించెను. ఎంత ఆపుకొనను ఆగక కోపము బ్రహ్మ కనుబొనల మధ్య నుండి నీలలోహితుడనెడి కుమారుడుగా బయలు వెళెను. అతడే పరమశివుడు, భవుడు. అతడు పుట్టగానే ఏడ్చెను. అందుచే అతని పేరు రుద్రుడు అయ్యెను. అప్పుడు ఆ భవుడు నా కొన్ని పేర్లను కొన్ని స్థానములను ఏర్పరచమని బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ ఏడవకుము నీకు నామకరణము చేసి ఉండుటకు స్థానమును నిర్దేశించునని చెప్పెను. భయముతో బాలుడు ఏడ్చినట్లు ఏడ్చితివి కనుక నిన్ను రుద్రుడు అని లోకులు వ్యవహరింతురు. నీకు ఉండుటకు స్థానములుగా హృదయము, ఇంద్రియములు. ప్రాణము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు, తమస్సు అనేటి స్థానములను నేను కల్పించి ఒంటిని. వానిని నీవు నీ స్థానములుగా స్వీకరింపుము. వెనుక చెప్పిన పదునకొండు స్థానములలో ఉండెడి నీకు పదుకొండు పేర్లు ఉండును. మన్యువు. మానువు, మహాకాలుడు, మహితుడు, శివుడు, రుతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు.
ఆ పదునొక్క పేర్లతో పదునొక్క స్థానములలో ఉండి క్రింద చెప్పడి పదునొక్క మంది స్త్రీలతో సంతానమును కనుమని చెప్పెను. ధీవృత్తి, అశన, మా, నియత్, సర్పిక, ఇళ. అంబికా, ఐరావతి, సుధా, దీక్ష, రుద్రాణి అనేటి పదినొక్క మంది నీకు భార్యలుగా ఉండెదరు. వీరితో కలిసి నీవు సంతానమును ఉత్పత్తి చేయుము. నీవు ప్రజలను సృష్టింతువు కనుక నీవు ప్రజాపతి అవుదువు. ఇట్లు బ్రహ్మ ఆదేశింపగా నీలలోహితుడు స్వభావముతో తనతో సమానులగు బిడ్డలను సృష్టించెను. ఆ పుట్టిన కుమారులు విశ్వమునంతను గుంపులు గుంపులుగా వెళ్లి తినివేయుచుండిరి. లెక్కైనంత మంది ప్రజను తినివేయుచుంటుట చూచి బ్రహ్మ బాధపడి ఇట్లనెను రుద్రా నీతో సమానులకు ఇట్టి సంతానము చాలును ఇంకా ఇట్టి సృష్టి వలదు. వీరు నీ వలనే తీవ్రములగు నేత్రములతో లోకమును నన్ను కూడా తినుచున్నారు. అందుచే నీవు యొక్క సర్వభూతములకు సుఖమును కలిగించునట్టి తపము ఆచరించుము. ఆ తపస్సు చేయుట చేతనే అతనిని ఎరింగి ఆ జ్ఞానముచే సృష్టి చేయగలవు అని చెప్పెను. ఇట్లు బ్రహ్మ ఆదేశింపగా బ్రహ్మకు ప్రదక్షిణము చేసి ఓం అని వాని వద్ద ఆజ్ఞ తీసుకొని తపస్సు చేయుటకు అరణ్యమునకు ఏగెను. ఇట్లు రుద్రుడు తపస్సు చేయుటకు ఏగిన తరువాత సృష్టి చేయు కుమారులను కనవలెనని బ్రహ్మ మరల ధ్యానింపగా భగవద్భక్తి యుక్తుడగు బ్రహ్మకు లోకమును సృష్టింపజాలిన పది మంది కుమారులు కలిగిరి. మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్టుడు, దక్షుడు, నారదుడు అనేటి పది మంది బ్రహ్మ నుండి ఆవిర్భవించురి. బ్రహ్మ ఒడి నుండి నారదుడు పుట్టెను, బొటనవేలి నుండి దక్షుడు, ప్రాణము నుండి వశిష్టుడు, చర్మము నుండి భృగువు, చేతుల నుండి క్రతువు పుట్టెను, నాభి నుండి పులహుడు, కర్ణముల నుండి పులస్త్యుడు, ముఖము నుండి అంగిరసుడు. నేత్రముల నుండి అత్రి పుట్టెను. మనసు నుండి మరీచి పుట్టెను. కుడి వక్షోభాగము నుండి ధర్ముడు పుట్టెను. ఆ ధర్ము నుండి నారాయణుడు ఆవిర్భవించెను.
ఇట్లు పది మందిని ఆవిర్భవింపచేసిన తరువాత అతని శరీరావయములు కొన్ని నుండి కొన్ని భాగములు ఆవిర్భవించెను. కుడి వక్షోభాగము నుండి ధర్మం వచ్చెను. ఆ ధర్మమునందు నారాయణుడు ఉండును. అతని వీపు నుండి అధర్మము వచ్చెను. దానియందే లోకమునకు భయము కలిగించెడి మృత్యువు ఉండెను. చతుర్ముఖుని హృదయ దేశము నుండి కామము, కనుల నుండి క్రోధము, క్రింది పెదవి నుండి లోభము, ముఖము నుండి వాక్కు, మర్మావయముల నుండి సముద్రములు, గుదస్థానము నుండి పాపములకు అధిష్టానమగు నిర్పతి. శరీర ఛాయ నుండి కర్ధముడు పుట్టిరి. ఆ కర్ధముడే స్వయంభువుని కుమార్తెయగు దేవహుతికి భర్త అగును. బ్రహ్మ శరీరము నుండి మనసు నుండి జగత్తును సృష్టించెను. బ్రహ్మ వాక్కుకు అధిష్టాన దేవతాగు స్త్రీమూర్తిని కుమార్తెగా కనెను. ఆమె చాలా అందము కలిగి మనసులు ఆకర్షించుచుండెను. అతడు తన కుమార్తెగు వాగ్దేవిని ఆమెకు తనపై మనసు లేకున్నను తాను పొందవలెనని కోరెను. ఆ సంగతిని ఎరింగి. ఇట్టి బుద్ధి అధర్మమని మరీచి మొదల కుమారులు తండ్రియందు ఉండు నమ్మకము వలన ఎరంగించిరి. ప్రభు ఇట్టి పనిని ఇంతకుముందు ఎవ్వరునూ చేయలేదు. ఈ కాలమున ఎవ్వరునూ చేయరు. భవిష్యత్తులో ఎవ్వరునూ తన కుమార్తెను తాము ప్రేమింపరు. కామమును నిగ్రహించుకొనలేక కుమార్తెను కామించుట చాలా నిందిప్పదగిన పని. మీరు తేజస్శాలురు. అయినను లోకములో మర్యాదను కాపాడవలసిన మీరు ఇట్టి పని చేయుట శ్లాగింపదగినది కాదు. పెద్దలు నడిచినట్లే లోకములో నడుచుందురు. అట్లు నడుచుట శ్రేయస్కరమని పెద్దలు చెప్పుచుందురు. ఇట్లు తండ్రిగు బ్రహ్మతో చెప్పి భగవానులను నమస్కరించి ఇట్లు విన్నవించుకొనిరి. ఓ భగవాన్. నీవు నీలో అణిగి ఉన్న సూక్ష్మ దశలో ఉన్న చేతనా చేతనాత్మక ముద్దగత్తును నీ సంకల్పమనడి జ్ఞానము చేత అందరకు గోచరమగునట్లు బయలుపరిచితివి. అట్టి సర్వ జగత్ కారణముగు నీవే అధర్మము జరువకుండా ధర్మమును ఆచరించినట్టు చేయు సమర్ధుడవు. ఇట్లు తన కుమారులగు ప్రజాపతులు తాను చేయు తప్పు పనిని.
ఎరింగి భగవాను ప్రార్థించుట చూచి తాను వెంటనే సిగ్గుతో శరీరమును వీడెను. అతడు వదిలిన ఘోరమగు శరీరమును దిక్కులు గ్రహించినవి. దానిచే దిక్కులు తన స్వరూపము కనపడకుండా కప్పెడి మంచు పొరగా స్వీకరించినవి. స్పష్టముగా కనిపించే దిక్కులను మంచు ఎట్లు ఆవరించి కనపడకుండా చేయునో అట్లే కామము స్వభావమును ఆవరించి ప్రకాశింపకుండా చేయును. ఆ శరీరమును వీడిన తరువాత బ్రహ్మ వెనుకటి కల్పములో ఉన్నట్లు ప్రజలను ఎట్లు సృష్టించగలనని ధ్యానించుచుండెను. అట్లు ధ్యానించుచున్న ఉన్న ఆ చతుర్ముఖై నుండి ఋగ్వేదము మొదలుగా గల నాలుగు వేదములు ఆవిర్భవించెను. నలుగురు హోతలతో జరిపెడి చాతుర్హోత్రము అనేడి కర్మతంత్రము ఆవిర్భవించెను. యజ్ఞము, ఉపవేదము, వేదములలోని అర్థములను ఎరుంగుటకు సాయపరుడి న్యాయములు, తపస్సు, సత్యము, దయ, శౌచము అనడి పాదములు గల ధర్మము, బ్రహ్మచర్యము మొదలగు నాలుగు ఆశ్రమములు వానియందు ఆచరింపవలసిన ధర్మములు చతుర్ముఖ నుండి. వెలువడినవి. దీని తరువాత మిదురుడు మళ్ళీ మైత్రేయుని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. దాని నుంచి ఇంకా మనకు సృష్టి విషయాలు ఏమందిస్తారో తరువాత ఎపిసోడ్ పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the ocean of blessings. I bow to the cause of the mind, to the righteousness that is filled, to Krishna, the one with the pot-like forehead, to the man, to the ancient one, to the lord of Sankhya Yoga, to the lord, to the ruler, to the cause of Manu, to the one with the desire, to the lord, to the ruler, to the cause of Manu, to the one with the desire, to the lord, to the ruler, to the cause, to the one with the desire, to the lord, to the ruler, to the cause, to the one with the desire, to the lord, to the ruler, to the cause, to the one with the desire, to the lord, to the ruler, to the cause, to the one with the desire, to the lord, to the ruler, to the cause, to the one with the desire, to the lord, to the ruler, to the cause, to the one with the desire, Salutations to the embodiment of the great Dharma, to the embodiment of unbroken bliss, to the one with unconfined intellect, to the ancient being, to the lord of Sankhya Yoga. Fourth Canto, 24th Chapter, 42nd Vallak Prayer. Oh, devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, Third Canto. Welcome to episode 16. Until now, in Vidura's Maitri dialogue, we have understood and experienced how the calculation of time, the ages, the combination of ages, those Manvantaras, then Kalpas, then how day and night are created for Brahma. To hear this matter in detail once again, if you listen to the podcast in front of you, you will understand it well. Let us experience how Maitreya described the future. Maitreyi has explained the form of time so far. Now, how does Brahma, the father of the Vedas, create the universe He is explaining. Before the creation of the Vesti, the four-faced one created five types of ignorance: the mixture of darkness, the mixture of ignorance, great delusion, delusion, and darkness. Because of this, knowledge is lost and ignorance surrounds the wise being. The inability to discern the difference between the body and the soul is ignorance. The body, senses, and so on, I do not think, is called delusion and delusion to the mental. The desire to enjoy the pleasures of the village and to be happy is great delusion. When those pleasures are accompanied by a sense of loss, the mental disturbance caused by the desire for revenge is anger.
When those pleasures are destroyed, one feels like one has died, that is the suffering of blindness. Brahma blamed himself for first creating these ignorant professions and this sinful creation. Having meditated on the Lord, purifying the mind, he began to create another kind of creation. Then Sanaka Sanandana Sanat Sujata Sanat Kumaras created four sons. They always meditate on the auspicious Lord. They were introverted and had no interest in worldly pleasures. Those who are victorious over the senses. Brahma was appointed to create. But they were interested in salvation and considered Vasudeva as their attainment. Therefore, they did not agree to create. He felt angry. He tried to control his uncontrollable anger. How much can I hold back, without stopping, anger, from between Brahma's eyebrows, a son named Neelalohudu went out. He is Parameshwara, the supreme god. He's already crying. So his name became Rudra. Then that person, my He asked Brahma to create some names and some places. Then Brahma said, do not cry, and to give you a place to be named, he said. Because you cried like a child crying in fear, people will call you Rudra. The heart and the senses are the places where you have to stay. Life, sky, air, fire, water, earth, sun, moon, I created the places called Tamas. You accept them as your places. You will have eleven names in the eleven places mentioned earlier. Manyuvu. Manuvu, Mahakaludu, Mahidhudu, Shivudu, Rutadhwajudu, Ururetasudu, Bhavudu, Kaludu, Vamadevudu, Dhrutavrathudu.
He said to have children with the ten women who were in the ten places with the names of those ten. Dheevruthi, Asan, Ma, Niyath, Sarpika, Ila. Ambika, Airavata, Sudha, Deeksha, and Rudrani, all ten of them, will be your wives. With them, you produce offspring. You are the creator of the people, therefore you will be the father of the people. Thus, as Brahma commanded, Neelalohita, with his own nature, created children who were equal to him. Those born sons went in groups to the whole universe and ate. Seeing that it was devouring so many people, Brahma became sad and said, Rudra, such offspring are enough for those who are equal to you, and such creation is not needed anymore. They are eating the world and me too, with their eyes that are as sharp as yours. Therefore, practice penance that brings happiness to all beings. He said that by doing penance, they can create him with that knowledge. Thus, as Brahma commanded, after circumambulating Brahma, he gave the order to him, saying 'Om' He went to the forest to perform penance. Thus, after Rudra sat down to perform penance, Brahma, wishing to have sons to create the universe, meditated again, and Brahma, who was devoted to devotion, had ten sons who could create the world. Marichi, Atri, Angirasudu, Pulastudu, Pulahudu, Kratuvu, Bhruguvu, Vasishtudu, Dakshudu, Naradudu, these ten people emerged from Brahma. Narada was born from Brahma's lap, Daksha from the thumb, Vasishta from the life force, Bhrugu from the skin, Kratu was born from the hands, Pulahu from the navel, Pulastya from the ears, Angirasudu from the face. Athri is born from the eyes. The mind is a mine, fresh from the earth. Dharmudu was born from the right chest. From that Dharma, Narayana manifested.
Thus, after the ten people were manifested, some parts of his body and organs were manifested. Right from the chest, Dharma came. In that dharma, Narayana resides. Evil came out of his back. In that, there was death that caused fear to the world. From the heart of the four-faced one, desire; from the eyes, anger; from the lower lip, greed; from the mouth, speech; from the navel, oceans; from the anus, the determination that is the basis for sins. Kardhamudu was born from the shadow of the body. That Kardhamudeva is the husband of Devahuti, the daughter of Swayambhu. From the Brahma body, from the mind, the world was created. The daughter of the presiding deity of Brahma Vak is the female form. She was very beautiful and attracted people. He desired to marry his daughter, Vagdevi, even though he did not have a heart for her. I'll tell you about it. Thus, the sons of Marichi, considering this intellect unrighteous, were destroyed by the faith they had in their father. Lord, this work before Nobody did. Nobody does that anymore. In the future, no one will love their daughter. Unable to control lust, lusting for a daughter is a very reprehensible act. You're a darling. However, you who are supposed to protect the dignity of the world, doing such a thing is not commendable. The world walks as the elders walk. Elders say that it is good to walk like that. Thus, the father, after telling Brahma, saluted the Lords and thus requested. Oh, my God. You have revealed the subtle, inward-dwelling, conscious, and active essence within you, so that it may be known to all by your willful knowledge. You are the cause of all the world, you are capable of making it so that unrighteousness does not prevail and righteousness is practiced. Thus, the king, being the son of the people, did wrong.
Seeing the prayer of the Lord, he immediately, out of shyness, abandoned his body. The directions understood the terrible body that he had left behind. By that, the directions were accepted as a layer of ice that covered without revealing its form. Just as snow covers and makes the visible directions invisible, similarly, desire covers and prevents the nature of desire from shining. After leaving that body, Brahma was contemplating how he could create people as he was in the previous kalpa. Thus, from that four-faced one who is meditating, the four Vedas, starting with the Rigveda, were manifested. The Chaturahutram, a ritual performed with four sacrifices, emerged. Yagnyamu, Upavedamu, the laws that help to understand the meanings in the Vedas, penance, truth, compassion, purity, the Dharma with these feet, celibacy, and the four ashramas to be practiced in them, the Dharmas from Chaturmukha. They were released. After this, Midrudu again asks Maitreyi some questions. From that, we have more creation related topics We will find out who will do it in the next episode of the podcast. Jai Srimannarayana and salutations to the Gurus.