కర్దమ ప్రజాపతి సన్న్యాస దీక్ష - వనగమన వృత్తాంతము

Kardama's Renunciation & Retirement to Forest

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, గృహస్థాశ్రమ ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వహించి, భగవాన్ కపిలుని అవతారమును స్వయంగా దర్శించిన కర్దమ ప్రజాపతి, సర్వసంగ పరిత్యాగంతో సన్న్యాస దీక్షను స్వీకరిస్తారు. లోక బంధాలను ప్రేమగా వదలి, పరమాత్మ చింతనలో జీవితాన్ని సమర్పించుకొనుటకు వనమార్గం పట్టిన కర్దముని వైరాగ్యం అత్యంత హృద్యంగా వర్ణించబడింది. ఆసక్తులను త్యజించి ముముక్షు మార్గమున నడచిన ఆ మహర్షి జీవితం, ప్రతి సాధకునికీ శాశ్వత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

In this sacred episode from the Third Canto of Srimad Bhagavatham, we explore the noble renunciation of Kardama Prajapati, who, having fulfilled his householder duties and witnessed the divine birth of Lord Kapila, gracefully surrenders all worldly attachments. With deep devotion and an unwavering heart, Kardama takes formal sannyasa diksha and departs into the forest to dedicate the remainder of his life entirely to the contemplation of the Supreme Lord. His example stands as a timeless inspiration for all seekers, illustrating that true liberation begins the moment one lovingly releases the bonds of material life in service of the Divine.

← Prev Next →
Kardama's Renunciation & Retirement to Forest bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః యచ్ఛక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి కుర్వంతి చేషా ముహురాత్మ మోహం తస్మై నమోనంత గుణాయ భూమ్నే వాదులు ప్రతివాదుల వివాద సంవాదములకు మూలము ఆ పరమేశ్వరుని మాయా శక్తులే ఆ మాయా శక్తులే వీరి బుద్ధులలో మరల మరల వ్యామోహనము కలిగించుచుండును. అనంతములు గుణములు కలిగిన సర్వమును వ్యాపించియున్న ఆ పరమాత్మకు నమస్కారము. సిక్స్త్ క్యాంటో, ఫోర్త్ చాప్టర్, థర్టీ ఫస్ట్ ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధం 36వ పాడ్కాస్ట్ లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దేవహుతి దేవహుతికి తన పుత్రుడు కపిలుగా అవతరించినటువంటి విష్ణుమూర్తి చెబుతున్నటువంటి బోధ మనం వింటున్నాం. ఇంతవరకు ఈ శరీరాలు ఎలా ఏర్పడ్డాయి? ఆ శరీరంలో చలనం ఎలా ఏర్పడుతుంది? దానిలో జీవాత్మ ఎలా ప్రవేశిస్తాడు? పరమాత్మ ఎలా ప్రవేశిస్తాడు? ఏ రకంగా మనం శరీరాన్ని మన అనేటువంటి భావన అందుకుంటాము విషయాలని మనం తెలుసుకున్నాం. మరి ఈ శరీరము భగవంతుని వైపు వెళ్ళడానికి ఎలా మనం ప్రయత్నం చేయాలి ఆ యొక్క ప్రక్రియ మనకు ముందు ఇప్పుడు ఇంకా కపిల గీతలో చెప్తున్నారు. శబ్దాది విషయములందు తగులుకొని ప్రవర్తించుచుండగా మనస్సు దానిని అనుసరించి అనర్థములు తెచ్చుకొనుచున్నది. మనస్సు ఇంద్రియముల వెంట విషయముల వైపు పోకుండా భగవానుని యందు ఇంద్రియముల వెంట భగవాను యందు వశపరచుకొనుటకు భక్తి సాధనము. మనస్సు విషయములవై పోకుండా శ్రద్ధతో నియమించుటకు యమనియమాదులను అభ్యసించవలెను. భగవానుని యందు ప్రేమ పెంచుకొనవలెను. వాక్కున సత్యమును అలవరచుకొనవలెను. చెవులతో భగవత్ కథలను వినుచుండవలెను. శరీరముతో కూడిన ఏ ప్రాణిని చూచినను పైన కనపడు శరీరము ప్రకృతి వికారమనియు దానిలో జీవుని యందు పరమాత్మ ఉండుననియు గుర్తించి

బాహ్యమగు ఆకార భేదముచే కలిగెడి భేదము గోచరింపక సమత్వమును గోచరించవలెను. సర్వభూతములు భవదాత్మకములుగా కనపడగనే వాటియందు వైరము తొలుగును. శబ్దాది విషయములందు ఆసక్తి తగ్గును. ఈ నియమములను పాటించుచు బ్రహ్మచర్యమును మౌనమును పాలింపవలెను. భక్తి కలుగుటకు ప్రధానమగు అంశము తన వర్ణమునకు ఆశ్రమమునకు తగిన కర్మలను ఏ కోరిక లేక ఆచరించుచుండుట. దైవవశమున తనకు లభించిన దానితో సంతుష్టినందుచుండవలెను. లభించిన దానికి అధికముగా ఆహారమును తీసుకునరాదు. సంతతం మనసులో భగవానుని రూపములను గుణములను పరిశీలించుచుండవలెను. సంఘముతో కాక ఏకాంతముగా ఉండుట అలవరచుకొనవలెను. మనసున కోరికలు ఊరకుండా శాంతముగా ఉండవలెను. తాను చూచిన వారిపై మైత్రి గలవాడే ఉండవలెను. క్లేశము అనుభవించుచున్న వారిని చూచి జాలి కలగవలెను. రాగము, ద్వేషము, అసూయ మొదలగు దుర్గుణములు లేని మనస్సు ఉండవలెను. బిడ్డలు, భార్య మొదలగు పరికరములను శరీరమును కర్మవశమున వచ్చినవి. ఆ కర్మానుభవము పూర్తి అగువ వరకు వానితో సంబంధం ఉండునని గుర్తించి నేను నాది అనేటి వ్యామోహము తగ్గి ఉండవలెను. ప్రకృతి యొక్క పురుషుని యొక్క తత్వమును ఎరుంగి ప్రకృతిని విడవవలెను. ఆత్మను ఎరుంగవలెననియు గుర్తించవలెను. మనసులో సంకల్ప వికల్పమును నివర్తింపవలెను. భగవానుని కంటే భిన్నములగు వస్తువులను చూచుట తగ్గవలెను. మన కంటితో సూర్యుని స్పష్టముగా చూచినట్లు పరమాత్మచే అధిష్టింపబడిన మన ఆత్మచే పరమాత్మను దర్శింపవలెను. సూర్యుడు కంటిని అధిష్టించి ఉండి ప్రవర్తింపచేసినను ఆ కన్ను సూర్యునిచే చూడగలిగినట్లు చేయును. అట్లే పరమాత్మ మన ఆత్మలలో చేరి పరమాత్మనే చూడగలుగునట్లు చేయును. ఈ విధముగా భక్తి యోగము పరినిష్టితమై ఉన్ననాడు ప్రారబ్ధ కర్మను అంతయు కాగానే కర్మ చేయవచ్చిన దేవ మనుష్యాది శరీరములు వీడిపోవును. నిత్యము సంకోచమే లేని జ్ఞాన స్వరూపుడు ప్రత్యగాత్మ జీవునకు సర్వవిధ బంధములు లేవు. శరీరమున్నగు వానిని దర్శింపజేయువాడును సమానుడు గాని అధికుడు గాని లేనివాడును అగు పరమపురుషుని జీవుడు పొందగలిగిన వాడగును. తాను ఎవడో ముందు ఎరింగి ప్రకృతి కంటే వేరైన ఆత్మ స్వరూపమును చూచుచు అంతకు అంతర్యామిగా.

ఉండు పరమాత్మను దర్శించును. నేలపై సూర్యుని కాంతియే నీటిపై బడి నీటిలో తన ప్రతిబింబను కనిపించజేయును. ఆ వెలుగే ఆకాశమందుండి ఆకాశమందు సూర్యుని చూపించుచున్నది. సూర్యుడు కానీ ప్రతిబింబమును సూర్యుని కూడా మనకు కనపడునట్లు చేయునది ఆ సూర్యుని వెలుగే అహంకారమే భూతములుగా ఇంద్రియములుగా మనస్సుగా మారుచుచున్నది. ఆత్మ యొక్క ధర్మభూత జ్ఞానము ఈ ఇంద్రియములందు మనసునందు పాంచభౌతికమగు శరీరమునందు ప్రసరించి నిజముగా ఆత్మ గాని దేహాదులను ఆత్మ అనునట్లు ప్రకాశింపచేయును. ఈ శరీరమునందు ఆత్మాను జ్ఞానము కలిగినది ఆత్మ నుండి ప్రసరించిన జ్ఞానము చేతనే ఆ జ్ఞానమే సత్యమగు. ఆత్మ స్వరూపమును కూడా గుర్తింపచేయును. సూర్యుడు కాని ప్రతిబింబమును సూర్యుని నుండి ప్రసరించిన కాంతియే సూర్యునిగా కనిపించేయుచున్నది. ఆ కాంతియే ఆకాశమందుండి సూర్యుని కూడా కనిపించేయుచున్నది. ఆత్మ నుండి ప్రసరించెడి జ్ఞానమే ఆత్మ కాని దేహాదుల యందు ఆత్మ అయినటి జ్ఞానమును కలిగించెడిది. అది ఏ వెనుకకు ప్రసరించినచో ఆత్మను కూడా దర్శింపచేయును. నిద్రపోవుచున్నప్పుడు బుద్ధి గాని, అహంకారము గాని, తన్మాత్రలు గాని. ఇంద్రియములు గాని, మనసు గాని పని చేయవు. అప్పుడు దేహము లేనట్లగును. అప్పుడు శరీరముతో సంబంధము లేని నేను మాత్రం ప్రకాశించుచుండును. అప్పుడు వానికి దేహమే నేను అనేటి బుద్ధి ఉండదు. మేలుకొని ఉన్నంత సేపు శరీరము, ఇంద్రియములు, మనసు పని చేయుచుండును. అప్పుడు అవి లేని తాను లేనని అవి ఉన్ననే తాను ఉందునని అనుకొనుచుండును. నిద్రపోయినప్పుడు ఇంతకాలం వేనిని తానుగా భావించినాడో ఆ శరీరము ఇంద్రియములు మనస్సు ఆగిపోయినవి. నేను అనడి ఆత్మ మాత్రము ఆగిపోలేదు. కానీ అవి లేకుండా పోయినప్పుడు తానే లేకుండా పోయినట్టు అనిపించును. ఒకడు ధనమే తన సర్వస్వం అని భావించును. ఆ ధనము లేనిచే లేనిచో తానే లేనివాడ అనుకొని ఉండును. అట్టివానికి ఒకనాడు ధనము పోగానే ధనము పోయినది నేను ఉన్నాను అని గుర్తింపక నేనే చనిపోయితినని మెరపట్టుకొనును.

అందుచే ప్రకృతి కంటే వేరైన ఆత్మ స్వప్నములో సుషుప్తిలో ఉండును. దానిని మనం జాగ్రత్తగా పరిశీలింపవలెను. అట్లు పరిశీలించినచో ఆ ఆత్మ ప్రకృతి వికారమైన శరీరాదులు పోయినను పోవనిది అని తెలియును. పంచభూత సముదాయమగు దేహమును నిలుపునది ఆత్మ. దాన్ని కదలుచున్నట్లు చేయునది ఆత్మ. అంతేగాని దేహమే ఆత్మ కాదు. ఈ విధముగా ఈ శరీరము కంటే వేరుగా ప్రత్యేకాత్మ అనగా జీవుని స్వరూపమును ధ్యానించి దానియందు అంతర్యామిగా ఉన్న భగవానుని ప్రేమతో స్మరించి దర్శించి మోక్షమునందదగును అని కుమారుడు చెప్పగా తల్లి దేవహుతి విని ప్రకృతి పురుషులు ఎల్లప్పుడూ ఉండెడివారు వారి కలయిక అనాదిగా ఉన్నదని కపిలుడు చెప్పిన మాటలచే ఎప్పుడు కలిసియే ఉండు ప్రకృతి పురుషులు విడువడుట ఎట్లు? విడువడకపోయినచో మోక్షము కుదరదని శంకించి ఇట్లు ప్రశ్నించుచున్నది. ప్రకృతి పురుషుని ఎన్నడూ వదలదు కదా. పురుషుడు లేనిదే ప్రకృతి గాని ప్రకృతి లేని పురుషుడు గాని లభింపరు కదా. రెండును నిత్యములు. రెండింటికీ సంబంధము నిత్యమని తెలియుచున్నది కదా. భూమి, వాసన ఒకదాని నుండి ఒకటి వేరుగా కనుపట్టవు. అట్లే ప్రకృతికి పురుషునకు వేరుదనము కనిపింపదు. పురుషుడు తనంత తాను కదలుట మొదలగు వ్యాపారములు లేనివాడు. వానికి కర్మ అనేటి బంధము ప్రకృతి సంబంధం వలనే కలుగుచున్నది. ప్రకృతిని వీడి గుణములు ఉండవు. గుణము లేని ప్రకృతి ఉండదు. ప్రకృతి లేని ఆత్మ కర్మ చేయజాలదు. సంసారము తొలగవలెనని తత్వజ్ఞానము కలగవలెను. వెనక నీవు చెప్పినట్లు మనసులో పరిశీలించి పరిశీలనం చేసుకొని నివర్తించి ఉండిన కలిగెడి ప్రకృతి సంబంధము నివర్తించనిదే కర్మ బంధుము. తొలగి తత్వజ్ఞానము కలిగి బంధం ఎట్లు వీడును? తీవ్రత తగ్గినను పూర్తిగా తొలగిపోవుట సంభవించదు కదా అని దేవహుతి కపిల భగవాన్ని ప్రశ్నించింది. మరి దానికి తన సమాధానం ఏమందించాడో మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Those who speak of the power of the Lord, the disputes and arguments that arise among them, are created by the ego of the self. Salutations to that infinite virtue, the origin of the disputes and arguments of the disputants in this world. The illusion of that Supreme Lord The powers, those magical powers, repeatedly captivate their minds. Salutations to that Supreme Being who is pervading all that has infinite qualities. Sixth Canto, Fourth Chapter, Thirty First Prayer. Devotees of God, welcome to the third episode of the Srimad Bhagavata Tattva Deepika, in the 36th podcast. As part of the conversation between Vidura and Maitreya, we are listening to the teaching of Vishnu Murthy, who is telling Devahuti that his son has incarnated as Kapila. How were these bodies formed, until now? How is movement produced in the body? How does the soul enter into it? How does the Supreme Being enter? In what way do we perceive the body as our own? We have learned about the subjects. And how should we try to go towards God with this body The process is now being described in the Kapila Mudra. While acting upon what is touched by the sounds, the mind follows it and brings about misfortunes. The mind, instead of going after the senses towards objects, is a means of devotion to control the senses and be controlled by God. To regulate the mind from becoming engrossed in worldly matters, one must practice yamaniyamas. Love of God must be increased. Speech should be truthful. One should listen to the stories of God with their ears. Whenever one sees any creature with a body, one should recognize that the body seen above is a distortion of nature, and that the Supreme Soul resides within the living being

The difference caused by external differences should not be apparent, but the samatva (equality) should be apparent. When all beings appear as the embodiment of existence, enmity arises in them. Interest in worldly matters decreases. Following these rules, one should observe celibacy and silence. The main aspect for devotion is to perform actions suitable for one's caste and ashram without any desire, without any desire. May he be pleased with what he has been given by Providence. One should not take more food than what is available. The mind should contemplate the forms and qualities of the Lord. One should learn to be alone, not with a group. The desires of the mind should be silent and peaceful. One should be friendly with those whom he sees. Seeing those who are suffering, one should have compassion. One should have a mind without bad qualities like anger, hatred, and jealousy. Children, wife, and other possessions, the body, are the result of karma. Until that experience of karma is complete, recognizing that I have a connection with him, the delusion of 'I' should be reduced. Of nature The essence of a man must be left to nature. It is important to know and recognize the self. The mind must be cleansed of prejudice and bias. One should not look at things that are different from God. Just as we see the sun clearly with our eyes, we should see the Supreme Being through our soul, which is established by the Supreme Being. Even if the sun is positioned above the eye and makes it behave, that eye will make it possible to see the sun. Similarly, the Supreme Being joins our souls and makes us able to see the Supreme Being. In this way, when Bhakti Yoga is perfected, as soon as all the karmas of past deeds are completed, the bodies of gods, humans, and other beings will be released. The embodiment of knowledge, which is without any hesitation, does not have any kind of bondage for the individual self. He who is with the body, the one who shows him, is equal, or the one who is without a high position, the soul is able to attain the Supreme Being. He, before anyone else, seeing a different soul form than nature, as the inner controller.

He will have the opportunity to see the Paramatma. The sunlight falling on the ground makes its reflection visible in the water. That light is shining from the sky, showing the sun in the sky. The sun, but the reflection, makes the sun also visible to us. That sun's light itself is ego, transforming into beings, senses, and mind. The righteous knowledge of the soul, pervading in these senses, in the mind, in the five-elemental body, and making the body, which is indeed the soul, shine as if it were the soul. In this body, that which has self-knowledge, that which is spread from the self, by that knowledge, that knowledge itself becomes truth. It also makes you aware of your soul. The reflection of the sun, the light that is reflected from the sun, appears as the sun. That light is visible even from the sun, from the sky. The knowledge that emanates from the soul is the knowledge that causes the soul to be in the body and other things. It also shows the soul when it is reflected back. When sleeping, intelligence, or Ego or self-importance. The senses or the mind do not work. Then the body becomes non-existent. Then, I alone, being united with the body, will shine. Then he will not have the intellect that says, 'I am the body'. As long as one is awake, the body, senses, and mind function. Then, thinking that he is not without them, he is without them. When he slept, for so long, he considered Venini as himself, that body, senses, and mind stopped. I'm not saying that my spirit is stopping. But when they disappear, he feels as if he disappears. One who has no other wealth than money. He who has no money, if he has no money, he will think that he is without a father. To such a person, one day, as soon as the wealth is gone, without realizing that the wealth is gone, he will boast that I myself have died.

Therefore, a soul different from nature exists in a dream, in a state of deep sleep. We should examine it carefully. When examined in that way, it is known that even if the body and other things that are the nature of the soul are destroyed, it does not go away. The soul is what holds the body together, which is a combination of the five elements. It is the Spirit that makes them move. It is not the body that is the self. In this way, differentiating from this body, meditating on the form of the individual soul, that is, the living being, and remembering, praising, and seeing the Lord who is within it with love, the son said that it will lead to salvation. Hearing this, the mother Devahuti Men are always there, their union has been from the beginning, by the words spoken by Kapiludu, how can nature, which is always together, leave the men? If it is not released, there is a doubt that salvation will not be possible, thus it is questioning. Nature abhors a law, baron. Without a man, neither nature nor a man is attainable, right? Both are permanent. The connection between the two is eternal, you know. The earth and its smells are different from one another They cannot be seen. Similarly, the difference between nature and man is not visible. A man is not a businessman who can manage things by himself. For him, karma is a bondage, it arises from the relationship with nature. Qualities are superimposed on nature. Nothing purely negative can exist. A soul without nature cannot perform karma. One must have the knowledge of the truth, so that worldly life may be removed. If you examine and contemplate in your mind as you said, and if you have controlled and kept it, then you will attain the natural relationship. If you do not control and keep it, then you will be bound by karma. Having uprooted the knowledge of the self, how can bondage be removed? Devahuti questioned Kapila, the god, saying that even if the intensity decreases, it is not possible to completely remove it, is it? And what answer he gave to that, we will find out in the next podcast. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.