విరాట్ రూప ధ్యానము & ముక్తి మార్గము (Parts 1-6)

Virat Rupa Meditation & Path of Liberation (Parts 1-6)

bhagavatam

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, శుకదేవ మహర్షి పరీక్షిత్ మహారాజుకు భగవంతుని విరాట్ స్వరూపముపై ధ్యానం చేయు విధానమును వివరిస్తారు. భూమి నుండి ఆకాశం వరకు ఆ పరమాత్మ విశ్వరూపంలోని ప్రతి అంగమూ సాధకునికి మనస్సును నిలిపే ఒక దివ్యమైన ఆలంబనగా తెలుపబడింది. ఇంకను ముక్తి మార్గమును గురించి వివరిస్తూ, నిరంతర ధ్యానము మరియు శరణాగతి ద్వారా భక్తుడు జనన మరణ చక్రమును అధిగమించగలడని స్పష్టం చేయబడింది. భాగవతం మొత్తంలో అత్యంత ఆచరణాత్మకమైన మరియు ఉత్తేజకరమైన అధ్యాత్మిక సాధనా మార్గదర్శనంగా ఈ ఉపదేశం విలసిల్లుతున్నది.

In this sacred episode from Canto 2 of Srimad Bhagavatham, Shukadeva Maharshi guides King Parikshit through the profound meditation on the Virat Rupa — the universal cosmic form of the Lord. Each part of the divine form, from the earth as His feet to the heavens as His crown, is revealed as a gateway for the sincere seeker to fix the mind on the Supreme. The episode further illuminates the path of liberation, explaining how a devotee, through steady contemplation and surrender, transcends the cycle of birth and death. This teaching stands as one of the most practical and uplifting guides to spiritual practice found in the entire Bhagavatham.

← Prev Next →
Virat Rupa Meditation & Path of Liberation (Parts 1-6) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః యో విద్యయానుపహతోపి దశార్ధ వృత్యా నిద్రామువాహ జఠరీకృతలోకయాత్రః అంతర్జలేహి కశిపు స్పర్శానుకూలాం తస్మై నమో భగవతే పురుషోత్తమాయ భగవానుడు ప్రళయ కాలములో సకల ప్రాణులను తన ఉదరమునందు నిలిపి ఉంచినాడు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అంటే మరణ భయము అనే ఐదు చిత్త క్లేశములు భగవానుడు నిర్జించలేవు. అయినను ఆయన తనలోని ప్రాణులకు నిద్రాసుఖమును కలిగించువాడై భయంకరము తరంగముల పంక్తులతో కూడి ఉన్న ప్రళయకాల జలముల యందు మెత్తని స్పర్శతో అనుకూలముగా నుండే ఆదిశేషుడనే తల్పముపై యోగ నిద్రను స్వీకరించెను. థర్డ్ కాంటో నైన్త్ చాప్టర్ 20th ప్రేయర్. భగవంతువులారా ఇంతక్రితం వరకు మనము ప్రథమ స్కంధాన్ని పూర్తి చేసుకొని ఈరోజు మనం ద్వితీయ స్కంధంలో ప్రథమ పాడ్కాస్ట్ లో ఉన్నాము. ఇంతవరకు పరీక్షిత్తు తన ప్రాయోభవేషం చేయడానికై సిద్ధపడి ఉన్నారు. అప్పుడు వారి దగ్గరికి అందరూ ఋషులు వేంచేశారు. శుక మహాముని కూడా శుకుడు ఒకడికి వేంచేశాడు. సో శుకుడిని పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తున్నాడు ఇది మనకు ఈ ద్వితీయ స్కంధంలో ప్రారంభం. పరీక్షిత్తు అడిగిన ప్రశ్నను విని మరణము ఆసన్నమైనప్పుడు పురుషులు వినదగినది ఏది అని నువ్వు అడిగిన ప్రశ్న చాలా శ్రేష్టమైనది. నీవే కాక లోకమునకు కూడా హితమును ఎరంగించునది. ఆత్మజ్ఞానులు మెచ్చునవి, మానవులు వినదగినవి అని భావించునవి వేలకొలది ఉన్నవి. ఆత్మతత్వమును ఎరుంగని వారు తమకు ప్రధానమని శరీర పోషణతో ఐహిక ఆముష్మిక ఫలములు పొందగోరెడు వారు ఎరుంగదగిన ఎన్నో ఉన్నవి.

మానవుల జీవితము రాత్రి నిద్రతో గడిచిపోవుచున్నది. కొంతకాలము స్త్రీ పురుష సంభోగముతో గడిచిపోవుచున్నది. వయస్సులో పగటి భాగము డబ్బును సంపాదించుకొనుటకు కుటుంబమును పోషించుకొనుటకు ఉపయోగింపబడుచున్నది. తన పరిజనమగు భార్య, బిడ్డలు తన శరీరము కూడా ఎన్నడో ఒకనాడు నశించునవే అని లోకములో చనిపోవారిని చూచి ఎరుంగిన వారు కూడా దానిని మలచి ధనమును ఆర్జించి శరీరమును శరీర సంబంధములను పోషించుకొనుటకే జీవితమును సాగించుచున్నారు. అందుచే ఓ రాజా, అభయమును పొందవలెనని కోరువారు సర్వ జీవులకు అంతర్యామియై నేమించువాడును, కళ్యాణ గుణములు కలవాడును, తన్ను ఆశ్రయించిన వారి పాపములను హరించువాడును అగు శ్రీహరిని గూర్చి వినవలెను. కీర్తించవలెను, స్మరించవలెను. జ్ఞాన యోగము, కర్మ యోగము అనునవి రెండును ఎరింగి ఆచరించుచు భగవానులకు తాను దాసుడునని. తాను ఆచరించవలసిన ధర్మములను ఆచరించు వారికి శరీరావసాన కాలమున తప్పక నారాయణ స్మరణ కలుగును. జన్మను పొందినందుకు చేతగినది ఇంతే. శాస్త్రములో చేయుమనియు చేయవలెదనియు చెప్పిన కర్మలలో కామ్య కర్మలను వీడి భగవానును ఉపాసించుచు మనసునకు శుభాశ్రయమగు శ్రీహరిని సంతతము తలంచుచు రజస్తమస్సులతో కూడిన సత్వగుణము గాక శుద్ధ సత్వగుణము గల భగవానుని యందే మనస్సు నిలిపి మునులు భగవద్గుణమును చెప్పుకొనుచు జీవితమును గడుపుదురు. నేను కూడా ద్వాపర యుగ ప్రారంభమున తండ్రిగారగు వ్యాసుల వారి వనల వలన వేదముతో పాటు భాగవత పురాణము నేర్చుకొంటిని. భగవత్ అనుసంధానమునందు నిరంతరము నిలబడిన మనస్సు గల నేను కూడా కీర్తింపవలసిన వారిలో ఉత్తముడగు భగవానుని లీలచే ఆకర్షింపబడిన మనస్సు. కలవాడని ఆ భాగవతముని నిరంతరము అధ్యయనము చేయుచుందును. భాగవతము భగవాను నుండి వెలువడినది. భగవానుని స్వరూపమును, రూపమును, గుణములను ప్రతిపాదించునది. ఒక్క ప్రయోజనమునకై సాధన చేయగలవారు మాత్రమే కాక భగవానుని యందు సంతతము నిలిచి ఉండెడి మనసు గల నేను కూడా భాగవతములను నిత్యము అధ్యయనము చేయుచుందును.

నీవు మహాపురుషుడగు భగవానుని భక్తుడవు అందుచే నీకు దానిని ఉపదేశించెదను. ఈ పురాణమును శ్రద్ధతో వినువారులకు మోక్షప్రదురగు భగవానుని యందు అహేతుకమగు భక్తి కలుగును. సంసారములో తాపత్రయమును అనుభవించి అనుభవించి పొందవలసిన దానిని పొందలేక పోతిమని దిగులు పొంది అభయస్తిథిని పొందవలెనని కోరెడి యోగులకు భగవన్నామ సంకీర్తనము ముక్తి సాధనము. వేరొకటి లేదని నిర్ణయింపబడినది. ఆయుర్దాయం పూర్తి అగుచున్నది. మరణము ఆసన్నమైనది ఇంకా సమయము లేదే ఎట్లు భగవానుని పొందవలెనని సంశయం నీకు అవసరము లేదు. దేహాపత్య కళాత్రాదులనందు ఆసక్తితో భగవంతుని ఎరుంగకుండు జీవించు ఆయుర్దాయం ఎంత ఉన్నను ప్రయోజనము లేదు. ఒక్క ముహూర్తమైనను భగవన్ నామమును ప్రేమతో స్మరింపగలిగిన అది శ్రేయస్సును కలిగించును. పూర్వము ఖట్వాంగుడును రాజర్షి దేవతలకు యుద్ధములో సాయము చేసి వారి అనుగ్రహముచే ఇంకా అల్పమైన ఒక మూర్త కాలమే తనకు జీవితం మిగిలి ఉన్నదని ఎరింగి. ఆ లోకములో ఈ లోకములో సర్వమునందు తనది అనడి భావమును తన శరీరమునందు తాను అను భావమును వీడి ఆ శ్రీహరిని ఆశ్రయించి అభయమునందెను. కానీ నీకు ఐదు రోజులు ఇంకను జీవించే అవకాశం ఉన్నది. కావున ఈ శరీరమును వీడి పొందవలసిన దానిని పొందుటకు ఏమి చేయవలెనో ఇప్పుడే చేసుకొనుము. ఏడు రోజులు సమయం ఉంది ఐదు కాదు. దేహమును వీడు కాలము సమీపించినప్పుడు చనిపోవుదునేమోనని భయమును వీడి అన్ని పనులయందు సంఘమును వీడి అసంఘమనడి శస్త్రముతే శస్త్రముతో దేహమునందు దేహ సంబంధుల యందు మమకారము తెంచుకొనవలెను. గృహమును వీడవలెను. ఎట్టి వ్యధలకు చెదరని మనస్సు కలిగి ఉండవలెను. పుణ్యతీర్థములలో స్నానము చేసి పరిశుద్ధమైన ఏకాంత ప్రదేశమున శరీరమును తిన్నగా ఉండునట్లు ఉంచి కూర్చుండవలెను. అప్పుడు మనసులో మూడు అక్షరములతో కూడిన బ్రహ్మ ప్రతిపాదకమగు ఓంకారమును ఆవృత్తి చేయవలెను. ప్రాణాయామముచే మనసును నిగ్రహించి ప్రణవమును మరవకుండా వలెను. శబ్దాది విషయముల నుండి ఇంద్రియములను బుద్ధి అను సారధి సాయంతో మనసు మరల వాటిపైకి పోకుండా.

శుభమగు భగవాను రూపమునందు బుద్ధిని నిలిపవలెను. మధ్యలో మరియొక విషయమును గూర్చిన స్మరణ రాకుండా ఆ భగవానుని విగ్రహమును ధ్యానించుచుండవలెను. పూర్ణమగు విగ్రహమంతయు ధ్యాన గోచరము కాకున్నను ముఖమునో పాదములను ఏదో ఒక అవయవమును ఎడతెగక స్మరించుచు మనసును ఇతర విషయములను లేకుండా చేయవలెను. ఏ భగవత్ స్వరూపమును చింతించుచున్నప్పుడు మనసులో రాగాది దోషములు చేరవో అట్టి స్థితిని అందుట పరమ పదమునందుట పరము అనగా పొందదగినది పొందవలసిన దానిలో సర్వోత్కృష్టమైనది భగవానుని దివ్య రూపము. ఇతర విషయముల స్మరణ లేకుండా భగవానుడే మనసున నిలిచి రాగాది దోషములు తొలగుటచే ప్రసన్నమగు మనసు కలిగి ఉండుట పరమ పదము. రజస్సు చేత ఇతర విషయములపు వైపు మనస్సు లాగబడును. తమస్సు చేత మనస్సు ముద్దుబారును. అట్లు కాకుండా మనస్సును భగవత్ రూపమందు నిలుపుట ధారణ. అట్లు ధారణ చేయగా యోగికి భక్తి కుదురును. ప్రీతితో వేరొక విషయమును గూర్చి స్మరణ లేకుండా ఒకే వస్తువును గూర్చి స్మరించుటయే భక్తి. అట్టి భక్తియే ధ్యానము. ఇట్లు చెప్పగా పరీక్షిత్తు మనసునందు ప్రధానముగా దేనిని నిలిపి ఉంచవలెను? ఎట్లు నిలిపవలెను? ఎట్టి ధారణచే విషయ సంబంధముచే మనసునకు అంటిన రాగద్వేషాది మాలిన్యము తొలగించబడును అని ప్రశ్నించెను. శ్రీ శుక్ల వారు ఇట్లు చెప్తున్నారు ఈ విశ్వమంతయు భగవాను రూపము శరీరం వలె ఈ విశ్వం ఆత్మయగు భగవానుడు ఉన్ననే నిలిచి యుండును. అతని చేతనే ప్రేరేపించబడి ఆయా వ్యాపారములను చేయును. చేసేడి పనులు అన్నిటినీ తనలోనున్న ఆత్మయగు భగవానుని కొరకే సమర్పించును. అందుచే పృథివి మొదలు భూతములతో నిండి ఈ ప్రపంచము. భగవాను స్థూల శరీరము ఈ దేహమునందే గడిచిన కాలములో రాబోవు కాలములో జరుగుచున్న కాలములో ఉన్న సమిష్టి వ్యష్టి రూపమున ఉన్న సకల పదార్థ జాతము.

కనపడుచున్నది బ్రహ్మాండము భగవానుని శరీరము దానికి ఏడు ఆవరణములు ఉన్నవి మొదటిది భూమి రెండు జలము మూడు తేజస్సు నాలుగు వాయువు ఐదు ఆకాశము, ఆరు అహంకారము, ఏడు మహత్తత్వము. ఈ ఆవరణములతో కూడిన బ్రహ్మాండము అనడి శరీరము కలవాడై విరాట్ పురుషుడు ఉన్నాడు. అట్టి భగవానుని ముందుగా ధారణలో నిలుపవలెను. ఈ విశ్వమును ఆ భగవానుని అవయవములుగా భావన చేయవలెను. విరాట్ పురుషునకు పాతాళము పాదభాగము, మడమ అగుపాదము పైభాగము రసాతలము, అతలము వితలము ఆ పురుషునకు రెండు గుల్పములు. అనగా రెండు చీలమండలు, రెండు పిక్కలు తలాతలము, రెండు మోకాళ్ళు సుతలము. అతలము అనులోకములు రెండు తొడలు. భూలోకము ఆ పురుషుని జఘనము అనగా నడుము. అనగా నడుము ముందు భాగము, బొడ్డునకు కింద భాగము, ఆకాశము నాభి ప్రదేశం, ఆ విరాట్ పురుషుని వక్షస్థలము జ్యోతిర్మండలము, మహర్లోకము కంఠ భాగము, జనలోకము ఆ పురుషుని ముఖము, ఆ ఆది పురుషుని లలాటము అనగా నుదురు తపోలోకము, సహస్ర శిరస్కుడగు ఆ ఆదిపురుషుని శిరస్సు సత్యలోకము. ఇంద్రాది దేవతలు ఆ పురుషుని బాహువులు దిక్కులు అతని శ్రవణములు. ఆ చెవిచే వినడి శబ్దము ఆ దిక్కులయందు అనగా కర్ణ బిలములయందు ఉండడి శ్రోత్రేంద్రియములచే గ్రహింపబడును. పరమ పురుషుల నాసికలు అశ్విని దేవతలు, గంధము ఆ పురుషుని ఘ్రానేంద్రియము, ప్రజ్వలించున్న అగ్ని ఆ పురుషుని ముఖము, ద్విలోకము ఆ పురుషుని నేత్రగోళములు. ఆ గోళమునందలి రూపమును గ్రహించు చక్షునింద్రియము సూర్యుడు, ఆ విరాట్ పురుషుని కనురెప్పలు అహోరాత్రములు, ఆ పురుషుని కనుబొమ్మ కదలిక చతుర్ముఖ చతుర్ముఖుడు వశించు బ్రహ్మలోకము. తాలు ప్రదేశము జలము. ఆ జలమునందలి రుచియే ఆ పురుషుని జిహ్వేంద్రియము. పరిచ్ఛేదము లేని ఆ అనంతుడగు విరాట్ పురుషుని శిరస్సు ఛందస్సులు. ఆ పురుషుని నోటిలోని కోరలే యముడు, స్నేహాంశములే ఆ విరాట్ పురుషుని దంతములు. జనులకు ఉన్మాదమును కలిగించు, మోహమును కలిగించు ఆ పురుషుని ఆశ్చర్యశక్తి నవ్వు. అతని క్రీగంటి చూపు అపారముగు సృష్టి, సిగ్గు.

ఆ పురుషునిపై పెదవి, లోభము కింద పెదవి, ధర్మము స్తనము, అధర్మ మార్గము వీపు, ఆ పురుషుని లింగము బ్రహ్మ, వృషణములు మిత్రావరణుడు, సముద్రము అతని ఉదరము, పర్వతములు అతని ఎముకలు, గంగాది నదులు అతని శరీరమునందలి నాడులు. వృక్షములు రోమములు విశ్వ శరీరకుడగు ఆ విరాట్ పురుషుడు పీల్చి వదిలిన వాయువే ఆకాశమందలి ప్రాణవాయువు. కాలమతని నడక సత్వరజస్తమోగుణముల ప్రవాహమే ఆ పురుషుడు చేయు కర్మ అనగా కార్యము. ఇదియే ప్రాణులకు సంసారము. ఆ భగవానుని కేశములుగా మేఘములు ఉన్నవని చెప్పుదురు. అతడు ధరించు వస్త్రము సాయం ప్రాతః సంధ్యాకాలములు. అవ్యక్తము ప్రధానమనున్నది ఆ పురుషుని హృదయ కమలము. చంద్రుడే అతని మనస్సు అదియే సర్వ ఔషధులలో మార్పును కలిగించునది. మనసే సర్వ వికారములకు ఆశ్రయమై ఆశ్రయమే ఉండునట్లు చంద్రుడు సర్వ వికారాశ్రయ భూతుడు. మహత్తత్వము అతని విజ్ఞాన శక్తి సర్వాంతర్యామిహు ఆ విరాట్ పురుషుని అంతఃకరణము అహంకారము రుద్రుడు అందుచేతనే భగవద్గీతలో విశ్వరూపమున రుద్రుడు వక్షస్థానమున ఉన్నట్టు అర్జునుడు దర్శించెను. ఇంకా ముందు భాగంలో ఉన్న వర్ణనను ఇంకా తర్వాత తెలుసుకుందాం. స్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Even though he was afflicted by the three kinds of knowledge, he was not afflicted by the three kinds of wealth, sleep, and the journey of the world. In the inner waters, Kashipu was pleased with the touch. Salutations to that Bhagavatam, the Supreme Personality of Godhead. Bhagavan, in the time of dissolution, to all beings, his He is kept in the stomach. Ignorance, self-respect, attachment, hatred, and attachment to ego, meaning the fear of death, these five mental impurities cannot be overcome by the Lord. However, he, being the one who bestows sleep and happiness upon his creatures, took on yoga sleep on the bed called Adiseshu, which was favorably situated with a gentle touch in the waters of the terrible, wave-filled, and deluge-like times. Third Canto Ninth Chapter 20th Prayer. Oh Gods, until now we have completed the first book and today we are in the second book, in the first podcast. Until now, Parikshit is ready to perform his preliminary rituals. Then all the sages came to them. Shuka the great sage also settled at one place and Shuka met one person. So, Shukudu is answering the question asked by Parikshit This is the beginning of the second book. Hearing the question asked by Parikshit, when death is near, what is worthy of hearing by men, that question you asked is very excellent. You are not only the one but also the one who removes goodness to the world. Those who are self-aware are appreciated, those who are worthy of being heard are considered, there are thousands of them. Those who do not understand the essence of the soul, those who consider themselves primary, those who desire worldly and otherworldly fruits with bodily nourishment, there are many things to be understood.

Human life passes by night. For some time, it is passing with male-female intercourse. In old age, the daytime is used to earn money and to support the family. His wife, his consort, Children, even those who have seen in the world that their bodies will perish one day, are also living their lives to mold it, earn wealth, nourish the body and bodily relationships. Therefore, O King, those who wish to obtain refuge should listen to Sri Hari, who is the inner controller of all beings, the destroyer of sins of those who take refuge in him, and the possessor of auspicious qualities. Let us sing and remember. Gnana Yoga and Karma Yoga, both are practiced, and he is a servant to the Lord. Those who practice the dharmas they must practice will surely have the remembrance of Narayana at the time of their death. That's all anyone is due for life. In the scriptures, it is said that one should perform actions that are desirable, abandoning actions that are not desirable, and the Lord While worshiping, constantly remembering Sri Hari, who is the abode of goodness for the mind, and not being attached to passion and ignorance, but keeping the mind on the pure quality of goodness, the sages live their lives by telling the virtues of God. I also learned the Bhagavata Purana along with the Vedas from the forest of Vyasa, who was the father at the beginning of the Dwapara Yuga. I, who have a mind that is always steadfast in the connection with God, also have a mind attracted by the play of the Supreme Being, who is the best among those who should be praised. He who is not a Kalavadi, constantly studies that Bhagavatam. The Bhagavata is a product of the Divine. It is that which proclaims the form, the appearance, and the attributes of the Lord. Not only those who can achieve for one purpose, but also I, who have a mind to remain constantly in God, will also study the Bhagavatas daily.

You are a devotee of the great man, the Lord. Therefore, I will teach you that. Those who listen to this Purana with devotion will have unwavering devotion to the Lord, who is the giver of salvation. In the world, experiencing the suffering of the world, not being able to attain what one should attain, being sad, and wishing to attain the state of being fearless, for those yogis who desire this, the chanting of the name of the Lord is the means to liberation. It was decided that there is no other. Life expectancy is coming to an end. Death is near, there is no time left, you do not need to doubt how to attain God. Without knowing God with interest in the arts of body, speech, and wealth, there is no benefit, no matter how long one lives. Even for a moment, if one can remember the name of the Lord with love, it will bring prosperity. In the past, Khatvangudu helped the royal sages and gods in battle, and by their grace, he knew that he had only a short time left to live. In that world, in this world, abandoning the feeling that everything belongs to him, and the feeling that he is in his body, he took refuge in that Srihari and was in fear. BUT YOU STILL HAVE FIVE DAYS TO LIVE. Therefore, leave this body and do what needs to be done to attain what you need. There are seven days, not five. Leave the fear of dying when the time of departure approaches, and forsake all associations in all affairs, and break the attachment to the body and its relatives with the weapon of non-association. The house must be left. One must have a mind that does not waver in any suffering. After bathing in sacred places, one should sit in a pure, secluded place, keeping the body straight. Then, in the mind, one should chant the Omkara, which is the Brahma Pratipadaka, consisting of three letters. Through pranayama, one should control the mind and not forget the pranava. From the subject of sound, with the help of the senses and the intellect as a charioteer, without the mind going back to them.

May we place our minds in the auspicious form of the Lord. In the middle, without forgetting the remembrance of another matter, one should meditate on the idol of that God. Even if the complete idol is not visible in meditation, one should constantly remember the face or feet, or some part of the body, without letting the mind and other things be distracted. When contemplating the divine form, to attain a state where the defects of the mind do not occur, to reach that supreme state, the supreme means is that which is attainable, the most excellent of what is to be attained, is the divine form of the Lord. Without the remembrance of other things, when God resides in our mind, the supreme state is to have a pleased mind by removing the faults of coming and going. The mind is drawn to other things by the touch screen. The mind is captivated by the lustful. Instead of that, holding the mind in the form of the divine is the practice. Thus, when one practices, devotion arises in the yogi. With love, without remembering another thing, remembering the same thing is devotion. Such devotion is meditation. Having said this, Parikshit, in his mind, primarily focused on what Should I keep it? How to stop it? By what means, by the subject matter, the impurity of attachment and aversion that has touched the mind will be removed, he asked. Sri Shukla is saying this, this entire universe exists only because the Lord, who is the form of the Lord, exists as the soul of this universe. He is inspired by him and does those businesses. He dedicates all the works he does to the Lord, who is the soul within him. Therefore, this world is filled with elements from the earth to the ghosts. The divine gross body, in this body, in the past, in the future, in the present, in the collective and individual forms, all substances are born.

The universe is visible, the body of the Lord has seven envelopes. The first is earth, the second is water, the third is splendor, the fourth is air, the fifth is sky, the sixth is ego, and the seventh is the great element. The universe, consisting of these environments, is a large being with a body, the Virat Purusha. One should first place the Lord in meditation. This universe should be conceived as the limbs of that God. Virat Purushunaaku, the underworld is the foot part, the heel is the upper part of the foot, the netherworld is the rasaatalam, the atala is the vitalam. That Purushunaaku, two gulpamulu. That is, two ankles, two calves, head, and two knees. The two thighs are the two worlds. The earth is the male genitalia, or the waist. That is, the front part of the waist, the lower part below the navel, the sky, the navel, the chest of that great man, the lotus, the great world, the throat, the world, the face of that man, the forehead of that primal man, that is, the head, the world of penance, The head of the Sahasrara, the Adipurusha, is the Satyaloka. Indra and other gods, the arms of that man, the directions, his ears. That ear's sound The sound, in those directions, that is, in the ear cavities, is perceived by the auditory senses. The nostrils of the Supreme Being are the gods Ashwini, the fragrance is the sense of smell of that being, the blazing fire is the face of that being, the two worlds are the eyeballs of that being. The eye that perceives the form within that sphere is the sun; the eyelids of that cosmic being are the day and night; the movement of the eyeballs of that being is the four-faced Brahmaloka, which is controlled by the four-faced one. Taluka is the area of land. The taste in that water is the tongue of that man. The head of the infinite Virat Purusha without a section is the meter. The teeth of that great man are the fangs of Yama, the friendship, and the teeth. The laughter of the wondrous power of that man who causes madness and delusion to people. His majestic gaze, the boundless creation, shame.

The lips on that man, the lips under greed, righteousness is the chest, the path of unrighteousness is the back, the lingam of that man is Brahma, the testicles are the friend, the ocean is his stomach, the mountains are his bones, the rivers Ganga and others are the nerves in his body. The trees, the hairs, that vast being who is the body of the universe, the air that he breathed out, that is the life air in the sky. The flow of time, the movement, the flow of the three gunas, that is the action performed by that man. This is the world for animals. They say that the Lord's hair is like clouds. The garment he wears is morning, evening. The unmanifest is the primordial seed of the male. The moon is his mind; it is the one that brings change in all medicines. The mind is the refuge for all distortions, and the moon is the refuge for all distorted beings. The greatness, his knowledge power, the omnipresent one, the inner self of that Virat Purusha, the ego, Rudra, therefore, in the Bhagavad Gita, Rudra is in the form of the universe, Arjuna saw that he was in the chest. And further, the description in the front part, and also We will find out later. Smadgurubhyo Namah Jai Shrimannarayana.