అంబరీషుని భక్తి మరియు దుర్వాస మహర్షి కోపం – నవమ స్కంధం
Ambarisha's Devotion and Durvasa's Wrath – Srimad Bhagavatam 9th Skandha
ఈ ప్రవచనంలో మహా భాగవతుడైన అంబరీషుడు తన మనో వాక్కాయములను సంపూర్ణంగా శ్రీహరి సేవకే అర్పించిన విధానం వివరించబడింది. ద్వాదశి వ్రత సమయంలో దుర్వాస మహర్షి అతిథిగా వచ్చి, అంబరీషుడు జలమాత్రం స్వీకరించినందుకు కోపించి కృత్యను ప్రయోగించెను. శ్రీహరి ప్రసాదించిన సుదర్శన చక్రం ఆ కృత్యను దహించి దుర్వాసుని వెంటాడగా, బ్రహ్మ, శివుడు ఎవరూ రక్షించలేకపోయారు. చివరకు శ్రీహరి తాను భక్త పరాధీనుడనని చెప్పి, దుర్వాసుని అంబరీషుని వద్దే క్షమాపణ కోరమని ఆదేశించెను.
This discourse introduces Ambarisha, a great devotee-king who dedicated all his senses entirely to the service of Lord Vishnu. During a Dvadashi vrata, sage Durvasa arrived as a guest and, upon learning Ambarisha had sipped water before feeding him, cursed him in anger and unleashed a fiery demon. The Sudarshana Chakra, given by the Lord to protect Ambarisha, chased Durvasa across all worlds and lokas, and neither Brahma nor Shiva could stop it. Finally, the Lord tells Durvasa that He is fully under the control of His devotees and instructs him to seek forgiveness from Ambarisha himself.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః భూమిపతావర్ధపతౌ విద్యావృద్ధే తపోధికే బహుషు మూర్ఖేశ్వరి శుచ గురు శుచ విదుషానైవోత్తరం వాచ్యం తెలివిగలవాడు రాజును ధనవంతుడిని బాగా చదువుకున్న వాడిని ఎంతో తపస్సు చేసిన వాడిని మందిని మూర్ఖుల్ని శత్రువుల్ని గురువుల్ని ఎదురించి మారు పలకరాదు. ఆర్యోక్తి నెంబర్ ఫైవ్. భగవద్బంధులారా శ్రీమద్భాగవత తత్వ దీపిక నవమ స్కంధము. మూడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం సుకన్య చరిత్ర తరువాత ఆ వంశం యొక్క సూర్య వంశం యొక్క ప్రాప్తి గురించి మనం మనములో అవి గురించి విషయాన్ని తెలుసుకున్నాం. ఇవాళ మనం అంబరీష్ ఉపాఖ్యానం తెలుసుకోబోతున్నాం. నా భావుని కుమారుడు అంబరీషుడు, మహా భాగవతుడు. అతనిపై బ్రాహ్మణ శాపము కూడా పని చేయలేదు. అతని చరిత్రను పరీక్షిత్తునకు శ్రీ సుఖయోగేంద్రుడు ఇట్లు వివరిస్తున్నాడు. మహా భాగవతుడగు అంబరీషుడు సప్త దీపవతియగు భూమిని అఖండమగు ఐశ్వర్యమును కలిగి ఉండెను. అతడు దానిని స్వప్నములో అనుభవించు పదార్థముల వంటిదని భావించెను. ఐశ్వర్యము కలుగుటచే మానవుడు నరకమును పొందునని అంబరీషుని ఆశయం. భగవానుడగు వాసుదేవుని యందు భగవ భక్తులకు సాధువుల యందు భక్తి గలవాడై ఈ విశ్వమును మట్టి బిడ్డతో సమానముగా భావించుచుండెను. అతని మనస్సు సంతతము శ్రీకృష్ణ పాదారవిందముల యందే నిలిచి ఉండెను. వాక్కు భగవద్గుణ వర్ణనమునే చేయుచుండెను. హస్తములు భగవద్ ఆలయములను పరిశుద్ధి చేయు సేవకై వినియోగపడుచుండెను. చెవులు భగవత్ కథా శ్రవణముని చేయుచుండెను. నేత్రములు భగవత్ ఆలయమును, భగవత్ విగ్రహములను దర్శించుటయే ఆసక్తి కలిగి ఉండెను. అతని శరీరము భగవత్ భక్తుల శరీర స్పర్శచే
కాంక్షించుచుండెను. నాసిక భగవన్ నిర్మాల్యమగు తులసినే వాసన చూచుచుండెను. నాలుక భగవన్ నివేదితములగు ప్రసాదములను తప్ప ఇతరములను ఇవి చవిచూడకుండెను. పాదములు శ్రీహరి అర్చారూపమున వేయించేసి ఉన్న క్షేత్రములను దర్శించుటకు సాగుచుండెడివి. శిరస్సు హృషికేశ పాదారవిందములను నమస్కరించుట యందే ఆసక్తమై యుండెను. శ్రీహరి దాస్యము చేయవలెనని కోరిక తప్ప వేరొక కోరిక అతనికి లేదు. ఎల్లవేళలా భగవ భక్తుల సాంగత్యమునంది అతని మనసు ప్రవర్తించుచుండెను. ఈ విధముగా మనోవాక్కాయములు మూడింటి చేతను సర్వాంతర్యామగు భగవానుని సేవించుచు భూమిని పరిపాలించుచుండెను. యజ్ఞాధిష్టాన దేవతయగు శ్రీహరిని అశ్వమేధ యాగములచే ఆరాధించుండెను. తన ఐశ్వర్యమునంతను యజ్ఞ పరికరములను ఆర్జించుటకు యజ్ఞ దక్షిణను వసంగుటకు వినియోగించుండెను. సరస్వతి నదీ తీరమునందు వశిష్ట, అసిత, గౌతమాదులు ఋత్విక్కులుగా యజ్ఞములను చేయుచుండెను. ఆ యజ్ఞ సదస్సులో ఋత్విక్కులు దేవతలతో సమానమగు వస్త్రములను ఆభరణములను దాల్చి ఉండడివారు. అతని రాజ్యమునందు జనులు నిత్యము భగవల్లీలను వినుచు గానము చేయుచు స్వర్గమును కూడా కోరక అతనే ఉండవలెనని కోరుకొనుచుండిరి. భగవంతుని ధ్యానించు వారులకు అణిమాది సిద్ధులు కానీ ఆత్మానుభవము కానీ కోరదగినవై ఉండవు. ఈ విధముగా అంబరీషుడు వర్ణాశ్రమ విహిత కర్మాచరణమును ఆత్మజ్ఞానమును పొందిన వాడై వానిచే కలిగిన భక్తిచే భగవంతును తృప్తిపరచుచు సర్వ సంఘములను వీడియుండెను. అతనికి ఇంటియందు కానీ ఇల్లాలి యందు కానీ సుత్తుల యందు కానీ బంధువుల యందు కానీ సంఘము లేకుండెను. ఏనుగులను, రథములను, గుర్రములను, అఖండమగు ధనరాశిని, వస్త్రాభరణాదులను తృణప్రాయముగా భావించుచుండెను. అవి అన్నియు ఉన్నను వాని యందు అతనికి సంఘము లేకుండెను. ఏకాంత భక్తిచే సంతుష్టి నొందిన ముకుందుడు అతనిపై శత్రుత్వమును చూపు వారిని భయపెట్టుటకు రక్షణగా చక్రమును సంగెను. ఇట్లు భగవన్నిష్టుడై రాజ్యపాలన చేయుచున్న అంబరీషునకు తుల్యశీలవతియగు
భార్య లభించెను. ఆమెతో కలిసి ఒక సంవత్సరము ద్వాదశి వ్రతము చేయుటకు సంకల్పించెను. దశమి రాత్రి ఆహారము తీసుకోకుండా ఏకాదశి అంతయు ఉపవాసము చేసి భగవత్ సేవతో గడుపుచు ద్వాదశి నాడు ఉదయముననే భగవానుని ఆరాధించి నివేదించి ప్రసాదమును తీసుకోనుట ద్వాదశి వ్రతం. కార్తీక శుక్ల ఏకాదశి మొదలు మరుసటి సంవత్సరము కార్తీక శుక్ల ఏకాదశి వరకు అట్లు ఆ వ్రతమును ఆ దంపతులు సాగించిరి. కార్తీక మాసమున వ్రత సమాప్తి చేయుటకు యమునా నదిలో స్నానము చేసి మధువనములో ఉన్న స్వామిని ఆరాధించిరి. స్వామికి మహాభిషేకము సమర్పించిరి. సాక్షాత్ భగవాన్ స్వరూపముగా భావించి భగవత్ భక్తులను సేవించి వారికి ఆరు ఆరు న్యర్బుదములు గోవులను దానము చేసెను. ఆ గోవులకు బంగారు కొమ్ములు, వెండి గిట్టెలు అలంకరించిరి. గోవులతో పాటు వస్త్రములను, ఆభరణములను వారికొసంగిరి. బ్రాహ్మణ భోజనమైన తర్వాత వారికి దక్షిణ వసంగి ఆ దంపతులు ప్రసాదమును స్వీకరించుటకు వారి అరుగ్యతో సిద్ధపడిరి. ఇంతలో దుర్వాస మహర్షి అతిథిగా వచ్చెను. ఆయనకు ప్రత్యుత్థానము చేసి ఆసనమొసంగి ఆరాధించి భోజనమునకు వేయించేయుడని అంబరీషులు ప్రార్థించెను. దుర్వాసులు అంగీకరించి స్నానము చేయుటకు యమునకేగి స్నానము చేసి జపము చేయుచు చాలా కాలం ఉండిపోయెను. ద్వాదశి గడిచిపోవుచున్నది. అర్ధ ముహూర్తం మిగిలి ఉన్నది. ద్వాదశి ఉండగా భోజనము చేయనిచో వ్రతమునకు భంగము కలుగును. చేసినచో అతిథిని అవమానించిన అపచారము కలుగును. ఏమి చేయవలెనో తోచక ధర్మశీలురగు పెద్దలను అతిథి విషయమున అపరాధము కాకుండా వ్రతము చెడకుండా ఏమి చేయవలెనని అంబరీషులు ప్రశ్నించెను. వారు జలమును పుచ్చుకొని వ్రతమును పూర్తి చేసిన అతిథి కంటే ముందుగా భోజనము చేసిన దోషము కలగదనియు వ్రతం సమాప్తమగుననియు చెప్పిరి. అప్పుడు ఆ రాజు అచ్యుతిని మనసున ధ్యానించుచు జలములను పుచ్చుకొనెను.
దుర్వాసుడు యమునా తీరము నుండి స్నానము చేసి వేయించేసెను. రాజు నమస్కరించి కూర్చుండబెట్టెను. ఋషి తన శక్తిచే అతని చేష్టితము తెలుసుకొనెను. కోపముతో వడలంతయు వణికిపోవుచు కనుబొమ్మలు ముడిచి ఇట్లు పలికెను. ఐశ్వర్యముచే మదించి అతిథిని అవమానించినాడు. ఇతడు భక్తుడు కాదు. తాను గొప్పవాడనని భావించుచున్నాడు. నన్ను ఆతిథ్యమును స్వీకరించమని కోరి నేను భుజించకుండా ఇతడు భుజించినాడు. దీని ఫలమును అనుభవించగలడు అని కోపముతో తన జడను పెరికి దానిని తన మంత్రి శక్తిచో మంత్రశక్తిచే కాళాగ్ని వలె ప్రజ్వలించు కృత్యగా మార్చి అతనిపై ప్రయోగించెను. ఆ కృత్య చేతితో కొత్తి పట్టుకొని కాలినీళ్లు తొక్కుచు మండుచు అంబరేష్ ని వైపు సాగెను. అతడు అట్లే కదలక నిలిచెను. అంబరీషుని రక్షణమునకు శ్రీహరి వసంగిన చక్రము ఆ కృత్యమును ఆ కృత్యను దహించెను. తరువాత దుర్వాసురుడు భయపడి ప్రాణమును కాపాడుకొనుటకు పారిపోసాగెను. ఆ చక్రము కార్చిచ్చు పామును వెంటాడినట్లు దుర్వాసిని వెంట వెడలుచుండెను. దుర్వాసుడు మేరు గుహలో దూరెను. చక్రం అచరికేగెను. అన్ని దిక్కులగు పరిగెత్తెను. భూ వివరములలో దూరెను. ఆకాశమునకు ఎగిరెను. సముద్రములో మునిగెను. అన్ని లోకములకు పరిగెత్తెను. లోక పాలులను శరణు పొందెను. స్వర్గమునకు ఎగిరెను. అతడు ఎటు వెళ్ళినా అటు చక్రము వెంబడించుచుండెను. యెచ్చటను శరణములు లభింపక భయపడి బ్రహ్మలోకమునకేగి బ్రహ్మను రక్షించమని ప్రార్థించెను. ఆ భగవానుని యొక్క రూపమగు కాలమునకు వశపడినది నా లోకము. రెండు పరార్థముల కాలము కడవగానే శ్రీహరి బొమ్మముడి మాత్రముచే నా లోకము అంతమగును. నేను, రుద్రుడు, దక్షుడు, భృగువు, మున్నగు ప్రజాపతులు, లోకపాలురు మొదలగు మేమందరము కూడా. ఆ శ్రీహరి ఆజ్ఞను పాలించుచు ఆ నియమనమును శిరసావహించి లోకహితమును చేయుచుందుము. శ్రీహరి చక్రము నుండి రక్షించుటకు నాకు శక్తి లేదు అని బ్రహ్మ చెప్పగానే దుర్వాసుడు కైలాసమునకేగెను.
శంకరుని శరణు పొందెను. మేము చక్రమును రక్షించుటకు సమర్ధులము కాము. మేమందరము శ్రీహరి సంకల్పము చేయు వచ్చు వారలము, పో వారలము. నేను, సనత్కుమారుడు, నారదుడు, కపిలుడు మొదలగు వారలము భగవన్ మాయచే ఆవరింపబడిన వారలమై అతని మాయను ఎరుంగజాలము. సకల లోకేశ్వరుని చక్రము సహించుటకు శక్యము కానిది. నీవు ఆ శ్రీహరినే శరణు పొందుము అని శంకరుడు చెప్పిన మాట విని దుర్వాసుడు వైకుంఠమునకు ఏగి శ్రీతో కూడి వేంచేసి ఉన్న శ్రీనివాసుని శరణు పొందెను. శ్రీనివాసా, అచ్యుతా, అనంతా అపరాధము చేసితిని. దానికి ప్రాయశ్చిత్తం నీవే కల్పింపవలెను. నీ నామమును కీర్తించినచో నరకములోనున్నవారు కూడా ముక్తి నొందుదురు కదా, క్షమించి కాపాడము. అని దుర్వాసుడు ప్రార్థింపగా శ్రీహరి మహర్షి నేను అస్వతంత్రుడను భక్త పరాధీనుడను సాధువులు నా హృదయమును స్వాధీనము చేసుకునినారు వారికి నేను వశపడి ఉందును. భక్తులకు నేను ప్రియుడను, వారు నాకు ప్రియులు. ఆ సాధువులకు భక్తులను తప్ప ఇతరులను నేను కాంక్షించను. భక్తులను విడుచుటయే సంభవించినచో నన్ను ఎప్పుడు వదలని లక్ష్మి అయినను నాకు ప్రియతమ కాదు. భక్తులు భార్య, బిడ్డల కంటే, ఐశ్వర్యము కంటే, ధనము కంటే కూడా ఎక్కువగా భావించి నా కొరకు వాన్నింటినీ వదులుటకు సిద్ధపడుదును. నా యందే నిలిపిన మనస్సు గల సాధువులు, పతివ్రతలు భర్తను వశపరచుకొనునట్లు నన్ను తమ వశమును అంచుకొందురు. వారికి నా సేవయే ముఖ్యం. ఈ లోకములో ఐశ్వర్యమును కోరరు. సరికదా సాలోక్యము, సాయుజ్యము, సారూప్యము, సామీప్యము అను మోక్షములను కూడా కాంక్షించరు. నా సేవనే కోరుకొనుచుందురు. సాధువులు నా హృదయమును అనుసరించి ప్రవర్తింతురు. నేను వారి హృదయమును అనుసరించి ప్రవర్తింతును. వారు నాకంటే అన్యమెరుగరు. నేను వారికంటే అన్యమెరుగను. నీకు ఉపాయము చెప్పెదను. నీవు ఎవరి విషయమున అపచారమును చేసితివో వారి దగ్గరకు వెళ్ళుము.
నా భక్తుల విషయములో నీ శక్తిని ప్రయోగించుటచే నీకీ వేదన కలిగినది. బ్రాహ్మణునకు తపస్సు, విద్య తప్పక ఉండతగినవే. అవి అతనికి మోక్ష సాధనములు. దుర్వినీతుడగు బ్రాహ్మణునకు అవి వేదనను, దుఃఖమును కలిగించునవి అగును. మహా భక్తుడు అంబరీషుని యెడ నీవు చేసిన అపచారమునకు ప్రాయశ్చిత్తముగా అతని వద్దకే పోయి క్షమించమని వేడుకొనును. అప్పుడు చక్రము శాంతించును. భగవానుని ఆజ్ఞానుసారము దుర్వాసుడు. తర్వాత ఏం చేసినాడో మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. The one who increases the earth, the one who increases the sky, the one who increases knowledge, the one who is more virtuous than many fools, the one who is good to the Guru, the one who knows the truth, the intelligent one, the king, the wealthy one, the one who is well-educated, the one who has done a lot of penance One should not speak back to people, fools, enemies, or teachers. Aarohinam number five. Oh, devotees of the Lord, the ninth canto of the Srimad Bhagavata Tattva Deepika. Welcome to the third podcast. Until now, after the Sukanya Charitra, we have learned about the attainment of the Surya Vamsha of that lineage. Today we are going to learn about the Ambareesh legend. Bharata's son was Ambarisha, the great devotee. The Brahmin curse also did not work on him. Sri Sukha Yogendra is explaining his history to Parikshit. The great Bhagavata Ambarisha possessed the earth, which is like seven lamps, with immense wealth. He thought it was like the objects he had experienced in a dream. Because of the attainment of wealth, a human being will not enter hell, said Ambarisha The intention. Being devoted to the Lord Vasudeva, being devoted to the devotees and saints, he considered this universe to be equal to a child of clay. His mind was always fixed on the lotus feet of Lord Krishna. The word was describing the divine qualities. Hands are being used for the service of cleaning the Bhagavad temples. The ears were listening to the divine story. The eyes were interested in visiting the Bhagavat temple and the Bhagavat idols. His body, by the touch of the bodies of the devotees of God
He was longing. My nose was smelling the fragrance of the pure Lord. The tongue did not taste anything other than the offerings offered to God. The feet were circumambulating the sacred places in the form of anarchas, and were proceeding to visit. His head was engrossed in saluting the lotus feet of Hrishikesha. Srihari has no other desire except to do servitude. At all times, his mind was engaged in the company of devotees of the Lord. In this way, with the three senses, serving the omnipresent God, he was ruling the earth. She worshipped the Goddess Srihari, who is the presiding deity of the Yajna, by performing Aswamedha Yagnya. He used all his wealth to acquire sacrificial implements and to collect the sacrificial offerings. On the banks of the Saraswati river, Vasishta, Asita, and Gautama, along with other priests, were performing sacrifices. In that Yagnya Sadasam, the Ritvikas, dressed in garments and ornaments equal to the gods, were seated. In his kingdom, the people always listen to and sing devotional songs They desired that he should remain without desiring even heaven. Those who meditate on God will not be denied the powers of the unmanifest or the experience of the self. In this way, Ambarisha, having attained the prescribed duties of the Varna system and self-knowledge, and through the devotion he received, satisfied the Lord and left all the communities. He had no house, no wife, no tools, no relatives, no church. He considered elephants, chariots, horses, and the immense wealth and ornaments as insignificant. Although they were all there, he did not have a church. Mukundu, who was satisfied with solitary devotion, showed enmity towards them and entrusted the Chakra as a protection to frighten them. Thus, being devoted to God, she became equal to Ambarisha, who ruled the kingdom
I've got a wife. She resolved to perform the Dwadashi Vrata for a year with her. The Dwadasi vow is to fast without taking food on the night of Dasami, and to spend the entire Ekadasi fasting, and to worship the Lord in the morning on Dwadasi, offer Him, take Prasadam, and take Prasadam. From the first day of Karthika Shukla Ekadasi to the next year's Karthika Shukla Ekadasi, the couple observed that vow. To complete the vow in the month of Karthika, they bathed in the Yamuna River and worshipped the Swami in Madhuvanam. A great consecration was offered to the Lord. Considering himself as the embodiment of God, he served the devotees of God and donated six six Nyarbudams and cows to them. The cows were decorated with gold horns and silver udders. They brought cloth and jewelry for the cow. After the Brahmin meal, the couple, Dakshina Vasangi, prepared to accept the prasadam with their Arrugi. In the meantime, Durvasa Maharshi arrived as a guest. He was raised, seated, worshipped, and served food Ambarisha prayed to God to make him strong. The demons agreed and went to the Yamuna to bathe, took a bath, and performed japa (chanting) for a long time. The twelfth day is passing. Half an hour remains. If one does not eat during the Dwadasi, it will be considered as a violation of the fast. If done, it will cause the insult of the guest. Not knowing what to do, Ambarisha asked the elders, who were righteous, what to do so that they would not be guilty in the matter of the guest and so that the vow would not be broken. They said that there is no fault in eating before the guest who has taken the water and completed the vow, and that the vow is completed. Then the king, meditating on Achyuta in his mind, took the waters.
Durvasa was made to bathe from the Yamuna river. The king greeted and sat down. The sage knew his actions by his power. With anger, the whole body trembled, and closing his eyelids, he spoke thus. He was arrogant with Aishwarya and insulted the guest. He is not a devotee. He thinks he is so important. He asked me to accept hospitality, but he accepted without me. He angrily tore off its fruit, thinking he could experience it, and turned it into an act that blazed like fire by his minister's power, like a mantra power, and used it on him. That Kruti, holding a piece of cloth in her hand, wiped her feet with water and went towards Ambaresh. He remained still. Srihari's weapon, which was used to protect Ambarisha, burned that act. After that, Durvasa, being frightened, started running away to save his life. Like a scorpion chasing a fire-breathing snake, Durvasini was chasing him. Durvasa went into a cave. The wheel has stopped. In all directions He ran. He went into the details of the land. Flew into a sky. She was drowned in the sea. Ran across the world. He sought refuge in the world. He flew to heaven. Wherever he went, the wheel followed him. Fearing that they would not find refuge anywhere, they went to Brahma and prayed to him to protect them. My world has fallen into the hands of time, which is the form of that God. As soon as the time of two meanings is over, my world will end only by the lips of Srihari's picture. I, Rudra, Daksha, Bhrigu, and other Prajapatis, the protectors of the world, and all of us. O Srihari, obeying His command, accepting His ordinance, and doing good to the world. As soon as Brahma said that he had no power to protect me from Srihari's Chakra, Durvasa went to Kailasam.
He took refuge in Shankaracharya. We are not competent to protect the wheel. We all are those who come to do Srihari's Sankalpam, we are those who go. I, Sanatkumarudu, Narada, Kapiludu, and others, being covered by the illusion of the Lord, cannot understand his illusion. It is impossible to bear the Chakra of the Lord of the Universe. Hearing Shankarudu say that you should surrender to that Srihari, Durvasudu went to Vaikuntha, joined Sri, and surrendered to Srinivasa. Srinivasa, Achyuta, Ananta, I have committed a crime. You are the one who must make the atonement. If you praise my name, even those in hell will be saved, forgive and protect. And as Durvasa prayed, Srihari Maharshi said, I am independent, a devotee of others, the saints have taken control of my heart, I will be subdued to them. I love the devotees and they love me. I do not desire anybody but the Sadhus and devotees. If it is possible to abandon the devotees, even if it is Lakshmi, who is always with me Not dear. Devotees consider him more than their wives, children, wealth, and riches, and are ready to give up everything for me. The saints and virtuous women who have my mind fixed on me, will bring me under their control, just as they subdue their husbands. My service is important to them. In this world, they do not seek wealth. They do not desire liberation, union, similarity, or proximity. They seek my service. The saints are close to my heart. I will follow their heart. They are no strangers to me. I'm no better than anybody else. I will tell you a trick. Go to the one whom you have wronged.
Because you used your power on my devotees, you have this pain. For a Brahmin, penance and knowledge are essential. They are the means to salvation. They cause pain and sorrow to the wicked Brahmin. As a great devotee, he will go to Ambarisha and plead for forgiveness as atonement for the wrong you have done. Then the wheel will be quiet. Durvasa was pleased by the order of the Lord. We'll find out more in another podcast. Jai Srimannarayana. Salutations to the Asmadgurus