ఉత్తరా గర్భ రక్షణ - శ్రీకృష్ణుని అనన్య శరణాగతి

Protection of Uttara's Womb & Refuge in Lord Krishna

bhagavatam

ఈ భాగవతం ఎపిసోడ్‌లో, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి ఉత్తర గర్భంలోని అజన్మ శిశువు పరీక్షిత్తును శ్రీకృష్ణుడు అద్భుతంగా రక్షించిన దివ్య చరిత్రను వివరిస్తాము. తన భక్తులు పూర్ణ శరణాగతి చేసినప్పుడు భగవంతుడు వారిని ఎన్నడూ విడువడని సత్యాన్ని ఈ సంఘటన స్పష్టంగా నిరూపిస్తుంది. నిస్సహాయ స్థితిలో శ్రీకృష్ణుని శరణు పొందడమే జీవికి నిజమైన రక్షణ అనే ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా ఈ ఎపిసోడ్ హృదయంగమంగా తెలియజేస్తుంది.

In this profound episode of Srimad Bhagavatham, we explore how Lord Krishna miraculously protected the unborn Parikshit within Uttara's womb from Ashwatthama's deadly Brahmastra, revealing His boundless compassion for His devotees. This divine act demonstrates that the Lord never abandons those who surrender to Him completely, even shielding the yet-unborn from the most powerful of weapons. We also reflect on the deeper significance of total surrender to Krishna as the only true refuge in times of helplessness and despair.

← Prev Next →
Protection of Uttara's Womb & Refuge in Lord Krishna bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో నమస్తేస్తు వృషభాయ సాత్వతాం విదూర కాష్టాయ ముహుక్కు యోగినాం నిరస్త శ్యామ్యాతిశయేన రాధసా స్వధామని బ్రహ్మణి రంస్యతే నమః యాదవులలో శ్రేష్టుడగు శ్రీకృష్ణ భగవానున నమస్కారమగుగాక. భక్తిహీనులకు ఏ కాలమున యందైనా ఆయన నీడ కూడా దగ్గరకు రాదు. ఆయనతో సమానము గాని అధికము గాని అగు తేజస్సు లేదు. తన పరబ్రహ్మ స్వరూపమునందు రమించే ఆ శ్రీహరికి పలుమార్లు నమస్కారం అగు కాక. సెకండ్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ ఫోర్టీన్త్ ప్రేయర్. భోద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 12వ పాడ్కాస్ట్ లో స్వాగతం. నారదుడు వ్యాస మహర్షి ఇంటికి ఎతెంచి ఆయన యొక్క సఫరీలు అందుకొని కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటున్నాం. వ్యాసుడు పూజించిన తరువాత నారదుడు తాను కూర్చొని వ్యాస మహర్షిని కూర్చోమని ఆదేశించెను. వీణ ధరించి సతతము భగవన్ నామమునే కీర్తించు నారదుడు. నారాయణ అనుగ్రహంచే అధికము కీర్తిని పొందినవాడు. అతడు దేవర్షి బ్రహ్మర్షియగు వ్యాసును చూచి మందహాసము చేయుచు ఇట్లు పలికెను. మహాభాగ వ్యాస నీ ఆత్మ మనస్సు సంతోషముగా ఉన్నావా? నీవు తెలుసుకొనదలచిన వాటిని తెలుసుకుంటివి కదా సర్వార్ధములతో పరిపూర్ణముగు శబ్దములచే అర్థములచే మహాభారతమును రచించావు కదా నీవు ఎరుంగనిది ఏముండును? సనాతనమగు వేదమును అధ్యయనం చేసినావు. దాని అర్థమును విచారించినావు. అయినను ఏదో పొందవలసిన అర్థమును పొందని వాని వలె శోకములో ఉన్నావు. కారణం ఏమి? ఇట్లు నారదుడు అడగగా వ్యాసుడు ఇట్లా చెప్తున్నాడు.

హే భగవన్, మీరు చెప్పినట్లు సర్వము ఉన్నవి కానీ మనసున సంతోషం కలగటం లేదు. ఆ అసంతృష్టికి కారణమేమో తెలియకున్నది. అగాధమగు అపారము జ్ఞానం కలవాడవు నీవు. బ్రహ్మ శరీరము నుండి ఆవర్భవించిన వాడివి నువ్వు. జ్ఞానుల్లో అగ్రేసరుడవు. ప్రాణులలో ఎట్టి భావములు ఉన్నవో ఎరుంగజాలిన వాడవు. సర్వ జగత్కారణ భూతుడగు పరమ పురుషుడు నీచే ఉపాసించబడినాడు. బ్రహ్మాది దేవతలు ఎవరికంటే క్రింది వారో అట్టి వారు. అట్టివాడు దేవతలందరినీ నియమించువాడగు భగవానుడు. అతడు సంకల్పం మాత్రము చేతనే ఈ విశ్వమును సృష్టించుచున్నాడు, రక్షించుచున్నాడు, సంహరించుచున్నాడు. తన సంకల్పం మాత్రము చేత జగత్తును సృష్టించి అందు తాను ఉన్నను సత్వాది గుణములచో అతడు ప్రభావితుడు కాడు. అట్టి వానిని ఉపాసించిన నీకు ఎరంగరానిది ఉండదు. సూర్యుని వలె మూడు లోకములను సంచరించుచు అన్నిటి యొక్క బాహ్య స్వరూపమును దర్శింపజాలిన వాడవు. వాయువు వలె జ్ఞానముచే లోన వ్యాపించి అంతరమైన స్వభావమును ఎరుంగజాలిన వాడవు నీవు. వేద వేదమును అధ్యయనము చేసిన వాడను నేను. ఆ వేద వ్యాసుడనగు పరబ్రహ్మును తెలుసుకునిన వాడను. ధర్మములను వ్రతములను ఆచరించిన వాడను. కానీ ఏదో చెప్పుటకు అందని ఒక లోపం నన్ను బాధించుచున్నది. అది నీవు నీ జ్ఞానముచే ఎరిగి. నాకు ఎరింగింపుము. వ్యాస మహర్షులు ప్రార్థింపగా నారదుడు చెబుచున్నాడు. నీవు భారతమును అంతను రచించితివి కానీ అందు ప్రసంగ వశమున భగవానుని గుణములను కీర్తించితివి. కానీ ప్రధానముగా భగవద్గుణములను కీర్తించలేదు. భగవద్గుణములను కీర్తించినను వినినను దుఃఖ హేతువుకు పాపము నశించును. నువ్వు భారతములో కృష్ణ కథలను కీర్తించినను అవి వేరొక కథకు అనుబంధంగా చెప్పబడినవి. అందుచేత భగవానునకు సంతృష్టి కలిగి ఉండదు. భగవత్ కథను కీర్తించుచున్నచో భగవాను సంతృష్టి చెందును. భగవాను సంతృష్టి నెందిన నాడు అతనిచే నియమింపబడు మన మనస్సు కూడా సంతోషముతో నుండును.

భగవత్ స్వరూపమును, రూపమును, గుణములను, విభూతిని ఎరింగి ప్రీతితో దానిని వర్ణింపకపోవుటయే నీ లోపము. అందుచేతనే నీ మనస్సునకు సంతృష్టి కలగలేదు. మహాభారతమున ధర్మార్థ కామములు అని మూడు పురుషార్ధములకు సాధనములను కీర్తించితివి కానీ వాసుదేవుని మహిమ వర్ణింపబడలేదు. భగవద్ గుణములను ప్రధానముగా ప్రతిపాదించని ప్రబంధము ఎంత అందమైన చిత్రమైన పదములతో కూర్చబడినను ఆ ప్రబంధము కాకుల పిండములను తినుటకు చేరెడి రేవు వంటిది. ఆ రేవునకు హంసలు రావు. అట్లే పరమహంసలైన భాగవతులు భగవత్ కథలేని ప్రబంధమును ఆదరించరు. మనోహరమగు మానస సరోవరమును తన నివాస స్థానముగా ఏర్పరచుకొని ఆనందించే హంసలు కాకులు కదలాడి ఉచ్చిష్ట పాత్రలతో మురికి నీటితో కూడి ఉండేడి రేవును ఆదరింపవు. అత్యంత ప్రియమగు బ్రహ్మమి తమకు ఆశ్రయముగా కలిగి బ్రహ్మానందానుభవం అనుభవించడి అంతఃకరణ నైర్మల్యము కలిగిన పరమహంసలు క్షుద్ర కథలతో నిండిన కాముకులకు అనుభవింప యోగ్యమైన ప్రబంధములను ఆదరింపరు. శబ్దములచే, అర్థములచే ఏ విధమైన అందము లేకపోయినను, కొంత కొంత దోషము ఉన్నను, భగవాని కీర్తితో నిండిన భగవన్ నామములు గల ప్రబంధములు భక్తులచే ఆదరింపబడును. అట్టి ప్రబంధములే జనుల పాపములను పారదృళగలవు. అట్టి ప్రబంధములనే భాగవతులైన సాధువులు ఆదరముతో వెందురు. వినువారు దొరికినచో తామే చెప్పుదురు. వినడివారు చెప్పెడివారు లేనప్పుడు తామే స్వయంగా పాడుకొని అనుభవించుచుందురు. జ్ఞానము ఉన్నను ఆ జ్ఞానము ఆత్మ స్వరూపమును ఎరుంగుటకు తగినదే అయినను రాగద్వేషాదు లేనిదే అయినను భగవానుని భక్తికి ఉద్దీపింపజేయని వానాడు ఆ జ్ఞానము విడవదగినదే గానీ ఆదరింపదగినది కాదు. అది ఎక్కువ శోభింపదు. అట్లే భగవానునకు ప్రీతికరముగా ఆదరింపని కర్మ కూడా ఆచరించునప్పుడు దుఃఖమును కలిగించునది. ఫలమును ఇచ్చునప్పుడు మరల క్రిందికి జారినట్టు చేయునది కనుక ఆ కర్మ కూడా శోభింపదు. సత్పురుషచే సత్పురుషులచే ఆదరింపబడదు.

భక్తి లేని కేవల ఆత్మజ్ఞానము కానీ, భక్తి భగవదర్పణము కానీ, కామ్య కర్మ కానీ ఆదరింపదగినవి కావు. నీవు లోక హితమునకై ప్రవర్తించిన వాడవు. కానీ కేవల ధర్మార్థ కామములనే ప్రతిపాదించుచు వానికి సాధనమును వివరించితివి. అది అనర్థములతో నిండినది. అనిష్టములు తొలగించి ఇష్టములను పొందింపజాలినది భక్తి యోగం ఒక్కటే. దానిని కలిగించునది భగవంతుని లీలలు, గుణములు ఎరుంగుట, కీర్తించుట. నీవు భగవత్ అంశ సంభూదుడవు. సకల వేదములను దర్శించిన వాడవు. సర్వ భూతములకు హితమును కలిగించు సత్యమునందే రమించువాడవు. సత్వగుణం ప్రధానముగా గలవారిచే దర్శింపదగు సత్వస్వరూపుడగు భగవానును దర్శింపజాలిన జ్ఞానము గలవాడవు. అట్లు దర్శించిన సత్యమును లోకమున ఎరిగించుటకు దీక్ష వహించిన వాడవు. పరిశుద్ధమగు కీర్తి కలవాడవు. అట్టి నీవు మూడు లోకములను పాదన్యాసములచే కొలిచిన త్రివిక్రముని లీలను కీర్తింపుము. అది ఏ ప్రాణులకు గర్భ జన్మ మరణాది బంధమును విడిపించి ముక్తిని కలిగించును. భగవద్గుణ ప్రతిపాదకమగు ప్రబంధమును నిర్మించుము. భగవద్గుణ లీలానుకీర్త అయినయే మనసుకు స్వస్థతను కలిగించును. దానికంటే ఇతరములగు విషయములను వర్ణించిన మనస్సు వ్యాకులతనందును. సముద్రంలో పడవ గాలికి ఇటునటు కదిలిపోవుచు ఒకచోట కుదురుగా నిలవలేనట్లు వ్యాకులత చెందియున్న మనస్సు భగవంతునకు చెందినవగు లీలలను విభూతులను వర్ణించిన వ్యాకులత లేనిదగును. లోకంలో ఏ వస్తువునైనను వర్ణించవచ్చును కానీ ఆ వస్తువులన్నియు భగవంతుడు ఆత్మగా గలవని గుర్తించి వానికి చెందినవిగా వర్ణించిన నాడు ఆ వర్ణనము మనసును శోకమును కలిగింపదు. భగవానుడితో సంబంధము లేకుండా స్వతంత్రముగా ఈ విశ్వమునందలి వివిధ విషయములను వర్ణించిన నాడు మనసు వ్యాకులతనే చెందించును. నీవు లోక హితమునకై భారతమును రచించితివి. ధర్మమును ఎరిగించవలెనని ప్రయత్నించితివి. కానీ లోకము అర్ధకామముల యందే సహజమైన అనురాగం కలది. ధర్మము కొరకు దాని సంబంధించిన అర్ధకామములను నీవు వర్ణించితివి. లోకులు అర్ధకామములనే గ్రహించిరి. నీవు ప్రతిపాదించిన ధర్మమును గ్రహించలేకపోయిరి. అందుచే నీవు అనుకొనునట్లు. ధర్మమునందు రుచి కలుగుట కంటే అర్ధకామములు విడువదగినదని

ధర్మమును వదలి వాటిని ఆర్జించుట అనర్థమని ఆ అర్ధకామములను సాధించుటకు ధర్మమును ఆచరించవలెనని నీవు ప్రతిపాదించితివి కానీ లోకమట్లు గ్రహించలేదు. ధర్మార్థ కామములను వీడి మోక్షమునకు ప్రయత్నింపవలెనని నీవు ప్రతిపాదించినట్లు లోకులు గ్రహింపలేకపోయిరి. జ్ఞానహీనులు గ్రహింపలేకపోయినను జ్ఞానము గలవారు ప్రవృత్తి ధర్మము కంటే నివృత్తి ధర్మము గొప్పదని గ్రహింపగలరు. కానీ వారు కూడా భగవత్ గుణములను వర్ణించినని సుఖముగా భగవద్దేశమున ప్రవర్తింపగలరు. అందుచే అందరకు భగవాన్ అని దివ్య లీలలు వివరించి చెప్పినచో గ్రహించి అర్ధకాములు విడువదగినవి భగవద్భక్తియే స్వీకరింపదగినదని ఎరుంగుదురు. పామరులు, పండితులు కూడా ఎరుంగదగినట్లు భగవత్ గుణములను లీలలను ప్రతిపాదించు గ్రంథమును రచింపుము. శరీరముతో కర్మాచరణ చేయుట తప్పదు. ఆ కర్మను భగవానుని చరణారవిందమునందు సమర్పించుట కర్తవ్యము. భగవతర్పణముగా కర్మను ఆచరించుట శ్రేయస్కరము. శరీరముతో కర్మాచరణ చేయుచు దానిని భవదర్పణ చేయుచు మోక్షమునందు గల స్థితి లభింపక ముందు ఈ శరీరం వీడినను వారికి హాని లేదు. ఇంతకంటే ఉత్తమమైన శరీరమును పొంది భగవత్ప్రాప్తిని క్రమాంగా పొందగలవారగుదురు. కానీ భ్రష్టతనందరు. కానీ భవదర్పణము చేయక ఒక ఫలమును సాధించుటకు ఈ శరీరముతో కర్మను ఆచరించువారు ఎట్టి సుఖమును పొందజాలరు. తాను కర్మాచరణము చేసి పొందిన స్వర్గాది సుఖములు తాత్వాలికములు. మరల పుట్టుచు పోవుచు దుఃఖమునే అనుభవించును. అందుచే ఒక ఫలమును కోరి సధర్మమును ఆచరించుట అనర్థమునే కలిగించును. అనగా దుఃఖమునే కలిగించును. భగవద్భక్తితో తన శరీరముతో కర్మను ఆచరించువాడు సర్వోత్తమమైన సుఖమును భగవదనుభవ రూపమైన శాశ్వత సుఖమును లభించదు. నిపుణమైన బుద్ధి గలవాడు అట్టి సుఖమును సాధించుటకు ఉపాయమును ఎరిగింపవలెనే కానీ విషయ సుఖములను సాధించు సాధనను ఉపదేశింపరాదు. భూత హితమును కోరినట్టు వాడు విషయ సుఖములచే కలుగు దుఃఖమును సుఖమును ఎట్లెన్నో పొందవచ్చును కానీ దానిని ఆర్జించుట మానవును కర్తవ్యము కాదని లోకులకు తెలియజేయుటకు ప్రయత్నించవలెను.

భగవత్ భక్తి చేతనే కానీ దుఃఖము కలియన సుఖము లభింపదు. ఇతరోపాయములచే సాధించు సుఖము దుఃఖముతో కూడియే ఉండును. ఇక ముందు ఏం బోధిస్తున్నారో నారదుడు విందాము. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Salutations, salutations to Vrishabha, to the one who knows Satvata. To the one who is the destroyer of the Kashtas, to the Yogi who is one for a moment, to the one who is beyond Shyamya, to Radha, to the self-controlled one, to Brahma, to the one who is delightful. Salutations to Srikrishna Bhagavan, who is the best among the Yadavas Namaste. For those who are not devout, even the shadow of him will not come near at any time. There is no radiance equal to or greater than him. May salutations be offered to that Srihari, who is delighted in his supreme form, many times. Second Canto Fourth Chapter Fourteenth Prayer. Welcome to the 12th podcast of the first book of Srimad Bhagavata Tattva Deepika, Bhod Bandhula. Narada reached the home of Vyasa Maharshi, received his guests, and sat down. We will learn about the story after that. After Vyasa had worshipped, Narada, sitting down, ordered Vyasa to sit down. Narada, playing the Veena, always sings the name of the Lord. He is the one who has attained the supreme glory by the grace of Narayana. He, seeing the divine sage and Brahmarshi Vyasa, smiled and spoke thus. Oh great Vyasa, are your soul and mind happy? You have known what you wanted to know, haven't you? You have written the Mahabharata with all the resources, with meanings, with sounds, haven't you? What is there that you don't know? You have studied the Vedas, the eternal ones. You have contemplated its meaning. Yet, you are in sorrow like one who has not attained the meaning of what he should have attained. What's the reason? Thus, as Narada asked, Vyasa is saying this.

Oh Lord, as you said, everything is there, but there is no happiness in my heart. The reason for the dissatisfaction is unknown. You are the one who is immense, full of knowledge. You are the one who emerged from the Brahma's body. You are a leader among the wise. You are not able to understand what kind of feelings animals have. The Supreme Being, the cause of all the worlds, is worshipped by you. They are the ones who are below all the gods like Brahma. He is the Lord of all the gods, the Lord of the universe. He is creating, protecting, and destroying this universe only through His determination. He created the world with his determination, and even though he exists, he is not affected by the qualities of goodness. There is nothing that you, who have worshipped him, cannot achieve. Like the sun, you travel through the three worlds and are able to see the external form of everything. Like air, you are pervading with knowledge, and you are the one who cannot understand the nature of the end. I am someone who has studied the Vedas. That Veda, the supreme being, Vyasa I'm the one who knows. He was one who practiced dharma and vrata. But there is some inexplicable flaw that is bothering me. Know that it is by your own knowledge. Let me have it. As the sage Vyasa prayed, Narada spoke. You wrote the entire Bharatam, but in that, due to the speech, you praised the virtues of the Lord. But mainly, it did not glorify the Bhagavad Gita. Even if one praises the virtues of God and listens to them, sin will be destroyed for the sake of sorrow. Even though you have praised the stories of Krishna in Bharatam, they are told as a part of another story. Therefore, the Lord is not satisfied. While praising the Lord, the Lord will be satisfied. When God is satisfied, our mind, which is appointed by him, will also be happy.

Your lack of describing the form, qualities, and splendor of the divine with love is your flaw. Therefore, your mind is not satisfied. In the Mahabharata, you have praised the means to the three Purusharthas, namely Dharma, Artha, and Kama, but the glory of Vasudeva has not been described. A composition that does not primarily present the virtues of the Lord, even though composed with such beautiful and poetic words, is like a harbor that leads to eating crow corpses. The gulls are not coming to the harbour. Similarly, the Paramahamsas, the Bhagavatas, do not accept a Prabandha without a Bhagavata story. The swans and crows, delighted to have the beautiful Manasa Sarovaram as their abode, do not respect the port that is full of dirty water with leftover vessels. The most beloved Brahma, having you as their refuge, do not experience the bliss of Brahman. The supreme saints, who have purity of heart, do not accept the compositions that are worthy of being experienced by the vile stories of the Kamakas. Even if there is no beauty of any kind through sounds and meanings, even if there is some fault, the Lord is full of the glory of God The prabandhas with names are revered by the devotees. Such a composition removes the sins of people. Such devotees of the Bhagavata, who are the authors of such treatises, are revered. Those who are listening will tell when they find someone. When there is no one to listen and tell, they themselves sing and experience it. Even if there is knowledge, even if that knowledge is sufficient to understand the nature of the soul, even if it is without attachment and aversion, that day which does not inspire devotion to God is one that can be abandoned but not cherished. It doesn't really add up. Similarly, even actions that are not pleasing to God, when performed, cause sorrow. When it gives fruit, it makes it fall down again, so that karma also does not shine. Not to be admired by good men.

Devotion without devotion, mere self-knowledge, or devotion to God, or desire-fulfilling actions, are not worthy of respect. You are one who has acted for the welfare of the world. But you have explained the means to him who only proposes dharma, artha and kama. It was full of disasters. Devotion is the only yoga that can remove unwanted things and bring desired things. That which causes it is the plays and virtues of God, to understand and to praise. You are a part of the Divine. You are the one who has seen all the Vedas. You are the one who delights in the truth that brings good to all beings. You are the one who has the knowledge to see the Lord, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the embodiment of goodness, who is the You are one who has taken a vow to reveal the truth that has been seen. You're a holy fool. Thus, you praise the play of Trivikrama, who measured the three worlds with his feet. That liberates the bondage of birth, death, and rebirth from any living being and brings liberation. Build a composition that proposes the virtues of the Divine. The Lord's play of virtues, the glory of the Lord, brings healing to the mind It causes. The mind that describes things other than that causes anxiety. In the ocean, the boat, moving here and there in the wind, is not able to stand still in one place, similarly, the mind, which is restless, describing the plays and glories that belong to God, will be without restlessness. Any object in the world can be described, but when all those objects are recognized as being in the form of God, and when they are described as belonging to Him, that description does not cause sorrow to the mind. Without being connected to God, when describing various things in this universe independently, the mind becomes restless. You have written the Bharatam for the welfare of the world. You tried to make a religion out of it. But the world has a natural affection for desires. For the sake of dharma, you described its related desires. The people understood only the sexual desires. You were unable to grasp the dharma that you propounded. So that you think. It is better to renounce desires than to find pleasure in righteousness

You proposed that abandoning dharma and earning through it is futile, and that dharma should be practiced to achieve those desires, but the world did not understand. People could not understand that you proposed to abandon dharma, artha, and kama and try for salvation. Even though the ignorant cannot understand, the wise can understand that the state of being is greater than the duty of being. But they too, having described the divine qualities, can happily act in the direction of God. Therefore, if the divine plays are explained to everyone as 'Bhagavan' (God), they will understand that devotion to God is acceptable and worthy of abandonment. Let us compose a book that presents the virtues and divine plays of God in a way that is understandable even by the common people and scholars. It is inevitable to perform actions with the body. It is the duty to offer that karma at the lotus feet of the Lord. Performing karma as an offering to God is auspicious. While performing actions with the body and while showing it to the world, before attaining the state of liberation, there is no harm to those who leave this body. More than this Having attained a good body, they will gradually attain God. But it's all corruption. But without doing the mirror of the world, those who perform karma with this body to achieve a fruit will not be able to attain any happiness. He performed karma and attained heavenly pleasures and other comforts. Again, being born and dying, experiencing sorrow. Therefore, desiring a fruit and practicing righteousness will cause misfortune. It causes sadness. One who performs actions with devotion to God, with his body, does not attain the ultimate happiness, the eternal happiness in the form of divine experience. A person with a wise mind should know the way to achieve such happiness, but he should not teach the means to achieve worldly pleasures. As one desires the well-being of others, one can attain sorrow and happiness in various ways through worldly pleasures. However, one should strive to make it known to people that earning it is not a duty for humans.

Only through devotion to God can one attain happiness without sorrow. The happiness achieved through other means is always accompanied by sorrow. Let's listen to what Narada is teaching next. Jai Srimannarayana, salutations to the Gurus