దక్ష పునర్జన్మ & హంసగుహ్య స్తుతి (Parts 5-8)
Daksha's Rebirth & Hamsa-guhya Prayers (Parts 5-8)
ఈ ఎపిసోడ్‌లో శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధం కొనసాగిస్తూ, దక్షుని పతనానంతరం దైవకృపతో అతను పునర్జన్మ పొందే అద్భుతమైన కథను వివరిస్తున్నాం. అలాగే, పరమాత్మ యొక్క అతీంద్రియ స్వరూపాన్ని ప్రకటించే అత్యంత రహస్యమైన హంసగుహ్య స్తుతులను కూడా విశ్లేషిస్తున్నాం. ఈ పవిత్రమైన స్తోత్రాలు భక్తి మార్గాన్ని వెలిగిస్తూ, శరణాగతి యొక్క గొప్పతనాన్ని మన హృదయాలకు చేరువ చేస్తాయి.
In this episode of our Srimad Bhagavatham series, we continue Canto 6 with the remarkable story of Daksha's rebirth, exploring how the great progenitor receives a new life through divine grace after his downfall. We also delve into the profound Hamsa-guhya prayers, a collection of deeply esoteric hymns addressed to the Supreme Lord that reveal hidden truths about His transcendental nature. These sacred prayers illuminate the path of devotion and surrender, offering the sincere seeker a glimpse into the boundless glories of the Absolute Truth.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో భగవతే తస్మై కృష్ణయా కుంఠమేధసే యత్పదాంభోరుహ ధ్యానాత్ సంహితా మధ్యగామిమాం అనంత జ్ఞాన సంపన్నుడగు ఆ శ్రీకృష్ణ భగవానుని కొరకు నమస్కారము. నేను పద్మముల వంటి ఆయన పాదములను ధ్యానించుట వలెనని ఈ భాగవత పారాయణమును పురాణమును అధ్యయనము చేయగలిగితిని. 12th కాంటో, 6th చాప్టర్, 35th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక. షష్ట స్కంధము ఐదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు దీనిలో భాగంగా అజామిళ వృత్తాంతాన్ని దాని తత్వార్ధాన్ని మనం గ్రహించాం. ఇప్పుడు దక్ష ప్రజాపతి చరిత్రాన్ని తెలుసుకుందాం. శుకయోగిని పరీక్షిత్తు వ్యష్టి సృష్టి ఎట్లు జరిగినదో వివరింపమని కోరగా ఇటు చెబుచున్నాడు. ప్రాచీన బర్హి కుమారులు ప్రచేతసులు పది మంది తపస్సు చేసి సముద్ర మధ్య నుండి పైకి లేచి భూమిని చూచిరి. భూమి అంతయు చెట్లతో నిండి ఉండెను. ప్రచేతసులు తపస్సుకు వెళ్ళిని. ప్రాచీన బర్హి విరక్తుడై ఉండెను. రాజ్య పాలనము చేయువారు లేక భూమి అంతటా మొక్కలు బలిసి ఉండెను. ప్రచేతసులకు కోపం వచ్చెను. తపస్సుచే ఆ కోపము తీవ్రమై ఆ చెట్లను దహింపవలెనని వారికి సంకల్పము కలిగెను. ఓ వృక్షములారా, ముఖము నుండి వాయువును అగ్నిని విజృంభింపచేసి దహించి వేతునని అగ్నిని వదలిరి. చెట్లు దహింపబడుచుండెను. అప్పుడు చంద్రుడు ఔషధులకు ప్రభోగుటచే వారి కోపమును ఉపశమింప చేయుచు ఓ మహానుభావులారా మీరు లోకమును ఉద్ధరింప గోరువారు ప్రజాపతులు. ఇట్లు ఏ అపరాధము లేని దీనులను బాధించుట తగదు. బ్రహ్మాదులకు ప్రజాపతులకు కూడా ప్రభువగు శ్రీహరి ఈ వృక్షముల అంతర్యామియే ఉండును. అందు ఉండుటచే శ్రీహరికి ఏ దోషము అంటదు.
వనస్తతులను వనస్పతులను సృష్టించి దేవతలకు పితృ దేవతలకు ఆహారముగా ఔషధుల నుండి హవిస్సును కల్పించి సమర్పించి ఆ శేషమును ప్రజలు భుజింపవలెనని భగవానుడు సృష్టించినాడు. పితృ దేవతలను ఉద్దేశించి ఊర్జము అనడి అన్నమును దేవతలను ఉద్దేశించి ఇషము అనడి అన్నమును సమర్పింపవలెనని వనస్పతులను ఔషధులను సృష్టించినాడు. దేవతలకు, పితృ దేవతలకు ఆహారము కల్పింపబడుటకు ఉపయోగించడి ఈ వృక్షములను దహించుట మీకు తగదు. లోకములో ఒకరికొకరిని ఆహారముగా భగవానుడు ఏర్పరిచినాడు. పాదములతో సంచరించెడి భూతములకు పాదములతో సంచరించెని భూతములు ఆహారము. అచరములలో అనగా కదలని వాటిలో ఒకటి తినునది ఒకటి తినబడునది అనేటి భేదము లేదు. కానీ కదలెడి భూతములలో ఒకదానికి ఇంకొకటి ఆహారమగుచుండును. పాదములలో కదలాడెడి వాటికి పాదములు లేనివి. చేతులు గల రెండు కాళ్ళు గలవారికి చేతులు లేని నాలుగు పాదములు గలవి ఆహారమగుచుండును. ఓ మహానుభావులారా! మీ తండ్రియగు ప్రాచీన బర్హి తపస్సు చేసి సంతోషింపచేయగా బ్రహ్మ ప్రత్యక్షమై మిమ్ములను ప్రజా సృష్టి చేయుటకు ఏర్పరిచినాడు. సత్పురుషుల మార్గమును అనుసరించుడు. మీ తండ్రి తాతలు, ముత్తాతలు ఏ మార్గమును అనుసరించినారో ఆ మార్గమును అనుసరింపుడు. కోపమును తగ్గించుకొనుడు. సర్వ రక్షకుడు భగవానుడు. అతడు బాలురకు తల్లిదండ్రులను రక్షకుడుగా కళ్ళకు రెప్పలను స్త్రీకి భర్తను ప్రజలకు రాజును భిక్షకులకు భిక్షముసంగు వారిని కర్మకాండ చేయువారికి ఆ ప్రక్రియ చేయించు నేర్పుగల వారిని రక్షకులుగా ఏర్పరిచినాడు. స్వయముగా అందరి దేహములలో తాను ఉండి తాను రక్షకుడై మిత్రుడై నియామకుడై కాపాడుచున్నాడు. అందుచే విశ్వమునంతను భగవత్ అధిష్టానముగా భావింపుడు.
అట్లు మీరు చూచుటచే భగవానుడు సంతసించును. దేహములో హృదయాకాశము నుండి అనుకొనకుండా బయలుదేరిన సహించుటకు శక్యము కాని కోపమును ఎవడు ఆత్మ పరమాత్మ స్వరూప విచారణతో తగ్గించుకొనునో. ఆ పురుషుడు సత్వరజస్తమో గుణములను దాటి బంధము నుండి విముక్తుడగును. దీనములగు వృక్షములను దహించుట విరమింపుడు. మిగిలిన వృక్షములకు మంగళమగుగాక మీకు శుభమగుగాక. ఈ వృక్షములచే పరిపాలింపబడుచున్న ఆ కన్య మారిషా ఆమెను మీరు భారీగా స్వీకరింపుడు అని చెప్పెను. కన్య ఒక ఋషివీర్యముచే అప్సరస యందు జన్మించినది. సోమరాజు వారికి ఆ కన్యను వసంగి తన స్థానమునకేగెను. వారు ఆమెను యధావిధిగా వివాహమాడిరి. ప్రచేతసులకు ఆమె యందు దక్షుడు అను ప్రజాపతి జన్మించెను. వెనుక దక్ష ప్రజాపతి యజ్ఞములో రుద్రాపరాధం వలన శరీరము వీడెను. అతడే మరల ఇప్పుడు ప్రచేతసుల వలన మారిషి యందు ప్రాచేతసుడు అను దక్షుడుగా జన్మించెను. ఈ మూడు లోకములందున ప్రజలందరూ అతని సంతానమే. దక్షుడు తన సంకల్ప మాత్రము చేత ఆకాశమునందు సంచరించెడి వారిని భూమియందు సంచరించడి వారిని దేవతలను అసురులను మనుష్యులను జన్మింపచేసినాడు. ఇట్లు మనసుతో సృష్టి చేసినాడు. ఆ సృష్టి బాగుగా వృద్ధి పొందుట లేదు. వింధ్య పర్వత ప్రాంతములకేగి ఇతరులు ఎవ్వరూ చేయలేని తపస్సును చేసెను. త్రికాలములో స్నానము చేయుచు తపస్సుచే శ్రీహరిని సంతుష్టిని చేసెను. అతడు హంస గుహ్యమనడి ఒక స్తోత్రముతో శ్రీహరిని సంతోషపరిచెను. అతడు సంతుష్టుడాయెను. హంస గుహ్య స్తోత్రమును చెప్పెదని వినుము. చేతనులకు జీవుల కంటే పరుడై అమోఘమగు అనుభూతి అనగా సంకల్ప రూప జ్ఞానము గలవానికి నమస్కారము. సత్వాది గుణత్రయములు బయల్పోవుటకు కారణమగు ప్రకృతికి ఆశ్రయమై నియంతై ఉండువానికి నమస్కారము. గుణత్రయములు కార్యమగు పృథివ్యాధి తత్వములు ఎరుంగగలిగిన బుద్ధులచే గుర్తింప శక్యము కాని వానికి నా నమస్కారము.
ఇంతవాడు ఇట్టివాడు అని చెప్పుటకు వీలువైన దశకాల వస్తు పరిచ్ఛేదములు లేని స్వరూపము గలవానికి నమస్కారము. ఏ పరమ పురుషుడు ఈ శరీరములో జీవునకు అంతరాత్మగా సఖుడై ఉండునో అట్టి పరమాత్మ యొక్క స్వామిత్వమును తన దాసత్వము జీవుడు ఎరుంగ జాలడు. జీవుడు పరమాత్మతో రంగు ద్రవ్యముతో ఎట్లు విడదీసి వేరుగా ఉండుటకు వీలు కాకుండా ఉండునో అట్లు తానుండి అతని చేతనే ప్రవర్తించుచు దేహములోనున్న పరపురుషుని పరమపురుషుని ఎరుంగలేని వాడగుటచే. అతనిని ఆ సంబంధమును జీవుడు గుర్తింపలేదు. అట్టి పరమ పురుషునకు నమస్కారము. దేహము, ప్రాణములు, ఇంద్రియములు, మనోవృత్తులు, జ్ఞానేంద్రియములు, భూతములు, శబ్ద స్పర్శాది తన్మాత్రలు. వాటిని గ్రహించడి ఇంద్రియములు, కర్మేంద్రియములు మొదలగునవి అన్నియు తమకు ఆత్మ అయిన జీవుని తమకంటే వేరుగా అచేతనములగుటచే ఎరుంగజాలవు. జీవుడు క్షేత్రజ్ఞుడు. జ్ఞానము కలవాడు కనుక వీటినన్నింటినీ ఎరుంగును. దేహమును ఎరింగిన జీవుడు తన గుణములను తను ఎరుంగజాలునే గానీ సర్వజ్ఞుడగు భగవానుని అతని గుణములను ఎరుంగజాలడు. అట్టి పరిచ్ఛిన్నుడగు పరమ పురుషుని స్తుతించుచున్నాను. దేవ మనుష్య బ్రాహ్మణాది నామరూప విభాగమును గుర్తించడి మనస్సు. విశ్రమించి స్వప్నావస్థ దాటి సుషుప్త్యవస్థ దొందునప్పుడు జీవుడు పరమాత్మతో చేరి ఉండును. కానీ జీవుడు ఆ పరమాత్మను గుర్తింపజాలడు. పరమాత్మ మాత్రము అన్నిటినీ ఎరుంగజాలిన వాడై ఉండును. రాగాది కాలుష్యము లేని స్వాభావిక జ్ఞానమునకు ఉపాసనచే పరిశుద్ధమైన అంతఃకరణమున గోచరమగు అపరిచ్ఛిన్నానంద స్వరూపుడగు భగవానునకు నమస్కారము. హంస స్వరూపుడగు పరమాత్మ ఉపాసనచే పరిశుద్ధమై శుచియగు అంతఃకరణమునందు అభివ్యక్తమగుచుండును. పరమేశ్వరుడు పరబ్రహ్మము చేతనుల హృదయములో బహిరీంద్రియములచే గ్రహించుటకు శక్యము కాకుండా తనంత తానుగా సన్నిధానము చేసి ఉండును. హృదయ గుహలో గోచరము కాకుండా ఉండెడి జీవునిలో అంతరాత్మగా మనసుచే కూడా గ్రహించుటకు శక్యము కాకుండా ఉండును. అతడు తొమ్మిది శక్తులతో కూడి ఉండును.
ఆయా కార్యములను చేయుటకు ఉపయోగించినవై పరమాత్మ కంటే వేరుగా ఉండక కలిసి ఉండెడి వానికి శక్తులు అని పేరు. అవి తొమ్మిది. అవి మూడేసి మూడేసి కూడి ఉండును. శ్రీ, పుష్టి, గీహి అంటే వాకుకాంతి, తుష్టి, ఇళ, ఊర్జ, విద్య, అవిద్య, మాయ అను తొమ్మిది శక్తులతో పరమాత్మ కూడి ఉండును. కర్రలో అడిగి ఉన్న అగ్నిని మధించు సాధనమగు అరణిచే ఎట్లు వెలికితీయుతురో అట్లే పరమాత్మ యధాత్మ్యమును ఎరుంగగలిగిన వారు యోగముచే పరిశుద్ధమగు బుద్ధిచే ప్రకృతి పురుషుల కంటే వేరైన తనలోనే ఉన్న పరమాత్మను చూడగలరు. ఆ భగవానుడు అశేష వికారములు కలిగించెడి మాయ అంటనివాడు. దుఃఖముతో కూడి ఉండని మోక్షము సుఖమగు ముక్తానుభవమునకు విషయము అయినవాడు. సర్వ శబ్దముల చేత వ్యవరింపబడుచుండెడివాడు. విశ్వమంతయు తన శరీరముగా కలవాడు దాని అందలి దోషములు అంటనివాడు వాగ్మనస్సులచే ఎరుంగజాలని స్వాభావిక శక్తులు కలవాడు అట్టి భగవానుడు నన్ను అనుగ్రహించుగాక శబ్దముచే చెప్పబడెడి, బుద్ధిచే నిరూపించబడెడి, ఇంద్రియములచే గ్రహింపబడెడి, మనసుచే సంకల్పింపబడునది అంతయు అతని శరీరమే అగును కానీ అతడు శబ్దము చేతను, ఇంద్రియముల చేతను, బుద్ధి చేతను, మనసు చేతను గ్రహింపబడడు. అన్నిటి చేతను గుర్తింపబడునవి ప్రకృతి వికారములే అగును గాని పరమాత్మ గాడు. సత్వాది గుణములచే ఏర్పడినవి అన్నియు ప్రకృతియందు ఉండునే గాని పరమాత్మయందు ఉండవు. పరమాత్మ సత్వరజస్తమో గుణములు గల ప్రకృతిచే జన్మించే ప్రపంచము యొక్క సృష్టి లయముల చేతనే గుర్తింపబడును. ఆ కారణత్వము కూడా చేతనా చేతనా విశిష్టమగు బ్రహ్మమునందే కానీ కేవలం బ్రహ్మమునందుకే లేదు. కనుక జగత్ సృష్టి స్థితి లయ కారణత్వము. బ్రహ్మ స్వరూపమును ఎరుంగుటకు ఉపలక్షణము. జగత్తును సృష్టించునది సర్వ వ్యాపారములు శరీరము ద్వారా చేయించునది పరమాత్మయే.
ఆయా ద్రవ్యములు పరమాత్మకు శరీరములు. కనుక పరమాత్మయే పరంపరగా శరీరము ద్వారా ఆధారము, ఉపాదానము, అపాదానము, కరణము, సంప్రదానము, కర్మ కర్తగా ఉండును. ఈ విశ్వమంతయు బ్రహ్మ కంటే వేరైనది కాదు. సృష్టికి ముందు కారణముగా ప్రసిద్ధమైన సూక్ష్మ చేతనా చేతన విశిష్టమైన బ్రహ్మయే సృష్టికి తరువాత కార్యవ్యవస్థనందినది. ఒకే ద్రవ్యం యొక్క రెండవ స్థలే బ్రహ్మము. జగత్తు కారణావస్థ బ్రహ్మము. కారణము విశిష్టము. కార్యము కూడా విశిష్టమే. చేతనా చేతనములు అనబడే విశేషణములతో కూడిన బ్రహ్మమే ఎల్లప్పుడూ ఉండునది. అది ఏ నిమిత్త కారణము? ఉపాదాన కారణము. సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము గలదై రెండు విధములుగా కారణముగా ఉండును. కొందరు ఈ విశ్వమునకే పరమాణువులే కారణము ఈశ్వరు నిమిత్త కారణము అందురు. ఈ జగత్తునకు ప్రధానమైన కారణము ప్రకృతియు దానితో చేరి ఉండి పురుషుడే గానీ ఈశ్వరుడు లేడని కొందరందురు. కొంతమంది ఈ జగత్తంతయు నిత్యము, అనిత్యము, భిన్నము, అభిన్నము, సత్తు, అసత్తు అయి ఉండునని చెప్పుచుందురు. ఇన్ని వాదములు ఉండగా బ్రహ్మమే కారణమనియు బ్రహ్మము కంటే జగత్తు వేరు కాదని చెప్పుట ఎట్లు కుదురు అని శంఖింపనవసరం లేదు. వారు చెప్పేటివన్నీయు పరమాత్మ యొక్క శక్తులే అందులో ఒక దానిని ఆశ్రయించి ఒకరు వేరొక దానిని ఆశ్రయించి వేరొకరు వాదించుకొనుచున్నారు. ఆ శక్తులే ఈ వాదము చేయువారికి మోహము కలిగించుచున్నవి. అట్లే సర్వశక్తి విశిష్టుడు అసంఖ్యేయ కళ్యాణ గుణములు గలవాడు స్వరూపతః అన్నిటికంటే గొప్పవాడగు బ్రహ్మమునకు నమస్కారము. సర్వేశ్వరుడు ఉన్నాడని కొందరు లేడని కొందరు వాదించుందురు. మనము లోకములో ఘటము, పటము మొదలగను ఉన్నవి లేవు అనుచున్నాము. ఈ రెండును ఒకటి ఉన్నచోట రెండవది ఉండదు. ఉన్న వస్తువును వస్తువునందు ఉండకపోవుట ఉండదు. ఈ విరుద్ధమైన ధర్మములలో ఏది వాస్తవమో తెలుసుకొనుట శక్యము కాదు.
అతీంద్రియముకు భగవద్విషయము ఇతర ప్రమాణములతో తెలుసుకునుటకు నిశ్శక్యము కాదు. కనుక దాని ఎరుంగుటకు వేదాంత వాక్యములే ప్రమాణమని ఎరుంగవలెను. వేదము ఆది అంతము లేనిది. కొంత కాలము ఒకరి నుండి ఒకరికి సాగి కొంత కాలమునకు పోవునది కాదు. భగవాను నుండి ప్రారంభమై ఎడతెగక నేటికిని సాగుచునే ఉన్నది. అది మనుష్యులచే రచింపబడినది కాదు. కనుక దానియందు భ్రమ. ప్రమాదము, వంచనము, అశక్తి అను దోషములు ఉండవు. కనుక దానిచే సర్వేశ్వరుని ఎరుంగవలెను. యోగశాస్త్రమున ఈశ్వరుడు ఉన్నాడందురు. సాంఖ్యమున భగవానులు లేడందురు కానీ వేదాంతములు అనగా ఉపనిషత్తులు సత్యము జ్ఞానము అనంతము అగునదే బ్రహ్మమనియు ఆనందో బ్రహ్మమనియు చెప్పునది. బ్రహ్మము ఎల్లప్పుడూ ఏకరూపముగానే ఉండుననియు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదనియు అందరికీ అనుకూలమైనదగుటచే ఆనంద రూపమైనదనియు చేతనా చేతనముల కంటే వేరేదనియు ఇప్పుడు కనపడుచున్న జగత్తు కంటే ముందే ఉన్నదనియు గుణముల చేత స్వరూపము చేత అపరిచ్ఛిన్నమనియు ఎరంగవలెను. అట్లే గుణములు ఉన్నవి లేవు అను రెండు వాక్యములు ఉపనిషత్తులోనే ఉన్నవి. యహ సర్వజ్ఞ సర్వవిద్ అనే బ్రహ్మము అన్నిటినీ కూర్చిన జ్ఞానము గలవాడని శక్తి గలవాడని ఉపనిషత్తులు చెప్పినవి. అట్లే నిష్క్రియం నిష్కలం. అని గుణములు లేవని ఉపనిషత్తే చెప్పినది. ఈ ఉపనిషత్తు ఏది చెప్పినను వాస్తవమే గనుక గుణములు గలది, గుణములు లేనిది అనే రెండు వాక్యములు యదార్థమే. బ్రహ్మమునందున గుణములు ఏవి? లేని గుణములు ఏవి? అని వేదముల చేత నిరంగవలెను. ఉన్న గుణములు జ్ఞానము, ఆనందము మొదలగునవి. జీవులకు కర్మచే కలుగునట్టి విడవదగిన గుణములు అనగా సత్వరజస్తమో గుణములు, ముసలితనము, చావు మొదలగునవి లేవు అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి.
అందుచే ఉపనిషత్తులే మనకు ఈ భిన్న భిన్న వాదములకు సమన్వయం చేయునది. అట్లు వేదములచే నిర్ణనింపబడినటువంటి స్వభావము గల స్వరూపము గల భగవానునకు నమస్కారము. ఇట్లు ఎరుంగుటకు శక్యము కాని వాడైనను ఆశ్రితులకు సులభుడగుటచే తానే తనంత ఈ లోకములో జన్మించి రామకృష్ణాది నామములను ధరించి విచిత్రములగు అతి మానుషములగు చేష్టములను చేసి అనుగ్రహించినాడు. అతడు సులభుడై ఉండియు పరముడే. తనను ఆశ్రయించిన వారికి తన దర్శింప చేయుటకే అతడు నామరూపములను ధరించినాడు. ఈ దేహముతో ఉండియు తనతో సమానుడు తనకంటే అధికుడు లేనివాడే అతడు. అట్టి వానికి నమస్కారము. ఇతడు నన్ను అనుగ్రహించుగాక. ఇంద్రియములు మన మనోవృత్తులను అనుసరించి ప్రవర్తించుచుండును. ఈ చేతనా చేతనములన్నియు అతని శరీరములే. వానిలో అతడు ఉండి వాని ద్వారా మనకు కనపట్టుచుండును. లోకములో మనము రాజును చూచుచున్నాము. రాజు శరీరమును చూచి రాజును చూచినాము. అని అనుకొనునట్లే జగత్తును చూచి ఈ జగత్తులో ఆత్మగానున పరమాత్మను చూచినామని జగత్తు యొక్క యధాజ్ఞమును ఎరిగిన వారు భావించుచుందురు. జగత్తు కంటే ప్రత్యేకమైన భగవానుడు జగత్తుగా కనిపించునా అని సందేహింపనవసరము లేదు. పృథ్వి వికారముగు పువ్వులోని పుప్పొడిని తీసుకొని వచ్చుచున్న గాలి తనకు లేని వాసనను కలిగి ఉన్నట్టు మనకు తోచుచున్నది కదా? వాయువునకు వాసన లేదు. గాలికి రూపము లేదు. కానీ త్వకింద్రియముచే అనుభవింపబడిన గాలిలో పృథ్వి యొక్క గుణమగు గంధము ఉన్నదని ఎట్లు ఎరుగుచున్నామో. అట్లే జగత్తు జగత్తు కంటే విలక్షణమయుడైనటువంటి పరమాత్మ జగత్తును చూచినప్పుడు తత్వం ఎరుంగిన వాడిచే అనుభవింపబడుచుండును. అట్టి సర్వేశ్వరుడు నా కోరికను నెరవేర్చుగాక. ఈ రకంగా స్తోత్రం చేశారు తర్వాత విషయాన్ని మనం మరొక భాగంలో తెలుసుకుందాం. స్తోత్రం పూర్తి కావడానికి సమయం ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the Lord. To that Krishna, the ascetic, whose lotus feet are meditated upon, whose mind is filled with the hymns, I offer my salutations to that Sri Krishna Bhagavan, who is full of infinite knowledge. I was able to study this Bhagavata Parayana and the Puranas, as if meditating on his feet, which are like lotuses. 12th kaanto, 6th chapter, 35th prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the sixth podcast episode. Until now, as part of this, we have understood the story of Ajamila and its philosophical meaning. Now, let's learn about the history of Daksha Prajapati. When Shukayogini asked Parikshit how the individual creation happened, he said this. The ancient Barhi sons, the ten Prachetas, performed penance and rose from the middle of the ocean, looked at the earth. The whole earth was full of trees. Prachetas went away for penance. The ancient Barhi was a viraktu. There were no rulers to govern, and plants were overgrown all over the land. The jealous Prachetas are enraged. Through penance The anger became intense, and they resolved to burn those trees. Oh trees, from your mouth, you release the fire that ignites the air and burns, leaving the fire. The trees were burning. Then, by the moon being pleasing to the physicians, pacifying their anger, O great ones, you who desire to uplift the world are the rulers. It is not appropriate to trouble the innocent who have no fault. Sri Hari, who is the lord of Brahma and the Prajapatis, resides within these trees. Therefore, by being there, there is no fault of Srihari.
Creating forests and plants, and providing food to the gods and ancestors as offerings from medicines, and offering it, the Lord created that remnant so that the people should eat it. Addressing the ancestors, one should offer food called 'Urjamu' and address the gods with food called 'Ishamu'. He created the forest deities and medicines. It is not right for you to burn these trees, which are used to provide food for the gods and ancestors. In the world, God has established each other as food. For the ghosts that roam with feet, for the ghosts that roam with feet, food. Among the unmoving, there is one that is eaten and one that is not eaten; there is no difference between them. But one of the moving ghosts is becoming food for another. Those that have feet but no feet. Those who have hands and two legs will have four feet without hands, which will be food. Oh, great ones! Your father, the ancient Barhi, having performed penance and made you happy, Brahma appeared and appointed you to create the people. The path of the saints Follow. Follow the path your father, grandfathers, and great-grandfathers followed. Breathe. The Lord is my shepherd. He has appointed them as protectors, the eyes of the eyes, the eyeballs of the children, the husband to the woman, the king to the people, the beggars, the beggars, those who perform rituals, those who know how to do that process, as protectors. He is in everyone's bodies, protecting, being a friend, being appointed, and protecting. Therefore, consider the entire universe as the abode of the Lord.
By watching you, God will be pleased. Who is able to endure the anger that arises from the heart and sky in the body, without thinking, who reduces the anger that is impossible to bear with the examination of the soul, the supreme soul. That man transcends the three Gunas (qualities) of Sattva, Rajas and Tamas and becomes liberated from bondage. He will stop burning down the trees that are in the forest. Auspiciousness to the remaining trees and auspiciousness to you. That maiden Marisha, who is being ruled by these trees, told you to accept her greatly. Kanya was born to an apsara (celestial nymph) by the sage's semen. Vasangi went to his place for the girl to Somaraju. They married her off without a second thought. To the Prachetas, in her, Daksha, the Prajapati, was born. In the past, Daksha Prajapati's sacrifice, due to the sin of Rudra, his body was separated. He again, now, by the Prachetas, changed into a skilled one named Prachetasudu in Mauris. All peoples of the three worlds belong to him. Daksha, with his determination alone, made those who roam in the sky, those who roam on the earth, gods, demons, and humans He created. Thus, he created with his mind. That creation is not growing well. He went to the Vindhya mountain regions and performed penance that no one else could. While bathing in the three times, he satisfied Srihari by doing penance. He pleased Srihari with a hymn called Hamsa Guhyam. He was satisfied. Listen, I will tell you the Hamsaguhya Stotram. Salutations to those who have the unique and amazing experience of being beyond beings, that is, those who have the knowledge of the form of resolve. Salutations to the one who is the refuge and the controller of the nature that is the cause of the departure of the three qualities of goodness, truth, and righteousness. My salutations to that which cannot be recognized by the intellects that can understand the three gunas and the nature of the earth-born disease.
Salutations to the one who is capable of saying, 'This person is like that person.' The supreme being who is the inner soul to the living being in this body, such a supreme being's ownership, the living being cannot understand his servitude. The being, how he is separated from the Supreme Soul with color and substance, so that he does not have the ability to be separate, being in himself and acting through him, being unable to know the Supreme Being in the body. The being did not recognize the relationship or the being. Salutations to that Supreme Being. Body, life forces, senses, mental activities, sense organs, elements, sound, touch, etc. The senses, the organs of action, and all other such things cannot understand that the soul, which is separate from them, is inanimate. The living being is a field expert. He who is endowed with wisdom will understand all these. The being who knows the body, unless he knows his own qualities, cannot know the qualities of the omniscient God. Such a Supreme Being who is beyond duality I praise. The mind does not recognize the division of beings, gods, humans, Brahmins, etc., in name and form. When the wandering state of dreams is over and the state of deep sleep begins, the soul unites with the Supreme Soul. But the individual is not able to recognise the Supreme Soul. The Supreme Being is beyond all comprehension. Salutations to the Lord, who is the embodiment of unbroken bliss, who is visible in the pure inner self, who is worshiped by worshiping the natural knowledge without pollution of the body, and who is the embodiment of unbroken bliss. The Supreme Being, who is the embodiment of a swan, is purified by the worship of Him, and is manifested in the pure inner self. Parameshwara, the Supreme Brahman, is able to be present in His own heart without being perceived by the senses, and without being able to be perceived by the external senses. In the cave of the heart, it is possible to perceive the being that is not visible, as an inner self, even without the mind. He is composed of nine powers.
Those used to perform various tasks, not being separate from the Supreme Being, but being together, are called powers. That's nine. Those three are added together. Sri, Pushti, Gehi means Vakkanti, Tushti, Ila, Oorja, Vidya, Avidya, Maya, with these nine powers, the Supreme Being is united. Just as the fire in the stick is extinguished by the forest, which is a means to subdue it, similarly, those who can understand the supreme self, through yoga, with a pure intellect, can see the supreme self within themselves, which is different from nature and men. That God is the illusion that causes all the anomalies. He who is the subject of the experience of liberation, which is happiness, not being associated with sorrow, is the one who is free. He is being separated by all the sounds. He who is the universe, his body, and he who does not speak of its faults, he who has natural powers that cannot be known by the arts, may such a God bless me. That which is spoken by sound, that which is proved by intellect, That which is perceived by the senses and is determined by the mind, all of that is his body, but he Sound, senses, intellect, and mind cannot be perceived. Everything that is recognized is the distortion of nature, but the Supreme Being is not. All that is formed by the qualities of goodness are in nature, but not in the Supreme Being. The world, born of the nature with the qualities of the Supreme Being, Sattva, Rajas, and Tamas, is known only through its creation and destruction. That causality is also in the Brahman that is distinct from the causality, but not only in the Brahman. Therefore, the cause of the creation, preservation, and destruction of the world. It is a sign to know the form of Brahma. That which creates the world, that which makes all transactions through the body, is the Supreme Soul.
The material elements are the bodies of the Supreme Soul. Therefore, the Supreme Being, through succession, is the basis, the cause, the support, the instrument, the contact, and the doer of the body. This universe is not different from Brahman. Before creation, the famous subtle consciousness, the unique Brahma, was the cause. After creation, the system of work was established. The second state of matter is the Bose. The world is the resultant of Brahman. The reason is unique. The work is also unique. The Brahman, which is always present, is made up of the adjectives called the states of consciousness. What is the reason for that? The causative factor. It is omniscient and omnipotent, and exists as a cause in two ways. Some say that atoms are the cause of this universe, and that God is the cause of this. Some believe that the main reason for this world is nature, and that there is no God, but only man. Some people say that this entire world is eternal, non-eternal, different, unified, good, and evil. While there are so many arguments, Brahman is the cause, and the world is separate from Brahman There is no need to be ashamed of saying that it is not so. Everything they say is the powers of the Supreme Soul. One of them, relying on one, one another, relying on another, are arguing. Those powers are causing delusion to those who argue. Similarly, the all-powerful, the one with countless auspicious qualities, the embodiment of form, salutations to Brahma, the greatest of all. Some argue that the Lord exists, while others argue that He does not. We are saying that there are no such things as pots and pans in the world. These two, where one is, the second will not be. The object that is present will not be present in the object. It is not possible to know which of these conflicting religions is true.
It is not impossible to know the divine subject through other means than the transcendental. Therefore, it is necessary to understand that the Vedanta scriptures are the only standard for understanding it. The Vedas are eternal. It does not go from one person to another for some time. It started from God and continues to this day without stopping. It is not the product of human beings. Therefore, there is an illusion in it. There will be no defects of danger, deception, and weakness. Therefore, one should understand the Lord of all. The Yoga Sutras suggest that God exists. In Samkhya, there are no gods, but the Vedanta, that is, the Upanishads, say that truth, knowledge, and infinity are Brahman and Anandabrahma. Brahman is always of the same form, and it is not that it existed once and did not exist at another time, but it is pleasing to everyone, and it is of the form of bliss, and it is different from the senses and consciousness, and it existed before the world that is now visible, and the qualities It is inseparable from the form of the hand and is like a pen. Similarly, the two sentences 'gunamulu unnavi' (there are qualities) and 'lekundi' (there are none) are present in the Upanishads. Yaha The Upanishads say that the Brahma, who is omniscient and omniscient, is the one who has knowledge and power that unites everything. Likewise, inactive, inactive. The Upanishads say that there are no such qualities. Whatever this Upanishad says is true, therefore, the two sentences, 'having qualities' and 'not having qualities,' are true. What are the qualities of Brahman? What are the qualities that are lacking? And by the Vedas, it is like a well. The qualities that exist are knowledge, happiness, etc. The Upanishads say that living beings do not have qualities that are unavoidable due to karma, such as the qualities of Sattva, Rajas, and Tamas, old age, death, etc.
Therefore, the Upanishads are what reconciles these different arguments for us. Salutations to the Lord, who has a nature and a form determined by the Vedas. Even though he is unachievable to be understood, because he is easy to those who depend on him, he himself, being born in this world, assuming the names of Ramakrishna and others, performed strange and very human-like acts and bestowed grace. He is simple and yet he is transcendental. He assumed the form of a human to show himself to those who sought refuge in him. He who is with this body, is equal to himself, he is the one who is not superior to himself. Greet thee, O solitary one. May he bless me. The senses act according to our mental tendencies. These consciousnesses are all his body. He is in him, and through him, he is visible to us. We have seen the king in the world. We saw the king's body and we saw the king. And as they think, seeing the world, those who know the true nature of the world, seeing the supreme soul as the self in this world, will feel. Unique to the world There is no need to doubt whether God appears as the world. The wind that brings the pollen from the earthly flower seems to have a scent that it does not have, doesn't it? Air has no smell. Air has no shape. But how do we know that the air experienced by the sense of touch contains the quality of earth, which is the quality of the earth? Similarly, when the Supreme Being, who is more distinct than the world, sees the world, the essence is experienced by the one who understands it. Oh God, may that sovereign one fulfill my desire. In this way, they praised. Let's learn about the next topic in another part. The time taken for the prayer to be completed was found to be long. Jai Srimannarayana and salutations to the Ashram Guru.